*రెండు మంచి మాటలు
దేవుడు నిజాలు మాట్లాడమని నోరుని, అబద్ధాలు చూడమని కళ్ళని ఇస్తే మనం మాత్రం అబద్ధాలను నోటితో నిజాలను కళ్ళతో చూస్తున్నాం
మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం,మనిషిగా బ్రతకడం ఒక అద్భుతం, ఇన్ని అద్భుతాలు కలిగిన మనం అందరి మేలుకోరడం మహా అద్భుతం అవుతుంది!
మన సహాయం ఒకరి కడుపు నింపేదిలా ఉండాలి, దానికోసం మరొకరి కడుపు కొట్టేదిలా ఉండకూడదు!
మనం ప్రారంభాన్ని సరిగ్గా ఆరంభిస్తే, ఫలితం దానంతట అదే సరిగ్గా వస్తుంది!!
పుట్టినప్పుడు పేరు ఉండదు ఊపిరి మాత్రమే ఉంటుంది, చచ్చినప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది, ఈ రెండింటి మధ్య ఉన్నదే "జీవితం"
ఊపిరి ఎలాగో నిలుపుకోలేము కనీసం పేరునైనా నిలుపుకోవాలి, “ఆశయం” గొప్పదైతే,“ఆలోచన” పవిత్రమైతే, “ఆత్మబలమే” ఆయుధమైతే, "విజయం" తప్పక వరిస్తుంది
“బంధం” బరువు కాకుడదు, “ప్రేమ” విరక్తి చెందకూడదు, “మాటతో” విసుగు రాకూడదు, “ప్రవర్తనతో” పరువు పోకూడదు మరియు“ఆలోచనలు” మితిమీరకూడదు హద్దు దాటితే అన్నీ ప్రమాదమే. కాకులు పాటల పోటికి దిగినప్పుడు __ కోకిల పాడకపోతేనే కదా గట్టిపోటి ఇచ్చినట్లు !
మనం కాకిగా మారిపోవాలా ! కోకిలలా మిగిలిపోవాలా !! అన్నది మనమే తేల్చుకోవాలి.
కొన్నిసార్లు సూచనలతో సవరణలతో రాని మార్పు మౌనం వల్ల వస్తుంది
అయితే మాటల్లో బయటపడలేక మూగనోముతో మథనపడిపోతూ ఉంటే
ద్వేషాన్ని ద్విగుణీకృతం చేసుకుంటూ ఉంటే అది మరింత ప్రమాదకరం !!
ఎదుటివారు చేసిన గాయాన్ని మరచిపోయే,మన్నీంచే పెద్ద మనసు నుంచి మొగ్గ తొడిగే
మౌనమే మధురమైంది ప్రస్తుత తరం సహనం, సంయమనాలను పిరికితనం అసమర్థతలని భ్రమపడుతుంది, ఎవరో చెప్పిన మాటల మాయావలయంలో పడి ప్రతీకారం తీర్చుకోవడటమే ప్రధానమన్న పోకడలతో, పోట్లాటల్లోను వ్యతిరేకతతో పోటీపడుతున్నారు. మనం నవతర మని చెప్పుకుంటూ భావోద్రేకాలను నిమిషం కూడా నియంత్రించుకోలేక పోతే ఏం ప్రయోజనం? పాశ్చాత్యుల భౌతిక నాగరికత వెంట పరుగెత్తడానికి ఆధ్యాత్మికతను ప్రక్కకు నెట్టేస్తే దాని ఫలితంగా మనకు రానున్న మూడుతరాలలో భారతజాతి అంతరించి పోతుంది ఎందుకంటే అధ్యాత్మికతను వదిలిపెట్టిన రోజు భారతజాతి వెన్నెముకే విరిగిపోయి జాతియత భావన అనే పునాది క్రుంగిపోతుంది ఫలితం సర్వనాశనం
***
*సద్వినియోగం
భగవంతుని సృష్టిలో ఆలోచించే శక్తి, విచక్షణా జ్ఞా నం, నవ్వగలిగే అదృష్టం మనిషికే ఉన్నాయి. మనిషిగా పుట్టడమే ఒక వరం. కనుమూసి తెరిచేలోగా ముగిసే ఈ అపురూపమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
సత్కర్మలతో ఉదాత్తమైన ఆలోచనతో మనుగడ సాగించడం మంచిది. అయితే తనని సృష్టించిన విధాతను విస్మరించి విడనాడి తాను విశ్వవిజేతనని, అంతా తన గొప్పేనని విర్రవీగడం మనిషకి తగదు. విజ్ఞానపరంగా మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే మంచిది. ఎన్ని మహత్తర విజయాలు సాధించినా మనిషి మర్యుడే. మృత్యువు తప్పదని తెలిసిని ఎగిసిపడుతున్న మనిషి అమరుడైతే ఎలా ఉంటుంది. మనిషి తను చేస్తున్న ప్రతి పని తన మనతే అనుకుంటాడు. కాని భగవంత్సంకల్పంలేనిదే ఏదీ జరగదనే సత్యాన్ని గ్రహించాలి. మానవశక్తి వెనుక ఓ అదృశ్య శక్తి ఉంది. ఆ శక్తే దైవం. ఆ దైవాన్ని స్మరించడం మనిషి కర్తవ్య. అదే ఆయన పట్ల మనం చూపే విశ్వాసం. మనిషి జగత్తునే శాసించగల స్థాయికి ఎదిగాడంటే అది భగవంతుని కరుణాకటాక్షమే గదా. మనిషి జీవితం అశాశ్వతమని, తాను విధి చేతిలో కీలుబొమ్మననే నిజాన్ని మరచి భ్రమలో బతుకుతూ తనకి జన్మనొనగిన దైవాన్ని కాదని ఆ పరాత్పరుని ఉనికినే ప్రశ్నిస్తూ అహంకారదర్పంతో మిడిసిపడటం గర్హనీయం.
