2*శ్రీ దామోదరాష్టకం*
1)నమామీశ్వరం సచ్చిదానందరూపం- లసత్కుండలం గోకులే భ్రాజమానం |
యశోదాభియోలూఖలాద్ధావమానం -పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా ||
2)రుదంతం ముహుర్నేత్రయుగ్మం -మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం |
ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠ- స్థితగ్రైవ-దామోదరం భక్తిబద్ధమ్ ||
3)ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే-స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్ |
తదీయేషితాజ్ఞేషు భక్తైర్జితత్వం - పునః ప్రేమతస్తం శతావృత్తి వందే ||
4)వరం దేవ మోక్షం న మోక్షావధిం వాన చాన్యం వృణేఽహం వరేషాదపీహ |
ఇదం తే వపుర్నాథ గోపాలబాలం సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః ||
5)ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్- వృతం కుంతలైః స్నిగ్ధ-రక్తైశ్చ గోప్యా |
ముహుశ్చుంబితం బింబరక్తధరం మేమనస్యావిరాస్తాం అలం లక్షలాభైః ||
6)నమో దేవ దామోదరానంత విష్ణో ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్ధిమగ్నం |
కృపాదృష్టివృష్ట్యాతిదీనం బతాను గృహాణేశ మాం అజ్ఞమేధ్యక్షిదృశ్యః ||
7)కువేరాత్మజౌ బద్ధమూర్త్యైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తిభాజౌ కృతౌ చ |
తథా ప్రేమభక్తిం స్వకం మే ప్రయచ్ఛ న మోక్షే గ్రహో మేఽస్తి దామోదరేహ ||
8)నమస్తేఽస్తు దామ్నే స్ఫురద్దీప్తిధామ్నే త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే |
నమో రాధికాయై త్వదీయప్రియాయై నమోఽనంతలీలాయ దేవాయ తుభ్యం ||
ఇతి శ్రీమద్పద్మపురాణే శ్రీ దామోదరాష్టాకం సoపూర్ణం ||
9 ..
3*శ్రీ సూర్యస్తోత్రం*...
ధ్యానం |
ధ్యాయేత్సూర్యమనంత కోటికిరణం తేజోమయం భాస్కరం |
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ||
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం |
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్
కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః
బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః
ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |
సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః 4
పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |
అండయోనే మహాసాక్షిన్ ఆదిత్యాయ నమో నమః
కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |
ధర్మమూర్తే దయామూర్తే తత్త్వమూర్తే నమో నమః
సకలేశాయ సూర్యాయ ఛయేశాయ నమో నమః |
క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనం
సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణం |
ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్
సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్
****
*అధ్యాయము - 1*
ఈ ప్రపంచంలో అన్ని వస్తువులను, జీవులను కలుపునది ప్రేమయే. పేరు ప్రతిష్ఠలు, వస్తువుల యందు మనకున్న ప్రేమ వాటితో మనలను కలుపుతున్నట్లుగా, భగవంతుని యందు మనకుగల ప్రేమ మనలను ఆయనతో ఐక్యపరచును. ఈ భక్తి మార్గము అందరకూ అనుసరించుటకు సులభమైనది. మనందరిలో సహజంగా ప్రేమ ఉంది. వృక్షములు, జంతువులతోసహా అందరూ ప్రేమను అర్థం చేసుకోగలరు.
ఒక ధనవంతుని కుమారునకు పెట్టుబడి సిద్ధముగానే ఉన్నందున వ్యాపారము ప్రారంభించుట సులభమే. అదే విధంగా మన దగ్గర ఉన్న ప్రేమ అనే పెట్టుబడిని శరీరమునందు, విషయవస్తువుల యందు పెడుతున్నాము.
ఈ ప్రేమలోగల పరస్పర ఆధారము, ప్రతిఫలాపేక్ష దుఃఖమునకు కారణమవు తున్నాయి. వీటి యందు మన పెట్టుబడియైన ప్రేమను వెనుకకు తీసుకొని అనగా మమకారాన్ని వదలి దానిని భగవంతుని యందు పెట్టుబడిగా పెట్టిన ఆయన దాన్ని మించి సమృద్ధమైన ప్రతిఫలమిస్తాడు.
"భగవానుడే సత్యము, అంతరాత్మ, జీవన నిర్వాహకుడు - బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి కథ్యతే”. ఆయన అందరి వెనుకనే ఉండి అందరి ఆలోచనలను వెలిగించే అంతరాత్మయైన నిర్గుణ చైతన్యం.
నేను భగవంతుని ప్రేమిస్తున్నట్లయితే ఎవరినైనా ఎలా ద్వేషించగలను? అవమానించగలను? భగవంతుని విగ్రహాన్ని పూజిస్తూ యితర జీవులను ద్వేషిస్తున్నచో అటువంటి ప్రేమ బూడిదలో పోసిన పన్నీరు వంటిదని భాగవతం చెబుతున్నది. అటువంటి ఆరాధన వలన ఎటువంటి జ్ఞానము లభింపజాలదు.
మమకారాన్ని వదులుకొనుటకు సాధనము ఈ క్రింది శ్లోకములో
చెప్పబడింది.
4*🧘♂️10- శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచితము - సిద్ధాశ్రమయోగులు🧘♀️*
*🧘♂️10-సిద్ధభూమిక🧘♀️:-*
శ్వేతవరాహకల్పంలో వైవస్వత మన్వంతరం. 28వ మహాయుగంలో కలియుగం ప్రథమపాదం విక్రమశకంలో 7వ శతాబ్దం. దక్షిణాపథంలో శ్రీలంక. అందులో ప్రసిద్ధమైన మలయపర్వతం. ఈ శైలం మీద నుండి వచ్చే గాలులకు కొన్ని వందల మైళ్ళమేర చల్లగా ఉంటుంది.
ఈ గిరి మీద చందన వృక్షాలు అసంఖ్యాకంగా ఉండటం వల్ల ఇది నాగజాతికి నివాసమైంది. ఋషుల ఆశ్రమాలు, గ్రామాలు ఇక్కడ అరణ్యప్రాంతాలలో మానవనివాసాలు.
అటువంటి ఒక చిన్నపల్లెలో ఒక బ్రాహ్మణ కుటుంబం. ఆస్తిపాస్తులు లేవు. పురాతనమైన చిన్న యిల్లు, కొండలు, గుట్టలు, అక్కడ పెద్దపంటభూములు లేవు. అడవిలో నివ్వరిధాన్యం కొంచెం లభిస్తుంది. పండ్ల చెట్లు మాత్రం సమృద్ధిగా ఉన్నవి. కొద్దిగా గోసంపద. ఈ బ్రాహ్మణుడు కాస్త చదువుకొన్నాడు.
సాయంకాలాలు పురాణ ప్రవచనం చేస్తుంటాడు. దగ్గరి కుటుంబాలవారు ఒక పది, పదిహేనుమంది వచ్చి వింటుంటారు. ఎప్పుడన్నా కొంచెం ధాన్యం,
కాయగూరలు పండ్లు ఇస్తుంటారు. పంచాంగం చూచి మంచి చెడు చెపుతుంటాడు. జాతకభాగంతో అల్ప పరిచయం ఉంది.
కాలం గడచిపోతున్నది. సంతానం లేదు. తనకు తెలిసిన జ్యోతిష పరిజ్ఞానాన్ని బట్టి సంతానయోగం లేదు. వంశం నిలిచే అవకాశం కనబడటంnలేదు. ఒకసారి దేవీ భాగవతం పురాణం చెపుతుండగా దేవదత్తుని కథ వచ్చింది. ఆ దేవదత్తుడు సంతానయోగం లేదని తెలుసుకొని ఒక మహర్షినిnఆశ్రయించాడు. ఆ ముని - పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే సంతానం కలుగుతుందని సలహా యిచ్చాడు. దేవదత్తుడు మునిపల్లెలో ఉన్నవాడు. యజ్ఞానికి విపుల కేమి లోటు? అంతో యింతో ఉన్నవాడు. దక్షిణలివ్వగలడు.
