Friday 3 June 2022

***




" శ్రీవిద్యారూపిణీం , బ్రాహ్మీం ,   శ్రీ చక్రనిలయాం , పరామ్..

  శ్రీ గురుమూర్తిచిత్తజ్ఞాం ,   శ్రీబాలాత్రిపురాం భజే  !!! "

.......

శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల

 9వ శ్లోకం:-

మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తి హీనాన్ పదాబ్జే మాశ్రౌషం శ్రావ్యబంధం తవచరిత మపాస్యా నన్యదాఖ్యాన జాతం! మాస్మార్షం మాధవ త్వామపి భువన పతే చేత సాపహ్నువానాన్ మాభూవం త్వత్సపర్యా వ్యతికర రహితో జన్మ జన్మాంత రేపి!!  

భావం'-

(భక్తి నొసంగుమని ప్రార్థించి, కులశేఖరులు ఆ భక్తి కలుగుటకు ప్రతిబంధకముగా ఉండు పాపములను తొలగించుటకై, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ మనస్సులచే సాధింపదగు శమదమాది సంపత్తిని ఇందు వివరించుచున్నారు)

హే జగన్నాథా ! మాధవ ! నీ పాదారవిందములయందు క్షణమైనను భక్తి నిలుపని పుణ్యహీనులను కంటితో చూడను. చేవికింపైన బంధము కలదయినను చరిత్రము తప్ప వేరొక కథాసందర్భమును చెవితో వినను. (ఈ రెండింటి చేత జ్ఞానేంద్రియ నిగ్రహమును సూచించిరి) మానసికముగా నీ అస్తిత్వమును అంగీకరింపని వారలను (అసత్పురుషులను) నేను స్మరింపను. దీనిచే మనోనిగ్రహము సూచింపబడినది. జన్మజన్మాంతరములందును నీ కైంకర్యములేని మనుగడను కలిగియుండును. ( దీనిచే కర్మేంద్రియ నిగ్రహము సూచింపబడినది)

లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూన్ 3.

నేలపై పాకే చీమ కన్నా నేను గొప్పవాడినని అనుకుంటే నేను అజ్ఞానినే.

జాగృతి స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు

కష్టాలనే అభేద్యమైన అడ్డుగోడల్ని చీల్చుకొని ముందుకు సాగేది. సచ్ఛీలంతో శక్తిని సంతరించుకొన్న సంకల్పబలమే కానీ ధనం, పేరు ప్రతిష్టలు, పాండితీ ప్రకర్షలు ఇవేమీ కావు.

🧘‍♂️శాంతి🧘‍♀️

వర్తమానంలో ప్రతిక్షణం పరిపూర్ణంగా జీవించండి. భవిష్యత్తు తన సంగతి తానే చూసుకుంటుంది. ప్రతి క్షణంలోని అద్భుతాన్ని, అందాన్ని పూర్తిగా ఆస్వాదించండి. శాంతి సాన్నిధ్యాన్ని అభ్యసించండి అలా ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా ఆ శాంత శక్తి సాన్నిధ్యాన్ని మీ జీవితంలో అనుభూతి చెందుతారు.

*శ్రీ పరమహంస యోగానంద యోగదా సత్సంగ పాఠాలు.*

---

-పఞ్చతన్త్రమ్-


శ్లో𝕝𝕝 కాచే మణిర్మణౌ కాచో యేషాం బుద్ధిర్వికల్పతే।

న తేషాం సన్నిధౌ భృత్యో నామమాత్రోఽపి తిష్ఠతి॥

తా𝕝𝕝 ఎవరిబుద్ధికి (ఏ రాజుల బుద్ధికి) గాజుముక్క మణిగాను, మణి గాజుముక్కగాను భ్రాంతిగా 

---

తోస్తుందో అట్టి రాజులవద్ద నామమాత్రానికైననూ సేవకులు ఉండరు.

*సొగసు చూడతరమా!

