మీకు చిన్నప్పుడు నడకరాని వయసులో... నడవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఎన్నోసార్లు పడిపోయి ఉంటారు. కానీ నడవాలనే ఉద్దేశం మీకు ఉండేది కాబట్టి... ఎన్ని సార్లు ఓడిపోయినా, ఆ ఓటమిని ఎన్నడూ అంగీకరించకుండా... మళ్ళీ లేచి, నడవడం మొదలుపెట్టారు. అలా ప్రయత్నం చేస్తూ, చేస్తూ... ఒక రోజు సఫలం అయ్యారు. కానీ ఇప్పుడు మీరు ఏ విషయంలోనైనా ప్రయత్నం చెయ్యడానికి ముందు... దాన్ని సాధించలేమేమో అనే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ ఆలోచన కారణంగానే అనుకున్నది సాధించడంలో చాలాసార్లు విఫలమవుతారు. కాబట్టి జీవితంలో ఏదైనా ముఖ్యమైనది సాధించాలనుకున్నప్పుడు... సాధించగలమనే ఆలోచనతో మొదలుపెట్టండి. అప్పుడే మీరు విజయపథంలో సాగిపోగలరు.
మనం జీవించి ఉన్నామంటే... ఆ భగవంతుడి కృప మన మీద ఉన్నట్టే. మనం ఏం చేయాలనుకుంటే అది చేయగలిగే అవకాశం మన ముందు ఉంది. కానీ అన్నిటికన్నా మనం జీవించి ఉండడం ప్రధానం. ఏదైనా చేయాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపలి నుంచే వస్తుంది. శ్వాస మీ లోపలికి వస్తూ, పోతున్నంతకాలం... మీరు ఓటమి పాలైనట్టు కాకుండా, విజయం సాధించినట్టుగా జీవించండి.
నేను మీకు ఒక కథ చెబుతాను. ఒక చిన్న కుక్కపిల్ల దారి తప్పి... దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ కారడవిలో అటూ ఇటూ తిరుగుతూ... తనకు దగ్గరలో ఒక సింహం ఉన్నట్టు పసిగట్టింది. అటూ ఇటూ చూస్తే... ఒక పెద్ద సింహం తనవైపు వస్తూ కనిపించింది. వెనక్కి తిరిగి పారిపోదామనుకుంటూ ఉండగా... పక్కనే ఒక పెద్ద ఎముకల గుట్ట కనిపించింది. కుక్కపిల్ల ఆ గుట్ట దగ్గరకు వెళ్ళి, తనను ఏదో విధంగా కాపాడుకోవడానికి ఉపాయం ఆలోచించడం మొదలెట్టింది.
ఇంతలో సింహం గర్జిస్తూ... ఆ కుక్క పిల్ల దగ్గరకు వచ్చింది. కుక్కపిల్ల ఆ ఎముకల గుట్ట మీద... సింహానికి వ్యతిరేక దిశలో కూర్చొని, ఓ ఎముకను కొరుకుతూ... ‘‘ఆహా! సింహం రుచే వేరు. ఇన్ని సింహాలను తిన్నా ఇంకా నా తనివి తీరలేదు. చివరిగా ఇంకో సింహం దొరికితే చాలు, నా ఆకలి తీరుతుంది’’ అంది.
ఆ మాటలను విన్న సింహం ‘‘ఇది సింహాలని తినేస్తుందా! దొరికితే నన్ను కూడా తినేస్తుందేమో’’ అనుకుంటూ, భయంతో వెనక్కి తిరిగి పారిపోయింది.
ఆ పక్కనే ఉన్న చెట్టు మీద ఉన్న కోతి ఇదంతా చూసింది. సింహం దగ్గరకు వెళ్ళి ‘‘ఆ కుక్క చాలా తెలివైనది. అది ఏ సింహాన్నీ తినలేదు. ఈ అడవికి మీరే రాజు. అది మిమ్మల్ని భయపెట్టింది’’ అని చెప్పింది.
కోతి మాటలు విన్న సింహం కోపంతో రగిలిపోయింది. కోతిని తన మీద కూర్చోబెట్టుకొని ఆ కుక్క వైపు పరుగులు తీసింది.ఇంకా ఆ ఎముకల కుప్ప దగ్గరే ఉన్న కుక్క పిల్ల... ఆ రెండూ తన వైపు శరవేగంతో వస్తూ ఉండడం చూసింది. ‘‘ఇప్పుడేం చెయ్యాలి? ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి’’ అనుకొని, ‘‘ఈ కోతి ఎక్కడికి పోయిందో! ఒక్క సింహాన్నైనా తీసుకురమ్మని చెప్పి అరగంట అవుతోంది. ఇంకా రాలేదేమిటి?’’ అని అరవడం మొదలుపెట్టింది.
ఆ మాటలు విన్న సింహం వెంటనే కోతిని కింద పడేసి... అక్కడి నుంచి పారిపోయింది. అలా తన తెలివితేటలతో... సింహం బారి నుంచి ఆ కుక్కపిల్ల చాకచక్యంగా తప్పించుకొని, అడవి నుంచి బయటపడింది.
అదే విధంగా మనం కూడా మన జీవితంలో ఏ ఇబ్బంది ఎదురైనా ఓటమిని అంగీకరించకుండా సంయమనం పాటించాలి. చాకచక్యంగా వ్యవహరించాలి అప్పుడే సఫలీకృతులం కాగలం. ఎప్పుడైతే మనం ఓటమిని అంగీకరిస్తామో... అప్పుడు విజయం సాధించడం అసాధ్యమనిపిస్తుంది. ఓటమిని ఒప్పుకోకుండా, ధైర్యంగా ముందుకు సాగితే... విజయం తప్పకుండా వరిస్తుంది.
అక్షయతృతీయ, పరశురామ జయంతి సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు
నే టి అనారోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం పత్రికలోని వ్యాసములు కీర్తనలు శ్లోకాలు పద్యాలు కధలు - చావండి చదవమని చెప్పండి * శ్రీ కృష్ణ శతకం - పద్య స్వరూపం - భాగవతం
న్యస్తాక్షరి.......... సం ధ్యా కా లం -- పాదాదిన రావాలి.......
* ఆటవెలది
సంధ్య వార్చి సుగుణ సవితను మదినుంచి
ధ్యాన ధనుడు వీర దాత హనుమ
కాంత సీతఁనెతుక కమనీయరమణీయ
లంకనగరసొబగు లన్ని జూసె.
***
* ఉత్పలమాల
పెళ్లి కి ముందునే ప్రభలు ప్రేమలు సంభవమే సుఖాలు గన్
పెళ్లి యు యైన వేంట కళ ప్రేరణ అర్ధము కోరుటే యగున్
పెళ్లి లొ యుద్ధమే జరిగి పేరుయు ఊరుయు మార్పులే యగున్
పెళ్లి లొ వంటకాలు కల కాలము వల్లె ను ఇష్ట కష్టములే
***
* తేటగీత
సంధ్య కునె ముందు లంకకు సాగ నెంచి
ధ్యాన ధీర సుగుణ ధైర్య దాత హనుమ
కాంతి లొలికేటి జానకిని గాంచ గలిగి
లంక వైభవమతొ కళ లన్ని జూసె
***
*సుభాషితం
సాపేక్షా న చ దాక్షిణ్యం న ప్రితినర్చ సంగతిః ౹
తథాసపి హరతే తాపం లోకనామున్నతో ఘనః ౹౹
ఎటువంటిఅపేక్షమేఘానికిలేదు.దయలేదు.ప్రేమలేదు.జతగాడన్న భావనలేదు.అయినా,మేఘం తనదైన పెద్ద బుద్ధితో ప్రజల తాపాన్ని తీరుస్తుంది.
****
*ఉపనిషత్ సూక్తి
* అజ్ఞాన మలపంకం యః క్షాళయేత్ జ్ఞానతో యతః, స ఏవ సర్వదా శుద్ధః|| (దర్శనోపనిషత్)
-ఎవడు జ్ఞానము వలన అజ్ఞాన మలపంకమును ప్రక్షాళనము చేయునో అతడే సర్వదా పరిశుద్ధుడు.
***
నిరంతర వికాశమే జీవనం. సంకోచమే మృత్యువు. తన వ్యక్తిగత సుఖాలనే చూసుకుంటూ, సోమరితనంతో గడిపే స్వార్ధపరునికి నరకంలో కూడా స్ధానం లేదు.
***
*జాగృతి: స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు
మీ శరీరాన్ని గానీ, బుద్ధిని గానీ, ఆధ్యాత్మికతను గానీ నిర్వీర్యం చేసే దేన్నైనా విషంలా తిరస్కరించండి.
***
*నిష్ఠ
దేవునియందు, మహాగురువుల యందు నిష్ఠ గలవారి సాంగత్యంలోనే ఎల్లప్పుడూ ఉండండి. అప్పుడు మీ జీవితం అత్యుత్తమ జీవితంగా మారుతున్నట్లు తెలుసుకుంటారు. గురు బోధనలలోని సత్యానికి విధేయులై ఉండండి. అప్పుడు మీ జీవితం దైవ ప్రకాశంతో కూడిన ఆత్మ వైభవంతో నిండి ఉండడం గమనిస్తారు. శ్రీ పరమహంస యోగానంద ప్రవచనం.
***
*శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం
శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహసంధౌ|
భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్యచిరాద్యది విష్ణుత్వమ్||
శీఘ్రంగా పరమాత్మను పొందదలచినచో శత్రు - మిత్ర - పుత్ర - బంధువుల పట్ల విరోధ - స్నేహములకై ప్రయత్నించక సర్వసమాన భావనను పొందుము.
లోకా: స్సమస్తా: స్సుఖినోభవన్తు!
***
**
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
718వ నామ మంత్రము 24.6.2022
ఓం మహ్యై నమః
భూస్వరూపిణిగా, ప్రకృతి స్వరూపిణిగా, మహీయను నదీరూపిణిగా వివిధ రూపములందు తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహీ యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం మహ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు, ఆ పరమేశ్వరి కరుణకు పాత్రుడై క్షమాగుణశీలతతో విలసిల్లును. ఆత్మానందానుభూతితో జీవించి తరించును.
మహీ అనగా భూమి. అనగా భూదేవతా స్వరూపురాలు. క్షమయా పృథివీసమా అనగా భూదేవి అంత ఓర్పు గలిగినది జగన్మాత. సమస్త జీవజాలానికి భూదేవి వలె ఆధారభూతమైనది. సకల జీవులను సృష్టించి, జీవులను తన బిడ్డలవలె అనురాగముతో సాకుతూ, జీవులకు కావలసిన సుఖసంతోషములను ప్రసాదించును. సన్మార్గములో నడిపించి ముక్తిని సంప్రాప్తింపజేయును. మాయా ! అను ((716వ)నామ మంత్రములో చెప్పిన ప్రకారం పరబ్రహ్మమునుండి ఉద్భవించిన మాయ జీవుల పూర్వజన్న వాసనలను అనుసరించి విద్యా మాయా పరమైన (విద్యామాయ, అవిద్యామాయ అని మాయ రెండు రకములు) పరబ్రహ్మతత్త్వాన్వేషణ వైఫు జీవుని నడిపించును. మధుమతీ స్వరూపిణియై ఆధ్యాత్మిక మధురాసుభూతులను కలిగించును. మాయా మరియు మధుమతీ స్వరూపాలను రెండింటిని తనలో ఇముడ్చుకొనిన మహీ స్వరూపిణి జగన్మాత. వేదములందు మహీదేవతను అదితి అన్నారు. అదితి దేవతలకు తల్లి. మహీ అనగా గౌరి, అనగా శివుని భార్య. పరమేశ్వరి తన మహత్తత్త్వమును అనేక విధములుగా సర్వత్రా, అనేక మార్గాలలో వ్యాపింపజేస్తుంది గనక పరమేశ్వరి మహీ యని నామ ప్రసిద్ధ అయినది.
జగన్మాత మహీ యను నదీ స్వరూపురాలు. నదీస్వరూపిణిగా సకలచరాచర జీవులకు ఆహారకారకమైన పంటలకు ఆధారభూతము. తనలో స్నానమొనరించువారిని పునీతులను చేయును.
మహీ యనగా గోవు. జగన్మాతను గోమాతా అను (605వ) నామ మంత్రము లో చెప్పిన ప్రకారం గోవులకు తల్లివంటిదైన కామధేనువు రూపమున పూజింపబడునది జగన్మాత. ఇంక మహీ యనగా గోవు. గో శబ్దమునకు స్వర్గము, వృషభము, కిరణము, వజ్రము, చంద్రుడు, ఆవు, నేత్రము, దిక్కు, బాణము, భూమి, వాక్కు, ఉదకము అని అర్థములు గలవు. ఈ గో శబ్దమునకు ఏఏ అర్థములు చెపుతామో జగన్మాతకు వాటినన్నిటినీ అన్వయించి మనం చెప్పుకుంటూ ఆ పరమేశ్వరినిగూర్చి మనం తెలిసి తరించవచ్చు.
సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం
సురబిం యజ్ఞా స్య జననీ మాతరం త్వానమామ్యాహం
సర్వ తీర్ధములు గోమాతయందే గలవు. సకలవేద స్వరూపిణి గోమాత. గోమాత యజ్ఞమునకు తల్లి వంటిది. గోమాత సర్వ శుభ రూపిణి. ముక్కోటి దేవతలకు నిలయం గోమాత.
అటువంటి సకలదైవాంశ సంభూతయైన గోమాతా స్వరూపిణి జగన్మాత.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
182వ నామ మంత్రము 24.6.2022
ఓం నిష్క్రియాయై నమః
విహితములు (శాస్త్రసమ్మతములు అయిన), లేక నిషిద్ధములు (శాస్త్రములు వలదన్నవి అయిన) క్రియలు ఏమియు లేనటువంటి నిష్క్రియాస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిష్క్రియా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిష్క్రియాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను, భౌతిక జీవనపరంగా సిరిసంపదలూ, పాడిపంటలూ సమృద్ధిగా ఉండునట్లుగాను, సామాజికపరంగా కీర్తిప్రతిష్టలు ఇనుమడించునట్లుగాను, భక్తిపరంగా భగవధ్యాన నిమగ్నులగునట్లుగాను జీవనము కొనసాగించునట్లు ఆ తల్లి కరుణించి అనుగ్రహించును.
విహితములు, నిషిద్ధములు అని క్రియలు రెండు విధములు. అధర్మపరమైన వన్నియు నిషిద్ధములే. విహితములు వర్ణాశ్రమధర్మములననుసరించి ఉండును. బ్రాహ్మణుడు త్రికాల సంధ్యలాచరించవలయును, వేదాధ్యయనము చేయవలెను, ధర్మబోధలు సలుపవలయును. క్షత్రియుడు ధర్మబద్ధంగా ప్రజలను పాలించుచూ, రాజ్యములో ధర్మసంబంధమైన కార్యకలాపములు, దైవసంబంధమైన యజ్ఞయాగాది క్రతువులు జరిపించుచుండవలెను. దుష్టశిక్షణ, శిష్టరక్షణ సలుపుచుండవలయును. వైశ్యులు వాణిజ్యపరమైన క్రియలద్వారా, ప్రజలకు నిత్యావసరములు ధర్మబద్ధంగా లభింపజేస్తూ జీవించవలయును. శూద్రుడు బ్రాహ్మణులను దైవసమానులుగాను, క్షత్రియులను ప్రభువులుగాను, వైశ్యులను లక్ష్మీస్వరూపులుగాను భావించుచూ, భక్తిప్రపత్తులతో చరించుచూ, ఆహారసంబంధమైన దినుసులను వ్యవసాయ వృత్తిద్వారా ఉత్పత్తిచేస్తూ, దేశాన్ని సుభిక్షము చేయుట విహితక్రియ. క్రియలు అనేవి శరీరధారులకు మాత్రమే. జగన్మాత నిరవయవ. అంటే సూక్ష్మరూపిణి. స్థూలరూపంగా మనం ఆ తల్లిని దర్శిస్తాము. పూజించుతాము. ధ్యానించడానికి మాత్రం అమ్మవారిని హృదయంలోని దహరాకాశంలో, ఆ తల్లి స్వరూపాన్ని దర్శిస్తాము. కనుక ఆ తల్లికి విహితక్రియలుగాని, నిషిద్ధక్రియలుగాని ఉండవు. కాబట్టి ఆ తల్లిని నిష్క్రియా అని స్తుతిస్తున్నాము. సృష్టిస్థితిలయలకు కారణము శ్రీమాతయే. జీవకోటికి ఏమి కావలెనో అవి అన్నియు తన సంకల్పమాత్రంచేత సమకూరునట్లు చేయును.
జగన్మాత అనుగ్రహం ఉంటేచాలు మనకు గల నిషిద్ధక్రియల వైపు మనసు వెళ్ళదు. అలాగే విహితక్రియలు ధర్మబద్ధంగా నిర్వర్తించునట్లు అనుగ్రహింప బడుట జరుగుతుంది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిష్క్రియాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻. పండుగలు మరియు పర్వదినాలు : యోగిని ఏకాదశి, Yogini Ekadashi🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 3 🍀
3. జామ్బూనదాభసమకాన్తివిరాజమానే
తేజోస్వరూపిణి సువర్ణవిభూషితాఙ్గి|
సౌవర్ణవస్త్రపరివేష్టితదివ్యదేహే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్
॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మనసుని అంతర్ముఖం చేయడం వల్ల సర్వవ్యాపకత్వము వస్తుంది. ఇదే అద్వైతము. - మాస్టర్ ఆర్.కె. 🍀
🌷🌷🌷🌷🌷
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
. కపిల గీత - 28 / Kapila Gita - 28🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
🌴. 13. సమర్పణ ద్వారా సంపూర్ణ జ్ఞానం - 1 🌴
28. దేవహూతిరువాచ
కాచిత్త్వయ్యుచితా భక్తిః కీదృశీ మమ గోచరా
యయా పదం తే నిర్వాణమఞ్జసాన్వాశ్నవా అహమ్
దేవహూతి పలికెను : నీ యందు చేయవలసిన భక్తి ఎలాగ ఉండాలి? నవ విధ భక్తులలో ఏది నిన్ను చేరుస్తుంది. నీ విషయముకో ఎలాంటి భక్తి చేయాలి. దేనితో నేను నిన్ను చేరుతానో అది చెప్పు. నాకు ఎలాంటిది అర్థమవుతుందో అది చెప్పు. దేని వలనైతే బాధపడుతున్న నేను నిన్ను చేరగలనో అది చెప్పు.