శాస్ట్రోక్త విధానంలో యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞంలో హోమాలు, అర్చనలు, పారాయణలు చాలా భాగాలుంటవి. గోభిలుడనే మహర్షి ఉద్గాతగా వేదపారాయణం చేస్తున్నాడు. ఎండాకాలం కావటం వల్ల అలసిపోయి ఒక చోట మంత్రస్వరం తప్పుగా ఉచ్చరించాడు. వింటున్న దేవదత్తునికి కోపం వచ్చింది. ఏమయ్యా ! గోభిలా ! నేను ప్రయోజనం కోరి యజ్ఞం చేస్తున్నాను. స్వరం దోషయుక్తమైతే ఫలితం ఎలా వస్తుంది ? అని గద్దించాడు. గోభిలునికి కోపం వచ్చింది.
ఎండ వేడికి అలసిపోయి కాస్త పొరపాటు చేస్తే పదిమందిలో నన్ను అవమానిస్తావా ? నీకు మూర్ఖుడగు పుత్రుడు పుట్టును గాక ! అని శపించాడు. యాజ్జికులంతా విస్తుపోయి చూస్తున్నారు. దేవదత్తుడు పరిస్థితి గమనించాడు. శాపాయుధుడైన ఋషిని తానేమి చేయగలడు? వెంటనే మహర్షీ ! నన్ను క్షమించు. ఉద్రేకంలో తొందరపడ్డాను. అయితే మీ మాటవల్ల ఒక ఉపకారం జరిగింది.
పుత్రుడు పుడతాడని నిశ్చయమైంది. అయితే వేదవేత్తల కుటుంబంలో మూర్యుడు ప్రభవిస్తే అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. పుట్టే పిల్లవాడు పండితుడయ్యేటట్లు ఆశీర్వదించండి” అని కాళ్ళ మీద పడ్డాడు.
గోభిలునకు మనస్సు కరిగింది. “విప్రుని అలుకయు తృణహుతాశనంబు దీర్ఘమగునె?” అన్నారు పెద్దలు. బ్రాహ్మణుని కోపం గడ్డిపరకకు అంటుకొన్న నిప్పువంటిది. ఎక్కువ సేపుండదు. గోభిలుడు శాంతించి “దేవదత్తా ! నీకుమారుడు మొదట మూడుడైనా తర్వాత సరస్వతీదేవి అనుగ్రహం చేత విద్వాంసుడవుతాడు” అని వరమిచ్చాడు.
తరువాత కొన్నాళ్ళకు దేవదత్తునకు కుమారుడు పుట్టాడు. వాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఉపనయనం చేశారు. కాని శాపం వల్ల ఎంత కష్టపడ్డా చదువు రాలేదు. ఆపిల్లవాడు మునిశాపంవల్ల తనకు విద్యరాదని విని తండ్రి అనుజ్ఞ తీసుకొని దూరప్రదేశానికి వెళ్ళి ఒక కుటీరం నిర్మించుకొని భగవధానం చేసుకుంటూ మంచిరోజుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులలోను అబద్దమాడేవాడు కాకపోవటం వల్ల అతనికి సత్యవ్రతుడనే పేరు వచ్చింది.
సశేషం )
100) అష్టావక్ర గీత🧘♀️*
*నిర్లిప్తత - ఉదాసీనత (నిర్వేదము)*
*శ్లోకం 08:-*
*తాత్పర్యం:-*
సూక్ష్మంగా, అంతర్గతంగా మనలో ఉండే వాసనలు మనస్సులో కోరికలు గానూ బుద్ధిలో ఆలోచనలుగానూ వ్యక్తం అవుతుంటాయి. అందుకే సాధారణంగా వాసనలను కోరికలు అని, వాడుతూ ఉంటాం. అయితే నిజానికి కోరికల యొక్క బీజరూపమే వాసనలు. మనిషిలో ఉండే ఈ మొత్తం వాసనలను కారణశరీరమనీ, లింగదేహమనీ అంటారు.
ఈ కారణశరీరమే మనిషిలోని వ్యక్తిత్వంగా వ్యక్తమవుతూ ఉంటుంది. (కారణశరీరం--వ్యష్టిలోని మొత్తం వాసనలు కారణ శరీరం అనబడతాయి సమిష్టి జీవుల సమష్టి వాసనలు మాయ అనబడతాయి. ఈ మాయగా వ్యక్తమయే ఆత్మ చైతన్యమే ఈశ్వరుడు అనబడుతున్నాడు.
'పర్వాః శరీరాభిమానీ, సమిష్టికారణ శరీరాభిమానీ పరమాత్మా ఈశ్వరః" -- ఈ సృష్టికి, స్థితికి, లయానికి కారణమయిన మహాశక్తి, అన్ని ప్రాణులలోనూ బయటా కూడా ఉంటూ ఈశ్వరుడుగా గుర్తింపబడుతున్నాడు.
మనశ్శరీరాలలో ఆలోచనలుగా, కోరికలుగా, క్రియలుగా వ్యక్తమయే ఈ ఆలోచనలే (వాసనలే) అహంకారాన్ని స్వార్థభావంతో బంధిస్తాయి. ఆ బంధంతో జనన మరణ యుక్తమైన జీవిత చక్రం క్రమం తప్పకుండా పరి భ్రమిస్తూ ఉంటుంది. 'వాసనా ఏవ సంసారః"---ఈ వాసనలే సంసారానికి బీజం వంటివి. కోరికలు లేకుండా చేసుకోవడమే సంసారం నుండి బయటపడడం, వాసనారాహిత్యమే ముక్తి.
"అద్య --ఇప్పుడు--కోరికలను త్యజించి,వాసనలను క్షయింపజేసుకున్న తరువాత, వ్యక్తికి సంపూర్ణ స్వతంత్రం లభిస్తుంది. అతడు ఎక్కడ ఏ విధంగా జీవించినా సంసారచక్రం అట్టివానిని బాధించదు, బంధించదు. యోగవాశిష్ఠంలో ముక్తి ఇలా వివరింపబడింది.
9వ అధ్యాయం సమాప్తం.
🕉️🌞🌍🌙⭐🚩
: *🧘♂️20) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘♀️*
*20) శ్లోకం:-*
*దేహాదికం జగ దసజ్జడ దుఃఖ రూపం మయ్యద్వితీయ నిజబోధ సదాదిరూపే |*
*సందృశ్యతే భ్రమవశా ద్గగనే నిరంశే గంధర్వ పత్తన మివేత్యనుభావయ త్వమ్ ॥ 20*
*టీకా*
దేహ ఆదికం = దేహము మొదలైనవి, జగత్ = బాహ్య ప్రపంచము, అసత్ = మిథ్య, జడ దుఃఖ రూపం = జడమైనవి, దుఃఖాన్ని కలిగించేవి, భ్రమవశాత్ = భ్రాంతి కారణంగా, అద్వితీయ = రెండోదిలేని, నిజబోధ సత్ ఆది రూపే = నా జ్ఞాన సత్తాల మొదటి రూపమైన, మయి = నాలో, గగనే నిరంశే విభజనలు లేని ఆకాశంలో, గంధర్వ పత్తనం ఇవ = గంధర్వ నగరంవలె, సందృశ్యతే = కనబడుతుంది, ఇతి = ఇలా, త్వం అనుభావయ = నీవు నిరంతరం భావన చెయ్యి.
*భావం:-*
దేహాదులు, జగత్తు మిథ్య అయినవి జడమైనవి, దుఃఖరూపమైనవి. అద్వితీయమైన సచ్చిద్రూపమైన నా స్వస్వరూపంలో నిరంతరం భావన చేయుము... భ్రాంతి వల్ల విభజనలు లేని ఆకాశంలో గంధర్వపట్టణం కనిపించినట్లు, కనబడుతున్నాయి.
*వివరణ:-*
కేవలం దేహేంద్రియాలని సాక్షినని భావించడం వల్లనే నిదిధ్యాసన పూర్తి కాదు. ప్రాపంచిక, శారీరక సమస్యలు, బాధలు ఉంటూనే వుంటాయి. వాటి మిథ్యా స్వరూపం కూడ మనకి బాగా అర్థం కావాలి.