విశ్వామిత్రుడి వెంట శ్రీరామలక్ష్మణులు సిద్ధాశ్రమానికి వెళ్లి తాటకిని సుబాహుణ్ని సంహరించారు. ముని తలపెట్టిన మోక్ష కామేష్టి యజ్ఞం సజావుగా ముగిసింది. విశ్వామిత్రుడి ఆనందానికి అవధులు లేవు. అక్కడ మిదిలలో మైథిలి వివాహం చేయడానికి జనకుడు స్వయంవరం నిర్వహిస్తున్న విషయం విశ్వామిత్రుడికి అప్పుడే తెలిసింది. శ్రీరామ లక్ష్మణులకు తాము మిథిలా నగరానికి వెళ్ళాల్సి ఉందని చెబుతాడు. ఆ ముగ్గురూ మిథిలకు చేరుకుంటారు. అక్కడి ప్రజలు విశ్వామిత్రుణ్ని, ఆయన వెంట నడుస్తున్న శ్రీరామలక్ష్మణులను విస్మయంగా గమనించసాగారు. ముఖ్యంగా శ్రీరాముడి సౌందర్య శోభ వారిని అబ్బురపాటుకు గురిచేసింది. వాల్మీకి రామాయణంలో వర్ణించినట్లు ఆయన రత్నదీపంగా భాసిస్తున్నాడు. ఆజానుబాహుడిగా కమల పత్రాక్షుడై ధనుర్బాణాలు ధరించి స్నిగ్ధ మోహనంగా కనిపించాడు. రాజసభలోకి రాగానే శ్రీరామున్ని చూసి జనకుడు దేవలోకం నుంచి దిగివచ్చినవాడిగా భావించాడట. దాశరథి ముఖంలో సౌశీల్యత గోచరించింది. ఆ సభలో ఉన్నవారందరినీ శ్రీరాముడిలోని నిర్భయత్వం యౌవనశోద సౌమ్యత చకితులను చేశాయి.

శివధనుస్సును శ్రీరాముడికి చూపించమని విశ్వామిత్రుడు కోరగానే జనకుడు ఆరువందల బలశాలు రచేత దాన్ని సభలోకి తెప్పించాడు. ముని క్రీగంట సూచన శ్రీరాముడు ఆసనం దిగి ఆ ధనుస్సును ఎక్కుపెట్టగానే అది. పెళ పెళ మంటూ విరిగింది. జనకుడు ఉత్కంవతతో తమ్ముడు కుశధ్వజున్ని కౌగలించుకున్నాడు. ఆరు సద్గుణాలు ప్రస్ఫుటం

అవుతున్న సంపూర్ణమైన _మానవుడు... ఇతడే సీతకు తగిన వరుడని జనకుడు వెనువెంటనే నిర్ణయించుకున్నాడని రామాయణం చెబుతోంది.

త్యాగరాజు సొగసు చూడ తరమా కృతి (కన్నడగౌళ)లో తన ఆరాధ్య దైవం శ్రీరాముడి అందచందాలను మనోహరంగా వర్ణించాడు. 'ఓ రామా నీ సొగసు... నీ సౌందర్యం ఎంత చూసినా తనివి తీరదే నీ వదనం ముచ్చట గొల్పుతూ అందానికి అది నివాసమైంది. దేవతలే ఆమర్చిన నీ పాదాలు ఆభయమిచ్చే దిన్య హస్తాలు మన్మథుని మించిన రమణీయత (అమరార్చిత పద యుగమో అభయ ప్రదకర యుగమో) నన్ను ఆరాధనకు తొందర పెడుతున్నాయి... అని గారం చేశాడు. 'ఏరువుతో నిండిన పండులా నీ ఆదరాలు పొగడ పూవులతో నిండిన నీ వక్షస్థలం ధనుర్బాణాలతో నిండిన నీ పరాక్రమ సూచికలు... నీ నుదుటిపై ముంగురులు అందుకు తగిన చిరునవ్వు కన్నులందలి తళుకు (చిరునవ్వో ముంగురులో మరి కన్నుల తేటో) నాకు సంభ్రమం కలిగిస్తున్నాయి' అని ఆలపించిన కీర్తనా సుమనోహరమే.

