Tuesday, 5 July 2022

కధలు 01-02-2023 to 08-02-2023


ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధ లూ

01-02-2023 *మనశ్శాంతి*
ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇంతలో ఒక శిష్యుడిని పిలిచి, "నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే చెరువునుంచి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు.  అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది. శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు. అరగంట సమయం గడిచింది. చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది. మరో అరగంట సమయం వేచి చూసాడు. నీరు తేరుకున్నాయి.

ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు. అప్పుడు శిష్యుని అనుమానం " ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుంది? నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది.  మన మనసు కూడా అంతే !!

ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి. కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళిపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది.

నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు.
కొంతసేపు అలా వదిలేస్తే, దానంతట అదే సద్దుమణుగుతుంది. చక్కబడుతుంది.
మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది." 

మీకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకండి !!
వారు తప్పులు చేసారు అనుకుంటే, ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన, ఆనందకరమైన క్షణాల గురించి ఒక్కసారి తలుచుకోండి. ఎందుకంటే, పరిపక్వత కన్నా, అభిమానం ముఖ్యం. మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు. మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు.
అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి. జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకటమే. మీకు ఇష్టమైన వారి కోసం, మిమ్మల్ని ప్రేమించేవారికోసం బ్రతకండి. స్నేహం, ప్రేమ, బంధుత్వాలు అనేవి డబ్బు భాష మాట్లాడేవారికి అర్థం కావు. ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మనకు కనిపించే లాభాలను ఇవ్వలేకపోవచ్చు, కాని మనలను సంపన్నుల్ని చేస్తాయి.

****

02-01-2023 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక  /// కథకాని బోధ 

అయ్యిందేదో మంచికే అయ్యింది. . అవుతున్నదేదో అది మంచికే అవుతుంది..  అవ్వపోయేది కూడా మంచికే అవుతుంది..  నీవేమి పోకొట్టుకున్నావని విచారిస్తున్నావ్? ఏమి తెచ్చావని పోకొట్టుకుంటావ్? 
నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది  నీవు ఏదయితే పొందావో అవి ఇక్కడినుండి పొందావు  ఏదయితే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు  ఈనాడు నీవు నాసొంతం అనుకున్నదంతా, నిన్న ఇంకొకరి సొంతం కద, మరి రేపు మరొకరి సొంతం కాగలదు..  పరివర్తనం@మార్పు చెందడం అనేది లోకం యొక్క పోకడ@అలవాటు.. కావున జరిగేదేదో జరుగకమానదు..జరిగింది ఎన్నటికీ మారదు.. అనవసరంగా ఆందోళన పడకు  ఆందోళన అనారోగ్యానికి మూలం..  
'ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించు'..  ఫలితం ఏదయినా దయివప్రసాదంగా స్వీకరించు.. కాలం విలువైనది. . రేపు అనుదానికి రూపులేదు. మంచిపనులు వాయిదా వేయకు..  అసూయను రూపుమాపు.. అహంకారాన్ని అణగద్రొక్కు..
హింసను విడనాడు, అహింసను పాటించు.. కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు...
ఉపకారం చేయలేకపోయినా, అపకారం తలపెట్టకు.. మతిని సిద్ధంచేసేది మతం, మానవత్వం లేని మతం మతం కాదు.. దేవుని పూజించు, ప్రాణకోటికి సహకరించు..
తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట, ఇంట, చెంత ఉండగలదు..
ఓం శాంతి శాంతి శాంతి

*****

03-02-2023 *ఓం నమః శివాయ: కర్మ - జన్మ (1)

 "కర్మ ఫలం" లో - ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం.

 ఎవరైనా చంపబడ్డప్పుడు చాలామందికి వచ్చే సందేహం, ఓ మనిషి అందరిలా సహజంగా మరణించే దాకా ఆగకుండా ఇంకొకరు అతన్ని చంపితే అప్పుడతని ఆయుష్షు ప్రకారం కాక, అతను ముందే మరణించినట్లు అవుతోంది కదా? 

 ఓ జీవి ఆయుష్షుకి ఒక్క క్షణం ముందు కూడా ఈ భూ ప్రపంచంలో ఎవర్నీ ఎవరూ చంపలేరు, ఎవరూ అలా మరణించలేరు. హత్య ద్వారా మరణించడం అతని ప్రారబ్ధ కర్మ అయినప్పుడే అతను హత్య చేయబడతాడు. పాపం చేసినవాడికే అలాంటి మరణం వస్తుంది. అంటే సహజ మరణం ఎలా ప్రారబ్ద కర్మో, అలాగే హత్య చేయబడటం ద్వారా మరణించడం కూడా ప్రారబ్ద కర్మలో ఓ భాగంగా మాత్రమే సంభవిస్తుంది. 

మహా భారతంలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది.

