"* శ్రీపీత కౌశేయవిరాజమానం ,
శ్రీపద్మభర్తారమనాథనాథమ్..
శ్రీపన్నగేంద్రశయనప్రభోగం ,
శ్రీవేంకటేశంప్రణమామినిత్యమ్ !!! "
----
*....దూరపు శిఖరం చిన్నది దూది గాను
అస్థిర మగు ఆనందము ఆశ జూపు
కలయికలు దూర మైనను కష్ట మగుటె
కలసి బ్రతుకులోన విషాద కళలె కలలు
🙏
న్యస్తాక్షరి......
తి
రు
మ
ల
పద్య పాదం చివర రావాలి
చివర....రావాలి
🔴🔴🔴
సరోజ.. కలహము
* మది లోనే కళ మాధుర్యం
నది లాగా గల శబ్ధం లే
విధి ఆటే తిధి నాకేలా
కానీ నాదే కళ హృద్రాగా
సీ//
శుక్లపంచమి తిధి శుభవేళ కార్తీక
శుక్రవారంనాడు సుందరాన!
పద్మ సరోవర పద్మమై వెలిసిన
అలివేలు మంగయే యాదిలక్ష్మి!
సిరిలేని శ్రీహరీ చింతతోద్వాదశ
వత్సర యోగము వలపుతోడ!
వరదయామయివమ్మ వరద యభయ
ముద్ర
పద్మాలు ధరియంచి పంకజాక్షి
ఆ॥వె॥
కుందనానబొమ్మ కువలయసిరివమ్మ
మందగమనమహిన సుందరదన!
పద్మసరసునందు యుధ్బవించినముగ్థ
కమలపతిని జేరి కరమునందె!
🌹🙏🙏
ఈ ఉపోద్ఘాతం గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ..
ఈమధ్య మన పొరుగు దేశం చైనా కవ్వింపు చర్యలు ఎక్కువయ్యాయి.
మనదేశంలో ఉండే వారి దేశీయులు చైనీయులందరినీ వెనక్కిరమ్మని చెప్పిందని ఓ పుకారు హల్ చల్ చేస్తుంది. అంటే క్రమంగా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయని మనకు అర్థం అవుతుంది.. మనం డైరెక్ట్ గా యుద్ధం చేసి జన నష్టం, ఆస్తి నష్టం చేసుకునే ముందు ఈ సందర్భంలో మనం చాణక్యనీతి ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.
ఆ వ్యూహం మనందరికీ తెలిసినదే..
అదే "చైనా వస్తు బహిష్కరణ "
ఇది అందరూ చెప్పేదే కదా.. అయినా చైనా వస్తువులను మన దేశంలోకి రాకుండా అడ్డుకుంటే సరిపోతుంది కదా అనే ఆన్ లైన్ మేధావి వర్గం వాదన.. అది కరెక్ట్ కాదు.
ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం ఏ దేశమైనా తమ దేశంలో మరో దేశ ఉత్పత్తులను అమ్ముకోడానికి నిరాకరించకూడదు..
కొనవద్దు అని బహిరంగంగా ప్రజలకు ప్రభుత్వం చెప్పరాదు. అందువల్ల మన దేశంలోకి వచ్చే చైనా ఉత్పత్తులను ఆపలేం.. అలాగని ఖచ్చితంగా కొనవలసిందే అని నిబంధనలేమీ ఏ ప్రభుత్వం వారి ప్రజలకు పెట్టదు, కాబట్టి కొనడమా? మానడమా? అన్నది మన ఇష్టం.. కాదు అది మనకు కంటికి కనిపించని ఆయుధం.. చైనా తన ఉత్పత్తులు మనదేశంలో అమ్ముడుపోయినంతగా మరే దేశంలో అమ్మడుపోవు.. ఒకరకంగా చెప్పాలంటే చైనాకు మనదేశమే ప్రధాన ఆదాయ వనరు...ముళ్ళచెట్టు కాండం కు బెల్లం వేసినట్టు మనం అందరం ఏకతాటిగా నిలచి, ఐకమత్యం గా సైలెంట్ గా చైనా వస్తువులను కొనడం మానేస్తే సరి.. చైనాను మనం ఆర్ధికంగా నష్టపరచినట్టే.. మనం మన దేశానికి ఎంతో మేలు చేసినట్టే.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్ లోని హిరోషిమా, నాగసాకి పై అణుబాంబు వేసినప్పుడు జపాన్ దేశానికి అపార జన, ఆస్తి నష్టం వాటిల్లింది, కోలుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది, అందుకు కోపంగా జపాన్ ప్రజలు ఈరోజు వరకు అమెరికా ఉత్పత్తులు కొనడం మానేసారు.. అమెరికా కు జపాన్ తో వాణిజ్య సంబంధాలు ఈరోజుకు కూడా చక్కబడలేదు అంటే అది జపాన్ ప్రజల ఐక్యత.. ఓ చుక్క రక్తం చిందించకుండా అమెరికా పై నైతికంగా, ఆర్థికంగా గెలిచి చూపించారు.. మనం ఆ పని చేయలేమా? అంతటి దేశభక్తి మనలో లేదా? ఆ ఐక్యత మనకు లేదా? ఆలోచించండి ఫ్రెండ్స్...
మనదేశం భారతదేశం - మన లక్ష్యం భారతీయ సంపద వృద్ధి
జైహింద్
****
నమ్మకంతో బతకండి
సామాన్య జ్ఞానం(కామన్ సెన్స్) లేని వాడు అంటే విచక్షణా జ్ఞానం లేనివాడు, చేసే పని మీద శ్రద్ధ, విశ్వాసము లేని వాడు, ఎల్లప్పుడూ ప్రతి దానినీ సందేహించేవాడు, ఎన్నటికీ బాగుపడడు. ఎల్లప్పుడూ ఏదో ఒక సందేహముతో సతమతమౌతూ ఉండేవాడు ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ సుఖాన్ని పొందలేడు. ఇటువంటి వాడికి గురువు మీద, శాస్త్రము మీదా నమ్మకం ఉండదు. ఎవరి మీదా విశ్వాసం ఉంచడు. కాబట్టి అజ్ఞానికి, శ్రద్ధలేని వాడికీ, ముఖ్యంగా సందేహజీవికి ఎక్కడా సుఖం లభించదు.
మనకు తెలియనపుడు ఏదో ఒకటి నమ్మాలి. దాని మీద విశ్వాసం ఉంచాలి. పూర్వపు మహాఋషులు, మునులు, ఎంతో ఆలోచించి, దర్శించి, శాస్త్ర జ్ఞానమును మనకు అందించారు. మనకు ఉన్న మిడి మిడి జ్ఞానంతో అవి అన్నీ తప్పు అనడం సరికాదు. మానవులకు ఉన్న ఒకే ఒక జాడ్యం అ.. "వాడికి తెలియదు. వాడికి తెలియదు అన్న విషయం వాడికి తెలియదు." అంటే అంతా నాకు తెలుసు అనుకుంటాడు. అదే అజ్ఞానం. తెలియకపోతే తెలుసుకోవాలి. గురువును ఆశ్రయించాలి. తన సందేహాలు తీర్చుకోవాలి. అంతే కానీ ఏమీ తెలుసుకోకుండా అంతా నాకు తెలుసు అని అనుకోవడం అవివేకము. పైగా అటువంటి వాడు ప్రతిదానినీ సందేహిస్తాడు.
ఇది ఇలా ఎందుకుంది.. అలా ఎందుకు ఉండకూడదు. ఇది నిజంగా జరిగిందా! లేక పుక్కిటి పురాణమా! జరిగితే ఇలానే ఎందుకు జరిగింది. అలా ఎందుకు జరగకూడదు. వేదాలు ఉపనిషత్తులు ఎవరు రాసారు? వాళ్లు మగాళ్లు కాబట్టి వారికి అనుకూలంగా రాసుకొని ఉంటారు.
గీతను కృష్ణుడు చెప్పాడా?
700 శ్లోకాలు యుద్ధభూమిలో ఎలా చెప్పగలడు? అసలు భారత యుద్ధం జరిగిందా! ఇలా అనునిత్యమూ ఏదో ఒక పనికిమాలిన సందేహంతో బాధపడుతుంటాడు. అటువంటి వాడికి సుఖమూ, శాంతి అనేదే దొరకదు. వేదాలలో గానీ, శాస్త్రాలలోగానీ, గీతలో గానీ మనకు ఉపయోగించేవాటిని తీసుకొని, చదివి, అర్థం కాకపోతే గురువు బోధిస్తే విని, విన్నదాన్ని అర్థం చేసుకొని, మననం చేసుకొని, అనుసరించాలి, ఆచరించాలి గానీ అనునిత్యం సందేహాలతో బాధపడితే వాడికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖం లభించదు అని పరమాత్మ బోధించాడు.
--(())--
మల్లాప్రగడ రామకృష్ణ ప్రాంజలిప్రభ
22-శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘♀️
22వ శ్లోకం:-
హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే
హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే మాధవ
హే రామానుజ హే జగత్త్రయ గురో హేపుండరీకాక్ష మాం
హే గోపీజననాథ పాలయ పరం జానామి న త్వాం వినా
భావం:-
ఓ గోపాలా! కరుణాసముద్ర! లక్ష్మీపతి! కంసారి! గజేంద్ర రక్షకా! మాధవ! రామానుజ! జగన్నాథ! పుండరీకాక్షా! గోపీజనవల్లభ! రక్షింపుము. నీవే తప్ప ఇహపరంబు నేను ఎరుంగను.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూన్ 10.
లక్షల మంది పేదరికంలో, అజ్ఞానంలో మగ్గిపోతున్నంత కాలం, వారి కష్టార్జితంతో విద్యావంతులై, వారిని కనీసం పట్టించుకోవడం మానివేసిన ప్రతి వ్యక్తిని నేను వంచకుడిగానే భావిస్తాను. పీడితులై చెమటోడ్చే లక్షలమంది పేదల హృదయ రక్తంతో విద్యావంతులై, సుఖాల్లో మునిగి తేలుతూ, వారి గురించి కనీసం ఆలోచించని వారిని నేను నయవంచకులనే అంటాను.
జాగృతి
స్వామి వివేకానంద స్ఫూర్తి వచనాలు
ప్రజల ఆలోచనావిధానం, కార్యనిర్వహణల్లోని తప్పుల్ని ఎత్తి చూపకూడదు. దానికి బదులు, వాటిలో పరిణితి సాధించే మార్గాలను వారికి తెలియజెప్పాలి.
శాంతి
చికాకులు గుంపుగా వచ్చి మీ మనస్సు పై దాడి చేసిన ప్రతిసారి , వాతి వల్ల ప్రభావితం కాకండి. వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తూ ప్రశాంతంగా వేచి ఉండండి. చికాకులపై శాంతియనే శక్తివంతమైన రసాయనాన్ని చల్లండి.
*శ్రీ పరమహంస యోగానంద
ॐ卐సుభాషిత రత్నావళిॐ卐
పీత్వా కర్దమపానీయం
భేకో రటరటాయతే।
పక్వం చూతరసం పీత్వా
గర్వం నాయాతి కోకిలః ॥
భేకః కర్దమపానీయం
పీత్వా రటరటాయతే।
కోకిలః పక్వం చూతరసం
పీత్వా గర్వం నాయాతి ॥
బురదలో నీరు తాగి కూడా కప్ప పొగరుతో బెకబెకమంటుంది.... బాగా పండిన మామిడి రసం తాగి కూడా కోకిల గర్వాన్ని పొందదు....