. శ్రీ మదగ్ని మహాపురాణము - 68 / Agni Maha Purana - 68 🌹
ప్రథమ సంపుటము, అధ్యాయము - 24
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -5 🌻
పిమ్మట శిరస్సుపై విష్ణుహస్తము నుంచి, వైష్ణవమంత్రమును ధ్యానించవలెను. ఈ విధముగా ధ్యానయోగముతో ఒకటి గాని, అనేకము గాని జపించి, హస్తములను మొదళ్ళయందు పట్టుకొని, మాంత్రికుడు నేత్రమంత్రము చదువుచు అంచుతో (జాలుతో) కూడిన చినగని వస్త్రముచే ఆ శిష్యుల నేత్రములు బంధించవలెను. తత్త్వము నెరిగి గురువు బాగుగా దేవదేవుని పూజించి, దోసిళ్లలో పుష్పములు ధరించి యున్న ఆ శిష్యులను పూర్వాభిముఖులనుగా కూర్చుండబెట్టవలెను.
ఆ శిష్యులు కూడ గుర్వనుజ్ఞ పొంది, అచట పుష్పాంజలిని చల్లి హరిని పూజింపవలెను. పిమ్మట పుష్పాదులతో వాసుదేవార్చనము చేసి. తరువాత గురుపాదార్చనము చేసి సర్వస్వమును గాని, దానిలో సగము గాని గురుదక్షిణగా ఇవ్వవలెను.
గురువు శిష్యులకు బోధించవలెను. వారు నామములతో హరిని పూజించవలెను. శంఖచక్రగదాధిరియై, తర్జనితో జళిపించుచున్న ప్రభు విష్వక్సేనుని పూజించి మండలమునందున్న హరికి ఉద్వాసన చెప్పవలెను. విష్ణునిర్మాల్యము నంతను విష్వక్సేనునకు సమర్పింపవలెను.
ప్రణీతలలో తనపైజలము చల్లుకొని, కుండములో నున్న అగ్నిని తనలో చేర్చికొని విష్వక్సేనుని విసర్జన చేయవలెను. ఈవిధముగ చేసినచో భోగములు అనుభవింప కోరిక గలవాడు సకలభోగములను పొందును. మోక్షేచ్ఛగల వాడు హరియందు లీను డగును.
అగ్ని మహాపురాణములో కుండనిర్మాణాగ్నికార్యాది కథన రూప మగు ఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
. శ్రీ శివ మహా పురాణము - 584 / Sri Siva Maha Purana - 584 🌹
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴
🌻. కుమారస్వామి జననము - 4 🌻
దేవతలిట్లు పలికిరి --
ఓ శంభో! శివా! మహేశ్వరా! నిన్ను మేము శ్రద్ధతో నమస్కరించు చున్నాము. తేజస్సుచే దహింపబడుతూ శరణు జొచ్చిన మమ్ములను రక్షించుము (33). ఓ హరా! ఈ దుఃఖమును హరించుము. లేనిచో, మేము నిశ్చయముగా మరణించెను. ఓ దేవా! మా ఈ దుఃఖమును నివారించుటలో నీవు తక్క సమర్థుడు మరి ఎవ్వరు గలరు? (34)
బ్రహ్మ ఇట్లు పలికెను--
దేవోత్తముడు, భక్తవత్సలుడు అగు ఆ ప్రభువు మిక్కిలి దీనమగు ఈ మాటను విని నవ్వి దేవతలతో నిట్లనెను (35).
శివుడిట్లు పలికెను--
ఓ హరీ! విధీ! దేవతలారా! అందు నా మాటను వినుడు. సావధానులై ఉండుడు. మీకు ఇపుడు సుఖము కలుగగలదు (36). ఓ దేవతలారా! మీరందరు నా తేజస్సును వెంటనే వమనము చేయుడు. మంచి ప్రభుడనగు నా ఆదేశముచే అట్లు చేసి విశేషసుఖమును పొందుడు (37).
బ్రహ్మ ఇట్లు పలికెను--
విష్ణ్వాది దేవతలందరు ఈ శివుని యాజ్ఞను శిరసా వహించి వినాశరహితుడగు శివుని స్మరిస్తూ వెంటనే వమనమును చేసిరి (38). బంగరు కాంతితో పర్వతాకారముగ నుండి అచ్చెరువును గొలిపే ఆ శివతేజస్సు భూమిపై పడి కాంతులను వెదజల్లుతూ అంతరిక్షమును స్పృశించు చుండెను (39). అచ్యుతుడు మొదలగు దేవతలందరు సుఖమును పొంది భక్తవత్సలుడు, పరమేశ్వరుడు అగు శంకరుని స్తుతించరి (40). ఓ మహర్షీ! కాని, వారిలో అగ్నికి సుఖము చిక్కలేదు. పరమేశ్వరుడు, సర్వోత్కృష్టుడు అగు శంకరుడు అయనకు మరల ఆజ్ఞనిచ్చెను (41).
ఓ మునీ! అపుడు ఆ అగ్ని దుఃఖితుడై చేతులు జోడించి నమస్కరించి మిక్కిలి దీనమగు మనస్సు గలవాడై శివుని స్తుతించి ఇట్లు పలికెను (42).
సశేషం....
. ఓషో రోజువారీ ధ్యానాలు - 203 / Osho Daily Meditations - 203 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 381-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 381-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀
🌻 381. 'రహెూయాగ క్రమారాధ్యా' - 2🌻
వ్యాకరణ మందు, శాస్త్రము లందు ప్రావీణ్యమును ప్రదర్శించుట, తమ గొప్పదనము నలుగురికి తెలియునట్లు చాటుకొనుట, లోకుల మనస్సును ఎరుగుటకు ప్రయత్నించుట, భక్తులవలె చలామణి అగుటకు ప్రయత్నించుట రహోయాగము చేయ సంకల్పించు వారికి నిషిద్ధ విషయము. ఏకాంత భక్తి సాధన, ధృడవ్రతము కలిగి లోక సంబంధములను వదలి సతతము ఆత్మయందు యోగము చెందుటకై ప్రయత్నించుచూ యమ నియమములను పాటించుచూ యుండుట రహోూయాగ యాగమునకు ప్రధానము.
కేవలము పాపములు దగ్ధమగుటచే మోక్ష స్థితి కలుగదు. పుణ్యములు కూడ దగ్ధము కావలెను. పుణ్య మాసించక పరహిత కార్యములు చేసినచో పుణ్యము కూడ పరిసమాప్తి యగును. పాపపుణ్యములు పరిసమాప్తి అయిన వారికే మోక్షము. రహోూయాగము మహత్తరమగు యాగము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ అంబా పంచ రత్న స్తోత్రం
1) అంబాశంబర వైరితాతభగినీ శ్రీచంద్రబింబాననా బింబోష్ఠీ స్మితభాషిణీ శుభకరీ కాదంబ వాట్యాశ్రితా !
హ్రీంకారాక్షరమంత్రమధ్యసుభగా శ్రోణీనితంబాంకితా మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు !!
2) కల్యాణీ కమనీయసుందర వపుః కాత్యాయనీ కాలికా కాలా శ్యామల మేచక ద్యుతిమతీ కాదిత్రిపంచాక్షరీ !
కామాక్షీ కరుణానిధిః కలిమలారణ్యాతిదావానలా మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు!!
3) కాంచీకంకణ హారకుండలవతీ కోటీకిరీటాన్వితా కందర్పద్యుతికోటికోటిసదనా పీయూష కుంభస్తనా !
కౌసుంభారుణకాంచనాంబరవృతా కైలాసవాసప్రియా మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు!!
4)యా సా శుంభనిశుంభదైత్యశమనీ యా రక్తబీజాశనీ యా శ్రీ విష్ణుసరోజ నేత్రభవనా యా బ్రహ్మవిద్యాఽఽసనీ!
యా దేవీ మధు కైటభాసురరిపుర్యా మాహిషధ్వంసినీ మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు!!
5) శ్రీవిద్యా పరదేవతాఽఽదిజననీ దుర్గా జయా చండికా బాలా శ్రీత్రిపురేశ్వరీ శివసతీ శ్రీరాజరాజేశ్వరీ !
శ్రీరాజ్ఞీ శివదూతికా శ్రుతినుతా శృంగారచూడామణిః మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు!!
6)అంబాపంచకమద్భుతం పఠతి చేద్యో వా ప్రభాతేఽనిశం దివ్యైశ్వర్యశతాయురుత్తమమిదం విద్యాం శ్రియం శాశ్వతం !
లబ్ధ్వా భూమితలే స్వధర్మనిరతాం శ్రీసుందరీం భామినీం అంతే స్వర్గఫలం లభేత్స విబుధైః సంస్తూయమానో నరః!!
ఇతి శ్రీ అంబా పంచ రత్నస్తోత్రం సమాప్తం
🕉🌞🌏🌙🌟🚩
శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘♀️
35 వ శ్లోకం:-
తత్త్వం ప్రసీద భగవన్ కురు మయ్యనాథే
విష్ణో కృపాం పరమకారుణిక: కిల త్వం!
సంసారసాగరనిమగ్నమనంత దీనం
ఉద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోసి!!
భావం:-
సర్వేశ్వరా! అనాధుడనగు నాయెడల దయచూపుము. అనుగ్రహింపుము. నీవు పరమదయామయుడవు కదా! హరే! అనంత! ఈ సంసార సాగరంలో మునుగు దీనుడను ఉద్ధరింపుము. నీవు పురుషోత్తముడవు కదా.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూన్ 24.
మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచన, పలుకు మాత్రమే ఈ లోకంలో ఉన్న కీడు అని గ్రహించండి. మనిషిని బలహీనపరిచే, మనిషికి భయాన్ని కలిగించే దానిని మాత్రమే చెడుగా భావించి తిరస్కరించాలి.
🕉🌞🌎🌙🌟🚩
దీపజ్యోతి మధ్యలో ఉండే నీలివర్ణం కారణశరీరానికి సంకేతం.దానిమీద మనసు నిల్పితే తప్పక ఏకాగ్రత వృద్ధి చెందుతుంది. దీపజ్యోతిని ధ్యానించడం వల్ల చిత్తప్రశాంతత లభిస్తుంది.
-శ్రీరామకృష్ణులు
🕉🌞🌎🌙🌟🚩
🧘♂️స్వస్థత🧘♀️
సర్వాభీష్టములకు మూలస్థానమైన భగవంతుని నుండియే మన ఆత్మకు బలము, సంతోషము, శక్తి నిరంతరాయముగా ప్రవహిస్తున్నాయి. అందువల్ల మీరు సాధ్యమైనంత ఎక్కువగా ఆ అనంత స్రోతస్సుపైనే ఆధారపడి ఉండడం అతి ముఖ్యం.
శ్రీ పరమహంస యోగానంద / యోగదా సత్సంగ పాఠాలు
ॐ卐సుభాషితమ్ॐ卐
శ్లో𝕝𝕝 కాకో ఆహ్వయతే కాకాన్
యాచకో న తు యాచకాన్।
కాకయాచకయోర్మధ్యే
వరం కాకో న యాచకః॥
తా𝕝𝕝 కాకి తనకు కాసిన్ని మెతుకులు దొరికినంతనే తాను తినక కావు కావు మని మిగిలిన కాకులను పిలిచి వాటితో యీ కాసిన్ని మెతుకులనూ పంచుకుంటుంది....కాని యాచకుడు తనకు భిక్ష లభించుచున్ననూ మరొక యాచకుడిని పిలవడు.... వచ్చిననూ సహించడు.
🕉🌞🌎🌙🌟🚩
🧘♂️94-కర్మ - జన్మ🧘♀️
8 వ ఆధ్యాయం - "కర్మ మర్మం"
ఐతే నీళ్ళఋణం, నిద్రఋణం తాము వెళ్ళాల్సిన ఊళ్ళో రాసిపెట్టి ఉంటే, వారు రాహుకాలంలో వెళ్ళినా ఆ టిక్కెట్ దొరికి తీరుతుంది. ఫిల్మ్ డైరెక్టర్ బీరం మస్తాన్ రావ్ ఈ రాహుకాలాన్ని ఒకప్పుడు పాటించేవారు.
కాని రాహుకాలంలో మంచి జరగడం, మిగిలిన కాలాల్లో చెడు జరగడం గమనించి అది హేతుబద్ధం కాదని నిర్ధారించుకుని ఆ నమ్మకం లోంచి అతను బయటపడ్డారు.
వర్జ్యం, తిథి, వారం, నక్షత్రం, క్షేమ తార లేదా వాస్తు ప్రకారం ఏదైనా చేస్తే మంచి జరుగుతుందనుకోవడం కర్మ సిద్ధాంతం మీద సరైన అవగాహన లేకుండా ఏర్పరుచుకున్న నమ్మకాలే. పోనీ ఆ నమ్మకాలు వాళ్ళకి అన్నివేళలా పని చేస్తున్నాయా అంటే అదీ లేదు.
ఎందుకంటే అవి ప్రారబ్దానికి వ్యతిరేకంగా పనిచేయలేవు. జరగబోయేది నిర్ణయించేది ప్రారబ్ద కర్మ కాని, అవి కావు.
వేదాంత గ్రంధాలైన భగవద్గీతలో కాని, ఉపనిషత్తుల్లో కాని కర్మ గురించి తప్ప వీటి గురించి మనల్ని పరమాత్ముడు, ఋషులు హెచ్చరించలేదు. మతపరమైన పురాణాల్లో మాత్రం వీటి ప్రసక్తి కొంత కనిపిస్తుంది.
వధూవరుల జాతకాలు కుదిరి, మంచి ముహూర్తాల్లో జరిగిన వివాహాలు కూడా భగ్నం అవుతున్నాయి కాబట్టి ఈ విషయంలో శాస్త్రీయ నిరూపణ లేదు.
అది శాస్త్రీయమైతే వాటి ప్రకారం జరిగిన పెళ్ళిళ్ళు భగ్నం కాకూడదు. కర్మ ప్రకారం రాసిపెట్టిన భార్యాభర్తలని కలపడానికి భగవంతుడు బహుశ వీటిని సోపానాలుగా వాడుకుంటున్నాడేమో?
అందుకనే తన చేతుల్లో ఏం లేదని అర్ధం చేసుకున్న వేదాంతి మనసు నిశ్చలంగా ఉంటుంది. లౌకికుడు వారం, వర్జ్యం మొదలైనవాటి తలుపు తడుతూ చికాకుగా ఉంటాడు.
(తరువాత భాగంలో - రత్నధారణ)
🕉️🌞🌏🌙🌟🚩
12- శ్రీ కపిలగీత🧘♀️
అధ్యాయము - 1 శ్లోకం 11:-
తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినామ్ |
అజాతశత్రవః శాన్తాః సాధవః సాధుభూషణాః ॥ 11 ॥
టీకా:-
తితిక్షవః = సహిష్ణువు (క్షమాగుణం కలవారు); కారుణికాః = దయగలవారు; సుహృదః సర్వదేహినాం = అన్ని జీవుల క్షేమము కోరువారు; అజాతశత్రవః = శత్రువులు లేనివారు; శాంతాః = శాంతులు; సాధవః = మహాత్ములు; సాధుభూషణాః = సాధువులకు భూషణమైనవారు
భావం:-
శాంతచిత్తులు, క్షమ, దయగలవారు, శత్రువులు లేనివారు, సమస్త జీవుల క్షేమము కాంక్షించువారు మహాత్ములకే ఆభూషణమైనట్టివారు.
వివరణ
గొప్పగుణములు మన వ్యక్తిత్వానికి ఆభూషణాలు. మోక్షాన్ని కోరనివారికైనా ఆనందంగా, శాంతిగా జీవించటానికి యీ గుణాలు అవసరం. తితిక్షవః=సహనం గలవారు. ఇది మానవునకు కావలసిన గుణాలలో మొట్టమొదటిది. జీవితం శారీరక అసౌకర్యాలతో, మానసిక అశాంతులతో, బౌద్ధిక సంఘర్షణలతో నిండి యుంటుంది. ఇవన్నీ అడక్కుండానే ప్రవాహంలా వస్తూ ఉంటాయి.
“సహనం సర్వదుఃఖానా మప్రతీకార పూర్వకమ్ |
చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే” (వి. చూ.24)
ప్రతిక్రియ లేకుండా, చింతించకుండా, దుఃఖించకుండా అన్ని బాధలను సహించటాన్ని తితిక్ష అంటారు. జీవితంలో యెదురయ్యే కష్టనష్టాలను కష్టాలనే భావనకూడా రానివ్వక చిరునవ్వుతో సహించటాన్ని (సహిష్ణుత) క్షమ అంటారు. ఉదాహరణకు వేసవికాలం మధ్యాహ్నం ఆడుకొనే పిల్లలు వేడిమిని గురించి పట్టించుకొనే పట్టించుకోరు. ఆ అసౌకర్యం కూడా ఆటలో భాగమేననుకుంటారు.
కారుణికాః = దయాగుణం కలవారు. ఋషులు తమకు ఎదురయ్యే కష్టాల గురించి ఎప్పుడూ చింతించరు కానీ ఇతరులకు కలిగే దుఃఖాలకు సానుభూతి కలిగి వారిపట్ల ప్రేమతో ఉంటారు. వారు ఇతరుల దుఃఖముతో తాదాత్మ్యము చెంది వారితో పాటు దుఃఖిస్తారు. ఇతరుల దుఃఖమును తొలగించుటకు తమకు అసౌకర్యమూ, కష్టమూ, ఒత్తిడీ కలిగినప్పటికీ లెక్కచేయరు. వారు తమవద్ద పరిమితమైన ఆహారమే ఉన్నప్పటికీ, తాము ఆకలితో ఉండి ఆకలిగొన్నవారికా ఆహారాన్నిచ్చేస్తారు.