ఈ జీవితం నీటి బుడగ అని గ్రహించి కర్తవ్యాన్ని నర్విహిస్తూ లభ్యమైన అరుదైన మానవ జన్మను సార్ధకం చేసుకోవడం వివేకవంతుల లక్షణం. అయితే ఈ జన్మలో అంతర్యాన్ని అంతరార్ధాన్ని అవగతం చేసుకున్న వారు జీవితాసారాన్ని అవగాహన చేసుకున్న జ్ఞా నులు జన్మరాహిత్యాన్నే కోరుకుంటారు.
తృటిలో ముగిసి కాటిలో చితిలో బూడిదయ్యే ఈ జీవితంలో మనిషి సామనస్కుడై సామరస్యతో సమైక్యతా భావంతో పరోపకారమే ఆశయంగా సాగిపోతూ ప్రేమలు, మమతలు వంచుతూ కైవల్య సాధన కోసం పాటుపడుతూ భగవంతుని స్మరించడమే కర్తవ్య. మనిషి ఎంతటివాడైనా నైచ్యానికి దిగజారేడంటే తన స్వార్థం కోసం, సౌఖ్యం కోసం తన సంపద పెంచుకోవటానికి తోడబుట్టిన వారికి అన్యాయం చేయడం, ఇక్కట్లకు గురిచేయడం అలవాటు చేసుకున్నాడు. వీరికి దైవభీతి పాపభీతి ఉండవు.
చిత్రమేమిటంటే ఇటువంటి వారిలో విద్యాధికులే ఎక్కువ. ఎంత ఆర్జించినా ఈ దేహం ఆశాశ్వతం, ఇహబంధాలు ఆనందాలు ఆకర్షణలు అసత్యం. ఆస్తులు, ఐశ్వర్యాలు వెంటరావు. బంధువులు, బాంధవ్యాలు ఎవరు కాని శ్మశానం వరకే వస్తారు. కట్టుకున్న ఇల్లాలు గడపదాటిరాదు. ఆ తర్వాత ఎవరికెవరు? కలకాలం నిలిచేది మంచి, పాపపుణ్యాలే బుద్ధుదు రాజ్యం సకలభోగభాగ్యాలు సమస్తం తృణప్రాయంగా ఎంచి పరిత్యజించాడు. తనను కట్టుకున్న భార్యను వీడి, జీవిత పరమార్ధం తెలుసుకునేందుకు జీవితాన్ని అంకితంచేసాడు.
వేమన అనిత్యమైన దుఃఖపూరితమైన శారీరక బంధాలపైన భోగిగా ఉన్నవాడు యోగిగా మారాడు. మనిషిగా తన కర్తవ్యం ఏమిటని అన్వేషణ సాగించాడు. ఈ జీవితం ఎంత నమ్మరానిదో ఈయన మాటల్లో తెలుస్తుంది.
కడకు వీడిపోవు కపటి రాజీవుడు అన్నాడు.
ఓటికుండ నుంచి నీరు పోవునట్లు మనుషుని ఆయువు కూడా పోతుంది.
చాలామంది అయ్యో అప్పుడే ఆయువు తీరిపోయిందా అని బాధపడతారు. ఎంతకాలం బతికాడనేది ముఖ్యం కాదు, ఎలా బతికేమనేది ముఖ్యం. మనిషినైజం ఆ దైవానికి ఎరుక. తన ఉనికినే సవాలు చేసే మనిషికి తగు పాఠం నేర్పాలనేదే ఆయన ఉద్దేశం
---
*ఆగమాల ఆంతర్యం
ఆగమం అనే పదానికి వేదం శాస్త్రం అనే అర్థాలున్నాయి. దేవతా మూర్తుల ఆరాధనకు సంబంధించిన విధి విధానాలను వేదాలలో చెప్పిన విషయాల సంగ్రహాన్ని సైతం అగమం అంటారు. ఆగమాలు వైదికం తాంత్రికం అని రెండు రకాలు.