అమృతం గమయ
"జీవితం అందంగా ఉంది" అని మీరు చెప్పనవసరం లేనంతగా మీ జీవితాన్ని చాలా అందంగా చేసుకోండి మరియు జీవించండి. మీరు ప్రకటించినా, ప్రకటించకపోయినా జీవితం ఎల్లప్పుడూ అందంగా ఉంటుంది. ఇంద్రియాలు జీవిత సౌందర్యం యొక్క సర్వశక్తిని పరిమితం చేస్తున్నందున మీ ఇంద్రియాలకు మరియు ఆలోచనలకు పైన జీవించండి. జీవితం అవ్వండి. తత్ సత్ - సత్ చిత్.
87-కర్మ - జన్మ
బ్రహ్మా హా హేమ హారే చ సురాపో గురు తల్పగః |
మహా పాతకి నో హేత్తౌ తత్సం సర్గీచ పంచమః ||
- దేవీ భాగవతం 11-15
భావం:-
బ్రాహ్మణుడిని చంపడం, బంగారాన్ని దొంగిలించడం, సురాపానం చేయడం, గురువు భార్యని అనుభవించడం అనే ఈ నాలుగూ మహాపాతకాలు. అయిదోది, ఇటువంటి పాపాలని చేసే వాళ్ళతో స్నేహం చేయడం.
🧘♂️92) అష్టావక్ర గీత🧘♀️
అధ్యాయం - 9
నిర్లిప్తత - ఉదాసీనత (నిర్వేదము)
సాధకుడు తన స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ముఖ్యంగా మూడు గుణాలను అభివృద్ధి చేసుకోవాలి అని అష్టావక్రులు అంటున్నారు.
1) నిర్వేదము (నిర్లిప్తత)
2) సమత
3) యుక్తి.
ఇందులో ప్రతి ఒక్కటీ మిగిలిన వాటి వల్ల ప్రభావితం అవుతుంది.
నిర్వేదము, సమత్వము లేనిదే తార్కికంగా యుక్తిపరంగా ఆలోచించడం సాధ్యం కాదు. నిర్వేదం ఉండాలంటే సమత్వ బుద్ధి, యుక్తి, సహాయం చెయ్యవలసిందే.
ఇలాగే సమత్వబుద్ధి ఉండడానికి మిగిలిన రెండూ ఉండి తీరవలసినదే. నిజానికి ఈ మూడూ కూడా శరీరమూ మనస్సూ బుద్ధి ద్వారా ఏకకాలంలో సాధింపబడాలి. అప్పుడే ప్రయోజనకరం కాగలవు.
బాహ్యవస్తుమయ ప్రపంచ ఆకర్షణ నుండి విడిగా నిర్లిప్తంగా ఉదాసీనంగా శరీరం ఉండాలి. రాగద్వేషాల ఆధారంగా మనస్సు తన యిష్టం వచ్చిన రీతిలో నర్తించడం మానాలంటే సమత్వభావం చాలా అవసరం. ఇంద్రియగోచరమయ్యే ప్రపంచం, కేవలం మనఃకల్పిత భ్రమ అనీ, భావనామాత్రమనీ శాస్త్రాధారంతో యుక్తి సహాయంతో బుద్ధి తెలుసుకోగలగాలి.
శరీరంతో తాదాత్మ్యమూ తద్వారా ప్రాపంచిక భోగాల మీద మక్కువా అహంకారాన్ని పటిష్టంచేసి అజ్ఞానాన్ని పెంచడానికి తోడ్పడతాయి. దీనికి నిర్వేదమే మందు.
ఈ భావం వల్ల వస్తు విషయభోగాలపై ఆకర్షణ తగ్గి సాధకుడు వాటి బంధం నుండి బయటపడతాడు. అప్పుడీ విషయభోగాలూ యిష్టాయిష్టాలూ వాటి కోసం శారీరకంగా బానిసవలె పడవలసిన శ్రమా తగ్గుతాయి.
ఈ ప్రపంచమంతా పంచమహాభూతాల (పృథివి, ఆపస్, తేజో, "యు, ఆకాశం) సమ్మేళనంతో తయారుకాబడింది. ఇవి వేరు వేరు
నిష్పత్తులలో కలిసి మహా ప్రపంచంగా రూపొందినవి. వాటిని యథాతథంగా చూస్తే నిజానికి ఎటువంటి విలువా లేదు.
కాని మన యిష్టాయిష్టాలూ రాగ ద్వేషాలూ ఆ వస్తువులను ఆవరించి వాటికి లేని విలువలను ఆపాదించి తమ ఉనికిని బలపరచుకుంటాయి.
ఈ కల్పిత మానసిక విలువలతో వస్తువులను సంపాదించుకోవడానికీ వదలించుకోవడానికి అనవరతము శ్రమపడుతూ, బాధామయమైన సంసారంలో చిక్కుకొని పోతున్నాము.
ఉదాసీనభావాన్ని వృద్ధి చేసుకుంటే కోరికలు నశిస్తాయి. కోరికలకు నిర్వేదమే మందు!
కోరికే సంసారం, నిర్వేదభావమే ముక్తికి మార్గం.
🕉🌞🌏🌙🌟🚩
🧘♂️12) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘♀️
12) శ్లోకం:-
మాతుః స్థితస్య జఠరే వచసాం చ దూరం దుఃఖం పునర్జనన కాల భవం దురూహ్యమ్ ।
బాల్యేఽపి దుఃఖ మవిషహ్య మవారణీయం ఆలోచ్య భీతి రధునా మహతే మమోత్థా ॥ 12
టీకా
చ = మఱియు, మాతుః జఠరే స్థితస్య = తల్లి గర్భంలో ఉన్నవానికి, వచసాం దూరం దుఃఖం = వాక్కులలో వచింపలేని దుఃఖం, పునః = తిరిగి, జనన కాల భవం = జనన సమయంలో సంభవించే (దుఃఖం), దురూహ్యం = ఊహించడానికి కూడా అలవి కానిది, బాల్యే అపి = పసితనంలో కూడా, దుఃఖం = బాధ, అవిషహ్యం = సహింప రానిది, అవారణీయం = నివారింపలేనిది, ఆలోచ్య = (వీటిని గురించి) యోచించగా, అధునా = ఇప్పుడు, మమ = నాకు, మహతే భీతిః = అమితమైన భయం, ఉత్థా = ఉదయించింది.
భావం:-
తల్లి గర్భంలో ఉన్న వానిది వచింపరాని దుఃఖం. జననకాలంలో సంభవించే దుఃఖం ఊహింపలేనిది. బాల్యంలో కూడా సహింపలేని దుఃఖం ఉన్నది. వీటిని గురించి యోచించడం వల్ల నాకు ఇప్పుడు చాలా భీతి కలుగుతుంది.
వివరణ:-
తల్లి గర్భంలో పిండం ఎదుగుతూండగా క్రమంగా తక్కువయ్యే చీకటి స్థలంలో ఉమ్మనీరు త్రాగుతూ తిరిగే జీవుడు తనకు ఏ కష్టం కలిగినా చెప్పుకోలేడు. తల్లి తెలివి తక్కువగా ఏమి చేసినా, తిన్నా అతనికి అపాయం. తల్లి మీద ఇతరులు అఘాయిత్యం చేసినా అతడికి ప్రమాదం.
ఇక పుట్టే సమయం, తల్లి గర్భాన్ని చీల్చుకొని బయటపడడం ఎంతో బాధకరం. తల్లికీ బిడ్డకి కూడా గండమే.
ఉదయించాక ఏడవడం తప్ప మరేమీ చేతగాని శిశువు నిస్సహాయంగా పడి వుంటాడు. ఎవరు ఏమి చేసినా స్వరక్షణ చేత గాదు. ఇవి అన్నీ అయిపోయాయి.
శిష్యుడు వయస్సులో ఉన్నవాడే. అయితే మున్ముందు ఇలాంటి జన్మలు ఎన్ని పొందాలో అనే భీతి అతన్ని వేధిస్తుంది.
🧘♂️82- ఒక యోగి ఆత్మకథ🧘♀️
(🖌️రచన :- శ్రీ పరమహంస యోగానంద)
అధ్యాయం : 20
మేము కాశ్మీరు వెళ్ళలేదు
“నాన్నగారూ, వేసవి సెలవుల్లో హిమాలయాల దిగువ కొండలకు నాతోబాటు రమ్మని, గురువుగారినీ మరో నలుగురు స్నేహితుల్నీ పిలుద్దామనుకుంటున్నాను. కాశ్మీరుకు ఆరు ట్రెయిను పాస్‌లూ, మా ప్రయాణం ఖర్చులకు సరిపడే డబ్బూ ఇస్తారా?”
నే ననుకున్నట్టుగానే, నాన్నగారు మనసారా నవ్వారు. “నువ్వీ కాకమ్మకథ చెప్పడం ఇది మూడోసారి. కిందటి వేసంగుల్లోనూ అంతకు ముందు వేసంగుల్లోనూ, ఇలాగే అడగలేదూ నువ్వు? చివరి క్షణంలో శ్రీయుక్తేశ్వర్‌గారు రామంటారు.”
“నిజమే నాన్నగారూ, కాశ్మీరు విషయంలో మా గురువుగారు ఖచ్చితంగా మాట ఎందుకివ్వడంలేదో నాకు అర్థంకాకుండా ఉంది. కాని, నే నప్పుడే మీ దగ్గర పాస్‌లు తీసేసుకున్నానని చెబితే, ప్రయాణానికి ఆయన ఒప్పుకుంటారని ఎందుకో అనిపిస్తోంది నాకు.”
అప్పటికయితే నాన్న గారికి నమ్మకం కలగలేదు. కాని ఆ మర్నాడు ఆయనే, కొన్ని పరిహాసాలతో నన్ను ఆటపట్టించిన తరవాత ఆరు పాస్‌లూ ఒక పదిరూపాయల నోట్ల కట్టా నా చేతి కిచ్చారు.
“నీ ఉత్తుత్తి ప్రయాణానికి ఇలాంటి ఆధరువులేవీ అక్కర్లేదనుకుంటాను; అయినా ఇవిగో!” అని వ్యాఖ్యానించారు నాన్న గారు.
ఆరోజు మధ్యాహ్నం నేను దండుకున్నవి తెచ్చి శ్రీయుక్తేశ్వర్ గారి ముందు ప్రదర్శించాను. నా ఉత్సాహం చూసి ఆయన చిరునవ్వు చిందించారే కాని, ఆయన మాటలు మట్టుకు ఎటూ తేల్చలేదు: “నాకూ రావాలనే ఉంది; చూద్దాం.” వారి ఆశ్రమ విద్యార్థి అయిన కనాయిని కూడా తీసుకువెళ్దామని అన్నప్పుడు ఆయన ఏమీ వ్యాఖ్యానించలేదు.
మరో ముగ్గురు స్నేహితుల్ని కూడా మాతో రమ్మని చెప్పాను.-- రాజేంద్రనాథ్ మిత్రా, జోతిన్ ఆడీ, మరో అబ్బాయి. మరుసటి సోమవారంనాడు బయల్దేరాలని నిర్ణయమైంది.
శని, ఆదివారాలు రెండు రోజులూ కలకత్తాలో ఉండిపోయాను; మా చుట్టాలబ్బాయి పెళ్ళి తతంగమంతా కలకత్తాలో మా ఇంట్లోనే జరుగుతోంది. నా సామాను తీసుకుని, సోమవారం పొద్దుట శ్రీరాంపూర్‌లో దిగాను. రాజేంద్ర ఆశ్రమ ద్వారం దగ్గర నన్ను కలుసుకున్నాడు.