"స్వకర్మణా హతం హంతి హత ఏవ సహన్యతే"                 ‌      -  శాంతి పర్వం 

భావం:  పాపి అయినవాడు తన కర్మచే మరణిస్తాడు కనుక, అతన్ని చంపేవాడు చచ్చినవాళ్లే చంపేవాడు అవుతాడు.

 ప్రతీ జీవి పుట్టుక, మరణాలు ప్రారబ్ద కర్మలు ముందే నిర్ణయించబడి ఉంటాయని ఇందాకే అనుకున్నాం. మరి ఆత్మహత్య ఎలా సంభవం అనే అనుమానం చాలామందికి వస్తూంటుంది. 'కారణం లేకుండా కార్యం జరగదు' అన్న కర్మ సిద్ధాంతం ప్రకారం ఆత్మహత్య ద్వారా మరణించడం అన్నది కూడా వారి ప్రారబ్ద కర్మలోని భాగమే తప్ప, ఇంకా జీవించాల్సి న సమయం రాసిపెట్టి ఉండగా ఓ మనిషి ఆత్మహత్య చేసు కుని దాన్నించి తప్పించుకోలేడు. అది కర్మ సిద్ధాంతానికే విరుద్ధమైన భావన.

 పూర్వ జన్మలో ఎవరైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వారు కల్పించినా, లేదా అందుకు సహాయం చేసినా ఆ దుష్కర్మ ఫలితంగా అతను ఏడు జన్మల పాటు ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడని ఓ సందర్భంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామి చెప్పారు.

 కొందరు అతి స్వల్ప కారణానికి కూడా ఆత్మహత్య చేసుకుని మరణించడం మనం చూస్తూంటాం. అందుకు ఇదే కారణం కావచ్చు. తను ఆత్మహత్యకి పురికొలిపిన వాడి ఆత్మ దేహాన్ని వదిలాక పడే బాధని అతని ఆత్మ కూడా అనుభవించి కర్మ క్షయం చేసుకోవాలి కాబట్టి అతను ఆత్మహత్య చేసుకుంటాడు. హత్యలా ఆత్మహత్య కూడా ప్రారబ్ద కర్మ. ఇది వేదాంతం చెప్పేది.

 శ్రీ రామకృష్ణ పరమహంస గురువు,  తోతాపురి దక్షిణేశ్వర్ లో పదకొండు నెలలు ఉండి కడుపునొప్పితో బాధ పడి, గంగలో ముణిగి చావాలనుకుని వెళ్తే....... 

ఎంత దూరం వెళ్ళినా మోకాలు వరకే నీరు ఉండటంతో, చేసేది లేక తిరిగి వెనక్కి వచ్చేసాడు. ఆత్మహత్య కూడా ఈశ్వరాధీనం లేదా కర్మాధీనం అని దీనినిబట్టి తెలుస్తోంది.

 వేదాంతం, హిందూ మతం ప్రకారం ఆత్మహత్య నిషిద్ధ కర్మ. అది మహా పాపం. కర్మ శక్తి మృత్యువుతో ఆగిపోయేది కాదు. అది జాగిలమై మృత్యవు తర్వాత కూడా ఆ జీవిని వెన్నాడుతుంది. జీవిస్తే,  వాడు అనుభవించే ఫలం కంటే ఆత్మహత్య ఎక్కువగా బాధిస్తుంది. ఇది మత పరమైన భావన. మతం కన్నా వేదాంతం  చెప్పేదాంట్లో ఎక్కువ స్పష్టత ఉంటుంది.

కోహిలోకస్యకురుతెవినాశప్రభవావుభౌ

కృతమ్ హితత్కృతెనైవ కర్తాతస్యాపి చాపరః                  - శాంతి పర్వం 217-16 

 భావం:-  ఈ ప్రపంచంలో పునరుత్పత్తి, నాశనం ఎవరు చేస్తున్నారు? మానవుని విభిన్న కర్మలే అవి చేస్తున్నాయి.

 మరణ స్థల, సమయాలు  మనం మరణించే సమయం, ప్రదేశం, పద్ధతి కూడా మన ప్రారబ్ద కర్మలోని భాగాలే. సహజ మరణమా లేక ప్రమాదంలో పోవడమా, అత్మ హత్యా లేదా హత్య చేయబడటమా, సునాయాస మరణమా లేదా బాధపడి పోవడమా, పక్క ఎక్కి ఎత్తి పోయించుకోవడమా లేదా తన పనులు తను చేసుకుంటూ పోవడమా అన్నవి కూడా ప్రారబ్ధ కర్మలోని భాగాలే అవుతాయి.

 రచయిత బాల్యంలో ఓ పొరుగాయన హిమాలయాల్లోని బదరీనాథ్ లో మరణించాడు. హిప్నటిస్ట్ నాగరాజు, విజయవాడ వెళ్ళే రైల్లో మరణించాడు, రచయిత కొండముది శ్రీరామచంద్రమూర్తి కైలాస మానస సరోవర యాత్రకి వెళ్ళి అక్కడ మరణించాడు. ముఖ్యంగా ప్రమాదంలో మరణించడం ప్రారబ్ద కర్మే.