భగవంతుడిని ఎలా అర్చించాలి. ఎలా ప్రతిష్టించాలనే విషయాలను ఆగమాలు తెలుపుతాయి. రోజువారీ నిత్య కర్మలు, ఏదో ఒక ఉద్దేశంతో చేసే నైమిత్తిక కర్బలు, కోరికలు నెరవేరాలని చేసే కామ్య కర్మలు తదితరాల నిర్వహణకు వివరణ ఇస్తాయి.. ఉత్సవాలను ఎలా నిర్వహించాలి. ఎలాంటి విషయాలు అధ్యయనం చేయాలి. కర్మలు, ఉత్సవాలు నిర్వహించే యజమాని ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలనే విషయాలను తెలియజేస్తాయి. ఈ ఆగమాలు- శైవాగమం, పాంచరాత్రాగమం, వైఖానసాగమం, స్మార్తాగమం. వీటిలో మళ్ళీ శాఖలు, ఉప శాఖలు ఉన్నాయి.
శైవ మతం ఇరవై ఎనిమిది అగమాలు, రెండు వందలకు పైగా ఉప అగమాలను భక్తులకు నిర్దేశించింది. కానీ దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లో పూజాదికాలకు ఆరాధనా పద్ధతులకు కామిక ఆగమం, కారణ ఆగమాలనే శైవులు అనుసరిస్తారు.
విష్ణువు గరుత్మంతుడు, విష్వక్సేనుడు, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే అయిదుగురికి అయిదు రోజుల్లో ఉపదేశించినవి కాబట్టి దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. విఖనస రుషి నుంచి వచ్చింది కాబట్టి వైఖానసం అంటారు. ఈ మార్గానుయాయులు విష్ణువును ముఖ్య దైవంగా కొలుస్తారు. అయినప్పటికీ కొన్ని అలవాట్లు, ఆచారాలు బహుదేవతా ఆరాధనను సూచిస్తాయి. పాంచరాత్రం, వైఖానస ఆగమాల ప్రకారం వైష్ణవ దేవాలయాల్లో పూజలు నిర్వర్తిస్తారు.
వేదాలను, శాస్త్రాలను(స్కృతులను) అనుసరించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే వారిని స్మార్తులు అంటారు. వీరు ఆదిశంకరాచార్యుల వారి అద్వైత వేదాంత తత్వాన్ని అనుసరిస్తారు. వేదం. శాస్త్రాలలో చెప్పిన వాటిని స్మార్తాగమాలు అంటారు. కుమారస్వామికి శక్తి అనే నామాంతరం ఉంది. కుమారస్వామిని పూజించేవారిని శాక్తేయులు అంటారు. వారు అనుసరించే విధానాలను శాక్తేయం అంటారు. విఘ్నేశ్వరుడి పూజకు సంబంధించిన ఆగమం వినాయక పురాణం. ఇది విఘ్ననాయకుడి పూజాది కాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ ఆగమాలు తంత్రశాస్త్రాలతో పాటు మరెన్నో పురాణాలు, దేవతా మూర్తులను పూజించే పద్ధతులను విపులంగా సూత్రీకరించాయి.
మన పూర్వీకులు ప్రతి ఆగమాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. ఈ నాలుగు పాదాల్లో ఆగమాలు నిర్దేశించిన పూజలు, ఆరాధనలను స్పష్టం చేశాయి. చర్యా పాదంలో నిత్య పూజాదికాలకు కావలసిన భౌతిక సామగ్రికి సంబంధించిన మార్గదర్శకాలను పొందుపరచారు. రెండోదైన క్రియా పాదంలో ఆచరించవలసిన భగవదారాధన ప్రక్రియను, యజ్ఞ యాగాది ఆచరణ విధులను విశదీకరించారు. మూడోదైన యోగ పాదంలో మనో నియంత్రణకు సంబంధించిన సూత్రాలను
నిర్వచించారు. ఆగమాల్లో చివరి పాదం పూర్తిగా ఆధ్యాత్మిక పార్శ్వాన్ని స్పృశించింది. మోక్ష సాధనకు ఉపకరించే సూచనలను చేసింది.
భగవంతుడు ఒక్కడే అని, అతడే పరబ్రహ్మ... పరమాత్మ, పరమ పురుషుడని ఆగమాలన్నీ ఏకగ్రీవంగా బోధించాయి. అతడు సర్వాత్మకుడై, సర్వజ్ఞతతో సర్వ శక్తిమంతుడిగా పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు వ్యాపించాడని వర్ణించాయి.