దేహాదుల్ని బట్టి ప్రపంచము, అందులోని దుఃఖాలు మనని తాకుతున్నాయి. నేను కేవలం సాక్షిని అయితే ఇవన్నీ ఎందుకు కనబడుతున్నట్లు? వీటిని ఎలా వదిలించుకోవాలి? ఈ శ్లోకంలో స్పష్టం చేస్తుంది.
ఆకాశంలో ఏ విభజనలు లేకపోయిన కంటిలోని నీటి తెరల కారణంగా ఆకాశంలో ఏవేవో భవనాలు పట్టణాలు ఉన్నట్లు కబడుతుంది. అది కంటిదోషం. అలాగే భ్రాంతి కారణంగా కేవలం సచ్చిద్రూపంగా ఉండే ఆత్మ స్వరూపంలో దేహాదులు, వాటి కారణంగా జగత్తు కనబడుతున్నాయి.
అవి మిధ్య, జడము, పైపెచ్చు దుఃఖమయము. భ్రాంతి వల్లనే కనబడుతున్నాయి. ఈ ప్రకారంగా తర్కబద్ధంగా నిరంతరం చింతన చేయగా చేయగా క్రమంగా భ్రాంతి పొరలు కరిగిపోయి ఇవి కనబడడం మాని వేస్తాయి. స్వస్వరూపం గోచరమౌతుంది.
🕉️🌞🌍🌙🌟
*🧘♂️శ్రీ అన్నమాచార్య సంస్కృత కీర్తన🧘♀️*
గానం: ఎం.ఎస్.సుబ్బలక్ష్మి అమ్మ
రాగం: యమన్ కల్యాణి
రేకు రాగము: ధన్యాసి.
భావయామి గోపాలబాలం మన-
స్సేవితం తత్పదం చింతయేయమ్ సదా!!
కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా-
పటల నినదేన విభ్రాజమానం
కుటిలపద ఘటిత సంకుల శింజితేనతం
చటుల నటనా సముజ్జ్వల విలాసం!!
నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది-
సుర నికర భావనా శోభితపదం
తిరు వేంకటాచల స్థితం అనుపమం హరిం
పరమపురుషం గోపాలబాలం!!
🕉️🌞🌏🌙🌟🚩
యశోదమ్మ దగ్గర పారాడుతూ, నడుస్తూ, నృత్యం చేస్తున్న చిన్నికృష్ణయ్యని అన్నమయ్య ఈ కీర్తనలో మనోహరంగా వర్ణిస్తున్నాడు.
చిట్టి పొట్టి అడుగులు వేస్తూ ముద్దు కన్నయ్య నడుస్తుంటే మొలతాడుకు ఉన్న చిరుగంటలు అందంగా మోగుతున్నాయి. అసలు మన హృదయాలు గంటలుగా మారాయేమో! అదుగో మనలని అనుగ్రహించటానికి కృష్ణుడు నృత్యం చేస్తున్నాడు. అటు కాలు ఇటు వేసి, అందెలు ఘల్లు ఘల్లు అంటుంటే మా బాల కిట్టయ్య ఎంత చక్కటి నృత్యం చేస్తున్నాడో కదా! ఆ విలాసం ఇంకెవరికయినా ఉంటుందా!
అదుగో! అమ్మ ఎప్పుడు పెట్టిందో చేతిలో వెన్నముద్దతో వెన్నదొంగ మురిసిపోతూ మెరిసిపోతున్నాడు. కృష్ణుడు ముద్దుముద్దుగా నడుస్తుంటే, ఆ అడుగులకు అందరూ మురిసిపోతున్నారు. ఆ అడుగులతో బ్రహ్మ మొదలైన దేవతల ఆలోచనలు మెరిసిపోతున్నాయి. అలా తమ భావాలను మెరిపిస్తున్న కృష్ణున్ని తలుచుకుంటూ దేవతలందరూ తాము అదృష్టవంతులమనుకొంటున్నారు.
ఎవ్వరితో పోలిక లేనివాడు,పరమ పురుషుడు గోపాలబాలుడు. ఆ చిన్ని కృష్ణుడు వేంకటేశునిగా వేంకటాచలంలో ఉన్నాడు. ఆ ఆవులు కాసే బాలుడిని, నన్ను రక్షించమని ధ్యానిస్తాను.
***
స్వామివారు భూలోకంలో ఉన్నది సరిగ్గా 125 సంవత్సరాలని ఒక లెక్క ఈ 125 సంవత్సరాల జీవిత కాలంలో పెద్దరికపు చేష్టల కంటే శ్రీకృష్ణుని బాల్య క్రీడలు కవులకు అధికంగా మనస్సేవితాలయ్యాయి. మనస్సేవితమనేది ఒక అద్భుతమైన పద బంధం. చేతులు, కాళ్ళు భగవంతుని సేవలో యాంత్రికంగా నిమగ్నమవుతాయి. కాని, మనస్సు సేవించటమనే విషయం మానవులలో తక్కువగా జరుగుతుంది. రాగ ద్వేషాలకు అతీతులై, భగవంతునికి మనస్సేవ చేయమని అన్నమయ్య సందేశం. భాగవతంలో కర్దమ మహాముని చూసిన స్వామి మనస్స్పర్శస్మిరేక్షణుడు (మనస్సును తాకే చిరునవ్వుల చూపుల వాడు). ఆ చిన్నికృష్ణుడిని మనస్సేవితునిగా చేసిన అన్నమయ్య ధన్యుడు,
మర్కట కిశోర న్యాయ మార్జాల కిశోర న్యాయం - అని రెండు పద్దతులు భక్తి ప్రపంచంలో ఉన్నాయి. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు దాటేటప్పుడు తల్లి కోతిని - పిల్ల కోతి గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇక్కడ తల్లికి రక్షణ బాధ్యత లేదు. పిల్లకే బాధ్యత, ఈ విధానంలో భక్తుడిదే బాధ్యత.
జీవుడు తన రక్షణకు తాను ప్రయత్నాలు చేస్తుంటాడు. మార్జాల కిశోర న్యాయం దీనికంటే ప్రత్యేకమైనది. పిల్లి తన పిల్లలని తానే రక్షిస్తుంది. ఆహారం అందిస్తుంది. ఒకచోట నుంచి ఇంకోచోటికి తానే తీసుకువెళుతుంది. ఇక్కడ తల్లిదే రక్షణ బాధ్యత. పిల్లకి సంబంధం లేదు. అన్నమయ్య లాంటి మహాభక్తులు అనుసరించిన శరణాగతి మార్గం ఇదే. స్వామికే సర్వం సమర్పణ చేయాలి. తన రక్షణ బాధ్యతలు అన్నీ స్వామికే అప్పజెప్పే ఈ ఉత్తమ భక్తి విధానంలో వేలాది కీర్తనలు అన్నమయ్య రాసాడు.
ఈ భావయామి కీర్తనలోన సదా ( ఎల్లప్పుడు) అనే పదం కీలకమైంది. సర్వకాల సర్వావస్థల్లోనూ స్వామిని ధ్యానించాలి. శరణు కోరాలి. ఈ కీర్తన ఇచ్చే సందేశం ఇదే. చింతయేయమ్ కు బదులు *'చింతయేహమ్'* అను పాఠమే మనం గ్రహించాలి. ముత్తుస్వామి దీక్షితులవారు కూడా *చింతయేహమ్* అని శివ సంకీర్తనలలో తరచూ ప్రయోగించారు. అమ్మ భావనాగమ్య (భావించటం చేత తెలియదగినది లలితాసహస్రం). కృష్ణయ్య కూడా భావనాగమ్యుడు. కేవలం మనకే కాదు. బ్రహ్మ మొదలైన దేవతల భావనలకు చిన్ని కృష్ణుడు శోభనిస్తాడని అన్నమయ్య చెబుతున్నాడు. అంటే మనం కృష్ణయ్యను ఒక్కసారి భావిస్తే చాలు, ఆ ఊహలు వెలిగిపోతాయి. అతడు బ్రహ్మాది భక్తుల భావాల వెలుగుతో ప్రకాశించే పదాలు కలవాడని కవి మాట.
పదాలకు రంగు, రుచి, వాసన ఉంటాయంటే కవులలాగే చెబుతారని అనుకొనేవాళ్ళు, ఈ అన్నమయ్య భావనాశోభ చూసి "పదాలకు రుచి ఉంటుంది. నిజమేస్మీ" అనకుండా ఉంటారా?
