Friday, 3 June 2022

***

*కందుకూరి వీరేశలింగం గారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం...*

అమావాస్య రోజే ఉద్యోగంలో చేరిన ఆచరణ వాది.

మూఢ నమ్మకాలపై పోరాట యోధుడు వీరేశలింగం.

''కార్యశూరుడువీరేశలింగం

కదం తొక్కి పోరాడిన సింగం.

దురాచారాల దురాగతాలను

            తుదముట్టించిన అగ్ని తరంగం'' 

తెలుగు రచయిత, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గూర్చి మహాకవి శ్రీశ్రీ వాక్కులివి. 

''ఉద్యోగంలో చేరడానికి అమావాస్యనాడే ఎందుకు వచ్చా''వని అధికారి అడిగాడు...

 ''అయ్యా! అన్ని రోజులూ ఆ ఈశ్వరుడు సృష్టించిన వనే చెపుతారు కదా? మరి అలాంటప్పుడు అన్ని రోజులూ మంచివే... అలాంటప్పుడు ఇక నేను ఏ రోజు ఉద్యోగంలో చేరినా, అది మంచి రోజే అవుతుంది!'' అని తాపీగా సమాధానమిచ్చారు వీరేశలింగం.

ఈ విషయం ''మూఢ నమ్మకాలపై నా పోరాటం'' అనే గ్రంథంలో ఆయనే స్వయంగా రాసుకున్నారు (పే.24). అభిరుచి ఉన్న వారు ఆ పుస్తకం సంపా దించి, క్షుణ్ణంగా చదవడం మంచిది. అందులో ఆయన అనేక ప్రహస నాలు రాశారు.

 అందులో ఒకటి ' *శకునాలు* ' అనే శీర్షికతో ఉంది. 

ఉదాహరణకు ఇక్కడ అందులోని విషయాలు కొన్ని క్లుప్తంగా పొందు పరుస్తున్నాను. సున్నిత హాస్యం, వ్యంగ్యం మేళ వించి ఎంతో మనోరంజ కంగా రాశారు. గమనించండి!

 కుటుంబాన్ని తీసుకుని ప్రయాణం చేయాలంటే వెనకటి రోజుల్లో ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. అసలే రవాణా సౌకర్యాలు సరిగా లేని రోజులు. 

పైగా ఘడియ ఘడియకూ ముహూర్తాలు చూసుకునే పిచ్చి. మనువాదులు ఆ పిచ్చిని ఎప్పటికప్పుడు మరింతగా పెంచి పోషిస్తూ ఉండేవారు. 

ఆ విశేషాలన్నీ వీరేశలింగం సోదాహరణంగా రాసుకొ చ్చారు. ఇన్నిన్ని చాదస్తాల మధ్య ఆకాలం మనుషులు ఎలా బతికారబ్బా? అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది కూడా!

ఆడవాళ్ళను తీసుకుని మంచీ చెడ్డా విచారించ కుండా దూరాభారం ఎలా బయలుదేరనండీ..? 

పోనీ అమావాస్యకు ముందే  బయలుదేరుదా మంటే, దోవలో అమావాస్య వస్తే మంచిది కాదని పెద్దలు చెప్పినారు. 

అమావాస్య వెళ్ళినా పాడ్యమి ప్రయాణానికి బొత్తిగా మంచిది కాదు. విదియనాడు బయలు దేరుదామంటే ఆ రోజు శుక్రవారం అయ్యింది. అక్కడికీ మొండిగా చొరవ చేసి బయలు దేరుదామని అనుకునేంతలో ఎవరో 'హాచ్చ్‌'మని తుమ్మినారు.

 అటువంటి అపశకునం అయిన తర్వాత ప్రయాణం ఎలా చేస్తామని ఆనాటికి మానేశాం. 

శనివారం ఉదయమా.. దుర్ముహూర్తం! పిల్లలను తీసుకుని ఎలా బయలు దేరడం? ఆ మధ్యాహ్న మేమో వర్జ్యం వచ్చింది. వర్జ్యం వెళ్ళిన తరువాతి రాత్రి బండి కోసం కబురు చేయబోతుంటే గుడ్లగూబ కూసింది. అలాంటప్పుడు ప్రయాణం మానేయక తప్పదు కదా? 

ఇక ఏం చేయడం? ఆ మరునాడు చవితి. ప్రయాణానికి చవితి ఏమాత్రం మంచిది కాదని అందరికీ తెలిసిన విషయమే కదా?

తరువాతి రోజు పంచమి, బయలు దేరాలి. కానీ, ఉదయాన నక్షత్రం మంచిది కాదు. అదీ కాకుండా వర్జ్యం కూడా వచ్చింది. మధ్యాహ్నం బయలుదేరుదామని భోజనం చేసి పచార్లు చేస్తూ ఉంటే,  బల్లి మీదపడింది. జ్యోతిష్యుణ్ణి పిలిపించి స్నానం చేసి, దీపం పెట్టుకుని శాంతీ.. గీంతీ చేసుకునేప్పటికి దీపాల వేళయ్యింది. రాత్రి భోజనాలు చేసి బయలు దేరుదామంటే పెద్దలం దరూ చుక్క ఎదురు వెళ్ళకూడదన్నారు. సరే, ఆ మరుసటి రోజు షష్టి. ఒక్క షష్టి మాత్రమే అయితే ఎలాగయినా బయలుదేరుదును. కానీ, ఆ రోజు పిడుగువలె మంగళవారం కూడా వచ్చింది. ఈ రెంటికి తోడు ఆ రోజు వట్టి పాడు నక్షత్రం. ఇక సప్తమీ బుధవారం ప్రయాణానికి బహు అనుకూలమైంది. కానీ, ఆ రోజు మా చిన్న కుర్రవాడి పుట్టిన దినం. ఆ పండుగ ముగించుకుని భోజనాలు చేస్తే గాని బయలు దేరేది లేదని ఇంట్లో ఆడవాళ్ళు పట్టు బట్టారు. అసలు ఆ ఉదయాన్నే బయలుదేరితే మధ్యాహ్నానికే దొంగలమర్రి దాటిపోయే వాళ్ళం. దొంగలమర్రి అంటే దారిదోపిడీ దొంగలు పొంచి ఉండే చోటు. కానీ, భోజనాలు కాగానే బయలుదేరుదామని బండి కట్టించి తీరా ఎక్కబోయే సరికి విధవ ఎదురుగా వచ్చింది. మళ్ళీ లోపలికి వెళ్ళి అర్థ గంట సేపు ఆగినాము. అప్పుడు బయలుదేరినా దీపాలు పెట్టక ముందే దొంగల మర్రి దాటిసే వాళ్ళం.

కానీ వీధిగుమ్మంలోకి వచ్చే సరికి ఒంటి బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చాడు. అందుకని లోపలికి వెళ్ళి కొంత సేపు ఆగినాము. ఇలా అయితే లాభం లేదని వీధిలో ఎవరూ నడవకుండా జాగ్రత్తపడి పొరుగింట్లో నుంచి ఒక ముత్తయిదువును ఎదురు రమ్మని చటుక్కున బండి ఎక్కి బయలుదేరినాము. ఎంత మంచి శకునం చూసి బయలుదేరినా... ఆ విధవ  ఎదురుగా వచ్చిన వేళ ఎటువంటిదో కానీ ఫలితం మాకు వెంటనే కనిపించింది. రాత్రి పది గంటలకు మేము జడుస్తూనే దొంగల మర్రి దగ్గరకు చేరాము. దొంగలు వచ్చి నగలన్నీ ఎత్తుకు పోయారు. మేం మంచి శకునం చూసుకుని బయలుదేరడం వల్ల ప్రాణాలు కాపాడుకో గలిగాం. మొన్న ఓ సారి జాతకం చూపించుకుంటే.. నాకు ధన నష్టం ఉందని జ్యోతిష్యుడు చెప్పాడు. అంటే అంతా నిజమైనట్టే కదా? జ్యోతిష్యం తప్ప లేదు.

*జ్యోతిష్యాన్ని నమ్మేవారు తాము నమ్మిన జోస్యాలు నిజం కానప్పుడు వాటిని పట్టించుకోకుండా పక్కన పెడతారు. ఎప్పుడైనా ఒకటి అరా నిజమైతే వాటినే మళ్ళీ పట్టుకుని వేళ్ళాడుతారు. ఒక విధంగా జ్యోతిష్యం చెడిపోయిన గడియారం లాంటిది. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది. అలాగని, ఆగిపోయిన గడియారాన్ని నమ్మడం ఎంత మూర్ఖత్వమో, జ్యోతిష్యాన్ని నమ్మడం కూడా అంతే మూర్ఖత్వం! వాస్తవానికి మనం ఏదైనా విషయం ఊహించి చెపితే, అందులో కొంత మేరకు నిజమయ్యే అవకాశాలు ఉంటే ఉంటాయి. ఉండకపోతే ఉండవు.*

 ఇకపోతే, దేవుడి విషయం చూద్దాం ! ఒక కారుకు బ్రేకులు ఫెయిల్‌ అయి లోయలో పడిందని అనుకుందాం. ఆ ప్రమా దంలో బతికిన వాళ్ళు 'ఆ దేవుడి దయ వల్ల బతికా మ'ని చెప్పుకుంటారు కదా? మరి చనిపోయిన వారిని ఎవరు చంపి నట్టూ? ఆ దేవుడు చంపాడని చెప్పాలి కదా? కానీ చెప్పరు. ఒక వేళ ప్రమాదానికి గురయిన ఆ కారులోని వారంతా చని పోతే మీడియాలో వార్త ఇలా ఉంటుంది.. ''కారు బ్రేకులు ఫెయిల్‌ అయి అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు'' అని ఉంటుంది. బ్రేకులు ఫెయిల్‌ కావడం హైలైట్‌ అవుతుందే తప్ప ఆ వార్తలో దేవుడి ప్రసక్తి ఉండదు.

*ప్రయాణికులు బతికితే 'దేవుడి దయ' వల్ల బతికారనడం, మరణిస్తే మాత్రం.. తప్పు బ్రేకులు ఫెయిల్‌ కావడంపై పెట్టడం ఏమైనా బాగుందా?* తప్పు దేవుడి మీద పెట్టి, ఆయనే చంపేశాడని అనుకునే ధైర్యం ఉండదు. 

*ప్రజలు ఇలాంటి ధోరణికి అలవాటు పడిపోవడం వల్ల కదా దేవుడు, జ్యోతిష్యం, వాస్తు, ఆత్మ, పునర్జన్మ వంటి అంధ విశ్వాసాలు సమాజంలో సజావుగా బతుకు తున్నాయి? ఇలాంటి విశ్వాసాల వల్లనే సమాజం రోగగ్రస్తమౌతూ ఉంది? మన జీవితంలో మన చుట్టూ జరుగుతున్న విషయాల్ని నిశితంగా పరిశీలిస్తూ, హేతుబద్ధంగా విశ్లేషించుకుంటే నిజా నిజాలుబయటపడతాయి.*

*''దైవాన్నీ, జ్యోతిష్యాన్ని ప్రబోధించేవారు తమ సౌకర్యానుసారంగా ఆలోచనల్ని, విధి విధా నాలని మార్చుకుంటూ ఉంటారని''* వీరేశలింగం పంతులు ఏనాడో చెప్పారు. 