“గురుదేవులు బయటికి షికారుకువెళ్ళారు. ఆయన రామంటున్నారు”
ఆ మాటకు నాకు ఎంత విచారం కలిగిందో అంత పట్టుదల కూడా పెరిగింది. “కాశ్మీరు వెళ్ళడానికి నేను భ్రమతో వేసిన పథకాలను నాన్నగారు మూడోసారి కూడా పరిహాసం చేసే అవకాశం నే నివ్వను. మిగిలిన వాళ్ళమే వెళ్ళాలి.”
రాజేంద్ర ఒప్పుకున్నాడు; ఒక నౌకరును సంపాదించడానికి నేను ఆశ్రమం నుంచి వెళ్ళాను. గురుదేవులు లేకుండా, కనాయి ప్రయాణం కట్టడని నాకు తెలుసు; పైగా మా సామాను కాపలా కాయడానికి ఎవరో ఒకరు అవసరం. బిహారి నా మనస్సులో మెదిలాడు. అతను వెనక మా ఇంట్లో నౌకరు. ఇప్పుడు శ్రీరాంపూర్‌లో ఒక ఉపాధ్యాయుడి దగ్గర పని చేస్తున్నాడు. నేను వడివడిగా నడుస్తూ పోతుండగా, శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్ దగ్గరున్న క్రిస్టియన్ చర్చి కి ఎదురుగా గురుదేవులు తారసపడ్డారు.
“ఎక్కడికెళ్తున్నా వోయ్?” శ్రీయుక్తేశ్వర్‌గారి ముఖంలో చిరునవ్వన్నమాటే లేదు.
“గురుదేవా, మనమనుకున్న ప్రకారం ప్రయాణం చెయ్యడానికి మీరు, కనాయీ రావడంలేదని విన్నాను. బిహారికోసం వెతుకుతున్నాను. కిందటేడు, కాశ్మీరు చూడ్డానికి అతనెంతో మనసుపడ్డాడనీ, జీతంలేకుండా పనిచేస్తానని కూడా అన్నాడనీ మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది.”
“ఔను, జ్ఞాపకముంది. అయినా బిహారి, రావటానికి ఒప్పుకుంటాడని అనుకోను.”
దాంతో నా సహసం సన్నగిలింది. “సరిగా ఈ అవకాశం కోసమే అతను ఆత్రంగా ఎదురు చూస్తున్నాడండి!” అన్నాను.
మా గురుదేవులు మౌనంగా మళ్ళీ నడక సాగించారు. నేను కాసేపట్లోనే స్కూలు మాస్టరుగారి ఇల్లు చేరుకున్నాను. బిహారి ముంగిట్లోనే ఉన్నాడు; ఆప్యాయంగా నవ్వుతూ పలకరించినవాడల్లా, నేను కాశ్మీరు మాట ఎత్తేసరికి చటుక్కున మాయమయాడు. క్షమార్పణ చెప్పుకుంటున్నట్టుగా ఏదో గొణిగి యజమాని ఇంట్లోకి దూరాడు. నేను అరగంట సేపు అక్కడే పడిగాపులు పడి ఉన్నాను; బిహారి ఆలస్యానికి కారణం, ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడమేకాని మరేం కాదని అంతసేపూ నన్ను నేను సమాధానపరుచుకుంటున్నాను. చివరికి వీథి తలుపు తట్టాను. “బిహారి దాదాపు అరగంట క్రితం, వెనకవేపు మేడమెట్లు దిగి వెళ్ళిపోయాడు,” అని చెప్పా డొకాయన. రవ్వంత చిరునవ్వు ఆయన పెదవులమీద తొణికిసలాడింది.
అక్కణ్ణించి దిగాలుపడి వస్తూ, బిహారిని మాతో రమ్మని పిలవడంలో ఏమైనా బలవంతం చేస్తున్నట్లు ఉందా, లేకపోతే గురుదేవులు అదృశ్య ప్రభావం ఏమైనా పనిచేస్తుందా అని తర్కించుకున్నాను. క్రిస్టియన్ చర్చి దాటి వెళ్తూ మళ్ళీ మా గురుదేవుల్ని కలిశాను; ఆయన నావేపే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. నేనేం చెప్తానో వినకుండానే ఆయన ఇలా అన్నారు:
“అయితే బిహారి రాడన్నమాట! మరిప్పుడు నీ ప్రయత్న మేమిటి?” అదుపాజ్ఞలు పెట్టే తండ్రిని ధిక్కరించడానికి నిశ్చయించుకున్న మొండి పిల్లవాడిలా మొరాయించింది నా మనస్సు. “మా బాబయ్యని, తన దగ్గర పనిచేసే లాల్‌ధారి అనే నౌకర్ని పంపించమని అడుగుతానండి.”
“కావాలంటే మీ బాబయ్యని కలుసుకో,” అన్నారు శ్రీయుక్తేశ్వర్ గారు, ముసిముసిగా నవ్వుతూ. “కాని వెళ్ళినందుకు నువ్వు సంతోషిస్తావని మాత్రం నా కనిపించడం లేదు.”
ఆ మాటకు నేను కీడు శంకించినా, నాలో తిరుగుబాటుతనం తలఎత్తింది; గురువుగారిని విడిచిపెట్టి శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్‌లో అడుగు పెట్టాను. మా బాబయ్య శారదా ఘోష్ అక్కడ గవర్నమెంటు ప్లీడరు. ఆయన నన్ను ఆప్యాయంగా చేరదీశాడు.
“ఈవేళ నేను కొంతమంది స్నేహితులతో కలిసి కాశ్మీరుకు బయల్దేరుతున్నాను.” అని చెప్పాను. “ఈ హిమాలయ యాత్రకోసం ఎన్నో ఏళ్ళనుంచి ఎదురు చూస్తున్నాను.” అన్నాను. “చాలా సంతోషం ముకుందా. నీ ప్రయాణం మరింత సుఖంగా జరగడానికి నేను చెయ్యగలిగింది ఏమన్నా ఉందా?”
ఆదరపూర్వకమైన ఈ మాటలలో నాలో ఉత్సాహం పెల్లుబికింది. “బాబయ్యా, నువ్వు మీ నౌకరు లాల్‌ధారీని పంపించగలవా?”
నా ఈ చిన్న విన్నపం భూకంపం పుట్టించినంత పని చేసింది. మా బాబయ్య కుర్చీలోంచి విసురుగా లేచేసరికి, కుర్చీ తిరగబడి, బల్లమీది కాయితాలు అన్ని వేపులకీ చెల్లాచెదరుగా ఎగిరిపోయి, కొబ్బరి చిప్పతో చేసిన, ఆయన పొడుగాటి హుక్కాగొట్టం చటుక్కున కిందపడి పెద్ద రణగొణధ్వని అయింది.
“ఓరి స్వార్థపరుడా! ఎంత విపరీతపు ఆలోచన! నా నౌకర్ని కాస్తా నువ్వు నీ విలాసయాత్రకి తీసుకుపోతే, ఇక్కడ నా అవసరాలు చూసేవాళ్ళెవర్రా?” అంటూ కోపంతో ఊగిపోతూ అరిచాడాయన.
శ్రీమన్నారాయణీయము దశమ స్కంధము 72వ దశకము - అక్రూరుని ఆగమనము - 72 - 5 & 6 - శ్లోకములు
72-5
భూయః క్రమాదభివిశన్ భవదంఘ్రిపూతం
బృందావనం హరవిరంచసురాభివంద్యమ్।
ఆనందమగ్న ఇవ లగ్న ఇవ ప్రమోహే
కిం కిం దశాంతరమవాప న పంకజాక్ష॥
5వ భావము :-
పంకజాక్షా! భగవాన్! అక్రూరుడు అట్లు ప్రయాణము చేసి చేసి, తుదకు - నీ పాదస్పర్శతో పునీతమయినది, బ్రహ్మరుద్రాదిదేవతలకు సహితము వందనీయమయినది - అగు - బృందావనమును ప్రవేశించెను.
ఆ సమయములో అక్రూరుడు మహదానందమునే పొందెనో! లేక ఆనందపారవశ్యముననే మునిగెనో! అతని హృదయము ఎన్నెన్ని విధములుగా స్పందించి ఆనందించెనో - చెప్పశక్యము కాదు.
72-6
పశ్యన్నవందత భవద్విహృతిస్థలాని
పాంసుష్వవేష్టత భవచ్చరణాంకితేషు।
కిం బ్రూమహే బహుజనా హి తదాపి జాతాః।
ఏవం తు భక్తితరలా విరలాః పరాత్మన్॥
6వ భావము :-
ఆకాలములో ఎందరో భక్తులు జన్మించి ఉండవచ్చును. కాని, అక్రూరునివంటి పరమభక్తులు మాత్రము ఏకొద్దిమంది మాత్రమో ఉండి ఉందురు. అక్రూరుడు బృందావనమును చేరి - అచ్చట నీవు విహరించిన స్థలములను చూచి పులకాంకితుడయ్యెను;
సంతోషముతో రథముదిగి - భక్తిపారవశ్యముతో - నీ పాదస్పర్శతో పునీతమయిన ఆ ధూళిని తనశరీరమున ధరించెను. అప్పుడు అతడు పొందిన ఆనందము వర్ణనాతీతము.
____
శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)
672) శ్లోకము :-
ఉతాహో! తన్వంగ్యాం భృగుకుల
విధాత్య్రాం పితృగిరా
తనూజేన చ్ఛిన్నే శిరసి
భయాలోకాక్షినలినే!
న్యధా స్తేజో భీమం నిజ
మయి యదక్షుద్ర మనఘం
తదాహు స్త్వా మమ్బ!
ప్రథిత చరితే కృత్తశిరసమ్!! 672
పదవిభజన:-
భావము:-
తల్లీ ! ఓ ఉమాదేవి!
తండ్రి ఆజ్ఞ ప్రకారము పరశురాముడు
భృగు వంశ విధాత్రి,
అనగా మూల కర్త జమదగ్ని భార్య ,
తల్లి అగు
రేణుకా దేవిని
తన పరశువుతో ఖండించు నప్పుడు,
ఆ రేణుక దేవి అందు
ఉత్తమము, పవిత్రము, ఉగ్రము
అగు నీ తేజస్సును ప్రవేశింప చేసితివి.
కనుకనే ఆమె బ్రతక గలిగెను.
అందుచే కూడ నిన్ను
చ్ఛిన్న మస్తక
అని పిలుతురు.
673) శ్లోకము :-
హుతం ధారాజ్వాలా జటిల
చటులే శస్త్రదహనే
తపస్విన్యాః కాయం భగవతి!
యదాంబ! త్వమవిశః!
తదా తస్యాః కంఠ
ప్రగలదసృజః కృత్తశిరసః
కబంధేన ప్రాప్తో భువన
వినుతః కోఽపి మహిమా!! 673
పదవిభజన:-
భావము:-
తల్లీ ! ఓ ఉమాదేవి!
పరశురాముని
సాంద్రము , జటిలము,
శ్రీఘ్రము, ప్రచలము
అగు పరశువు నుండి
అవిచ్ఛిన్న రక్తధార కారగా
అగ్ని జ్వాల ధారచే
హోమము చేయునట్లుండెను.
