పిల్లాడికి 5 ఏట వచ్చేదాక నెత్తిన పెట్టుకొని పెంచండి
15వ ఏట వచ్చేదాక క్రమశిక్షణతో పెంచండి
25వ ఏట వచ్చేదాక మంచి స్నేహితుడిలా పెంచండి
తర్వాత మీ పిల్లలు చెప్పి నాట్లు వినండి, ఇదే లోకం తీరు
మీ పెంపకం నుండే వాడికి సంస్కారం అలవాటు అవుతుంది అని గుర్తించండి.
అమ్మమ్మలు ,నాయినమ్మలతో కొన్నాళ్ళు గడిపే అవకాశం వారికివ్వండి.బంధువులు బాంధవ్యాల గొప్పతనం తెలిసోకోనివ్వండి. ముఖ్యంగా ఆడవాళ్లు అత్తమామలను ఇంటికి రానియ్యటంలేదు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటే...? చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. మీరు మారండి పిల్లలకు మారే అవకాశం ఇవ్వండి.
అసలేం జరుగుతుంది మన దేశంలో..?
విద్యాసంస్ధలేమో లాబాల కోసం ఫీజులు పెంచేస్తున్నారు
ఉపాధ్యాయులేమో జీతాల కోసం బతకలేక బతుకుతున్నారు
తల్లిదండ్రులేమో ఎంత ఖర్చైనా పర్లేదు మంచి స్కూలు అని పిల్లలను గారాబం చేస్తున్నారు .
తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలి మరీ మరీ అడుగుతున్నారు, త్రాసులో పెట్టి ఫీజుకు తగ్గ చదువస్తున్నాడా అని ఆలోచిస్తున్నారు.
పిల్లలకేమో బట్టి కొట్టైన కాపి పెట్టైనా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని.
బయట ఎండ నాన్నా అని చెప్పి వాడి చేతిలో మొబైల్ పెడతారు ఇక వాడి ఆటలన్ని అందులోనే..
అది కాస్తా తలుపులు వేసుకొని బూతు బొమ్మలు చూసేదాకా వెళ్తాయి.
మీ అందరి స్వార్ధంతో అజ్ఞానంతో పిల్లల ఇష్టాలను, ఎదుగుదలను బాల్యంలోనే సమాధి చేస్తున్నారు.
గట్టిగా చెప్పాలంటే అందరు కలిసి పిల్లలతో వాళ్ళకే తెలియని ఒక ' మానసిక వ్యభిచారం ' చేయిస్తున్నారు...!
గుర్తుంచుకోండి..
" మీరు పెంచేది మీ పిల్లల్ని కాదు సమాజాన్ని తీర్చిదిద్దే రేపటి తరాన్ని.."
అది మర్చి పోవద్దు...
వారే రాబోయే రోజుల్లో ఈ జాతి నిర్మాణ రథ సారథులు .
ఇప్పుడు వారుంటున్న వసతి గృహాలు రేపు మీ వృద్ధాశ్రమాలు...
***
భగవంతుడు అంటే ఏమిటి? అంటే.....
ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు.
కాబట్టి ఓపిక చేసుకుని...
ఈ చిన్న కథను చదవండి
ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో... ముఖ్యంగా మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి.
అవి...
1.దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు?
2.దేవుడు ఎక్కడ ఉంటాడు?
3.దేవుడు ఏం చేస్తాడు?
ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు.
తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై... పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు.
తాను మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.
ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు. రాజాస్థానం చేరుకొన్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు.
పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు.... రాజుకో విషయం నిర్దేశం చేసాడు. ‘చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి’ అని కండీషన్ పెట్టాడు .
దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు.
పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు.
‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు పశువుల కాపరి.
🌷మొదటి ప్రశ్న
దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు?
దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.
వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.
మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.
‘అన్నివైపులకు చూస్తుంది’ అని జవాబిచ్చాడు రాజు.
ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు.... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే.
🌷మరి ఇక రెండవ ప్రశ్న....
దేవుడు ఎక్కడ ఉంటాడు? అన్నాడు రాజు.
‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి.
పాలు తెచ్చారు.
‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’ అని అడిగాడు.
‘పాలను బాగా మరుగబెట్టాలి. వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధం అవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’ అన్నాడు రాజు.
‘సరిగ్గా చెప్పారు మహారాజా!
అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, మనస్సు అనే తోడు వేసి, స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును, సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది.
ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అన్నాడు కాపరి. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.
ఇక చివరి ప్రశ్న.