ఓ చిత్ర నిర్మాత బాగా తాగి, హోటల్ గదిలో పడుక్కున్నాడు. ఆ గదిలో మంచి నీళ్ళు లేకపోవడంతో ఆయన దప్పికతో అక్కడే మరణించాడని మద్రాసులో, రచయిత ఇరవై ఏళ్ళ క్రితం విన్నాడు. స్వంతిల్లు ఉన్నా ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్ళలేదు. 

 మరణ సమయం, స్థలం గురించి చక్కగా వివరించే ఈ కథ చూడండి. 

ఓసారి యముడుకి శివుడితో పనిపడి హిమాలయాల్లోని కైలాస పర్వతానికి వెళ్ళాడు. శివుడి దగ్గరకి వెళ్ళబోతూ అక్కడున్న జీవుల్లోని ఓ పిచ్చుక వంక ఆయన ఆశ్చర్యంగా చూసాడు.

 యముడు తనని ఎందుకలా చూసాడా అని ఆ పిచ్చుకకి భయం వేసి వెంటనే పక్షిరాజు గరుత్మంతుడ్ని ప్రార్ధించింది. అతను ప్రత్యక్షం అవగానే ఆ పిచ్చుక జరిగింది చెప్పి 'యముడు తన ప్రాణాలని తీసుకెళ్ళక మునుపే తనని కాపాడమని' కోరింది.

 ఆ పిచ్చుక మీద జాలి కలిగిన గరుత్మంతుడు వెంటనే దాన్ని తన మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి కన్యాకుమారిలోని సముద్రతీరంలో వదిలి వచ్చాడు. శివుడితో పని ముగించుకుని కైలాస పర్వతం నించి బయటకి వచ్చిన యముడు ఆసక్తిగా చూస్తూంటే, ఏం తెలీనట్లుగా ఏమిటని అడిగాడు గరుత్మంతుడు. “ఇక్కడ ఓ పిచ్చుక ఉండాలి.

అదేమైందా అని చూస్తున్నాను.” జవాబు చెప్పాడు యముడు.

 “దాని ప్రాణం పట్టుకెళ్ళడం నీ వల్ల కాదు. నేను దాన్ని తీసుకెళ్ళి ఓ రహస్య ప్రదేశంలో వదిలి వచ్చాను.” నవ్వుతూ చెప్పాడు గరుత్మంతుడు. 

 “ఈ క్షణంలో అది కన్యాకుమారిలోని సముద్రం ఒడ్డున ఓ విలుకాడి బాణానికి మరణించాల్సి ఉంటే, ఇక్కడ ఎలా ఉందా అని నాకు ఆశ్చర్యం కలిగింది.” చెప్పి యముడు వెళ్ళిపోయాడు. 

 మరణించే ప్రదేశం మన ప్రారబ్ధ కర్మ నిర్ణయమే. 

(తరువాతి భాగంలో - "కర్మల బట్వాడా" - "కర్మని బట్టే పునర్జన్మ")

---(((())))---


ప్రాంజలి ప్రభ - om sri raam - శ్రీ మాత్రేనమ:
సేకరణ/ రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  
6281190539 -- 13-07-2022