ఈ కీర్తనలోని నిరత కరకలిత నవనీతం (చేతిలో ఉంచుకొన్న కొత్తగా తీసిన వెన్నముద్ద కలిగినవానిని ) పాదాన్ని విన్న వెంటనే, "చేత వెన్నముద్ద చెంగల్వపూదండ" అనే పద్యం గుర్తుకు వస్తుంది. ఆ మాటకొస్తే అమ్మ చేతిముద్దలాంటి కమ్మనైన ఈ పద్యం కూడా అన్నమయ్యదే అని కొందరు విమర్శకుల భావన.
ఇంతకీ వెన్నముద్దకి, కృష్ణుడికి సంబంధం ఏమిటి? ఆయనకి ఇంకేం పనిలేనట్టు అస్తమాను ఈ వెన్న దొంగతనాలు ఏమిటి? వెన్నముద్దలు చేతిలో పెట్టుకోవటమేమిటి? ఈ ప్రపంచం నీళ్ల వంటిది. మనస్సు పాల వంటిది. నీళ్లలో పాలను కలిపితే - స్వచ్ఛమైన పాల ఉనికి మనకు కనిపించదు. అదే పాలను పెరుగుగా మార్చి చిలికితే వెన్న వస్తుంది.
ఆ వెన్నముద్దను నీళ్లలో ఉంచితే, అది నీళ్లలో కలవదు. తేలుతుంది. మన జీవుల మనస్సు వెన్న కావాలని కృష్ణయ్య సందేశం. నీళ్ళ లాంటి ప్రపంచంలో ఉంటున్నాం ప్రాపంచిక బంధాలు అంటుకోకూడదు. ఇది చెప్పినంత తేలిక కాదు. పాలలాంటి మనస్సు వెన్నగా మారాలంటే కృష్ణమూర్తి అనుగ్రహం జీవుడికి అవసరం. నన్ను ఆశ్రయించండి. స్మరించండి.
మిమ్మల్ని నా చేతుల్లో పెట్టుకొని చూసుకొంటానని స్వామి వెన్నముద్దను చేతిలో ధరిస్తున్నాడు. ఇది అర్ధం చేసుకొన్న అన్నమయ్య లాంటి మహాభక్తులు సదా ఆయనను స్మరించి తరించారు. అన్నమయ్య కీర్తనలు చదివి ఆనందించాలి. ఆయన మార్గాన్ని అనుసరించి తరించాలి.
***
*🧘♂️90- ఒక యోగి ఆత్మకథ🧘♀️*
*రాతిబొమ్మ గుండె*
“శిలారూపిణివైన మౌన మాతృమూర్తి, నీ ప్రియభక్తులు రామకృష్ణుల విన్నపాన్ని మన్నించి అప్పుడు జీవన్మూర్తి వయావు. నీ కోసం పరితపించే ఈ కొడుకు ఆక్రందనల్ని ఎందుకు ఆలించవమ్మా?” అంటూ ప్రార్థించాను.
దివ్య ప్రశాంతితోబాటు నాలో ఉత్సాహం అపరిమితంగా పెరిగింది. అయినా ఐదుగంటలు గడిచిపోయాయి; నేను అంతర్‌దృష్టితో దర్శిస్తున్న కాళీమాత నాకు సమాధానమివ్వలేదు, నేను ఒక్కరవ్వ నిరాశపడ్డాను. ఒక్కొక్కప్పుడు, ప్రార్థనలు ఫలించడంలో ఆలస్యం చెయ్యడం దేవుడు పెట్టే పరీక్ష. కాని చివరికి, తదేక నిష్ఠగల భక్తుడు ఇష్టదేవతగా తనను ఏ రూపంలో కొలుస్తాడో ఆ రూపంలోనే దర్శన మిస్తాడాయన. భక్తి తత్పరుడైన క్రైస్తవుడు ఏసును చూస్తాడు; హిందువు కృష్ణుణ్ణో, కాళికా దేవినో చూస్తాడు; ఒకవేళ అతని ఆరాధన నిరాకారుడివేపు తిరిగితే విరాట్ జ్యోతిని దర్శిస్తాడు.
నేను అనిష్టంగానే కళ్ళు తెరిచి చూశాను; మధ్యాహ్న కాలనియమాన్ని అనుసరించి ఒక పూజారి ఆలయ ద్వారాలు మూసేస్తున్నాడు. ముఖమంటపంలో ఉన్న నా ఏకాంత స్థల నుంచి లేచి ముంగిట్లో అడుగు పెట్టాను. అక్కడ నేలమీద పరిచిఉన్న రాయి మిట్టమధ్యాహ్నం ఎండకు మలమల మాడుతోంది; నా అరికాళ్ళ మంటెత్తిపోతున్నాయి.
“జగన్మాతా,” అంటూ నేను మౌనంగా ఆక్షేపణ తెలిపాను. “నువ్వు ఇంతవరకు నాకు దర్శనమిచ్చావు కావు; ఇప్పుడు మూసిన తలుపుల వెనక దాక్కుని ఉన్నావు. ఈ రోజు నేను మా బావగారి తరఫున నీకు ప్రత్యేక ప్రార్థన చెయ్యాలని అనుకున్నాను.”
మనస్సులో నేను చేసిన విన్నపానికి వెంటనే స్వీకృతి లభించింది. మొదట, నా బాధను మటుమాయం చేస్తూ వెన్ను వెంబడి, పాదాలకింద ఆహ్లాదకరమైన చలవ అల ఒకటి పాకి వచ్చింది. ఆ తరవాత, ఆ ఆలయం పరిమాణం బ్రహ్మాండంగా పెరిగిపోయి నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. దాని విశాల ద్వారం మెల్లిగా తెరుచుకొని కాళికాదేవి శిలావిగ్రహాన్ని ఆవిష్కరించింది. క్రమంగా ఆ విగ్రహం సజీవరూపంగా మారింది; చిరునవ్వు చిందిస్తూ ఆ తల్లి పలకరింపుగా తల ఊపింది; చెప్పనలవికాని ఆనందంతో నన్ను పులకరింపజేసింది. కంటికి కనిపించని ఒక పిచికారీతో లాగేసినట్టుగా నా ఊపిరితిత్తుల్లోంచి శ్వాస బయటికి వచ్చేసింది; నా శరీరం జడప్రాయం కాకపోయినా అతినిశ్చలమయిపోయింది.
ఆ తరవాత నా చైతన్యం ఆనంద తన్మయత్వంతో విస్తార మయింది. నా ఎడమవేపు గంగానది మీద అనేక మైళ్ళదురం స్పష్టంగా చూడగలిగాను, అంతే కాకుండా గుడి వెలుపల దక్షిణేశ్వర క్షేత్రమంతా కళ్ళకు కట్టింది. భవనాలన్నిటి గోడలూ పారదర్శకంగా ప్రకాశించాయి; వాటిగుండా నేను, దూరభూముల్లో సంచరిస్తున్న జనాన్ని గమనించాను.
నేను ఊపిరి లేకుండా ఉన్నప్పటికీ, నా శరీరం చిత్రంగా ప్రశాంత స్థితిలో ఉండిపోయినప్పటికీ, నేను చేతులూ కాళ్ళూ స్వేచ్ఛగా కదపగలిగాను. కొన్ని నిమిషాలసేపు నేను కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రయోగం చేశాను: మూసినా తెరిచినా కూడా దక్షిణేశ్వర దృశ్యాన్ని యావత్తు స్పష్టంగా చూశాను.
ఎక్స్-రే లనే కిరణాల మాదిరిగా, ఆధ్యాత్మిక దృష్టి అన్ని రకాల పదార్థాల్లోకీ చొచ్చుకుపోతుంది; ప్రతి చోటా దివ్యనేత్రమే కేంద్రం; దాని కెక్కడా పరిధి ఉండదు. ఎండకు మాడుతున్న ఈ ముంగిట్లో నించుని ఉండగా నే నొక విషయం కొత్తగా గ్రహించాను; వాస్తవానికి స్వప్నమై, నీటి బుడగ మాదిరిగా నిరాధారమై ఉన్న భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి దేవుడి భ్రష్టసంతానంగా జీవించడం మానేసిన మానవుడు తన అనంత సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందుతాడు. సంకుచిత మూర్తిమత్వంలో కుదించుకుపోయిన మానవుడికి పలాయన వాదమే శరణ్యమయినట్లయితే, సర్వవ్యాపకత్వంతో పోల్చదగ్గ పలాయనం మరొకటి ఉండే అవకాశం ఉందా?
