Thursday, 30 June 2022


వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేనచ !
వకార పంచభిర్యుక్తః నరః సంయాతి గౌరవం.!! ....... 56

అనగా మేలైన వస్త్రములు ,స్నానముచే నిర్మలమైన శరీరము , మృధు మధురమైన వాక్కు ,మంచి విద్య, దానికి తగిన వినయము ఇవియున్న వానికే గౌరవము లభించును.ఇవి లేని వాడు ఇంద్రుడైనను వానికి గౌరవము ఉండదు....

శ్లో === భార్యా వియోగాశ్చ జనాపవాదో ఋణ స్య శేషః కుజనస్య సేవా
దారిద్ర్యకాలే ప్రియదర్శనం చ వినాగ్ని నాప జ్చ దాహంతి కాయ [చిత్త]మ్     ...... 57


భావము === భార్యావియోగము, లోకుల నిందింప బడుట, ఋణ శేషము, నీచులను 

సేవించుట, తనకు లేనప్పుడు తన వద్దకు వచ్చి పరామర్శించు వారు, ఈ ఐదుగురు ను నిప్పుతో పనిలేకయే దాహిమ్తురు. అనగా వీరు అవమాన భారముతో నశిమ్తురని భావము.

శ్లో|| దానపాత్రమతిక్రమ్య యదపాత్రే ప్రదీయతే।
తద్దత్తం గామతిక్రమ్య గర్దభస్య గవాహ్నికమ్॥

తా|| "దానము పొందుటకు అర్హత, యోగ్యత కలవాడికి కాక అనర్హుడికి, అయోగ్యుడికి చేసిన దానము గోమాతను కాక గాడిదను సేవించినట్లు వ్యర్థం ఔతుంది."



నేటి  అనారోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం   పత్రికలోని  వ్యాసములు కీర్తనలు శ్లోకాలు  పద్యాలు కధలు - చావండి చదవమని చెప్పండి 

*ప్రాంజలి ప్రభ సుభాషితాలు *గజల్ -- అంచయాన - (011).   కపిల భగవానుని ఆగమన ఉద్ధేశ్యము -1 *మనశ్శాంతి* బోధ , * శ్రీ సూర్య మండల స్తోత్రం *ఓం నమః శివాయ: *కర్మ - జన్మ (1), *శ్రీ అన్నమాచార్య సంకీర్తన --1 *  మనమేం చేస్తున్నాం? *మహాభాగవతం


*ప్రాంజలి ప్రభ సుభాషితాలు 

*కీటోసపి సుమనః సంగదా రోహతి సతాం శిరః ౹

  అశ్మాపి యాతి దేవత్వం మహద్భి : సుప్రతిష్ట : ౹౹

పువ్వుల స్నేహవల్ల కీటకము కూడా సజ్జనుల శిరస్సు ఎక్కుతుంది।అలాగే,మహాత్ముల ప్రతిష్ఠించిన శిలకూడా దైవత్వాన్ని పొందుతుంది।

***

*శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం

1 కస్త్వం కోఽహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః।

ఇతి పరిభావయ సర్వమసారమ్ విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్ ।।

నీవెవరు? నేనెవరు? ఎక్కడి నుండి వచ్చావు? నాతల్లి ఎవరు? నాతండ్రి ఎవరు? స్వప్నమువలే కనబడు ఈ ప్రపంచమును విడిచి అంతా నిస్సారమే అని భావించుము।

****

*108 ఉపనిషత్తులలో గల 108 మహా వాక్యములు

88। స్వయమేవకృతద్వారం రుద్రాక్షం స్యాది హోత్తమమ్।।

(రుద్రాక్షజాబాలోపనిషత్)

- స్వయముగా రంధ్రమున్న రుద్రాక్ష ప్రశస్తమైనది (స్వయముగా రంధ్రమున్న రుద్రాక్ష ధరించుట శ్రేష్టము)।

*****


*గజల్ -- అంచయాన - (011)

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

హృదయమునకు ప్రీతి కలిగించు హృదయమే అంచయాన 
పుణ్య కర్మలు చేయు వారి శిరమున అంచయాన  

యోగ నిష్ఠుల ప్రస్థానములొ సహాయ సహకారం 
నిర్మలత్వము ప్రసాదించు రూపము అంచయాన 

చ్ఛిన్నాభిన్నమైన తత్త్వజ్ఞానము సహకారం 
ఉండే సంశయములనే తిర్చేటి అంచయాన  

దుష్ట శిక్షణ శిక్ష రక్షణ యందు సహకారం 
కపాల మోక్షముకు అనుశ్రుతముగా అంచయాన

ఆఖరి దశలో శాంతి కల్పించే సహకారం 
విచ్ఛిన్నమస్తక గ్రంధులు ఏకం అంచయాన 

నిత్యమూ సందర్భము ననుసరించి సహకారం 
సరైన పునర్జన్మను కలుగచేయు అంచయాన 

జనులకు ఆత్మజ్ఞానము అందించే సహకారం 
జన్మ రాహిత్యాన్ని ప్రసాదించు అంచయాన 
 
మంచి వారు ఎల్లప్పుడు పూజింప అంచయాన 
పాద పంకజములు కలగి పవిత్రత అంచయాన  

____(((())))____

*  కపిల భగవానుని ఆగమన ఉద్ధేశ్యము -1 🌴

1. శౌనక ఉవాచ

కపిలస్తత్త్వసఙ్ఖ్యాతా భగవానాత్మమాయయా
జాతః స్వయమజః సాక్షాదాత్మప్రజ్ఞప్తయే నృణామ్

భగవానుడైన కపిలుడు జన్మలేని వాడై ఉండి తన సంకల్పముతో పుట్టి తత్వములను నిరూపించాడు. మానవులకు ఆత్మ బోధ చేయడానికి ఏ పుట్టుకా లేని పరమాత్మ తన సంకల్పముతో పుట్టాడు.
****




Monday, 27 June 2022

 


వారం వారం కవిపరిచయం

పంచపది కవిరత్నాలు-5


1.పేరు: మల్లాప్రగడ రామకృష్ణ 

2.పుట్టిన తేది/వయసు:15.06.1959/64సం.లు.

3.జన్మస్థలం: తెనాలి, ఆంధ్ర ప్రదేశ్.

4.విద్యార్హతలు:బి.యస్.సి (ఫిజిక్స్ మేన్) gunturu 

5.తల్లిదండ్రులు: తల్లి.కీ.శే. ఉర్మిళా హౌస్ వైఫ్ 

తండ్రి.కీ.శే. మల్లాప్రగడ రామకృష్ణ, విశ్రాంతి ఫైర్ డ్రైవర్ స్టేట్ గౌర్నమెంట్ ఉద్యోగి మరియు జ్యోతీషం, జాతకం ప్రవృత్తి హనుమాన్ జ్యోతిశలయం , గుంటూరు.

తాతగారు : కీ శే వెంకటాచల జోశ్యులు, నిజాం నవాబు వద్ద పండితులు   

6.సంతానం: ముగ్గురు కూతుర్లు

* సమీరా, జాహ్నవి,ప్రత్యూష

7.నివాసం: ప్రాంజలి ప్రభు,12-126, ఆదిత్యనగర్,2వలైన్,మీర్ పేట, హైదరాబాద్.97. 

8.రచనలు:2012 నుండి రచనలు చేస్తున్నాను, 

9. ముద్రిత పుస్తకములు > 1. పంచపాది (380) పద్యాలు 

   2. వేంకటేశ్వర , లలిత , నమ: శివాయ శతకములు 

  

**రామాయణం బాలకాండ పద్యాలు, సుందరకాండ వచన కవిత్వం, భగవద్గీత అంతర్గత సూక్తులు, మరియు కధలు నిత్యమూ ఉదయ గీతంలా ఫేస్ బూక్ లో పొందుపరచడం 

 **నాన్న,పెదనాన్నలు, సాహిత్యం సంపద తో జీవితం గడిపారు

9.సాహిత్య సేవ: పంచపాది పద్యాలు గా శివ లీలలు 350 పైన పద్యాలు వ్రాసి ముద్రించడం జరిగింది.

10.వృత్తి ప్రవృత్తి:. విశ్రాంతి యెకౌంట్స ఆఫీసర్, APMS,RMS,  ఆంధ్రప్రదేశ్ 

**మాధమెటిక్సు మాష్టర్ గా 9 సంవత్సరాల అనుభవము

11.అవార్డులు రివార్డులు:   ఉన్నత వ్యక్తి, సహజ వ్యవహారిక కవి  

12.ఇతరములు: సహాయం చేయటం అలవాటు, తెలుగు వృద్ధికి నా వంతు కృషి చెయ్యాలని తపన  

పంచపదులపై నా అభిప్రాయం

పంచపాది నిర్వాహకు లందరికి హృదయ పూర్వక అభి నందనలు , శుభా కాంక్షలు, అందులో నేనొక సభ్యునిగా ఉండటం పూర్వజన్మ చేసుకున్న సుకృతం, సాహిత్య సంపద  హద్దులు లేని సముద్రము అదేవిధముగా కవుల హృదయ స్పందనలు తెలుసు కొనుట కూడా కష్టమే, కాల గమనాన్ని బట్టి ప్రస్తుత పరిస్థితిలో తెలుగు అగమ్య గోచరంగా మారింది కారణము ప్రభుత్వమూ నిర్లక్షం, మేధావులు పండితులు చెప్పలేని స్థితి- 

మారాలి దానిలో ప్రయత్నంగా పంచ పది ప్రక్రియ పై  విఠల్ గారు చేయుకృషి అమోఘం, వారితో మరికొందరు సాహిత్య అభివృద్ధికి సోపానాలుగా ఉన్నారు, నా వంతు  కృషిగా ప్రాంజలి ప్రభ 2012 లో ప్రాంభించి వాడ్సప్ 200 మంది సభ్యులతో రోజు కధలు, పధ్యాలు ఇతరుల రచనలు పొందుపరుస్తూ ఉన్నాను   

పంచపది సమూహంలో వివిధ అంశాలతో ప్రతిరోజు ఇవ్వబడే విషయాలతో పంచపదులు వ్రాయడం ఒక దినచర్యగా మారినది. సమూహంలో సోదర సోదరీమణులతో చక్కని స్నేహబంధం ఏర్పడినది. పంచ పాది పద్యం  

*పసితనంలో తండ్రి సంరక్షణలే 

యవ్వనంలో భర్త సంరక్షణలే 

వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలే 

అందరూ సమానం కాదులే 

మహా మూల చైతన్యం అవునులే ఈశ్వరా 


*ఇంత విశ్వానికి సమృద్ధి ఈశ్వర కళ  

చింత మనసుకు బుద్ధిగా చేష్టల కళ  

అంతె అనుకున్న వృద్ధిగా ఆశల కళ 

పంత మనునది లేనిది ప్రతిభల కళ

వింతె మనసుకు శాంతిగా విశ్వకళలు ఈశ్వరా       


*ఫలిత మాశించకనె సాగు ప్రక్రియ కధలు

నాకు ఏమియు వద్దనే నియమ కళలు

తెలియని ఒ నిశ్శబ్దం స్వేచ్ఛ తెల్పు కలలు

ధ్యాన మార్గం దైవత్వము ధరణి కనులు

సర్వ శ్రేయస్సు కొరకేను సమర మగట ఈశ్వరా    


ఈ స్థితి స్మృతి శిష్టము ఇచ్చు శక్తె యుక్తి ముక్తిగా సాహిత్యంతో 

ప్రతి ఒక్కరి ఆయురారోగ్యాలు,సుఖ సంతోషాలతో జీవించాలని పంచపది కవన వేదిక తరపున ఆ భగవంతున్ని ప్రార్థి స్తున్నాను.