దేవుడు ఏం చేస్తాడు? అని.
నేను పశువుల కాపరిని, మీరు మహారాజు.
క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు.
పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల.
సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం,
దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.
సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు.
పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు.
మంచిని ఎక్కడ ఉన్న గ్రహిద్దాము..
*మంచిని నేర్చుకుందాము.. *
*మంచిని ఆచరించుదాము... *
*మంచిని అందరికి పంచుదాము... *
మంచి పేరుతో మరణిద్దాము...
🙏శుభం భూయాత్! 🙏
ఓంనమశ్శివాయ
070.. సప్త మహర్షులు - సప్త ఋషి మండలము
కట్ తర్వాత, అతను తన బిల్లు గురించి అడిగాడు, మరియు బార్బర్ ఇలా సమాధానమిచ్చాడు, 'నేను మీ నుండి డబ్బు తీసుకోలేను, నేను ఈ వారం సమాజ సేవ చేస్తున్నాను.
పూల వ్యాపారి సంతోషించి దుకాణం నుండి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు ఉదయం మంగలి తన దుకాణాన్ని తెరవడానికి వెళ్లినప్పుడు, అతని కోసం ఒక 'ధన్యవాదాలు' కార్డు మరియు డజను గులాబీలు అతని కోసం వేచి ఉన్నాయి.
తరువాత, ఒక కిరాణా వ్యాపారి హెయిర్‌కట్ కోసం వచ్చాడు మరియు అతను తన బిల్లు చెల్లించడానికి ప్రయత్నించినప్పుడు, క్షౌరకుడు మళ్లీ ఇలా సమాధానమిచ్చాడు, 'నేను మీ నుండి డబ్బు తీసుకోలేను, నేను ఈ వారం సమాజ సేవ చేస్తున్నాను.
కిరాణా వ్యాపారి సంతోషించి దుకాణం నుండి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు ఉదయం బార్బర్ తెరవడానికి వెళ్ళినప్పుడు, అతని కోసం ఒక 'ధన్యవాదాలు' కార్డు మరియు తాజా కూరగాయల సంచి అతని కోసం వేచి ఉంది.
*అప్పుడు ఒక రాజకీయ నాయకుడు జుట్టు కత్తిరింపు కోసం వచ్చాడు, అతను తన బిల్లు చెల్లించడానికి వెళ్ళినప్పుడు, క్షౌరకుడు మళ్లీ ఇలా సమాధానమిచ్చాడు, 'నేను మీ నుండి డబ్బు తీసుకోలేను.
నేను ఈ వారం సమాజ సేవ చేస్తున్నాను.*
రాజకీయ నాయకుడు చాలా సంతోషించి దుకాణం నుండి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు ఉదయం, బార్బర్ తెరవడానికి వెళ్ళినప్పుడు,
ఒక డజను మంది రాజకీయ నాయకులు ఉచిత హెయిర్‌కట్ కోసం వేచి ఉన్నారు.
ఇది, మన దేశ పౌరులకు మరియు సమాజాన్ని నడిపే రాజకీయ నాయకులకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని వివరిస్తుంది.
మీరు దీన్ని ఫార్వార్డ్ చేయకపోతే, ఎవరైనా మంచి నవ్వును కోల్పోతారు.
--
061..గురువు సలహా (కథ) ---20-03-2023
sekarana
ఆ ఊరుకి ఎక్కడి నుండో ఒక స్వామీజీ వచ్చాడు. ఆయన వెనుక ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఊరి బయటున్న గుడి ప్రాంగణంలో నివాసం ఏర్పాటు చేసుకుని, గుడికి వచ్చే భక్తులకు మంచి విషయాలను బోధించేవాడు గురువు. ఆధ్యాత్మిక సందేహాలు అడిగినా , సమస్యలు చెప్పుకున్నా తగిన సలహాలిచ్చి పంపేవాడు స్వామీజీ.
ఒకరోజు పొద్దున్నే ఒక యువజంట వచ్చింది. గురువుకి నమస్కరించి “మాది ప్రేమ వివాహం. అన్యోన్యంగా వుండాలనుకున్నా ఉండలేక పోతున్నాము. నాకు కోపం వస్తే ఆయనని తిడుతున్నాను. అది భరించలేక అతడు నన్ను కొడుతున్నాడు. మేం సంతోషంగా ఉండాలంటే ఏంచెయ్యాలి?” అని అడిగింది యువతి.
