Friday, 24 June 2022

నాలో నీవు.. నీలో నేను...10 నుండి


నేటి పద్యం - జీవన జ్యోతి 
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

తొలివలపుల మల్లె చెండు అడుగు -  చిరుగాలి వళ్ళ ఆస్వాదించని వారెవ్వరు
రజని వెలుగు  జాబిలమ్మ  అడుగు -  చిరువెల్గు వళ్ళ సంతోషించని వారెవ్వరు 
తళుకు బెళుకు గాజులమ్మ అడుగు - చిరు గుండె వళ్ళ ఆనందించని వారెవ్వరు
నలుపు తెలుపు  చీరలమ్మ  అడుగు -  చిరు జంట వళ్ళ ఆచ్ఛాదించని వారెవ్వరు

మనసు ఎప్పుడు మారుతుందో తెలియదు, కోపము ఎప్పుడొస్తుందో తెలియదు కానీ ప్రకృతిలో  ఉండేవి ఏవి మారవు అవి కూడా భాద పడతాయని ఒక్కసారి ఆలోచించండి. 

మల్లె చెండు వలపు మధ్య నలిగి పోతుంది కానీ పరిమాళాల్ను అందించి సుఖం కలిగిసింది. చీకటిలో కలిగే సరసానికి జాబిలి చిరు వెన్నెల అందించి సంతోషించటానికి సహకరిస్తుంది. గాజులమ్మ అందచందాలతో మనసు ఊరడించి తళుకు బెళుకులు చూపించి చిరుగుండెలను ఆనందపరుస్తుంది. నలుపు తెలుపు చీరలమ్మ సహకరించి చిరు జంటను ఉవ్విలూరించి ఒకరికొకరు ఆలింగనంతో  తన్మయం చెందేటట్లు చేస్తుంది.  మరి వీటిని అనుకునే వారెవ్వరు.    


ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
              
సాధన చతుష్టయ సంపత్తి( మహావాక్యముల విచారణ - పరబ్రహ్మతత్వము.)ఆదిశంకరుల వివేక చూడామణి నుండి
🕉🌞🌎🌙🌟🚩 

ఓం శ్రీగురుభ్యోమ్ నమ:

గురుదేవులు చెప్పినదానికి శిష్యుని స్పందన చూద్దాం.  

శ్లో.  ఇతి శ్రుత్వా  గురోర్వాక్యం ప్రశ్రయేణ కృతానతి :   / 
       స తేన సమనుజ్ఞాత : యయౌ  నిర్ముక్త బంధన :  //  577 . 

సద్గురువు యొక్క అమృతవాక్కులు విని మిక్కిలి వినయంతో,  గురుదేవులకు నమస్కారం  ఆచరిస్తూ,  ఆ శిష్యవరేణ్యుడు  గురుదేవుని ఆదేశానుసారం సంసార బంధము నుండి పూర్తిగా విడిపోయి బ్రహ్మ స్వరూపియై ఆనంద సముద్రంలో విహరించెను. 

శ్రీగురుదేవుల వాక్యములను చక్కగావిని, ఆ వాక్కులు మహాప్రసాదంగా భావించి వినయంతో శిరస్సు వంచి నమస్కారం చేస్తూ,  అనాత్మబంధములను తెగ త్రెంచుకొని, స్వస్వరూప పరబ్రహ్మమై శిష్యుడు  విహరించాడు.   శిష్యుడు ఈ సమయానికి పరిపూర్ణ జ్ఞానీ అయినాకూడా, అహంకార రహితుడై, అదంతా గురు ప్రసాదమే అని  చిట్టచివరి దశలో కూడా గురువు పై వినయం చూపిస్తూనే వున్నాడు.   శిష్యుడు అద్వైతానందంలో ఓలలాడుతున్నా, గురుసన్నిధిలో ఆ అద్వైత భావము చూపించి గురువును తనతో సమానమని తలపలేదు. 

భావాద్వైతం సదా కుర్యాత్  క్రియాద్వైతం న కర్హిచిత్ /  
అద్వైతం త్రిషులోకేషు నా ద్వైతం గురునా సహ  //   
( తత్వోపదేశం  ఆదిశంకరుల విరచితం ) 

ఎల్లప్పుడూ భావంలో అద్వైతం వుండాలి.  క్రియలో అద్వైతం చూపకూడదు.  మూడు లోకాల విషయములందు అద్వైత సిద్ధాంత భావన అలవరచుకోవాలి గానీ,  గురువు వద్ద అద్వైతం ప్రదర్శించ కూడదు.

నిర్ముక్త బంధన : అని చెప్పడంలో శిష్యుడు బంధ విముక్తిని పొంది జీవన్ముక్తుడయ్యాడని భావము.   ఆ విధంగా బంధ విముక్తుడు కావడానికి గురువు యొక్క ఉపదేశములు, తత్వ చింతన అడుగడుగునా శిష్యునికి ఉపకరించి  వేదాంత సారమును శిష్యుడు గ్రహించి, స్వానుభవసిద్ధ ఫలితమును శిష్యుడు పొంది, కృతకృత్యుడు అయ్యాడు. 