Discover Nirupama Mishra's (India) creative work on Touchtalent. Touchtalent is premier online community of creative individuals helping creators like Nirupama Mishra in getting global visibility
04-02-2023 తండ్రి ఎవరు???
------------------వాట్సాప్ సేకరణ 
(ఇది రాసినవారు తెలిస్తే దయచేసి వివరాలు కామెంట్ చేయండి)
శ్రీరాముడు పాలిస్తున్న రామరాజ్యంలో ఒక శూద్ర మహిళ గర్భవతి అయింది...
ఆమె ఒక విధవరాలు. రామ రాజ్యంలో ఒక విధవ స్త్రీ, అందులోనూ శూద్రురాలు, గర్భవతి కావటమా! అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు., అలా జరగటం రామరాజ్యానికే మాయని మచ్చ అనుకొంటున్నారు. రాజధాని అంతటా ఆ వార్త
గుప్పుమంది. దీనికి శిక్ష తీవ్రంగా వుంటుంది. నేరం చేసింది ఎవరైనా విధించిన శిక్షకు కట్టుబడి వుండాలి. శూద్రకులం నుంచి నేరస్థులు
వుంటే శిక్ష మరింత తీవ్రంగా వుంటుంది. అది నాటి యుగ ధర్మం!
   ఈ వార్త దావానలంలా పాకుతూ చివరికి ఒకరి ఫిర్యాదు ద్వారా రాముని దగ్గరకు చేరింది. రాముని ఆదేశంతో ఆ శూద్ర గర్భిణిని కోర్టుకు (కొలువుకు) తీసుకొచ్చారు.
అక్కడ వాదోపవాదాలు ఇలా సాగాయి.
రాముడు:- అమ్మా! నీ గర్భంలో వున్న శిశువుకి తండ్రెవరు?
గర్భిణి:- పేరు బైటకు చెప్పలేను, రామచంద్రా! ఎందుకంటే, ఆయన ఒక కులీనుడు, సవర్ణుడు, ఎంతో ప్రఖ్యాతి గలవ్యక్తి, అతనెవరో బయటపెడితే నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తాడు.
రాముడు:- సరే, ఇందుకు నీకెలాంటి శిక్ష వుంటుందో తెలుసా? ఈ నేరానికి యావజ్జీవ జైలు శిక్ష తప్పదు.
గర్భిణి:- అయ్యా! ఆ శిక్ష గురించి నాకు తెలుసు.
(ఎంత అడిగినా ఆ మహిళ తన కడుపులోని బిడ్డకు తండ్రెవరో చెప్పలేదు. దాంతో రాముని ఆగ్రహం పెరిగింది. ఆమె చేసిన నేరానికి రాముడు మరణ శిక్ష అమలు చేయమని తీర్పు చెప్పాడు. శిక్ష అమలుకావటానికి ముందు రోజున, ఆమెను రాముని కొలువుకు తీసుకొచ్చారు భటులు. రాముని ప్రక్కనే అతని గురువు వసిష్టుడు, తమ్ములయిన లక్ష్మణ భరత శత్రుఘ్నులు, హనుమంతుడు వగైరాలంతా వున్నారు. 
గర్భిణిని చూసి వసిష్టుడు ఇలా అడిగాడు.
వసిష్టుడు:- అమ్మాయి! రేపు నీకు మరణ శిక్ష అమలవుతుంది. నీ చివరి కోరిక ఏమిటో చెప్పు.
గర్భిణి:- (వినయంగా) నా భర్త మరణించాక, అతనితో పాటే నా కోరికలూ పోయాయి. 
మీరేదనుకుంటే అది చేయండి.
వసిష్టుడు:- రఘువంశాచారం ప్రకారం, నీ కడసారి కోరిక ఏదో చెప్పాలమ్మా!
గర్భిణి:- నా కడుపులోని బిడ్డకు తండ్రెవరో చెపితే భయంకర శిక్షకు గురవుతాను గనుక, చెప్పలేకపోయాను. అయ్యా, వసిష్టులవారూ! నా చివరి కోరిక ఒకటుంది. దయచేసి మీ తండ్రేవరో చెపుతారా?
(వసిష్టుడు ఆ మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని తల్లి ఊర్వశి ఒక వేశ్య, ఒకసారి ఆమె అందాన్ని చూసిన సూర్యునికి వరుణునికి వీర్య పతనమయింది. వారి వీర్యాన్ని  ఆమె ఒక కుండలో భద్రపరిచింది. అందులోంచే
వసిష్టుడు, అగస్త్యుడు పుట్టారు. వసిష్టుని ఉలికిపాటుకు ఇదీ కారణం)
రాముడు:- ఏవమ్మా! ఎంత ధైర్యం నీకు? మా గురువుగారి తండ్రి వివరాలడుగుతావా? 
నీ తల తెగుతుంది జాగ్రత్త!
గర్భిణి:- మీరేమైనా చేయండి ప్రభూ! నా చివరి కోరిక మీ గురువు తండ్రేవరో తెలుసుకోవటమే, అయినా, వారిని అడిగితే మీరెందుకు మండిపడుతున్నారు? పోనీ, ఆయన సంగతి వదిలేయండి. మీ తండ్రేవరో చెప్పండి మహారాజా!
(ఆ మాటతో రాముడు కూడా తలదించుకున్నాడు. ఎందుకంటే, రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు, వారి తల్లులు పాయసం తింటే పుట్టారట! దశరధుడు వృద్ధుడు గనుక పుత్ర సంతానం కోసం నియోగ పద్ధతికి అంగీకరించాడని
మరో కధనం వుంది.)
లక్ష్మణుడు:- ఏం మాట్లాడుతున్నావమ్మా! మరొక్క మాట నీ నోటివెంట వస్తే బాణాలతో నీ శరీరాన్ని 
తూట్లు గావిస్తాను.
గర్భిణి:- అయ్యా లక్ష్మణులవారూ! నా చివరి కోరిక చెప్పమని మీరే బలవంత పెట్టారు. చెపితే, ఇలా విరుచుకుపడుతున్నారు. ఏం చేయను? మీ అన్నగారు మీ తండ్రి పేరు చెప్పలేకపోతున్నాడెందుకో! పోనీ మీరైనా చెప్పండి
(ఈ మాటతో లక్ష్మణుని నోరు మూతపడింది. ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడు. తన మరిది పరిస్థితిని చూసిన సీతకు జాలి వేసింది)
సీత:-ఏం మాట్లాడుతున్నావమ్మా, కొంచెమైనా మర్యాదలేదా? నా మరిదిని ఇంకొక్క మాటంటే నీకు శిరచ్చేదనమే శిక్ష !!
గర్భిణి:- అమ్మా, సీతమ్మా! ఎలాగైనా నేడో రేపో నన్ను చంపుతారు, చివరికోరిక కోరుకొమ్మని బలవంతపెట్టింది మీరే. కనుక అడుగుతున్నాను. మీ కుల గురువు వశిష్టుడు, మీ భర్త రాముడు, మీ మరిది నా కోరికను తీర్చలేకపోయారు. పోనీ,
మీరైనా చెప్పండి, మీకు తండ్రెవరు?
(సీతకు తన జన్మవృత్తాంతం గుర్తుకువచ్చింది. జనక మహారాజు పొలం దున్నుతుంటే, ఆమె నాగటి చాలులో వుండే మన్నులో దొరికిందని తనకు చెప్పారు. తన తండ్రెవరో తెలియదు. సీత కూడా మౌనం వహించింది)
హనుమాన్:- (ఆగ్రహంతో) ఓ యమ్మా! నీకెంత తెగింపు! మా ప్రభువైన రామచంద్రుని, సీతమ్మను సైతం ప్రశ్నించే నీ తెగువ క్షమించరానిది. నువ్వు తీవ్ర శిక్షకు పాత్రురాలవు.
గర్భిణి:- అయ్యా, హనుమాన్లు వారూ! మీకూ మీ సీతారాములన్నా, వారి కుల గురువు వసిష్టులన్నా, లక్ష్మణస్వామన్నా ఎంత గౌరవమో, భక్తో నాకూ తెలుసు, వాళ్లెవరూ వాళ్ల తండ్రుల గురించి చెప్పలేకపోయారు, పోనీ, మీరైనా మీ తండ్రెవరో
చెప్పి, నా చివరి కోరికను తీర్చండి.
(హనుమంతుని ముఖం వాడిపోయింది, అతని తల్లి అంజన, కేసరి అనే వానరుని భార్య, ఒకసారి  ఆమెను విడిచి తపస్సు కోసం అడవులకు వెళ్లాడు. అప్పుడు, అంజన వాయువును ప్రసన్నం చేసుకోగా, ఆ వాయువు వల్ల తాను పుట్టినట్లు విన్నాడు. అంటే తన పుట్టుక కూడా ..... హనుమంతుడు ఏం చెప్పలేక మౌనం వహించాడు)
గర్భిణి :- (సీతా రామలక్ష్మణ వసిష్టాదులను చూస్తూ) అయ్యలారా! అమ్మా! మీరెవరూ మీ తండ్రులెవరో చెప్పలేకపోయారు, అలాంటి మీరు నా కడుపులోని బిడ్డకు తండ్రెవరో చెప్పని నేరానికి మరణ శిక్ష విధిస్తున్నారు నాకు, నా కడుపులోని బిడ్ద అక్రమ సంతానమైతే మరి మీరూ??? మీరెలా నాకు మరణ శిక్ష విధిస్తారు??? ఇదెంతవరకు న్యాయం???
(ఈ ప్రశ్నకు జవాబివ్వలేక రాముని సభాసదనమంతటా మౌనం ఆవరించింది)...