Saturday, 25 June 2022

గాయత్రి దేవి అంటే..!! PRN


01.గాయత్రి దేవి అంటే..!!

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు...
మహా శక్తి వంతమైన గాయత్రి మంత్రాక్షరాలు ...💐

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా....ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపమని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. 

నా నుండి అగ్ని..
అగ్ని నుండి వాయువు.. 
వాయువు నుండి ఓంకారం..
ఓంకారంతో హృతి..
 హ్రుతితో వ్యాహృతి..
వ్యాహృతితో గాయత్రి..
గాయత్రితో సావిత్రి..
సావిత్రితో వేదాలు..
వేదాలలో సమస్త క్రియలు..
ప్రవర్తిమవుతున్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:

1. వినాయకుడు:. 
సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.

2. నృసింహ స్వామి:.
పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.

3. విష్ణుమూర్తి:.
పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.

4. ఈశ్వరుడు:.
సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.

5. శ్రీకృష్ణుడు:.
యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.

6. రాధాదేవి:.
ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.

7. లక్ష్మీదేవి:.
ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.

8. అగ్నిదేవుడు:.
 తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.

9. మహేంద్రుడు:.
రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.

10. సరస్వతి:.
విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.

11. దుర్గాదేవి:.
దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

12. ఆంజనేయుడు:.
నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.

13. భూదేవి:.
 ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.

14. సూర్య భగవానుడు:.
ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.

15. శ్రీరాముడు:.
ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.

16. సీతాదేవి:.
తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.

17. చంద్రుడు:.
శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.

18. యముడు:.
కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.

19. బ్రహ్మ:.
సకల సృష్టికి అధిష్ఠాత.

20. వరుణుడు:.
భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.

21. నారాయణుడు:.
ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.

22. హయగ్రీవుడు:.
సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.

23. హంస:.
వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.

24. తులసీ మాత:.
 సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం..
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.

ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
.
త్రికాలాలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. 

ఆరోగ్యం, 
సంకల్ప బలం, 
ఏకాగ్రత, 
ఇంద్రియాలపై అదుపు 
సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. 

అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. 

హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు.

 ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. 

గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. 
శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. 

ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహాఋషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
.
గాయత్రి మంత్రాక్షరాలు...
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’

గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. 

‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ 
శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. 

పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. 

ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. 
వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.

లోకా సమస్తా సుఖినో భవంతు..!!💐

Friday, 24 June 2022

నాలో నీవు.. నీలో నేను...10 నుండి


నేటి పద్యం - జీవన జ్యోతి 
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

తొలివలపుల మల్లె చెండు అడుగు -  చిరుగాలి వళ్ళ ఆస్వాదించని వారెవ్వరు
రజని వెలుగు  జాబిలమ్మ  అడుగు -  చిరువెల్గు వళ్ళ సంతోషించని వారెవ్వరు 
తళుకు బెళుకు గాజులమ్మ అడుగు - చిరు గుండె వళ్ళ ఆనందించని వారెవ్వరు
నలుపు తెలుపు  చీరలమ్మ  అడుగు -  చిరు జంట వళ్ళ ఆచ్ఛాదించని వారెవ్వరు

మనసు ఎప్పుడు మారుతుందో తెలియదు, కోపము ఎప్పుడొస్తుందో తెలియదు కానీ ప్రకృతిలో  ఉండేవి ఏవి మారవు అవి కూడా భాద పడతాయని ఒక్కసారి ఆలోచించండి. 

మల్లె చెండు వలపు మధ్య నలిగి పోతుంది కానీ పరిమాళాల్ను అందించి సుఖం కలిగిసింది. చీకటిలో కలిగే సరసానికి జాబిలి చిరు వెన్నెల అందించి సంతోషించటానికి సహకరిస్తుంది. గాజులమ్మ అందచందాలతో మనసు ఊరడించి తళుకు బెళుకులు చూపించి చిరుగుండెలను ఆనందపరుస్తుంది. నలుపు తెలుపు చీరలమ్మ సహకరించి చిరు జంటను ఉవ్విలూరించి ఒకరికొకరు ఆలింగనంతో  తన్మయం చెందేటట్లు చేస్తుంది.  మరి వీటిని అనుకునే వారెవ్వరు.    


ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
              
సాధన చతుష్టయ సంపత్తి( మహావాక్యముల విచారణ - పరబ్రహ్మతత్వము.)ఆదిశంకరుల వివేక చూడామణి నుండి
🕉🌞🌎🌙🌟🚩 

ఓం శ్రీగురుభ్యోమ్ నమ:

గురుదేవులు చెప్పినదానికి శిష్యుని స్పందన చూద్దాం.  

శ్లో.  ఇతి శ్రుత్వా  గురోర్వాక్యం ప్రశ్రయేణ కృతానతి :   / 
       స తేన సమనుజ్ఞాత : యయౌ  నిర్ముక్త బంధన :  //  577 . 

సద్గురువు యొక్క అమృతవాక్కులు విని మిక్కిలి వినయంతో,  గురుదేవులకు నమస్కారం  ఆచరిస్తూ,  ఆ శిష్యవరేణ్యుడు  గురుదేవుని ఆదేశానుసారం సంసార బంధము నుండి పూర్తిగా విడిపోయి బ్రహ్మ స్వరూపియై ఆనంద సముద్రంలో విహరించెను. 

శ్రీగురుదేవుల వాక్యములను చక్కగావిని, ఆ వాక్కులు మహాప్రసాదంగా భావించి వినయంతో శిరస్సు వంచి నమస్కారం చేస్తూ,  అనాత్మబంధములను తెగ త్రెంచుకొని, స్వస్వరూప పరబ్రహ్మమై శిష్యుడు  విహరించాడు.   శిష్యుడు ఈ సమయానికి పరిపూర్ణ జ్ఞానీ అయినాకూడా, అహంకార రహితుడై, అదంతా గురు ప్రసాదమే అని  చిట్టచివరి దశలో కూడా గురువు పై వినయం చూపిస్తూనే వున్నాడు.   శిష్యుడు అద్వైతానందంలో ఓలలాడుతున్నా, గురుసన్నిధిలో ఆ అద్వైత భావము చూపించి గురువును తనతో సమానమని తలపలేదు. 

భావాద్వైతం సదా కుర్యాత్  క్రియాద్వైతం న కర్హిచిత్ /  
అద్వైతం త్రిషులోకేషు నా ద్వైతం గురునా సహ  //   
( తత్వోపదేశం  ఆదిశంకరుల విరచితం ) 

ఎల్లప్పుడూ భావంలో అద్వైతం వుండాలి.  క్రియలో అద్వైతం చూపకూడదు.  మూడు లోకాల విషయములందు అద్వైత సిద్ధాంత భావన అలవరచుకోవాలి గానీ,  గురువు వద్ద అద్వైతం ప్రదర్శించ కూడదు.

నిర్ముక్త బంధన : అని చెప్పడంలో శిష్యుడు బంధ విముక్తిని పొంది జీవన్ముక్తుడయ్యాడని భావము.   ఆ విధంగా బంధ విముక్తుడు కావడానికి గురువు యొక్క ఉపదేశములు, తత్వ చింతన అడుగడుగునా శిష్యునికి ఉపకరించి  వేదాంత సారమును శిష్యుడు గ్రహించి, స్వానుభవసిద్ధ ఫలితమును శిష్యుడు పొంది, కృతకృత్యుడు అయ్యాడు. 

ఈ విధంగా శిష్యుడు గురువు పై చూపిన గౌరవము, వినయము,  సాధనలో పడిన శ్రమ తెలుసుకోవాలి.    గురుదేవుని వాక్య తత్పరత,  ప్రసన్నత, గురువుకు  నమస్కారం చేయడం,  ఆజ్ఞా బద్దుడు అవడం, బంధ విముక్తిని పొందడం ఇవన్నీ క్రమంగా వర్ణించ బడినవి. 

ఇలాంటి గురు భక్తి కలిగిన వారు తప్పక అఖండ  జ్ఞానులవుతారని తెలుసుకోవాలి.  

🕉🌞🌎🌙🌟🚩

ఓం శ్రీగురుభ్యోమ్ నమ:

ఈ శ్లోకంలో గురువు లక్షణాలను వివరిస్తున్నారు. 

శ్లో.  గురువేవ సదానందసింధౌ  నిర్మగ్న మానస :  /
      పావయన్వసుధామ్  సర్వామ్ విచచార  నిరంతర :  //  578 .

శ్రీగురుదేవులు నిరంతరము స్వస్వరూప పరబ్రహ్మానంద సాగరంలో మునిగిన మనస్సు కలవారై సమస్త భూమండలాన్ని పవిత్రంగా చేస్తూ ఆంతా తానే అయి స్వేచ్ఛగా విహరిస్తూ వుంటారు. 

గురుదేవులు స్థిరంగా ఒకచోట వుండరు.  ఎందుకనగా పరమహంసలు విహరించినట్లు విహరించే స్వభావం మహానుభావులది.  ఇదే శాస్త్ర వచనము.  అట్టి మహనీయులు ఎక్కడ పాదం పెడితే అక్కడ మహాతీర్ధం లాగా శోభిల్లుతుంది   అక్కడే గంగానదీ సమానమైన పవిత్రజలాలు వుంటాయి.   

మహాత్ముల పాదధూళి సోకినంతనే సమస్త జీవులూ పునీత౦ అవుతాయి.   వారికి భూమి అంతా కుటుంబమే ! వసుధైక కుటుంబం అనేదే వారి ధోరణి.   పరమహంసలు, అవధూతలు అయిన పరమగురువులు నిష్క్రియులై,  సంకల్పసూన్యులై,  అసంగులై, పరబ్రహ్మ స్వరూపులై,  సర్వ స్వతంత్ర విహారం చేసేవారు అయినప్పటికీ, ఎవరైనా సంసారబంధ విముక్తి కోరి తీవ్ర ముముక్షుత్వ వాంఛతో తమ దరిచేరి శరణు కోరతారో, వారిని పరమదయతో అనుగ్రహిస్తారు.  ఇది జీవన్ముక్తుల స్వభావము. 