వాళ్ళని పరీక్షగా చూసి ‘ అమ్మా! నీకు భర్తని తిట్టాలనిపిస్తే అతడిలో మీ నాన్నని ఊహించుకో” అని చెప్పాడు. ఈసారి యువకుడితో “బాబూ ! నీకు భార్యని కొట్టాలనిపిస్తే ఆమెలో మీ అమ్మని ఊహించుకో” అని చెప్పి పంపించాడు స్వామీజీ.
“పాలూ నీరు, పూలూ దారంలా అన్యోన్యంగా కలసి జీవించమని చెబుతారనుకుంటే ఇలా చేసారేమిటి?” అని ఒక శిష్యుడు అంటే రెండోవాడు కల్పించుకుని “ అవును. వద్దని చెప్పాలి కానీ తిట్టుకోమని, కొట్టుకోమని సలహా ఇస్తారా?” అన్నాడు .
స్వామీజీ మౌనంగా నవ్వాడు తప్ప జవాబివ్వలేదు.
పదిరోజుల తరువాత యువజంట మళ్ళీ వచ్చింది.
వాళ్ళని చూడగానే ‘మనమనుకున్నట్టే గురువు గారిచ్చిన సలహా వికటించి ఉంటుంది’ అని మనసులోనే అనుకున్నారు శిష్యులు.
ఆ జంట స్వామీజీ కాళ్ళ మీద పడి “మా కాపురం చక్కబడింది” అన్నారు. వాళ్ళని “అన్యోన్యంగా జీవించమని’ దీవించాడు స్వామీజీ.
ఈసారి ఆశ్చర్యపోవడం శిష్యుల వంతయింది. “మాకేం అర్ధం కాలేదు గురువు గారూ!. గతసారి సలహాతో సరిపుచ్చి పంపారు. ఇప్పుడేమో దీవించారు” అన్నారు శిష్యులు.
స్వామీజీ చిన్నగా నవ్వి “ఆ రోజు జంటను చూడగానే గొడవలకు అలవాటు పడ్డ వాళ్ళుగా గ్రహించాను. ఎలాగూ జరిగేది ఆపలేను కాబట్టి ప్రయోగం చేయాలనుకుని అలాంటి సలహా ఇచ్చాను. అది ఫలితం ఇచ్చింది” అన్నాడు స్వామీజీ. మరింత వివరంగా చెప్పమని శిష్యులు అడగడంతో ఇలా చెప్పాడు స్వామీజీ.
“సాధారణంగా అమ్మాయిలకి అమ్మ కంటే నాన్న మీద ప్రేమ, గౌరవం ఎక్కువ ఉంటాయి. అది గుర్తు పెట్టుకునే తిట్టేముందు భర్త స్థానంలో ఆమె నాన్నని వూహించుకోమన్నాను. అతడిలో నాన్నని ఊహించుకుని తిట్టలేకపోయింది యువతి. ఆవిడ తిట్టనప్పుడు యువకుడు కొట్టడం లేదు కదా. అలా సమస్య తగ్గిపోయింది. ఒకవేళ ఆమె ఎపుడైనా తిట్టిందే అనుకుందాం. అప్పుడా యువకుడు ఆమె స్థానంలో అమ్మను ఊహించుకుంటాడు. కాబట్టి కొడుకులకు అమ్మ మీద ఉండే ప్రేమ, అభిమానం, అనురాగం వలన కొట్టడానికి చెయ్యి ఎత్తలేడు. అదే జరిగింది వాళ్ళ విషయంలో. అందువలన గొడవలు తగ్గాయి. అందుకే అన్యోన్యంగా ఉండమని దీవించాను”.
స్వామీజీ చెప్పింది విని ఆయన పాదాల మీద పడ్డారు శిష్యులు.
జీవిత సారాన్ని కాచి వడబోసినందు వల్లనే వచ్చే సందర్శకుల మానసిక స్థితిని ఊహించి అందుకు అనువైన సలహాలిచ్చి స్వామీజీ మెప్పు పొందుతున్నారని మనస్పూర్తిగా శిష్యులు నమ్మారు.
060.. అనారోగ్యం 21-03-2023
*ప్రస్తుతం పట్టణ వాసులే కాదు పల్లెవాసులు కూడా తమ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే విధానం వైపు పరుగెత్తుతున్నారు. ప్రస్తుత జనాభాలో డయాబెటిస్ ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వైద్యులు కూడా ఈ డయాబెటిస్ మరియు రక్తపోటు వ్యాధులను చాలా సాధారణమైన జబ్బులే అంటున్నారు. కానీ ఈ రెండింటి బారిన పడినవారు ఆపకుండా జీవితాంతం మందులు, మాత్రలు వాడుతూనే ఉండాలి, ఆహారం తీసుకోవడంలోనూ మార్పులు చేసుకోవాలి. కానీ కొన్ని సహజ ఆహారాలు మన శరీరంలో చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. వాటిలో ముఖ్యంగా తెల్ల పుట్టగొడుగులను తరచూ తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. డయాబెటిస్‌ను నియంత్రించడానికి తెల్ల పుట్టగొడుగులలో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయని వైద్యులు కూడా అంటున్నారు.