*||శ్రీమన్నారాయణీయము||  05-01-2023
సప్తమ స్కంధము/ 25వ దశకము - శ్రీనృసింహావిర్భావ వర్ణనము/25-7-శ్లోకం*

త్యక్త్వాతం హతమాశు రక్తలహరీసిక్తోన్నమద్వర్ష్మణి
ప్రత్యుత్పత్య సమస్తదైత్యపటలీం చాఖాద్యమానేత్వయి।
భ్రామ్యద్భూమి వికంపితాంబుధికులం వ్యాలోలశైలోత్కరం
ప్రోత్సర్పత్థచరం చరా చరమహో! దుః స్థామవస్థాందధౌ।।

భావము:-

హిరణ్యకశిపుని సంహరించి శీఘ్రమే నీవతని శరీరమును వదలివేసితివి. రుధిరధారలతో తడిసి, ప్రభూ! మహోన్నతమైన నీ శరీరమంతయూ రక్తసిక్తమయి ఉండెను. మహోగ్రరూపముననున్న నీవు, పిదప, మిగిలిన అసుర సమూహమును తినివేయ నారంభించితివి. అప్పుడు భూమి కంపించెను. సముద్రము అల్లకల్లోలమయ్యెను. పర్వతశిఖరములు మిక్కిలి చలించెను. దేవతలు వారివారి స్థానములను వదిలి పారిపోవసాగిరి. అక్కటా! సమస్త జగత్తుకు దుస్థితి కలిగెను కదా!

వ్యాఖ్య:-

దేవదేవుడు నరసింహ రూపుడు, దానవేశ్వరుడి గుండెలు చీల్చి నెత్తురు కురిపించాడు; కఠోరమైన రక్తనాళాలు త్రెంచి తుత్తునియలు చేసాడు; కండరాలు ఖండించి ముక్కలు ముక్కలుగా చేసాడు; రక్తం కారుతున్న ప్రేగులు లాగి తన కంఠంలో మాలికలుగా వేసుకున్నాడు. ఇలా అమితోత్సాహంతో హిరణ్యకశిపుని చంపి సంహరించి నరసింహమూర్తి గోళ్ళ కాంతులతో ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు.