సీతా రామ లక్ష్మణులు కైకేయి ఆజ్ఞపై అరణ్యవాసం చేసినప్పుడు దండకారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ మునులందరూ శ్రీరాముణ్ని దర్శించుకోవడానికి వచ్చారు. వారెప్పుడూ అరణ్యాలు విడిచి నగరాల్లోకి వెళ్లని రుషులు. తొలిసారిగా శ్రీరామున్ని చూసినప్పుడు ఆకర్షణీయమైన రూపం గమనించి. మాటలు రాక తడపడ్డారట. వాళ్ళందరూ శ్రీరాముడి నుంచి వేరుగా ఉండడం ఇష్టం లేక... ఆయన తదుపరి అవతారంలో ఆయనను సదా వెన్నంటి ఉండే గోపకన్యలుగా జన్మించడానికి అనుమతిని కోరారని జనసేనుడు రాసిన హరివంశ పురాణం చెబుతోంది. శ్రీరాముడు తన అందచందాలతో అందరి హృదయాలను దోచుకున్నవాడే కాక ఆయన మర్యాదా పురుషోత్తముడు. ఆ సుందర రాముడు అందరి మనసులలో సుగుణాభిరాముడయ్యాడు. అందుకే

- అప్పరుసు రమాకాంతరావు

*శిఖండి

సంతానం లేని ద్రుపదుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భీష్ముణ్ణి చంపే కొడుకు కావాలని అడిగాడు.

"ముందు కూతురై పుట్టి తరువాత కొడుకుగా మారి భీష్ముణ్ణి చంపే సంతానం నీకు కలుగుతుంది" అని శివుడు వరమిచ్చాడు.

ఆ ప్రకారమే ద్రుపదుడికి కూతురు పుట్టింది. తల్లిదండ్రులిద్దరికి అసలు సంగతి ముందే తెలుసు కనుక కొడుకే పుట్టాడని అందరితోనూ చెప్పి ఆ పిల్లను పురుషవేషంలో పెంచారు. ఆమెకు శిఖండి అని పేరు పెట్టారు. శివుడి వరం సంగతి ఆమెకు చెప్పి, ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్యాభ్యాసం చేయించడం మొదలు పెట్టారు.

కూతురికి యుక్తవయస్సు వచ్చాక పెళ్ళి చేయాలనుకుని, ఈశ్వరుని వరం తలచుకుని ధైర్యం తెచ్చుకుని, దశార్ణదేశ ప్రభువు హేమవర్మ కూతుర్ని తెచ్చి పెళ్ళి చేశారు. ఆ పెళ్ళికూతురు చాలా తెలివైనది. శిఖండి అజాగ్రత్తగా ఉన్న సమయంలో అసలు సంగతి పసికట్టి తన దాసికి చెప్పింది. పరిచారిక వెళ్లి హేమవర్మ చెవిలో వేసిందా సంగతి. ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.

"కొడుకని చెప్పి కూతురికి మరో కన్యనిచ్చి పెళ్లిచేసావు. ఇందువల్ల నగుబాటు తప్ప మరేం జరిగింది నీకు? నన్ను అవమానించావు. కొడుకని చెప్పిన 

నీ కూతురికెలాగూ పురుషత్వం లేదు. నీకైనా మగతనం వుంటే యుద్ధంలో చూపించు" అన్నాడు.

"ఏం మాటలయ్యా ఇవి! కూతుర్ని కొడుకని చెప్పుకోవలసిన గతేమిటి నాకు? ఎవరో గిట్టనివాళ్ళు ఏదో చెప్పి వుంటారు మీకు. నావంటి వాడి మర్యాదైనా ఆలోచించకుండా మాట్లాడటం ధర్మమేనా?" అన్నాడు ద్రుపదుడు.

"అయితే మనిద్ధరం ఇప్పుడే నిజానిజాలు తేల్చుకుంటే సరిపోతుందిగా?" అన్నాడు హేమవర్మ.

"అబ్బే! అలా చేస్తే అబ్బాయిని అవమానించినట్లవుతుంది. ఎందుకూ - కొద్దిరోజుల్లో అబ్బాయి అత్తవారింటికోసారి రావాలిగా?" అని మెల్లగా నచ్చచెప్పి పంపించేశాడు ద్రుపదుడు.

ఇదంతా తెలిసి శిఖండి ఆ అవమానం భరించలేక మరణమే శరణ్యమనుకుని ఎవరికీ చెప్పకుండా అడవికి పారిపోయింది. అక్కడున్న యక్షుడొకడు ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నాలను గమనించి… "అమ్మాయీ! ఏమిటీ చావు ప్రయత్నం? నీ బాధేమిటో చెప్పు, నేను తీరుస్తాను" అన్నాడు.