సుహృదః సర్వదేహినామ్ = ఒక యోగి (మహాత్ముడు) అందరకూ మిత్రుడే. ఆయన సాన్నిధ్యంలో ఎవరూ నిర్లక్ష్యం గావింపబడ్డామని భావించరు. ఆయన అందరి క్షేమము కోరుటచే సరియైనమార్గాన్ని చూపించటానికి గానీ లేక అవసరమైనప్పుడు చేదైన సత్యాన్ని చెప్పటానికి గానీ సంకోచించడు. ఆయన కేవలం మానవులనే కాక జీవులన్నింటి క్షేమం కోరతాడు. ఒక యోగి మునిగి పోతున్న తేలుని రక్షించాడు. ఆ తేలు ఆయనను కుట్టి మళ్ళీ నీటిలో పడిపోయింది. ఇలా చాలాసార్లు జరిగింది. ఆ దారినే పోతూ ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి, ఆ యోగిని - “రక్షించేవానినే ఇలా అనేకసార్లు కాటువేస్తున్న ఆ విష జంతువును మీరెందుకు రక్షించాలని చూస్తున్నా”రని అడిగాడు. ఆ యోగి యిలా జవాబిచ్చాడు“తనను రక్షించేవానినే కాటువేసే తన సహజ స్వభావాన్ని తేలు వదులుకోనప్పుడు కాటువేయబడినప్పటికీ యితరులను రక్షించే నా సహజ స్వభావాన్ని నేనెలా వదులుకుంటాను?”
అజాతశత్రవః = శత్రువులు లేనివారు. తనకు హానిచేసిన వారిని కూడా మహాత్ముడు శత్రువుగా భావించడు. ఎవరి మనసు వారికే శత్రువైనా, స్నేహితుడైనా అని ఆయనకు తెలుసు. మనసును నిగ్రహించి స్నేహితుని చేసుకొంటే తనను కష్టపెట్టేందుకు ఎవరూ మిగలరు.
(సాధనాత్శత్రుః = ఇతరులను కష్టపెట్టువాడే శత్రువు) యుధిష్ఠిరుడు, ప్రహ్లాదుడు అజాతశత్రువులు. తాను సర్వాంతర్యామినని తెలుసుకున్నందున యోగి ఎవరినీ ద్వేషించడు. అందుచే ఆయన ఎవరికీ కష్టం కలిగించడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో (11.55) ఇలా అంటున్నాడు - "నిర్వైర స్సర్వభూతేషు యస్స మామేతి పాండవ- ఓ అర్జునా! శత్రుత్వం లేనివాడు నన్ను పొందుతాడు" ఖర దూషణులు శ్రీరాముని ఎదురుగా వచ్చినప్పుడు వారి శత్రుత్వమంతా మాయమై ఆయన సౌందర్యానికి నిశ్చేష్టులయ్యారు. ఆయన అజాతశత్రువు.
శాన్తాః = శాంతంగా, విషయవస్తువులయందలి కోరిక, కాంక్ష, ద్వంద్వాలు మొదలైనవి మానసిక సంఘర్షణకు కారణం. ఆత్మనిగ్రహం, తృప్తి, సహనం, దయగలవాడు అజాతశత్రువై సహజంగానే శాంతమూర్తియై యుంటాడు.
సాధవః = గొప్పవారు. “పరకార్యం సాధనోతి ఇతి సాధవః - నిస్వా యితరులకు మేలు చేయువాడు సాధుపురుషుడు”. మంచికి ప్రతిఫలంగా మంచి చేయువారు మంచివారు. శత్రువులకు కూడా మంచి చేయువారు సాధుపురుషులు.
**
102) అష్టావక్ర గీత🧘♀️
అధ్యాయం - 10
నిర్మమత్వం - వైరాగ్యం
శ్లోకం 01:-
अष्टावक्र उवाच ॥
विहाय वैरिणं काममर्थं चानर्थसङ्कुलम् ।
धर्ममप्येतयोर्हेतुं सर्वत्रानादरं कुरु ॥ १०-१ ॥
అష్టావక్ర ఉవాచ ॥
విహాయ వైరిణం కామమర్థం చానర్థసంకులం ।
ధర్మమప్యేతయోర్హేతుం సర్వత్రానాదరం కురు ॥ 10-1 ॥
అష్టావక్ర ఉవాచ :
శ్లో విహాయ వైరిణం కామం అర్థం చానర్థసంకులమ్ | ధర్మమ ప్యేతయోర్దేతుం సర్వత్రానాదరం కురు 1.
టీకా
వైరిణం = శత్రురూపమగు, కామం = కామమున్ను, చ = మరియు, అనర్థ సంకులం = అనర్థములతో నిండిన, అర్థం అర్థమున్ను, విహాయ = విడిచి పెట్టి, ఏతయోః = ఈ రెండింటికీ, హేతుం = కారణమైన, ధర్మమపి = ధర్మమునున్ను, విహాయ = విడిచి పెట్టి, సర్వత్ర = ధర్మార్థ కామములయందును, వాటికి నిమిత్తములగు కర్మముల యందును, అనాదరం = అనాదరమును, కురు = చేయుము.
వివరణ:-
కోరికను నీ శత్రువుగా భావించు, ఐశ్వర్యం అనర్థ హేతువనీ, కోరిక లను పెంచడానికి తోడ్పడుతుందని తెలుసుకో. ఈ కోరికలకు, ఐశ్వర్యానికీ కూడా ధర్మం మూలమని గుర్తించు, ఇలా గుర్తించడంలో కోరికను, సంపదను, ధర్మాన్నీకూడా, పరిమితులను ప్రయోజనాలను గుర్తించి, ఉదాసీన భావంతో పరిత్యజించు.
తాత్పర్యం:-
సంప్రదాయబద్ధమైన హిందూజీవితం ధర్మ, అర్థ, కామ, మోక్షమనెడి నాలుగింటిని సాధించేదిగా నియమింపబడింది. ధర్మానికనుగుణంగా జీవిస్తూ
వీలయిన అర్థాన్ని సంపాదిస్తూ, ఏనేక వితరణలతో కోరికలను (కామం) తీర్చుకుంటూ, మోక్షాన్ని సాధించడమే మానవ జీవిత పరమార్ధం. ఇది సంభవం అయేలా చెయ్యడానికి జీవితాన్ని నాలుగు ఆశ్రమ విభాగాలుగా విభజించేరని ఇదివరకే చెప్పబడింది. అవి బ్రహ్మచర్య,గృహస్థ,
వానప్రస్థ, సన్యాస ఆశ్రమములు.
ఆ మోక్ష సాధనకు ఉపయోగపడే జీవితానికి అర్హమైన గౌరవాన్ని ఇవ్వాలి. ఆ జీవితాన్ని పూర్తిగా సంతోషంగా జీవించాలి. ఆ విధంగా జీవితాన్ని మలచడాని కుపయోగపడే ధర్మానికి, సంతోషంగా జీవించడాని కవసరమయే అర్థకామాలకు కూడా అర్హమైన విలువ నిచ్చినప్పటికీ, వాటి పరిమితులను కూడా గుర్తించాలి. ధర్మ అర్థ కామాల ఆకర్షణలోనూ విలువలోనూ మునిగిపోయి మోక్షాన్ని విస్మరించరాదు.
వీటిని సాధించటంలో అహంకార మనోబుద్ధులు దృఢపడి, చివరలో వీటిని విడనాడడం కష్టతరం అయే ప్రమాదం ఉంది. అందుకే సాధకులను
అష్టావక్రులు ఇచ్చట హెచ్చరిస్తున్నారు. ధర్మార్థ కామ మోక్షాల ఆవశ్యకతనూ, విలువనూ, అవధినీ, పరిమితినీ, ప్రయోజనాన్ని పూర్తిగా గుర్తిస్తూ జీవించడంలో వాటి బంధం నుండి బయట పడగలగాలి. అప్పుడే మోక్షం సాధ్యం అవుతుంది.
ఈ అవగాహన సక్రమంగా లేనిపక్షంలో వానిలోనే బంధింపబడి ఉండిపోవడం జరుగుతుంది.
వేదాంత విద్యార్థికి "కోరిక" శత్రువు వంటిది. ఈ కోరికలు మనస్సును అశాంతితో నింపి లక్ష్యాన్ని మరపింప చేస్తాయి.
విషయ భోగవాంఛలతోనూ ప్రయత్నాలతోనూ కాలం గడిచిపోతుంది. ధ్యానం కష్టసాధ్యమవుతుంది. అందుకనే కోరికలను శత్రువుగా భావించి అప్రమత్తతతో వ్యవహరించాలి. అర్థాన్ని సంపాదించడంలోనూ దాచడంలోనూ ఖర్చు చేయడంలోనూ కూడా మనస్సు అంతులేని అశాంతికి గురికాక తప్పదు. కాబట్టి జాగ్రత్త చాలా అవసరం.
ధర్మా చరణలో పేరు ప్రతిష్ఠలు, సన్మానాలు, సంపదలూ వృద్ధి అయి మనస్సును అన్యాక్రాంతం చేసి లక్ష్యాన్ని విస్మరింపజేస్తాయి. వీటన్నిటి ప్రయోజనాలను పరిమితులను గుర్తిస్తూ, అర్హమైన విలువనిస్తూ పూర్తిగా జీవించడంలో మొత్తం కోరికలనుండి బయటపడగలగాలి. చివరగా మోక్షం కావాలనే కోరికను కూడా విడచి పెట్టాలి. కోరిక ఏ రూపంలో ఉన్నా అజ్ఞానం ఉందన్నమాటే.
అత్యున్నతమైన ఈ వైరాగ్యభావంతో ధ్యానించాలి. జీవితంలో ఏమీ సాధించలేని నిరాశతో భయపడి అన్నిటినీ వదిలివేయడం కాదిది. తనచుట్టూ
ఉన్న ప్రపంచాన్ని తన జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంతో పరిణతి చెందిన బుద్ధిలో నీకసించిన అత్యున్నత భావమే వైరాగ్యము.
🕉️🌞🌍🌙⭐🚩
102) అష్టావక్ర గీత🧘♀️
అధ్యాయం - 10
నిర్మమత్వం - వైరాగ్యం
శ్లోకం 01:-
అష్టావక్ర ఉవాచ ॥
విహాయ వైరిణం కామమర్థం చానర్థసంకులం ।
ధర్మమప్యేతయోర్హేతుం సర్వత్రానాదరం కురు ॥ 10-1 ॥
అష్టావక్ర ఉవాచ :
శ్లో విహాయ వైరిణం కామం అర్థం చానర్థసంకులమ్ | ధర్మమ ప్యేతయోర్దేతుం సర్వత్రానాదరం కురు 1.
టీకా
వైరిణం = శత్రురూపమగు, కామం = కామమున్ను, చ = మరియు, అనర్థ సంకులం = అనర్థములతో నిండిన, అర్థం అర్థమున్ను, విహాయ = విడిచి పెట్టి, ఏతయోః = ఈ రెండింటికీ, హేతుం = కారణమైన, ధర్మమపి = ధర్మమునున్ను, విహాయ = విడిచి పెట్టి, సర్వత్ర = ధర్మార్థ కామములయందును, వాటికి నిమిత్తములగు కర్మముల యందును, అనాదరం = అనాదరమును, కురు = చేయుము.
వివరణ:-
కోరికను నీ శత్రువుగా భావించు, ఐశ్వర్యం అనర్థ హేతువనీ, కోరిక లను పెంచడానికి తోడ్పడుతుందని తెలుసుకో. ఈ కోరికలకు, ఐశ్వర్యానికీ కూడా ధర్మం మూలమని గుర్తించు, ఇలా గుర్తించడంలో కోరికను, సంపదను, ధర్మాన్నీకూడా, పరిమితులను ప్రయోజనాలను గుర్తించి, ఉదాసీన భావంతో పరిత్యజించు.
తాత్పర్యం:-
సంప్రదాయబద్ధమైన హిందూజీవితం ధర్మ, అర్థ, కామ, మోక్షమనెడి నాలుగింటిని సాధించేదిగా నియమింపబడింది. ధర్మానికనుగుణంగా జీవిస్తూ
వీలయిన అర్థాన్ని సంపాదిస్తూ, ఏనేక వితరణలతో కోరికలను (కామం) తీర్చుకుంటూ, మోక్షాన్ని సాధించడమే మానవ జీవిత పరమార్ధం. ఇది సంభవం అయేలా చెయ్యడానికి జీవితాన్ని నాలుగు ఆశ్రమ విభాగాలుగా విభజించేరని ఇదివరకే చెప్పబడింది. అవి బ్రహ్మచర్య,గృహస్థ,
వానప్రస్థ, సన్యాస ఆశ్రమములు.
ఆ మోక్ష సాధనకు ఉపయోగపడే జీవితానికి అర్హమైన గౌరవాన్ని ఇవ్వాలి. ఆ జీవితాన్ని పూర్తిగా సంతోషంగా జీవించాలి. ఆ విధంగా జీవితాన్ని మలచడాని కుపయోగపడే ధర్మానికి, సంతోషంగా జీవించడాని కవసరమయే అర్థకామాలకు కూడా అర్హమైన విలువ నిచ్చినప్పటికీ, వాటి పరిమితులను కూడా గుర్తించాలి. ధర్మ అర్థ కామాల ఆకర్షణలోనూ విలువలోనూ మునిగిపోయి మోక్షాన్ని విస్మరించరాదు.
వీటిని సాధించటంలో అహంకార మనోబుద్ధులు దృఢపడి, చివరలో వీటిని విడనాడడం కష్టతరం అయే ప్రమాదం ఉంది. అందుకే సాధకులను
అష్టావక్రులు ఇచ్చట హెచ్చరిస్తున్నారు. ధర్మార్థ కామ మోక్షాల ఆవశ్యకతనూ, విలువనూ, అవధినీ, పరిమితినీ, ప్రయోజనాన్ని పూర్తిగా గుర్తిస్తూ జీవించడంలో వాటి బంధం నుండి బయట పడగలగాలి. అప్పుడే మోక్షం సాధ్యం అవుతుంది.
ఈ అవగాహన సక్రమంగా లేనిపక్షంలో వానిలోనే బంధింపబడి ఉండిపోవడం జరుగుతుంది.
వేదాంత విద్యార్థికి "కోరిక" శత్రువు వంటిది. ఈ కోరికలు మనస్సును అశాంతితో నింపి లక్ష్యాన్ని మరపింప చేస్తాయి.
విషయ భోగవాంఛలతోనూ ప్రయత్నాలతోనూ కాలం గడిచిపోతుంది. ధ్యానం కష్టసాధ్యమవుతుంది. అందుకనే కోరికలను శత్రువుగా భావించి అప్రమత్తతతో వ్యవహరించాలి. అర్థాన్ని సంపాదించడంలోనూ దాచడంలోనూ ఖర్చు చేయడంలోనూ కూడా మనస్సు అంతులేని అశాంతికి గురికాక తప్పదు. కాబట్టి జాగ్రత్త చాలా అవసరం.
ధర్మా చరణలో పేరు ప్రతిష్ఠలు, సన్మానాలు, సంపదలూ వృద్ధి అయి మనస్సును అన్యాక్రాంతం చేసి లక్ష్యాన్ని విస్మరింపజేస్తాయి. వీటన్నిటి ప్రయోజనాలను పరిమితులను గుర్తిస్తూ, అర్హమైన విలువనిస్తూ పూర్తిగా జీవించడంలో మొత్తం కోరికలనుండి బయటపడగలగాలి. చివరగా మోక్షం కావాలనే కోరికను కూడా విడచి పెట్టాలి. కోరిక ఏ రూపంలో ఉన్నా అజ్ఞానం ఉందన్నమాటే.
అత్యున్నతమైన ఈ వైరాగ్యభావంతో ధ్యానించాలి. జీవితంలో ఏమీ సాధించలేని నిరాశతో భయపడి అన్నిటినీ వదిలివేయడం కాదిది. తనచుట్టూ
ఉన్న ప్రపంచాన్ని తన జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంతో పరిణతి చెందిన బుద్ధిలో నీకసించిన అత్యున్నత భావమే వైరాగ్యము.
🕉️🌞🌍🌙⭐🚩
22) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘♀️
22) శ్లోకం:-
జాగ్రన్ముఖ త్రివిధ ధామసు సాక్షిణీ యా జాగ్రన్ముఖ త్రివిధధామ విలక్షణా యా |
స్వప్నాద్యనుస్మృతి బలాత్సతతైక రూపా సై వాహమస్మి చితి రిత్యవధారయ త్వమ్ ॥ 22
టీకా
జాగ్రత్ ముఖ = జాగ్రత్తుతో మొదలయ్యే, త్రివిధ ధామసు = మూడు స్థానాలలోను, యా సాక్షిణే = ఎవరు సాక్షియో, జాగ్రత్ ముఖ = జాగ్రత్తుతో మొదలయ్యే, త్రివిధ ధామ = మూడు స్థానాలకి, విలక్షణా యా = విలక్షణమైనది ఏదో, స్వప్న ఆది = కల మొదలైన దశల, అనుస్మృతి బలాత్ = నిరంతర స్మృతి కారణంగా, సతత ఏకరూపా = ఎప్పుడూ ఒకేరూపంలో ఉండేదిగా (నిర్ధారితమైన), చితి ఏవ = ఆ చితియే, అహం అస్మి = నేను అయి వున్నాను, ఇతి = ఈ ప్రకారంగా, త్వం = నీవు, అవధారయ = భావించు.
భావం:-
జాగ్రత్తు మొదలైన మూడు స్థానాలకి సాక్షి యేదో, స్వప్నం మొదలైన వాటి నిరంతర జ్ఞాపకం ఉంటున్న కారణం వల్ల నిత్యమూ ఒకే రూపంగా(నిర్ధారిత మైంది) ఉండేది ఏదో ఆచితినే నేను అని నిరంతరం భావన చేయుము.
వివరణ
జీవుడి పరికరాల రూపంలోను, ప్రపంచంలోని విషయ వస్తువుల రూపంలోను ఉన్న జడాలన్నింటితో అంత:శ్చైతన్యం పెనవేసుకొని పోయి వున్నది. ఒకటిగా అల్లుకుపోయిన జడచైతన్యాలని సూక్ష్మభావన ద్వారా అతి నేర్పుతో విడదీయాలి.