ఉగ్ర నరసింహుని గోళ్ళు ఆ రాక్షసుడి వక్ష కవాటం పగులగొట్టేటప్పుడు గండ్రగొడ్డళ్ళలా విరాజిల్లాయి. హృదయపద్మం పెకలించేటప్పుడు త్రవ్వుగోలల వలె దీపించాయి. రక్తనాళాలు త్రెపేటప్పుడు బలిష్ఠమైన కొడవళ్ళు వలె ప్రకాశించాయి.

 ప్రేగులు కోసేటప్పుడు రంపాలలాగా రాణించాయి. తన ఊరువులపై పడి ఉన్న రాక్షసుడిని ఎలాంటి అస్త్రశస్త్రాలతోనూ పనిలేకుండా నరకేసరి తన గోళ్ళతోనే సంహరించాడు. అప్పుడు ఆ గోళ్ళు అతి విచిత్రమైన రణ విజయాన్ని చాటుతూ శోభించాయి.

నరసింహస్వామి గోళ్ళు శరణాగత సాధుజనులకు ఇష్టమైనవి. ఆ దానవేశ్వరుని దేహాన్ని చీల్చివేశాయి. దేవతల ముఖాలను వికసింపజేశాయి. బహు అధికమైన కాంతులతో అగ్నిశిఖలను సైతం ఓడించాయి.

ఆ విధంగా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలకు భంగం కలుగకుండా; కేవలం నరరూపం కానీ, మృగరూపం కానీ కానటువంటి నరసింహ రూపంతో; రాత్రి గానీ, పగలు గానీ కానట్టి సంధ్యాసమయంలో; లోపల కానీ, వెలుపల కానీ కానటువంటి సభాభవనపు గడప మీద; ఆకాశం కానీ, భూమీ కానీ కానట్టి తన ఊరు ప్రదేశంలో (ఒళ్ళో); ప్రాణం ఉన్నవీ కానీ, ప్రాణం లేనివి కానీ కాని గోళ్ళతో సంహరించాడు. అలా ఉగ్రనరసింహస్వామి ముల్లోకాలకూ గుండెల్లో గాలంలా తయారైన ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడిని చంపాడు. 

అప్పుడు, ఆయన మిక్కిలి ఉగ్ర స్వరూపంతో దావానల జ్వాలలా దర్శనమిచ్చాడు. అతిభయంకరంగా ఉన్న ముఖంతో; నాగేంద్రుని నాలుక లాగ మాటిమాటికి బయటకు వచ్చి చలిస్తున్న భీకరమైన నాలుకతో; నెత్తురుతో తడసి ఎఱ్ఱబారిన మెడజూలుతో; భయంకరంగా ఆ దానవ రాజు ప్రేగులు కంఠమాలికలులా వేసుకున్న మెడతో ఆ ఉగ్ర నరసింహుడు దర్శనమిచ్చాడు. ఆ దేవుడు ఆ దానవుడి హృదయకమలం చీల్చి వేసి, మదగజేంద్రుడి కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజులాగా విరాజిల్లుతున్నాడు;

రక్తంలో తడసిన ఆయన గోర్లు సంధ్యారాగ రంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి; ఆ రూపం చూసిన రాక్షస వీరులు కోపాలు పట్టలేక వివిధ ఆయుధాలతో ఆ రాక్షసాంతకుని మీదకి దండెత్తి వచ్చారు; అలా వచ్చిన పెక్కువేల రక్కసులను వచ్చిన వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో ఒక్కడిని కూడా వదలకుండా వధించాడు ఆ ఉగ్ర నరకేసరి.

ఈ విధంగా రాక్షస సంహారం కానిచ్చి, యుద్ధం పరిసమాప్తి చేసాడు. ఇంకా ఆ ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహం తగ్గలేదు. ఆ చూపులు భయం కలిగిస్తున్నాయి. భీకరమైన ముఖంతో ఊగిపోతున్నాడు. చూడటానికి గానీ, పలకరించడానికి కానీ చాలక అక్కడున్న వాళ్లందరూ భయభ్రాంతులై తత్తర పడుతుండగా, ఆ భీకర నరకేసరి ఆ సభాభవనంలో సింహాసనంపై ఆసీను డయ్యాడు.

దేవతలు, చారణులు, విద్యాధరులు, గరుడులు, నాగులు, యక్షులు, సిద్ధులు మొదలైన వారిలో ఏ ఒక్కరు కూడ ఆ సమయంలో ఆ ఉగ్ర నరకేసరి దరిదాపులకు వెళ్ళటానికి సాహసించలేక భయకంపితు లౌతున్నారు.
*****

o

06-02-2023 *ఎప్పుడు మారుతుంది ఈ దేశం?

నేననుకుంటున్నాను ఎప్పుడు దేశం మారుతుందా అని. 