అలాంటి మహానుభావులు కారణపురుషులై వుంటారు.  ఇలాంటివారు అంత తేలికగా జనబాహుళ్యానికి దొరకరు.  

శ్లో.  ఇత్యాచార్యస్య  శిష్యస్య సంవాదేనాత్మ లక్షణం / 
       నిరూపితం ముముక్షుణాం సుఖబోధోపపత్తయే // 579 .

ఈ ' వివేకచూడామణి ' గ్రంధంలో ముందరే తెలియపరిచినట్లుగా,  గురుశిష్యుల యొక్క ప్రశ్నోత్తర  సంవాద రూపంలో  బంధవిముక్తి ని కోరి, ఆత్మతత్త్వం తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసుల యొక్క సులభ జ్ఞానప్రాప్తికై  చెప్పబడింది.  

ఈ గ్రంధము గురుశిష్య సంవాదరూపమై నానావిధ ఉపదేశాలతోనూ, సకల ఉపనిషత్తుల సారముతోనూ నిండివున్నది.   దీనిని చదివి ఆకళింపు చేసుకున్నవారికి ఇవి అన్నీ తేటతెల్లం కాగలవు.   గ్రంధము యొక్క ముఖ్య ప్రతిపాదన ఆత్మ స్వరూప దర్శనమే.   ఆత్మజ్ఞానము కలిగించి,  అనాత్మరూప జ్ఞానమును తొలగించి శాశ్వత స్వ స్వరూప దర్శనము కలగడానికి అట్టి సాధకులకు  ఈ గ్రంథములోని విషయములు ఉపయోగ పడగలవు. 

ఈగ్రంధము యొక్క ముఖ్య ఉద్దేశ్యము సులభంగా తరించడానికి ఉపాయమును బోధించుట.   శ్రీకృష్ణుడు అర్జునునకు గురువుగా మారి భగవద్ గీత  చెప్పినట్లు, యోగ వాశిష్టం లో వశిష్టులవారు శ్రీరామునికి  గురుస్థానంలో వుంది బోధించినట్లు, ఈ గ్రంధంలో జగద్గురువులు శిష్యునికి ఆత్మ తత్వమును గురించి సంవాదరూపంలో బోధించారు.   అట్టి విధానము సులభ గ్రాహ్యము.   

తరువాతి శ్లోకంలో ' వివేకచూడామణి '  గ్రంథ విశిష్టత మరికొంత  చెప్పబడింది.   

🕉🌞🌎🌙🌟🚩

Thursday, 23 June 2022

1ప్రాంజలి ప్రభ



01 మిఠాయిలు ముట్ట 15-06-2023

అత్తగారు! స్వీట్ ప్యాకెట్ లో మైసూర్ పాక్ లేదు, ఏమైందత్తయ్యగారు!
ఏమోనే నాకేం తెలుసు? రాత్రి నువ్వో, మీ ఆయనో తినేసి వుంటారులే, అయినా సంసారంలో అన్ని లెఖ్ఖలేంటే కోడలా!
అత్తయ్యగారు! మీ కడుపులో చక్కెర ఫేక్టరీ వుంది, నిన్న రక్త పరీక్ష లో 450 వుంది!
మీ అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ హెచ్చరిస్తున్నారు, మీ అబ్బాయి అయితే మరో అడుగు ముందుకేసి "నీ అశ్రద్ధ తో మా అమ్మని చంపేసేలాగున్నావు" అంటారు, మీరు చూస్తే ఇలా, చావేదో నాకొచ్చినా బాగుణ్ణు!
కోడలు పిల్లా! ముందు కంటతడి ఆపి ఇలారా తల్లీ!
చెప్పండత్తయ్యగారూ!
నాకు చిన్నప్పటినుంచి మిఠాయిలంటే ప్రాణం!
మంచి వయసులో వుండి, మిఠాయిలు అందుబాటులోనున్నా తినలేకపోయాను, కారణం మా అమ్మ "ఒసే! నువ్విలాగ మితం లేకుండా మిఠాయిలు తింటే బాగా వొళ్ళొచ్చేసి నీకు పెళ్ళి అవకుండా పోతుందే " శోభనముగదిలో అన్నీ వు beన్నా ఆయనేమనుకుంటారోనని తినలేకపోయాను,
అత్తారింటిలో వుమ్మడి కుటుంబం మూలాన
"భగవంతుడా! ఈ పనులెప్పుడు పూర్తౌతాయి, మగవాళ్ళ భోజనాలెప్పుడవుతాయి, నా కడుపులోకి పిడికెడు మెతుకులెప్పుడెళతాయి" అనిపించేది!
క్రమేపీ నా సంసారమన్నది ఏర్పడ్డాక అంతులేని భాద్యతలతో తిండి మీద ధ్యాస పోయింది! 
అమ్మయ్య! కొడుకు బుద్ధిమంతుడు, కోడలు బంగారం ఇక నాకు కావలసిన మిఠాయిలు తినేయొచ్చనుకునేసరికి తోబుట్టువుల్లాగ ఈ చక్కెర, రక్తపోటూ వచ్చి పడ్డాయి, నన్నర్దము చేసుకో తల్లీ!
నిజమే అత్తగారు! ఈ విషయం లో భగవంతుడు మీకు అన్యాయం చేసాడు, ఇకమీదనుండి మీ ఇంట్లో మీరు దొంగతనం చేయాల్సిన పని లేదు, నేనే స్వయంగా నేతి మిఠాయిలు కొని తెచ్చి మీకిచ్చేస్తా, మీ కెన్ని కావాలంటే అన్ని తినొచ్చు!
అయితే మీరు నన్ననుగ్రహించి నా ప్రశ్నకు జవాబు చెప్పాలి!
ఏమిటమ్మ అది?
మీకు కడుపుతీపి అంటే ఎక్కువిష్టమా?
నోటితీపి అంటే ఎక్కువ ఇష్టమా?
కోడలా! నీ అంతరంగం నాకు అద్దంలా కనిపిస్తోంది, నా కొడుకు మీద ఒట్టేసి చెపుతున్నాను "ఇక నేను మిఠాయిలు ముట్టను " ఇదిగో నీ మైసూర్ పాక్!
--((**))--
0
****
గడియారం లా కదులుతూ ఉండాలి .

పైకి కిందకీ..కిందకీ పైకి మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారుజామున 4:00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. 
కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్ర లేస్తాము. 
ఇదే *బయో-గడియారం*. 
చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 
50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో 
గాఢంగా నమ్మి  చాలామంది తమ సొంత బయోక్లాక్‌ ను ఏర్పాటు చేసుకున్నారు. 
అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  *మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌* ను మానసికంగా తప్పుగా సెటప్ చేస్తాము. 
చైనాలో చాలా మంది ప్రజలు  120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి అలా మానసికంగా సంసిద్దులై వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు. 
*కాబట్టి ..!*
1. మనము మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా *ధ్యానం* చేస్తే తద్వారా మనం *కనీసం* 100 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు.
2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. 
వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.
3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన రంగు (తెల్లజుట్టు ఉంటే) వెయ్యండి, 
యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. 
*ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ  యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. యెట్టి పరిస్థితులలో వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు*.
4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ 
'నెగటివ్ థాట్స్' తో  తీసుకోవద్దు. 
*ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.* 
లేదంటే 'ఋణాత్మక ఆలోచన'ల వల్ల మన శరీరంలో నెగటివ్ ఎంజైములు విడుదలై మన జీర్ణ వ్యవస్థను, మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.
5. ఎప్పుడూ చురుకుగా ఉండండి. నడవడానికి బదులుగా వీలైతే జాగింగ్ చేయండి. 
5. *వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి*. 
(ఇది నిజం కూడ).
6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. 
కనుక ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి. 
*(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి*).
7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు. మన ఆలోచనా విధానం. ముఖ్యంగా మన మాట, సరదాకు కూడ.... 
"నాకు Old age వస్తుంది" అనే మాటను అనకండి. కాబట్టి మీ మానసిక 
'బయో క్లాక్' ని ఎక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోండి ....
ఆలోచనా దృక్పధాన్ని మార్చుకోండి.     
******
విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ

*****

 

Wednesday, 22 June 2022

ఉగాది

 



*****

*చైత్ర మాసం విశిష్టత*
“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం.
 సంవత్సరానికి తొలి మాసం కూడా.  చైత్రమాసం అనగానే మనకి "ఉగాది, "శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.

పురాణ గాథ!
ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు  శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు. 
అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. 
వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. 
సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట. 
నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి
ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి. అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది.  అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది.

 అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి.
 ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది.  
ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’.
ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే
 కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు. 
కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది. 
అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. 
మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది
సేకరణ

*🌹. ఉగాది విశిష్టత -  చరిత్ర🌹*
*🍀. 'శుభకృత్‌'  ఉగాది శుభాకాంక్షలు - ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితం ఆనందం,  శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి  యొక్క గొప్ప సంవత్సరంగా ఉండాలని కోరుకుంటూ 🍀*

*ఉగాదిలో 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఆ శబ్దానికి ప్రతిరూపం ఉగాదిగా రూపొందింది.*

*ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు. ప్లవ నామ సంవత్సరానికి ముగింపు పలికి  'శుభకృత్‌'  నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.*

*🍀. ఉగాది విశిష్టత - చరిత్ర 🍀*

*చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.*

*శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు.*

*🍀. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత.. 🍀*

*ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.*

*🌻. బెల్లం - తీపి - ఆనందానికి ప్రతీక*
*🌻. ఉప్పు - జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం*
*🌻. వేప పువ్వు - చేదు- బాధకలిగించే అనుభవాలు*
🌻. చింతపండు - పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన *పరిస్థితులు*
*🌻.  పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు*
*🌻.  కారం - సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు*
ప్రాంజలి ప్రభ


*ఈ రోజు క్రొత్త అమావాస్య*

ఉగాదికి ముందు రోజును *క్రొత్త అమావాస్య* అనడం ఒక వాడుక. ముఖ్యంగా గుంటూరు, క్రిష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలలో చాలా విశేషంగా చెప్పుకుంటారు.

రాబోయే క్రొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కనుక క్రొత్త అమావాస్య అని మన పెద్దలు అంటూంటారు.

క్రొత్త అమావాస్య నాడు గ్రామ దేవత (నూకాలమ్మ, మరిడమ్మ, పోలేరమ్మ, దుర్గాలమ్మ మొదలైన గ్రామదేవతలు) లను ఆరాధించుతారు. ఈ రోజున అమ్మవారికి ఉపారములు (అమ్మవారికి పెట్టే నైవేద్యములు) పెడతారు.అవి వేడి ఉపారము, చల్లని ఉపారము అని కడుపు చలువకోసం (తమ పిల్లలు చల్లగా ఉండాలని) పెడతారు. పెట్టిన నైవేద్యాన్ని ఇంటి చాకలికి ఇస్తారు. 