దిన దినం అందరికీ జాగ్రత్స్వప్న సుషుప్తులలో మూడు లోకాల అనుభవం కలుగుతుంది. అవి మూడు వేరు వేరు అవస్థలలో అగుపడు తున్నాయి. ప్రతి అవస్థలోని వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంటుంది. రెండో దానిని పోలివుండదు. జాగ్రదవస్థలో లక్షాధికారి అయినవాడు స్వప్నంలో బిచ్చగాడుగా ఉండవచ్చును. సుషుప్తిలో ఏదీలేని శూన్యంగా ఉంటాడు.
స్థూలశరీరంలో ఉన్నప్పుడు జాగ్రద్లోకము, సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు స్వప్నలోకము, కారణ శరీరంలో ఉన్నప్పుడు సుషుప్తి శూన్యము అగుపడుతాయి.
అందుచేత ఈ మూడు శరీరాలు జీవికి మూడు ధామాలు లేదా మూడు ఇళ్ళు. ఈ మూడిళ్ళలోను ఉండి తెలుసుకునే జీవుళ్ళు ఎందరున్నారు. ముగ్గురా? ఒకడా? అనుభవాలు మూడు వ్యక్తిత్వాలవి, జీవుడు మాత్రం ఒక్కటే.
ఆ ఒక్కడైనా జీవుడి స్వరూపం ఏది అని లోతుగా ఆలోచిస్తే, మూడు లోకాల అనుభవాలని చూస్తూ, మూడు ధామాలకి భిన్నమైనది ఏదో అదే జీవుడని తెలుస్తుంది.
మూడు లోకాలని చూడడానికి, మూడు ధామాలని వాడుకోడానికి చైతన్యం కావాలి. అందుచేత ఆ చితిని నేను అని జీవుడు గ్రహించాలి.
అయితే మూడు వ్యక్తిత్వాలు, మూడు ధామాలు మూడు లోకాలు మారిపోతున్నాయి కాబట్టి చితి కూడా మారుతోందా? అంటే మారదు. అని పై శ్లోకం వివరిస్తుంది.
మార్పులని జ్ఞాపకం ఉంచుకునేది మార్పులకు అతీతమైనది. అది ఎప్పుడూ ఏకరూపంగా ఉంటుంది. చితి ఏక రూపం కాక భిన్నత్వాన్ని చెందుతూంటే, జాగ్రదావస్థలోని చితి మారిపోయింది.
కాబట్టి స్వప్నావస్థ గుర్తుండదు. సుషుప్తి అవస్థలో చితి మారిపోయింది కాబట్టి మేలుకొన్నాక నిద్ర బాగా పట్టిందో లేదో తెలియదు. ఇవి అన్నీ నిరంతరం జ్ఞాపకంలో ఉన్నాయి కాబట్టి చితి మారకుండా ఏకరూపంగా ఉంటూంది.
ఇలా నిత్యం భావన చేసి మూడు ప్రపంచాల, మూడు ధామాల వ్యామోహం నుండి బయటపడాలి.
**
92- ఒక యోగి ఆత్మకథ🧘♀️
విశ్వవిద్యాలయపట్టప్రాప్తి
“నువ్వు నీ తత్త్వశాస్త్ర పాఠ్యగ్రంథాలు చదవడం నిర్లక్ష్యం చేస్తున్నావు. పరీక్షల్లో గట్టెక్కడానికి అనాయాసమయిన అంతఃప్రేరణ మీద ఆధారపడుతున్నట్టుంది. కాని నువ్వు కనక, ఒక విద్యార్థిమాదిరిగా కష్టపడి చదవకపోయినట్లయితే నువ్వు పాస్ కాకుండా ఉండేలా చూస్తాను.”
శ్రీరాంపూర్ కాలేజిలో ప్రొఫెసర్ డి. పి. ఘోషాల్‌గారు నాతో కఠినంగా మాట్లాడుతూ అన్న మాటలివి. ఆయన, తరగతిలో పెట్టే చివరి రాత పరీక్షలో కనక నేను తప్పినట్లయితే చిట్టచివరి పరీక్షలకు కూర్చోడానికి నేను అనర్హుణ్ణి అవుతాను. ఈ నియమాలు ఏర్పరచింది కలకత్తా విశ్వవిద్యాలయ విద్యావిభాగం; దాని అనుబంధ శాఖల్లో శ్రీరాంపూర్ కాలేజి ఒకటి. భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఒక విద్యార్థి బి. ఏ. చివరి పరీక్షల్లో ఏ ఒక్క సబ్జెక్టులో పాసవకపోయినా, ఆ మరుసటి సంవత్సరం మొత్తం ‘అన్ని’ సబ్జెక్టుల్లోనూ పరీక్షకు కూర్చోవాలి.
శ్రీరాంపూర్ కాలేజీలో మా అధ్యాపకులు మామూలుగా నన్ను దయతో చూసేవారు; అయితే దాంట్లో రవంత పరిహాసం కూడా లేకపోలేదు, “ముకుందుడు మత విషయంలో కాస్త మితిమించి మత్తెక్కి ఉన్నాడు.” అని తేల్చి పారేస్తూ, తరగతి గదిలో వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ప్రయత్నించే ఇబ్బంది కూడా నాకు లేకుండా చేసేవారు. చివరి రాతపరీక్షలు నన్ను బి. ఏ. పరీక్షార్థుల పట్టికలోంచి తప్పిస్తాయని నమ్ముకున్నారు. నా తోటి విద్యార్థులు నా గురించి ఇచ్చిన తీర్పు, “పిచ్చి సన్యాసి” అని వాళ్ళు నాకు పెట్టిన మారుపేరులోనే వెల్లడి అయింది.
తత్త్వశాస్త్రంలో నేను తప్పుతానన్న ప్రొఫెసర్ ఘోషాల్‌గారి బెదిరింపును వమ్ముచెయ్యడానికి నేను తెలివిగా ఒక ఎత్తు వేశాను. ఇక చివరి పరీక్ష ఫలితాలు బహిరంగంగా ప్రకటిస్తారనగా, ప్రొఫెసర్ గదిలోకి వెళ్ళేటప్పుడు నాతోబాటు ఒక సహాధ్యాయిని కూడా రమ్మన్నాను.
“నువ్వు కూడా రా; నాకో సాక్షి కావాలి,” అన్నాను మా వాడితో. “ఆ ప్రొఫెసరుగారి నమ్మకాన్ని వమ్ము చేయడంలో నేను విఫలుణ్ణయితే నాకెంతో నిరాశ కలుగుతుంది.”
నా పేపరుకు ఆయనిచ్చిన మార్కులెన్నో చెప్పమని నేను అడిగినప్పుడు ప్రొఫెసర్ ఘోషాల్‌గారు తల ఆడించాడు.
“పాసయిన వాళ్ళలో లేవు నువ్వు,” అన్నారాయన ఏదో సాధించానన్న గర్వంతో. తమ బల్లమీదున్న పెద్ద కాయితాల బొత్తి కెలికి చూశారు. “పేపరు లేనే లేదిక్కడ: ఏమయినా, పరీక్షకి గైర్‌హాజరు కావడంవల్ల నువ్వు ఫెయిలయావు.”
నేను ముసిముసిగా నవ్వాను. “సార్, నేను హాజరయానండి! పోనీ, ఆ కట్టలో నేను వెతుక్కోనాండీ?”
ఆ ప్రొఫెసరుగారు ఇరకాటంలో పడి, నాకు అనుమతి ఇచ్చారు. నా హాజరుపట్టి నంబరు తప్ప, మరే గుర్తూ లేకుండా నేను జాగ్రత్తపడ్డ పేపరును తొందరగానే పట్టుకున్నాను.
“ఎర్ర జెండా” లాంటి నా పేరు ఆయన్ని హెచ్చరిస్తూ అక్కడ లేకపోవడంవల్ల ఆ ప్రొఫెసరుగారు, పాఠ్యపుస్తకాల్లోంచి ఉదాహరించిన ముక్కలతో నా సమాధానాల్ని అందంగా అలంకరించకపోయినప్పటికీ, వాటికి ఆయన ఎక్కువ మార్కులే ఇచ్చారు.
నేను ప్రయోగించిన యుక్తి కనిపెట్టి, “ఇది వట్టి, సిగ్గుచేటు అదృష్టం!” అంటూ ఉరిమారాయన. అయినా, “బి. ఏ. ఫైనల్స్‌లో నువ్వు ఫెయిలవడం ఖాయం!” అంటూ తమ ఆశాభావం వెలిబుచ్చారు.
నేను ఇతర విషయాల్లో జరిగే పరీక్షలకోసం కొంత స్నేహితుల చేత చెప్పించుకున్నాను. ముఖ్యంగా, నాకు ప్రియమిత్రుడయిన మా శారద బాబయ్యగారబ్బాయి ప్రభాస్ చంద్రఘోష్ నాకు చాలా చెప్పాడు. అవస్థపడుతూ కాస్త ఊగిసలాడినా, మొత్తం మీద నేను చివరి పరీక్ష లన్నింటిలోనూ పాసవడానికి రావలసిన కనీసపు మార్కులు తెచ్చుకుని ఎలాగో బయటపడ్డాను.
నాలుగేళ్ళు కాలేజి చదువు పూర్తయిన తరవాత, ఇక నేను బి. ఏ. పరీక్షలకు కూర్చోడానికి అర్హుణ్ణి అయాను. అయినప్పటికీ ఆ అవకాశాన్ని వినియోగించుకోగలనని కలలో కూడా అనుకోలేదు. బి. ఏ. డిగ్రీకి కలకత్తా విశ్వవిద్యాలయం పెట్టే కఠిన పరీక్షలముందు, శ్రీరాంపూర్ కాలేజి చివరి పరీక్షలు చిన్న పిల్లల ఆటల్లాంటివి. దాదాపు ప్రతి రోజూ నేను శ్రీయుక్తేశ్వర్‌గారి దర్శనానికి వెళ్తూండడంవల్ల కాలేజి హాళ్ళలోకి ప్రవేశించడానికి నాకు టైమే మిగలలేదు. అక్కడ నా సహాధ్యాయులు, నేను గైర్హాజరయినప్పటి కంటె హాజరయినప్పుడే ఆశ్చర్యం ప్రకటించేవారు.
పొద్దున తొమ్మిదిన్నరకి సైకిలెక్కి బయల్దేరడంతోనే దాదాపు ప్రతిరోజూ నా దినచర్య మొదలయేది. ఒక చేత్తో, గురుదేవులకు అర్పించడానికి, మా ‘పాంథీ’ వసతిగృహంలోని తోటలో పూసిన పూలు కొన్ని పట్టుకువెళ్ళే వాణ్ణి.
గురుదేవులు నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ మధ్యాహ్న భోజనానికి ఉండిపొమ్మనేవారు. ఇక ఆ రోజుకు కాలేజీకి వెళ్ళడమనే బెడద తప్పినందుకు సంతోషిస్తూ, ఆయన ఆహ్వానాన్ని తప్పకుండా హుషారుగా అంగీకరించేవాణ్ణి.
శ్రీయుక్తేశ్వర్‌గారి సాటిలేని జ్ఞానోపదేశాలు ఆలకిస్తూనో, ఆశ్రమ విధుల్లో సాయపడుతూనో ఆయనతో గంటల తరబడి గడిపిన తరవాత, మనస్సు ఒప్పకపోయినా ఏ నడిరాత్రి వేళకో బయల్దేరి ‘పాంథీ’ వసతిగృహానికి వెళ్తూ ఉండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు, రాత్రి అంతా గురుదేవుల దగ్గరే ఉండిపోయేవాణ్ణి; ఆనందంగా ఆయన సంభాషణలో ఎలా మునిగిపోయేవాణ్ణంటే, చీకటి వేకువగా మారిందెప్పుడో కూడా గమనించేవాణ్ణి కాదు.
🕉🌞🌏🌙🌟🚩
- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)
689) శ్లోకము :-
అంబా వృణోతి పరితోఽప్యయ మంధకారో
నాత్మేనమేవ మమ కింతు కులం చ దేశమ్!
శీఘ్రం మదీయ హృదయోదయ పర్వతాగ్రే
శ్రీమా నుదేతు తవ పాద మయూఖమాలీ!! 689
పదవిభజన:-
అంబ! ఆవృణోతి పరితః
అపి అయం అంధకారః
న ఆత్మేనం ఏవ మమ కిం
తు కులం చ దేశమ్!
శీఘ్రం మదీయ హృదయ
ఉదయ పర్వత అగ్రే
శ్రీమాన్ ఉదేతు తవ
పాద మయూఖమాలీ!! 689
భావము:-
తల్లీ ! ఓ ఉమాదేవి!
ప్రగతి మార్గమును కప్పివేసిన
అజ్ఞానము అనే అంధఃకారము
కేవలము నా మనస్సునే కాక
దేశము అంతటా
అందరినీ
ఆవరించి ఉన్నది.
లక్ష్మి వంతమైన నీ పాదపద్మములు,
కాంతి వంత మైన సూర్య కిరణముల వలె
నా హృదయములో
శ్రీఘ్రముగా ఉదయించి
అజ్ఞానాంధఃకారమును
నా నుండి, అందరి నుండి
నా దేశము నుండి
పటా పంచలు చేయుకాక.
🕉🌞🌎🌙🌟🚩
690) శ్లోకము :-
కష్టం ధునోతు మమ పర్వత పుత్రికాయాః
ప్రత్యగ్ర పంకరుహ బాంధవ కాంతి కాంతమ్!
అంభోరుహాసన ముఖామరమౌలిరత్న
జ్యోతిర్విశేషిత గుణం చరణారవిందమ్!! 690
పదవిభజన:-
కష్టం ధునోతు మమ పర్వత పుత్రికాయాః
ప్రత్యగ్ర పంకరుహ బాంధవ కాంతి కాంతమ్!
అంభోరుహాసన ముఖ అమర మౌలిరత్న
జ్యోతిః విశేషిత గుణం చరణ అరవిందమ్!! 690
భావము:-
తల్లీ ! ఓ ఉమాదేవి!
బ్రహ్మ మొదలగు దేవతలు
శిరసు వంచి నమస్కరించుచుండ
వారి కిరీట రత్న కాంతి పుంజముల
విశిష్ట గుణముచే ప్రకాశమానమై,
కమల బాంధవుడగు బాల భానుని
కాంతివలె ప్రకాశంచుచున్న,
హిమ పర్వత రాజ కుమారి
పాద పద్మములు
నా కష్టముల తొలగించు కాక.
🕉🌞🌎🌙🌟🚩
[4:22 pm, 24/06/2022] +91 92915 82862: 🧘♂️392) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️
🕉️🌞🌏🌙🌟🚩
స్థితి ప్రకరణము
రెండవ అధ్యాయము
దామ వ్యాళ కటోపాఖ్యానము
2-127
యథా మశకజాలాని వర్షాదిష్వాకులాని తు ఉత్పత్త్యోత్పత్త్యనశ్యన్తి తథేమా లోకసృష్టయః.
వర్షాది ఋతువులందు పెక్కు దోమలుత్పన్నమై నశించునట్లు ఈ వివిధ జగత్తులున్ను (ప్రాణులున్ను) ఉత్పన్నములై విలయము నొందుచున్నవి.
2-128
దేహోత్పత్తౌ వినాశే చ దీపానాం బ్రహ్మణామపి
కాలేనాధికతాం త్యక్త్వా నాశే భేదో న కశ్చన.
తమ తమ శరీరముల యొక్క ఉత్పత్తి వినాశములందు దీపములకును, బ్రహ్మదేవులకును కాలాధిక్యత యొకటి తప్ప మఱియు ఏ భేదమున్ను లేదు. (అనగా దీపశరీరము శీఘ్రముగ నశించును. బ్రహ్మదేవుని శరీరము ద్విపరార్థాంతమున నశించును, ఇంతియే భేదము.)
2-129
పునః కాలకులాలేన కృతభూతశరావకమ్ చక్రమావర్త్యతే వేగాదజస్రం కల్పనామకమ్.
కాలమను కుమ్మరివానిచే నిర్మింపబడిన ప్రాణులను మృణ్మయ పాత్రను ధరించిన కల్పమను చక్రము నిరంతరముగ వేగముగా పలుమార్లు పరిభ్రమించుచున్నది.
శ్రీ వాల్మీకి మహర్షిచే రచింపబడిన మోక్షోపాయమగు శ్రీయోగవాసిష్ఠరత్నాకరమున స్థితిప్రకరణమందు దామవ్యాళకటోపాఖ్యానమను రెండవ అధ్యాయము సమాప్తము.