- వి.ఎస్. రాజమౌళి
శ్రీ అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
(వసంత రాగం)
అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామిII
అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామిII
అయమేవ ఖలుపురా అవనీధరస్తుసో
వ్యయమేవ వటదళాగ్రాధీశయనః
అయమేవ దశవిట్టరవతార రూపైచ్య
నయమార్గ భువిరక్షణం కరోతి||
అయమేవ సతతం శ్రియఃపతి దేవేషు
అయమేవ దుష్టదైత్యాంత కస్తు
అయమేవ సకల భూతాంతరేష్ణు క్రమ్య
ప్రియభక్తపోషణం పిదృతృనోతు||
అయమేవ శ్రీవేంకటాద్రి విరాజితే
అయమేవ వరదోప్యాచకానా
అయమేవ వేదవేదాంతశ్చ సూచితో
అయమేవ వైకుంఠాధీశ్వరస్తు||
****
నేటి ఉదయ హృదయ స్పందన పద్యాలు
జై తెలంగాణ జై జై తెలంగాణ
---
సీస పద్యము
సాధ్యమే నీడగా...సన్నిహితునిపైన
ఎదుగుదలను కొరు..ఎల్ల కళల
క్ష్యముయేను బ్రతికించు.. క్షణక్షణంమ్ముగా
మంచిగాను సహాయ..మేను విధియె
మిణుగురు పురుగులా..మిడిసిపాటులు లేవు
మార్గదర్శకులుగా.. మనసు పంచె
మ్ను నుపు ఇపుడుకూడ .. ముఖ్యమైన పనులు
ఎప్పడి కప్పుడూ...యదను తాకు
ఆటవెలది
సాక్షి ఎవరు యైన సామరస్యము గా ల
క్ష్యమును చూపి వినయ క్షమను పంచె
మిగులు కృపయు దయయు మేలును చేయుటే
మ్ముంచ గుండ మేలు ముఖ్య మగుటె
......
సాన పట్టిజూడు సద్గురువులను,య
క్షయము గురువు లగునునియమ నిష్ట
మిగులు మనసుమార్చి సుగుణాల నిచ్చు, న
వ్వుచునె నేర్పు నడక నిచ్చు ఘనుడు
---
" *సా *మిమనముమనకిడుసా
* క్ష్య * మిచటజగతినిఁగనంగ సజ్జనదయయే
* మి *ముఁగావఁగవచ్చెసు
* మ్ము * మెఱఁపుప్రభవోలెఁజూడమోదమొసఁగుచున్ !!! "
చిన్నవి సమస్య లన్నీ
ఉన్నవి యోచన భయమ్ము ఊపిరి కొరకే
నిన్నన ముందడుగేలే
మన్ననవిజయాలు కోరు మనసుకు మేలే
.......
ఉత్పలమాల
తప్పును తప్పుగా తెలిపి తప్పుకు తిర్గుట ఏల నీకుయున్
తప్పెవరైన చేసినను తప్పుయు ఒప్పుయు కానెకాదుయున్
ముప్పును తెచ్చెతప్పులను ముందుగ తెల్పియు చేయకుండుటన్
ఒప్పుయె సర్వ ఉన్నతియె ఓర్పుయె చూపిన సమ్మతమ్ముగన్
......
సృష్టి నందుకష్ట సుఖములుదెలుయుటే
నిజమగు వరమేగ నీకుఁదెలుయు!
జగతి నందునకష్ట జనకములెరుగవా
నిజరూపఁదెలుయుటే నిన్ను నీవు!
సాధన జేయుమా సాధ్యమేయగునీదు
ఆత్మీయయనుభవ యగునుబలము!
మనసుయణచిజూడుమందిరమగు
నీదు
పొరలు యానందము పొంగి పొంగి !
ధనముజూపుగురువు ఋణములే లేనిది
గుణమునిచ్చుగురువు ఋణముగాద
మనముమార్చిసుగుణమనసునే మనకిచ్చు
వనము పెరుగ గొప్ప వంశమేగ
___
శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల
15) వ శ్లోకం:-
తృష్ణాతోయే మదన పవనో ద్ధూత మోహోర్మి మాలే దారావర్తే తనయ సహజ గ్రాహ సంఘా! కులే చ సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రి ధామన్ పాదాం భోజే వరద భవతో భక్తి నావం ప్రయచ్చ!!
భావం:-
"సంసారమను సముద్రములో పడి, మునుగుచు, తెలుచూ, దాటలేక బాధపడుచున్న వారికి విష్ణువే నౌక అని, విష్ణుభక్తియే నౌక అని వెనుకటి 2 శ్లోకములలో పేర్కొని, ఆ నౌకను ఇవ్వమని విష్ణువునే ప్రార్థింపవలెనని తెలుసుకొని, ఈ శ్లోకంలో ప్రార్థించుచున్నారు".