ఖండించబడు రేణుకాదేవి దేహమున
చ్ఛిన్న మస్తకవైన నీవు
ఆవేశించినందు వలన,
ఆమె కంఠము విడివడిన మొండెము నుండి
బయటకు విరజిమ్ము చున్న రక్తము
నీ మహిమ పొంది ఉండ వచ్చును.
సూచన: -
చ్ఛిన్నమస్తక అవతారమున
దేవి తన కుడి చేతి కత్తితో
కంఠమును తెగనరికికొని
తన ఎడమ చేతిలో శిరస్సు పట్టుకొనును.
మొండెము నుండి మూడు ధారలుగా
రక్తము పైకి చిమ్ముచుండును.
మధ్య ధార ఆమె చేతిలోని శిరసులో పడుచుండును.
మిగిలిన రెండు ధారలను ఆమె చెలికత్తెలు స్వీకరింతురు.
___
🧘♂️382) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️
స్థితి ప్రకరణము
రెండవ అధ్యాయము
దామ వ్యాళ కటోపాఖ్యానము
2-97
బలీవర్దవదామగ్నం మనో మదనపల్వలే
అలూనశీర్ణావయవం బలాద్రామ సముద్ధర.
ఓ రామచంద్రా! కామమను దొరువునందు ఎద్దువలె చిక్కుకొని పోయినదియు, ఛిన్నాభిన్నములైన అవయవములు గలదియు నగు ఈ మనస్సును బలాత్కారముగ ఉద్ధరింపుము.
2-98
శుభాశుభప్రసరపరాహతాకృతౌ
జ్వలజ్జరామరణ విషాద మూర్ఛితే
వ్యథేహ యస్య మనసి భో న జాయతే
నరాకృతిర్జగతి స రామ రాక్షసః.
ఓ రామచంద్రా!
కామ్యకర్మల యొక్కయు నిషిద్ధకర్మల యొక్కయు వ్యాప్తిచే మలినమైన ఆకృతిగలదియు, ప్రజ్వలితములగు వార్ధక్య, మరణ దుఃఖములచే మూర్ఛ నొందినదియు నగు తన మనస్సును జూచియు ఎవనికి బాధ జనింపకుండునో (దాని నుద్ధరించుటకు ఎవడు యత్నింపకుండునో) అట్టివా డీ ప్రపంచమున మనుజ వేషమున నున్న రాక్షసుడే యగును.
2-99
ఆశాపాశశతాబద్ధా వాసనాభావధారిణః కాయాత్కాయముపాయాన్తి వృక్షాద్వృక్ష మివాణ్డఙాః
పెక్కు ఆశలను త్రాళ్ళచే గట్టబడిన వారును, వాసనాయుక్తులు నగు (అజ్ఞాన) జీవులు ఒక వృక్షమునుండి మఱియొక వృక్షమును పక్షులు పొందులాగున ఒక దేహమునుండి మఱియొక దేహమును పొందుచున్నారు.
300 రోజులుగా ప్రతి రోజు ఒక పాటను వ్రాస్తు
నేడు 300 వ పాట ను పూర్తి చేయడం చాలా ఆనందంగా వుంది. Facebook వివిధ గ్రూపులలో
నిరంతరం గా వ్రాయడం జరిగింది.. అభిమానించి ఆదరించిన సోదర సోదరీ మణులకు నమస్సులు.
అలాగే అడ్మిన్స్ కు ధన్యవాదాలు🌹🌹🌹🌹🌹
శ్రీ శంకరాచార్యకృత నిర్వాణ మంజరీ
(ఈ స్తోత్రమున నిషేధ ప్రక్రియతో శుద్ధ పరబ్రహ్మ తత్వమే ఆత్మ తత్త్వమని నిరూపింపబడుచున్నది.)
1) అహం నామరో నైవ మర్యోనదైత్యో న గంధర్వరక్షః పిశాచ ప్రభేదః |
పుమా న్నైవ నస్త్రీ తథా నైవ షండః ప్రకృష్ట ప్రకాశ స్వరూప శ్శివోహమ్||
-నేను దేవ జాతివాడను కాను, మానవజాతివాడను కాను, దైత్య జాతివాడను కాను. గంధర్వులు, రాక్షసులు, పిశాచములు అను విభాగములలోని వాడనుకాను - పురుషుడను కాను - స్త్రీని కాను - నపుంసకుడను కాను. కాని సర్వోత్కృష్ట సర్వావభాసక చిత్రప్రకాశ స్వరోపుడగు శివుడనే (పరబ్రహ్మ వస్తువు) నేనై యున్నాను.
2) అహం నైవ బాలో యువా నైవ వృద్ధా న వర్జీ నచ బ్రహ్మచారీ గృహస్థః |
వనస్థోపి నాహం న సన్యస్తధర్మా జగజ్జన్మ నాశైక హేతు శ్శివోహమ్||
-నేను బాలుడను గాని, యువకుడను గాని, వృద్ధుడను కాను. నిరంతరము వేదాధ్యయన నిష్ఠ గలిగిన బ్రహ్మచారిని గాని, గృహస్థుడనుగాని, వానప్రస్థాశ్రమస్థుడను.గాని, సన్యాసాశ్రమస్థుడను గాని కాను - కాని సర్వజగత్సృష్టి స్థితిలయములకు ఏకైక కారణమగు శివుడనే (పరబ్రహ్మ వస్తువునే) నేనై యున్నాను.
3) అహం నైవ జ్ఞేయ స్తిరోభూత మాయ స్తధై వేక్షితుం మాం పృథఙ్నస్త్యుపాయః |
సమాక్లిష్ట కాయత్రయో వ్యద్వితీయ స్సదా తీంద్రియ స్సర్వరూప శ్శివోహమ్||
నేను జ్ఞానగమ్యుడను (తెలియబడువాడును) కాను - మాయాతీతుడను. నన్ను కనుగొనుటకు వేరు ఉపాయములు లేవు. (నన్ను ఆశ్రయించిన నే మాయను తరించి నన్ను తెలిసికొని నన్ను పొందగల్గుదురు). నేను స్థూలము సూక్ష్మము కారణము అను మూడు దేహములతో కూడుకొనియున్నవాడనైనను - సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనివాడనే - నేను కాలత్రయమునందును - అతీంద్రియుడును, విశ్వాత్మకుడును నగు శివస్వరూపుడనే (పరబ్రహ్మ వస్తువునే) అయి యున్నాను.
4) అహం నైవ మన్తా న గన్తాన వక్తా న కర్తా న భోక్తా న ముక్తాశ్రమస్థః |
యధాహం మనోవృత్తి భేదస్వరూప స్తదా సర్వవృత్తిప్రదీప శ్శివోహమ్ ||
-నేను ఆలోచనలు చేయువాడను గాని, గమనము చేయువాడను గాని, మాటలాడువాడను గాని, కార్యములను చేయువాడను గాని, భోగముల ననుభవించు వాడను గాని, యత్యాశ్రమము నందున్నవాడను గాని కాను. సర్వవిధములగు మనోవృత్తి భేదములన్నియు నా స్వరూపములే. అట్లే ఆ మనోవృత్తులను ప్రకాశింప జేయువాడగు శివస్వరూపుడనే (పరబ్రహ్మ వస్తువునే) నేనై యున్నాను.
5) నమే లోకయాత్రా ప్రవాహ ప్రవృత్తి ర్నమే బంధబుద్ధ్యా దురీహానివృత్తిః |
ప్రవృత్తిర్నివృత్తిశ్చ చిత్తస్య వృత్తి ర్యత స్త్వన్వహం తత్స్వరూప శ్శివోహమ్ ||
నాకు ఈ లోక యాత్రయే సంబంధించి సర్వమానవ సాధారణమగు ప్రవృత్తియు లేదు. నేను సంసార బంధమున తగుల్కొని యుంటిని. ఈ బంధమును తొలగించు కొనవలయునను తలంపుతో నిషిద్ధ కర్మములు వగైరాలను చేయకయుండుట యను నివృత్తియును లేదు. ఈ నివృత్తియు, ప్రవృత్తియు ఈ నా చిత్తము (అంతఃకరణము) యొక్క వ్యాపారములు కాని నావి కావు. కాన నేను ఎల్లప్పుడును నిష్క్రియ పరబ్రహ్మ స్వరూపుడౌ శివుడనే అయి యున్నాను.
6) నిదానం య దజ్ఞానకార్యస్య కార్యం వినా యస్య సత్త్వం స్వతో నైవ|
భౌతి యదాద్యన్త మధ్యాన్త రాలా నరాల ప్రకాశాత్మకం స్యాత్తదేవాహమస్మి ||
ఎయ్యెది అజ్ఞానము వలనను ఉత్పాదితమైన సమస్త ప్రపంచమునకు మూల కారణమగుచున్నదో, దేనియొక్క సత్తాచేతనే (ఉనికిచేతనే) కార్యమగు ఈ దృశ్య ప్రపంచమంతయు సత్త (ఉనికి) కలదివలె భాసించుచున్నదో, ఎయ్యది సమస్త దృశ్య పదార్థముల యొక్క ఆద్యంత మధ్యభాగముల యందును, అంతరాలాంతరాళముల యందును (లోలోపలి భాగములందును) ప్రకాశాత్మకమైవర్తించుచుండునో అట్టి సర్వకారణ కారణమైన -సదాత్మకమైన-చిదాత్మకమైన పరబ్రహ్మ వస్తువు నేనై యుంటిని.
7) యతోహం న బుద్ధి ర మే కార్యసిద్ధి ర్యతో నాహ మంగం నమే చాంగభంగ |
హృదాకాశవర్తీ గతాంగ త్రయార్తిః సదా సచ్చిదానందమూర్తి శ్శివోహమ్ ||
-బుద్ధియను వస్తువు నేను కాను. కాని బుద్ధిచే సంకల్పింపబడిన కార్యముల యొక్క సిద్ధి నాదియు కాదు. స్థూల సూక్ష్మాది దేహములు నేను కాను (సూక్ష్మ దేహమునకు లింగ దేహమను సంజ్ఞ కలదు. అది కారణ దేహమగు అవిద్య యొక్క కార్యము. ఆత్మతత్వ విజానము కలుగగా అవిద్య నశించును. కారణమగు అవిద్య.
8) లింగభంగము అని అందురు. ఇయ్యది ముక్తిహేతువు అని శాస్త్ర ప్రవాదములు కలవు. లింగభoగ మనునది లింగ (సూక్ష్మ) దేహమునకు సంబంధించినదియే యగును గాని ఆత్మకు సంబంధించినది కాదు. ఈ యంశమిచట వర్ణింపబడుచున్నది. నేను ఎల్లపుడును హృదయాకాశ మధ్యవర్తియు స్థూల సూక్ష్మకారణ దేహములకు సంబంధించిన బాధ లేమాత్రమును లేనట్టి సచ్చిదానంద స్వరూపుడగు శివ స్వరూపుడనే అయియుంటిని.
8) య దాసీ ద్విలాసా ద్వికారో జగద్య ద్వికారాశ్రయో నాద్వితీయత్వతస్స్యాత్||
మనోబుద్ధి చిత్తాహ మాకారవృత్తి ప్రవృత్తిర్యతస్స్యాత్త దేవాహమస్మి ||
ఏది లీలా మాత్రముగ ఈ దృశ్యమాన జగత్తుగా తాను అయ్యెనో ఏది స్వతః తాను అద్వితీయమై (స్వగతాది భేదములేని) ప్రపంచమునకు ఆశ్రయము కాకయే శుద్ధమై యుండెనో; దేని నుండి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అను అంతః కరణము యొక్క వృత్తులు బయలుదేరుచున్నవో అట్టి పరమశివ (పరబ్రహ్మ) తత్త్వమే నేనై యుంటిని.
