డబ్బు బ్రతుకులో చావులో డప్పు కొట్టు
డబ్బు మంచికి చెడుకు నూ డప్పు కొట్టు
డబ్బు గృహముగా నిగ్రహమై డప్పు కొట్టు
డబ్బు ప్రేమపంచియు పొంది డప్పు కొట్టు
డబ్బె తప్పుగా ఒప్పుగా డప్పు కొట్టె ఈశ్వరా
నేటి స్పందన పద్యాలు
🧘♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘♀️
20వ శ్లోకం:-
పృధ్వీ రేణురణు: పయాంసి కణికా: ఫల్గుస్ఫులగో:
తేజో ని:శ్వసనం మరుత్ తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభ:!
క్షుద్రా రుద్రపితామహప్రభృతయ: కీటాస్సమస్తా స్సురా:
దృష్టే యత్ర సతావకో విజయతే భూమావ ధూతా వధి:!!
భావం:-
పరబ్రహ్మ స్వరూపమగు నారాయణుని దర్శించినచో అందు ఈ పృథ్వి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువు. ఈ జగము నీటి తుంపర. తేజస్సు సూక్ష్మమగు అగ్నికణము. వాయువు నిస్శ్వాసము. ఆకాశము సన్నని చిన్నరంధ్రము. రుద్రా పితామహాది దేవతాకోటి సమస్తము క్షుద్రకీటకములు. ఆ పరబ్రహ్మమగు నారాయణుని అతిశయము అవధులు మీరి విరాజిల్లుచున్నది.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూన్ 7.
జాతికి ఆయువుపట్టు పవిత్రతే. పవిత్రతను కోల్పోవడమే జాతి పతనావస్ధకు చేరబోతుందనడానికి మొదటి సూచన అని చరిత్రలో మీరు గమనించలేదా? పవిత్రతను కోల్పోయిన జాతి అంతరించే రోజు కనుచూపు మేరలోనే ఉంటుంది.
జాగృతి
స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు
భారతదేశంలో ముగ్గురు వ్యక్తులు కలిసికట్టుగా ఐదు నిముషాలైనా పనిచేయలేరు. ప్రతి ఒక్కరూ అధికారం కోసమే అర్రులు చాస్తారు. చివరకు మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది.అందరూ సధ్భావనలతో కలిసికట్టుగా ఉంటే మంచి ఉన్నతమైన మార్గంలో పయనించవచ్చును.
🧘♂️శాంతి🧘♀️
మీ శరీరం నందలి ప్రతి కదలిక యందు శాంతి, మీ ఆలోచనా పధ్ధతియందు శాంతి, మీ సంకల్ప శక్తిలోని శాంతి , మీ ప్రేమ లోను శాంతి, మీ ఆశలు, ఆశయాలలో శాంతి మరియు దైవం ఉన్నప్పుడు, జ్ఞాపకం ఉంచుకోండి ----- మీ జీవితాన్ని భగవంతునితో అనుసంధించారు.
*శ్రీ పరమహంస యోగానంద
యోగదా సత్సంగ పాఠాలు*
ॐ卐సూక్తిసుధానిధిఃॐ卐
85-కర్మ - జన్మ
(తరువాత భాగంలో - వంశపారంపర్య రోగాలు)
సప్త సముద్రాలు :-
లవణ సముద్రం - మూత్రం।
ఇక్షు సముద్రం - చెమట।
సురాసముద్రం - ఇంద్రియం।
సర్ప సముద్రం - శోణితం।
దథి సముద్రం - శ్లేష్మం।
క్షీరసముద్రం - జోల్లు।
శుద్దోదక సముద్రం - కన్నీరు।
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
ఊర్థ్వలోకాలు :-
భూలోకం -- గుదమందు ఉంటుంది।
భువర్లోకం -- గుహ్యమందు ఉంటుంది।
సువర్లోకం -- నాభియందు ఉంటుంది।
మహర్లోకం -- హృదయం యందు ఉంటుంది।
జలలోకం -- కంఠం యందు ఉంటుంది।
తపోలోకం -- భ్రూమధ్యం యందు ఉంటుంది।
సత్యలోకం -- లలాటం యందు ఉంటుంది ।
అధోలోకాలు :-
అతల లోకం -- అరికాళ్ళ యందు ఉంటుంది।
వితల లోకం -- మోకాళ్ళ దగ్గర ఉంటుంది।
సుతల లోకం -- మడిమల వద్ద ఉంటుంది।
తలాతల లోకం -- పిక్కల యందు ఉంటుంది।
రసాతల లోకం -- మోకాళ్ళ దగ్గర ఉంటుంది।
మహతల లోకం -- తొడలయందు ఉంటుంది।
పాతాళ లోకం -- గుదయందు ఉంటుంది।
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
దేహత్రయ వివరణ :-
ప్రాథమికంగా వీటిని అవగాహన చేసుకోవడం అవసరం అందుకే ఇవి పోస్ట్ చేయడం!