*ఈ తెల్ల పుట్టగొడుగులలో తక్కువ స్థాయిలో కార్బోహైడ్రేట్లు మరియు చక్కెర ఉంటాయి. ఇది యాంటీ డయాబెటిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇటీవలి జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్ వారి సర్వే ప్రకారం, తెల్ల పుట్టగొడుగులు తినేటప్పుడు ప్రోబయోటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది గౌట్ లోని సూక్ష్మజీవుల చర్యను మెరుగుపరుస్తుంది. ఇది కాలేయంలో స్రవించే గ్లూకోజ్ మొత్తాన్ని కూడా నియంత్రిస్తుంది. ఇందుకొరకు ఎలుకలపైన అధ్యయనం చేయగా ఎలుకలకు తెల్ల పుట్టగొడుగులను ఇవ్వడం ద్వారా పరీక్షించినప్పుడు, వాటి గౌట్లోని సూక్ష్మజీవులను ఉత్పత్తి చేస్తుంది, ఇవి కొవ్వును కరిగించే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి.
*మరొక అధ్యయనం ప్రకారం పుట్టగొడుగులు మరియు విటమిన్స్ అధికంగా ఉండే ఆహారాలు వంటి కూరగాయలను తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో మధుమేహం నుండి రక్షణ పొందగలరని నివేదించబడింది. డయాబెటిస్ మెల్లిటస్ ప్రపంచవ్యాప్తంగా 14% గర్భాలను ప్రభావితం చేస్తుంది, ఇది తల్లులు మరియు శిశువులను ప్రభావితం చేస్తుంది. ఈ తెల్ల పుట్టగొడుగులోని విటమిన్ బి వృద్ధులను చిత్తవైకల్యం ఉన్నవారిని మానసిక కార్యకలాపాల నుండి మరియు చిత్తవైకల్యం నుండి కాపాడుతుందని కనుగొనబడింది. అదేవిధంగా, డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మెట్‌ఫార్మిన్ తీసుకుంటారు. కానీ బదులుగా ఈ తెల్ల పుట్టగొడుగులు సహజంగా శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మీకు సహాయపడతాయి.
*పుట్టగొడుగులు తీసుకొంటే ఆరోగ్యంగా ఉంటారు. మీకు అవసరమైన, ఆరోగ్యకరమైన పుట్టగొడుగులను ఎంచుకోవడం మరియు ఉపయోగించడం ఉత్తమం. కానీ ఈ పుట్టగొడుగులలో పోషకాలు మరియు ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహానికి పుట్టగొడుగులు ఉత్తమమైన ఆహారం. ఎందుకంటే ఇందులో మన శరీరానికి అవసరమైన పోషకాలు మరియు తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల, పుట్టగొడుగులను ఉదారంగా తీసుకోవచ్చు. దీనివల్ల తక్కువ స్థాయిలో చక్కెరను అందిస్తుంది.
*ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడుతాయి. తెల్ల పుట్టగొడుగులలో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి అవి కొవ్వును కరిగిస్తాయి. అందువలన గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. గుండె రక్త నాళాలలో కొవ్వు అడ్డుపడటం జరగదు. ఈ పుట్టగొడుగులలో రోగ నిరోధక శక్తి కూడా బాగా ఉంటుంది.
*తక్కువ గ్లైసెమిక్ సూచిక మరియు తక్కువ కార్బోహైడ్రేట్ పుట్టగొడుగులలో కనిపిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు అధిక బరువు ఉన్నవారు దీనిని ఉపయోగిస్తే అతిబరువు తగ్గవచ్చు. ఈ తెల్ల పుట్టగొడుగు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. విటమిన్ బి మరియు పాలిసాకరైడ్ వంటి పోషకాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు అదనపు పోషకాలను అందిస్తాయి. రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీనిలోని యాంటీ బయోటిక్ గుణాలు మీ ఆహారాన్ని రుచిగా ఉంచుతుంది. కాబట్టి మీ ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
*మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.*
*ఆరోగ్యమే మహాభాగ్యం.*
***
059.. *మరణానంతరం మన అంత్యక్రియలు
జరిగిన తరువాత ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
➖➖➖➖➖➖➖➖➖➖
కొద్ది గంటల్లో రోదనధ్వనులన్నీ పూర్తిగా సద్దుమణుగుతాయి. కుటుంబసభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో నిమగ్నమవుతారు.