8) యదస్తర్బహి ర్వ్యాపకం నిత్యశుద్ధం యదేకం సదా సచ్చిదానందకన్దమ్ |
యత స్థూల సూక్ష్మ ప్రపంచస్య భానం యత స్తత్ప్రసూతి స్తదేవాహ మస్మి ||
- ఏది నిత్యశుద్ధమైనదో, ఏది సచ్చిదానంద ఘనమైనదియో, దేని వలన స్థూల సూక్ష్మ ఏది సర్వ దృశ్యపదార్థ జాతమునందు బాహ్యాభ్యంతర వ్యాప్తియై యుండెనో; ప్రపంచములకు ప్రకాశ మేర్పడుచున్నదో; దేని నుండి ఈ ప్రపంచము ఏర్పడుచున్నదో; అట్టి పరబ్రహ్మ తత్త్వమే నేనై యుంటిని.
10) య దర్కేందు విద్యుత్ప్రభాజాల మాలా విలాసాస్పదం య త్స్వభేదాదిశూన్యమ్ |
12) సమస్తం జగ ద్యస్యపాదాత్మకం స్యా దృత శ్శక్తి భావం తదేవాహ మస్మి ||
-ఏది సూర్యుని యొక్కయు, చంద్రుని యొక్కయు, మెరుపుల యొక్కయు నానావిధ కాన్తి పుంజములకు మూలమై యుండెనో (ఎవని కాంతిచే నవి కాంతివంతము లగుచున్నవో) ఎయ్యది సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిదియో - ఈ సమస్త ప్రపంచమును ఎవని యొక్క అంశ మాత్రమే అయి యుండెనో - సమస్త ప్రపంచమునకు కారణమైన మాయాశక్తియు దేనివలన ప్రకాశించుచు నుండెనో అట్టి పరబ్రహ్మ తత్త్వమే నేనై యుంటిని.
11) యతః కాలమృత్యుర్బిభేతి ప్రకామం యత శ్చిత్త బుద్దీంద్రియాణాం విలాసః |
హరి బ్రహ్మ రుదేంద్ర చంద్రాదినామ ప్రకాశో యత స్స్యాత్తదేవాహ మస్మి ||
-దేని భయము వలన మృత్యు దేవతయు మిక్కిలి భయపడుచు స్వకార్యములను నిర్వర్తించుచున్నదో, దేనినుండి సర్వజీవుల జ్ఞానేంద్రియములును ఆయా జ్ఞానములను సంపాదించగలుగుచున్నవో, దేనివలన హరియని, బ్రహ్మయని, రుద్రుడని, ఇంద్రుడని, చంద్రుడని బహువిధములగు నామములు విలసిల్లుచున్నవో అట్టి పరబ్రహ్మ తత్త్వమే నేనై యుంటిని.
12) యదాకాశవత్సర్వగం శాంతరూపం పరం జ్యోతి రాకారశూన్యం వరేణ్యమ్ |
య దాద్యన్త శూన్యం పరం శంకరాఖ్యం యదన్తర్విభావ్యం తదేవాహ మస్మి ||
-ఏది ఆకాశమువలె సర్వవ్యాపకమైనదో - ఏది ప్రశాంతమగు స్వరూపము గలదియో-ఏది ఏ విధమైన ఆకారములు లేని ప్రార్ధనీయమగు పరమజ్యోతి స్వరూప మైనదియో-ఏది ఆద్యంతరహితమైనదియో-ఏది హృదయాంతర్భాగము ననే భావింప దగినదియో అట్టి సర్వోత్కృష్టమగు శంకరాయినుగు పరబ్రహ్మతత్వమే నేనే అయియుంటిని.
****
🧘♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘♀️
23వ శ్లోకం:-
భక్తాపాయ భుజంగ గారుడమణి: త్త్రైలోక్య రక్షామణి:
గోపీలోచన చాతకాం బుదమణి: సౌందర్య ముద్రామణి:!
య: కాంతామణి రుక్మిణీ ఘనకుచ ద్వంద్వైక భూషామణి:
శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో గోపాల చూడామణి:!!
భావం:-
సంసార వ్యాధిగ్రస్థులకు ఆ వ్యాధి నివారణకు మణిమంత్రఔషధములను ఉపదేశించుచున్నారు. దేవతాశిఖామణి గోపాలచూడామణి మనకు శ్రేయస్సు ఒసంగుగాక! దేవతాంతరముల కంటె గోపాలుడగు శ్రీకృష్ణదేవుడు శ్రేయస్సులు ఒసంగుటలో సులభుడు. అతడు కాంతామణి అగు రుక్మిణీదేవి కుచద్వంద్వమునకు అనన్య సాధారణమగు భూషణమణి. సాక్షాత్ లక్ష్మియే రుక్మిణి. వారిద్దరూ మణి, మణిప్రభలవలె ఒకరినొకరు విడువకుందురు. అందుచే ఆ రుక్మిణీ మనోవల్లభుడే మనకు శ్రేయఃప్రదుడు. ఆ విధంగా ఆమెకు అలంకారముగా ఉండుటచే అతడు సౌందర్యముద్రామణి. లోకములో ఇది అందమైన వస్తువని నిరూపించుటకు ఆ కృష్ణసౌందర్యము ముద్ర పడవలెను. ఆ అందమును చూసి పరవశులై గోపికలు తమ లోచన చాతకములచే ఆ కృష్ణమేఘమునే సేవించుచుందురు. ఈ మేఘము కేవలము చాతకములనే కాదు, మూడులోకములను తన కృపాశక్తిచే రక్షించుమణి. ఈ రక్షామణి మూడులోకములను రక్షించునదియే ఐనను భక్తుల పట్ల గారుడ, మణియై వారికీ కలుగు అపాయములనెడి భుజంగములను దరిచేరకుండ తొలగించు.
🕉🌞🌎🌙🌟🚩
నా దృష్టిలో ఎవరైనా తనను తాను అల్పుడినని, హీనుడనని తలచడమే మహా పాతకం, అజ్ఞానం.
🕉🌞🌎🌙🌟🚩
జాగృతి
స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు
అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి, దాన్ని సాధించేందుకు మీ జీవితాన్నంతా ధారపోయండి.
🧘♂️విస్తరణ🧘♀️
ప్రతి నిమిషము అనంతకాలమే; ఎందుకంటే ఆ నిమిషంలో అనంతకాలమును అనుభవించవచ్చు. ప్రతిదినము, ప్రతిగంట, ప్రతి నిముషము అనే కిటికీ గుండా మీరు అనంతకాలమును చూడవచ్చు. జీవితం క్షణికం.ఐనప్పటికీ అనంతం. ఆత్మ శాశ్వతమైనది కాని ఈ జీవితమనే స్వల్ప ఋతువులోనే అమరత్వమనే ఫలసాయాన్ని వీలయినంతగా కోసుకోవాలి.
శ్రీ పరమహంస యోగానంద / యోగదా సత్సంగ పాఠాలు
భూప్రదక్షణ షట్కేన కాశీ యాత్రాయుతేన చ |
సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే ||
భావం:- ఆరు సార్లు సంపూర్ణ భూప్రదక్షణము, నూరు సార్లు సముద్ర స్నానము, పదివేల సార్లు కాశీయాత్ర చేసిన ఫలము, ఒక్క సారి తల్లికి నమస్కరించిన దానితో సమానము.
***
02- శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచితము - సిద్ధాశ్రమయోగులు
2-సిద్ధభూమిక:-
1947లో ద్వితీయ ప్రపంచ సంగ్రామం తర్వాత అమెరికా విమానసేనా నాయకులలో ఒకడు ఎడ్మిరల్ బర్డ్ ఒక చిన్నవిమానంలో ఆర్కిటిక్ ఉత్తర ధ్రువ ప్రాంతాల వైపు వెళ్ళాడు.
విమానం యాంత్రిక లోపం వల్ల చెడిపోయింది. వెంటనే వద్దామని వెళ్ళినందువల్ల ఆహారం - నీరు ఎక్కువnలేవు. ఆ మంచులో మరణించక తప్పదన్న స్థితిలో ఒక మంచు పేళ్ళ పైకి లేచింది.
అందులోనించి ఒక మానవుడు పైకి వచ్చి యితనిని పిలిచి ఆ మంచు పెళ్ళ క్రింద ఉన్న గుహలోకి తీసుకు వెళ్ళి చిక్కని ఆకుపచ్చ ద్రవంnఆహారంగా ఇచ్చాడు. దానిని తీసుకుంటే శక్తి - ఓపిక వచ్చింది. ఇప్పుడు నీకిచ్చిన ఆహారం కొన్ని రోజుల దాక బలాన్ని నిలుపుతుందని ఆ వ్యక్తి ఇతనికి చెప్పాడు.
అక్కడ ఉన్న మరికొందరికి ఇతనిని పరిచయం చేశాడు. వారంతా వందల వేల సంవత్సరాల వయస్సు గలవారు. ఆ గుహలోపలికి వెళ్ళగా ఇండ్లు, మనుషులు భూసొరంగాలలో కనిపిస్తున్నవి.
మీ దేశాధిపతులు అణుబాంబులు ప్రయోగించి మానవజాతి నాశనానికి కారకులవుతున్నారు.అలా చేయవద్దని హెచ్చరించటానికే నిన్నిక్కడికి అనుమతించాము అని వారు బర్డకు తెలియజేశారు. అతని అభ్యర్థనపై అక్కడి విశేషాలు మరికొన్ని తెలిపారు.
భూమిలో ఇటువంటి పట్టణాలు ఎన్నో ఉన్నవట. వీటన్నిటి కేంద్రం శంబళ గ్రామం. అక్కడ భగవంతుడు పరిపాలకుడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు.
ఆయన పరివారంలోని వారే ఈ భూగర్భవాసులు. వీరంతా దీర్ఘ కాలజీవులు. ప్రపంచంలోని ఎన్నో ప్రదేశాలలో సొరంగాల ద్వారా ఈ పట్టణాలకు త్రోవలున్నవి.
హిమాలయాలు, ఈజిప్టులోని పిరమిడ్లు, టిబెట్లోని లాసా ప్రాంత గుహలు, అమెరికాలోని కొలరాడో పర్వత కందరాలు ఇటువంటి చోట్ల నుండి భూమిలోకి మార్గాలున్నవి.
యమునానదిలోని ఒక రహస్య మార్గం ద్వారా ద్వాపరాంతంలో బృందావనంలో నందుని వరుణభటుడు మకరరూపంలో వచ్చి తీసుకువెళ్లే శ్రీకృష్ణుడు వెళ్ళి తండ్రిని విడిపించి తీసుకువచ్చాడు.
అమెరికాలో డెన్వర్ దగ్గర కొండ గుహలో మాయన్ జాతి అవతార పురుషుడు జ్వాలాకూలుడిప్పటికీ ఉండి శంబళ గ్రామంతో సంబంధాలు కలిగి ఉన్నాడు.