ఈ సంసారమను సముద్రములో ఆశయే జలము. ఆ జలము కామమను పెనుగాలిచే కదిలింప బడుచున్నది. ఆ విధంగా కదులుటచే మొహమను కెరటములు వరుసగా సాగుచుండును. ఈ సముద్రములో భార్య సుడిగుండము వలె పట్టి తిప్పి, అందు పడినవారిని బయటకు పోనీయక ముంచి వేయును. బిడ్డలు, బంధువులు - మొసళ్ళు మొదలగు జంతువుల వలె కబళింప ప్రయత్నించు చుందురు. ఇట్లు భయంకర మగు సంసార మహాసముద్రమున పడి, దాటు ఉపాయము లేక మునుగుచున్న మాకు, ఓ వరద ! ఓ త్రిధామ ! నీ పాదపద్మ భక్తి అనెడి నౌకను ఇచ్చి దరిజేర్చుమయ్యా!
లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!
*అఖండమైన ఓర్పు, అఖండమైన ధైర్యం, అఖండమైన ప్రయత్నాలతోనే ఉత్తమోత్తమ ఫలితాలు సంప్రాప్తమౌతాయి.
*మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు.
🧘♂️శాంతి🧘♀️
భక్తి ద్వారా మంచితనానికి ఆత్మార్పణ చేసుకోవడంలో శాంతి లభిస్తుంది. ప్రేమమయులు, నిశ్చలత్వమును అభ్యసించేవారు, ధ్యానమందు, సత్కర్మలయందు ఆనందం పొందేవారు, నిజమైన శాంతి పొందుతారు. శాంతి దేవుని పూజా వేదిక, సౌఖ్యం లభించే స్థితి.
శ్రీ పరమహంస యోగానంద / యోగదా సత్సంగ పాఠాలు
-ॐ卐సుభాషితమ్ॐ卐
శ్లో𝕝𝕝 నాఽద్రవ్యే నిహితా కాచిత్ క్రియా ఫలవతీ భవేత్|
న వ్యాపారశతేనాఽపి శుకవత్ పాఠ్యతే బకః||
తా𝕝𝕝 అయోగ్యమైన వస్తువు యెడల చేసిన క్రియ ఎంత ప్రయత్నవంతమైననూ ఫలవంతము కానేరదు.....ఎన్ని ప్రయత్నములు చేసినను కొంగను చిలుకవలే పలికింపవీలుకాదు కదా!ఉపయోగం లేని పని విషయంలో... ఎంత ప్రయత్నం చేసిన ఫలితం ఉండదు అని భావన.
8 వ ఆధ్యాయం - "కర్మ మర్మం"
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన
-- గీత 7-26
భావం:-
ఓ అర్జునా! గతకాలానికి చెందిన, వర్తమాన కాలానికి చెందిన చరాచర ప్రాణులన్నీ నాకు తెలుసు. రాబోవు కాలంలో పుట్టబోయే ప్రాణులందరూ కూడా నాకు తెలుసు. కాని నామీద భక్తి శ్రద్ధలు గలవారు తప్ప ఇతరులు నన్ను తెలుసుకోలేరు.
దీన్నిబట్టి మనం ఈ జన్మలో ఎలాంటి కర్మలు చేసి తర్వాతి జన్మలకి మనం వెళ్తామో పరమాత్మకి తెలుసని, అన్నీ ఈశ్వరేచ్ఛ ప్రకారం జరుగుతున్నాయని, అందువల్ల మనకి స్వేచ్ఛా చిత్తం ఉన్నట్లు కనిపించినా లేదనే చెప్పాలి.
స్వేచ్ఛా చిత్తం లేదా భావస్వేచ్ఛ మీద శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి చెప్పిన మాటల సారాంశం ఇది.
'ప్రస్థుత కాలం మన ముందు ఉంది. నీ భావనా స్వేచ్ఛతో నువ్వు దాన్లో గడిపి దాని ఫలితాలకి రూపుని ఇస్తున్నావు. ఓ గంటని నువ్వు దైవ భజనతో గడుపుతావా లేక ఇతరుల మీద చాడీలతో, నిందలతో గడుపుతావా, సేవా కార్యక్రమాల్లో గడుపుతావా లేక ఇతరులని మోసం చేసి ధనార్జనతో గడుపుతావా అన్నది నీ భావ స్వేచ్ఛ ద్వారా చేస్తున్నావు.
ఆ విధంగా భావ స్వేచ్చ అంటే వర్తమాన కర్మ. గతం నీ దృష్టికి కనపడదు. దాని ఫలితాన్ని మాత్రమే నువ్వు చూస్తావు. నీ ముందున్న వర్తమాన కర్మని చూస్తావు.