గత కొన్ని సంవత్సరాలుగా,

మానవ సమాజంలో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి, నగరీకరణ, నవీకరణ అత్యంత వేగవంతంగా జరుగుతున్నది, 

ధరల పెరుగుతున్నాయి అంటూ ప్రోత్సాహం చూపేవారు ఎక్కువయ్యారు.అసలు బీదవాళ్ళనే వారు లేరు భారత దేశంలో కాని

మరణం అందరికి ఉంది కాని .... మరణించాలని ఎవరూ అనుకోరు. ఈ రోజుల్లో ఐతే పరిస్థితి ఇంకా విషమంగా ఉంది

భోజనం అందరికీ కావాలి కాని., ఎవరూ వ్యవసాయం చేయా లనుకోరు. నీరు అందరికి కావాలి కానీ , నీటి వనరులు రక్షించ డానికి ఎవరూ ప్రయత్నం చేయరు. పాలు అందరికీ కావాలి కానీ,ఆవు ను పాలించాలని ఎవరూ అనుకోరు.నీడ అందరికి కావాలి కాని, చెట్లను నాటాలని వాటిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు.  భార్య  అందరికి కావాలి, కాని ఆడ పిల్లలు పుట్టా లనీ, వారిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు.

అంతా ఆధునికం అంటూ

ధనం దుర్వినియోగం జరుగుతున్నది.

 ఆహారపు అలవాట్లు, మానవ సంబంధాలలో విపరీత మార్పులు చోటుచేసుకున్నాయి, అంతా ఇంట్లోవుండే నిత్యావసర వస్తువులను తెప్పించుకుని సుఖపడుతు న్నారు. అసలు విలువ ఏంతో తెలియటంలేదు చెట్లకు డబ్బులు కాస్తున్నాయి.

 మన అన్న భావన తొలిగి నేను - నాది అన్న సంకుచిత మనస్తత్వానికి బీజాలు పడ్డాయి, నైతిక విలువలు, మానవ బాంధవ్యాలు సన్నగిల్లసాగాయి, చదువు, సంపాదన పెరిగినప్పటికీ మానవ సంబంధాలు మసక బారడం మొదలయింది.

ఏది ఏమైనా వాట్సాప్, కరోనా పుణ్యమా అని సంబంధం సమాచారం అందుతున్నది.

మనం నిజం తెలుసుకనేలోపు నిజాయితీ గా ప్రేమించే వాళ్ళను దూరం చేసుకుంటాం ఇదేనా జీవితం.

మనిషి మనిషికీ మధ్య 

సామాజిక పరివర్తన

అనేది ఎపుడూ సానుకూల దిశలో సమాజ హితం కోసం జరగాలి, వ్యతిరేక దిశలో పయనిస్తే మానవత్వం అనే పదానికి (అర్థం) విలువ లేకుండా పోతోంది.

అలాగే ప్రభుత్వం ధనికులకు అప్పులిచ్చి వసూలు చేయలేక బీదవారిపై వత్తి డి తగ్గాలి. సంక్షేమాలముసుగులో ధనాన్ని దుర్వినియోగం కూడా తప్పే, చదువు, ఆరోగ్య ఉచితం, నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే ప్రభుత్వం రావాలని ఆశిద్దాం.

కెరటాలు తీరానికి తాకితే వినోదం. ప్రజల కు నాయకుల మాటలు వినోదం. కెరటం దాటితే ఎంతో విధ్వంసం అవుతుందో అట్లాగే ప్రజల ఓర్పుపై ప్రయోగాల ప్రభావము అంతకన్నా ఎక్కువుగా రావచ్చు.

     *ఏది ఏమైనా మనం చేయగలను  అనుకుంటే చేయగలము, చేయలేము అనుకుంటే చేయలేము.*          

        *నమ్మకం లోని నాణ్య తే మనల్ని నాణ్యమైన జీవితానికి మంచి మార్గం చూపిస్తుంది, వెనకడుగు వేస్తే వెన్ను పోటే గతౌతుంది అందరూ గమనించాలి.*

మనసుకు శాంతి కల్గించేందుకు చేసే మంచ పనుల ప్రయత్నం కావాలి, రావాలి వస్తుందని ఆశిద్దాం.


మీ శ్రేయోభిలాషి..మల్లాప్రగడ రామకృష్ణ

--((())--


07-02-2023 "ఎ ఆవ్ రా బా వా " చక్కటి కధ చదవండి 

ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థాన కవులందరికీ ఒక పరీక్ష పెట్టాడు.

" మీరు ఐదు అక్షరాల పదం ఒకటి రూపొందించాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో పుండాలి. ఆ ఒక్కొక్క అక్షరానికి ఆ భాషలో ఏమి అర్థమో మిగిలిన నాలుగు భాషల్లో కూడా అదే అర్థం వుండాలి.

అంతేకాక ఆ ఐదక్షరాల పదంకూడా

అర్థవంతంగా వుండాలి.