🕉️🌞🌏🌙🌟🚩
కంద పధ్యాలు
* మధ్యం ఆరోగ్యానికి
మధ్యం అనేది ప్రభుత్వ మందనిత్రాగున్
మధ్యం హాని కరము యే
మధ్యం ధనముయ సుఖమ్ము మనసును చంపున్
* ఊహించని దే దాహము
దేహము విజ్ఞాన నిధియు దివ్యమగుటయున్
మోహము పైనుండి మదము
స్నేహము దాహాన్ని తీర్చి సిరులే పంచున్
* 'నేనే దేవుడు అనేది
ప్రాణము బయటే ఉంటే ప్రధమం దోషం
ప్రాణం లోపల సత్యము
మనిషే మనధర్మములను మనసు న మార్చెన్
* చదువు గుర్తింపు పేదల చేరువగుట
దేశ అభివృద్ధి చదువుతో దినదినముగ
వ్యక్తి చదువు వ్యర్దము చేసి వ్యాధి అనకు
చదువుల జగతి సుఖముగా జీవయాత్ర
* హృదయ వాంఛను గమనించు హృదయమందు
శిధిల మయ్యేనె ఓదార్పు స్వేశ్చ లేక
నిధియు నిక్షిప్త మైనది నేడు రేపు
ఆణువణువు తినేసిన ప్రేమ ఆశ నాది
* బాల్య మిత్రులు కలయిక బహుసబబు యె
వృత్తి ఏదైనా పరిచయ వివరణ మది
సహజ సంపద స్నేహము స్వల్ప దృష్టి
కలము కదిలేను కధలుగా కాల మలువు
*।అడుగె వేయుట నీవంతు అదరక విధి
ఎప్పుడూ ఆప కూడదు ఏది అనక
తెలిసినది తెల్పి తెలియంది తెలుసుకొనుడు
జీవితం ఎత్తుపల్లాలు చేదు తీపి
నిన్ను నీవుగా గుర్తింపు నేటి స్థితియు
ఓర్పు ఓదార్పు సంఘము ఓడి గెలుచు
సంఘం
స్రగ్ధరా - మ/ర/భ/న/య/య/య UUUU IUU - IIII IIU - UIU UIUU
కాలమ్మే ప్రేమ భావం - కళలను కధలే - కావ్యమై సేవచేయా
మూలమ్మే దాహ లక్ష్యం - ముడుపులు పెరిగే - మూగభావమ్ము పెంచే
మాలగా దైవ సేవే - మలుపులు కదిలే - మానసమ్మే మ్మెను జూపే
నీలికన్నుళ్లు ప్రేమా - నటనలు తెలిపే - నాట్యమై దేహ మాయే
మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
స్రగ్ధరా - మందాక్రాంతము
---
సంస్కృతములో ఎక్కువగా వాడిన నిడివియైన వృత్తములు శార్దూలవిక్రీడితము, స్రగ్ధరా। స్రగ్ధరకు రెండు యతులు। శ్రీరామకర్ణామృతములో ఎన్నియో స్రగ్ధరలు ఉన్నాయి। స్రగ్ధరా అంటే పూదండ దాల్చినది అని అర్థము। నన్నెచోడుడు కుమారసంభవమును స్రగ్ధరావృత్తముతో ప్రారంభిస్తాడు। పార్వతీదేవి స్రగ్ధరయే కదా? ఈ వృత్తపు పాదము మ,ర గణములతో ఆరంభమవుతుంది, కనుక ఇది మరణయోగమునకు దారి తీస్తుందనే ఒక (మూఢ) నమ్మకము కవులకు। కాని కాలిదాసు అభిజ్ఞానశాకుంతలమును స్రగ్ధరతోనే ప్రారంభిస్తాడు। స్రగ్ధరను వ్రాయడము కొద్దిగా కష్టమే। కాని ఏవృత్తమునైనను కొన్ని మాత్రాగణములుగా విభజించుకొన్నప్పుడు వ్రాయుట సులభము। ఉదాహరణముగా స్రగ్ధరను ఇలా విడదీయ వచ్చును: UU UUI UU - IIII IIU - UIU UIUU। ఇది ఒక్కటే కాదు, ఇతర విధములు కూడ ఉన్నాయి। క్రింద నా ఉదాహరణములు:
---
స్రగ్ధరా - మ/ర/భ/న/య/య/య UUUU IUU - IIII IIU - UIU UIUU
21 ప్రకృతి 302993
---
స్వామీ నీవేల నాపై - బరువు నిడితివే - బాధతో మోయ నౌనా
యేమో నీరీతి నాతో - నిపుడు ధరణిపై - నిట్టు లాటాడుటేనా
ప్రేమానండుండ వీవే - ప్రియమున గనరా - శ్రీలు నేఁగోర లేదే
నీమోమే చాలు నాకీ - నిఖిలమున సదా - నిండు నీడెందమందున్
---
రాగమ్మై రా మురారీ - రవణపు సరమై - రమ్య రాసప్రవీణా
నాగమ్యమ్మై నవమ్మై - నగవుల సిరియై - నందగోపాల రారా
యూఁగంగా రా మనస్సే - యుఱికెను గడలై - యోసఖా నిన్ను జేరన్
మ్రోఁగెన్ నాలో వినంగా - ముదములు సడియై - మోహనా ముద్దులీరా
---
స్రగ్ధరలో మందాక్రాంతము కూడ ఇమిడియున్నది।
UUUU IUU - IIII IIU - UIU UIUU - స్రగ్ధరా
UUUU - III IIU - UIU UIUU - మందాక్రాంతము
పైన రెండవ పద్యములో మందాక్రాంతము గర్భితమై యున్నది। ఆ పద్యము
---
మందాక్రాంతము - మ/భ/న/త/త/గగ UUUU - IIIIIU - UIU UIUU
17 అత్యష్టి 18929
---
రాగమ్మై రా - రవపు సరమై - రమ్య రాసప్రవీణా
నాగమ్యమ్మై - నగవు సిరియై - నందగోపాల రారా
యూఁగంగా రా - యుఱికెఁ గడలై - యోసఖా నిన్ను జేరన్
మ్రోఁగెన్ నాలో - ముదము సడియై - మోహనా ముద్దులీరా
---
విధేయుడు - మోహన
0 comments
పాదములు రెండు పదహారు సూర్యగణములు
యతి 1।1 -- 9।1 , ప్రాస , అంత్యప్రాస నియతము
శేషశైల శ్రీనివాస , భక్తవరద పారిజాత , శ్రీకరముగ నిల్చి నావు , వేంకటేశ్వరునిగ మాకు !
భూషణములు సర్వసంపదలట , సిరికి పెనిమిటివట , పోష కుడవు భారకుడవు సర్వరక్షకుడవు మాకు !!
ఒరియా కథ అనువాదం
కధ శ్రీ గౌరహరి దాస్
అనువాదం: శ్రీ కే।వి।ఎస్ ఎస్।మూర్తి
బంగారపు ముక్క (అనువాద కథ)
ఒరియా మూలం : గౌరహరి దాస్
తెలుగుసేత : మూర్తి కెవివిఎస్
పొద్దుటే కాకులు గోల పెట్టి అరుస్తుంటే జనాలు పక్కల మీదినుంచి లేవడం సహజం। కాని రఘునాథ్ మాత్రం తల్లి,భార్య వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవ భరించలేక నిద్ర నుంచి లేస్తాడు।ఆ గొడవ ఒక్కోసారి చిన్న వాన జల్లుల్లా మొదలయి ముగుస్తాయి।కాస్తా నిద్ర లోకి జారుకుంటాడప్పుడు। అయితే ప్రతిరోజూ అంత అదృష్టం ఉండదు।ఇత్తడి సామన్లని ఎవరో ఒకరు దభేలున ఎత్తి పడేస్తారు। ఇదిగో ఈరోజులాగే।
నిద్రలో నుంచి చచ్చినట్లు మేల్కోవలసిందే।గత అయిదు రోజులనుంచి ఈ శబ్దాలు కిచెన్ లో నుంచే ఎక్కువ గా వస్తున్నాయి। కనక ఆ వేపుగా వెళ్ళాడు।ముందు గది లో కొడుకు టి।వి।చూస్తున్నాడు। పొద్దున్నే ఆ టి।వి। ఏవిట్రా అన్నాడు రఘు।"నేను।।।ఒక్కడ్నే కాదు,అమ్మ కూడా చూస్తోంది" అన్నాడు వాడు।ఏం అనాలో అర్థం కాలేదు రఘు కి।
టి।వి। లో వార్తలు ।।।ఇజ్రాయెల్ ,లెబనాన్ సిటీల మీద బాంబుల వర్షం కురిపిస్తోంది।వేలాదిమంది నిరాశ్రయులయ్యారు।విదేశీయులు ఎయిర్ పోర్ట్ ల దిశగా పరుగులు తీస్తున్నారు। అదే సమయం లో కొడుకు ఇప్సిత్ చానల్స్ ని వాడి ఇష్టం వచ్చినట్లుగా మార్చుతున్నాడు।వాడికిష్టమైన కార్టున్ చానల్ కోసం।
"ఎందుకు అలా మారుస్తున్నావు,ఏదో ఓ చానల్ ఉంచరా" అన్నాడు రఘు।
వాడు ఏ ధ్యాస లో ఉన్నాడో గాని తండ్రి చెప్పిన చానల్ కే మార్చాడు। లెబనాన్ దేశం లోని ఆకాశం అంతా పొగమయం గా ఉంది।నాగసాకి,హిరోషిమా ల మీద బాంబు పడితే ఎలా పొగమయంగా అయిందో।।అలా।।।అదంతా టెక్స్ట్ బుక్స్ లో చూసిందే।ప్రతి చోట రక్తసిక్తం గా ఉంది।అరణ్య రోదనలు।
"బందనా।।! ఈరోజు మాణింగ్ న్యూస్ విన్నావా।।?" అడిగాడు రఘు।
అంత వరకు అత్త తో ఏదో వాదిస్తున్న బందన ఏవిటి అన్నట్లు ఆ గొడవ ఆపింది।ఆమెలోని టీచర్ అంతర్జాతీయ వార్తల్ని,ఆ విషాదాన్ని పట్టించుకున్నట్లే ఉంది।
"కనుమూసి చూసేలోగా వేలమంది నిరాశ్రయులయ్యారు।చూస్తుంటే అక్కడ బూడిదే మిగిలేలా ఉంది" అంది బందన।
"జంతువుల కంటే మనిషి ఎంతో పురోభివృద్ధి సాధించాడంటారు।ఏవిటో" ఇదంతా వ్యాఖ్యానించాడు రఘు।
"అవతల బాగ్దాద్,ఇక్కడ కాశ్మీర్ ప్రతిరోజు తగలబడుతూనే ఉన్నాయిగా।ఇప్పుడు బీరూట్ కూడా అలానే ఉంది। ప్రశాంతత అనేది లేదు లోకంలో" బందన ప్రశాంతత అనే పదాన్ని వత్తి పలికింది। టి।వి। మీదినుంచి తన చూపుని తల్లి వేపు సారించాడు రఘు। కొడుకు చదువుకోవడానికి టేబుల్ దగ్గరకి వెళ్ళాడు। తల్లి బెడ్ రూం లో ఉంది। నిజానికి ఆమెకంటూ ఓ గది లేదు।స్టోర్ రూం లోనే ఓ పక్కకి పడుకుంటుంది।చుట్టాలెవరైనా వస్తే వాళ్ళ సామాన్లు అక్కడే పెడతారు।ఆ రూం లో పావు వంతు తల్లి, దేవుడి పటాలతోనూ వాటితోనూ నింపేసింది।
"బియ్యపు మూటలు,బంగాళా దుంపలు ।।ఇలాంటివన్నీ ఇక్కడే పెట్టాలా?" అని సణుగుతుంది తల్లి। ఇదివరకు ఇక్కడ మీ నాన్న ఈ రూం లోనే పడుకునేవాడు।దీన్ని ఇప్పుడు ఇలా చేసేశారా।।?అంటుందామె। ఏ చిన్న చప్పుడైనా ఆమె కి పడదు।సణుగుతుంది।
"మీ అమ్మ విషయం లో కొన్ని మార్పులు చేయదల్చుకున్నాను।కాదంటే చెప్పు।।। ఇప్పుడే పిల్లాడ్ని తీసుకుని బెర్హంపూర్ వెళ్ళిపోతాను" భార్య బందన అల్టిమేటం ఇచ్చింది రఘుకి।నిశ్శబ్దం గా విన్నాడు రఘు।అతని తమ్ముడు జైపూర్ లో ఉంటాడు।తనేమో భువనేశ్వర్ లో।భార్యకీ,తనకీ మంచి ఉద్యోగాలు ఉన్నాయి।తమ్ముడిది ప్రైవేట్ ఉద్యోగం।ఓ కాంట్రాక్టర్ దగ్గర క్లర్క్ గా చేస్తున్నాడు।
పాపం వాడి భార్య కి అనారోగ్యం। ఇద్దరు పిల్లలు। వచ్చే ఆదాయం అంతంత మాత్రం।గత ఏడాది తండ్రి కి ఆరోగ్యం బాగోలేకపోతే భువనేశ్వర్ కి తీసుకొచ్చారు।ఇక్కడే చనిపోయాడు।అప్పటి నుంచి తల్లి కూడా ఇక్కడే ఉంటోంది।
తల్లికి,భార్య కి ఎప్పుడూ గొడవలే।ఎవరు బాధ్యులో అర్థం కాదు।ఎవర్ని సమర్థించాలో అర్థం కాదు।ఇద్దరూ ఇద్దరే।వాళ్ళేమన్నా కూరగాయలా।।?ఎవరో ఒకర్ని సెలెక్ట్ చేసుకోవడానికి।మిగతా వాటిని పారేయడానికి।
గతకొన్ని రోజుల్నుంచి చూస్తున్నాడు।గొడవలు తగ్గడం లేదు।బందన ప్రవర్తన అత్త ని ఇంట్లోనుంచి పంపించెయ్ అన్నట్లుగా ఉంది।ఇన్నిరోజులు చెప్పకపోయినా,ఈరోజున తన చెవులతో తనే వినవలసివచ్చింది।
భారతదేశం లో ని సగం కుటుంబాల్లో ఇదే పరిస్థితి। పాశ్చాత్య దేశాల్లో భిన్నమైన వాతావరణం।అక్కడ చాలా చిన్న వయసు నుంచే ఎవరి కాళ్ళ మీద వారు నిలబడటం నేర్చుకుంటారు।వృద్ధాప్యం లో తల్లిదండ్రులు పిల్లలకి దూరం గా నివసించినా ఎవరూ ఏమీ అనుకోరు।అదే మన దేశం లో పెళ్ళయిన కొడుకులు తల్లిదండ్రులతో నివసించాలని కోరుకోరు।ఎంత వసుధైక కుటుంబం అని చెప్పుకున్నా।।!
తల్లిదండ్రులు వేరేగా ఉన్నా మన సమాజం ఒప్పుకోదు।వీళ్ళూ అలా ఉండాలని అనుకోరు। ఒక వింతైన బంధం।।!ఎన్ని అవమానాలు ఎదురైనా ముసలి వాళ్ళు అలా భరిస్తూనే ఉంటారు। ఒక సోషియాలజి లెక్చరర్ గా బంధన కి ఇదంతా తెలుసు।కానీ అత్త విషయం లో మాత్రం నిర్దయ గా వ్యవహరిస్తుంది। రఘు ఎటూ చెప్పలేని పరిస్థితి లో ఉన్నాడు।
బంధన అన్న మాటల్ని రఘు తల్లి విని కన్నీళ్ళు పెట్టుకుంది। ఆమె తన వస్తువుల్ని అన్నిటిని ఓ పెద్ద సంచి లో పెట్టుకుంటున్నది।ఆ సన్నివేశం చూసి రఘు షాక్ అయ్యాడు।డబ్భై ఏళ్ళ తల్లి ఏ ఆధారమూ లేని వితంతువు లా గోచరించింది। మరి ఇప్పుడు తాను ఏం చేయాలి।।?తాము ఉంటున్న ఇంట్లో అయిదు గదులు ఉంటాయి।తాము మరీ పేద కాదు అలాగని పెద్ద ధనిక కుటుంబమూ కాదు।సరే।।చిన్నా చితకా అప్పులున్నా తీర్చలేనివి ఏమీ కావు। భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులే।।!
ఇప్పటికి చూస్తే తండ్రి మరణించాడు।మరి తల్లి యొక్క ఆయుషు ఎంత వుందో।।?ఇటు చూస్తే బంధన ,అత్త తో ఎంతమాత్రం కలిసి ఉండేది లేదని అల్టిమేటం ఇచ్చింది। పోనీ తమ్ముడి దగ్గరకి పంపుదామా అంటే,వాడి భార్య యొక్క ఆరోగ్యం అంతంత మాత్రం।సంకటస్థితి లో పడ్డాడు రఘు।తను ఒక్కడే కొడుకై ఉంటే అలాంటి స్థితి లో ఏమిచేసి ఉండేవాడో।।!