కాని దాని ఫలితాన్ని ఇప్పుడు చూడలేవు. ఎందుకంటే అది భవిష్యత్తులో ఉంది. భవిష్యత్తులో ఆ కర్మ ఫలాన్ని చూసినప్పుడు అది విధి అయి, ఆ విధికి కారణమైన నేటి నీ వర్తమాన కర్మ కనపడదు. అందుకని దానికి 'అదృష్టం లేదా దురదృష్టం' అనే పేరు పెట్టుకున్నావు.
విధి, భావ స్వేచ్ఛ నిజానికి ఒక్కటే. కాల విషయంలో భిన్నత్వం ఉన్నప్పటికీ రెంటికీ వస్తు విషయంలో తేడా లేదు. గతంలో నీకు గల భావ స్వేచ్ఛ ప్రకారం ప్రవర్తించడం ద్వారా సృజించిన కర్మఫలాలే నేటి నీ విధి.
నేడు నీ భావ స్వేచ్ఛ ప్రకారం గల నీ ప్రవర్తనా ఫలితమే భవిష్యత్తులో నీకు కలిగే విధి. పూర్వ జన్మలో నీ నువ్వు సన్మార్గాన్ని అనుసరించి ప్రవర్తించి ఉంటే, ఈ జన్మలో నీ విధి బావుంటుంది. దీన్నే అదృష్టం అంటాం.
పూర్వ జన్మలో నీ ప్రవర్తన దుర్మార్గంగా ఉండి ఉంటే ఈ నీ జన్మలో నీ విధి చేదుగా ఉంటుంది. దీన్నే దురదృష్టం అంటాం. కాబట్టి విధి, కర్మ ఫలాలు వేరు వేరు కావు. ఆ రెండూ ఒక్కటే. అంతే కాని విధి బయట నించి ఎక్కడ నించో మన మీదకి వచ్చి పడే భూతం కాదు'
వేదాంతులు కొందరు మనిషికి స్వేచ్ఛా చిత్తం ఉందని, మరి కొందరు లేదని వాదించుకుంటారు. కాని కొన్ని విషయాల వల్ల లేదనే అనిపిస్తుంది.
ఉదాహరణకి రచయిత బంధువుకి సద్గురు నిత్యానంద బాబా ఆశ్రమం ఉన్న మహారాష్ట్రలోని గణేష్ పురికి వెళ్ళి మూడు రాత్రులు నిద్ర చేయమని నాడిలో పరిహారం వచ్చింది. దాదాపు ఆరు వందల ఏళ్ళ క్రితం ఆ గ్రంధం (దీన్ని రచయిత స్వయంగా చూసాడు) రాయబడ్డ కాలంలో ఇంకా నిత్యానంద బాబా అసలు జన్మించనే లేదు.
అంటే సద్గురు నిత్యానంద బాబా ఆశ్రమం గణేష్ పురిలో ఫలానా కాలానికల్లా వస్తుందని చాలా కాలం క్రితమే ఆ నాడీ గ్రంధం రాసిన వారికి తెలుసు. కేరళలో జన్మించిన రామన్ నిత్యానంద బాబా పేరుతో గణేష్ పురిలో స్థిరపడ్డారు.
దీన్ని బట్టి ఆయన పుట్టక మునుపే ఆ జీవి జీవిత గమనం నిర్ణయించబడిపోయినట్లే. ఇక స్వేచ్ఛా చిత్తం ఎక్కడనించి వస్తుంది? మరో సందర్భంలో అదే గ్రంధంలో అతనికే జిల్లెళ్ళమూడి అమ్మ ఆశ్రమం సందర్శించమని పరిహారం వచ్చింది.
అంతా భగవంతుడి ఇష్టం ప్రకారం జరుగుతుంది. మాయ వల్ల మనం దాన్ని మన ఇష్ట ప్రకారమే చేస్తున్నామని, స్వేచ్ఛా చిత్తం ఉందని బహుశ అనుకుంటాం.
(తరువాత భాగంలో - చెడ్డ పనులు చేసేవారు దుర్మార్గులా?)