మరి, మనవాళ్ళు ఏమైనా చెవికి ఎక్కించుకున్నారా? లేదే? గుడ్డెద్దు చేలో పడ్డట్టు.. గుడ్డిగా మూఢ నమ్మకాల్లో పడిపోతు న్నారు. ఒక పెరియార్‌, ఒక కందుకూరి, ఒక తాపీ ధర్మారావు, ఒక గోరా వివేచన అనే దుడ్డు కర్రలతో జనాన్ని అదిలిస్తూనే వచ్చారు. మనం కూడా ఆ పనిని కొనసాగిస్తూనే ఉండాలి. జన చైతన్యానికి దోహదం చేస్తూనే ఉండాలి!

..........

*జీవితం... ప్రకృతి... నియమాలు
ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు నియమాలు

1. ప్రకృతి యొక్క మొదటి నియమం...

ఒక వేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది,

అదేవిధంగా మనసును మంచి మరియు ఆధ్యాత్మిక ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి...


2. ప్రకృతి యొక్క రెండవ నియమం...

ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానినే పంచుకోగలరు, సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు, దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు.

జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు, భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు, భయస్తులు భయాన్నే పంచగలరు... ఇది సత్యం...


3. ప్రకృతి యొక్క మూడవ నియమం...

మనకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోవాలి, ఎందుకంటే...

భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి.

ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది,

మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి.

ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది,

నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది,

అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది,

దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది, సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది...

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే  " అరిషడ్వర్గాలను " జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. 

కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు ....
దేహ శుద్ధి (purification of body), 
నాడీ శుద్ధి (purification of nadis/nervous system),
 మనో శుద్ధి (purification of mind), 
బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి.

 నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. 

ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.

  చక్రాలు :-
**

వెన్నెముక లో ఉండే చక్రాలు
ప్రధాన వ్యాసము : సప్తచక్రాలు
షడ్చక్రాలు లేదా సప్తచక్రాలు మన శరీరంలోని వెన్నుపూస లోనున్న ప్రదేశాలు.

మూలాధార చక్రము (Mooladhara) :-
గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం లం. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

స్వాధిష్ఠాన చక్రము (Swadhisthana) :-

 లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం వం.

మణిపూరక చక్రము (Manipura) :-

 నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము. దీని బీజ మంత్రం రం.

అనాహత చక్రము (Anahatha) :-

హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం యం.

విశుద్ధి చక్రము (Vishuddha) :-

కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజ మంత్రం హం.

ఆజ్ఞా చక్రము (Ajna) :-

భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం ఓం.

సహస్రార చక్రము (Sahasrara) :-

 బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.

::::::::::::::::::::::::
::   సప్తచక్రాలు :-
::::::::::::::::::::::::

శ్రీ విద్య లోను, వివిధ తంత్రముల లోను చెప్పిన ప్రకారము మానవునియందు ఏడు చక్రములుండును.

 మూలాధార చక్రము :-
******

పిరుదుల స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. 

నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది.

 ఇందే కుండలినీ శక్తి యుండును. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

మూలాధారచక్ర అధిష్టాన దేవత “సిద్ధవిద్యాదేవి” సాకిణీ రూపములో ఉంటుంది. 

ఈ దేవతకు సంబధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ “స” కార సంబంధముగా ఉంటాయి. 

514 నుండి 519 వరకూ గల నామములు “సాకిన్యంబ”ను వర్ణిస్తాయి. 

 నామములు :-
""'''''"'''''''''''''''''''''''''""
 మూలాధారామ్భుజారూఢ,  పంచవక్తాృయ,  ఆస్ధిసంసితాయ, 
అంకుశాది ప్రహరణాయ,  వరదాది నిషేవితాయ,
 ముద్గౌదనాసక్తాయ.  మూలాధారస్ధపద్మే,  శృతి దళలసితే, 
 పంచవక్త్రాం త్రినేత్రాం,  ధూమ్రాభా,  మస్ది సంస్దాం   సృణి మపి  కమలం పుస్తకం  జ్ఞానముద్రాం బిభ్రాణం   బాహుదండైస్సులలిత వరదా  పూర్వ శక్త్యన్వితాoతం
ముద్గాన్నాసక్త చిత్తాం  మధుమదముదితాం సాకినీ భావయామి.

మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. 

ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో ‘సాకిన్యాంబ’ నివసిస్తుంది.

 ఈమెకు ఐదు ముఖములు....
 శబ్దము,  స్పర్శ,  రూపము,  రసము,  గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. 

గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. 

ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. 

 వజ్రేస్వరి :-
""""""""""""""
ఈ దేవతకి నాలుగు చేతులు...
 అంకుశము,  కమలం,  పుస్తకము,  జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.

సాకిన్యాంబ వరదాది దేవతలు  :-

 1. వరద 
 2. శ్రియ 
 3. షండా 
 4. సరస్వతి 

(  వ, శ, ష, స అను మూలాక్షరాల ) దేవతలచే కోలువబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము.

   స్వాధిష్ఠాన చక్రము :-
*******

లింగమూలమున గలదు. ఆరు దళములతో సింధూరవర్ణము గల జలతత్వ కమలము గలది.

  మణిపూరక చక్రము :-
*******

నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము.

  లాకిన్యంబాస్వరూపిణి :-
""""""""""""""""""""""""""""""""
6 నామాములు / 3 వ చక్రము . 

(495) నుండి (502) వరకూ నామములు :-

 మణిపూరాబ్జనిలయ,  వదనత్రయసంయుతా, వజ్రాధికాయుధోపేతాయ,   డామర్యాదిభిరావృతాయ,
 రక్తవర్ణాయ,  మాంసనిష్టాయ,  గుడాన్నప్రీతాయ, 
 సమస్తభక్త సుఖదాయ ,  దిక్పత్రే,  నాభిపద్మే, 
 త్రివదన విలస ద్దంష్ట్రిణీం,  రక్తవర్ణాం, శక్తిం ,
 దంభోళి ,  దండావ భయమపి, భుజైర్దారయంతీo ,
 మహోగ్రాం ,  డామర్యాద్త్యై: ,  పరీతాం ,  పశుజన భయదాం,
 మాంసధాత్వేక నిష్టాం,  గౌడన్నసక్త చిత్తాం ,  సకల సుఖకరీం ,
 లాకినీమ్ ,  భావయామి:

నాభిస్తానము వద్ద గల మణిపూరచక్రమున వసించునది. 

పది దళముల పద్మము, బీజాక్షరాలు సంస్కృతములోని “డ” నుండి “ఫ” వరకు గల అక్షరాలు. 

గర్భస్తశిశువు మూడవ మాసములో కాళ్ళు, చేతులు ఏర్పడడం జరుగును. 

మూడు ముఖములు కలది....
 గర్భస్ధ శిశువుకి నోరు, ముక్కు, కళ్ళు ఏర్పడతాయి. 

నాలుగు చేతులు కలది.....
వజ్రం,శక్తి, దండము, అభయ ముద్రలు ధరించింది.

 డామరము ఆది దేవతలచే పరివేష్టించబడింది. ఈ సమయములోనే శిశువు శబ్దాలకి ప్రతిస్పందన చూపిస్తాడు. 

ఎరుపు వర్ణము కలది. మాంస ధాతువుని ఆశ్రయించేది. బెల్లంతో చేసిన పాయసం, చక్రపొంగలి లాటి వానిపై ఇష్టం కలది. 

అన్నిరకముల భక్తులకీ సుఖసంతోషములు కలిగించేది ఈ లాకిన్యాంబ రూపిణి.

  మణిపూరక చక్రం మంత్రం :-
"""""""""""""""""""""""""""""""""""""
 ‘ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టానదేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః”

  మణిపూరకచక్రం :-
"""'"""""""""""""""""""""""

ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత లాకిని. 

ఈమె .....
డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ అను యోగినులచే ఆరాధింపబడుచున్నది.

 వాహనం పొట్టేలు.

 'గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/ సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి.

బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది.

ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది. 

ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రాణామయకోశంతో సంబంధం. 

శారీరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక. 

పుట్టుట, జీవించుట, మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. 

అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. 

ఈ త్రికోణమే భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి. 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే ...

 అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాధులుకు కారణమౌతుంది. 

నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గుతాయి.

 ఉదరకోశ వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, 
తలబరువు,  కాలేయవ్యాధులు, అతిమూత్రవ్యాధి, 
రక్తక్షీణత,  నేత్రవ్యాధులు కల్గుతాయి.

ఈ చక్ర మానసిక స్వభావం  మూసుకుపోవడం వలన....
 కీర్తికండూతి,  పెత్తనం చెలాయించాలనే అహం,  అసూయ,  అసహనం,  దుడుకుతనం,  క్రూరత్వం,  కటుత్వం,  స్వలాభపరులు, స్వార్ధపరులు. 

తన గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం.

 తెరుచుకుంటే .....
 లక్ష్యసాధన,  ఆశయసిద్ధి,  వ్యవహార దక్షత,  ఉత్సాహం,  ధనాపేక్ష,  తన్ను తాను గౌరవించుకోవడం,  ఆత్మవిశ్వాసం కల్గివుండడం,  జీవితంలో అన్నింటా ముందడుగు. 

ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి  చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. 

మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే.

లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. 

ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.

మరి ఈ చక్రాన్ని ఎలా శుద్ధి చేసుకోవడం? 

ఈ చక్రమునకు లాకిని దేవత.

 సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. 

ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగాన్ని స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. 

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే అనుభూతులను  ( ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ... ) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి. 

దీర్ఘంగా శ్వాసించడం చేయాలి. అలాగే ఈ చక్రానికి అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి.

 సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. 

అదే మాదిరిగా నవగ్రహాలలో ....

 గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వాన్ని అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి.

శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఇది జలతత్త్వం గలది.

తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా 
స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్ 
తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్ 
నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం

మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారాన్ని పోగొట్టు మెరుపుతో గూడినది.

 నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంలైన ముల్లోకములను చల్లపరుచును.

   అనాహత చక్రము  :-
******

హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి హేమవర్ణము గల వాయుతత్వ కమలము.