ఇటువంటి నమ్మలేని విశేషాలెన్నో ఎడ్మిరల్ బర్డ్ విన్నాడు. వారతనివిమానం బాగు చేయించి పంపించారు. అతడు తిరిగి వచ్చి తనపై అధికారులకి విశేషాలు చెపితే వారు భ్రాంతులని కొట్టివేశారు. సైన్య నిబంధనలను బట్టి సర్వీసులో ఉండగా రహస్యంగా ఉంచి రిటైరైన తర్వాత ఇవన్నీ పుస్తకంగా వ్రాయించాడు.
ఈ గ్రంథంలో భూమిలోని ఈ జాతులను గురించి చాలా విశేషాలున్నవి. ఈజిప్టులోని గిజా పిరమిడ్ లోని భూసొరంగం ద్వారా లోపలికి మార్గమున్నదట.
లోపలివారు శక్తిమంతమైన ఛానెల్సు ద్వారా భూమి మీద కొందరితో సంబంధం పెట్టుకొంటుంటారు. ఎలమౌర్య అనే ఛానెల్ కు నికొలస్ రోరిచ్ అనే రష్యన్ మీడియంగా ఉన్నాడు.
భూమి లోపలి టెలోస్ అనే నగరం నుండి షర్ములా,షీల్డ్ అనే భార్యభర్తలు చానే అన్న స్త్రీని మీడియంగా ఎన్నుకొని అక్కడివిశేషాలు తెలుపుతున్నారు. మౌంట్ శాస్త క్రింద పెద్దనగరం ఒకటి ఉన్నది. అందులో చాలామంది యోగులున్నారు.
ఎమర్సన్ అనే రచయిత స్మోకీగాడ్ అన్న గ్రంథం 1908లో ప్రచురించాడు. అందులో ఓలాఫ్ జాన్సన్ అనే నార్వే దేశస్థుని అనుభవాలు వ్రాశాడు. ఆ జాన్సన్ రెండు సంవత్సరాలు భూగర్భ నగరంలో ఉన్నాడట.
హిమాలయాలో షోనేషా అన్న రహస్య పట్టణం లామాల కాపలా క్రింద ఉంది. దాని జనాభా 3/4 మిలియన్లు. అలానే చైనా, మంగోలియాలో షింగ్వా అనే భూగర్భ నగరం జనాభా కూడా 3/4 మిలియన్లు.
భారతదేశంలో జయపూర్ దగ్గర రామనగర్ - ఇటువంటిదే. వీరి సిద్ధాంతం ప్రకారం శ్రీరాముడు అగర్తా నుండి మరుద్వాహనం మీద
ధర్మరక్షణకు, దుష్టశిక్షణకు వచ్చిన సిద్ధవీరుడు. ఈ జాతులలో ఎక్కువమంది 400-800 ఏండ్ల వయస్సులో ఉంటారు. ఈ నగరాలు, ఈ ప్రజలు, ఈ యోగులు అందరు శంబళ - విష్ణుదేవుని ఆజ్ఞ ప్రకారం నడచుకొంటుంటారు.
పాశ్చాత్యులు ఈ సంప్రదాయానికి వైట్ బ్రదర్‌హుడ్ - శ్వేతసోదరవర్గము అని పేరు పెట్టారు. ఈ శంబళ గ్రామాన్నే టిబెట్లో షాంగ్రీలా అని అంటారు. పెమెకో అన్న పేరుకూడా కొన్ని చోట్ల ఉన్నది. సిద్ధాశ్రమ భాగాలలో ' శంబళ ' ప్రధాన కేంద్రం.
(సశేషం )
****
🧘♂️13) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము
13) శ్లోకం:-
తారుణ్య మేత్య కులయౌవన రూపసంపత్ విద్యాత్మ గర్వ పిహితాత్మ హితాభిలాషః |
విణ్మూత్ర మాంస రుధిరాస్థిమయే శరీరే నార్యా రుచిం సముపయాతి జనో విచిత్రమ్ ॥ 13
టీకా
తారుణ్యం ఏత్య = యౌవనాన్ని పొంది, కుల యౌవన రూప సంపత్ విద్య ఆత్మ గర్వం = కుల యౌవన రూప, ధన, విద్యలున్నవనే గర్వంచేత, పిహిత = కప్పబడిన, ఆత్మహిత అభిలాషః = తన హితాన్ని గూర్చిన అభిలాషకలవాడై, నార్యా = స్త్రీయొక్క. విట్ మూత్ర మాంస రుధిర అస్థిమయే శరీరే = మలం మూత్రం మాంసం నెత్తురు ఎముకలతో కూడిన శరీరంలో, జనః = నరుడు, రుచిం సముపయాతి = ప్రీతిని పొందుతాడు, విచిత్రం = ఎంత ఆశ్చర్యమో కదా!
భావం:-
యౌవనదశని పొంది, తన కుల యౌవన రూప విద్యా సంపదలను గూర్చిన గర్వం వల్ల ఆత్మ హితం పొందాలనే అభిలాష మరుగుపడిపోగా, నరుడు మల మూత్ర మాంస రుధిరాస్తిమయమైన స్త్రీ శరీరం పైన మక్కువ పెంచుకుంటాడు. ఇదేమి విచిత్రమో!
వివరణ:-
మానవుడి అజ్ఞానం ఎన్ని రకాలుగా వుంటుందో ఈ శ్లోకం నిరూపిస్తుంది. పసితనంలోని అమాయకత్వం యౌవనంలో అజ్ఞానంగా మారి వెర్రితలలు వేస్తుంది.
కుల రూప యౌవనాలు శరీరానివి. విద్యా, సంపదలు బాహ్య ప్రపంచంలో సంపాదించుకొనేవి. స్త్రీ శరీరం తన శరీరం వలెనే మల మూత్ర మయమైనది. ఆత్మ మహిమతో పోల్చితే ఇవి అన్నీ తుచ్ఛమైనవే. ఈ అల్పమైన వాటిని గురించి గర్వపడుతూ మానవుడు తన హితాన్నే మర్చిపోతాడు.
🧘♂️383) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️
స్థితి ప్రకరణము
రెండవ అధ్యాయము
దామ వ్యాళ కటోపాఖ్యానము
2-100
అనన్తానన్త సంకల్పకల్పనోత్పాదమాయయా ఇంద్రజాలం వితన్వానా జగన్మయమిదం మహత్.
2-101
తావద్భ్రమన్తి సంసారే వారిణ్యావర్తరాశయః యావన్మూఢా న పశ్యన్తి స్వమాత్మాన మనిన్దితమ్.
అనంత విషయములందు అనంత సంకల్పములను గలుగజేయునట్టి మాయ ద్వారా మూఢులగు జీవు లీ విశాలజగత్తను ఇంద్రజాలమును విస్తరింపచేయుచు, సర్వోత్తమమైనట్టి తమయొక్క ఆత్మను గాంచనంతవఱకును, జలమందు ఆవర్త (సుడి) సమూహములవలె ఈ సంసారమున తిరుగాడుచునే యుందురు.
2-102
దృష్ట్వాత్మాన మసత్త్యక్త్వా సత్యామాసాద్య సంవిదమ్. కాలేన పదమాగత్య జాయన్తే నేహ తే పునః.
జీవులు కాలచక్రమున (భూమికా
దార్ఢ్యక్రమమున) సత్యజ్ఞానము బొంది, అసద్వస్తువు (దృశ్యము)ను త్యజించి, ఆత్మను దర్శించి, అట్టి ఆత్మపదమును పొందినవారై మరల ఈ సంసారమున జనింపకుందురు.
2-103
భుక్త్వా జన్మసహస్రాణి భూయః సంసారకోటరే
పతన్తి కేచిదబుధాః సంప్రాప్యాపి వివేకతామ్.
శాస్త్రవివేకమును బొందియు కొందఱు (అనుష్ఠాన రాహిత్యము చేతను, విషయలాంపట్యమువలనను) అజ్ఞానులవలె మరల సంసారమున అనేక జన్మల ననుభవించి పతనమైపోవుచున్నారు.
🧘♂️93) అష్టావక్ర గీత🧘♀️
అధ్యాయం - 9
నిర్లిప్తత - ఉదాసీనత (నిర్వేదము)
శ్లోకం 01:-
अष्टावक्र उवाच ॥
कृताकृते च द्वन्द्वानि कदा शान्तानि कस्य वा ।
एवं ज्ञात्वेह निर्वेदाद् भव त्यागपरोऽव्रती ॥ ९-१ ॥
అష్టావక్ర ఉవాచ ॥
కృతాకృతే చ ద్వంద్వాని కదా శాంతాని కస్య వా ।
ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాద్ భవ త్యాగపరోఽవ్రతీ ॥ 9-1 ॥
అష్టావక్ర ఉవాచ :-
శ్లో|| కృతాకృతే చ ద్వంద్వాని కదా శాంతాని కస్య వా |
ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్ భవ త్యాగపరోఽప్రతీ || 1.
asht’aavakra uvaacha ॥
kri’taakri’te cha dvandvaani kadaa shaantaani kasya vaa ।
evam jnyaatveha nirvedaad bhava tyaagaparo’vratee ॥ 9-1 ॥
టీకా
కృతాకృతే = కర్తవ్యా కర్తవ్యములును, ద్వంద్వాని = సుఖదుఃఖ శీతోష్ణాది ద్వంద్వములను, కస్య = ఎవనికి, కదా= యెప్పుడు, శాస్త్రని = శాంతించుచున్నవి, ఏవం = యీ ప్రకారము, వా = నిశ్చయముగా, జ్ఞాత్వా = తెలిసికొని, ఇహ = ఈ ప్రపంచము నందు, నిర్వేదాత్ = హేయత్వబుద్ధివలన, అవ్రతీ = ఆగ్రహము లేనివాడవై, త్యాగపరః = త్యాగపరుడవుగా, భవ = అగుము.
వివరణ:-
ధర్మాచరణలో కలిగే ధర్మసందేహాలు, ద్వంద్వ అనుభవాలు ఎవరికి చెందినవి? అవి ఎప్పుడు లేకుండా పోతాయి? నశించేదెవరు? ఈ విధంగా కూలంకషంగా విచారించి, తర్కించి, ప్రపంచం పట్ల పూర్తిగా ఉదాసీనభావం వహించి రాగరహితుడవై త్యాగధనుడవై జీవించుము.
తాత్పర్యం:-
విచారణ సరళి పూర్తిగా వివరింపబడింది. ఇక్కడ కర్తననుకునే అహం కారాన్ని బాధిస్తాయి. ధర్మాచరణలోని ధర్మసందేహాలు చెయ్యవలసిన పనిని చేసితినని సంతోషించడం కాని చెయ్యలేక పోయినందుకు విచారించడం కాని కర్త అయిన అహంకార ధర్మం.
ఈ అహంకారమే భోక్తననుకొని, అనుభవిస్తున్నాను అనుకోవడంతో శీతోష్ణాలు రాగద్వేషాలు, సుఖదుఃఖాలు మొదలైన ద్వంద్వాలు ఉనికిని సంతరించుకుని బలపడుతున్నాయి. ఈ ద్వంద్వాల ప్రభావాన్ని భోక్తగా అహంకారమే అనుభవిస్తుంది.
ఈ అహంకారం నశించినప్పుడే ద్వంద్వాలు కూడా నశిస్తాయి. మనఃకల్పితాలయిన ఈ ద్వంద్వాలు, అజ్ఞాన జన్యమైన అహంకారానికి చెందినవి.
భూతమూ దానికి సంబంధించిన బాధలూ స్తంభాన్ని ఏవిధంగానూ
బాధింపజాలవు. అహంకారం ఆత్మ మీద ఆరోపింపబడిన భ్రమ కావడం వలన ఆ అహంకారానికి చెందిన బాధలేవీ ఆత్మ నైన నన్ను బాధించ జాలవు. ఈ ఆరోపింప బడిన సర్వజగత్తుకు అధిష్టానమే నేను.