---
-----
2.6.2022 మధ్యాహ్నకాల సందేశము
శ్రీమద్దేవీభాగవత మహాత్మ్యము
శ్రీదేవీనవాహయజ్ఞ విధానము
(నాలుగవ సందేశము )
సూతముని వచించెను - శ్రీశుకదేవులు ఈ విధముగ చెప్పుచుండగనే, ఆ సభామధ్యమునందు మంత్రిణి శ్యామల, దండిని వారాహి, సంత్కరీ మరియు శక్తిగణములతో కూడి స్వయముగా శ్రీమాతయే ప్రత్యక్షమయ్యెను. అంతట సూతుడు, శౌనకాది మహర్షులు భగవతియగు ఆ పరమేశ్వరిని యథోచితముగ పూజించిరి. అచటి వారందరును ఆ పరమేశ్వరి ఎదుట సంకీర్తనము చేయసాగిరి. అట్టి కీర్తనమును దర్శించుటకై మహాదేవుడు, లక్ష్మీనారాయణులు, వాణీ, హిరణ్యగర్భులు కూడా అచటికి విచ్చేసిరి. సంకీర్తనము ఆరంభమయ్యెను. వ్యాసనందనుడగు శుకదేవుడు వివిధములగు సరసమైన అంగభంగిమలతో భావమును వెల్లడించుచుండెను. అలౌకికమైన ఇట్టి కీర్తనమును తిలకించిన పరమేశ్వరి అత్యంత ప్రసన్నమాయెను. అప్పుడా ఆ మహేశ్వరి ఇటుల చెప్పసాగెను. నేను మీయొక్క కథా, కీర్తనములచేత మిక్కిలి ప్రసన్నతనందితిని. మీలో ఉప్పొంగుచున్న భక్తిభావము, ఇప్పుడు నన్ను మీ వశము చేసికొనినది. కావున మీరేదైనా వరమును కోరుకొనుడు అనునట్టి ఆ భగవతి మాటలను విని అందరును మిగుల సంతసించిరి. ప్రేమలో మునిగి తడిసిపోయిన చిత్తముతో వారు ఆ పరమేశ్వరితో చెప్పసాగిరి- ఓ మాతా! ఇక ముందు ఈ నవాహకథా కార్యక్రమము ఎక్కడెక్కడ జరుగుచుండునో, తాను అక్కడక్కడ తమ పరివారముతోను, శక్తిగణమలతోను కూడ తప్పక విచ్చేయవలయునని మా కోరిక. కనుక, మా మాటను మన్నించి మా ఈ కోరకను పరిపూర్తి చేయగలరు అని వారందరు కోరిన వెంటనే ఆ పరమేశ్వరి తథాస్తు అని చెప్పి తత్ క్షణమే అంతర్ధానమయ్యెను.
అనంతరము శూతుడు, శౌనకాది మహర్షులు ఆ తల్లియొక్క చరణములను లక్ష్యముగా చేసికొని నమస్కరించిరి. పిమ్మట శుకదేవులు మున్నగు తాపసులందరకు కూడ వందనమాచరించిరి. కథామృతమును తనివితీర జుర్రుకొనుచు పానము చేయుట వలన అందరును మహదానందభరితులైరి. వారియొక్క మోహము పూర్తిగా నశించెను. అప్పుడు వారందరు తమతమ ప్రదేశములకు తిరిగి వెళ్ళిపోయిరి. శ్రీదేవీభాగవతమును సేవించుటచేత పరమేశ్వరి తన భక్తుల హృదయములయందు చేరి ప్రకాశించును. దారిద్ర్యదుఃఖమనెడు జ్వరజ్వాలలచే దగ్ధమగుచున్నవారికి, మాయాపిశాచముచే పీడింపబడుచున్నవారికి, సంసారసాగరమునందు పడి మునకలు వేయుచున్నవారికి, పూర్తి మేలును కలిగించుటలో శ్రీమద్దేవీభాగవత శాస్త్రమును మించిన వేరొక శ్రేయోదాయకమగు సాధనము లేనేలేదు.
యమధర్మరాజు తన దూతచేతిలోగల పాశమును చూచి అతనిని సావధానపరచి ఇట్లు చెప్పును- చూడు, నాయనా! భగవత్కథలయందు నిమగ్నమై యుండు మనుష్యులకు నీవు దూరముగా ఉండుము. వారియెడల నా యాజమాన్యము చెల్లదు. భగవద్భక్తులు కానట్టి ఇతరులను దండించుటకు మాత్రమే నేను అధికారమును కలిగియుందునని నీవు గమనింపుము అని చెవిని ఇల్లు కట్టుకొని తన దూతకు చెప్పును. సారహీనమైన ఈ ప్రపంచమునందు, విషయరూపమైన విషమునందు ఆసక్తి గల బుద్ధితో తల్లడిల్లుచున్న ప్రజలారా! మీరు మీ క్షేమము కొరకు అరక్షణమైనా సరే ఈ శుకకథారూపమైన సాటిలేని, అనుపమానమగు అమృతమును ఆస్వాధించుడు. నాయనలారా! నిందింపబడు కథలతో కూడిన చెడుమార్గమునందు వ్యర్థము ఏల తిరుగాడుచుందురు? ఈ కథ మీ చెవులలో ప్రవేశించినంతనే ముక్తి లభించును.
శ్రీశుకదేవుడు ప్రేమరసప్రవాహమున ఒలలాడుచు ఈ కథను చెప్పెను.