క్రొత్ప అమావాస్యనాడు ముఖ్యంగా పప్పు (పెసర పప్పు), తెలగపిండి (నువ్వుల చెక్క) కూర చేస్తారు. ఇంకా పోలి పూర్ణం బూరెలు, గారెలు  వడపప్పు, పానకం, పెరుగు (చల్లని ఉపారంలో ఇస్తారు).

ఇంటిలో ఈశాన్యంలో గోడకు గుండ్రంగా పసుపురాసి (అమ్మవారి ముఖం వలె), కుంకుమతో బొట్టుపెట్టి అమ్మవారిని ఆహ్వానించి పూజించుతారు.

అమ్మవారికి నైవేద్యంగా మూడు విస్తర్లు వేసి,వండిన పదార్థములను వడ్డించి నైవేద్యం పెట్టి హారతి ఇస్తారు. అనంతరం అమ్మవారిని ధ్యానించి, తమ పిల్లలు చల్లగా ఉండాలని, వృద్ధిలోకి రావాలని మ్రొక్కుకుంటారు.

అమ్మ వారికి పెట్టిన నైవేద్యాన్ని ఇంటి చాకలిని పిలిచి అతనికి ఇస్తారు.
.....


*నిజమైతే బాగుంటుందనిపించే కల*😇

వేడివేడి ఉప్మా తింటుంటే - అల్లం ముక్క నోటికి తగిలినట్టూ

దోరగా వేగిన పెసరట్టు కొరికితే -  జీడిపప్పు పంటి కిందకి వచ్చినట్టూ

మిర్చిబజ్జి ఆబగా తినబోతే -  నాలిక సుర్రుమన్నట్టూ

పక్కనే ఉన్న వొగ్గాణీ - గుప్పెడు బొక్కినట్టూ

పచ్చి మిరపకాయలు తగిలించి -  రోట్లో తొక్కిన టమాట పచ్చడి పేద్ద ముద్దలు కలిపినట్టూ

మామిడికాయ బద్ద నవులుతూ - గుండమ్మ కథ సినిమా చూస్తున్నట్టూ

పీకల్దాక పెరుగన్నం తినేసి - ఉసిరికాయ బుగ్గనెట్టుకున్నట్టూ

దిబ్బరొట్టె మొత్తం - 
నేనే తినేసినట్టూ

వేపచెట్టు కింద మడతమంచమెక్కి - 
చెంబుడు నిమ్మకాయ మజ్జిగ తాగి పడుకున్నట్టూ

చద్దన్నంలో - ఆవకాయ వాయ కలిపినట్టూ

పప్పుచారులో గిన్నెడు -  చిన్నుల్లిపాయలు, దోసకాయ, బెండకాయ, ములక్కాయ ముక్కలు తేల్తున్నట్టు

రోడ్ మీద కొబ్బరి బొండాం కొట్టించుకుంటే - లేత కొబ్బరి ఉన్నట్టూ

లేత లేత ముంజెలు వేలితో పొడుచుకుని - లెక్కెట్టకుండా తిని మూతి తుడుసుకున్నట్టూ

కమ్మగా ఉడికిన ముద్దపప్పు అన్నంకి - దోసబద్దల పచ్చడి తోడైనట్టూ

చుక్కకూర పప్పు కుతకుతలాడించి - వేడివేడిగా అమ్మ చపాతీ చేసినట్టూ

నూకలన్నంలో - వెన్న తీయని మజ్జిగ పోసుకుని జుర్రినట్టూ

పులగం అన్నంలోకి - ఘాటుగా పచ్చిపులుసు పోసినట్టూ

చెట్టు నుంచి తెంపుకొచ్చిన లేత వంకాయలు - మగ్గీ మగ్గగానే పళ్ళెంలోకి వడ్డించినట్టూ

సావిట్లో గేదెలతో పోటీపడి -  తేగలు తెగ తినేసినట్టూ

దోర పచ్చికొబ్బరి లోకి - బెల్లం గెడ్డ జత కుదిరినట్టూ

తిరుపతి లడ్డూ మొత్తం -  అచ్చంగా నాకే ఇచ్చేసినట్టూ

పరపరలాడే పచ్చిమామిడికాయలు - ఉప్పూ కారం దట్టించి కొరికినట్టూ

పండిన వేపకాయ - ఎవరూ చూడకుండా చీకిపారేసినట్టూ

టమాటా పప్పుకి తోడు -  ఊరమిరపగాయలూ , వడియాలూ , అప్పడాలతో వచ్చినట్టూ

మసాలా చాయ్ - ముంత మసాలాతో తాగినట్టూ

బంగినపల్లి మామిళ్ళు - పరకల కొద్దీ తినేసినట్టు

వేడి వేడి బెల్లం జిలేబీ , 
రోడ్ మీద కొనీ కొనగానే - 
కారు డోర్ వేసుకుని గుటుక్కుమనిపించినట్టు

బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తులు -  ఒలుచుకు తిన్నట్టూ

లోటాడు మద్రాస్ ఫిల్టర్ కాఫీ -  స్టార్ బక్స్ లో దొరికినట్టూ

బట్టీలోంచి తెచ్చిన బఠాణీలు -  పటపటమని నమిలేసినట్టూ

అలా చెట్టు నుంచి దూసిన కరేపాకు -  తాలింపులో వేసి కొత్తటుకులు వేయించినట్టూ

సినిమా హాల్ లో పాప్కార్న్ -  ఎవరన్నా తెచ్చిపెట్టినట్టూ

చిన్నా పెద్దా తేడాలేకుండా -  రసాలు గుటకలేసినట్టూ

కొబ్బరి బూరెల కోసం చేసిన -  చలివిడి కొట్టేసి తిన్నట్టూ

బిడ్డనెత్తుకొచ్చిన సారెలో -  పంచదార చిలక నాకే ఇచ్చినట్టూ

కొబ్బరి మామిడికాయ ముక్కలు - కేజీలు ఖాళీ చేసినట్టూ

మా పెద్ద రేగు చెట్టు - ఇంకా బిందెలు బిందెలు కాయలు కాస్తున్నట్టూ

కిస్మిస్ లని -  కేజీల్లో మాయం చేసేసినట్టూ

దోర జాంకాయాలు  చెట్టునుంచి ఎతికెతికి కోసుకుని -  పరపరా నమిలేసి తిన్నట్టూ

సన్నసెగన మరగకాగిన ఉలవచారు తాలింపు -  ఘుప్పుమన్నట్టూ

వానాకాలంలో పకోడీల వాసన -  గాలిలో తేలి వచ్చినట్టూ

తంపడకాయలు, కాల్చిన పచ్చేరుసెనక్కాయలు - కలిసి దొరికినట్టూ

పుల్లైసు బండి - పరిగెత్తకుండానే మన గుమ్మం ముందే ఆగినట్టూ

పొట్ట పగిలిపోడానికి రడీగా ఉన్న సీతాఫలం - చెట్టునే మగ్గి దొరికినట్టూ

దోరగా పండిన చింతకాయ -  చిటుక్కున చేతికి అందినట్టూ

పాలసపోటా చెట్టుకింద నిలబడి - అలాగ్గా కోసుకు తిన్నట్టూ

చిన్నుసిరికాయల చెట్టు -  స్కూలుకెళ్ళే దారిలో  కొమ్మజాపి రమ్మన్నట్టూ

ఎర్రగా వేగిన బంగాళా దుంప కూరకి - రసం తోడైనట్టూ

వాక్కాయల చెట్టొకటి తోవెమ్మటే ఉండి రారమ్మన్నట్టూ

కణుపు చిక్కుళ్ళు - చట్టినిండా ఉడకబెట్టి అమ్మ వాకిట్లోకి వెళ్ళినట్టూ

మామిడితాండ్ర పొరలుపొరలు తీసితింటూ - ముచ్చట్లు చెప్పుకున్నట్టూ

సాంబారు పెట్టిన్నాడే - దొండకాయ వేపుడు కూడా చేసినట్టూ

ఎర్రని సీమతుమ్మకాయలు -  కొక్కెం ఊడిపోకుండానే ఒడినిండా దొరికినట్టూ

గుళ్ళో పక్కనోళ్ళు - వాళ్ళ వాటా పులిహోర కూడా నాకే ఇచ్చినట్టూ

వగరే తెలియని కండపట్టిన నేరేళ్ళ కొమ్మ - చేతికందినట్టూ

విరగ కాసిన ఈత చెట్టొకటి - పిలిచి కాయలిచ్చినట్టూ 

బెల్లం గవ్వలు - ఒక పిసరు పాకం తక్కువై తీగ సాగినట్టూ

వర్షం పడుతుంటే - పునుగుల పళ్ళెం చేతిలోకి వచ్చినట్టూ 

వేయించిన ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసి - రోట్లో తొక్కిన గోంగూర పచ్చడి వెన్నపూసేసుకుని వాయ కలిపినట్టూ

భోజనాల బల్ల దగ్గర ప్రశాంతంగా కూర్చుని -  పాలుపోసి వండిన కూరలో ములక్కాయ ముక్కల్ని ఓ పట్టుపట్టినట్టూ

ఆవడల మీద బూందీ మిక్చరు వేసుకుని - మిట్టమధ్యాహ్నం ఎండలో హాయిగా తింటున్నట్టూ

పూరీలు పున్నమి చంద్రుళ్ళా పొంగి - కమ్మని కూరతో తెగతిన్నట్టూ

ఉల్లిపాయలు జీలకర్ర కరేపాకు దిట్టంగా వేసిన రవ్వట్టు - గుండ్రని డైనింగ్ టేబుల్ సైజులో పెట్టినట్టూ

గడ్డపెరుగులో - నిమ్మకాయ బద్ద నంజుకుని నాకేసినట్టు

పానిపూరీలు - లొట్టలేసేంత పుల్లగా వర్రగా కుదిరినట్టూ

దప్పళం గిన్నె - మొట్టమొదలు నాకే ఇచ్చినట్టూ

ఆఖరికి ఏడేడి ఇడ్లీలు దూదిలా మెత్తగా పొగలు కక్కుతుంటే - నేతిగిన్నెలో ముంచి కారప్పొడి అద్దినట్టూ

*కమ్మని కలలు కంటూ మాంచగి నిద్రలో  ఉంటే,  కుళ్ళుమోతు అలారం  పీడకలొచ్చినట్టు  మోగిచచ్చింది!* 

ఇదంతా ఎందుకంటే .....