రాకిన్యాంబస్వరూపిణి
- (494) (9 నామములు) (4 వ చక్రము)
అనాహతాబ్జనిలయ, శ్యామాభాయ, వదనద్వయ, దంష్ట్రోజ్జ్వలాయ, అక్షమాలాదిధరాయ, రుధిరసంస్దితాయ, కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయ, స్నిగ్ధౌదనప్రియాయ, మహావీరేంద్రవరదాయ. (485 నుండి 493 వరకూ గల నామములు)

హృత్పద్మే, భానుపత్రే, ద్వివదన లసితాం, దంష్ట్రిణీం, శ్యామవర్ణామ్
చక్రం, శూలం, కపాలం, డమరుపి – భుజైర్ధారయంతీ త్రినేత్రాం
రక్తస్దాం కాళరాత్రి ప్రభ్రుతి పరివృతాం, స్ధిగ్న భక్తైక సక్తాం 
శ్రీమద్వీరేంద్ర వంద్యా మభిమత ఫలదాం, రాకినీ, భావయామః

ఈమె నలుపురంగులో ఉన్నది, రెండు వదనములు ఉన్నాయి. ప్రాణము, అపానము అనే వాయువులు నియంత్రించు రెండు ముఖములు కలది. శిశువు 2 వ మాసములో రెండవ రంధ్రము ఏర్పడుతుంది. రెండు కోరలతో ప్రకాశించునది. ‘అ’ కారాది, ‘క్ష’ కారము వరకూ గల అక్షరాలని మాలగా ధరించింది. నాలుగు చేతులలో అక్షమాలా, శూలము, కపాలము, డమరుకము, దరించునది. అనాహత చక్రము హృదయమునకు సంబంధించినది, కావున ఆమె రక్త ధాతువుని ఆశ్రయించి ఉంటుంది. అనాహతమునకు 12 దళములు. వీటిని ‘క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలచే కొలవబడింది. కాళరాత్రి మొదలగు దేవతలు. నేతితో తడిసిన అన్నము అనిన ప్రీతి కలది. మహావీరుల కోరికలు తీర్చేది. రాకిణీ దేవత సంబంది బీజాక్షరములు, కీలక, న్యాస మంత్రములు అన్నీ ‘ర’ కారము సంబంధమైనవి.

క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలు "ద్వాదశ శక్తులు". అవి 1. కాళరాత్రి 2. ఖాతీత, 3. గాయత్రి 4. ఘంటాధారిణి 5. జామిని 6. చంద్రా 7. ఛాయా 8. జయా 9. ఝుంకారి 10. జ్ఞానరూప 11. టంకహస్తా 12. ఠంకారిణి

   విశుద్ధి చక్రము :-
*****

కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము.

  డాకినేశ్వరి :-
""""""""""""""""""
 (5 వ చక్రము) విశుద్ధి చక్ర అధిష్టానదేవత “డాకిని”. 

(475 నుండి 483 వరకూ డాకిని దేవత లక్షణాలు వర్ణించబడినవి.)

 ఆరక్తవర్ణాయ,  త్రిలోచనాయ,  ఖట్వాంగాది ప్రహరణాయ,
 వదనైకసమన్వితాయ, పాయసాన్నప్రియాయ,  త్వక్ స్ధాయ,
 పశులోకభయంకరాయ, అమృతాధి , మహాశక్తిసంవృతాయ. 
(8 నామములు)

గ్రీవాకూపే, విశుద్దే, నృపదళకమలే, శ్వేతరక్తాం, త్రినేత్రాం

హస్తే :-
"""""""""
ఖట్వాంగ, ఖడ్గౌ, త్రిశిఖమపి, మహాచర్మ సంధారయంతీమ్
వక్త్రేణేకేనయుక్తాం,  పశుజనభయదాం,  పాయసాన్యైక సక్తాం
త్వక్ద్సా వందేహమృతాద్యై:
 పరివృతవపుషాం, డాకినీo, వీరవంద్యామ్.

డాకినీ దేవత బీజాక్షరాలు, కీలక, న్యాస మంత్రాలు ఆన్నీ “డ” కార సంభందమైనవి. నవి.

 డాకినీ వర్ణము ఎఱుపు.ఈమె ఎఱ్ఱని ఎఱుపు కాదు. తెలుపు కలసిన ఎరుపు. 

జీవి పిండ దశలో ‘శుక్త + రక్త “ సమ్మేళనంతో బిందురూపముగా ఉండును. పదిహేను రోజుల పిదప బుడగ రూపము చెంది, నెలాఖరుకి గట్టిపడి, 45 రోజులకి పిండాకృతి పొందుతుంది. 

ఈ పిండ స్థితి డాకినీ స్థితి. ఈమె త్రిలోచన .....
భూత, భవిష్యత్, వర్తమానాలు చూడగలది.

 ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము ఆయుధములుగా గల దేవత. 

  బీజాక్షరములు :-
"""""""""""""""""""""""
ఖ, ఛ, ఠ, ధ, ఫ -- ఘ, ఝ, ఢ, ధ, భ.

  హాకినీరూపధారిణి :-
""""""""""""""""""""""""""""
 6 నామములు / 6 వ చక్రము...

 521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి.

 ఆజ్ఞాచక్రాబ్జనిలయా, శుక్లవర్ణా,షడాననా,మజ్జాసంస్దాయ, 
హంసవతీ ముఖ్యశక్తి సమన్విత, హరిద్రాన్నైకరసిక.
భ్రూమధ్యే  బిందుపద్మే దళయుగ కలితే, శుక్లవర్ణాం, 
కరాబ్జైమ్ విభ్రాణాo జ్ఞానముద్రాం, డమరుకమలా, 
మక్షమాలాం, కపాలం షట్చక్రాధారమధ్యామ్,
 త్రినయన లసితాం,  హంస వత్యాది యుక్తాం,
హరిద్రాన్త్యైక సక్తాం,  సకలశుభకరీం,  హాకినీం భావయామః

  ఆజ్ఞా చక్రము :-
*****

 భ్రూ మధ్యలో అనగా రెండు కనుబొమ్మలు కలిసే ప్రాంతములో ఉంటుంది. వివేక సూర్యుని ఉదయం జరిగే ప్రదేశము. 

దీనికి అధిష్టానదేవత హాకిణీ. ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమె త్రికాలజ్ఞాని.

 ఈ దేవతకి ఆరు ముఖములు. ఆరు కృతికలు, కుమారస్వామి ఆరు ముఖములు ఈమె రూపములే. 

ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. 

ఇది రెండు దళముల పద్మము. బీజాక్షరములు ‘హ’ ‘క్ష’ . హంసవతీ, ‘క్షమావతీ; అనే దేవతలు ఈ పద్మముని ఆశ్రయించారు. పసుపు పచ్చని అన్నమును ఇష్టపడుతుంది.

    ఆజ్ఞా చక్రము  :-
"""""""""""""""""""""""""

భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము.

హాకినీరూపధారిణి :- 
""'""""""""""""""""""""""""""""
6 నామములు / 6 వ చక్రము....

521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి.

 ఆజ్ఞాచక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా, 
మజ్జాసంస్దాయ,  హంసవతీ ముఖ్యశక్తి 
సమన్విత, హరిద్రాన్నైకరసిక. భ్రూమధ్యే బిందుపద్మే దళయుగ కలితే, శుక్లవర్ణాం,కరాబ్జైమ్ ,విభ్రాణాo జ్ఞానముద్రాం,
 డమరుకమలా, మక్షమాలాం,కపాలం షట్చక్రాధారమధ్యామ్,
 త్రినయన లసితాం, హంస వత్యాది యుక్తాం,హరిద్రాన్త్యైక సక్తాం, సకలశుభకరీం,హాకినీం భావయామః

ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. 

ఇది రెండు దళముల పద్మము.

   బీజాక్షరములు :-
"""""""""""""""'""""""""""
 ‘హ’ ‘క్ష’ .

 హంసవతీ, ‘క్షమావతీ; అనే దేవతలు ఈ పద్మముని ఆశ్రయించారు. 

పసుపు పచ్చని అన్నమును ఇష్టపడుతుంది.

   సహస్రార చక్రము :-
*****

బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. 

సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు.

 ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈస్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.

  యాకిన్యంబస్వరూపిణి :-
"""""""""""""""""""""""""""""""""""""

 6 నామములు / 7 వ చక్రము ...

528 నుండి 533 వరకూ నామములు ఈమెను తెలెయ చేస్తాయి. 

(సహస్త్రదళ పద్మస్ద, స్వర్ణవర్ణోపశోభిత, సర్వాయుధధర, శుక్లసంస్దితా, సర్వతోముఖ, సర్వోదనపీతిచిత్తాయ)

ముండవ్యోమస్ధ పద్మే దశశతదళకే కర్ణికా చంద్రసంస్దామ్
రేతో నిష్టాం, సమస్తాయుధ కలితకరాం, సర్వతోవక్త్రపద్మాం
ఆది క్షాన్తార్ణశక్తి ప్రకట పరివృతామ్ స్వర్ణవర్ణాం భవానీం
సర్వాన్నాసక్తచిత్తామ్, పరశివరసికాం యాకినీ భావయామః

శిరస్సు మధ్యభాగములో సహస్త్రాకార చక్రము ఉంటుంది. 

ఇది వేయి దళములు కలది.

 యశస్వనీ దేవత ఈ చక్ర అధిష్టానదేవత. 

ఈ 7వ మాసములోనే గర్భస్ధ శిశువులో జీవుడు ప్రవేశించేది. ఇందు విశ్వంలోని సకల....
 వర్ణములు, 
 రంగులు,
 అక్షరములు, 
 విద్యలు,
 ధ్వనులు,

 బీజాక్షరములు ఉంటాయి. యశస్వినీ దేవతకు లెక్కలేనన్ని చేతులు, అన్ని చేతులలో సకల ఆయుధములు ధరించునది.

 ఈమె సృష్టికి ఆధారభూతమైన శుక్ర ధాతువుని ఆశ్రయించునది .

 ఈమె సర్వతోముఖ అభివృద్ధి చేయునది. ఈమె అన్ని రకముల అన్నమునూ ఇష్టపడుతుంది.

ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రాలను షట్చక్రములుగా పేర్కొంటారు. ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు. 

ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం. ఇదియే అద్వైతస్థితి.

ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, 

అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ, స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును. 

తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే.

రజస్సు వలన శరీరం లోని వివిధ అవయములు పనిచేయుచున్నవి. 

సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. 

ఈ మూడును మూడు లోకములుగా అంటే .....
 భూలోకం (తమస్సు),
 భువర్లోకం (రజస్సు),
 సువర్లోకం (సత్వం)లుగా మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి.

  సహస్రారచక్రం :-
"""""""""""""""""""""""

సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖా సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ

ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది.

 అధిదేవత యాకిని. 

అకారాది క్షకారంత వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి.

మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థానం. పరమాత్మ స్థానం. 

ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం.

 ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. 

ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం.

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - షట్చక్రాలు బలహీనపడతాయి. 

గ్రహణశక్తి లోపిస్తుంది. 

భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు.

 కష్టదుఃఖాలు పొందుతుంటారు. 

పునర్జన్మలు తప్పవు. 

  ఈ చక్ర మానసిక స్వభావం :-
""""""""""""""""""""""""""""""""""""""
 ఈ చక్రం జాగృతయితే....

 సాధకుడు అమరుడౌతాడు.

 పరమాత్మగా వ్యక్తమౌతాడు.

 తనకు తాను తెలుసుకుంటాడు .