దక్షిణేశ్వరంలో నాకు కలిగిన పవిత్రానుభవంలో అసాధారణంగా విస్తరిల్లిన వస్తువులల్లా ఆలయమూ అమ్మవారి విగ్రహమూ, తక్కిన వాటిలో ప్రతి ఒక్కటీ తెలుపూ నీలమూ ఇంద్ర ధనుస్సులోని రంగులూ గల స్నిగ్ధ కాంతి పరివేషంతో కూడి ఉన్నప్పటికీ వాటి మామూలు పరిమాణాల్లోనే కనిపించాయి. నా శరీరం గాలిలో తేలిపోవడానికి సిద్ధంగా వాయుపదార్థంతో ఏర్పడినట్టు అనిపించింది. నా భౌతిక పరిసరాల సంపూర్ణ స్పృహతోనే నా చుట్టూ చూసుకుంటూ, ఆనందమయమైన దివ్య దర్శనానికి వ్యాఘాతం కలిగించకుండా కొన్ని అడుగులు వేశాను.
గుడి గోడల వెనక పవిత్రమైన మారేడుచెట్టు ముండ్ల కొమ్మల కింద కూర్చుని ఉన్న మా బావగారిని చటుక్కున చూశాను. ఆయన ఆలోచనల ధోరణిని అప్రయత్నంగానే తెలుసుకోగలిగాను. ఆయన మనస్సులో, దక్షిణశ్వర పవిత్ర వాతావరణ ప్రభావంవల్ల కొంతమట్టుకు ఉదాత్తస్థితి నందుకున్నప్పటికీ నా గురించి నిర్ధాక్షిణ్యమైన ఆలోచనలే సాగుతున్నాయి. నేను సూటిగా, ఆ అమ్మవారి దివ్యమంగళ విగ్రహం వేపు తిరిగాను. “జగన్మాతా, మా అక్కయ్య భర్తలో ఆధ్యాత్మికంగా పరివర్తన తీసుకువస్తావా నువ్వు?” అని ప్రార్థించాను.
ఇంతవరకు మౌనంగానే ఉన్న ఆ సౌందర్య రూపిణి చివరికి నోరువిప్పి మాట్లాడింది. “నీ కోరిక నెరవేరుతుంది!”
సతీశ్ వేపు సంతోషంగా చూశాను నేను. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి పని చేస్తోందని సహజ ప్రవృత్తివల్ల తెలిసి ఉన్నట్టుగా ఆయన, నేలమీద కూర్చున్న చోటునుంచి రోషంగా లేచాడు. ఆయన గుడివెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు; తన పిడికిలి ఎత్తి చూపిస్తూ నన్ను సమీపిస్తున్నాడు.
సర్వగ్రాహకమైన దృశ్యం అదృశ్యమయింది. అమ్మవారి దివ్య మంగళమూర్తి అవుపించడం మానేసింది; ఆ ఆలయం పారదర్శకత పోగొట్టుకొని తిరిగి మామూలు పరిమాణాన్ని పొందింది. మళ్ళీ నా ఒళ్ళు, సూర్యుడి ప్రచండ కిరణాలకు మలమల మాడుతోంది. ముఖ మంటపం నీడలోకి ఒక్క గంతు వేశాను; సతీశ్ మండిపడుతూ నన్నక్కడికి వెంబడించాడు. నా గడియారం చూసుకున్నాను. ఒంటిగంటయింది; దివ్య దర్శనం గంటసేపు ఉందన్నమాట.
“ఓయి తెలివితక్కువ నాయనా, కాళ్ళు మెలివేసుకుని కళ్ళు తేల వేసుకుని గంటలగ్గంటలు కూర్చున్నావక్కడ. నిన్ను గమనిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాను. మన భోజన మెక్కడోయ్? ఇప్పుడు గుడి మూసేశారు; గుడి అధికారులికి నువ్వు మన సంగతి చెప్పకపోతివి; మన భోజనాల ఏర్పాటుకు టైము చాలా మించిపోయింది!”
🕉🌞🌏🌙🌟🚩
- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)*
🕉🌞🌎🌙🌟🚩
685) శ్లోకము :-
ప్రాణేశ్వరీ విధిపురే లసతః పురారే
రంగీకరోతు శరణాగతి మంబికా మే.!
లబ్ధం నిపీయ యదురోరుహకుంభదుగ్ధమ్
సంబంధ మూర్తి రభవత్ కవిచక్రవర్తీ!! 685
పదవిభజన:-
ప్రాణేశ్వరీ విధిపురే లసతః పురారేః
అంగీకరోతు శరణాగతిం అంబికా మే!
లబ్ధం నిపీయ యదురోరుహ కుంభ దుగ్ధమ్
సంబంధ మూర్తిః అభవత్ కవిచక్రవర్తీ!! 685
భావము:-
తల్లీ ! ఓ ఉమాదేవి!
సంబంధమూర్తి దేవార్ లేక తేవారు అని పేరుకల
మూడు ఏండ్ల వయసు కల బాలునకు
నీ పాలిండ్ల పాలు అను మిషను జ్ఞానము ప్రసాదింపగా
శైవ సమాచార్యుడు- కవి చక్రవర్తి అయ్యెను.
శీర్హాలి, లేక శీర్ఖాలి అని ప్రసిద్ది పొందిన
బ్రహ్మపురమున విలసిల్లు పరమ శివుని
ఇల్లాలివి నా శరణాగతి అను ప్రపత్తిని
అంగీకరింతువు కాక.
🕉🌞🌎🌙🌟🚩
686) శ్లోకము :-
అప్రాప్య లోక రచనావన పాతనేషు
యస్యా స్త్రయో పి పురుషాః కరుణా కటాక్షమ్!
నైవేశతే కిమపి సా జగదేకమాతా
భద్రా పరా ప్రకృతి రస్త్వఘనాశినీ నః!! 686
పదవిభజన:-
అప్రాప్య లోక రచన ఆవన పాతనేషు
యస్యాః త్రయః అపి పురుషాః కరుణా కటాక్షమ్!
న ఏవ ఈశతే కిం అపి సా జగదేకమాతా!
భద్రా పరా ప్రకృతిః అస్తు అఘ నాశినీ నః!! 686
భావము:-
తల్లీ ! ఓ ఉమాదేవి!
390) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️*
*స్థితి ప్రకరణము*
*రెండవ అధ్యాయము*
*దామ వ్యాళ కటోపాఖ్యానము*
2-121
ఉచ్చైఃపదాయ పరయా ప్రజ్ఞయా వాసనాగణాత్ పుష్పాద్గన్ధమివోదారం చేతో రామ పృథక్కురు.
ఓ రామచంద్రా! ఉన్నతమగు అత్మపదప్రాప్తి కొఱకై నీవు మహాప్రజ్ఞతో నీ యొక్క
వివేకవైరాగ్యసహితమగు ఉత్తమ మనస్సును, వాసనాసమూహము
నుండి - పుష్పమునుండి గంధమువలె వేఱుచేయుము.
2-122
సంసారామ్బునిధావస్మిన్ వాసనామ్బు పరిప్లుతే
యే ప్రజ్ఞా నావమారూఢాస్తే తీర్ణాబ్రుడితాః పరే
వాసనయను జలముచే పూర్ణమై యున్నటి ఈ సంసార సముద్రమున ప్రజ్ఞ (వివేకము) అను నావ యెక్కినవారే అద్దానిని దాటివైచిరి. తక్కినవారు అందు మునిగిపోయిరి.
2-123
క్షురధారాప్రమితయా ధియా పరమధీరయా ప్రవిచార్యాత్మన స్తత్త్వం తతః స్వపదమావిశ.