ఈ రోజుల్లో ఇవిదొరకటం,దొరికినా తిని అరిగించుకునే శక్తిని కోల్పోయాం కదా‌!                                      

*****
సేకరణ..మల్లాప్రగడ రామకృష్ణ
*సంస్కార బీజం..!*
       ➖➖➖
*చెన్నై మహానగరంలో అదొక విశాలమైన కాలనీ. దాని పేరు బృందావన కాలనీ. ఆ కాలనీలో  ఏ ఇంటిని కనుగొనాలన్నా రెండు ల్యాండ్ మార్కులు. ఒకటి ‘కమలాసని నిలయం.’  రెండవది ‘దీనదయాళ్ హాస్పిటల్.’*
*కమలాసని నగసుత, హరికృష్ణ దంపతుల ఇల్లు.  ‘నగసుత’ సంగీత విద్వాంసురాలు. ఎంతోమందికి ఉదారంగా శాస్త్రీయ సంగీతం నేర్పుతుంది.* 
***************
*ఒకరోజు సాయంత్రం చిన్నపిల్లల క్లాసు జరుగుతున్నది . ఒక 8 ఏళ్ళ పిల్లవాడిని తల్లి తీసుకొని వచ్చింది. ఆ పిల్లవాడి పేరు ‘వాసుదేవ్‘ అని చెప్పింది. పిల్లవాడిని సంగీతం క్లాసులో చేర్చి వెళ్ళిపోయింది. వాసుదేవ్ ఏకసంథాగ్రాహి!*
*కమలాసని  ఇంటి ముందునుండే దీనదయాళ్ ఆసుపత్రికి అంబులెన్స్ వెళ్తూవుండేవి. ఎంత ఏకాగ్రంగా సంగీతం క్లాసు సాగుతున్నాసరే అంబులెన్స్ శబ్దం వినపడగానే వాసుదేవ్ పాడటం ఆపేసి ‘నారాయణ నారాయణ నారాయణ’ అంటూ కళ్ళు మూసుకొని ఉండిపోయేవాడు.* 
*అప్పడు క్లాసుకి అంతరాయం కలిగేది. ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంటే ఒకరోజు టీచర్ గట్టిగా కోప్పడింది. వాసుదేవ్ ఏడుస్తూ…”క్షమించండి టీచర్” అంటూ దణ్ణం పెట్టాడు.*
*టీచర్ కి జాలివేసింది . “నాయనా! పాఠం చెబుతున్నప్పుడు   నువ్వు ఎందుకలా చేస్తావు?” అన్నది కళ్ళు తుడుస్తూ.*
*అప్పుడు వాసుదేవ్ 'టీచర్! మాఅమ్మ ఏం చెప్పిందంటే అంబులెన్స్ సౌండ్ వినపడినప్పుడు మనం చేస్తున్న పనిని ఆపి, ఆ రోగి వెంటనే ఆరోగ్యవంతుడు కావాలని నారాయణ స్మరణ చేయాలని, మా ఇంట్లో అందరం అలాగే చేస్తాం టీచర్, అందుకే అలాచేశాను!' అన్నాడు చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ.* 
*టీచర్ కళ్ళే కాదు, అక్కడి పిల్లలందరి కళ్ళూ వాళ్ళకి తెలియకుండానే వర్షించాయి.*
*”నాయనా, వాసుదేవ్! నేను కాదురా, నీవే నా గురువ”ని అంటూ కౌగిలించుకున్నది టీచర్ అతడి తల నిమురుతూ.* 
*”టీచర్, నేను పెద్ద అయిన తరువాత హాస్పిటల్స్ కి అంబులెన్సు కొనిస్తాను. ఇది మా అమ్మ కోరిక టీచర్!” అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చేతులూపుతూ.* 
*”తథాస్తు!” అన్నది టీచర్ మనసులోనే.*
 *అలా 6 ఏళ్ళు గడిచాయి. సంగీతం చాలా బాగా అబ్బింది వాసుదేవ్ కి. అతని తండ్రిగారికి ట్రాన్స్ఫర్ అవడంతో వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు. అలా కాలం గిర్రున తిరిగిపోయింది!*
****************
*ఒక రోజు పొద్దున ఓ పిల్లవాడి చేయి పట్టుకొని తెల్లని డ్రస్సులో హుందాగా ఉన్న వ్యక్తి ‘కమలాసని’ ఇంటి గేటు తీసుకొని లోపలికొచ్చాడు.*
*”అమ్మా , ఎవరో వచ్చారు!” అని చెప్పింది ఇంట్లోని అమ్మాయి.* 
*అంతలో ‘గురో అజగురో త్యాగరాజ గురో గురో..” అంటూ పాడటం మొదలుపెట్టాడు వచ్చినతను.* 
*”వాసుదేవ్! నువ్వా!”  అంటూ లోపలినుండి గబగబా పరుగులాంటి నడకతో వచ్చింది నగసుత టీచర్.*
*”టీచర్!” అంటూ ఆమె కాళ్ళకు ప్రణమిల్లాడు. అతడిని లేవనెత్తి.. “ఎలావున్నావు వాసుదేవ్?” ఇన్నాళ్ళూ ఎక్కడున్నావు? నన్ను మరచిపోయావా?” అని అడిగింది  టీచర్.* 
*అతని కళ్ళవెంట కన్నీటిధారలు కారుతున్నాయి.*
*”అమ్మా! నేనిప్పుడు కార్డియాలజిస్టు ని. ఇక్కడే దీనదయాళ్ హాస్పిటల్ కు డాక్టరుగా వచ్చాను. ఇప్పుడు నాకు అమ్మలేదు. తొలి గురువుగా మా అమ్మ నేర్పిన సంస్కారాన్ని వదలరాదని 10 అంబులెన్సులను హాస్పిటల్ కు డొనేట్ చేశాను. నాకు భగవంతుడు శక్తినిస్తే ఇంకా కూడా చేస్తాను. వీడు నాకొడుకు దయాసాగర్. సంగీత జ్ఞానం కోసం వీడిని మీకు అప్పగిస్తున్నాను!”అన్నాడు.* 
*ఆ పసివాడిని ఆనందంగా గుండెలకు హత్తుకుంది నగసుత టీచర్.*
*అందుకే మాతృదేవోభవ అన్నది వేదం. ఎంతవారికైనా తొలిగురువు అమ్మేకదా ! కన్నతల్లి అయినా , అమ్మలాంటి గురువులైనా పసి మనస్సులలో సంస్కారబీజాలు నాటేది వారే. అందుకే కాలనియమంలేని సంస్కారాలను ఉగ్గుపాలతోనే నేర్పమంటారు మహాత్ములు .*