ఇది ఈశ్వరీయత స్థితి. ఈశ్వరత్వం పొందుతారు. 

ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే :-

తలపు, 
మాట, 
చేత యోగ్యంగా వుండాలి.

క్రమశిక్షణ, 
ఆచరణ, 
విశ్వాసం కలిగియుండాలి.

ధ్యానం, 
బ్రహ్మతత్త్వజ్ఞానం, 
స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) 
ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడం చేయాలి. 

ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు. సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రాలు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి మనజీవితములు ఆనంద నందనవనములు అవుతాయి.

ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి.

 అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్నిచక్రాలయందు నిబిడీకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి. 

క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తులవుతాం.

 కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర దేవతలను ప్రార్థించాలి. 

{ప్రార్థన అంటే దైవస్మరణ మాత్రమే కాదు, మన మనస్సును ఇహం నుండి పరం వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధంచేసుకొని, దేహమే దేవాలయమని, అంతరాన్నే అంతర్యామి కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్థన చేయాలి}. 

ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించుకోగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.

ఈ సాధన వలన ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు 'అహంబ్రహ్మస్మి' అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును. 

అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండటమే. ఈవిధంగా సరైనరీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారంలో తిరిగి జన్మింపరు. మనలో వున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేసే సాధనతో స్థూలంనుండి ప్రజ్ఞామయం వరకు పయనించి 'అహం బ్రహ్మస్మి' అన్న స్థితిని పొందడమే జీవన పరమావధి..

----((()))____

*వర్షం - వ్యవసాయం

నాకు సంబంధించిన విషయం చెప్పుకునే ముందు నాకు అత్యంత ఆప్తులైన శ్రీ జి పార్థసారథి గారు పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకున్న సమయంలో ఆయన పొందిన అనుభూతిని తెలియజేస్తాను. శ్రీ జి పార్థసారథి ఐక్యరాజ్యసమితిలో భారతదేశ రాయబారి. ఇందిరా గాంధి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారు కూడా. ఎప్పుడైనా ఢిల్లీ నుండి తమిళనాడుకు వస్తే కంచికి వెళ్ళకుండా, పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉండరు. వెళ్ళిన ప్రతిసారీ మహాస్వామి వారు దాదాపు అరగంట సేపు మాట్లాడేవారు. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పటిదాకా ప్రపంచంలో జరిగిన సంఘటనల గురించి ప్రతి ఒక్క విషయమూ మాట్లాడేవారు. మిగతా దేశాలతో మన దౌత్య సంబంధమైన విషయముల గురించి తగు సూచనలు ఇచ్చేవారు.

పార్థసారథి గారు ఆ విషయాలను అతిశయంతో నాతో పంచుకునేవారు. మహాస్వామివారు చెప్పిన విషయాల గురించి వారి జ్ఞానసంపద గురించి పలుమార్లు నాతో చెబుతూ స్వామివారి మేధస్సు అమోఘం అని కొనియాడేవారు. ఇద్దరమూ స్వామివారికి ఒక నమస్కారం చేసుకునేవారము.

ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు, స్వామివారు పల్లకిలో కూర్చున్నారు. నేను వెళ్ళి స్వామివారి ముందు కూర్చున్నాను. అప్పుటికి నేను మంత్రి పదవిలో ఉన్నాను. పనైమరత్తుపట్టి నియోజకవర్గం నుండి గెలిచాను.

నా నియోజకవర్గంలో ఉత్తమచోళపురం అనే ఒక గ్రామం ఉంది. అది తిరుమణి ముత్తారు నది ఒడ్డున ఉంది. ఆ ఊళ్ళో కరైపురనాథ స్వామివారి దేవాలయం ఉంది. అది చేరనాడు (చేరనాడు, చోళనాడు, పాండ్యనాడు అని మూడు భాగాలుగా ఉండేది ప్రాచీన తమిళనాడు). ఆ దేవాలయంలోనే అవ్వయ్యార్ పారీ రాజు కుమార్తెలు అంగవై, సంగవైలకు వివాహాలు జరిపించింది. ఆమె ఆదేశాన్ని అనుసరించి చేర, చోళ, పాండ్య రాజులు వచ్చి ఆశీస్సులు అందించారు.

పరమాచార్య స్వామివారు సేలం నుండి కోయంబత్తూరుకు పాదయాత్రగా వచ్చారు. అదే మార్గంలో ఉత్తమచోళపురం ఉంది. దారి ఎదురుగా ఉత్తమ చోళుడు నిర్మించిన శివాలయం ఉంది. మొదటిసారి పనైమరత్తుపట్టి నియోజకవర్గం నుండి ఉపఎన్నికల్లో పోటీ చేశాను. కరైపురనాథర్ అనే పేరున్న ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించే ఎన్నికల ప్రచారానికి వెళ్లేవాణ్ణి.

పరమాచార్య స్వామివారు ఆ దేవాలయం ముందరకు రాగానే, ఆలయ శివాచార్యులు స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం పలికి, ఆలయానికి రమ్మని ఆహ్వానించారు. స్వామివారు కొద్దిగా తల ఎత్తి పైకి చూశారు. అప్పటికి ఆ ఆలయానికి రాజగోపురం లేదు. 

అందుకు స్వామివారు, “ముందు ఆలయానికి గోపురం నిర్మించండి. తరువాత వస్తాను” అని చెప్పారు. స్వాగతాన్ని మాత్రం స్వీకరించి ముందుకు నడిచారు. చాలా ఏళ్లపాటు నాకు ఈ విషయం తెలియదు. రెండవ సారి ఎన్నికలు గెలిచినా తరువాత అక్కడి శివాచార్యులు ఈ విషయం నాకు చెప్పారు. నా నియోజకవర్గంలో ఉన్న ఇంత గొప్ప ఆలయాన్ని పరమాచార్య స్వామివారు దర్శించాకుండానే వెళ్ళిపోయారే అని నాకు బాధ కలిగింది. అందుకు కారణం తెలుసుకోదలచి, “నా నియోజకవర్గంలో దేవాలయం మీరు ఎందుకు దర్శించలేదు?” అని అడిగాను. అప్పుడు అర్థం అయ్యింది వారి జ్ఞాపకశక్తి ఎంతటిదో!

“ఉత్తమచోళపురం నీ నియోజకవర్గంలో ఉందా?” అని అడిగారు స్వామివారు. నేను ఊరిపేరు కూడా చెప్పలేదు. అప్పటికి ఈ విషయం జరిగి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. నేను మాటలురాక ఆశ్చర్యంతో కూర్చుండిపోయాను. “అక్కడ గోపురం లేదు. ఎందుకు నువ్వే కట్టించారాదు?” అని అడిగారు స్వామివారు.

స్వామివారి ఆదేశం, అనుజ్ఞ అయ్యింది. ఖచ్చితమైన నిర్ణయంతో అక్కడి నిండి బయలుదేరాను. కంచి నుండి నేరుగా ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీ కె.యస్. నారాయణన్ వద్దకు వెళ్లాను. సంబంధ శాఖతో మాట్లాడి కావాల్సినన్ని సిమెంటు బ్యాగులు పంపుతాను అని చెప్పారు. మొత్తం ఖర్చు భరించడానికి ఇప్పుడు ఒకర్ని వెదకాలి. అందుకే ఆరుట్ సెల్వర్ శ్రీ మహాలింగం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఈరోడ్ కైలాస గౌండర్ ని కలిసి వారి అంగీకారాన్ని తీసుకున్నాను. గోపురం ఆకృతి గురించి ఆలోచిస్తుండగా, నంగవల్లి దేవాలయ గోపురం స్ఫురించింది. స్నేహితులతో కలిసి ఒకసారి వెళ్లి చూశాను. చాలా అద్భుతమైన కట్టడం. వెంటనే ఆ స్థపతితో మాట్లాడి ఉత్తమచోళపురం దేవాలయ గోపుర నిర్మాణానికి ఒప్పించాను. ఈ కార్యం మొత్తం చూసుకోవడానికి ఒక వ్యక్తీ కావాలి కదా! దేవాలయ నిర్మాణ కమిటి అధ్యక్షుడిగా శ్రీ ఆర్. జయకుమార్ ని అడుగగా, ఆయన అంగీకరించారు. అప్పుడు శ్రీ రామస్వామి ఉదయర్ పోరూర్ లొ రామచంద్ర వైద్య కళాశాలను నిర్మిస్తున్నారు. కళాశాల నిర్మాణం కోసం రంగూన్ నుండి టేకు కలప తెప్పించారని విన్నాను. వెళ్లి అడగగానే, “తలుపులకోసం నా దగ్గర ఉన్నదాంట్లో నీకు ఎంత కావాలో చెబితే అంత, నా స్వంత లారీలో పంపుతాను” అన్నారు. పన్నెండు అడుగుల ఎత్తు ద్వారంబంధాలు చేయించాము.

ముందు కేవలం మూడంతస్తుల గోపురం నిర్మాణం చేద్దామని అనుకున్నాము. కమిటి అధ్యక్షుడు జయకుమార్ గారి సూచన మేరకు ఐదు అంతస్తుల గోపురం నిర్మాణం చెయ్యాలని తిర్మానిన్చాము. ఆ శివాలయం ప్రశస్తి ఏమిటంటే, చైత్ర పౌర్ణమి రోజు రెండు బస్తాల వండిన అన్నాన్ని అభిషేకించి, మరుసటి రోజు ఉదయం సాంబారు కలిపి ఆ సంబారు అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా పెడతారు. అది అక్కడి ఆలయ సాంప్రదాయం. కుంభాభిషేకానికి విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ చేద్దామని అనుకున్నాము. వాషర్ మాన్ పేట్ బియ్యం వర్తకుల సంఘాన్ని కలిస్తే, అందరిని సంప్రదించి ఇరవై బస్తాల బియ్యం ఇస్తామని చెప్పారు. వారే దగ్గరుండి సేకరించి వారి లారిలోనే మాకు పంపారు. నా స్నేహితుడు శ్రీ మెహతా కొడైకెనాల్ కూరగాయల వర్తకుల సమాఖ్యకు అధ్యక్షుడు. ముప్పైవేలమందికి సరిపడా కూరగాయలు లారీలో పంపమని అడిగాను. నా స్నేహితుడు శ్రీనివాసన్ దిండిగల్ వాసి. అతని “సేవరైట్ సేమ్యా” కర్మాగారం నా అధ్యక్షతన మొదలుపెట్టబడింది. కావలసినంత సేమ్యా పంపమని అడిగాను. వంటవారు, వడ్డించేవారు, పనిచేసేవారు మొదలైనవారికి ఇవ్వడానికి నా కోయంబత్తూరు స్నేహితుడు అన్నూర్ బాలు అరవైవేల రూపాయలు పంపాడు. శ్రీలంక మంత్రి సవుమియమూర్తి తొండమన్ ఈ ఉత్సవానికి హాజరయ్యారు. నామగిరిపెట్టై శ్రీ కృష్ణన్ నాదస్వర గానంతో ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. చివరిరోజు నా మంత్రి పదవి నాది కాకుండా పోయింది.