తన ఆఫీస్ లో సుపీరియర్ కి ఇలాంటి సమస్యే ఎదురైతే,తల్లిని వేరే ఇంట్లో ఉంచి ఆమె కి సేవ చేయడానికి నెలవారీ జీతం మీద ఓ పనిమనిషిని పెట్టాడు। ఎందుకో అది రఘు కి నచ్చలేదు।తల్లి ఒంటరిగా,పనిమనిషి సాయం తో ఉండటం।।।ఆయన మాత్రం సిటీ లో అన్ని సౌకర్యాలతో జీవించడం రఘు కి ససేమిరా నచ్చలేదు।
భార్య బంధన,తల్లి చేసే ప్రతిచిన్న పనిని విమర్శిస్తుంది।ఎప్పుడైనా గ్యాస్ కట్టేయకపోయినా,ఫ్రిజ్ డోర్ వేయకపోయినా తిడుతుంది।వీధిలో అమ్ముకునే వాళ్ళని పిలిచి ముచ్చట్లు పెట్టినా,సాధువుల్ని డ్రాయింగ్ రూం లోకి పిలిచి కూర్చోబెట్టినా బంధన కి నచ్చదు।ఈ ముసలామె వల్ల ఎవరో దొంగలు పడి ఇంటిని దోచుకుంటారని కోడలి అభిప్రాయం।
ఎందుకమ్మా అలా చేస్తుంటావు అని తాను అడిగితే "ఏదో చదువు లేనిదాన్ని।మా నాన్న పోయిన తర్వాత నన్ను ఎవరూ చదివించలేదు। మీ నాన్న కలకత్తా లోని ఇటుకలబట్టీ లో పనిచేసేవాడు।అక్కడి భాష నాకు తెలియదు।ఇక్కడ చూస్తే అంతా కొత్త కొత్త గా ఉంది।కొన్నాళ్ళుపోతే తెలుస్తుందేమో ఎలా ఉండాలో" అనేది తను।
తల్లి చెప్పింది కూడా నిజమే।।!ఆమె ఒక పేద కుటుంబం లో పుట్టింది।చిన్నతనం లోనే తల్లిదండ్రుల్ని కోల్పోయింది।ఆమె ఉన్న గ్రామం లో ఏ బడి లేదు।ఉన్నా ఆడపిల్లల్ని పెద్దగా పంపే రోజులు కావు అవి।అలా జరిగిపోయింది। పెళ్ళి కూడా ఏదో అలా జరిగిపోయింది।రఘు తండ్రి యొక్క మొదటి భార్య చనిపోవడం తో,ఏ కట్నం లేకుండా తల్లి మెళ్ళో తాళి కట్టాడు।
బంధన కి ఇవన్నీ బాగా తెలుసు। కానీ అత్త పట్ల ఎలాంటి జాలీ చూపదు।ఎంతమాట పడితే అంత మాట అంటుంది। తల్లి బాల్యం,ఆ తర్వాత దశ కూడా పేదరికం లోనే గడిచింది।చిన్నప్పుడు సంగతి అలా ఉంచితే,పెళ్ళయిన తర్వాత ఉన్న ఉంగరాన్ని కూడా భర్త అమ్మేశాడు।1971 లో వచ్చిన తుఫాన్ దెబ్బకి ఉన్న కొద్ది భూమి,పశువులు కూడా అమ్మివేయడం జరిగింది।
ఒకసారి తనని గోల్డ్ చైన్ చేయించమని అడిగింది తల్లి,ఏమిటో ఈ ఆడవాళ్ళకి ఆ లోహం మీద అంత ప్రేమ।।! సరే అన్నాడు తను।ఆ ఆనందం లో ఈ వార్త ని కోడలికి చెప్పింది।ఇక చూడు బంధన మామూలుగా తిట్టలేదు।
"ముసలితనం లో ఈవిడ కి బంగారపు గొలుసు కావలసి వచ్చిందా।।? ఆ దరిద్రపు రోజుల్లో ఎలాగూ లేదు।।ఇపుడు వేసుకోవాలనిపిస్తోందా।।?అయినా ఇంట్లో ఖర్చులకే సరిపోవడం లేదు। ఆమెకి గోల్డ్ చైన్ ఎలా చేయిస్తావు।।?ఆఫీస్ లో ఏవైనా వడ్డీ వ్యాపారం చేస్తున్నావా।।?" అంటూ భార్య తనని ఆడిపోసుకుంది।
అయ్యో।।।అమ్మా।।! నీకు గొలుసు చేయిస్తానని అన్న మాట నా భార్య కి ఎందుకు చెప్పావు।।? ఎంత లోకం పోకడ తెలియని అమాయకురాలివమ్మా।।।అని రఘు కి తల్లి మీద జాలీ ఇంకా మరో వైపు కోపమూ పెల్లుబికాయి। తల్లికి బంగారపు గొలుసు చేయించుదాము అనుకోవడానికి మరో కారణమూ ఉంది। తన భార్య,బిడ్డలు ఎప్పుడు బంగారు నగలు పెట్టుకున్నా,ఖరీదైన దుస్తులు వేసుకున్నా తల్లి కళ్ళు ఆశ తో మెరుస్తుండేవి। ఆమె బోడి చేతులు,మెడ,చెవులు ।।।చూసుకున్నప్పుడల్లా తనకి ఏమీ లేవు అనే ఓ భావం।।।చిన్నపిల్లల్లో ఉండే ఓ భావం ఆమె లో మెదిలేది। సరే।।।వితంతువులు అలాంటివి ధరించరాదని ఉన్నా అది వేరే విషయం।
రఘు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు।కాని ఏం చేయగలడు।।?సరే అని ఓసారి సూచాయ గా చెప్పాడు భార్య తో,తల్లికి గొలుసు చేయించే విషయం।।! ఇక దానితో ఆమె మామూలుగా శివాలెత్తలేదు।" ఇంజనీరింగ్ చదివే కూతురు కి ఏడాదికి లక్షన్నర కట్టాలి।కొడుకు కి ట్యూషన్ ఫీ కట్టాలి।ఇంటిఖర్చులు,మెడికల్ బిల్లులు ।।।ఇన్నీ పెట్టుకొని మీ అమ్మకి గోల్డ్ చైన్ ఎలా చేయిస్తావు।।।?" అన్నదామె।
"ఎంతైనా అమ్మగదా।।।ఆమెకి ।।"అంటూ గొణిగాడు రఘు।
"పదేళ్ళు మీ నాన్న కి సేవలు చేశాను।అంతకు ముందు మీ తమ్ముడ్ని పోషించాము।ఇప్పుడిక మీ అమ్మ వంతు వచ్చింది।ఇలా చేసుకుంటూ పోతే।।।ఇక నా సంగతి।।।నా పిల్లల సంగతి ఏమిటి ?" అంది బంధన।
రఘు గమ్మున ఉండిపోయాడు।అయినా మన పిల్లలు చిన్నగా ఉన్న కాలం లో వాళ్ళకి మా అమ్మ కూడా సేవ చేసింది గదా।ఇద్దరం ఉద్యోగాలకి వెళితే ఆమె ఇంటిని చూసుకుంది।ఇప్పుడంటే పిల్లలు ఎదిగారు,వేరే సంగతి।ఇదంతా బంధన కి గుర్తు చేద్దామనుకున్నాడు గాని దానివల్ల ఏం ప్రయోజనం ఉండదని ఏమి మాటాడకుండా ఉండిపోయాడు।
రఘు అడకత్తెర లో పోకచెక్క లాయ్యాడు।బంధన కాలేజి కి వెళ్ళిన తర్వాత తల్లిని ఓదార్చుదామనుకున్నాడు।వీళ్ళిదర్నీ సముదాయించడం,అదీ ఒకేసమయంలో,తనవల్ల గానిపని।తానేమీ జరాసంధుడిలా వరం పొందలేదు గదా,ఒకేసమయం లో రెండు చోట్ల కనబడటానికి। ఇద్దరూ ప్రతిరోజు గొడవ పడటం,తాను ఆఫీస్ నుండి టెన్షన్ తో రావడం అలవాటుగా మారిపోయింది।నిజానికి ఆఫీస్ లో ఉంటేనే కాస్త ప్రశాంతం గా ఉంటుంది। బంధన అనే మాటలకి,ఆమె దగ్గరకి వెళ్ళాలంటేనే చిరాకు గా ఉంటున్నది।
"మీకు ఏమిటి।।? ఇద్దరూ ఉద్యోగస్తులే।।।ఏం ఆర్థిక బాధలు ఉంటాయ్" అంటారు ఆఫీస్ లో కొలీగ్స్। వాళ్ళకేం తెలుసు సంపాదించే భార్యతో ఉండే బాధలు।
రఘు తల్లి కళ్ళలో నుంచి కన్నీరు,అదీ ఆమె కళ్ళకి కాటరాక్ట్ ఆపరేషన్ అయింది।మనవడు ఇప్సిత్ వెళ్ళి ఆమె ని ఓదార్చబోతే,బంధన వాడిని కసురుకుంది।వాడు చదువుకోవడానికి వెళ్ళిపోయాడు।రఘు కి తన మీద తనకే జాలి కలిగింది।ఇపుడు తనకి నలభైఆరేళ్ళు।ఇంకా ఎన్ని ఏళ్ళు ఇలా గడపాలో।।?!
" నా మరణానంతరం మీ అమ్మ ని జాగ్రత్త గా చూసుకో।చిన్న దానికే కలత పడిపోతుంది।చిన్నప్పుడే అనాథ కావడం।।।అన్నదమ్ములు ఆమె ని ఇంట్లోనుంచి పొమ్మని అనడం।।।పేదరికం।।ఇవన్నీ ఆమె అనుభవించింది।ఇంట్లోనుంచి పో అని మీ అమ్మని ఎప్పుడూ అనకు।అలా అంటే ముసలివాళ్ళకి చెప్పలేని బాధ కలుగుతుంది।తల్లిదండ్రుల్ని అలా చేసిన వాళ్ళకి వాళ్ళ వృద్ధాప్యం లో కూడా అలాంటి స్థితే కలుగుతుంది" అంటూ తండ్రి తన చివరిదినాల్లో వాపోయాడు।
ఆయన మొహం గుర్తుకు రాగానే రఘు కి చెప్పలేని బాధ కలిగింది। తను ఉండగానే బంధన కోపం శృతి మించుతున్నది।।!తండ్రి బతికి ఉన్న రోజుల్లో బంధన ఏమన్నా పట్టించుకునేవాడు కాదు।ఆయన తన జీవితం లో ఎన్నో కష్టాలు,అవమానాలు చూశాడు।రఘు కి,బంధన కి గొడవ అయినా ఆమె నే సమర్థించేవాడు।
"ఆ అమ్మాయి కొంచెం కలిగిన కుటుంబం నుంచి వచ్చింది।మీ ఇద్దరకీ ఇష్టం అవడం వల్లగానీ,లేకపోతే ఎవర్నో ఇంకా కలిగినవాడినే చేసుకునేదిగదా।వాళ్ళ అన్నదమ్ములకి సిటీ లో సొంత ఇళ్ళు ఉన్నాయి।మీరు కట్టుకోవాలంటే,ఆమె కూడా బ్యాంక్ లోన్ తీసుకోవాలిగదా। ఇంట్లో వండివార్చడం,మార్కెట్ కి పోయి కూరగాయలు తెచ్చుకోవడం,కాలేజ్ కి వెళ్ళి అక్కడ డ్యూటీ చేయడం।।।వీటన్నిటి మూలంగా ఆమెకి చిరాకు కలిగి ఏదో అంటుంది।మీ అమ్మ కూడా కొద్దిగా నిశ్శబ్దం గా ఉంటే సరిపోతుంది।గొడవలు పెట్టుకుంటే ఏమొస్తుందిరా" అనే వాడు తండ్రి।
ఎంతమంది అన్నదమ్ములు ఉంటే అన్ని ఇళ్ళు అని సామెత ఉంది।దాన్ని ఎంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే అన్ని ఇళ్ళు అని మార్చాలి।ఒక ఇంట్లో ఇద్దరు స్త్రీలకి అసలు పడదు గదా।ఎవరి ఆధిపత్యం వారిదేనంటారు।ఎవరి ప్రత్యేకత వారిదేనంటారు।బంధన దృష్టి లో ఇంటికి తానే బాస్।అత్తమామలు ఇంకా ఏ బంధువులైనా అతిథులు గా ఉండి వెళ్ళిపోవాలి,అంతే।అత్తమామలు కొడుకుని,కొడుకు పిల్లల్ని చూసి పోవలసినవారు మాత్రమే।ఒకవేళ ఉన్నా అతిథుల్లా ఉండాలి।
కానీ రఘు తల్లి దృష్టి లో మాత్రం ఇది కొడుకు ఇల్లు।కోడలు బయటి మనిషి।ఆమె తన చెప్పుచేతల్లో ఉండాలి అని భావిస్తుంది।సరిగ్గా అక్కడే వస్తుంది గొడవ।
ఎవరికి వాళ్ళు ఇంటికి మంచి చేస్తున్నాం అనే భ్రమ లో ఇంటిని నరకం చేస్తున్నారు।బందన ఆరోజు ఏమీ తినకుండానే కాలేజి కి వెళ్ళిపోయింది।రఘు ఆపి అడుగుదామనుకున్నాడు గాని ఇంకా రచ్చ అవుతుంది।తన మాటని ససేమిరా వినదు।ఆమె కూల్ కావడానికి కనీసం రెండు రోజులు పడుతుంది।
తల్లి దగ్గరకి వచ్చాడు।ఎలాగూ బందన లేదు కదా,కనుక్కుందాం అని।తల్లి తనని చూసి రోదించసాగింది। "ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండను।నన్ను మీ తమ్ముడు లోకనాథ్ దగ్గరకి పంపించెయ్।వెంటనే టికెట్ కొనివ్వు" అన్నదామె।
"అమ్మా।।।కాసేపు ఓపిక పట్టు।ఏం జరిగిందసలు" అంటూ రఘు అడిగాడు తల్లిని।
ఆమె పెద్ద కథ చెప్పసాగింది।ఈరోజు ఉదయం లో వోల్టేజ్ ఉందన్న సంగతి తెలియక నీళ్ళ పంపు మోటారు స్విచ్ వేసిందట।అంతలోనే బందన వచ్చి అరిచిందట।మోటారు డామేజ్ అయితే నాలుగు వేల ఖర్చు।నీదేం పోయింది।।చుక్క నీళ్ళు దొరకక మేం పోతాం అంటూ కోపగించుకుందట।
వాళ్ళు ఉండే ఈ జగన్నాథ్ విహార్ ఏరియా లో లోవోల్టేజ్ సమస్య ఉన్నది నిజమే।నీళ్ళపంపు మోటార్ వేయకముందే ట్యూబ్ లైట్లు వేస్తారు।లేకపోతే ఆ తర్వాత గానీ వేస్తే వెలగడానికి చాలా టైం తీసుకుంటాయి।ఈ సమస్య మీదే బందన ఇంట్లో గిన్నెల్ని పొద్దున విసిరికొట్టింది।
"ఇంత చిన్న దానికి ఇల్లు వదిలి పోతానంటున్నావు ఏవిటమ్మా।।।నిన్ను నేను ఏమైనా అన్నానా చెప్పు।।?" అన్నాడు రఘు।
"నన్ను గనక పంపించకపోతే ఏ నుయ్యి లోనో,చెరువు లోనో దూకుతా" అంది తల్లి మొండిగా।
రఘు సైలెంట్ అయిపోయాడు।
"అసలు చిన్నచిన్న వాటిని నీకు నేను చెప్పనే చెప్పను।ఆఫీసు నుంచి అలిసిపోయివస్తావని।।!బందన నన్ను ఇక్కడ ఉండనిచ్చే ఉద్దేశ్యం లో లేదు।నన్ను వెంటనే పంపించు" అంది మళ్ళీ।
రఘు కాసేపు కళ్ళు మూసుకున్నాడు।తనని పెంచడానికి ఆమె కష్టపడింది।ఓసారి తనకి టైఫాయిడ్ వచ్చి ప్రాణం మీదకి వచ్చింది।ఆశ వదిలేసుకున్నారు।తల్లి చేసిన సేవలు,పూజలు వల్ల బతికి బయటపడ్డాడు।ఊళ్ళో అందరు అదే అన్నారు।
తన సామాన్లు అన్నిటిని చేతిసంచి లో సర్దుకుంది।
"బందనకి కూడా ఓ కొడుకు ఉన్నాడుగా।ఆమెకి కూడా నాకు జరిగిన పరాభవమే జరుగుతుంది।ఆ వచ్చే కోడలు ఇంతకి ఇంతా చేస్తుంది।వచ్చిన తర్వాత నీ భార్య కి చెప్పు" అన్నది తల్లి।
గట్టిగా రోదించాలనిపించిది రఘుకి।కాని ఇది సమయం కాదు అనుకున్నాడు।తల్లిని ఏదో విధంగా ఊరుకోబెట్టాలి।లేకపోతే ఏమన్నా చేసుకున్నా చేసుకుంటుంది।తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే జీవితం అంతా అది వేధిస్తుంది।
"సరే।।రేపు జైపూర్ వెళుదువులే।।" అన్నాడు రఘు।
తల్లికి గోల్డ్ చైన్ చేయించడానికి కావలసిన డబ్బులు ప్రస్తుతం తన వద్ద ఉన్నాయి।కానీ బందన కి తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది।అమ్మకి వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు పెరుగుతోంది। తీరా చేయించిన తర్వాత ఎక్కడన్నా పోగొట్టుకుంటుందా అని అనుమానం వచ్చింది రఘుకి।ఇలా పరి పరి విధాలా ఆలోచించాడు।
లోకనాథ్ ఇంట్లో రెండే గదులుంటాయి।అక్కడ ఉండటం తల్లికి కష్టమే।తమ్ముడు కూడా చెప్పాడు అమ్మ దేవుడు బొమ్మలు పెట్టుకుండానికి కూడా స్థలం ఉండదని।తల్లిని ఏదో విధంగా ఆపాలి లేదా సొంత గ్రామమైనా పంపాలి।
సొంత ఊరి లో అయిదు ఎకరాల పొలం ఉంది।కాని రఘు దాన్ని పట్టించుకోవడం లేదు।తండ్రి ఎన్నోసార్లు అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టమని చెప్పేవాడు। రెండు గదులు కట్టినా లక్ష దాకా అవుతుంది।రెండు గదులు చాలడం లేదు,మనవళ్ళ కోసం ఇంకో గది కట్టమంటుంది అమ్మ।సెంటిమెంట్ కి పోయి ఖర్చు చేయడం తనకిష్టం లేదు।మనుషులు ఎంత పెరిగినా చెట్లకి ఉన్న వేళ్ళు లా ఒకేచోట పాతుకుపోవాలని అనుకుంటారు।వాళ్ళ పిల్లలు చూస్తారా లేదా అనేది ఆలోచించరు।ఇలా ఆలోచనల్లో మునిగితేలుతున్నాడు।
తల్లి ఏమైనా చెబుతుందేమో అని వేచి చూస్తే ఆమె సామాను అన్నిటిని సర్దుకుంటోంది।అయినా ఆమెకి ఉన్నవి ఏమిటని।।?కొన్ని దుస్తులు,వెలిసిపోయిన అద్దం,రెండు దువ్వెనలు,పూజాసామాగ్రి,తండ్రి రిస్ట్ వాచ్,ఒక చిన్న నోట్ బుక్ ।।।ఆ నోట్ బుక్ లో తమ్ముడు తన అడ్రస్ రాసి ఉంచాడు। ఆమె సామాన్లని కాసేపు లోపలికి పెడుతూ బయటకి తీస్తూన్నది।