అయితే ఈ వస్తుమయ ప్రపంచాన్ని ఏ విధమయిన దృష్టితో చూడాలి? నాలో నీకు రెండు కొమ్ములు ఒక తోక కనిపించినప్పుడు నాకూ వాటికీ సంబంధం ఎలా ఉండాలి? నిజానికి అవి నాలో లేనే లేవు.
వాటి యెడ నేను ఉదాసీన భావాన్ని చూపించడం నీ పైనా, నీ అజ్ఞానం మీదా జాలి చూపడం కాదా? నాపై నీకుండే స్నేహం కొద్దీ వాటికి నూనెరాసి అందంగా చెయ్యాలనుకుంటే నేను తప్పకుండా ఒప్పుకుంటాను! లేని కొమ్ములకు నీవు రాసిన నూనె నన్నెలాగూ అంటదు, పైగా నాకు సేవ చేసానన్న తృప్తి నీకు దక్కుతుంది!!
ఈ దృక్పథం నీకు అర్థమయితే జ్ఞానులందరూ ప్రపంచంతో వ్యవహరించే తీరు కూడా తప్పకుండా అర్థం అవుతుంది. రాగరహితుడవై, త్యాగిగా, ఆత్మను ఆత్మగా చూస్తూ ఆరోపింపబడిన భ్రమను విడనాడి సదా శాంతంగా జీవిస్తాడు.
'త్యాగపరాః అప్రతీ"--- ఇక్కడ అప్రతీ అంటే ఏ వ్రతములనూ చెయ్యని వాడని అర్థం.
ఏవైనా కోరికలు ఉన్నవారు అవి తీరడం కోసం వ్రతాలను ఆచరిస్తారు. కోరికలే లేని వారికి వ్రతంతో పని యేమిటి? ఇక్కడ అష్టావక్రులు ఈ పదాన్ని వాడి రాగరహితుడైన వ్యక్తి అనే అర్థాన్ని సూచించారు.
'మహోపనిషత్తు'లో ఇలా చెప్పబడింది.
నాకృతేన కృతేనార్థో న శ్రుతిస్మృతివిభ్రమైః!
నిర్మందర ఇవాంభోధి: స తిష్ఠతి యధాస్థితః!!
ధర్మశాస్త్రాలు విధించిన ధర్మాచరణ పట్ల ఉదాసీన భావం కలిగి, నిశ్చల గంభీరమయిన సముద్రంవలె, చైతన్యమయమయిన తన స్వరూపంలో స్థితిని కలిగి జ్ఞాని శాంతంగా జీవిస్తాడు.
02- శ్రీ కపిలగీత🧘♀️
అధ్యాయము - 1 శ్లోకం 01:-
దేవహూతి రువాచ : -
నిర్విణ్ణానితరాం భూమన్న సదిన్ర్దీ య తర్షణాత్ |
యేన సంభావ్యమానేన ప్రపన్నాస్మి తమః ప్రభో ॥ 1 ॥
శబ్దార్ధములు :-
దేవహూతిః ఉవాచ = దేవహూతి చెప్పెను; నిర్విణ్ణా = అలసట చెంది; నితరామ్ = మిక్కిలి; భూమన్! = ఓ అనంతుడా!; అసత్ ఇంద్రియ తర్షణాత్ = అసత్యమైన ఇంద్రియ విషయాభిలాష వలన; యేన సంభావ్యమానేన = దేనినుండి ఉద్భవించినదో; ప్రపన్నా అస్మి = నేను పడిపోయాను; తమ = అంధకారములోనికి; ప్రభో = ఓ భగవంతుడా.
భావం:-
ఓ భగవంతుడా! అసత్యమైన ఇంద్రియముల విషయాభిలాష వలన నేను మిక్కిలి అలసిపోయాను. ఇంద్రియములను సంతృప్తి పరచుచూ నేను ఘోరమైన అంధకారంలో పడితిని.
వివరణ:-
"యో వై భూమా తత్ సుఖం, న అల్పే సుఖం అస్తి - ఏది శాశ్వతమైనదో అదే ఆనందము. అశాశ్వతమైన దానిలో ఆనందము లేదు” (ఛాందోగ్యోపనిషత్తు. 7.13.1).
భూమా అనగా అనంతమైనది. (మా భూ ఇతి = ఏదైతే జన్మించలేదో అది అనంతమైనది) విశ్వవిభుడు తనకు పరమ సత్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించుట కొరకు పుత్రునిగా జన్మించాడని దేవహూతి గుర్తించింది. గొప్ప వైరాగ్యంతో ఆమె ఆత్మజ్ఞానాన్ని పొందగోరింది. కఠోపనిషత్తు (2.1.1) ఇలా చెబుతున్నది
“పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూః | తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్||
సృష్టికర్త ప్రకృతి సిద్ధంగా ఇంద్రియాలను బహిర్ముఖం చేశాడు. అందువలన అవి బాహ్యప్రపంచాన్నే చూస్తున్నాయిగానీ ఎప్పుడూ అంతర్ముఖం కావడం లేదు” ఇంద్రియాలు ఎప్పుడూ ఇంద్రియ విషయాలనే, ఆశిస్తున్నాయి.
మనస్సు వాటి వెంటే పరుగులు పెట్టి తన మనశ్శాంతినంతా కోల్పోతున్నది. మనస్సు దీర్ఘాలోచనలు చేసి ఊహించి దానితో వాసనలను సృష్టించుకొని మరిన్ని కోరికలను తెస్తున్నది. కోరికలుండటం, సంపాదించడం, సుఖాలనుభవించటం తప్పేమీ కాదు. కానీ ఇంద్రియ సుఖాల యందే మునిగి యుండటం, వాటి నుండి బయటపడేందుకు ప్రయత్నించకపోవటం నిజంగా సమస్యే. ఒక పిల్లవాడు బొమ్మలతో ఆడుకొంటూ యుక్తవయస్సు వచ్చినప్పటికీ ఆ ఆటలనుండి బయటపడకపోతే అది సమస్యే.
- “సర్వేంద్రియాణాం జరయంతి తేజాః” - భౌతిక సుఖములు ఇంద్రియములన్నింటినీ శక్తి విహీనం చేస్తున్నాయి. (కఠ- 1.1.26) అవి ఇంద్రియములను, మనస్సును రెండింటినీ అలసిపోయేలా చేస్తున్నాయి.
వివేకయుక్తమైన మనస్సు ఇంద్రియ సుఖబంధాలకు విసుగుచెంది వాటి నుండి బయటపడుతుంది. దేవహూతి ఇప్పుడు ఇంద్రియ సుఖాల యందున్న తన బానిసత్వము నుండి బయటపడాలనుకుంటున్నది.
02- శ్రీ కపిలగీత🧘♀️
అధ్యాయము - 1 శ్లోకం 01:-
దేవహూతి రువాచ : -
నిర్విణ్ణానితరాం భూమన్న సదిన్ర్దీ య తర్షణాత్ |
యేన సంభావ్యమానేన ప్రపన్నాస్మి తమః ప్రభో ॥ 1 ॥
శబ్దార్ధములు :-
దేవహూతిః ఉవాచ = దేవహూతి చెప్పెను; నిర్విణ్ణా = అలసట చెంది; నితరామ్ = మిక్కిలి; భూమన్! = ఓ అనంతుడా!; అసత్ ఇంద్రియ తర్షణాత్ = అసత్యమైన ఇంద్రియ విషయాభిలాష వలన; యేన సంభావ్యమానేన = దేనినుండి ఉద్భవించినదో; ప్రపన్నా అస్మి = నేను పడిపోయాను; తమ = అంధకారములోనికి; ప్రభో = ఓ భగవంతుడా.
భావం:-
ఓ భగవంతుడా! అసత్యమైన ఇంద్రియముల విషయాభిలాష వలన నేను మిక్కిలి అలసిపోయాను. ఇంద్రియములను సంతృప్తి పరచుచూ నేను ఘోరమైన అంధకారంలో పడితిని.
వివరణ:-
"యో వై భూమా తత్ సుఖం, న అల్పే సుఖం అస్తి - ఏది శాశ్వతమైనదో అదే ఆనందము. అశాశ్వతమైన దానిలో ఆనందము లేదు” (ఛాందోగ్యోపనిషత్తు. 7.13.1).
భూమా అనగా అనంతమైనది. (మా భూ ఇతి = ఏదైతే జన్మించలేదో అది అనంతమైనది) విశ్వవిభుడు తనకు పరమ సత్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించుట కొరకు పుత్రునిగా జన్మించాడని దేవహూతి గుర్తించింది. గొప్ప వైరాగ్యంతో ఆమె ఆత్మజ్ఞానాన్ని పొందగోరింది. కఠోపనిషత్తు (2.1.1) ఇలా చెబుతున్నది
“పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూః | తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్||
సృష్టికర్త ప్రకృతి సిద్ధంగా ఇంద్రియాలను బహిర్ముఖం చేశాడు. అందువలన అవి బాహ్యప్రపంచాన్నే చూస్తున్నాయిగానీ ఎప్పుడూ అంతర్ముఖం కావడం లేదు” ఇంద్రియాలు ఎప్పుడూ ఇంద్రియ విషయాలనే, ఆశిస్తున్నాయి.
మనస్సు వాటి వెంటే పరుగులు పెట్టి తన మనశ్శాంతినంతా కోల్పోతున్నది. మనస్సు దీర్ఘాలోచనలు చేసి ఊహించి దానితో వాసనలను సృష్టించుకొని మరిన్ని కోరికలను తెస్తున్నది. కోరికలుండటం, సంపాదించడం, సుఖాలనుభవించటం తప్పేమీ కాదు. కానీ ఇంద్రియ సుఖాల యందే మునిగి యుండటం, వాటి నుండి బయటపడేందుకు ప్రయత్నించకపోవటం నిజంగా సమస్యే. ఒక పిల్లవాడు బొమ్మలతో ఆడుకొంటూ యుక్తవయస్సు వచ్చినప్పటికీ ఆ ఆటలనుండి బయటపడకపోతే అది సమస్యే.
- “సర్వేంద్రియాణాం జరయంతి తేజాః” - భౌతిక సుఖములు ఇంద్రియములన్నింటినీ శక్తి విహీనం చేస్తున్నాయి. (కఠ- 1.1.26) అవి ఇంద్రియములను, మనస్సును రెండింటినీ అలసిపోయేలా చేస్తున్నాయి.
వివేకయుక్తమైన మనస్సు ఇంద్రియ సుఖబంధాలకు విసుగుచెంది వాటి నుండి బయటపడుతుంది. దేవహూతి ఇప్పుడు ఇంద్రియ సుఖాల యందున్న తన బానిసత్వము నుండి బయటపడాలనుకుంటున్నది.
383) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️
స్థితి ప్రకరణము
రెండవ అధ్యాయము
దామ వ్యాళ కటోపాఖ్యానము
2-100
అనన్తానన్త సంకల్పకల్పనోత్పాదమాయయా ఇంద్రజాలం వితన్వానా జగన్మయమిదం మహత్.
2-101
తావద్భ్రమన్తి సంసారే వారిణ్యావర్తరాశయః యావన్మూఢా న పశ్యన్తి స్వమాత్మాన మనిన్దితమ్.