మరుసటిరోజు నా విన్నపాన్ని మన్నించి పరమాచార్య స్వామివారు తమ శిష్యులు జయేంద్ర సరస్వతి స్వామివారిని, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారిని పంపారు. వారు వచ్చి దేవాలయంలో పూజలు చేశారు. ఈరోజు దాకా అలాగే జరుగుతున్నాయి. ఇంత కూలంకుషంగా రాయడానికి కారణం పరమాచార్య స్వామివారి అవ్యాజ కరుణ ఎటువంటిది అని తెలియజేయడానికే. వారి అనుగ్రహ వాక్కు ఎలా నిజమైందో చెప్పడానికే. నా జీవితంలో ఎన్నటికి మరచిపోలేని సంఘటన.

మధుమేహం వల్ల నేను డా. యం. విశ్వనాథన్ గారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. ఒక రోజు ఉదయం పది గంటలప్పుడు కొంతమంది ఐ.ఏ.యస్ అధికారులు పూలమాలలతో నావద్దకు వచ్చారు. కారణం అడుగగా, “ఈరోజు నుండి మీరు మా మంత్రి” అని చెప్పారు. పన్నెండు మంది మంత్రుల్ని తొలగించిన పురచ్చి తలైవర్ (యం.జి.ఆర్) వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖలను కూడా అప్పగించారు. కృతజ్ఞతలు తెలపడానికి నేను రామవరం వెళ్ళలేదు. నా గురించి ఇతర మంత్రులను అడుగగా, నా అనారోగ్య విషయం తెలుసుకుని నేరుగా ఆసుపత్రికి వచ్చారు. “ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నారు” అని అధికారులు తెలపగానే మూడవ అంతస్తులో ఉన్న నేను నేను డా. విశ్వనాథన్ గదికి వెళ్లాను. ఆయనే వారిని తీసుకుని నా గదికి వచ్చారు. నా గదికి రాగానే తలైవర్ డాక్టరుతో, “రాజారాం గారికి మెరుగైన చికిత్స అందించండి. ఖర్చు ఎంతైనా పర్లేదు” అని చెప్పారు.

వ్యవసాయ శాఖ నాకు ఇచ్చినప్పుడు రాష్ట్రం అంతా కరువు తాండవిస్తోంది. వర్షాలు లేక భూములన్నీ బీటలువాలాయి. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. కంచి మహాస్వామి వారిని స్మరించుకున్నాను. కంచి మఠానికి వచ్చాను. మఠం మేనేజరు శ్రీ నిలకంఠ అయ్యర్ నన్ను చిన్నతనం నుండి ఎరుగుదురు. నేను రాగానే వారు నన్ను ఆహ్వానించి, “నీరాక గురించి మహాస్వామివారు చాలాసేపటి నుండి అడుగుతున్నారు. నీకోసం చాలాసేపు చూసి, ఇప్పుడే నిద్రకుపక్రమించారు” అని అన్నారు.

“నిశ్శబ్దంగా దూరంగా నిలబడి దర్శించుకుంటాను స్వామివారిని” అని చెప్పి, స్వామివారు నిదురిస్తున్న వేదిక వద్దకు వెళ్లి నమస్కరించాను. కొద్ది నిముషాల తరువాత మహాస్వామివారు కొద్దిగా పక్కకు తిరిగి వెంటనే లేచి కూర్చున్నారు. నన్ను చూసి, “ఎప్పుడు వచ్చావు?” అని అడిగారు.

“ఇప్పుడే” అని చెప్పాను.

“నన్ను కలవాలని అడిగావు అంట కదా! ఎందుకు?” అని అడిగారు.

“రాష్ట్రంలో వర్షాలు లేవు. అలాంటప్పుడు నాకు వ్యవసాయశాఖ ఇచ్చారు. నేలంతా బీటలువాలింది. వర్షాలు లేని ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఎలా ఉండగలను. అది నాకు మచ్చ అవుతుంది. వర్షాల కోసం మీరు ఏదైనా యాగం జరిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను” అని అడిగాను.

“దీనికోసమే ఇక్కడకు వచ్చావా?” అని అడిగారు స్వామివారు. అవునన్నాన్నేను. కొద్దిసేపు ధ్యానంలో ఉన్నారు. కొద్దిసేపటి తరువాత, “సరే! రేపటినుండి పదిహేను రోజులపాటు కామాక్షి అమ్మవారి ఆలయంలో యాగం నిర్వహించమని చెబుతాను” అన్నారు.


సాయింత్రం చెంగల్పేట్ లో ఒక కార్యక్రమం ముగించుకుని కార్లో కూర్చున్నాను. భోజనం తరువాత కారు శ్రీపెరుంబుదూర్ వైపు వెళుతోంది. నిద్రపట్టక పోవడంతో సీటులో కూర్చుని కిటికీ అడ్డం గుండా బయటకు చూస్తే, నేను చూసిన విషయం ఎవరూ నమ్మరు. కారుపై ఎవరో కుండలకొద్దీ నీరు కుమ్మరిస్తున్నట్టు ఎడతెగని వాన. వర్షం ధారాపాతంగా పడుతోంది. పరమాచార్య స్వామివారి వాక్కు కొద్ది గంటల్లోనే నిజమైంది. రాష్ట్రం మొట్ట పొలాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. పంటలు సమృద్ధిగా పండాయి. త్రాగునీరు పుష్కలంగా లభిస్తోంది. వ్యవసాయానికి సరిపడు నీరు ఉండడంతో నా శాఖకు మంచి పేరుకూడా లభించింది.

ఇవన్నీ జరగడం రాష్ట్రంపైన నాపైన పరమాచార్య స్వామివారి ఆశీస్సులే కారణం.

--- రాజారాం కె, మాజీ మంత్రి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 3

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

 *****

1. అహింస, 

2.  సత్యం, 

3. అస్తేయం, 

4.  బ్రహ్మచర్యం, 

5.   అపరిగ్రహం.. 

వీటిని అష్టాంగయోగంలో మొదటి అంగంగా పరిగణిస్తారు. ఈ ఐదింటినీ యమములంటారు. ఏ ప్రాణినైనా మనోవాక్కాయ కర్మల ద్వారా ఏ విధంగానూ హింసించకుండా ఉండడం అహింస. అదే విధంగా మనోవాక్కాయ కర్మలందు ఒకే తీరుగా ఉండడం సత్యం. దీనినే త్రికరణ శుద్ధి అంటారు. దొంగతనం చేయకుండా ఉండడం అస్తేయం. బ్రహ్మము గురించి చింతనచేయడం బ్రహ్మచర్యం. జీవికకు అవసరమైనవి తప్ప ఇతరత్రా ఏవీ లేకుండా ఉండడం, స్వీకరించకుండా ఉండడం అపరిగ్రహం. పతంజలి మహర్షి ఈ విధులన్నింటినీ మహావ్రతాలన్నాడు.  వ్రతం అంటే అర్చన కాదు. ఆచరణ. ఆచరించవలసినవి వ్రతాలు. మన సనాతన ధర్మంలో అహింస, సత్యం ముఖ్యమైనవి. ‘అహింసాపరమో ధర్మః’ అహింసయే పరమ ధర్మము.

ఇక అష్టాంగ యోగంలో రెండో అంగము.. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం. ఇవి నియమాలు. శౌచం రెండు విధాలు. బాహ్యశౌచం అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. అంతశ్శౌచం అంటే అంతరంగం నిర్మలంగా ఉండడం. యోగానికి రెండూ అవసరమే. ఉన్నదానితో తృప్తిచెంది, దయాగుణం కలిగి ఉండడమే సంతోషం. శీతోష్ణాది ద్వంద్వాలను సహించడం, హితమైన ఆహారాన్ని మితంగా తీసుకోవడం మొదలైనవి తపస్సు. జపం, శాస్త్ర పఠనం స్వాధ్యాయం. ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తూ పరమాత్మునికే అర్పించడం ఈశ్వరప్రణిధానం. రెండవ అంగములో మొదటి నియమమైన శౌచం ఇవాళ ప్రపంచ మానవాళి అంతా తప్పకుండా ఆచరించవలసిన అవసరం కలిగింది. అందుకే మనమంతా వ్యక్తిగత శుభ్రతను పాటిస్తున్నాం. మొదటి అంగములో మొదటిదైన అహింసను ఆచరించాలన్న అవగాహన కూడా పెరిగింది. ‘అహింస అంటే ప్రాణులను చంపకుండా ఉండటం మాత్రమే కాదు. జీవులకు ఏ విధమైన కష్టాన్నీ కలిగించకపోవడమే అహింస’ అని శ్రీశంకర భగవత్పాదుల నిర్వచనం (అహింసా అపీడా ప్రాణినాం’). ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న విపత్తుకు కారణం.. వన్యప్రాణులపై చేస్తున్న హింస, మనిషి స్వార్థం, అత్యాశ తదితరాలే. ఈ  పరిస్థితులు మారాలంటే మనం మారాలి. మనుషుల్లో మానసిక పరివర్తన రావాలి. మార్పు వ్యక్తుల నుండి మొదలు కావాలి. 

అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః

అహింసా ధర్మంలో సుస్థిరంగా ఉండేవాని సాన్నిధ్యంలో పరస్పర విరోధ స్వభావం కలిగిన జంతువులు కూడా హింసను వదిలిపెడతాయి. అతని చెంత సింహం, ఏనుగు శాంతంగా వర్తిస్తాయి. పులి, మేకపిల్ల ఆటలాడుకొంటాయి. ఈ స్థితిలో స్థిరమైనవాడే యోగి. ఇదే అహింస యొక్క పరమావధి. కాబట్టి.. శౌచాన్ని (బాహ్యాభ్యంతర) పాటిస్తూ సాధ్యమైనంత వరకు అహింసను ఆచరించగలిగితే చాలా కష్టాలు రాకుండా నివారించగలుగుతాం.

........................................................

యమ నియమాలు!!

యమము, నియమము అనేవి పది ధర్మాలు ఉంటాయి. అవి సామాన్య ధర్మాలు. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ వీటిని పాటించవలసిన విధంగా అవి ఉంటాయి. అలాగే విశేష ధర్మము కూడా ఉంటుంది. ఈ ధర్మాల గురించి భగవద్గీత లో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ ఇలా చెబుతాడు.

【శ్లోకం:- స్వధర్మమనీ చావేక్షకైన వికమితుమర్ష్యసి ధర్మ్యా ద్ధి యుద్ధాల్చేయోన.. స్వత్ క్షత్రియస్య న విద్యతే!!