ఈ విధంగా శిష్యుడు గురువు పై చూపిన గౌరవము, వినయము,  సాధనలో పడిన శ్రమ తెలుసుకోవాలి.    గురుదేవుని వాక్య తత్పరత,  ప్రసన్నత, గురువుకు  నమస్కారం చేయడం,  ఆజ్ఞా బద్దుడు అవడం, బంధ విముక్తిని పొందడం ఇవన్నీ క్రమంగా వర్ణించ బడినవి. 

ఇలాంటి గురు భక్తి కలిగిన వారు తప్పక అఖండ  జ్ఞానులవుతారని తెలుసుకోవాలి.  

🕉🌞🌎🌙🌟🚩

ఓం శ్రీగురుభ్యోమ్ నమ:

ఈ శ్లోకంలో గురువు లక్షణాలను వివరిస్తున్నారు. 

శ్లో.  గురువేవ సదానందసింధౌ  నిర్మగ్న మానస :  /
      పావయన్వసుధామ్  సర్వామ్ విచచార  నిరంతర :  //  578 .

శ్రీగురుదేవులు నిరంతరము స్వస్వరూప పరబ్రహ్మానంద సాగరంలో మునిగిన మనస్సు కలవారై సమస్త భూమండలాన్ని పవిత్రంగా చేస్తూ ఆంతా తానే అయి స్వేచ్ఛగా విహరిస్తూ వుంటారు. 

గురుదేవులు స్థిరంగా ఒకచోట వుండరు.  ఎందుకనగా పరమహంసలు విహరించినట్లు విహరించే స్వభావం మహానుభావులది.  ఇదే శాస్త్ర వచనము.  అట్టి మహనీయులు ఎక్కడ పాదం పెడితే అక్కడ మహాతీర్ధం లాగా శోభిల్లుతుంది   అక్కడే గంగానదీ సమానమైన పవిత్రజలాలు వుంటాయి.   

మహాత్ముల పాదధూళి సోకినంతనే సమస్త జీవులూ పునీత౦ అవుతాయి.   వారికి భూమి అంతా కుటుంబమే ! వసుధైక కుటుంబం అనేదే వారి ధోరణి.   పరమహంసలు, అవధూతలు అయిన పరమగురువులు నిష్క్రియులై,  సంకల్పసూన్యులై,  అసంగులై, పరబ్రహ్మ స్వరూపులై,  సర్వ స్వతంత్ర విహారం చేసేవారు అయినప్పటికీ, ఎవరైనా సంసారబంధ విముక్తి కోరి తీవ్ర ముముక్షుత్వ వాంఛతో తమ దరిచేరి శరణు కోరతారో, వారిని పరమదయతో అనుగ్రహిస్తారు.  ఇది జీవన్ముక్తుల స్వభావము. 

అలాంటి మహానుభావులు కారణపురుషులై వుంటారు.  ఇలాంటివారు అంత తేలికగా జనబాహుళ్యానికి దొరకరు.  

శ్లో.  ఇత్యాచార్యస్య  శిష్యస్య సంవాదేనాత్మ లక్షణం / 
       నిరూపితం ముముక్షుణాం సుఖబోధోపపత్తయే // 579 .

ఈ ' వివేకచూడామణి ' గ్రంధంలో ముందరే తెలియపరిచినట్లుగా,  గురుశిష్యుల యొక్క ప్రశ్నోత్తర  సంవాద రూపంలో  బంధవిముక్తి ని కోరి, ఆత్మతత్త్వం తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసుల యొక్క సులభ జ్ఞానప్రాప్తికై  చెప్పబడింది.  

ఈ గ్రంధము గురుశిష్య సంవాదరూపమై నానావిధ ఉపదేశాలతోనూ, సకల ఉపనిషత్తుల సారముతోనూ నిండివున్నది.   దీనిని చదివి ఆకళింపు చేసుకున్నవారికి ఇవి అన్నీ తేటతెల్లం కాగలవు.   గ్రంధము యొక్క ముఖ్య ప్రతిపాదన ఆత్మ స్వరూప దర్శనమే.   ఆత్మజ్ఞానము కలిగించి,  అనాత్మరూప జ్ఞానమును తొలగించి శాశ్వత స్వ స్వరూప దర్శనము కలగడానికి అట్టి సాధకులకు  ఈ గ్రంథములోని విషయములు ఉపయోగ పడగలవు. 

ఈగ్రంధము యొక్క ముఖ్య ఉద్దేశ్యము సులభంగా తరించడానికి ఉపాయమును బోధించుట.   శ్రీకృష్ణుడు అర్జునునకు గురువుగా మారి భగవద్ గీత  చెప్పినట్లు, యోగ వాశిష్టం లో వశిష్టులవారు శ్రీరామునికి  గురుస్థానంలో వుంది బోధించినట్లు, ఈ గ్రంధంలో జగద్గురువులు శిష్యునికి ఆత్మ తత్వమును గురించి సంవాదరూపంలో బోధించారు.   అట్టి విధానము సులభ గ్రాహ్యము.   

తరువాతి శ్లోకంలో ' వివేకచూడామణి '  గ్రంథ విశిష్టత మరికొంత  చెప్పబడింది.   

🕉🌞🌎🌙🌟🚩

No comments:

Post a Comment