1। దేహత్రయం :- స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం।
2। అవస్థా త్రయం : - జాగృత్త, స్వప్న, సుషుప్తి।
3। స్థాన త్రయం :- విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు।
4। గుణ త్రయం :- రాజసం, సాత్వీకం, తామసం।
5। వర్ణ త్రయం :- రక్తవర్ణం, శ్వేతవర్ణం, నీలవర్ణం।
6। దైవ త్రయం :- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు।
7। మాతృకా త్రయం :- అకారం, ఉకారం, మకారం।
ఇలాంటి త్రయాలు చాలా ఉన్నాయి।।
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
సప్త ద్వీపాలు :-
జంబూ ద్వీపం - తలలోను।
ప్లక్షద్వీపం - ఆస్తులు।
శాకద్వీపం - శిరస్సున ఉంటుంది।
శాల్మల ద్వీపం - చర్మమున ఉంటుంది।
పుష్కర ద్వీపం - గోళ్ళ యందు ఉంటుంది।
కుశ ద్వీపం - మాంసం యందు ఉంటుంది।
కౌంచ ద్వీపం - వెంట్రుకల యందు ఉంటుంది।।।
।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।।
(సేకరణ।।।।ఆదిత్యనారాయణ।।।।తిప్పానా)
🧘♂️379) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️
🕉️🌞🌏🌙🌟🚩
స్థితి ప్రకరణము
రెండవ అధ్యాయము
దామ వ్యాళ కటోపాఖ్యానము
2-88
గత్వా సుదూరమపి యత్నవతా జవేన
నాసాద్యతే తదిహ యేన సుపూర్ణతైతి
మత్వేతి మా వ్రజ పదార్ధగణాన్ధియా త్వం
న త్వం త్వమేవ పరమార్ధతయా చిదాత్మా.
ఓ రామచంద్రా! ఎద్దానిచే అపరిచ్ఛిన్న సుఖలాభము ద్వారా పూర్ణకామత్వము కలుగునో, అట్టి ఆత్మ మహాయత్నముతో అతి వేగముతో దిగంతముల వఱకు సుదూరము నీవు సంచరించినప్పటికిని లభింపదు - అని యెఱిఁగి నీవు మనసాపి బాహ్యపదార్థముల సమూహముల వైపునకు బోకుము. నీవు దృశ్యరూపుడవు కావు. సర్వదృశ్య ప్రపంచ రహిత పరమార్థ చిదాత్మయే నీవు.
2-89
జ్ఞాతతత్త్వో హి శిథిలీభూతవాసనః కుర్వన్నపి ఫలం
నామసందధాతి. అథ చ స్పన్దనమాత్రం కేవలం కరో
త్యసక్తబుద్ధిః సంప్రాప్తమపి ఫలమాత్మైవేదం సర్వమేవ
కర్మఫలమనుమభవత్యకుర్వన్నపి కరోతి మగ్నమనాః.
ఆత్మతత్త్వము నెఱిఁగిన జ్ఞానికి వాసనలు నశించిపోపుటచే అతడు కార్యములఁజేయుచున్నను ఫలమును గూర్చి చింతింపడు, మఱియు అసక్తబుద్ధి గలవాడై శరీర చేష్టామాత్రము గావించును. ఫలము సంప్రాప్తించినను “ఇది యంతయు ఆత్మయే" యని భావించి దృశ్యమందు మగ్నుడు కాక యుండును. భోగాసక్తచిత్తుఁడగు అజ్జానియో కర్మల జేయకున్నను దృశ్యమందు మగ్నమైన మనస్సు గలవాడగుటచే కర్మలఁ జేయుచున్నవాడును, కర్మఫల మనుభవించుచున్నవాడును అగును.
2-90
తేన తత్ర కర్తురకర్తుర్వా నిత్యమసంసక్తం భవతు చేతో
న హి కించిదస్త్యాత్మతత్త్వవ్యతిరిక్తం యత్ర సంసక్తిర్భావ్యతే.
యత్కించిదిదం జగద్గతం తత్సర్వం శుద్ధచిత్తత్వాదాభాస మవేహి.
ఓ రామచంద్రా! కాబట్టి నీవు కర్మఁజేసినను, చేయకున్నను నీ చిత్తమెల్లపుడు వానియందు అంటకుండనుండుగాక! ఏలయనగా, ఈ ప్రపంచమున ఆత్మకంటె వేఱుగ ఒకింతైనను ఏ పదార్థమున్ను లేదు. ఇక దేనియందు నీ చిత్తమాసక్తి కలిగియుండును? ఈ జగత్తునందలి సమస్త పదార్థములున్ను శుద్ధచైతన్యము యొక్క ఆ భాసమాత్రమే యని నీ వెఱుఁగుము.
----
670, 671 - శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)
670) శ్లోకము :-
దృశో ర్భేదాద్ దృష్టే ర్న భవతి భిదా కాఽపి కరయో
ర్న భేదాద్ భిన్నంస్యాత్ కృత, మభి విమానైక్య వశతః!
భిదా తన్వో రేవం న భవతి భిదాయై తవ శివే!