ఓ రామచంద్రా! కత్తియొక్క అంచువలె (వివేక వైరాగ్యములచే) తీక్షణమొనర్పబడినదియు, మహాధైర్యముతో గూడుకొనినదియు నగు బుద్ధిచే ఆత్మతత్త్వమును బాగుగ విచారించి, అటు పిమ్మట ఆ స్వకీయ ఆత్మపదమున ప్రవేశింపుము.
🕉️🌞🌏🌙🌟🚩
1*🧘♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘♀️
*28వ శ్లోకం:-*
*మజ్జన్మన: ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయమదను గ్రహ ఏష ఏవ! త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ!!*
*భావం:-*
*దైత్యసంహారక! లోకనాథ! ఈ నా కోర్కెను తీర్చుము. నన్ను అనుగ్రహింపుము. నీ భ్రుత్యు భ్రుత్యు పరిచారక భ్రుత్య భ్రుత్యునాకు భ్రుత్యుడనుగా నన్ను తలంచుము. ఆవిధంగా నీ భ్రుత్య పరంపరలో ఒకనిగా నన్ను తలంచుటఏ ప్రభూ! నాజన్మకు ఫలము.*
🕉🌞🌎🌙🌟🚩
*🧘♂️సుభాషితరత్నావళి🧘♀️*
*శ్లోకం:-*
.....
2*🧘♂️08- శ్రీ కపిలగీత🧘♀️*
*అధ్యాయము - 1 శ్లోకం 07:-*
*తమిమం తే ప్రవక్ష్యామి యమవోచం పురాన ఘే! I*
*ఋషీణాం శ్రోతుకామానాం యోగం సర్వాంగ నైపుణమ్ || 7*
*టీకా:-*
తం ఇమం = అది, ఇది; తే = నీకు; ప్రవక్ష్యామి = తెలియజేయుదును; యమ్ అవోచమ్ = నేను ఏదైతే చెప్పానో; పురా = పూర్వం; అనఘే = ఓ పాపరహితా; ఋషీణాం శ్రోతు కామానామ్ = వినవలెననే కోరిక గలిగిన ఋషులకు; యోగమ్ = యోగం; సర్వాంగ నైపుణమ్ = దాని అన్నివిధముల నుండి.
*భావం:-*
అనఘా! పూర్వం జిజ్ఞాసువులైన ఋషులకు చెప్పిన యోగమును నీకు విశదపరచెదను.
*వివరణ:-*
భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడిలా అంటాడు-(4.3) “స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః పురాతన కాలంలో నాచే చెప్పబడిన యోగమునే ఇప్పుడు నేను నీకు బోధిస్తున్నాను".
ఈ జ్ఞానం శాశ్వతసత్యం. ఎప్పుడెప్పుడు అది కనుమరుగౌతూ ఉంటుందో అప్పుడప్పుడు భగవానుడవతరించి ఆ జ్ఞాన పరంపరను పునరుద్ధరిస్తూ ఉంటాడు.
గమ్యము, సాధనములు, అడ్డంకులు, ఉపకరణములు, ముందు జాగ్రత్తలు, ఫలితాలు మొదలైనవి ఈ జ్ఞానములోని వివిధ విషయములు. ఈ జ్ఞానం ఇక్కడ కపిలమునిచే సంపూర్ణంగా విశదీకరింపబడుచున్నది.
పూర్వమీ జ్ఞానము మహర్షులకు బోధింపబడినది. ఈ జ్ఞానము జిజ్ఞాసవు లకు మాత్రమే ఇవ్వబడింది, ఇవ్వాలి. లేనిచో అది వ్యర్థమవుతుంది, అపార్థము చేసుకోబడవచ్చు, లేక దుర్వినియోగపడవచ్చు.
కపిల ముని ఇప్పుడీ జ్ఞానాన్ని తన తల్లినికి ఉపదేశిస్తున్నాడు. ఈ జ్ఞానము స్త్రీలకు బోధింపబడకూడదన్న లేక వారు వినకూడదన్న మాట అసత్యమని దీనినిబట్టి తెలుస్తున్నది.
ఈ క్రింది శ్లోకములోని సత్యమును గుర్తించనంతవరకు ఏ సాధనకునకూ ఆధ్యాత్మిక ప్రగతిసాధ్యము కాదు. కాబట్టి దీనియొక్క ప్రాముఖ్యతను గ్రహించాలి.
***
:
3*🧘♂️98) అష్టావక్ర గీత🧘♀️*
*అధ్యాయం - 9*
*నిర్లిప్తత - ఉదాసీనత (నిర్వేదము)*
*శ్లోకం 06:-*
*कृत्वा मूर्तिपरिज्ञानं चैतन्यस्य न किं गुरुः ।*
*निर्वेदसमतायुक्त्या यस्तारयति संसृतेः ॥ ९-६ ॥*
*కృత్వా మూర్తిపరిజ్ఞానం చైతన్యస్య న కిం గురుః ।*
*నిర్వేదసమతాయుక్త్యా యస్తారయతి సంసృతేః ॥ 9-6 ॥*
శ్లో|| కృత్వా మూర్తి పరిజ్ఞానం చైతన్యస్య న కిం గురుః |
నిర్వేదసమతా యుక్త్యా యస్తారయతి సంసృతేః || 6.
*టీకా*
నిర్వేద = వైరాగ్యము, సమతా = సమత్వము, యుక్త్యా = యుక్తుల చేత, చైతన్యస్య = చైతన్యము యొక్క, మూర్తి పరిజ్ఞానం = ఆకారవిశేషజ్ఞానమును, కృత్వా = చేసి, యః = ఎవడు, సంసృతేః = సంసారమునుండి, (స్వం = తనను), తారయతి = తరింపజేసికొను చున్నాడో, సః = అట్టివాడు, గురుః = గురువు, న కిం = కాడాయేమి? (అగుచున్నాడని భావము)
*వివరణ:-*
శుద్ధమైన చైతన్య స్వభావాన్ని తెలుసుకుని, తార్కికమూ, సమత్వమూ కలిగి బుద్ధితో, ప్రపంచంమీద నిర్వేదభావం కలిగి, జనన మరణయుక్తమయిన సంసార చక్రం నుండి ముక్తుడయినవాడు మాత్రమే నిజమైన మార్గదర్శి కాగలడు.
*తాత్పర్యం:-*
వేదవేదాంగాలలో అపారమైన ప్రజ్ఞ ఉండడమే గురువు అర్హత నిర్ణయించదు. శాస్త్రపరిజ్ఞానం శ్రోత్రియత్వం వాంఛనీయమూ, ఆకర్షణీయమూ అయినప్పటికీ కేవలం అది ఒకటే చాలదు. ఆత్మానుభవనిష్ఠుడై నిర్వేదమూ, సమత్వమూ యుక్తి యుక్తమయిన బుద్దిని కలిగియుండిన వ్యక్తిమాత్రమే నిజమైన మార్గదర్శి కాగలడు.
అష్టావక్రులు అభిప్రాయములో బ్రహ్మనిష్ఠ కలిగిన జ్ఞాని మాత్రమే ఇతరులకు గురువు కాగల అర్హత కలిగినవాడు.
అర్హతలేని గురువును త్యజించమని గురుగీత అంటుంది. "జ్ఞానహీనో గురుస్త్యాజ్యో'--- "స్వవిశ్రాంతిం న జానాతి, పరశాంతిం కరోతి కిం"----తనలో లేని శాంతిని పరులకు ఏవిధంగా ఇవ్వగలడు?
***
4🧘♂️18) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘♀️*
*18) శ్లోకం:-*
*దృశ్యత్వతోన మనసశ్చ భవే చ్చితి త్వం నాహంకృతిశ్చ పరిణామవతే చితి స్స్యాత్ |*
*బుద్ధే రచిత్వ మపి జన్మ వినాశవత్వాౕౖత్ చిత్తం చ దృశ్య మచిదిత్యనుచింతయ త్వమ్ ॥ 18*
*టీకా*
దృశ్యత్వతః = దృశ్యమైన కారణంవల్ల, చితిత్వం = చితి స్వభావం, మనసః = మనస్సుది, న భవేత్ = కాదు, చ=మరియు, పరిణామవతే అహం కృతిః = మార్పులు చెందే అహంకారం, చితిః న స్యాత్ = చితికాదు, జన్మ వినాశవత్వాత్ = పుట్టడం, నాశనం ఉన్నందున, బుద్ధేః = బుద్ధి యొక్క, అచిత్వం అపి = చితి కాని విషయం కూడా (నిశ్చయమే). దృశ్యం చిత్తం = దృశ్యమైన చిత్తం, అచిత ఇతి = అచిత్తేనని, అనుచింతయ = నిరంతరం విచారణ చెయ్యి.