నవాహమిదం శ్రీమద్దేవీ భాగవత మహాత్మ్యమ్
హరిః ఓం తత్సత్
సర్వం శ్రీపరమేశ్వరీ చరణారవిందార్పణమస్తు
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9595813235
❤️ మతోన్మాదుల దాడులు తట్టుకునినిలిచిన భారతీయ శిల్ప వాస్తుశాస్త్రంతో నిర్మాణం చేసిన అత్యంత అద్భుత కళా సంపద ఉన్న ఆలయాలు నగరాల్లో కొన్ని:~*
💕 *కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -కుశార్, పాకిస్తాన్*
💕 *లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -లాహోర్, పాకిస్తాన్*
💕 *తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షకుడు నిర్మించిన నగరం)తక్షశిల,పాకిస్తాన్*
💕 *పుష్కలావతి /పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండోకొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం)పెషావర్, పాకిస్తాన్ (భాగవతం,మహాభారతం)*
💕 *మహావిష్ణువు గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్*
💕 *నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్*
💕 *జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్*
💕 *మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్*
💕 *శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,*
💕 *దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా*
💕 *పరశురామక్షేత్రం* *(పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) -* *కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర, సముద్రతీర ప్రాంతం*
💕 *మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా*
💕 *నిషాద రాజ్యం(నలమహారాజు రాజ్యం) గ్వాలియర్,మధ్యప్రదేశ్*
💕 *వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్*
💕 *నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు*
*బోధించిన ప్రాంతం) -* *సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్*
💕 *వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్*
💕 *రతిష్టానపురం (పురూరవుని రాజధాని) ఝాన్సీ,అలహాబాద్*
💕 *సాళ్వ రాజ్యం(సావిత్రీ, సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)- కురుక్షేత్ర దగ్గర*
💕 *హస్తినాపురం (కౌరవుల రాజధాని)హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్*
💕 *మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్*
💕 *వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర*
💕 *కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్*
💕 *మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్*
💕 *ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్*
💕 *గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా*
💕 *కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)*
💕 *పాండవుల లక్కగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్*
💕 *కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్*
💕 *శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.*
💕 *హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) జలాన్,ఉత్తర్ ప్రదేశ్*
💕 *విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర*
💕 *కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర*
💕 *చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్*
💕 *కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం)దాతియ,మధ్యప్రదేశ్*
💕 *ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర*
💕 *కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్*
💕 *పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) -* *ఎటాహ్,సహజహంపూర్*
*,ఫారుఖాబాద్,ఉత్తర్ ప్రదేశ్*
💕 *కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు, మత్స్యయంత్ర బేధన స్థలం) -*
*కంపిల్, ఉత్తర్*
💕 *జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ* *ఆఖరా / రణ్ భూమి,బీహార్*
💕 *కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన*
*ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా*
💕 *మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్*
💕 *విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్*
💕 *శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం*
💕 *ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం*
💕 *నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –*ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్*
💕 *జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్*
💕 *కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)నేపాల్ లోని తిలార్కోట్*
💕 *బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్*
💕 *బుద్ధుడు నిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.
*🧘♂️363) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️*
*స్థితి ప్రకరణము*
*రెండవ అధ్యాయము*
*దామ వ్యాళ కటోపాఖ్యానము*
2-42
పిష్టసేకామ్బు దుష్ప్రాపం రసాయనవదశ్నతా దుర్భగేనేదృశేనాప్తః
క్షీరోద ఉపమన్యునా.
బహు ప్రయాసచే తనకు లభించునట్టిదైన “పిండి కలిపిన నీటిని” గూడ అమృతమువలె త్రాగునంతటి గొప్ప దారిద్ర్యము గలిగి యున్నప్పటికిని ఉపమన్యువు తన శుభ ప్రయత్నముచే క్షీరసముద్రమును గూడ పొందగలిగెను.
2-43
త్రైలోక్యమల్లాంస్తృణవదశ్నన్విష్ణ్వబ్జజాదికాన్ భక్త్యాతిశయదార్డ్యేన కాలః శ్వేతేన కాలితః.
ఎయ్యది త్రైలోక్యవీరులగు
బ్రహ్మవిష్ణ్వాదులను గూడ తృణమువలె భక్షించి వేయుచున్నుదో, అట్టి మృత్యువును గూడ శ్వేతుఁడను ముని తన భక్త్యతిశయదార్డ్యముచే జయించివైచెను.
2-44
ప్రణయేన యమం జిత్వా కృత్వా వచనసంగమమ్ పరలోకాదుపానీతః సావిత్ర్యా సత్యవాన్పతిః.
ప్రీతి ప్రార్థనాదులచే యముని జయించి, తనకు సత్యవంతుని వలన నూఱ్గురు పుత్రులు గలుగవలెనని ఆ యముని మాట గైకొని సావిత్రి తన శుభప్రయత్నముచే తన పతియగు సత్యవంతుని పరలోకము నుండి రప్పించుకొనగల్గెను.
.......
సేకరణ.. చిదానంద రూప శివోహం
No comments:
Post a Comment