మనవలు, మనవరాళ్లు ఆటపాటల్లో మునిగి పోతారు. ఓ యువతీ యువకుల జంట రొమాంటిక్ గా ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, పరస్పరం ఫోన్ నెంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. మరికొందరు దగ్గర్లో ఉన్న టీషాపులో బాతాఖానీకి బయల్దేరుతారు.
అప్పటివరకూ ఆప్యాయత ఒలకబోసిన పక్కింటాయన - శ్రాద్ధకర్మల సందర్భంగా వదిలిన పిండోదకం, విస్తరాకులు తన ఇంటి ముంగిట పడ్డాయని చిర్రుబుర్రులాడుతాడు.
ఈ లోగా నీ దగ్గరి బంధువు ఒకాయన - ఆఫీసులో శెలవు దొరకని కారణంగా నీ అంత్యక్రియలకు హాజరవ్వలేక పోయానని నీ భార్యతో మొక్కుబడిగా వాపోతాడు.
మరునాడు వెళ్ళిపోయినవాళ్ళు వెళ్ళిపోగా - మిగిలిన వాళ్ళల్లో ఒకాయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పెక్కువైందని అలుగుతాడు. మరొకాయన దానికి వంత పాడుతాడు.
నువ్వు జీవితాంతం ఒళ్ళు హూనం చేసుకొని, కడుపు కట్టుకుని కూడబెట్టిన కోట్లు విలువ జేసే ఆస్తుల్ని పంచుకొనే విషయంలో నీ పుత్రరత్నాలు పేచీ పడతారు. నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అణాపైసలతో లెక్కలేసి వాటాలు తేల్చేసుకుంటారు. అప్పటికింకా నువ్వు పోయి నిండా నాల్రోజులు కూడా కాలేదు సుమా! మెల్లగా బంధుమిత్రులందరూ ఒక్కక్కళ్ళుగా జారుకొంటారు. విదేశాల నుండి వచ్చిన బంధువులైతే, పదకొండో రోజు తరువాత వెళ్ళబోయే విహారయాత్రకు ఇప్నట్నించే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.
నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నెంబరుకు వచ్చే ఫోన్లని నీ కొడుకో, కూతురో విసుగ్గా ఆన్సర్ చేస్తారు. కుదిరితే నీ ఆస్తిపాస్తులు, రావలసిన బాకీల గురించి తెలివిగా కూపీ లాగుతారు.
అంతలో, తమ ఎమర్జెన్సీ లీవు అయిపోవడంతో కొడుకులు, కూతుళ్ళు నీ భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు.
నెల తిరగక ముందే, మీ అర్థాంగి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వుతుంది. అంతకుముందే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యథాతథంగా సినిమాలు, షికార్లు చుట్టబెట్టేస్తుంటారు.
మొత్తంగా, నేల లోపే నీ చుట్టూ ఉన్నవారు, నీకు అత్యంత ఆత్మీయులు, నువ్వు లేకుండా బతకలేమన్నవాళ్ళు - అందరూ తమ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారంటే - నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయమే మర్చిపోయేంతగా!! ఒక పండుటాకు ఓ మహావృక్షాన్నుంచి ఎంత సునాయాసంగా, ఎంత వేగంగా రాలిపోతుందో, అంతే వేగంగా 'నీవారు' అనుకున్న అందరి స్మృతిపథం లోంచి నువ్వు కనుమరుగై పోతావు.
నీ మరణానంతరం కుడా - అవే వర్షాలు, అవే రాజకీయాలు, బస్సుల్లో సీటు కోసం అవే తోపులాటలు. పండుగలు ఒకదానివెంట మరోటి వస్తూనే ఉంటాయి. సినిమాతారలకి రెండు, మూడు, నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ పెంపుడు కుక్క మరో యజమానిని వెతుక్కుంటుంది.
అంతలో, నీ సంవత్సరీకాలు రానే వస్తాయి. నీ పెళ్ళి కంటే ఆడంబరంగా జరిగే ఆ తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా! నీ గ్జ్నాపకార్థం అతిథులకి పంచబోయే స్టీలు శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు, కోడళ్ళ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది.