అర్జునా! నీ స్వధర్మము అయిన క్షాత్రధర్మమును నిర్వర్తించడానికి నీవు భయపడనక్కరలేదు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధమును మించినట్టి శ్రేయస్కరమైన ధర్మము మరొకటి లేదు. ఓ అర్జునా ! నీవు క్షత్రియుడవు, యుద్ధం చేయడం నీ ధర్మం నీ ధర్మాన్ని నీవు నిర్వర్తింగానికి వీవు భయపడతావెందుకు. అసలు క్షత్రియుడికి భయం అంటే ఏమిటో తెలియదు. ఈ భయం నీకు ఎక్కడి నుండి దాపురించింది. క్షత్రియుడికి యుద్ధము చేయడమే వరము ధర్మము. యుద్ధం. చేయడం తప్ప మరేదీ, క్షత్రియుడికి శ్రేయస్సును ఇవ్వదు. ఇందాకా ఏదో భిక్షాటన చేస్తాను. అన్నావు అది నీ ధర్మం కాదు. అది బ్రాహ్మణ ధర్మము. కాబట్టి నీ ధర్మం నీవు నెరవేర్చు. విల్లు పట్టు యుద్ధం చెయ్యి అని కృష్ణుడు ఇప్పటి వరకు తాత్విక దృష్టితో చెప్పాడు. 

తరువాత ధర్మము అనేకోణంలో నుండి చెబుతాడు. ఎందుకంటే వేదాంతము అందరికీ అర్థంకాదు. ముందు ప్రిపరేషన్ కావాలి. లేకపోతే వేదాంతాన్ని అపార్ధం చేసుకుంటారు. ఎవరూ నాకు అర్థం కాలేదు అని అనదు. అయితే అర్థం చేసుకుంటాడు లేకపోతే అపార్థం చేసుకుంటాడు. అందుకని ధర్మం గురించి కూడా భగవానుడు చెబుతున్నాడు. స్వధర్మము అనే కోణం నుండి చూచినా నీవు యుద్ధం చేయక తప్పదు అని అర్జునుడికి విశధీకరించారు. ధర్మము రెండు విధాలు. సామాన్య ధర్మము, విశేష ధర్మము, 

సామాన్య ధర్మము

మానవులకు అందరికీ ఒకటే. యూనివర్సల్, ఆడ, మగ, కుల, మత, జాతి, ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ వర్తించేది సామాన్య ధర్మము. మనిషిగా పుట్టి, సమాజంలో జీవిస్తున్న ప్రతివాడు సామాన్య ధర్మాన్ని పాటించాలి. ఈ సామాన్య ధర్మములను 10 గా విభజించారు. వాటిని

యమ, నియమములు అని అంటారు. ఇవి ఏ దేశంలో ఉన్నా ఏకాలంలో ఉన్న ప్రతి జీవి ఆ నియమాలను అనుసరించాలి. ఇవి కేవలం భారతీయులకు హిందువులకు మాత్రమే అనుసరించవలసినవి కావు, అందరూ ఆచరించవలసిన ధర్మములు,

తరువాతది విశేష ధర్మము. అంటే వాడి వర్ణమును బట్టి చేసే పనిని బట్టి ఉండే ప్రదేశాన్ని బట్టి వాడి అర్హతను బట్టి, స్థితిని బట్టి, గుణమును బట్టి ఆచరించేది. అది ప్రతి మనిషికి వేరు వేరుగా ఉంటుంది. ఉదాహరణకు బ్రాహ్మణులు వేదములు శాస్త్రములు చదవాలి. అధ్యయనం చేయాలి. ఇతరుల చేత చదివించాలి. తాను చదివింది ఇతరులకు అర్ధం అయేటట్టు చెప్పాలి. అది బ్రాహ్మణుల ధర్మం, అంతే కాని యుద్ధం చేయడం, వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడం, ఉద్యోగం చేయడం బ్రాహ్మణ ధర్మం కాదు. అలాగే క్షత్రియులు రాజ్యపాలన చేయాలి, ప్రజలను కాపాడాలి. అవసరమైతే ధర్మయుద్ధం చేయాలి. అంతే కానీ బ్రాహ్మణ ధర్మంపాటించకూడదు. ఇదే విశేష ధర్మము.

యమము, నియమము అనేవి వది ధర్మాలు, ఇది సామాన్య ధర్మాలు. అందరూ పాటించవలసినవి. నియమములు: 

1. అహింస... ఇతరులు నాకు ఏమి చేస్తే నా శరీరానికి, మనసుకు బాధ కలుగుతుందో అది నేను ఇతరుల పట్ల చేయకూడదు.

2. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. పరమాత్మ ఒక్కడే సత్యం అని తెలుసుకోవడం.

3. అస్త్రీయం... ఒకరి వస్తువు తీసుకోకూడదు. తనకు ఉన్నదానితో తృప్తిపడటం.

4. బ్రహ్మచర్యం నిరంతరం పవిత్రమైన జీవితం గడపాలి, త్రికరణములు శుద్ధిగా ఉంచుకోవాలి.

5. అపరిగ్రహం... ఎంత అవసరమో అంతే సంపాదించడం, ఇతరులనుండి తీసుకోవడం.

6, శౌనం, ... శారీరక, మానసిక పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం. శరీరము మాదిరే మనసును కూడా ఎల్లప్పుడు నిర్మలంగా శుభ్రంగా ఉంచుకోవడం. 

7. సంతోషము ఉన్నదానితో తృప్తిపడటం, అసూయ, ద్వేషము ఉండకూడదు.

8. తపస్సు... స్వీయ క్రమశిక్షణ, ప్రతి పనిని శ్రద్దగా ఏకాగ్రతతో, నిష్కామలుద్ధితో, కర్తృత్వ భావన లేకుండా చేయడం.

9. స్వాధ్యాయము..... శాస్త్రములు చదువుతూఉండాలి. అన్నీ కాకపోయినా ఏదో ఒకటి చదవాలి.

చేసే ప్రతి పనీ భగవంతుడికి సమర్పించుకోవాలి. తనను తాను పరమాత్మకు అర్పించుకోవాలి. పరమాత్మకు శరణాగతుడు కావాలి.

విశేషధర్మములు: ఎవరి ధర్మం వారు చేయాలి. ప్రతివారికి ఒక ధర్మం ఉంటుంది. అందరూ అన్ని పనులు చేస్తే ఏ పనీ కాదు. ఆ నాటికాలంలో వర్ణవ్యవస్థ ఉండేది. దానికి ఒక ప్రత్యేకత ఉంది. దానికే స్వధర్మము, వర్ణాశ్రమ ధర్మము అని పేరు. నీకు కేటాయించిన ధర్మం నీవు చెయ్యాలి.

నీది క్షత్రియ ధర్మము, అధర్మం నుండి ప్రజలను రక్షించేవాడు క్షత్రియుడు. క్షత్రియుడు (ఈనాడు) పోలీసు, సైనికుడు, న్యాయాధికారి, న్యాయమూర్తి) అహింస అంటే కుదరదు. సత్యం అయినా ప్రమాదం పరిస్థితులలో చెప్పకూడదు. హింసతో కూడినది అని నీ ధర్మము అయిన యుద్ధం చేయకపోవడం తప్పు. నీవు క్షత్రియుడివి కాబట్టి నీ స్వధర్మం యుద్ధం కాబట్టి నీపుయుద్ధం చేయక తప్పదు. ఇది హింస కాదు. దీని వలన నీకు పాపం రాదు. ఇది ధర్మయుద్ధం కాబట్టి ఇది మీకు శ్రేయస్కరమైన కార్యము అని కృష్ణుడు అర్జునుడితో చెబుతాడు.

పై విషయాలు గమనిస్తే మనిషి తాను చేయవలసినది, నేర్చుకోవలసినది ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది

........................................................

(సేకరణ)(ఆదిత్యనారాయణ)(తిప్పానా)

0

[5:03 pm, 04/06/2022] +91 92915 82862: 🧘‍♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘‍♀️


 18వ శ్లోకం:-


జిహ్వే కీర్తయ కేశవం మురరి పుం చేతో భజ శ్రీధరం పాణి ద్వంద్వ సమర్చ యాచ్యుత కధా: శ్రోత్రద్వయ త్వం శృణు కృష్ణం లోకయ లోచన ద్వయ హరే ర్గచ్చాంఘ్రి యుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్ నమా ధోక్షజం || 


భావం:-


(ఇంద్రియ నిగ్రహం రెండు రకాలు. చేయకూడని వాని నుండి మరలించుట, చేయవలసిన వానిని చేయుట. వెనుకటి శ్లోకమున జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సులచే విడువదగిన వానిని చెప్పి, ఇందు చేయదగని వానిని చెప్పుచున్నారు.)


ఓ పాద ద్వంద్వమా! నీవు భగవదాలయమునకు నడుచు చుండుము. ఓ హస్త ద్వంద్వమా! నీవు భగవదర్చన చేయుచుండుము. ఓ వాగింద్రియమా! నీవు కేశవుని కీర్తింపుచుండుము. ఓ శిరమా! నీవు భగవంతుని నమస్కరించుచుండుము. (ఇట్లు కర్మేంద్రియములను నిగ్రహింపవలెను.) ఓ…

[5:03 pm, 04/06/2022] +91 92915 82862: 🧘‍♂️81-కర్మ - జన్మ🧘‍♀️

🕉️🌞🌏🌙🌟🚩


 8 వ ఆధ్యాయం - "కర్మ మర్మం"


 చెడ్డ పనులు చేసేవారు దుర్మార్గులా? 


 ప్రతీ జీవాత్మ చుట్టూ పేరుకున్న స్వార్ధ కర్మలు, పరమార్ధ కర్మలు పూర్తిగా మటుమాయం అయిన స్థితే మోక్ష స్థితి, లేదా ముక్తి, ఆత్మ సాక్షాత్కారం.



ప్రతీ జీవి ఎనభై నాలుగు లక్షల రకాల జీవకోట్ల శరీరాల్లో ప్రయాణించాక చివరికి మనిషి శరీరం లోకి ప్రవేశిస్తుంది. అప్పటినించి మనిషి ఎన్ని వేల లేదా కోట్ల జన్మలు ఎత్తినా, ప్రతీ జన్మ ప్రయోజనం ముక్తి దిశకి ప్రయాణించడమే అవుతుంది. దీన్నే 'పరిణామ క్రమం' అంటారు.



ఎత్తిన ప్రతీ జన్మ నించి జీవి స్వార్ధ కర్మలని చేయడం తగ్గించుకోవాలనే పాఠాన్ని నేర్చుకుంటూ, చివరకి ఒక్క స్వార్ధ కర్మని కూడా చేయని స్థితికి చేరుకుంటుంది. చివరకి కేవలం పరమార్ధ కర్మలని మాత్రమే చేసే స్థితికి కూడా చేరుకుని ముక్తిని పొందుతుంది.



 అందువల్ల స్వార్ధ కర్మలని చేసే ఏ మ…

[5:03 pm, 04/06/2022] +91 92915 82862: 🧘‍♂️85) అష్టావక్ర గీత 🧘‍♀️ 

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


అధ్యాయం - 7

ఆత్మా - ఆనందనిలయం  


 శ్లోకం 04:-


నాత్మా భావేషు నో భావస్తత్రానంతే నిరంజనే ।

ఇత్యసక్తోఽస్పృహః శాంత ఏతదేవాహమాస్తితః ॥ 7-4 ॥


శ్లో|| నాత్మా భావేషు నో భావః తత్రానన్తే నిరంజనే |

 ఇత్యసక్ కస్పృహశ్శానః ఏతదేవాహమాస్థితః || 4.