"సరే।।।నేను ఆఫీస్ నుంచి వచ్చేవరకు ఓపిక పట్టు।జైపూర్ బస్ సాయంత్రం ఉంది।వెళితే వెళుదువులే।ఎటొచ్చి నా గురించి ఆలోచించేవాళ్ళే ఎవరూ లేరు।పోనీ నేనేం చేయాలో అది చెప్పు" అన్నాడు రఘు।
"ఒరేయ్।।।ఇప్సిత్, రెడీ అవు।।।నిన్ను బస్ స్టాప్ దగ్గర దింపుతా" అన్నాడు రఘు కొడుకుతో।ఇప్సిత్ టౌన్ స్కూల్ లో ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు।ఫైర్ స్టేషన్ సెంటర్ దగ్గర నుంచి వాడి బస్ ఎక్కుతాడు।
ఆ రోజంతా రఘు కి మరో పని మీద ధ్యాస నిలవలేదు।గతం గుర్తుకు వస్తున్నది। బందన కి మొదట్లోనే చెప్పాడు,తన తండ్రి చిన్నకారు రైతు అని,తల్లి ఏమీ చదువుకోలేదని।।।!అప్పుడు ప్రేమ లో ఉన్న రోజుల్లో ఇవేమీ ఆమెకి పెద్ద విషయాల్లా అనిపించలేదు।ప్రస్తుతం రఘు కి ఏమి చేయాలో అర్థం కాని స్థితి। తల్లిని చివరిదాకా చక్కగా చూసుకొమ్మని,తండ్రి చివరి రోజుల్లో కన్నీళ్ళతో చెప్పినప్పటి దృశ్యాలు తన ముందు కదులుతున్నాయి।
ఏ శక్తీ లేని వృద్దురాల్ని కొడుకు సమ్రక్షణలో వదిలాడు।ఆయన తనమీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోగలడా।।? అన్నట్లు జైపూర్ లో అమ్మకి ఏమైనా జరిగితే।।।? వెంటనే బందన గుర్తు కొచ్చింది,వెంటనే ఆ భావం చెరిగిపోయింది।
వడ్డీవ్యాపారి సమాల్ బాబు దగ్గరకెళ్ళి కొంత డబ్బు తీసుకొని బంగారం షాపు కెళ్ళాడు।కొంత కాలం అమ్మ, తమ్ముడు లోకనాథ్ దగ్గర నే ఉండనీ,నెలకి రెండు లేదా మూడు వేల రూపాయలు ఆమె ఖర్చులకోసం తాను పంపిస్తే సరిపోతుంది।ఓ నెల గడిచిన తర్వాత మళ్ళీ తీసుకొస్తే సరి అనుకున్నాడు రఘు।
రఘు ఈ మధ్య బంగారం కొనలేదు,కనక రేట్ల విషయం లో తన అంచనాలు తప్పాయి।పదివేల రూపాయలకి మంచి గోల్డ్ చైన్ వస్తుందనుకున్నాడు।కానీ,పెరిగిన రేట్ల దృష్ట్యా చిన్నపిల్లకి సరిపోయే చైన్ మాత్రమే వచ్చింది।ఇంటి కొచ్చి చూస్తే అమ్మ అదేమూలన కూర్చుని ఉంది।బందన తలుపువేసుకొని లోపల టి।వి।చూస్తున్నది।అత్తా కోడళ్ళు ఎప్పుడూ కలిసి టి।వి।చూడరు,అక్కడ ఒకరుంటే ఇంకొకరు ఉండరు అంతే।
"అమ్మా।।।! ఇందా ఈ రెడ్ బాక్స్ తీసి చూడు।దీంట్లో బంగారు గొలుసు ఉంటుంది।ఓసారి మెళ్ళో వేసుకొని ,మళ్ళీ దాన్ని లోపల పెట్టేసుకో।బస్ లో ఏ దొంగ అయినా కొట్టేస్తాడు।జైపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ తీసి పెట్టుకోవచ్చు।।।" రఘు చెప్పాడు చిన్న బాక్స్ ని చేతికిస్తూ।
ఆమె తన కళ్ళని తానే నమ్మలేకపోయింది।డబ్భై ఏళ్ళకి తన కొడుకు వల్ల బంగారు గొలుసు అమిరింది ఇన్నాళ్ళకి।ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి।ఆమె సంథోషం చూసి రఘుకి కూడా కన్నీళ్ళు వచ్చాయి।
కాసేపు ఆ చిన్ ని చూసి మళ్ళీ దాన్ని వెంటనే బాక్స్ లో పెట్టేసింది।
"బందన చూస్తే కోప్పడుతుంది,నీ దగ్గరే ఉంచు నాయనా" అంది తల్లి।
"సరే।।।కోప్పడితే పడిందిలే।।।నీకు చేయించవలసిన బాధ్యత నాకు లేదా।।?" అన్నాడు రఘు।
"ఈ ముసలితనానికి ఇప్పుడెందుకులే నాయనా ఈ నగలూ గట్రా।।!తుఫాన్ కి ఇల్లు పాడయితే మళ్ళీ దాన్నీ బాగుచేసుకోవాలి,అలా వదిలేయకూడదు।ఇప్పటికే గొడవలతో అలిసిపోయాను" అన్నదామె।
"పదేళ్ళనుంచి గోల్డ్ చైన్ కావాలని ఒకటే ఇదిగా అడిగావు,తీరా తీసుకొస్తే ఎందుకు వద్దంటున్నావు।।।అంటే చిన్నగా ఉందనా।।?" ప్రశ్నించాడు రఘు।
"ఈ వయసు లో ఈ బంగారపు నగని నా దగ్గర ఉంచుకొని ఏంచేయను।।।వెళ్ళి బందనకి ఇవ్వు।తన కూతురి కోసం భద్రపరుస్తుంది" ప్రేమగా కొడుకు చెయ్యి పట్టుకొని చెప్పింది తల్లి।
రఘు ఆమె మెడ చుట్టూ చేతులు వేసి చిన్నపిల్లాడిలా ఉండిపోయాడు।మళ్ళీ తాను ఆరేళ్ళ ప్రాయం లోకి వెళ్ళినట్లు అనిపించింది।
"ఏమి జరుగుతోందిక్కడ।।?ఏమిటా గోల్డ్ చైన్ ఎవరు కొన్నారు,ఎక్కడ కొన్నారు।।?" బందన గుమ్మం దగ్గర నిల్చొని ప్రశ్నలు సంధించింది।
"నా కొడుకు ,తన కూతురు కోసం కొన్నాడు। నాకు చూపించాడు।।అంతే।।! చాలా బాగుంది।।!!" అన్నది ఆ వృద్దురాలు।
రఘు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయాడు। జైపూర్ బస్ కి టైం దగ్గరపడుతోంది।
(సమాప్తం)
సంపఁగి చట్రములో చంపకమాల
।।।
చం। ఇది యొక పిచ్చియే నిజముగా - హృదిలో నొక ప్రేమ నాదమే
బెదరుట యెందుకో జగతిలోఁ - బ్రియ మా విధి వ్రాయు వేదమే
నదివలె సాఁగు నీ బ్రతుకులో - నగవే యలలౌచు మ్రోఁయఁగా
ముదముల నావలో మధురమై - పులకింతము నేఁడు హాయిగా
।।।
చం। జననపు నామ మా మరణమే - జగమం దిది యొక్క చిత్రమే
ప్రణవపు నామ మా స్మరణయే - ప్రణయ మ్మది లిప్త మాత్రమే
దిన మొక రాత్రిగా నగునుగా - దినమౌ నది రాత్రి వీడఁగా
మనమున నెన్నియో తలఁపు లా - మధురాపతి మోము చూడఁగా
।।।
విధేయుదు - మోహన
0
అంగణ సుమధుర ।।ఆత్రమే భూషణం
రసఝరి యదలో।।।రవ్వల వెలగులై
ఆమె సాంగత్యంలో ।।। ఆశలు తీరెనే
తనువులోని అణువు ।।।తపను తీర్చు పలుకే
నవనవోన్మేష నా ।।నవ యవ్వన పుభావ
గీతిక తనువంత కేళి కలలుగాను
తెలియని భావమే తెలిపెను మదినిండ
మనసెందుకో మరి।। మైమరపు అమృతం
అలరారిమధు మధురి।। మల హృదయస్పంద
చేతనత్వంలోన ।।
చత్రఛాయలుగాను
అనుక్షణ జీవితం అజరామరమగుటే
రోజు పేస్బుక్కులో ప్రణయానందం, స్పందన పద్యాలు, ఒక కధ పెడుతున్న ఒకఱు కూడా చూడుట లేదు లైక్ చేయుట లేదు , ఫేస్బుక్లో ఇక పెట్టటం ఆపాలను కుంటున్నాను
నాలకింపడు తుమ్మెదా
నిక్కమేదియొ చెప్పుచున్నను నిక్కుతుంటడు తుమ్మెదా
బిక్కమోమును జూపుతుంటడు భీతి లేకయు దుమ్మెదా
తుంటడు దిట్టినంతను దుమ్మెదా!!
న రామచంద్రుడు తుమ్మెదా
సీతనీవని ప్రేమతోడను జెంతనుంటడు తుమ్మెదా!!
కష్టాల్లో కన్నీళ్లా -- సుఖాల్లో వేన్నీళ్లా
కదిలిస్తే ఎక్కిళ్లా -- వదిలేస్తే రోకళ్లా
మధు మాసపుమకరందానివి నీవే
నిద్ర _1 🌻
కల్పాంతమున తాను కూడ నిద్రలోనికి పోయినచో లోకములతో బాటు తాను గూడ నుండడు। అపుడు నారాయణుడు సృష్టికి మాత్రమే ఈశ్వరుడగును గాని సర్వేశ్వరుడు కాలేడు। నిద్రనుండి మెలకువ వచ్చిన తర్వాత తాముంటిమని జ్ఞప్తి గలిగి తమ ప్రకృతి ననుసరించి చరించువారు జీవులు।
వారు మరల నిద్రాసమయము వరకు మాత్రమే ఉందురు। నిద్రలో తాముండరు। ఉన్నపుడు కూడ తమ తెలివికి తాము అధిపతులు కాక , తమ స్వభావమునకు బద్ధులై, అసహాయులై జీవింతురు।
అట్టి జీవులయందు అంతర్యామిగా నున్న నారాయణుడు ప్రకృతి కూడ అతీతుడే కాని బద్ధుడు కాడు।
UUUU - UUUU - విద్యున్మాలా
UI UI UI UI - UI UI UIU - సుగంధీ
సంఘభావవ్యధమ్మేలు - సంఘగమ్యమ్మేలులేలు
UI UII UI UII - UI UII UIU - మత్తకోకిల
మత్తకోకిల షట్పది
।।।
విద్యున్మాలకు పాదములో ఎనిమిది గురువులు। చివరి గురువును తప్పించి మిగిలిన వాటి ప్రక్కన లఘువులను ఉంచితే మనకు ఉత్సాహపు ప్రత్యేకతయైన సుగంధి లేక తూణక వృత్తము లభిస్తుంది। ఈ వృత్తమునకు 7 గలములు, ఒక గురువు। ఇందులోని 2,4,6వ గలముల ప్రక్కన మఱొక లఘువును ఉంచితే మనకు మత్తకోకిల లేక విబుధప్రియ లభిస్తుంది।
।।।
UUUU - UUUU - విద్యున్మాలా
UI UI UI UI - UI UI UIU - సుగంధీ
UI UII UI UII - UI UII UIU - మత్తకోకిల
।।।
నిన్న ఉత్సాహ షట్పదిని మీకు పరిచయము చేసినాను। అదే ఉత్సాహ షట్పదిని కొద్ది మార్పులతో మత్తకోకిల షట్పదిగా ఇప్పుడు వ్రాసినాను
।।।
మత్తకోకిల షట్పది
।।।
శరీర ఓజస్సు, మనో తేజస్సు,
ఆత్మిక వర్చస్సు - ఈ త్రివిధ జాగరణ, త్రిపదా గాయత్రిని ఉపయోగించుకుని, సవితతో సంబంధం పెట్టుకొనుట వల్ల సంభవం అవుతుంది। సద్గురు శ్రీరామశర్మ। 🍀
మాలభారిణీ - స/లల - ర/య // స/భ - ర/య
(మాలభారిణీ వైతాళీయములయందలి ఔపచ్ఛందసికకు ఒక ప్రత్యేకత।)
పండితరాయలు, లవంగి, గంగాలహరి
।।।
ఒక తెలుగు బ్రాహ్మణ కవి, పండితుడు ఒక మహమ్మదీయ యువతిని చూచి మోహించి పెండ్లి చేసికొన్నాడు, ఈ కాలములో కాదు, 17వ శతాబ్దములో। అతడే పండిత రాయలు జగన్నాథకవి। లవంగిని చూచి జగన్నాథుడు చెప్పిన చాటు పద్యము:
।।।
మాలభారిణీ - స/లల - ర/య // స/భ - ర/య
(మాలభారిణీ వైతాళీయములయందలి ఔపచ్ఛందసికకు ఒక ప్రత్యేకత।)
లలితా సుఖలాస్య శోభలాంగీ
లయలేలేమది లోలతే కథేలే
లలుగేరునులేల సాధుమన్యే
లలనా నామనసే వినోద పర్చూ
యవనీ నవనీత కోమలాంగీ
శయనీయేయది నీయతే కథంచిత్
అవనీతలమేవ సాధుమన్యే
న వనీ మాఘవనీ వినోదహేతుః
- పండితరాయల చాటువు
।।।
రుచు
నా భావానువాదము:
।।।
యవనీ మృదు-హాస కోమలాంగీ
కవ గూడన్ నిను - గాంక్ష గల్గె నాకున్
అవనీతల - మద్ది చాలు నీతో
నవమౌ నాకపు - నందనమ్ము లేలా
।।।
ఇప్పుడే Love Jihad, Love Jihad in reverse ఉండగా అప్పటి కాలపు విమర్శనుగుఱించి చెప్పవలయునా? ఈ అవర్ణ సంగమమును ప్రత్యేకముగా అప్పయదీక్షితులు విమర్శించెనట। తాము పాపులము కామని గంగాలహరీ స్తోత్రమును ఆశువుగా చెప్పగా, గంగ మెట్లెక్కి వచ్చినది అని కథ। ఇందులో నిజానిజాలు ఎలగున్నా, ఆ లవంగియే భామినీవిలాసములోని భామినియని కొందఱి ఊహ! ఇప్పుడు గంగ కూడ జగన్నాథునికి సహాయము చేయదేమో?
।।।
శిఖరిణీ - య/మ/న/స/భ/లగ IUUUUU - IIIUIIIU
17 అత్యష్టి 59330
।।।
సమృద్ధం సౌభాగ్యం సకల వసుధాయాః కిమపి తత్
మహైశ్వర్యం లీలాజనితజగతః ఖండపరశః ।
శ్రుతీనం సర్వస్వం సుకృతమథ మూర్త సుమనసాం
సుధాసౌందర్యం తే సలిలమశివం నః శమయతు ।।
- పండితరాజ జగన్నాథ కృత గంగాలహరీ, 1।
।।।
నా భావానువాదము:
।।।
సమృద్ధిన్ భాగ్యంబున్ - సకల జగతిన్ నీవలననే
అమోఘైశ్వర్యం బా - హరుని సృజనన్ నీవె నిజమై
ప్రమాణమ్మా వేదా-ర్థముల కెపుడున్ నీమతి, సుధా
సమానా, మాపాపాం-జనము కడుగం జేయుము తలీ
కూడిన నవయోని స్వరూపమే
అరుణాచలము।
==
వసంతతిలకము - త/భ/జ/జ/గగ UUI UI IIU - IIUI UU
14 శక్వరి 2933
తానాన తానతననా తనతాన తానా
శ్రీవారి కేను వలదా -సిరి నేను కాదా
రావేల వేగ వరదా -రసరాగ దీపా
భావాల పూల సర మో - పరమేశ నీకే
రావాలు నీవి వినఁగా - రమణీయమేగా
।।।
తాతంద తన్న తననా తనతన్న తానా
శ్రీరంగ రమ్ము కనఁగాఁ జెలువమ్ము నీకే
చేరంగ రమ్ము దయతో సిరి వమ్ము గాదే
కోరంగ నిమ్ము కలలే గుణకమ్ము లౌనా
మారంగ నిమ్ము బతుకే మధురమ్ము కాదా
।।।
తాతన్న తత్త తననా తనతంద తానా
।।।
దేహమ్ము తిత్తి గదరా తెలియంగ లేదా
దాహమ్ము ముత్తి గదరా తరుణంబు రాదా
వాహమ్ము మిత్తి గదరా పరువంబు పోదా
సోహమ్ము చిత్తి గదరా సులభంబు గాదా
।।।
తత్తయ్య తత్త తననా తనతంద తానా
।।।
అత్తయ్య వద్దు నను నీవదిరించబోకే
మత్తిల్ల వద్దు మదిలో మశకంబు గానే
ఒత్తిల్లు మిప్పు డిఁకపై నుసి నించలేవే
అత్తిల్లు పెద్ద చెఱయా యది యింక కాదే
ఆరు పాదములు
1, 2 ,4, 5 పాదములలొ గణములు 3,4,3,4 మాత్రలు వరుసగా !
3 , 6 పాదాలలో గణములు 3,4, 3,4, 3,4, 2 మాత్రలు వరుసగా !
యతి 3 , 6 పాదాలలో -- 1।1 5।1
ప్రాస నియతము ।
నా మొదటి అభ్యాసము !
తప్పులున్నచో పెద్దలు దయచేసి సూచించగలరు !
( ౧ )
( ౨ )
వేణుగోపాల్ యెల్లేపెద్ది
వర్ణచ్ఛందములు - ౩౩ - తిరుప్పుగఴ్ ఛందము
==
(తనతనన తాన తంద
తనతనన తాన తంద
తనతనన తాన తంద తనతాన)2 (110)
==
దినమెపుడు నాకు చింత
మనమునను జాల వంత
నిను దలువ హాయి సుంత నిశిలోన
తెరువొకటి చూపు మింత
తెర తొలఁగు నేమొ కొంత
వరమనఁగ నీదు చెంత పయనాన
==
విధేయుడు - మోహన
నను జూడవు పలుకాడవు
మనమాయెను వెతతోడను మంజువాణీ
నెలరాజల వెలుఁగీయఁగ
వలరాజిల విరిబాణము
చెలరేగుచు గురి చేసెను నంజువోలె
==
దినమాయెను జనె సూరుఁడు
తనువాయెను జిన ఱాయిగ
కను మూయక యిరులాయెను మందు నీవా
తెరువేదియుఁ గనరాదిట
తెరయోయన హిమధూమము
వెఱపాయెను విరహానల మిందు నాకే
==
ఏకముతోడ నేకమె యనేకవిధమ్ముల నేకమయ్యెనే
" అంజలి జేయి వానరుడ!
యాహహ! టక్కున జిక్కినావురా!
యంజలు వైచి వచ్చితివి;
యాటలు సాగవు నాదు ముందటన్;
గుంజకు గొట్టి కూల్తు" నను
ఘోరపు లంకిణి ముష్టి గూల నే
లం ; జని చంపెఁ గ్రూరముగ
లావెసగం బవమానపుత్రుఁడే !