ఈ కార్యక్రమంతో నీకు, ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే. నీ గురించి మాట్లాడుకునే వారు గానీ, నిన్ను తలచుకునే వారు గానీ దాదాపుగా ఉండరు.
ఇప్పుడు చెప్పండి !!
ఇన్నాళ్ళూ మీరు పాకులాడింది ఎవరికోసం? దేనికోసం తెగ హైరానా పడిపోయావు? నువ్వు కట్టించిన భవనంలో నివసించే వారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే, నీ తపనకూ, తాపత్రయానికీ ఏమన్నా అర్థం ఉందా?
జీవితంలో ముప్పాతిక భాగం నీవాళ్ళనుకునే వాళ్ళకోసం, వారి మెప్పు పొందటం కోసం, వారి భవిష్యత్తు కోసం బతికావు కదా! వాళ్ళకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా?
ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి కాబట్టి, నీ కోసం నువ్వు సంతృప్తిగా బతకటంలో అర్థం, పరమార్థం ఉంది కదూ!!!
058..*బీజము రూపము
ఒకరోజు పశు వధ శాలలో ఒకడు గోవును చంపడానికొచ్చినపుడు...గోవు వానిని చూసి నవ్వింది.
దాన్ని చూసి కసాయి అడిగాడు. నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్?అని అడిగాడు.
అప్పుడు గోవు ఇలా చెప్పింది.
నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు.
అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది. ఏ తప్పూ చేయక, ఎవరికీ హాని కలిగించని నన్ను, నువ్వు చంపి, నా మాంసాన్ని తినే నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను.
పాలిచ్చి మిమ్మల్ని పెంచాను. మీ పిల్లలకూ పాలిస్తున్నాను. కానీ నేను తినేది మాత్రం గడ్డి.
పాలతో వెన్న చేసుకున్నారు. వెన్నతో నెయ్యి చేసుకున్నారు. నా పేడతో పిడకలు చేసుకుని వంటకు వాడుకున్నారు. అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు.
ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్లిపోయిన కూరలను ఎండి పోయిన గడ్డిని పెట్టారు. నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు.
కానీ నన్ను కసాయివాడిలా చంపడానికొచ్చావ్... నా పాలనుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావ్.
ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే. నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావ్. కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావ్.
నిన్ను కన్న తల్లికంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా నిలిచాను. శ్రీకృష్ణుని ఇష్టురాల్ని నేను.
నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్న నీ గతి ఏమౌను?
నా సంతతిని, నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే.
మీకు, మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో.
మాకే... భవిష్యత్తులో ఉనికి లేనప్పుడు... మీ కెక్కడి మనుగడ,అందుకే
నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను. అని చెప్పింది.
(మీకు సాధ్యమైనంతవరకూ మీ బంధుమిత్రులందరికీ ఇది తెలియజేసి గోమాత ఋణాన్ని తీర్చండి.)
జై గోమాత.🙏
మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.
ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.
దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ...
"ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి" అన్నాడు బ్రహ్మ...
ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...
ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రంలో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు. కూతురంటే అతనికి ప్రాణం.
ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.
తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో. అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.
అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా. వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు. అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం. నాలుగవ డైమెన్షన్ కాలం.
అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.
అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట. అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.
ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.
ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు. ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో సమానం.
పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.
అందుకే స్వామీ వివేకానంద అన్నారు..
"సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.
ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం. పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం. కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు. మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది. నాక్కుడా వచ్చింది.
పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి. హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.
మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు. ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు. ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.
ఎందుకో తెలుసా, చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు. అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం. ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం. ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం. అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు. ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు. అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.
ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి. ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.
ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.
ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పరమతం మాయలో పడుతున్నారు. మన తరువాత ఎప్పుడో వచ్చిన ఎడారి మతాలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు....
0 comm
055..ప్రాంజలి ప్రభ కధలు చదవండి.. ఓ శ్రీ రామ
04, తన కలెక్టర్ కొడుకును చూడడానికి ఛాంబర్ లోకి వెళ్ళాడు ఓ తండ్రి.
కలెక్టర్ ఐన తన కొడుకు భుజం మీద చేయి వేసి. "ప్రపంచం లో అత్యంత శక్తివంతుడు ఎవరు?" అని అడిగాడు .
అప్పుడు ఆ కలెక్టర్ సమాధానమిచ్చాడు..
ప్రపంచంలో అత్యంత శక్తి వంతుడిని నేనే అని.