*భావం:-*
‘దృశ్యమైనందున మనస్సు చితి కాదు. ఇంకా, మార్పు చెందే అహంకారం చితి కాదు. జన్మ, వినాశం కలిగిన బుద్ధి, దృశ్యమైన చిత్రం కూడా జడమైనవే' ఇలా నిత్యం చింతన చెయ్యి.
*వివరణ*
ఇక 'అంతఃకరణం' చితి అవుతుందా అనే విచారణ సాగింపు బడుతుంది. ఉద్రేకాలతో ఊగిపోతూ, సంశయాల పుట్ట అయినది మనస్సు దాని ఉద్రేకాలు, సంశయాలు జీవుడికి తెలుస్తూ ఉంటాయి. అందుచేత మనస్సు- దృశ్యం. ద్రష్ట-చూచేవాడు. అతడే చితి. చూడబడే దృశ్యం జడమే.
అహంకారం "నేను చేస్తున్నాను" అనే భావం. చేసే పనిని బట్టి, తిరిగే రంగాన్ని బట్టి మారుతుంది. నేను తినేవాణ్ణి, నడిచేవాణ్ణి, వినేవాణ్ణి అంటున్నప్పుడు అహంకారం పలురకాలుగా మారుతుంది.
చితి ఎప్పుడూ ఒకే రూపం కలిగి వుంటుంది. అందుచేత అహంకారం చితి కాదు. జడమైనది. చితి ఈ మార్పులన్నింటినీ గ్రహించేది.
బుద్ధో? అది అన్ని కాలాలలో పని చెయ్యదు. మనం పడుకున్నప్పుడు అది నిద్రపోతుంది. భారీగా అన్నం తిన్నప్పుడు అది మందంగా పనిచేస్తుంది. అందువల్ల జన్మ వినాశాలున్న బుద్ధి చితి కాదు. బుద్ధి యొక్క జన్మ వినాశాలని తెలుసుకునే బుద్ధి.
చిత్తం పాత జ్ఞాపకాల పుట్ట. మనస్మృతులన్నీ మన ఎరుకే. అందువల్ల అది కూడా దృశ్యమే. చితి కాదు.
***
5*🧘♂️88- ఒక యోగి ఆత్మకథ🧘♀️*
*(🖌️రచన :- శ్రీ పరమహంస యోగానంద)*
*అధ్యాయం : 21*
*శ్రీ అన్నమాచార్య సంకీర్తన*
రేకు: 1921-2
సంపుటము: 29-62
రాగము: కుంతలవరాళి
ఏలితివి నన్నుఁ దొల్లె యింతగా మన్నించితివి
ఆలించి నా విన్నపము లవధరించవయ్యా!!
॥పల్లవి॥
కోపగించరాదు నీతో గుంపెన చూపఁగరాదు
వైపుగా నిచ్చక మాడవలెఁగాని
రాఁపులఁ బెట్టఁగరాదు రట్టుసేసి చూపరాదు
చేపట్టి నీవే కృపసేయవయ్యా !!
॥ఏలి॥
కన్నుల జంకించరాదు కడుఁ దమకించరాదు
వన్నెగా బత్తి నెరపవలెఁగాని
సన్నలఁ గొసరరాదు సారెకుఁ బెనఁగరాదు
అన్నిటా నీవే నన్ను
నాదరించవయ్యా!!
॥ఏలి॥
పాడి పంతా లెంచరాదు పైపై సిగ్గువడరాదు
వాడికగాఁ గాఁగిలించవలెఁగాని
కూడితివి నన్ను నిట్టె గురిగా శ్రీవేంకటేశ
వేడుకతో వరమిచ్చి వెలయించవయ్యా !!
॥ఏలి॥
నన్ను పరిపాలించుచున్న స్వామి ఇంతగా మన్నించితివి. నా విన్నపములు ఆలకించి నన్ను ఉద్ధరించవయ్యా. నీతో కొపగించరాదు ఆగ్రహం గా చూడరాదు.
నీతో ప్రియవచనములాడాలి గాని రాచుట పెట్టరాదు. నీపై నిందవేసి చూడరాదు. అనుగ్రహించి నీవే దయచూపించవయ్యా. నీపై కన్నులతో కూడా కోపగించరాదు. అత్యంతము మోహము పడరాదు. అందముగా భక్తి చూపించాలి గాని సైగ చేయరాదు. మాటిమాటికి అహంకారం చూపించరాదు.
అన్నిటా నీవే నన్ను ఆదరించవయ్యా. ధర్మ ఆధర్మములను ఎంచరాదు. పైపై సిగ్గు పడరాదు. అలవాటుగా కౌగిలించవలె కాని శ్రీవేంకటేశ నీతో కలవాలన్న లక్ష్యంతో వేడుకతో వరమిచ్చి రక్షించవయ్యా అంటు అన్నమయ్య కీర్తించారు.
**
- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)*
680) శ్లోకము :-
భేదాయ చేద్ గతరజా ముని రాదిదేశ
చిచ్ఛేద చేద్ బహుగుణ స్తనయః సవిత్రీమ్!
దాహ్యం శరీర మఖిలప్రభు రీశశక్తి
ర్యద్యావివేశ చ కథా పరమాద్భుతేయమ్!! 680
పదవిభజన:-
భేదాయ చేత్ గతరజాః మునిః ఆదిదేశ
చిచ్ఛేద చేత్ బహుగుణః తనయః సవిత్రీమ్!
దాహ్యం శరీరం అఖిలప్రభుః ఈశశక్తిః
యది అవివేశ చ కథా పరమ అద్భుతా ఇయమ్!! 680
భావము:-
తల్లీ ! ఓ ఉమాదేవి!
పరమ సాత్వికుడైన
జమదగ్ని మహాముని
క్రోధావేశమున
శిరస్సు ఖండింప ఆజ్ఞాపించుట,
సద్గుణముల రాశి అయిన పుత్రుడు
పరశురాముడు ఆ విధముగా ఖండించుట,
అగ్నికి సమర్పింప దగు
రేణుకా దేవి మృత శరీరమున
ఈశ్వర శక్తివి నీవు ప్రవేశింవగా
ఆమె పునర్జీవి అగుట
అన్నియు
పరమ అద్భుత నీ లీలా విషయములు.
***
6. శ్లోకములు :-
పుత్రః ప్రియ స్తవ శిరః సహసా చకర్త
కృత్తా చ హర్షభరితా భవతీ ననర్త!
నో తస్య పాప మపి నో తవ కాఽపి హాని
ర్నాశోఽస్య హా భుజభువా మభవద్ విపాకః!! 681
అంబైవ సా సురభి దర్జునభూపతి ర్యాం
వీర్యా జ్జహార స చ భార్గవ ఆజహార!
తస్యా హతేః పరగృహస్థితి రేవ హేతుః
గంధర్వ దర్శన కథా రిపు కల్పితైవ!! 682
పదవిభజన:-
పుత్రః ప్రియః తవ శిరః సహసా చకర్త
కృత్తా చ హర్ష భరితా భవతీ ననర్త!
నో తస్య పాపం అపి నో తవ కా అపి హానిః
నాశః అస్య హా భుజభువాం అభవత్ విపాకః!! 681
అంబా ఏవ సా సురభిః అర్జునభూపతిః యాం
వీర్యాత్ జహార సః చ భార్గవః ఆజహార!
తస్యాః హతేః పరగృహస్థితిః ఏవ హేతుః
గంధర్వ దర్శన కథా రిపుకల్పితా ఏవ!! 682
భావము:-
తల్లీ ! ఓ ఉమాదేవి! రేణుకాదేవి!
ప్రియ పుత్రుడు పరశురాముడు
ఏ విచారము లేకుండ నీ శీర్షము ఖండించెను.