*****

Tuesday, 21 June 2022

నాలో నీవు... నీలో నేను..... (1)to 9



నాలో నీవు... నీలో నేను..... (1)
సరిగమలు, సరదాలు, సన్నుతి ప్రేమలు, వినిమయ వినోదాల విశ్వo, విశ్వ లీలలు కలయిక ప్రేమలు, కళల కారుణ్య కష్టాలు, కలలు తీర్చేటి కనురెప్పల్లో కదులతో హృదయ లీలలు, ఏకమై ఆనంద డోలిక అధరామృత కలయిక ప్రేమలు, అలుపెరగని ఆనందము, ఆనందంలో మకరందము, మకరందల్లో మాధుర్యము, మాధుర్యంలో అర్ధాన్ని, అర్థం చేసుకునే ఆత్మ సౌందర్యం, సమయ సందర్భ సన్నిహిత ప్రేమలు, మనసులో హృదయాంతర కవాటాలు కదిలించే ప్రేమలు, సుఖ సంభవమే కదా....
అవునా మరి ఇవి
తనని అడగకపోయినా సూర్యుడు తామరపూలను వికసింపజేస్తాడు,
మేఘాలు ఎవరూ అడగకపోయినా వర్షాలు కురిపిస్తాయి,
ఏ చదువు చదివిందని స్త్రీలు సుఖపెడుతున్నారు,
సజ్జనులైన వారు స్వతహాగా ఇతరులకు మేలు చేస్తారు.
పేరు పేరునా
_"నీ కష్టాలకు,బాధలకు గజ్జెలు కట్టి అందరికీ వినిపించకు._
_ఇక్కడ వినేవారి కంటే నవ్వే వాళ్ళే ఎక్కువ."_
మనసుల్లో అపోహ, మాటల్లో పోటీలు, మస్థిష్కమ్ లో పట్టుదల, నిగ్రహ శక్తులు, వచ్చి చేరాలంటే, జీవిత కాలం సరిపోదు, బంధాల మధ్య ప్రేమ పుట్టి, అనురాగాల మధ్య ఆత్మీయతలు పెరిగి, విశ్వాస సానుభవ కలయికలు, ఒకరికొకరు ఉన్నత భావాలతో, ఊహలు ఊయలగా సానుకూల పరిచి, సమయ దుర్వినియోగం పరచకుండా, సందర్భోచిత ప్రవర్తనలు, నిత్య జీవితంలో సరిగమలే కదా.....
జీవితంలో నిన్ను నిన్నుగా అభిమానించి ఇష్టపడిన వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోకు.
ఎందుకంటే అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు ఆ అదృష్టం అందరికీ దొరకదు.
నువ్వు నన్ను అర్థం చేసు కోలేవు, నన్ను సముదాయించనూ లేవు, నీకు నీవుగా మాట్లాడ నూ లేవు, ఆ మాటలు అర్థం చేసుకొని పలకనూ లేవు, నీదో లోకం నాదో లోకం, మనిద్దరిని కలిపింది మమేకం అంటావు, ఆశలు బట్టి ప్రవర్తించాలంటావు, విశ్వ రక్షణ తెలుసుకొని, మనుషులను అర్థం చేసుకొనే లక్షణం లేదంటావు, అర్ధానికి అర్థం పరమార్థం, అర్థం కాదంటావు, కాల నిర్ణయం బట్టి పోవాలంటావు, మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి నడవాలంటావు, సర్వశక్తులు క్రోడీకరించి జీవించాలంటావు, మంచో ఏది చెడు, అర్థం చేసుకునే జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు, దైవాన్ని నమ్మి జీవితాన్ని సాగించాలంటావు కదా......
****
నాలో నీవు... నీలో నేను...2
..
అవునా వేదాంత వ్యక్తిగా, వాంఛలు తీర్చు మదిగా,
అంతర్ముఖివై అంతా గమనించి, ఆశయాలు తెలిపి
పుట్టింది మొదలు నిత్య విద్యార్థినీ అని పలుకుతూ, ఏమీ తలవదనీ, అమాయకడని, ఆధ్యాత్మకడని,
ఊహతెలిసినప్పటి నుండి ఉచితానుచితాలు
గ్రహించి, ఉన్నదాన్ని విపులకరించి, సందేహం తీర్చి,
అనుభవంతో కొన్ని ఆకలింపుతో మరికొన్ని పసికట్టి తెలిపి, మనసు మనసుకు విషయ వాంఛలను తెలిపి,
సమయా సమయాలలో ఎలా వుండాలో నేర్పి, సహనముతో సహకారముతో, సంయణంతో,
పొగిడితే పొంగి ఉబ్బి తప్పిబ్భై, బోలాశంకరుడుగా,
తెగిడితే బాధాతప్త మదితో తల్లడిల్లి, హృదయావిదారక పలుకులల్లి, వినయ విధేయ మది తలపులతో, బ్రతుకు ఆటలతో,అలుపురాని ఆనంద పరవశంతో
ఏదైనా ఆశపడి ఆకాశమంత విహరించి, నిత్య సత్య ప్రభోదన్ని తెలిపి, ధర్మ నిర్ణయాలు తెలుపుచూ,
నిరాసైతే నీరసపడి సామ్రాజ్యాలు కోల్పోయిన
శోకమూర్తివి గా, కాల నిర్ణయానికి కట్టుబడి,
ప్రతిభ కనబరిచినా, విజయమొచ్చినా, సామర్థ్యమంతా పరమాత్మది, నేను నిమిత్తమాతృడనుచూ, ఓడితే విధిరాత అనక ఏదొ తన లోపమే ఇందుకు కారణం అనుచూ,
గౌరవ పేరుప్రతిష్టల ‌ గుర్తింపుకై వెంపర్లాడక, జరుగుతున్న కాలానికి తగ్గ అనుకరణ తో పలుకులు,
వీలైతే విశ్వ విజేత కావాలని అనుకోక, కొందరు
నీకు వ్యతిరేకమైతే ‌ పగబట్టి కసితీర్చుకోకప్రేమ కురిపించి సేవలు చేసి, వారి హృదయంలో ఉన్న పాషానాన్ని కారగించి, పువ్వులా పరిమళాలు అందించి, జీవితంలో
తోడునీడవై వుండి నడిపించి నలుగురిలో ఒకడిగా కాక, ఒక్కడిగా అందరికీ సహాయ ఆదరణ కల్పించే, నిర్మల మనసున్న నిజాయతీ పరుడవు, నవ్య, భవ్య,దివ్య, అజాతశత్రువు, ఎంతచెప్పిన తక్కువే.
నాగురించి అంతచెప్ప నవసరం లేదు జీవనాడి కదలిక నాకు నీకు మేలుకొలుపు అయినా
వృక్షాలకు గాలిని చూస్తే భయం. కమలలాకు చంద్రుడిని చూస్తే భయం. పర్వతాలకు వజ్రాయుధం చూస్తే భయం. మంచివారికి దుష్టులను చూస్తే భయం.ప్రపంచంలో అన్నీ వస్తువులకు భయం ఉండనే ఉంటుంది కదా
దానికి నీ సమాధానం.
ఏమి చెప్పాలి జీవన సాహిత్యం, కవి గారి ఆలోచనలకు ఈ భయాలు అడ్డు రావులే
అంతేనా
అంతే కదా
........
నాలో నీవు... నీలో నేను....3
ఈడేడు కొండలను దాటాను ... ఏరువాక పున్నమినే చేరాను
ఏమి చెప్పా తెలియకున్నాను ... అంతా నీవే శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
నదులు గుట్టలు దాటి వచ్చాను .. వన్య మృగాలను కలిసి వచ్చాను
తల్లిదండ్రులకు సేవే చేసి వచ్చాను .. అంతా నీవే శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
ఘడియ ఘడియకు నీ నామ స్మరణను .. మనసు మనసున కష్టాన్ని చెప్తున్నాను
కాలనిర్ణయాన్ని బట్టి బ్రతుకు తున్నాను .. అంతా నీవే శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
ఇంద్రియ సుఖాలు వదల కున్నాను .. మంచి చెడులు గమనించ కున్నాను
సర్వుల సర్వార్థం తెలియకున్నాను ... అంతా నీవే శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
.......
స్నేహము వీడ కుండ మనసే మమతా సహనమ్ము మార్గమున్
ద్రోహము చేయకుండ సుఖ బోధల సర్వము సేవ లక్ష్యమున్
మోహము చేర కుండ మది మోక్షము పొందుట ధర్మమార్గమున్
దాహము తీర్చ నుండ సహవాసము శాంతికి ప్రేమ తత్త్వమున్
........
గుప్పెడంత గుండె శబ్దమే నాదని ... గుండె పదిలమవ్వలేక ఉన్నానని
అస్థిర బుద్ధి తో జవసత్వాలని ... సత్యం ఇది శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
బ్రతుకు ఊహారెక్కలు కట్టుకుని .. మధుర స్మృతుల్లో పంచుకొని
ఆనందపు హద్దులు కలుపుకొని ... సత్యం ఇది శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
గాజు బొమ్మ బ్రతుకు నాదని ... ప్రేమ కోసం బ్రతుకు తున్నానని
బంధాన్ని అల్లుకొని చిక్కానని .... సత్యం ఇది శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
ప్రేమంటే ఆశా హరి విల్లని ... భ్రమల్లో బ్రతికేస్తు ఉంటున్నాని
నిరాశ నిస్పృహ జీవితమే నని ... సత్యం ఇది శ్రీ శ్రీ వెంకటేశా
.......
సాధనే శోధనే సంబరం సంఘమై సాక్షిగా సాహసం సామరస్యమ్ముగా
బాధలే బాధ్యతే సుందరం బంధమై భాగ్యమే భారతీ బంధుతత్వమ్ముగా
పాదమే పూజలై వందనం ధ్యానమై పాశమై పార్వతీ
భక్తి భావమ్ముగా
వేదమే సత్యమే సుందరం మోక్షమై వేడిగా చల్లగా సేవలక్ష్యమ్ము గా
......
శంకరుం డే మనో మార్గమే గా విధీ సంతసమ్మే సుఖాలే జయమ్మేను గా
శంక టాలే తిరో భయ్యమై పొంగుటే సంభవమ్మే విశేషం వివాదమ్ము గా

 నాలోనీవు..... నీలో నేను....4

ఓం శ్రీ రామ.... శ్రీ మాత్రేనమః
అనంత గంభీర సముద్రం యొక్క పిలుపు, నృత్యం చేస్తూన్న జలం మీద నా నావ ఊగుతూ ప్రయాణం,
శబ్దఘోషలో అంతర ఆత్మ తెలపలేని స్థితి, అర్ధం పరమార్ధం చూడాలనుకున్న కళ్ళు నిల్వలేని స్థితి వయోభారకదలిక మచ్చరము లేని మనసు, హృదయ కళ్ళు తెలిపే ఆవేదన శ్రీ శ్రీ శ్రీ సీతా రామా నిన్నే చూస్తున్నాయి ఈ కళ్ళు, నీ దాసుని రక్షించే కళ్ళ కోసం వేచివున్న ఈ కళ్ళు.
కాంతి యొక్క మంజుల కూనరాగ కళ్ళు ... ఉజ్జ్వల ప్రభావ అంతరంగమ్ము కళ్ళు
పరవశంతో పరిభ్రమించేటి కళ్ళు ... రెప్ప రెక్కలు పుప్పొడి తోను కళ్ళు
గోచర పదాల స్వేచ్ఛగా గొప్ప కళ్ళు ... అడవిపక్షుల బాగుగా స్వేచ్ఛ కళ్ళు
అంత స్వేచ్ఛనాకు ప్రసాదించు కళ్ళు .... విరగబోసుకొని అగమ్య స్వేచ్ఛ కళ్ళు
దీవెనలూ నీప్రేమలు, భావనలూ మురిసిపోవు బాధ్యత క ళ్ళూ
నవనీత తెలుపు కన్నులు, నవరాగ మనసు నవవిధ నాట్యము కళ్ళూ
అవినా భావము పొందియు, సవినినయ మలుపులు వల్ల సఖ్యత కళ్ళూ
వివరాలు కధే ప్రేమా, వినయమ్ము మదీ విధియని వేడుక క ళ్ళూ
అడవిలో కార్చిచ్చుకు ఎంత స్వేచ్ఛ కళ్ళు ... చీకటిని చీల్చి చండాడే గీత కళ్ళు
ఉరుములో ఎంత స్వేచ్ఛ ఉరక కళ్ళు ... స్వేచ్ఛ నాకు ప్రసాదించు సమయ కళ్ళు
నీవు నన్ను పిలవగాను నీడ కళ్ళు ... సరికి నా గోడ నీడల క్రింద కళ్ళు
నీ పిలుపు చూడ వినబడలేని కళ్ళు ... సూర్యుడే బాగ మీదికి తెచ్చె కళ్ళు
మౌనం ఒక నిశ్శబ్దం, మౌన పరిష్కారం మోక్షము కళ్ళూ
మౌనం ఆలోచనలే, మౌనకథలుగా వినోద మోక్షము కళ్ళూ
నీ నయ నాల వెలుగులే, కనలేని మలుపు తలపే కధలే కళ్ళూ
మౌన సమానత కళలే, వాన చినుకులై మెరుపులు వలపే కళ్ళూ
ఓం శ్రీరామ.... శ్రీ మాత్రేనమః
ఓం శ్రీరామ.... శ్రీ మాత్రేనమః
ఓం శ్రీరామ.... శ్రీ మాత్రేనమః
--
కం. జయతాత్ .. హనుమంతసతము
జయమునొసంగుమ వరిష్ట సజ్జనతతికీన్
భయమునుఁబోగొట్టుమయా..
సుయమనియమపాల.. దేవ ..శూరకపీశా !!! "
----

****

నాలో నీవు... నీలో నేను.... (5)

సీస పద్య మాల

నిత్య శుభ కలశం నీడ లాభాన్విత  ...  సమ హృత్సరమ్ము గా సామ రస్య 

సుప్రవాళ స్మిత సుమధుర  వికసిత  ... నిత్య పుష్పోత్సవం నిర్మలమ్ము

ప్రభల ధవళ చంద్రికామృత ధరణియే ... విశ్వ విశ్వాసమై విజయ మేను

సర్వ సన్నద్దయు సఖ్యత లక్ష్యమై   ...  దాన మాన ప్రాణ ధర్మ నిరతి

వాస్త వానికి సుఖం ఆనంద తూకమై  ... కాల పురుష శోభ కాల గతియు 

కిరణ జాల స్నాత కరుణ వసంతము  .. గాన లోలుప పిక గమ్య మాయె

 కళలు చూత ఫలము, కామ్య జగతి లోన .. మంద‌ వాయు చలిత, మానసమ్ము 

కీచక నాట్యము కీ డెది రించుట    ... ప్రకృతి నా దోత్సవం ప్రభల గీత

ద్వార బంధ కలలు పాడు చేయును బుద్ధి  .. శుభ తోరణోత్సవం శుభపు శోభ 

బంధు జన కథలు భాగ్య మగుట యేను  ...  నవ హృదయోత్సవం నవ్య జగతి

షడ్ర సోపేత ఆహార మే పరిమళం  ... కుసుమ కోమలము యే కృపయు జూవు 

చంద నార్చిత దేహ చైతన్య భాష్యము ...  పవిత్ర భావోత్సవం ప్రగతి తీర్పు

 స్మరణ కళల తోను సర్వ మంగళ శోభ  ... క్లేశ భార మనక సేవ నిరతి 

స్వర్ణ మయ భావము సమయమ్ము తీర్పుగా  .. మంగళోత్తర మేను, మహిమ ఇదియు

దేశ శు భోత్సవం, ధర్మ మార్గ ప్రతిభ  .. పద సేవనో న్ముఖ పలుక రింపు

జన సమా జోత్సవం జాగృతి ప్రాభవం  ... భారతీ వాణియు బంధ శృతియు

 మానవ మూల్యము మాధుర్య బంధము ... విశ్వ జనుల కీర్తి విద్య ప్రతిభ

పరివార భావము పరి మళోత్సవ మేను  ..  భావ జాబ్ది గురువు భాగ్య మేను

ఈ తరంగోత్సవం ఈశ్వర భావమే  ... ఆత్మ జ్ఞాన నవ కేతన కళ

కాంతి పూర గమన కార్యది నోత్సవం! ... శోభకృత్ వత్సర శోభ కళలు

 

* కాల పురుష శోభ కవుల కావ్య జగతి  ...  మృధుల హావ భావ చరిత్ర మధుర మగుట

నూతనో జ్వల బంధ మే పూజ్య నీయ  ... త్యాగ నిరతి రోగ రహిత తత్వ జగతి

.....