అనంత విషయములందు అనంత సంకల్పములను గలుగజేయునట్టి మాయ ద్వారా మూఢులగు జీవు లీ విశాలజగత్తను ఇంద్రజాలమును విస్తరింపచేయుచు, సర్వోత్తమమైనట్టి తమయొక్క ఆత్మను గాంచనంతవఱకును, జలమందు ఆవర్త (సుడి) సమూహములవలె ఈ సంసారమున తిరుగాడుచునే యుందురు.
2-102
దృష్ట్వాత్మాన మసత్త్యక్త్వా సత్యామాసాద్య సంవిదమ్. కాలేన పదమాగత్య జాయన్తే నేహ తే పునః.
జీవులు కాలచక్రమున (భూమికా
దార్ఢ్యక్రమమున) సత్యజ్ఞానము బొంది, అసద్వస్తువు (దృశ్యము)ను త్యజించి, ఆత్మను దర్శించి, అట్టి ఆత్మపదమును పొందినవారై మరల ఈ సంసారమున జనింపకుందురు.
2-103
భుక్త్వా జన్మసహస్రాణి భూయః సంసారకోటరే
పతన్తి కేచిదబుధాః సంప్రాప్యాపి వివేకతామ్.
శాస్త్రవివేకమును బొందియు కొందఱు (అనుష్ఠాన రాహిత్యము చేతను, విషయలాంపట్యమువలనను) అజ్ఞానులవలె మరల సంసారమున అనేక జన్మల ననుభవించి పతనమైపోవుచున్నారు.
03- శ్రీ కపిలగీత🧘♀️
అధ్యాయము - 1 శ్లోకం 02:-
తస్య త్వం తమసోఽన్ధస్య దుష్పారస్యాద్య పారగమ్ |
సచ్చక్షుర్జన్మనామనే లబ్ధం మే త్వదనుగ్రహాత్ ॥ 2 ॥
టీకా
తస్య = అది; త్వమ్ = నీవు; తమసః = చీకటి; అంధస్య = అంధత్వం; దుష్పారస్య = దాటుట కష్టము; అద్య = నేడు; పారగమ్ = దాటించగల; సచ్చక్షు = దివ్యనేత్రం; జన్మనాం అంతే = ఎన్నో జన్మల తరువాత; లబ్ధమ్ మే = నాకు లభించినది; త్వద్ = అనుగ్రహాత్ = నీ అనుగ్రహము వలన.
భావం:-
భావార్థము :- నీ అనుగ్రహం వలన ఎన్నో జన్మల అనంతరం తరింప వీలులేని అజ్ఞానాంధకారమును, ఇంద్రియ వ్యామోహము నుండి నన్ను తరింపజేయగల దివ్య చక్షురూపమైన నిన్ను పొందితిని.
వివరణ:-
మన స్వప్రయత్నముతో ఇంద్రియ వ్యామోహమును జయించుట కష్టము. వాటి ఆకర్షణ నుండి బయటపడాలని ప్రయత్నించిన కొద్దీ అవి మనలను ఇంకను లాగివేస్తాయి. సత్యతీరమున ఉన్నవాడు మాత్రమే మనలను క్షేమంగా బయటకు లాగగలడు.
కంటి యందు శుక్లములు (కాటరాక్ట్) ఉన్నవాడు పట్టపగలు గూడ చూడటానికి కష్టపడతాడు. కంటిచూపు సంపూర్ణముగా ఉన్నవాడు చూడగలడు పైగా చీకటిగా ఉన్న అడవిలో కూడా ఇతరులను నడిపించగలడు. క్రూర ఇంద్రియారణ్యంలో చిక్కుకున్న వ్యామోహిత శిష్యుని సత్యదర్శియైన గురువు మాత్రమే ఉద్ధరిస్తాడు.
ఎన్నో జన్మలు తపించగా భగవంతుని అనుగ్రహం వలన, పూర్వజన్మ పుణ్యము వలన ఎవరికైనా సద్గురువు లభిస్తాడు. సద్గురువు తన కృపాదృష్టితో జననమరణ చక్రమును అంతము చేయగలడు.
***
03- శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచితము - సిద్ధాశ్రమయోగులు🧘♀️
3-సిద్ధభూమిక:-
ఇంతకు సిద్ధాశ్రమం ఎక్కడ ఉంది? యక్షరక్షితమైన నిధివలె అత్యంత రహస్యంగా కైలాస పర్వత ప్రాంతంలో ఉన్నదని ఎరిగిన యోగులు చెపుతున్నారు. కైలాస పర్వతం చుట్టూ పద్మదళాకారంలో పర్వతాలున్నవి ఆ మధ్యప్రదేశమే సిద్ధాశ్రమ ప్రాంతమని దార్శనికుల అభిప్రాయము.
శివుని నివాసం కైలాసం. సతీవియోగంతో బాధపడుతున్న మహేశ్వరుడు హిమాలయాలలో దక్షిణామూర్తియై తపస్సు చేసి పరిచర్యకు హిమవంతుని పుత్రి పార్వతి వస్తూ ఉన్నరోజుల్లో తనను వ్యామోహితుని చేయటానికి వచ్చిన మన్మధుని మూడవకంటి మంటతో దహనం చేశాడు.
ఆ తర్వాత పార్వతి శివుని గూర్చి కఠోర తపస్సు చేసింది. ఆ ప్రదేశంలో ఉన్న సరస్సుకు గౌరీకుండమని పేరు. ఆ దేవి అక్కడ రోజూ స్నానం చేసేదట! ఆమె సాధనకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైన తర్వాత వారి వివాహం జరిగింది.
ఆ దంపతుల నివాసమే కైలాస పర్వతం. మంచుతో కప్పబడి తెలుపురంగుతో ప్రకాశిస్తుంది గనుక దీనిని రజతపర్వతం వెండికొండ అంటారు. కైలాసం అంటే స్ఫటికం.
దీనివలె అలరారుతుంది గనుక కైలాసం అన్న పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం. కేళి అంటే క్రీడ, దాని మీద నుండి పుట్టిన శబ్దము కైలము. అస అంటే ఉండుట అని అర్థము. శివుని క్రీడలకు నెలవైన ప్రదేశము గనుక కైలాసమని నామం వచ్చిందని మరికొందరంటున్నారు.
కైలాస శిఖరం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అంటే నాలుగు త్రికోణాలు- త్రిభుజాలు కలిసిన అగ్రం. తూర్పువైపు స్ఫటికం వలె, దక్షిణంవైపు నీలమణి సుందరంగా, పశ్చిమ ముఖం మాణిక్యోల్లసితంగా ఉత్తర దిక్కు కాంచన కమనీయంగా ప్రకాశిస్తుంటాయి.
మహాభారతంలో దీనిని హేమకూట పర్వతం అన్నారు. కొందరు దీనినే మేరు పర్వతమంటారు. మేరుస్సుమేరు: హేమాద్రిః అని దేవతలు నివసించే కొండకు పేరు. ఇది చైనాలో ఉన్నదని భౌగోళిక పరిశోధకుల అభిప్రాయం. సుమేరు - సుమేరియన్ నాగరికత - అన్న పేర్లు గ్రంథాలలో కనిపిస్తున్నవి.
కొన్ని ప్రాచీన గ్రంథాలలో కైలాసానికి రత్నాద్రి, గణపర్వతం అన్న నామాలు కూడా ఇవ్వబడినవి. జైన సాహిత్యంలో దీనికి అష్టపాదపర్వతమని పేరు. వారి ప్రథమ తీర్థంకరుడు ఋషభనాథుడు ఇక్కడకు వచ్చి నిర్వాణానికి వెళ్ళాడని వారి గ్రంథాలలో ఉంది.
ఇక బౌద్ధ వాజ్మయంలో శంవర అంటే బ్రహ్మానంద స్వరూపుడైన బుద్ధుడు. చక్రశంవరుడు కాలచక్ర ప్రభువు. ఆయన స్థానమే ఈ పర్వతం. ఈ శైలం మీద బుద్ధుడు 500 మంది బోధిసత్వులు నివసిస్తుంటారు.
దీనిని కంగ్రిన్ పోష్ అని బౌద్ధులు పిలుస్తారు. అంటే మంచు వజ్రం అని అర్థం. బుద్ధుని ముఖ్య సేవకుడు ధర్మపాలుడు వ్యాఘ్రచర్మధారియై డమరుక త్రిశూలములతో కపాలమాలను దాల్చి తన భార్యయైన వజ్రవారాహితో కలసి యీ క్షేత్రాన్ని పరిపాలిస్తుంటాడు.
ఇక్కడి వృక్షాలలో కూడా మహిమాన్వితమైన వృక్షాలున్నవని ప్రజల విశ్వాసం. సర్వరోగములను పోగొట్టే మూలికలే కాక కొన్ని చెట్ల ఫలాలు తింటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తవని, మరి యొక దివ్యవృక్షఫలం అమరత్వాన్ని ఇస్తుందని చెపుతున్నారు.
బౌద్ధమతం టిబెట్లో అడుగు పెట్టక ముందు అక్కడ బోన్పాలనే మంత్ర మార్గీయులు నివసించేవారు. వారి గ్రంథాలలో కైలాస పర్వతాన్ని సంగ్రామశక్తి స్వరూపమైన కాన్ గ్రీలత్సాన్ అనే దేవత - పరిపాలిస్తుంటుందని వ్రాశారు,
ఆ దేవత శూలాన్ని ధరించి జడల బర్రె నెక్కి సంచారం చేస్తుంటుంది. కైలాస నాథుడైన రుద్రుని రూపాన్నే బోన్సాలీ విధంగా భావించారని పరిశోధకుల అభిప్రాయం.
కొందరు బోనాలు జడల బర్రె ముఖం కలిగిన దేవతగా శైలాధి దేవతను వర్ణించారు. హిందూ తంత్ర గ్రంథాలలో కూడా ప్రత్యంగిరను సింహవాహనిగా, సింహముఖిగా వర్ణించడం కనిపిస్తుంది. యాక్ (జడలబర్రె) ను కూడా వారట్లే భావించి ఉండవచ్చు.
మరికొందరు గైకోడ్ అని పిలువబడే జడలబర్రె పురాణాలలో శివవాహనమైన నందికి ప్రతీకగా భావిస్తారు. కైలాస పర్వతాన్ని వీరు కాంగ్రిన్ బోఫెర్గ్ - అనే తొమ్మిదంతస్థుల స్వస్తికభవనంగా వర్ణించారు.
(సశేషం )
****
🌴. సాధువు లక్షణములు - 1 🌴
21. తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినామ్
అజాతశత్రవః శాన్తాః సాధవః సాధుభూషణాః
తితిక్షవః - ఓర్పు, క్షమ. ఎదుటివారి దుఃఖాలను చూచి సహించ లేక పోవుట కరుణ అంటాము. శత్రువు లేని వారు, అంతరింద్రియ నిగ్రహం కలిగిన వారు సాధువులు, సజ్జనులందరికీ అలంకారము.
*22. మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వన్తి యే దృఢామ్
మత్కృతే త్యక్త కర్మాణస్త్యక్త స్వజనబాన్ధవాః
కొంతమంది నా కొరకు వారి పనులన్నీ మానుకుంటారు. నా కోసం తన వారినీ బంధువులనీ వదిలి పెట్టాలి (లక్ష్మణుడు ప్రహ్లాదుడూ దృవుడూ వృత్తాసురుడూ పుండరీకుడు భీష్ముడూ లాగ)
No comments:
Post a Comment