"నా బాధ భగవంతుడు తీర్చాల్సిందే" అంది శిఖండి విలపిస్తూ.

"పోనీ నేను వినడం వలన నష్టం లేదుగా?" అన్నాడు యక్షుడు.

"ఇప్పుడు నాకు పురుషత్వం వస్తే తప్ప ఈ బాధ తీరదు" అని తన కథంతా పూసగుచ్చినట్టు చెప్పింది శిఖండి.

యక్షుడికి జాలేసింది.

"ఓస్! ఇంతేకదా! నా పురుషత్వం నీకిస్తాను. వెళ్ళి మీ అత్తింటి సందేహం పోగొట్టి మళ్ళీ పదిరోజుల్లో తిరిగిరా. అంతవరకూ నీ కన్యత్వం నేను భరిస్తూ ఉంటాను. నువ్వొచ్చాక  నా పురుషత్వం నాకిచ్చేదువుగాని" అని శిఖండిని ఓదార్చి ఆమెకు తన పురుషత్వాన్ని ఇచ్చాడు యక్షుడు.

శిఖండి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి తల్లిదండ్రులకి చెప్పేసరికి వాళ్ళు బ్రహ్మానందపడిపోయారు. తక్షణం ద్రుపదుడు హేమవర్మను పిలిపించి శిఖండి పురుషుడనే సంగతి రుజువు చేసాడు. హేమవర్మ తన తొందరపాటుకి సిగ్గుపడ్డాడు.

పది రోజులయ్యాక యక్షుడికిచ్చిన మాటప్రకారం శిఖండి అరణ్యానికి తిరిగి వచ్చాడు.

"మహాత్మా! నా పరువు దక్కించావు. నీ పురుషత్వం నువ్వు తీసుకో" అన్నాడు.

"నాయనా! నువ్వు అదృష్టవంతుడివి. ఇక నువ్వు నీ జీవితాంతం ఇలా పురుషుడుగానే ఉంటావు. ఇది దైవ నిర్ణయం" అన్నాడు యక్షుడు. సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు శిఖండి.

"నాయనా! నువ్వు వెళ్ళాక ఒకనాడు కుబేరుడు వచ్చాడు. ఆయన వస్తే ఎదురు వెళ్ళి గౌరవించాలని తెలుసు. కాని ఈ ఆడ రూపుతో వెళ్ళడానికి సిగ్గుపడ్డాను. నేను గౌరవించనందుకు ఆయనకు కోపం కలిగింది. ఆయన పరివారంలో ఉన్న యక్షులు కొందరు నా దగ్గరకు వచ్చి సంగతంతా తెలుసుకుని వెళ్ళి ఆయనతో చెప్పారు. అయినాసరే రమ్మనేసరికి నేను వెళ్ళి ఆయన పాదాలు తాకాను. 'స్థూల కర్ణా! ఇంక నువ్విలా స్త్రీ రూపంలో వుండు' అన్నాడు. 

ఆ మాట విని నేను ఏడ్చాను. యక్షులంతా నా బాధ చూసి కుబేరుణ్ణి ప్రార్థించారు. 'సరే అయితే! శిఖండి బ్రతికి ఉన్నన్నాళ్ళూ నువ్వు యిలా స్త్రీగా ఉండి, అతడు చనిపోయాక నీ పురుషత్వాన్ని మళ్ళీ నువ్వు పొందుతావు' అని కుబేరుడు అనుగ్రహించాడు. 

ఇందులో నీ తప్పేమీ లేదులే. వెళ్ళి సుఖంగా ఉండు" అని యక్షుడు అనగానే అపరిమిత ఆనందం పొందాడు శిఖండి.

స్థూలకర్ణుడి దగ్గర శెలవు తీసుకుని గబగబ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకీ వార్త తెలియజేసాడు.

ద్రుపదుడు తన అదృష్టానికి మురిసిపోయి దేవతలనూ, విప్రులనూ పూజించి నిస్సంకోచంగా ద్రోణాచార్యుడి దగ్గరకు శిష్యుడిగా పంపాడు శిఖండిని. ఆ తరువాత అస్త్రవిద్యలో అతను ఆరితేరాడు.