శోభకృత్ నామ సంవత్సరం.... నాలో నీవు.... నీలోనేను 

ఓం ఆదిత్యాయనమః.

ప్రాంజలి ప్రభ...శుభోదయవందనాలు.

ఆదిత్యహృదయం.

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః

ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః

ఆకాశానికి అధిపతి అగుటవలన, అతనికి వ్యోమనాధుడనే పేరు వచ్చింది. చీకటిని చీల్చుకొని వేదత్రయాన్ని (ఋగ్వేద, యజుర్వేద, సామవెదములు) త్రిలోకాలకు వినిపిస్తూ, మేఘాలను మెరిపిస్తూ వర్షాన్ని కురిపిస్తూ, నీళ్ళతో చెలిమి కలిగి, దక్షిణాయనంలో వింధ్యాచలం మీద సంచరించువాడు.

***

నాలో నీవు... నీలో నేను... (6)

*****************************

నేటి నా పాట పాట సంఖ్య:-

******************************

రచన:మల్లాప్రగడ రామకృష్ణ 

28/03/2023.g

****************

పాట సందర్భంపై నా విశ్లేషణ.

***************************

ప్రేమికులైనా సంసారులైనా  ప్రేమావేశం భావావేశం

భావవ్యక్తీకరణ లో ఇద్దరిది ఒకేదారైతే

అదో అధ్భుత కావ్యంలా వారి  పయనం

నిలిచి పోతుంది..

వనిత నిత్య నూతన కళావతియు సరిత

ఘనతల కళలు అవిశ్రాంత గమ్య భవిత

అలను పోలిన కదలిక ఆశ చరిత

వైభవ మదిగా అనుభూతి విద్య మమత

ఆమెలో 

చిలిపి తనం కొంటెతనం పువ్వుల్లా మదిలో పూసి

చతురోక్తుల సంభాషణలు  గుభాళిస్తు ప్రతి విషయాన్ని పట్టుదల గా తీసుకుంటు సుందరమయంగా మార్చుకుంటే

 ఆ జంట   ఒద్దికతనం అమోఘమైన  నవ్యతను సంతరించుకొని తమ చుట్టు సరదాల ప్రపంచాన్ని సృష్టించుకోగలరనే  స్ఫూర్తి తో  సాగే  ఓ  జంట పట్టుదల గా సాగుతు పాడుతున్న పాట..

****************************************

పల్లవి:-

*******

ఓ మందహాస మృధుస్వభావా 

ఈ అందచందం  నీ సొంతం చేసుకోవా

ఎదురుచూపులు మార్చి ముద్దు చేయవా 

చీకటివేళ వసంతం కురిపించవా 

వెన్నెల చీరతోనున్న అందాలు పరికించవా 

ఓ మందహాస మృధుస్వభావా 

ఈ అందచందం  నీ సొంతం చేసుకోవా

చరణం:-

********

చుక్కల చీర చక్కనమ్మ నై యున్నాను 

ఎర్రగా బుర్రగా ఊరిస్తున్నాను

రంభా ఊర్వశి మేనక మించి యున్నాను 

కౌగిలింతకు నలిగి పోవాలని యున్నాను 

ఆకు వక్క సున్నం కలిపిన కిల్లీ నౌతాను 

నీ సాయం తోటి సంసారం చేస్తాను

గంపెడు పిల్లలను కనిపెట్టి

 నీ వంశాభివృద్దిని చేస్తాను

పల్లవి:-

మందహాస మృధుస్వభావా 

ఈ అందచందం  నీ సొంతం చేసుకోవా

అతడు 

సృష్టినివిభజించు కొనుచు శృతిలయలగు

దృష్టి మార్చక గుణమును దృతి మతి గతి

కుమతులకు శిక్షణము రక్ష కుశలమేను 

సుమతి సత్కార్మచరణాలు పుడమి నీవు 

చరణం:-

*********

జంట గూడు లో గువ్వనౌతాను  

ఈడు తోడుతో సుఖము నిస్తాను 

మనసుల్లోన ప్రేమ నౌతాను 

వయసు గీతం  హరివిల్లు నౌతాను 

రంగుల వానలో తడిసి పోయి 

తపనల వీణతో కలిసి శృతి  కలప గలుగు తాను

అంతలో ఆమె 

మువ్వలు కట్టి నవ్వులు పంచే నీ నాగమల్లి ని 

ప్రేమ ప్రేమంటూ  గిర్రుగిర్రున నీ చుట్టు తిరుగుతుంటే

మల్లెపువ్వుని 

శిగలో చేరింది మంచి గంధమని 

కిక్కిచ్చి యవ్వన సార్వభామణినేను

బ్రతుకులో బంగారమై మెరిసి పోతాను 

పగలురాత్రి పండగగా మారిపో తాను

పరువాలన్ని పంచ గలుగుతాను 

రెచ్చి పోకుమా రెచ్చి పోకుమా.....

ఇద్దరూ కలసి

ఆమె....సతతమే ఇంతి సుఖశాంతి సంతసమ్ము ..2

అతడు...హితము గా నుండి సూర్యలా వెల్గు నింపి..2

ఆమె....మ్మతిగ శాంతిని గరచుచూ మాయ మాపి...2

అతడు....పతిగ నిత్యసుఖము నిచ్చు పరిమళమ్ము..2

----

 పల్లవి:-

*********

మందహాస మృధుస్వభావా 

ఈ అందచందం  నీ సొంతం చేసుకోవా

ఎదురుచూపులు మార్చి ముద్దు చేయవా 

చీకటివేళ వసంతం కురిపించవా

వెన్నెల చీరతోనున్న అందాలు పరికించవా

ఓ మందహాస మృధుస్వభావా 

**********************************

నాలో నీవు... నీలో నేను..... (7)

కనుచూపు మేరలో ఆదుకొనే అమ్మ, అలుపెరగని "ఆశ్స్రి  త స్త్రీ " జీవితం ఓ మైనపు బొమ్మ, వెలుగు నిచ్చి కరిగే నమ్మ, చీకటిని తరిమే దిమ్మ, ఆమె నిత్యమూ బాంగారు కొమ్మ, నయనాల పిలుపుతో నటించదమ్మా,

కదులు మొగ్గల, కన్నీరు, పువ్వులు, మోయాలని భరించే కాయలమ్మ, ఓర్పు, ఓదార్పు  చూపి, సకలమ్ము తృప్తి పరిచేనమ్మ, సేవలుచేసి నిత్యమూ సేవ నిర్మలమ్మా.

కష్టాలన్నీ తుమ్మముళ్ళ రెమ్మ, ఆశలు, ఆశయాలతో నుండె మంచు  బొమ్మ, నవ్వి, నవ్వించి, నవ్వుల బొమ్మ, నటనే తెలియని అమ్మ, నవనీత మందించి గాలిలో వెన్నెలమ్మ,

కళ్ళల్లో జరిగేను కన్నీటి చెమ్మ, మనసు విప్పి చెప్పుకోలేని ప్రేమమ్మా.

అవస్థలు ఆశ అరుగుల దిమ్మ, ఆర్ధిక సంపదకు మూల మమ్మ,మచ్చలేని మహిమను చూపు ఆదుకొనే నమ్మ,

ఆత్మీయత తోలుతిత్తులే నమ్మ, ఆదుకోలేని దైన ఆత్మ తృప్తి పరచు నమ్మా.

దిన దినం మహా ప్రయాసలమ్మ, విషయ వాంఛలకు నలిగితి వమ్మ, రక్తాన్ని పంచి రక్షించితివమ్మ, బాధ 

ఈసడింపు, తిరస్కార దినచర్యలన్నీ కుదుపులే కదమ్మ, 

అయినా మానవత్వాన్ని నిలిపెనమ్మా.