नात्मा भावेषु नो भावस्तत्रानन्ते निरञ्जने ।

इत्यसक्तोऽस्पृहः शान्त एतदेवाहमास्तितः ॥ ७-४ ॥



naatmaa bhaaveshu no bhaavastatraanante niranjane ।

ityasakto’spri’hah’ shaanta etadevaahamaastitah’ ॥ 7-4 ॥


టీకా 


ఆత్మా = ఆత్మ, భావేషు = దేహాదిభావములయందు, న = లేదు, భావః = దేహాదికభావము, తత్ర = ఆ, అనన్తే = అనంతమైన, నిరంజనే = నిరంజన (నిర్ద్వంద్వ)మైన ఆత్మయందు, నో= లేదు, ఇతి = ఈ ప్రకారముగా, అసక్తః = సంగరహితుడనైన, శాన్తః = శాంతుడనైన, అహం= నేను, ఏ…

[5:03 pm, 04/06/2022] +91 92915 82862: 🧘‍♂️5) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘‍♀️

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


05) శ్లోకం:-


శ్లో॥ సూక్ష్మాఖ్య భూతగత సత్త్వ రజస్తమోభిః  లింగం శరీర ముదభూ దత ఈశ్వరేచ్ఛా ।


పంచీ చకార వియదాదిక భూత సూక్ష్మా ణ్యండం హ్యభూదత ఇదం సహ జీవభోగ్యైః ॥ 5


టీకా


సూక్ష్మ ఆఖ్య = సూక్ష్మమనే పేరుగల, భూతగత = భూతాలలో ఉన్న, సత్త్వరజః తమోభిః = సత్త రజస్తమోగుణాలతో, లింగం శరీరం = సూక్ష్మశరీరం, ఉదభూత్ = ఉదయించింది, అతః = అప్పుడు, ఈశ్వర ఇచ్ఛా = ఈశ్వరుని సంకల్పం, వియత్ ఆది భూత సూక్ష్మాణి = ఆకాశం మొదలైన సూక్ష్మ భూతాలని, పంచీ చకార = పంచీకరణం చేసింది, అతః = అందుండియే, జీవభోగ్యైః సహ = జీవుళ్ళు భోగించడానికి తగిన విషయ వస్తువులతో సహా, ఇదం = ఈ ప్రపంచం, ఆభూత్ = తయారైంది.


భావం:-


సూక్ష్మమనే పేరుగల ఈ పంచభూతాలలోని సత్త్వరజస్తమోగుణాలతో సూక్ష…

[5:03 pm, 04/06/2022] +91 92915 82862: 576) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"


నిరుపాధిబ్రహ్మతత్త్వే భాసమానే స్వయంప్రభే ౹

అద్వైతే త్రిపుటీ నాస్తి భూమానన్దోఽ త ఉచ్యతే 

౹౹33౹౹


బ్రహ్మానందాభిదే గ్రంథే పంచమోధ్యాయ ఈరితః ౹

విషయానంద ఏతేన ద్వారేణాన్తః ప్రవిశ్యతామ్

౹౹34౹౹


ప్రీయాద్ధరిర్హ రోఽ నేన బ్రహ్మానన్దేన సర్వదా ౹

పాయచ్చ ప్రాణినః సర్వాన్స్వాశ్రితాన్

శుద్ధమానసాన్

౹౹35౹౹


స్వయంప్రకాశరూపము,

అద్వితీయము,ఉపాధి శూన్యము అయిన పరమతత్త్వం భాసమానమైనప్పుడు త్రిపుటి అనేది ఉండదు -



నిరుపాధికము,అద్వయము,స్వయంప్రకాశము అగు బ్రహ్మతత్వము భాసించునపుడు జ్ఞాన జ్ఞాత జ్ఞేయము అనెడి త్రిపుటి ఉండదు.ఆ త్రిపుటి అనేది లేకపోవటాన్నే భూమానందం అనబడినది.



బ్రహ్మానందమనే పేరుగల ఈ గ్రంథమున పంచమాధ్యాయమగు విషయానందము వివరింపబడినది.

ఈ విషయానందాన్ని ద్వారంగా చేసుకొని…

[5:03 pm, 04/06/2022] +91 92915 82862: 🧘‍♂️76- ఒక యోగి ఆత్మకథ🧘‍♀️

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


(🖌️రచన :- శ్రీ పరమహంస యోగానంద)

అధ్యాయం : 17


శశి, మూడు నీలాలు


శ్రీయుక్తేశ్వర్‌గారు చిరునవ్వు నవ్వుతూ నన్ను సముదాయించారు. “నువ్వు మనసారా ఆధ్యాత్మిక సాధన చేశావు. అంచేత కాలేజి చదువు ఉపేక్షించకుండా ఉండలేకపోయావు. వచ్చేవారం మాత్రం జాగ్రతగా పుస్తకాల్లో మునిగి ఉండు; ఓటమి లేకుండా గండం దాటతావు.”


అప్పుడప్పుడు నాలో సహేతుకంగా తల ఎత్తే సందేహాల్ని అణిచేసుకుంటూ కలకత్తాకు తిరిగి వచ్చాను. నా బల్ల మీదున్న పుస్తకాల గుట్టను పరకాయిస్తూ, నట్టడివిలో దారి తప్పిన బాటసారిలా ఆందోళన పడ్డాను.


చాలాసేపు ధ్యానం చేసిన మీదట నాకు శ్రమను తగ్గించే ఉత్తేజం కలిగింది. ప్రతి పుస్తకం అలవోకగా తెరిచి, ఎదుట కనిపించిన పుటలు మాత్రమే చదువుతూ వచ్చాను. ఇలా రోజుకు పద్దెనిమిది గంటల చొప్పున వారం రోజులపాటు ఈ పద్ధత…

: శ్రీ అన్నమయ్య సంకీర్తన

🕉🌞🌎🌙🌟🚩


గానం. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు

రాగం. హిందోళం.


రేకు : 80 - 4

సంపుటము : 1 - 385

రేకు రాగం : పాడి.



వినా వేంకటేశం న నాథో న నాథః

సదా వేంకటేశం స్మరామి స్మరామి !

హరే వేంకటేశః ప్రసీద ప్రసీద

ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ !!



అంతయు నీవే హరి పుండరీకాక్ష

చెంత నాకు నీవే శ్రీరఘురామ!!



కులమును నీవే గోవిందుడా నా

కలిమియు నీవే కరుణానిధి

తలపును నీవే ధరణీధర నా

నెలవును నీవే నీరజనాభ!!



తనువును నీవే దామోదర నా

మనికియు నీవే మధుసూదన

వినికియు నీవే విట్ఠలుడా నా

వెనకముందు నీవే విష్ణు దేవుడా!!



పుట్టుగు నీవే పురుషోత్తమ

కొన నట్టనడుము నీవే నారాయణ

ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు

నెట్టన గతి ఇంక నీవే నీవే!!


🕉🌞🌎🌙🌟🚩


భావము:-  


     ఓ శ్రీ హరీ! పుండరీకాక్షా! (పద్మ నయనా) నాకు అంతా నీవే. ఇంకొకటి లేదు. రఘుకులసోమా! శ్రీ రామా! సదా నా సమీపం…

[5:04 pm, 04/06/2022] +91 92915 82862: శ్రీమన్నారాయణీయము దశమ స్కంధము 68వ దశకము - భగవత్ సాక్షాత్కారము - 68 - 9 & 10 - శ్లోకములు

🕉️🌞🌏🌙🌟🚩


68-9


అయి నిశమ్యతాం జీవవల్లభాః।ప్రియతమో జనో నేదృశో మమ।


తదిహ రమ్యతాం రమ్యయామినీష్వనుపరోధమిత్యాలపో విభో॥


9వ భావము:-


ప్రభూ! ఇంకనూ వారితో ఇట్లంటివి. "ప్రియగోపికలారా! నన్ను కఠినాత్ముడని తలచవలదు.



నామాట వినండి. నేను అదృశ్యమగటతో నాయెడల మీ అనురాగము ఇంకనూ బలపడునని భావించి అట్లుచేసితిని. వేరొక విధముగా కాదు", అని పలికితివి.


🕉️🌞🌏🌙🌟🚩

 

68-10


ఇతి గిరాధికం మోదమేదురైర్ర్వజవధూజనైః సాకమారమన్।


కలితకౌతుకో రాసఖేలనే గురుపురీపతే।పాహిమాం గదాత్॥


10వ భావము:-


భగవాన్! ఈ విధముగా నీవు పలుకగనే - ఆ గోపస్త్రీలు అత్యంత ఆనందమును పొందిరి.



ఆ గోపస్త్రీలతో విహరించుచూ, రాసక్రీడ నృత్యము చేయుచూ వారిని ఆనందంపజేసిన గురవాయూరు పురాధీశా! నా వ్యాధులనుండి నన్ను రక్షింపుము.

 

దశమ స్కంధము

68వ దశకము సమాప్తము.


🕉️🌞🌏🌙🌟🚩

- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)

🕉🌞🌎🌙🌟🚩


664) శ్లోకము :-


యతః కాలవ్యాజాత్ పచసి

భువనం వైద్యుతమహః 

ప్రభావాత్ కాలీం త్వా మయి! 

విదు రతః పండితవరాః!


ప్రభోః శస్త్రం భూత్వా దహసి

యదరీన్ వజ్రవపుషా 

ప్రచండాం చండీం  తద్ భగవతీ!

భణం త్యక్షయబలే!! 664


పదవిభజన:-


యతః కాలవ్యాజాత్ పచసి

భువనం వైద్యుత మహః 

ప్రభావాత్ కాలీం త్వాం  అయి! 

విదుః అతః పండితవరాః!


ప్రభోః శస్త్రం భూత్వా దహసి

యత్ అరీన్ వజ్ర వపుషా 

ప్రచండాం చండీం  తత్ భగవతీ! భణంతి అక్షయబలే!! 664


భావము:-


తల్లీ ! ఓ ఉమాదేవి! 

కాలము అను మిషచే 

విద్యుత్ తేజస్సు వంటి ప్రతాప విశేషము వలన 

భువనము పక్వము చెయు 

అనగా సంకల్ప మాత్రముననే సృష్టి చేయు 

నిన్ను పండితులు కాలి అని గ్రహింతురు.



అఖండ బల సమన్వితమైన ఓ భగవతి!

సర్వ దేవతలకు ప్రభువగు పరమేశ్వర రూపక ఇంద్రునకు నీవే ఆయుధమై 

వజ్రరూపక శరీరముతో దహింతువు.…

[5:04 pm, 04/06/2022] +91 92915 82862: 🧘‍♂️376) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️ 

🕉️🌞🌏🌙🌟🚩


స్థితి ప్రకరణము  

రెండవ అధ్యాయము

దామ వ్యాళ కటోపాఖ్యానము


2-79


నైర్మల్యప్రాప్తమరణమసక్తం సర్వదృష్టిషు అమనస్త్వమిహాపన్నం బ్రహ్మ పశ్యతి నాన్యథా. 