( అంజలు- గంతులు; ముష్టి- పిడికిలి)
****
అధికార యజ్ఞానికి సామాన్యులు బలి
కళలుపార్టీలు ఆడే ఆట రక్త హోళి
UUI UI II UI I UIUU
సుభాషితాలు
త భ య జ స ర న గా
UUI UII IUU IUI IIU UIU IIIU
ఈజాతి భారత మహాజాతి నిర్మ లమునో జాతి నాది గదరా
ఈజాతి నిర్ణయ మనోవాంఛ ధర్మ మగునో కాల మంత విధిగా
ఈజాతి భావము సహాయమ్ము సర్వజగదానంద శాంత నిధిగా
ఈజాతి నైజము విశాలమ్ము నిత్య సఖదానంద సౌఖ్య మధిరాా
న భ ర స జ జ గ
Iii UII UIU IIU IUI IUI U
మ న ర త న ర
Uii III UIU UUI III U
మనయతనర--Uii III ఇనుము
ఎక్కిల్లా కురులు కురులు బొమ్మలునీ మోము దలచి ।। వారు చదవటం విధి రట అని తప్పుకుంటావా సభ్యులకు ఉఉయా అన్నట్లు అన్నట్లు మలువులే ।।
. కపిల గీత - 24 / Kapila Gita - 24🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
🌴. సాధువు లక్షణములు - 4 🌴
24. త ఏతే సాధవః సాధ్వి సర్వసఙ్గ వివర్జితాః
సఙ్గస్తేష్వథ తే ప్రార్థ్యః సఙ్గదోషహరా హి తే
ఇలాంటి వారు సాధువులు. అన్ని రకముల సంగతినీ విడిచిపెడతారు. అలాంటి వారి విషయములో నీ మనసు సంగతి పొందాలని ప్రార్థించు. భగావంతుని మనం అడగాల్సినది ఇదొక్కటే. దుష్ట సంగం వలన కలిగిన పాపాన్ని ఈ సత్సంగం తొలగిస్తుంది.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
. శ్రీ శివ మహా పురాణము - 580 / Sri Siva Maha Purana - 580 🌹
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴
🌻. శివ విహారము - 7 🌻
ఓ మునిశ్రేష్ఠా! విష్ణువు నాతో దేవతలతో కలిసి అచట నిలబడి సర్వలోకములకు ప్రభువగు శివుని మహానందముతో స్తుతించెను (58).
విష్ణువు ఇట్లు పలికెను--
మహా దేవా! పరమేశ్వరా! లోపల ఏమి చేయుచున్నావు? తారకాసురునిచే పీడితులై నిన్ను శరణు పొందిన దేవతలనందరినీ రక్షించుము (59).
ఓ మునీశ్వరా! విష్ణువు నాతో దేవతలతో గూడి ఈ తీరున శంభుని పరి పరి విధముల స్తుతిస్తూ తారకునిచే పీడింపబడిన దేవతలతో సహా బిగ్గరగా రోదించెను (60). ఓ మునీశ్వరా! అచట రాక్షస పీడితులైన దేవతల దుఃఖము శివుని స్తుతితో మిళితమై కోలాహల మేర్పడెను (61).
శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమార ఖండలో శివవిహార వర్ణన మనే మొదటి అధ్యాయము ముగిసినది (1).
సశేషం....
🌹🌹🌹🌹🌹
. శ్రీ మదగ్ని మహాపురాణము - 64 / Agni Maha Purana - 64 🌹
ప్రథమ సంపుటము, అధ్యాయము - 24
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -2
హోమము చేయుటకై చేయు ప్రమాణము లేదు పండ్రెండు అంగుళముల ప్రమాణము గల సృక్కును చేయించవలెను. దాని మూలభాగము చతురస్రముగా ఏడు లేదా ఐదు అంగుళములు ఉండవలెను. దాని మధ్యయందు త్రిభాగమున అందమైన, వర్తులాకార మైనగర్తము (గొయ్యి) ఉండవలెను.
అడ్డముగా, పై భాగమున సమముగా ఆ గర్తము నిర్మించి పైన అర్ధాంగుళ భాగమును శోధించవలెను. (చెక్కి నున్నగా చేయవలెను). నాల్గవ వంతు అంగుళమును మిగిలిన అర్ధములో అర్థమును కూడ శోధించవలెను. మిగిలిని అర్ధముచే గుర్తమునకు రమ్యమైన మేఖలను ఏర్పరుపవలెను.
త్రిభాగవిస్తారము కలదియు, అంగుష్ఠ మంత ఆయతు మైనదియు అగు కంఠమును చేయవలెను. దాని అగ్రమునందు నాలుగు లేదా ఐదు అంగుళముల ప్రమాణము గల ముఖ ముండవలెను. దాని మధ్యము ఆరు అంగుళముల ప్రమాణ ముండవలెను. దాని ఆయామము కూడా అంతయే ఉండి మధ్యమున పల్లమై అందముగా ఉండవలెను. దాని కంఠదేశమునందు చిటికెనవ్రేలు ప్రవేశించు నంత రంధ్ర ముండవలెను. మిగిలిన కుండము ( స్రుక్కు/ముఖము) అభిరుచి ననుసరించి విచిత్రముగ చేయవలెను.
స్రువము దండముతో సహా చేయి పొడ వుండవలెను. కొంచెము పంకమునందు ఆవు పాదము దిగిన లోతు ఎంట్లుండులో ఆ విధముగా అందమైన, రెండు అంగుళముల వృత్తము చేయవలెను.
అగ్నికుండమును అలికి, అంగుళముప్రమాణము గల వజ్రనాసికాలేఖను గీయవలెను. అది ఉత్తరాగ్ర మగు మొదటి రేఖ. దానిపై పూర్వాభిముఖములైన రెండు రేఖలు గీయవలెను. వాటి మధ్య దక్షిణాదిక్రమమున మూడు రేఖలు గీయవలెను.
మంత్రవేత్త ఈ విధముగా రేఖలు గీసి, ప్రణవ ముచ్చరించును నీళ్ళు చల్లి, ఓంకారము నుచ్చరించుచు పీఠమును కల్పించి దానిపై మూర్తిమతి యాగు వైష్ణవీశక్తిని అలంకరించి, విష్ణువును స్మరించుచు అగ్నిని ఉంచవలెను. 20
సశేషం....
ఓషో రోజువారీ ధ్యానాలు - 199 / Osho Daily Meditations - 199 🌹
199. సత్యము 🍀
🕉. అవగాహన ద్వారానే సత్యం సాధించబడుతుంది. ఇది అస్సలు మనస్సు ప్రక్రియ కాదు. మీరు సత్యాన్ని ఆలోచించ కూడదు; బదులుగా, మీరు సత్యం తెలుసుకోవాలంటే అన్ని ఆలోచనలను ఆపాలి; సత్యాన్ని తెలుసుకోవడం కోసం మీరు సత్యాన్ని మరచిపోయారు. 🕉
మీరు నేర్చుకున్న సిద్ధాంతాలు, పరికల్పనలు, తత్వాలు మరియు సిద్ధాంతాలన్నింటినీ మీరు విప్పుకోవాలి. సత్యాన్ని సాధించే ప్రక్రియ నేర్చుకునే ప్రక్రియ, ఇది షరతులు లేని ప్రక్రియ. మెల్లగా, మనసులోంచి బయటపడాలి, మనసులోంచి జారిపోవాలి; మరియు ఒకరు కేవలం స్పృహ యొక్క కొలనుగా, స్వచ్ఛమైన అవగాహనగా మారాలి. కేవలం నిష్కపటమైన జాగరూకత: ఏమీ చేయకండి, కేవలం చూడండి, బయటి ప్రపంచంలో మరియు అంతర్గత ప్రపంచంలో జరుగుతున్నదంతా చూడండి.
ఎలాంటి తీర్పులతో జోక్యం చేసుకోకుండా, పాత ఆలోచనలు రాకుండా చూడగలిగినప్పుడు, సత్యం తెలుస్తుంది. అద్భుతం ఏమిటంటే అది మీకు ఎక్కడి నుండి రాదు, అది పై నుండి దిగదు; ఇది మీలో కనిపిస్తుంది - ఇది మీ అంతర్గత స్వభావం. సత్యాన్ని తెలుసుకోవడం నిజంగా గొప్ప స్వీయ ఆవిష్కరణ. ఎందుకంటే మీరు అదే మరియు మీరు దానిని ఎన్నడూ కోల్పోలేదు - ఒక్క క్షణం కూడా. మీరు ఎల్లప్పుడూ అలాగే ఉన్నారు. దానిని కోల్పోవడం అసాధ్యం, ఎందుకంటే ఇది మీ స్వభావం మరియు మీ స్వభావం కోల్పోకూడదు. అందుకే ప్రకృతి అని అంటాం. పోగొట్టుకోలేనిది అని ప్రకృతికి నిర్వచనం. పోగొట్టుకునేది ప్రకృతి కాదు, పోషణ. సత్యం మీ ప్రకృతి, మీ స్వభావం, మీ ఉనికి, మీ కేంద్రం.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 380-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 380-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀
380. 'బిందుమండలవాసినీ' - 1
బ్రహ్మరంధ్రమున నివసించునది శ్రీమాత అని అర్ధము. బ్రహ్మరంధ్రమును 'బిందు మండల' మందురు. ఆత్మబిందువు వసించు స్థానము బ్రహ్మరంధ్రము. అందువలన 'బిందు మండల వాసిని' అని శ్రీమాతను సంబోధింతురు. ఈ నివాసము సర్వానంద మయము. ఋషులు అంతర్ముఖముగ తపస్సు సాగించి బ్రహ్మరంధ్రము నందు బిందు స్థానమును చేరి తన్మయులై పరవశింతురు. శరీర మొక పద్మకోశము. అనేకానేక పొరలతో ఏర్పడి యున్నది.
అన్ని పొరలకు మూలమైన ఆత్మ ప్రజ్ఞ సూర్యప్రభలతో వెలుగుచుండు బిందువువలె యుండును. మంత్రపుష్పమున ఈ బిందువునే ఆరాధించుట జరుగును. ఈ బిందువును బియ్యపు గింజ తలయందలి కొనతో పోల్చి చెప్పుదురు. అందుండియే స్వరాట్, త్రిమూర్తులు మొదలగు ప్రజ్ఞలన్నీ పుట్టినట్లుగ కూడ మంత్రపుష్పము కీర్తించును. బ్రహ్మము వసించు నాళము గనుక బ్రహ్మనాళ మని బ్రహ్మరంధ్ర మని అందురు. ఈ నాళము నుండి వికసించిన పద్మమునందే సృష్టికర్తయగు చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించినాడు.
సశేషం...
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
711వ నామ మంత్రము 17.6.2022
ఓం సాధువే నమః
శుద్ధ సత్త్వంతో కూడిన స్వరూపం గలిగిన పరమేశ్వరికి నమస్కారము
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సాధు యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం సాధువే నమః అని భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి నామ మంత్రజపమహిమతో తనలోని అరిషడ్వర్గములను నియత్రించుకొని సాధు స్వభావముతో పరమేశ్వరి కృపాకటాక్షములకు పాత్రుడై తరించును.
సంప్రదాయముచే మాత్రమే జగన్మాత తెలియదగినది. ఇంతకు ముందు (710వ) నామ మంత్రములో జగన్మాతను సంప్రదాయేశ్వరీ యని అన్నాము. అనగా సత్సంప్రదాయములకు తానే ప్రభ్వి. గాన సత్సంప్రదాయములు గలవారు సాధు తత్త్వం (శుద్ధ సత్త్వం) తో తేజరిల్లుదురు అనుటకు సముచితముగానున్నది.
సాధ్వీ యని 128వ నామ మంత్రములో అనన్య సామాన్య పతివ్రత జగన్మాత అని తెలిసియుంటిమి. ఇప్పుడు ఈ నామ మంత్రములో మరల అదే చెపితే పునరుక్తి దోషమగును గనుక సాధువే నమః అని యనుటయే సముచితమని భాస్కరరాయలువారు అన్నారు. వారి మాటనే ప్రమాణముగా ఇక్కడ గ్రహించ గలము.
జగన్మాత సంప్రదాయమను మంత్రార్థమునకు ఈశ్వరి. అందుచే
ఆ తల్లిని సాధు అని అన్నాము.
సాధు అను పదమునకు సాత్వికుడు, సుజనుడు, సహృదయుడు, ఉదారుడు మొదలైన అర్థములు వస్తాయి.
జగన్మాత సాత్వికురాలు. భక్తులు ఆపదలకు ఓర్చుకోలేక ఎంత నోరుజారి మాటలాడినను చిరునవ్వుతో వారి ఆర్తిని బాపును. అంతే గాని తన భక్తుడు తొందర పడ్డాడని కోపించదు.
జగదీశ్వరి ఉదారస్వభావురాలు గనుకనే లోకభయంకరమైన హాలాహలాన్ని తన భర్తచే సేవింపజేసి లోకాలను రక్షించినది.
పరమేశ్వరి సుజన అనగా చాలా మంచిది. భర్త కోపాగ్నిలో భస్మమైన మన్మథునికి తాను సంజీవనియై తిరిగి ఆ మన్మథుని సజీవుని జేసి, రతీదేవికి సౌభాగ్యాన్ని ప్రసాదించినది.
ఆ అఖిలాండేశ్వరి సహృదయ. భక్తుల హృదయంలోని దహరాకాశంలో ఎల్లప్పుడూ విలసిల్లుతూ, వారిలో సహృదయత పెంపొందింపజేసి లోకకళ్యాణ కారిణియగుచున్నది.
ఇలాంటివి ఎన్నైనా చెప్పవచ్చు జగన్మాత సాధు అను పదమునకు సరియైన స్వరూపిణియని.
అందుచే ఆతల్లి పాదపద్మములకు నమస్కరించునపుడు ఓం సాధువే నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
175వ నామ మంత్రము 17.6.2022
ఓం భవనాశిన్యై నమః
భవబంధముల (పుట్టుక, చావు మరల పుట్టుక వంటి జనన మరణచక్రభ్రమణము) నుండి తప్పించు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి భవనాశినీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం భవనాశిన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాపరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణించి సంసారక్లేశముల నుండి కాపాడి, శాశ్వతమైన పునర్జన్మరహిత మోక్షమునకు కావలసిన సాధనాపటిమను కలుగజేయును.
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్|
ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే॥
మళ్ళీ మళ్ళీ పుట్టడం, మరణించడం మళ్ళీ అదే...ఈ జనన మరణ చక్రభ్రమణం భౌతిక జీవులకు పరిపాటి. ఈ సంసారక్లేశమునుండి కాపాడమని ఈ భౌతిక జీవులు ఆ పరమాత్మను వేడుకుంటాయి.
పుట్టాలంటే తల్లిగర్భంలో ఉండడం అంటే చిన్న విషయం కాదు. మలమూత్రాలమధ్య, ఆకలిబాధతో, క్రిములు కరుస్తుంటే, తలక్రిందులుగా ప్రాణాలు పిడికిట్లో పెట్టుకుని ఉండే గర్భవాసం ఒక మహానరకం. అంధకారమైన గర్భంలో ఈ ప్రక్కనుండి ఆ ప్రక్కకు తిరగడానికి కష్టమయేస్థితిలో శిశువుపడే బాధ వర్ణనాతీతం. నరకంలో కోట్లాది సంవత్సరాలు ఉండవచ్చు, కాని గర్భవాసంలో జీవుడు నవమాసాలు పడేబాధ మహా దుర్భరం.
బాల్యయౌవనకౌమారవృద్ధాప్యావస్థలను అనుభవించి, అవసానదశలో ఎన్ని కష్టాలు పడాలి? రోగములు చుట్టుముట్టగా, కఫము, వాతము, పైత్యముల బాధతో, నోటినుండి మాటరాక, తనవాళ్ళు, తన ఆస్తులు వీటిపై మమకారము పీడిస్తుంటే ఆ దుర్భరపరిస్థితి వర్ణనాతీతం.
ఇటువంటి జనన మరణ చక్రభ్రమణమనే బాధలనుండి జగన్మాత కాపాడుతుంది.
గంగానది ఒక జీవనది. పవిత్రమైన నది. గంగానదీ స్నానం సర్వపాపాలకు పరిహారం. ఆ నదీ పవిత్రస్నానంతో పాపాలన్నీ నశిస్తాయి. జగన్మాత గంగానదీ స్వరూపురాలు గనుక భవనాశినీ యను నామముతో స్తుతింపబడుచున్నది.
శక్తిరహస్యం అనే గ్రంథంలో ఇలా చెప్పబడినది.
నవమ్యాం శుక్లపక్షే తు విధివత్ చండికాం నృప|
ఘృతేన స్నపయే ద్యస్తు తస్య పుణ్యఫలం శృణు॥
దశ పూర్వాన్ దశ పరా నాత్మానం చ విశేషతః|
భవార్ణవా త్సముద్ధృత్య దుర్గా లోకే మహీయతే॥ (సౌభాగ్యభాస్కరం, 364వ పుట)
శుక్లపక్షంలో నవమి తిథినాడు చండికను ఆవు నేతిలో స్నానం చేయించు సాధకులను అటు పదితరములు,ఇటు పదితరములు వరకూ సంసారసాగరమునుండి ఆ పరమేశ్వరి రక్షించును.
కూర్మపురాణంలో ఇలాగలదు:-
సైషా ధాత్రీ విధాత్రీ చ పరమానన్ద మిచ్ఛతామ్|
సంసారతాపా న్నిఖిలా న్నిహంతీశ్వర సంజ్ఞయే॥ (సౌభాగ్య భాస్కరం, 364వ పుట)
తనను పూజించువారికి, పరమానందమును కోరువారికి ఆ తల్లి సంసారతాపములను నశింపజేయును.
దేవీ భాగవతంలో శ్రీమాత ఇలా చెప్పినది.
అహం వై మత్సరాన్ భక్తా నైశ్వర్యం యోగమాశ్రితాన్|
సంసారసాగరా త్తస్మా దుద్ధరా మ్యచిరేణతు॥ (సౌభాగ్యభాస్కరం, 365వ పుట)
నా యందు ఆసక్తి గలవారై పరమేశ్వరుని యోగము నాశ్రయించిన భక్తులను సంసారార్ణవము నుండి శీఘ్రముగా ఉద్ధరింతును
జగన్మాత భవనాశిని. గనుక ఆ పరమేశ్వరిని నిశ్చలచిత్తముతో ధ్యానించినచో తప్పక భవబంధవిముక్తి కలిగించును.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం భవనాశిన్యై నమః అని అనవలెను.
No comments:
Post a Comment