ఆ తండ్రి ముఖం పాలిపోయింది. మా నాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అనే జవాబు వస్తుందని ఆశించాడు.
నిరాశగా వెనక్కుతిరిగి ఛాంబర్ లోనుంచి బయటకు వెళ్తూ మరొక్కసారి ఆలోచించమన్నాడు.
అప్పుడు ఆకొడుకు మానాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అని బదులిచ్చాడు. ఆశ్చర్యంతో తండ్రి అన్నాడు...
ఇంతకు ముందు నిన్ను నీవే శక్తివంతునిగా చెప్పావు, ఇప్పుడేమో నన్ను శక్తివంతుడు అంటున్నావేం అన్నాడు...!!
నాన్నా అప్పుడు నీ చేయి నా భుజం మీద ఉండింది. అందుకే అప్పడు నేనే శక్తివంతమైన వాన్ని. ప్రపంచంలో ఏకొడుకు భుజంమీద తండ్రి చేయి ఉంటుందో ఆకొడుకే అత్యంత శక్తివంతుడు కాదా నాన్నా?!
తండ్రి కళ్ళలో నీళ్ళు!
తోటలో నాటిన విత్తు మొలకెత్తడం సహజం.
ఆ విత్తును మొలకగా, చెట్టుగా, మహావృక్షంగా మలచడం తోటమాలి గొప్పదనం.
విత్తులాంటి వాడు కొడుకైతే మహా వృక్షంగా మలిచే తోటమాలి నాన్న.
,,,,,,,,,
054...మూడు జల్లెడ్ల పరీక్ష ...ప్రాంజలి ప్రభు
(ఇప్పటితరానికీ ఉపయోగపడే నేటి కధ.)
ఒక సారి ఉత్తమ బ్రాహ్మణుడైన చాణిక్యునిదగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను” అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను “మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)” అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.
మొదటి జల్లెడ “నిజం” – “నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?” అని అడిగాడు.
అందుకు ఆ స్నేహితుడు “లేదు, ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు.
“అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట” అని చాణిక్యుడు అన్నాడు.
సరే రెండో జల్లెడ “మంచి ” – ” నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?” అని అడిగాడు చాణిక్యుడు,
“కాదు” అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .
“అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా మంచి విషయం కాదు అని తెలుసు,, సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం”అన్నాడు చాణిక్యుడు.
మూడో జల్లెడ “ఉపయోగం” – “నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? ” అని చాణిక్యుడు అడిగాడు.
“లేదు” అన్నాడు ఆ మిత్రుడు.
“అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?” అని అన్నాడు చాణిక్యుడు
నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.
స్నేహానికి విలువ తెలిసిన వారికి మాత్రమే ఈ కథ!!
భక్తుడు తెల్పగా ప్రజల మానస కోర్కెలు తీర్చే దైవమే లౌకిక మోహమే ప్రకృతి వెండియు వజ్రము ఆశగా, మనో శక్తియు మర్చియే పరుగు సాగియు దైవము చూడకే సదామోక్షము కొర్కనే శరణు మూఢులు కోరెను అంతరాత్మతోపద్యానికి మూలం ఆశలకు దైవాన్ని కలిస్తే మోక్షమే
---
053*అమృతస్య పుత్రా:* సేకరణ। ప్రాంజలి ప్రభ
*1- అన్నమయ్య జీవిత చరిత్ర*
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు)।
అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది। దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు। గొప్ప వైష్ణవ భక్తుడు।
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు । అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి।
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు।
సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది। ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు।
త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు।
చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు।
జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు।
అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు। అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయాయి;
జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి। తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు।
052..అన్నమయ్య
మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు। ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది।
అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం।
కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి।
నందవరీకులు క్రీ।శ। 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత।
క్రీ।శ। 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం" అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు।
ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికులు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం।
కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం। తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచింది। అన్నమయ్య కూడా నందవరీకుడే।
ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య।
చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట। వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట। అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట।
అన్నమయ్య తాతయ్య - నారాయణయ్య
కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపి నాడు మండలం నడిఒడ్డున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది। ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు।
ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసాడు।
సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు।
ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్దులు ప్రతి రోజు పూజిస్తారు। ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి।
ఆ గ్రామ వాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు। వాళ్లల్లో నారాయణయ్య చాల ప్రసిద్దుడు।
ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు। అన్నమయ్య పితృ పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్ణు భక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటు జీవితం గడిపేవారు।
ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది।
నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు। తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు। లాభం లేక పోయింది। తన వద్ద ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు।
ఊటుకూరు నేడు కడపజిల్ల రాజంపేట తాలూకాలో ఉంది। అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు।
అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు।
----
051 ... మీ శ్రీమతి లేఖ।। మీరు చదవండి
ప్రియమైన భార్య పుట్టింటికి వెడుతూ, ప్రియాతి ప్రియమైన శ్రీవారికి పంపిన గీతోపదేశం। (ఇది చదివిన తరువాత పాపం పురుషుడికి, అరె ఇవన్నీ చేయొచ్చా అనే ఫీలింగ్ వస్తె, కొంచెం కస్టమే।
ఇక చిత్తగించండి
(P।S ఇది చదివి పురుషుల్లో మార్పు వస్తే, నాకు భాధ్యత లేదు )
*** పనిమనిషికి జీతం ఇచ్చేశాను। నేను ఊరినుండి వచ్చిందాకా పనిమనిషి రాదు, వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది। గిన్నెలు తోవించి బట్టలుతికించి వెళ్ళాక తెలుపు వేసుకోండి।
*** 10 రోజులు వైఫై ఆపెయ్యమని ప్రొవిడర్ కి చెప్పేశాను। పెందలాడే పడుకోండి। మీ external HDD కేబుల్ కోసం వెతక్కండి। అది నా తో పాటు హాండ్ బాగ్ లోఉంది। మీరు కాలక్షేపం గా కధలు వ్రాయండి।
*** మీరు చాలా హెల్దీ గా ఉన్నారు। మాటి మాటికి ఆ లేడి డాక్టర్ వద్ద చెకప్ కి వెళ్లవద్దు। మీరు వేసుకొనే మాత్రలను పెట్టి ఉంచాను రోజూ వేసుకోండి।
*** మీ కోతి మూకని పోగు చేయకండి। సోఫాలో సిగిరేట్ పొడిని పోయిన సారి క్లీన్ చేసుకోటానికి రెండు రోజులు పట్టింది। పిజ్జా బిల్లులు చాలా దొరికాయి। పది రోజులన్నా బయటితిండి తినక ఓపిక చేసుకుని వండు కోండి అల్పాహారం,ఆహారం।
*** మీ మరదలు పుట్టినరోజు పోయిన నెలలోనే అయిపోయింది। మనిద్దరం వెళ్ళి వచ్చాం। అర్ధరాత్రి వెళ్ళి దానికి బిలేటెడ్ బర్త్ డే విశేస్ చెప్పాల్సిన పని లేదు। మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడట। అది మీకోసమే అని నా నమ్మకం।మెసేజ్లుపెట్టడం,చదవడం మంచిది కాదుకదా?
*** పక్కింటి వాళ్ళని పొద్దుటే లేపి పేపర్ వచ్చిందా, పాలు వచ్చాయా అని విసిగించకండి। పెపరు పాలు వేయమని చెప్పాను।
*** అల్మారాలో కుడి వైపు మీ చడ్డీలు ఉన్నాయి। ఎడంవైపు ఉన్నవి పిల్లాడివి। ఆఫీసునుండి ఏదో ఇబ్బందిగా ఉంది అని పోయినసారి హడావిడి పెట్టారు గుర్తుందా?
నీవు బుధ్ధి మంతుడివి నాకు తెలుసు అయినా చెపుతున్నా।
*** మొబైల్ ఫోన్ బాత్రూమ్ సోప్ బాక్స్ లో పెట్టి ఇల్లంతా రెండు రోజులు వెతికారు పోయినసారి। కళ్ళజోడు ఫ్రీడ్జ్ లో ఉండి పోయింది।
కళ్ళజోడు కలము సుబ్బు అన్నీ ఉన్నా యి తీసుకోగలరు।
*** మరి అంత ఎక్కువ స్మార్ట్ గా తయారవ్వకండి।।।।।!!!!!!! మన వీధిలో ఉండే మిసెస్ స్వాతి, జ్యోతి, రాధిక ముగ్గురు ఊర్లో లేరు।
నేను ఇక్కడి నుండే చూడగలను ఇక్క డున్నా నిన్నే తలుస్తాను నీ ఆరోగ్యం జాగ్రత్త ఎన్ని పనులున్నా నా ఫోన్లకు సమాధానములు ఇవ్వ గలవు।
*** షరా మామూలుగా నేను ఎప్పుడయినా తిరిగి వచ్చే అవకాశం ఉండనే
ఉంది।
మీ శ్రీమతి
0
No comments:
Post a Comment