మహానైర్మల్య కారణమున వినాశమును బొందినదియు, సమస్త పదార్థము లందును అసక్తమై యుండునదియు, ఆమనస్క స్థితిని బొందినదియు నగు మనస్సే యిట బ్రహ్మమును గాంచును గాని తదితరము కాదు.


2-80


మనో నిర్మలతాం యాతం శుభసంతానవారిభిః 

బ్రాహ్మీం దృష్టిముపాదత్తే రాగం శుక్లపటో యథా  


తెల్లని వస్త్రము రంగును గ్రహించునట్లు, సమాధ్యభ్యాసాది శుభ గుణములను జలముచే నిర్మలత్వమును బొందిన మనస్సు బ్రహ్మ (ఆత్మ) సంబంధమగు దృష్టిని పరిగ్రహించుచున్నది. 


2-81


స బాహ్యాభ్యన్తరం త్యక్త్వా సర్వాం దృశ్యదృశం యదా మనస్తిష్ఠతి తల్లీనం సంప్రాప్తం తత్పదం తదా. 


మనస్సు ఎపుడు సమస్త బాహ్యాభ్యంతర దృశ్యమును వదలి (ఆత్మయందు) లీనమై యుండునో, అపుడు పరమాత్మపదము సంప్రాప్తించినదే యగును.

*తిరుమల కొండలలో తుంబురుతీర్థము

తిరుమల లో అరువది ఆరు కోట్ల తీర్థములు వున్నాయి అని మన పురాణాలు చెపుతున్నాయి.  అందులో ఈ క్రింద వుదహరించిన తీర్థములు ముఖ్యమని చెపుతారు.


1. స్వామివారి పుష్కరిణి, 2. ఆకాశగంగ , 3. పాపవినాశనము , 4. పాండవతీర్థము

5. కుమారధార తీర్థము , 6. తుంబురు తీర్థము, 7. రామకృష్ణ  తీర్థము

8. వైకుంథ తీర్థము , 9. శేష తీర్థము, 10. శీతమ్మ తీర్థము. 11. పసుపు తీర్థము

12. జాపాలి తీర్థము , 13. సనకశనందన తీర్థము

ఈ (2017) సంవత్సరం మార్చి నెల 11,12,13 తేదీలలో తుంబురు తీర్థము యాత్ర వున్నది కనుక ఆ యాత్ర గురుంచి అప్పట్లో ప్రస్తావించడం జరిగింది.  తిరుమల తిరుపతి  దేవస్థానం వారు ఈ యాత్రా తేదీలు వెల్లడిస్తూ వుంటారు. 

తుంబురుతీర్థం సంవత్సరంలో కేవలం మూడు రోజులు మాత్రమే వెళ్ళడానికి అనుమతి వుంటుంది. తిరుమల, జాపాలితీర్ఠం, అకాశగంగ, పాపవినాశన తీర్ఠం మీదుగా ఈ యాత్ర ప్రారంభ మవుతుంది. పాపవినాశనం dam వద్ద pain killer tablets, B.P Tablets , Pain Balms  తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉచితంగా ఇస్తారు. అత్యవసర వైద్య సేవలు దేవస్థానం వారు యేర్పాటు చేస్తారు. జారిపడి దెబ్బలు తగలడం, కళ్ళు తిరిగి పడడం, నడవలేక మధ్యలో వుండి పోవడం జరిగితే దేవస్థాన సహాయం యేర్పాట్లు వుంటాయి. ఈ యాత్ర సాధారణంగా  ఫాల్గుణ శుద్ధ చతుర్దశి,  పౌర్ణమి మరియు మరుసటి రోజు వరకు మాత్రమే ఈ యాత్రకు అనుమతి వుంటుంది. అదికూడా యాత్రీకులు గుంపులు గుంపులుగా వెళతారు. కొండలు యెక్కడం, దిగడం, దట్టమైన అడవులగుండా లోయలలోనుండి వెళ్ళవలసి వస్తుంది. మృగాలు, పాములు, రాళ్ళు, గుట్టలు, యెత్తులు, పల్లాలు, సెలయేర్లు దాటుకుంటూ తుంబురుతీర్థము చేరవలసి వుంటుంది. గుంపులు గుంపులుగా యాత్రీకులు వేలాది మంది వెళుతుంటారు కనుక మృగాలు, పాముల భయం వుండదు.  మార్గమధ్యంలో తినడానికి భోజనం, టిఫిన్‌ లాంటివి దొరకవు. కొన్ని స్వచ్ఛంద  సంస్థలు దారిలో పులిహోర, చక్కెర పొంగలి, పెరుగు అన్నం, మంచినీళ్ళు, మజ్జిగ వంటివి  ఉచితంగా ఇస్తారు. Cool drinks, సమోస, బజ్జీలు, పకోడీలు, తేనీరు వంటివి లభిస్తాయి. కాని చాల ఖరీదుగా లభిస్తాయి.   

ఈ తుంబురుతీర్ఠం గురుంచి ఒక కథ ప్రాచుర్యంలో వుంది. తుంబురుడు అనే గంధర్వుడు తన సోమరి అయిన భార్యను కప్ప అయి అక్కడవున్న చిన్న కొలనులో జీవించమని శపించాడు. తరువాత పశ్చాత్తాపపడి  అగస్త్యమహాముని దర్శనంతో శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు.  

ఆవిధంగా ఆ కప్ప చాల సంవత్సరములు అగస్త్యమహాముని గురుంచి రాక కొరకు వేచి వుంది. తర్వాత అగస్త్యమహాముని తన శిష్యులతో రావడం ఆకప్పకు శాప విముక్తి లభించడం జరిగింది. అప్పటినుండి ఆ  తీర్ఠము తుంబురుతీర్ఠముగా  ప్రసిద్ధి పొందింది.  తుంబురుతీర్ఠ స్నానముతో మోక్షము లభిస్తుందని అగస్త్యమహాముని తన శిష్యులకు చెప్పడం జరిగింది.  తుంబురతీర్ఠం కొన్ని వందల అడుగుల పైనుండి ఏకధారగా నిరంతరం పడుతూ వుంటుంది. క్రింద పడిన నీరు అక్కడ చిన్న చిన్న కొలనులుగా మారుతుంది. అటువంటి కొలనులలో కొన్ని అడుగుల  లోతులో పడిన వస్తువు కూడా  స్పష్టంగా కనిపించే అంత స్వచ్చంగా ఈ నీరు వుంటుంది. ఈ నీటిలో స్నానం చేసిన తరువాత శరీరములు ఏ సబ్బుతో గాని, నలుగు పిండితో గాని తోముకున్నా కూడా రానంత కాంతి వంతముగా అవుతాయి అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ధరించిన వెండి, బంగారు నగలు క్రొత్త నగల వలె ధగధగ లాడుతూ వుంటాయి.  ఏ సంగతి యెలవున్నా ఈ  నీటికి ఏ మినరల్‌ వాటర్‌కూ వుండనంత రుచి వుంటుంది. ఈ కొండలలో అనేక రకాల ఓషధులకు సంబంధించిన వృక్షములు, మొక్కలు వుండడం చేత, వాటి గుండా వచ్చే నీరు అవడంచేత తుంబురుతీర్ఠంలోని నీటికి ఔషధ లక్షణము వుంటుంది. ఈ కొండలలో వేప, తుమ్మ, టేకు, ఎర్ర చందనము, మద్ది మొదలైన కలప జాతులు, ఓషధ జాతులకు సంబంధించిన వృక్షములు, మొక్కలు వున్నాయి. ఈ కొండలను శేషాచలం కొండలు అంటారు. మనం తిరుమల వెళుతున్నప్పుడు అలిపిరి దాటిననుండి తిరిగి వచ్చే వరకు  ఈ కొండలలో వున్న ఓషధ ప్రభావంతో మన మనసు ఏదొ చెప్పలేనంత అహ్లాదంగావుంటుంది. 

ఈ దారిలో కొండలోయల్లో భక్తులు యజ్ఞ, యాగాదులు చేయడం, పూజలు, భజనలు అన్నదానాలు నిర్వహించడం ఈ మూడు రోజుల్లో జరుగుతూవుంటుంది. మద్యం త్రాగడం మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలు ఎట్టి పరిస్తితిలోను ఇచ్చట జరగవు.  

ఈ యాత్రకు వెళ్ళే వారు రాళ్ళపైన నడవడానికి కాళ్ళకు బూట్లు, ఎత్తులో ఒక రాయి నుండి ఇంకొక రాయి పైకి  ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు  ఊత కోసం  చేతిలో ఒక కర్ర అవసరమవుతాయి. అక్కడే ఏదో ఒక చెట్టు నుండి కర్రను సేకరించవచ్చును.  రాళ్ళపైన నడవడానికి  పాపవినాశనం నుండి బయలుదేరిన తరువాత మార్గమధ్యంలో ఒక అమ్మవారి గుడి వుంటు…

.....

* సుకుమారి సున్నితత్వం సుమధుర మందహాసం చూచువారికి తెలియని విద్యుత్తు ఆవహించి ఎదో కావాలి మరోదో పొందాలి అనే ఆత్రుత ఆరాటం, తెరచాప కదలికల అందం కనిపించి కనిపించి కనిపించని కమనీయదృశ్యం, పెదవులద్వారా సుమధుర సంగీతం మనసుకు ఆహ్లాదం అనిపించు గంబీరమై, మేలి ముసుగు ణ మెరిసే తళుకు బెళుకుల అందం సర్వులను ఆకర్షించి ఇంకా చేయాలి ఇంకా చూడాలి అంటూ మెదడు వాంఛించు అని కోరుతుననట్లు ఉన్నది।।      

సుకుమారి చేతులు కదలికలు బాలకృష్ణుడుని కూడా ముగ్ధుడ్ని చేస్తునాయి, ఏ కన్న బిడ్డయొ ఆటు బాల కాదు ఇటు మధ్య కాదు, మరి యవ్వన వతి మనసును దోచి మతి పోగొట్టునది। నవ రత్నాల వెలుగులు చిమ్ముచున్న నవరస భరిత అన్నట్లుగా పాదము నుండి శీర్షము వరకు  వర్ణించ నలవికాని స్థలము లేదు, రెండు కళ్ళు కాదు నాలుగు కళ్ళు  పెట్టుకొని చుసిన మర్చిపోలేని పాశం లా లాగేటి ప్రాణము।         

మధువుని విరజిమ్మి, మకరందాన్ని గ్రోలుకో అంటూ వికసించిన పువ్వు పరిమళం ఆస్వా దించటానికి వచ్చిన కీటకం మతి భ్రమించి నలుదిక్కుల చూసి ఆహా ఏమి పరిమళం ఎంత పీల్చినా తనివి తీరుటలేదు, కీటకము ముక్కుతో పొడిచి పొడిచి మక ర0దాన్ని జుఱ్ఱె।      


నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (13)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

  



No comments:

Post a Comment