వియద్దేశే చండ్యాం సితమహసి గౌర్యాం చ భవతి!! 670
పదవిభజన:-
శోః భేదాత్ దృష్టేః న భవతి భిదా కా అపి కరయోః
న భేదాత్ భిన్నం స్యాత్ కృతం అభి విమాన ఐక్య వశతః!
భిదా తన్వోః ఏవం న భవతి భిదాయై తవ శివే!
వియత్ దేశే చండ్యాం సితమ్ అహసి గౌర్యాం చ భవతి!! 670
భావము:-
తల్లీ ! ఉమాదేవి! కన్నులు రెండయిననూ దృష్టి వేరు వేరు కాక ఒక్కటే.
చేతులు రెండున్ననూ పని వేరు వేరు కాక ఒకటే
ఆకాశమున ఉన్న సూర్య ప్రచండ చండి, చంద్ర సౌమ్య గౌరి,
రెండుస్వరూపములు నీ అందు భేదము కూర్ప జాలవు.
671) శ్లోకము :-
తవ చ్ఛిన్న శీర్షం విదు రఖిలధాత్య్రాగమవిదో
మనుష్యాణాం మస్తే బహులతపసా యద్ విదలితే!
సుషమ్నాయాం నాడ్యాం తనుకరణ సంపర్కరహితా
బహి శ్యక్త్యా యుక్తా విగతచిర నిద్రా విలసతి!! 671
పదవిభజన:-
తవ చ్ఛిన్నం శీర్షం విదుః అఖిల ధాత్రి! ఆగమ విదః
మనుష్యాణాం మస్తే బహులతపసా యద్ విదలితే!
సుషమ్నాయాం నాడ్యాం తనుకరణ సంపర్క రహితా
బహిః శ్యక్త్యా యుక్తా విగత చిరనిద్రా విలసతి!! 671
భావము:-
తల్లీ ! విశ్వభర్త్రీ! ఓ ఉమాదేవి! గాఢ తపస్సున వలన యోగుల మూలాధారమున ఉన్న కుండలినీ శక్తి మేల్కొని జ్యోతిర్వాహిని కల సుషుమ్నా అని పేరు కల మధ్య నాడి అందు ప్రవేశించును.
దేహము ఇంద్రియముల ఆశ్రయింపక సుషుమ్నా నాడి పైకి ప్రవహించి శరీరమును విడనాడుటకు
శీర్ష భాగమున ఉన్న కపాలమును రెండుగా భేదించి బయటకు వెడలి బ్రహ్మాండశక్తితో కూడును.
వేద విదులగు తాంత్రికులు నీ శీర్షము ఖండింప బడినది కనక నిన్ను ఛిన్న మస్తక అందురు.
-----
శ్రీమన్నారాయణీయము* దశమ స్కంధము 71వ దశకము - కేశి, వ్యోమాసురుల వధ - 71 - 1 & 2 - శ్లోకములు
71-1
యత్నేషు సర్వేష్వపి నావకేశీ కేశీ స భోజేశితురిష్టబంధుః।
త్వం సింధుజా౾వాప్య ఇతీవ మత్వా సంప్రాప్తవాన్ సింధుజవాజిరూపః॥
భావము :-
భగవాన్! భోజరాజగు కంసునికి - 'కేశి' అను నామముగల - సహచరుడగు - ఇష్టబంధువు ఒకడు ఉండెను. చేపట్టిన కార్యమేదైనను దానిని సాధించుటలో ఇతడు బహు నేర్పరి; విఫలమెరుగనివాడు.
కంసునిచే నియోగించబడి - ఈ 'కేశి' ఒకరోజున - సింధుదేశపు (తెల్లని) అశ్వరూపమును ధరించి నీ ముందుకు వచ్చెను. (సింధుజను (లక్మీదేవిని) నీకు స్పురణకు తెచ్చి -సులభముగా, (ఏమరిచి) నిన్ను చేరవచ్చునని భావించెనో ఏమో! ఆ రూపముతో వచ్చెను).
--
71-2
గంధర్వతామేష గతో౾పి రూక్షైర్నాదైః సముద్వేజితసర్వలోకః।
భవద్విలోకావధి గోపవాటీం ప్రమర్ద్య పాపః పునరాపతత్ త్వామ్॥
భావము :-
భగవాన్! మాయావియగు ఆ 'కేశి' - అప్పుడు గంధర్వుని ముఖమును పోలిన ముఖముతో నుండెను. (నీ వద్దకు అనాయాసముగా వచ్చుటకే అయి ఉండవచ్చును).
తనగిట్టలతో అచ్చటి ప్రదేశములను ధ్వంసముచేయుచు ఆ కేశి భయంకరముగా సకిలించసాగెను. అతడు తన రూపమును మార్చుకొనగలిగెనేగాని – స్వరమును కాదు. అదిచూచి ఆ గోకులవాసులు భయభ్రాంతులు అగుచుండిరి. ప్రభూ! నిన్ను చూడగనే ఆ కేశి - నిన్ను ఎదుర్కొనెను.
---
No comments:
Post a Comment