ఖండింప బడిన దానవైననూ హాని కలుగక
ఆనందముతో నృత్యము చేసితివి.
అతనికి మాతృ హత్య పాపము కలుగలేదు.
కాని ఈ సంఘటన భూమిలోని రాజులకు
వినాశకారణముగా పరిణమించెను.
ఈ పౌరాణిక విషయము అసంభవముగా తోచుచున్నది.
గంధర్వరాజు, రేణుకాదేవి మోహము ఇత్యాదులు కూడ
సత్య దూరములయిన పౌరాణిక కథనము మాత్రమే.
వేదములో ఈ విధముగా చెప్పబడినది.
కార్తవీర్యార్జునుడు అపహరించిది అంబనే.
కామధేనువును కాదు.
పరశురాముడు అతనిని జయించి
విడిపించినది స్వంత తల్లినే.
జమదగ్ని ఆజ్ఞచే
ఆమెను పరశురాముడు ఖండించుట
పర గృహ నివాస నింద నివృత్తి కొరకు మాత్రమే.
***
*🧘♂️388) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️*
*స్థితి ప్రకరణము*
*రెండవ అధ్యాయము*
*దామ వ్యాళ కటోపాఖ్యానము*
2-115
నష్టే ధనఽథ దారాదౌ హర్షస్యావసరో హి కః
పారావలోకినస్త్యేతైః విరాగం యాన్తి సాధవః.
నశ్వరములగు ధన, భార్యాదులచే హర్షమును బొందనేల? వానియొక్క (దుఃఖ, నరకాది) భయంకర భావిదుష్ఫలితములను గాంచునట్టి సాధువులు ఆ స్త్రీ ధనాదులయెడల విరక్తిని గలిగియుండుచున్నారు.
2-116
సంసారసంభ్రమే హ్యస్మింశ్ఛన్నాత్మన్యాతతాయిని
తథా విహర సంబుద్ధో యథా నాయాసి మూఢతామ్.
ఓ రామచంద్రా! సంసారమున దిరుగాడునదియు, శత్రువువలె దాగుకొని చంపుటకు సిద్ధముగ నున్నదియు నగు కామము యొక్క విషయమై నీవు మహాజాగరూకుడై అప్రమత్తుడవై యుండి, మూఢత్వమును బొందకుండులాగున వర్తింపుము.
2-117
యయా కయాచిద్యుక్త్యైవ దృశ్యాద్యస్య గతా రతిః పరిమజ్జతి తస్యాస్థా
న క్వచిద్విమలా మతిః.
ఏదో యొక యుక్తిచే ఎవరికి దృశ్యము నుండి ప్రీతి, పట్టుదల తొలగిపోవునో, (పరమార్థాత్మయందు పట్టుదల గల) అట్టివాని యొక్క నిర్మలబుద్ధి సంసారసాగరమున ఎచటను మునుఁగనేరదు.
***
🙏శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
712వ నామ మంత్రము 18.6.2022
ఓం ఈ (యై) నమః
ఈం అను బీజాక్షర స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.
తురీయస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఈ అను ఏకాక్షర నామ మంత్రమును ఓం ఈ (యై) నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకుడు ఆత్మానందానుభూతినంది తరించును.
ఈం అనేది శక్తి బీజం. ఈ బీజమును కలుపుకునే మాయాబీజం, లక్ష్మీ బీజం, సరస్వతీ బీజములు ఏర్పడ్డాయి. కామకళా బీజం కూడా ఏర్పడినది. కామకళా బీజమే దేవీ స్వరూపము. ఈ దేవి నారాయణుని సోదరి మరియు శివునిపత్ని. సృష్టికి మూలమైన శక్తి ధ్యానింపతగిన మన్మథబీజము కూడా.
ఈ అను అక్షరము తురీయస్వరూపమునకు నిర్వచనము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ఈ (యై) నమః అని యనవలెను.
***
07. మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మ…
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
176వ నామ మంత్రము 18.6.2022
ఓం నిర్వికల్పాయై నమః
సంకల్ప వికల్పములు లేని శుద్ధచైతన్య స్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్వికల్పా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిర్వికల్పాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులు జ్ఞానపరిపూర్ణులై, సదా పరమేశ్వరీ ధ్యానమునందు మనస్సును నిమగ్నముచేసి తరించుదురు.
సంకల్పము అంటే ఏదైనా చేయాలనే ఆలోచన. సాధారణంగా పూజచేయునపుడు ఆచమనం చేసి, తమ యునికికి సంబంధించిన కాలము, ప్రదేశము, తిథివారనక్షత్రాదులు, ఆపైన సంకల్పంచేయువారి గోత్రము, నామధేయం, ఎందు నిమిత్తం సంకల్పం చేస్తున్నామో... ఇత్యాదులు సంకల్పంలో ఉంటాయి. అలాగే ఏదైనా కార్యక్రమం చేయాలనుకోవడాన్ని కూడా సంకల్పం అంటాము. కాని వికల్పము అంటే సంకల్పానికి వ్యతిరేకంగా అర్థం తీసుకోకూడదు. వికల్పానికి అర్థం భ్రాంతి అని అంటే ఇక్కఢ సందర్భం కుదురుతుంది. అంటే లేని వస్తువును గూర్చి వివరణ ఈయడం. దీనినే శూన్యమైన విషయము నుండి పుట్టిన జ్ఞానము. దీనికి ఒక ఉదాహరణముగా ధూర్జటి మహాకవి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ఒక పద్యం పరిశీలిద్దాము.
శా||అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా
జింతాకంతయు జింత నిల్పడు గదా, శ్రీకాళహస్తీశ్వరా!
ఈ పద్యంలోని భావము
ఓ శ్రీకాళహస్తీశ్వరా! పరమేశ్వరా! ఈ జగత్తు, ఈ జీవనము, జననము-మరణము మళ్ళీ జన్మించడం అనేవి అంతయూ మిథ్య. అలా తెలిసి కూడా ఎల్లప్పుడూ భార్యా, బిడ్డలు, సంపదలు, తనువు అనేవి శాశ్వతమనియు, సత్యమనియు తలచుచూ మోహము అనే సముద్రం (మోహార్ణవములో) లో మునిగి పోవును గాని, జన్మకు పరమార్థమునిచ్చే నీయందు రవ్వంతైనను ధ్యానము నిల్పడు కదా. ఇదంతా అజ్ఞానమే కదా!
ఈ రకమైన అజ్ఞానమే వికల్పము అంటారు. వికల్పము అనునది అజ్ఞాన సంబంధమైనది. లేనిది ఊహించుకొని అదే నిజమని భ్రాంతి చెందడం. ఇది కేవలం మనసుకు సంబంధించినది. పరమాత్మసంబంధమైనది కాదు. గనుక పరమాత్మ, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అయిన జగన్మాత నిర్వికల్పా యని అనబడినది. సాధకుడు యోగసాధనలో పరాకాష్ఠదశలో సమాధిస్థితికి చేరుతాడు. ఆ స్థితిలో సంకల్పవికల్పములు ఉండవు. దీనినే నిర్వికల్ప సమాధి స్థితి యంటారు. పరబ్రహ్మ స్వరూపిణియైన జగన్మాతకు సంకల్పవికల్పములు ఉండవు. గాన నిర్వికల్పా యను నామంత్రముతో స్తుతింపబడు చున్నది.
జగన్మాత చతుష్షష్టికళామయి (236వ నామ మంత్రము) అనగా అరవై నాలుగు కళలలోను పరిపూర్ణురాలు. అటు వంటి కళాప్రపూర్ణ అయిన జగన్మాత
విజ్ఞాన ఘనరూపిణీ (253వ నామ మంత్రము) అన్ని కళలయందును జ్ఞానము కలిగి యుండుటను విజ్ఞానఘనము అందురు. గనుక ఆ తల్లి విజ్ఞానఘనరూపిణీ యని అనబడుచున్నది గనుక జ్ఞానమునకు పరాకాష్ఠ అయినది గనుక సంకల్పవికల్పములు ఉండవు. కావున నిర్వికల్పా యని అనబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్వికల్ఫాయై నమః అని అనవలెను.
****
No comments:
Post a Comment