సుఖభోజనం నందించే నిపునత అమ్మ, సమస్యలను పరిష్కారీ అమ్మ, రాజ్య నీతి తెలిపే నమ్మ,

వంశోద్ధారకత వల అలల తుమ్మ, గానం తో ఊయల్లా 

ఆశలతో విషన్న వదనం వింత వర్ణ మేనమ్మ, 

ప్రేమతో బ్రతికించు మా ప్రేమమ్మా. మాముగన్న మా పెద్దమ్మ, మాఇలవేల్పు నీవే గదమ్మా 

         ********

చూపుల చూపై తోచెడి   ...  రూపములకు రూప మదియె  రూపము గాకే

 దా పై లోపల వెలుపల  ...  గావగ  పరిపూర్ణ శక్తి గనవలె ప్రేమా

జాతియు నీతియు వేరను   ..  ఖ్యాతి కొరకు నే కదలుచు కాయము ప్రేమా

 మతియే బీతికి చెందక   ..  గతిగా కాలము సుఖము యు గళమే ప్రేమా

పరిగిన గాలి నభంబున   .. నెరయంగా భూమి యందు నీరుండ గదా

దరిదాపుల వేరొక్కటి    .. ఇరువురు సఖ్యత యె మిట్లె  ఇష్టము ప్రేమా

చూపుల కళయిక చిత్రము  .. చూపర భావ మదిలోన సూత్రము ప్రేమా

దాపుల సుఖమును పొందుట  ... ఓపికగా కథ సలుపుట ఓర్పున ప్రేమా 

పికము వనములో పలికిన  ... ఏక ప్రాజ్ఞ వనిత కళ ఏకము పలుకే

కాకుల కూత కరసవుటె    ...  ఏకులు మేకులు అయిన ఎల్లల ప్రేమా

కనుచాటు తెప్పకాగురి   ... మననంబునజేరి నొక్కి మార్కొని నంతన్

వినుచుండు ప్రణవరవమును  ... గనిదాటున నిర్గుణంబు గతి యగు ప్రేమా 

స్థనముల బిగువులు ఆస్థిర  ... వనముల పెరిగిన విధమగు వేడుక కాగా

తనమన చూడని వనితయు ... తణువే తపనల పిలుపుల పానుపు ప్రేమా

గుండెల్లో నిను నుంచితి   .. వీడియు నిను మరువలేను విశ్వ చెరిత మున్

మండే గుండే మార్చుము   .. అండగ నుండుము మనసున వనితా ప్రేమా 

కదలక మదినిల్పి కదిసి   ... నిదుర సుఖము యగుట నేర్పు నియమము ప్రేమా

కధలను తెల్పిన కదలక  ... నిధియగు బ్రతుకున విలువలు  నిజమే ప్రేమా

చంద్రికా పద్యం - పంచపాది  

ప్రకృతి ధర్మమేను ప్రగతి మార్గమేను పడతి ఆశ తీరు 

ప్రకృతి సత్యమేను ప్రతిభ చూపు దారి సూర్యవెలుగు మారు   

ప్రకృతి విద్య యేను పగలు రెయ్ సుఖము పుడమి కోర్క తీరు

 ప్రకృతి అమ్మ మాట ప్రధమ దీవెనయే ఓర్పు నేర్పు కోరు 

ప్రకృతి చెలిమిగాను ప్రణతి నాదంగా మనిషి ఓర్పు నేర్పు ఈశ్వరా

****



****************************
నేటి నా పాట పాట సంఖ్య:- నాలో నీవు... నీలో నేను...
*****************************
రచన:- మల్లాప్రగడ రామకృష్ణ ✍️
29/03/2023.
**************
పాట సందర్భంపై నా విశ్లేషణ.
****************************
నాయకుల వెంట పాడే పాట
అర్థమైనాక ఇష్టమేర్పడి ప్రేమ పుట్టి తన ఆలోచనలే లోకమై గతం గుర్తు చేసుకుంటు పాడుకొనే వర్తమానానికి వర్తింపచేసుకుంటు దేశంకోసం పాటుపడేవాడ్ని తలుస్తూ....
******************************************
పల్లవి:-
*******
మనసున్న వాడా, మనసులో
నున్న వాడా, మారాజ్యాన్ని ఎలినోడా, మమ్ము ఉద్దరించటానికి మళ్ళీ గెలుపు కోసం వచ్చినోడా
చేసిన సహాయల తో మాలో ప్రేమ వేడి పుట్టించి నోడా, అందరికి అన్న, తెలుగుకన్న తల్లీ తెలుగోడా
దేశ ప్రగతికి తోడ్పడిన వాడా
ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడా
ప్రజల మనసునే కాజేసినోడా !!
జోలె కట్టి ఓట్లను కొల్లగొట్టినోడా
వయసు నాడి తలపు తీపిని
రుచి చూపించినోడా
మనసున్న వాడా, మనసులో
నున్న వాడా, మారాజ్యాన్ని ఎలినోడా, మమ్ము ఉద్దరించటానికి మళ్ళీ గెలుపు కోసం వచ్చినోడా
హుహుహు హుహుహు హాహహాహా హా...హా... హా..
చరణం:-
********
పల్లె బాట చేరుకొని
తియ్యదనమంతా మాటాల్లో చెప్పుకొని
ధనిక, బీద, కుల మతాల కతీతంగా కలుపుకొని
ఉన్న ధనమును ధారపోసి, ఓట్ల కోసం, వీధి వీధి తిరుగు తున్నావని
మరొక్కసారి నిన్నె గెలిపిస్తాము తెలుగోడా
""మనసున్న వాడా, మనసులో
నున్న వాడా, మారాజ్యాన్ని ఎలినోడా, మమ్ము ఉద్దరించటానికి మళ్ళీ గెలుపు కోసం వచ్చినోడా""
సన్నాయి రాగంతో, సంసార గీతం
సంతృప్తి పల్లవిలో,
అనుభవాల పాఠాలు చరణాలలో,
వాగ్దాణాలు వళ్ళించుటలో,
నాగరాభివృద్ధికి తోడ్పాటులో,
ఓర్పు, ఓదార్పు చూపుటలో,
ప్రజల నాడి తెలిసిన తెలుగోడా
"మనసున్న వాడా, మనసులో
నున్న వాడా, మారాజ్యాన్ని ఎలినోడా, మమ్ము ఉద్దరించటానికి మళ్ళీ గెలుపు కోసం వచ్చినోడా""
హుహుహు హుహుహు హాహహాహా హా...హా... హా..
పల్లవి:-
****
చరణం:-
********
రాజకీయ సూత్రధారుడా, ఆదరించుటలో ఆత్మబంధువుడా
రౌడీగాళ్ళను, మోసగాళ్ళను దరి చేర నియ్యని వాడా,
దడదడ లాడించి దుస్టుల
తాట తీసి దరువేసినోడా,
కొండల రాయుని నమ్మినవాడా,
చల్లని చూపులు రువ్వినోడా,
ధరణిలో ధర్మాన్ని నిలిపేవాడా,
పదవి పైన ఆస లేని వాడా
మనుషుల్లో దేవుడై ఉన్న వాడా
పిల్లలకు చదువు నేర్పి నోడా
ఉద్యోగాలు కల్పించి నోడా
తెలుగమ్మ కన్న తెలుగోడా
పల్లవి:-
*******
మనసున్న వాడా, మనసులో
నున్న వాడా, మారాజ్యాన్ని ఎలినోడా, మమ్ము ఉద్దరించటానికి మళ్ళీ గెలుపు కోసం వచ్చినోడా""
హుహుహు హుహుహు హాహహాహా హా...హా... హా..
**************************************

****

నాలో నీవు .... నీలో నేను   (9) 

విఘ్న గణపతి నీవుయే వినతి మదియు

విఘ్నములు మాపి శుభదిన విజయమిమ్ము

సకల సంపద తోడుగా సమయ మిమ్ము

శంభు సుతడువయ్యా మాలొ శంక తీర్చు


అలా విఘ్నేశ్వరుని ప్రార్ధన చేస్తూ 

 

ఆత్మీయతకోసం అలమటించి, ఆదరణ కోసం ఆరాటపడి, ఆత్మపరిశీలనకు వెంపర్లాడి, ఆనందానికి దారులు వెతుక్కొని, ఆశయసాధనకు దృఢసంకల్పం తో, విశ్వాసముంచి,        

తెలుపుతున్నా 

"నీది కానిది దానము నీ దగదులె    .....  మంచి చెయ్యాలని తలపు మనసు పదవి

బిక్ష మిచ్చినా చదువుయే ఇష్ట మవదు .. చేసి చెప్పిన రాజ్యము చేరు వగుట "

కరుణతో కరిగిపోయే, కాలాన్ని అర్ధం చేసుకోలేక, కన్నవారిని ఆదుకుంటూ, ఉన్నవారిని పోషించుకుంటూ, కలలు వచ్చిన కళలను నిగ్రహముగా అమలు పరుచుకుంటూ, సున్నిత రూపమేదో, నన్ను వెంబడించిన నేను మారక జీవిస్తున్నాను.   


"ఎంత చెప్పినా తక్కువే యదన నున్న ... దేవుని కరుణ అందరి దగుట తెలుగు

దేశ మందు స్థిరము గున్న తెగువ జూపి  ... మనుషులందరి ఆరాధ్య మనిషి రామ"

      

ఆవేశంతో, అలజడి సృష్టించేవారితో వున్నా, ఆనందాన్ని వదులుకోలేను, ఏది జరిగిన ఎవ్వరికి వినిపిన్చుకోలేను, తప్పుని సమర్ధించ లేను, ఒప్పును చెప్పలేను.     


" గురువు లేనివిద్యయు గుంపు గుణము చేర్చు  ... పరువు పోవు నన్న బ్రతుకు ప్రతిభ మార్పు

తరువు వల్లె నిత్య ఫలము తీరు కూర్పు   ....     కరువు బరువైన కథలుగా కలల తీర్పు"


ఉల్లాసంతో ఉరకలు వేసే అలౌకిక ఆనందమే మేధో  అయినా ఆవేదనతో అంతర్మదనంచెందే

ఈ జన్మసార్ధకథ ఏమిటో నాకు. ఎవ్వరికి అర్ధ కాలేదు.  


"మల్లెల పరిమళం చేరి మనసు కుదుపు   .... చల్లని సలప రింతగా చలవ చేయు

మెల్లని మలుపు తలపుల మేలు పూలు     .... కల్లలే కావు నిజముయే కథలు కావు"


పరిస్థితులకు  ప్రభావితమై పరుగులు తీసినా, పరితపించే మనిషి 

మాదోన్మమత్తులో వూగి వికృతచర్యలు చేసే సృష్టి విలయతాండవం చేస్తుందని, 


కు కవులంత జేరి రాజ్యము కుళ్ళు తెల్ప   ... నొకరి ఘనత తప్పొప్పులు నొకరు చెప్ప

బ్రజల కేమిఫలము నిచ్చు భజన తీరు     ... జరుగ కాలతీర్పు ఇదియు జాప్య మేల


స్వార్థప్రయోజనాలకై, ప్రలోభాలకు లొంగిపోయే, వివేకంతో ఆత్మపరిశీలన చేసుకోవాలని

జీవప్రయోజనమే లక్ష్యంగా, కృషీవరుడై పయనించే, విజయసాధన ధ్యేయంగా

విషయపరిజ్ఞానం  సమపార్జించితి 


దుష్ట శక్తులు పొంచిన దూర్తు డవకు   ... కష్ట పడిన ఫలము ఎంచ కోర వద్దు

నష్ట మైన సమయు మందు నటన వద్దు ... ఇష్ట మున్న లేకున్నను ఈశ్వరేచ్ఛ


స్వార్థరహిత, శాంతియుత ప్రపంచరూపకల్పనకై తపనపడే, అ మహోన్నత విశ్వజగతిని నీ విజ్ఞానంతో ఆవిష్కరించితి ....


" ఎండ గాలులు వదలక ఎల్ల వేళ      ..  భగ భగ మనుచు భానుడు పలక రింపు

దాహ తృప్తిగా జలమునే దాచ నెంచ   ... మల్లె పూల ఘుబాలింపు మనకు నిచ్చె"


మీ కవిత అర్ధం అయినట్లు అర్ధం కానట్లు అనుకుంటే మీ అదృష్టం, ఎవ్వరు మేధావులు కారు, 

ఆలోచనలు ఎవరి ఇష్టం వారధి కదా 


" ఒక్కరొక్కరి టక్కరి రోరి యనిరి  ... మొక్కిరి సిరి కోరి బికారి మెక్కిరి సిరి

చెక్కిరి వరి నారు కక్కిరి చుక్క చేరి  ... వెక్కిరింపు గడసరి యే వెర్రి మొర్రి

****