దీనికి సమాధానం రేపు సభాముఖంగా నాకు చెప్పండి."

కవులలో కలకలం బయలుదేరింది.

విచిత్రమైన సమస్య అనుకుని ఎవరింటికి వారు బయల్దేరి వెళ్లారు.

మన తెనాలి రామకృష్ణ కు నిద్రపట్టడం లేదు. తన బావమరిది ఇంటికెళ్ళి అక్కడ పశువుల పాకలో మంచంవేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు‌. అర్థరాత్రి అయినది. ఆ సమయానికి పశువులశాలలో ఒక ఆవు దూడను ప్రసవించినది. వెంటనే రామ కృష్ణుడు " బావా! బావా! ఆవు ఈనింది‌" అని కేకలు వేశాడు. నిద్రమత్తులో నున్న బావమరిది ఆ మాటలు విని " ఏ ఆవ్ రా బా వా " అని అడిగాడు. రామకృష్ణకు వెంటనే ఏదో స్ఫురించింది. ఎగిరి గంతేసాడు.

మరునాడు మహారాజు సభ తీర్చాడు.

" అందరూ సిద్ధంగావున్నారా" రాయలవారి మాట విన్న కవులు ఏమీ మాట్లాడలేదు.

 కాని రామకృష్ణుడు మాత్రం లేచి " నేను సిద్ధమే" అన్నాడు.

మహారాజు: ఏదీ ఆ పదం చెప్పు!

రామకృష్ణుడు: " ఎ ఆవ్ రా బా వా "

'ఏ' అనగా మరాఠీలో 'రా' అని అర్థము.

'ఆవ్ ' అనగా హిందీలో ' రా' అని అర్థము.

'రా' అనగా తెలుగులో 'రా' అనే కదా అర్థము!

'బా' అనగా కన్నడ భాషలో 'రా' అని అర్థము.

' వా' అనగా తమిళంలో 'రా' అని అర్థము.

ఈ అయిదు అక్షరాలూ అయిదు భాషలకు చెందినవి. ఈ అయిదు అక్షరములు కలిసిన పదం " ఏ ఆవ్ రా బా వా" ఇదికూడా అర్థవంతమైన పదమే!

-

*తెలుగు పాఠము*

 08-02-2023 *"ర"కీ "ఱ"కి మధ్య తేడా ఏమిటి?*

ఈ మధ్యనే వాట్సాప్ లో మెసేజ్ చూసాను. ద్వానా శాస్త్రి గారు రాసారట. బావుంది. అది ఇక్కడ పెడతాను. forwarded as it is.

తెలుగు భాషాభిమానుల కోసం.👇

*అరసున్న [ ఁ ], బండి ' ఱ 'లు ఎందుకు?*

అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు. అలా చేసారు మన ఆధునిక భాషా వేత్తలు. తెలుగుకు పట్టిన దుర్గతి ఇది. అయితే, ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. తెలుగు భాషా లక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణ శాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. కానీ వీటిగురించి తెలుగువాడు తెలుసు కోవాలిగదా! మన భాషా సంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న( ఁ ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:

అరుఁగు = వీధి అరుగు

అరుగు = వెళ్ళు, పోవు

అఱుగు = జీర్ణించు

ఏఁడు = సంవత్సరం

ఏడు = 7 సంఖ్య

కరి = ఏనుగు

కఱి = నల్లని

కాఁపు = కులము

కాపు = కావలి

కాఁచు = వెచ్చచేయు

కాచు = రక్షించు

కారు = ఋతువు, కాలము

కాఱు = కారుట (స్రవించు)

చీఁకు = చప్పరించు

చీకు = నిస్సారము, గ్రుడ్డి

తఱుఁగు = తగ్గుట, క్షయం

తఱుగు = తరగటం(ఖండించటం)

తరి = తరుచు

తఱి = తఱచు

తీరు = పద్ధతి

తీఱు = నశించు, పూర్తి(తీరింది)

దాఁక = వరకు

దాక = కుండ, పాత్ర

నాఁడు = కాలము

నాడు = దేశము, ప్రాంతము

నెరి = వక్రత

నెఱి = అందమైన

నీరు = పానీయం

నీఱు = బూడిద

పేఁట = నగరములో భాగము

పేట = హారంలో వరుస

పోఁగు - దారము పో( గు

పోగు = కుప్ప

బోటి = స్త్రీ

బోఁటి = వంటి [నీబోఁటి]

వాఁడి = వాఁడిగా గల

వాడి = ఉపయోగించి

వేరు = చెట్టు వేరు

వేఋ = మరొకవిధము

మడుఁగు = వంగు, అడఁగు

మడుగు = కొలను, హ్రదము

మొదలైనవీ ఉన్నాయి.

అయినా తెలుగు భాషను నాశనం చేస్తున్న కాలం దాపురించింది కదా!

[డాక్టర్ ద్వా. నా. శాస్త్రి )

~~~~Forwarded~~~~


No comments:

Post a Comment