అంగనలనూ, అంగనాపూర్వులనూ, అంగనాకారం గలవాళ్ళనూ, అంగనానామధేయం కలవాళ్ళనూ చంపనని భీష్ముడు వ్రతం పట్టాడు. 

అందుకే శిఖండిని కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు చంపలేదు..

-----

*కృతజ్ఞతలు, ధన్యవాదములు - ఈ రెండు పదాల మధ్య అర్థంలో గల తేడా ఏమిటి? వీటిని పర్యాయపదాలుగా వాడుకోవచ్చునా?

1 .కృతం అంటే చేసినది. జ్ఞ. అంటే తెలిసిన * .కృతజ్ఞత * అంటే చేసిన సహాయం మరచిపోకుండ ఉండడం. నేను నీవు చేసినది మరచిపోను—- అని చెప్పడం లో—-"కృతజ్ఞుణ్ణి" అంటాము. కేవలం జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోదు.

ఏదీ ఊరికే తీసుకోగూడదు, — ఋణపడిపోతాము.

అది తీరడానికి మళ్ళీ మళ్ళీ పుట్టాలి.

కాబట్టి వీలైనపుడు దానికి బదులు ఎంత ఇవ్వాలో

అప్పటి మన స్థితినిబట్టి మనస్సాక్ష్యంతో తెలుసుకొని —-తీర్చేసి పోవాలి ..వీలుకానపుడు" చచ్చి నీ కడుపున పుడ్తాను" అంటాం గదా!. నీ కొడుకై నీకు సేవ చేసి నా వెనకటి బాకీ తీర్చేస్తాను —-అని చెప్పడం. . ఋణం ఏ జన్మకైనా తీర్చ వలసినదే..

విదుర సహాయంతో లక్కయింటి చావు తప్పించుకొని పాండవులు ఏక.చక్రపురంలో తల్లి తోపాటు ఒక బ్రాహ్మణుడి ఆశ్రయంలో బ్రాహ్మణ రూపాలలో ఉంటారు.

బకాసురుడికి ఆహారంగా ఆయన ఎవరో ఒకరిని ఆ నాడు పంపాలి. వాళ్లు ధార్మికంగా ఆలోచిస్తూ ఉంటారు. చివరికి ఆ విప్రుడే తాను ఆహారం కావడానికి నిశ్చయించుకొంటాడు. ఆ విషయాలన్నీ వింటున్న కుంతీదేవి వీళ్ళు మాకు ఆశ్రయం ఇచ్చారు .!!ఈ ఋణం ఎట్ల తీర్చుకుందామా అని ఆలోచిస్తూ ఉంటాను..ఇన్నాళ్ళకు అవకాశం వచ్చింది…అనుకొని ఆ బ్రాహ్మణునికి నచ్చ జెబుతుంది. "మా అబ్బాయి ని పంపుతాను. మీరు నిశ్చింతగా ఉండండి " అని.(అపుడు కొడుకులెవరూ అక్కడ లేరు).

ధర్మరాజు వస్తాడు."నీకు భీముడు వదలుకో దగిన వాడుగా అనిపించాడా? అని ధర్మ చర్చ చేయబోగా ఆమె వీడు చిన్నబిడ్డ గా ఉండగా అడవిలో సింహం తరుముకొన్నది.వీడు ఒడినుంచి జారి పడి రాళ్ళు పిండి అయ్యాయి.అపుడు అశరీర వాక్కు వినిపించింది "ఇతడు కౌరవ వినాశం చేస్తాడు" అని…కాబట్టి వీడు ఆ బకుడి పీడ విరగడ చేస్తాడని తెలిసి పంపుతున్నాను అని చెప్పింది.. ఇదీ..కృతజ్ఞత అంటే.

. (అయినా ఏ తల్లి ఇంత.ధైర్యం చేస్తుంది .)

2.నీవు చేసిన సహాయం వల్ల నా కష్టాలు తీరిపోయాయి. నా జన్మ సార్థకమైంది అనడంలో..ధన్యవాదములు . అంటాము రెండిటికీ తేడా ఉంది గదా.. కనుక తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము కనీసం వాళ్లను బాగా చూసుకొని కృతజ్ఞుడనై ఉండండి

-----



No comments:

Post a Comment