ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమా:
(ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
చలియనక ఎండనక
అవిరామ కృషి శ్రమతో
దేశ సరిహద్దుల్లో కాపుకాస్తున్న
జవానులు త్యాగాలే మహోన్నతాలు
లోక హితాభి వృద్ధికై
సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్న
విజ్ఞాన శాస్త్రవేత్తల మేధావులు మహోన్నతాలు
జీవనంలో జరిగే సంఘటల్ని
మనోనిగ్రహముగా ఎదుర్కొని
మనుష్యుల బోధలు మహోన్నతాలు
రేయనక పగలనక
నిత్యం శ్రమతో
పంటను పండించి
సకల జనుల ఆకలి తీర్చి
రైతన్నల త్యాగాలు మహోన్నతాలు
ఓం శ్రీ రాం - శ్రీమాత్రేనమ: శ్రీష్ణాయనమ:
ఆననడం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
నేటి హాస్యం
కిర్కెట్ మ్యాచ్ లు ఫిక్స్ అయ్యాయని గొలపెడతావ్!!
మరి, నీ పెళ్లి మటుకు "ఫిక్స్" అవ్వకుండానె జరిగిందా??!!!
"లంచం" తప్పు అంటావ్ !
మరి, నువ్వు కట్నం తీసుకోలేదా!!??
--((**))--
అధిక్షేప ప్రేమ లీల
ప్రాంజలి ప్రభ ప్రేమ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఇక్కడ, అక్కడ వెతికిన దొరకదు
- నీలోన ఉన్నది కాన రాదు అదే ప్రేమ
ఎక్కువ తక్కువ అనియన కానరాదు
- ఉగిసలా ఉండే తక్కెడ లాంటిది ప్రేమ
ఎక్కము వక్కాణించినట్లు చెప్పి రాదు
- మనసు రంజిల్లతేగాని కాన రాదు ప్రేమ
ఒక్కడు కోసం సమయాన్ని మించి రాదు
- వయసులో వలపును పంచునదే ప్రేమ
ఆనందం అర్ణవ జలంలా మార రాదు
- అనురాగం ఆర్భాటంలేక పొందేదే ప్రేమ
ఆశకు చిక్కి అభాసుపాలు కారాదు
- అనురాగపు అంచులలో ఉండేదే ప్రేమ
ఆదర్శం కోసం అప్పులకు చిక్కరాదు
- ఒకరికొకరు అర్ధం చేసుకోవటంలో ప్రేమ
ఆరోగ్యం కోసం అడ్డ దారి తొక్కరాదు
- సగం ద్వందాలతో ఉండే జీవితమే ప్రేమ
అనురాగం ఆత్మీయత అంతా ఒక భూటకం
ఆత్మశుద్ధితో అర్ధంతో పరమార్ధాన్ని గ్రహించటంలో
ఉన్నది అసలైన నిజమైన ప్రేమ
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఇక్కడ అక్కడ ఎందుకు ప్రేమ
ఎక్కడ కక్కడ ఆగదు ప్రేమ
మక్కువ తక్కెడ లా ఉండు ప్రేమ
ఎక్కములా వక్కానిమ్చలేవు ప్రేమ
ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
ఆర్భాటం ఆశగా మారితే
అప్పుల భాద ఇక తప్పదు
అనురాగపుటంచుల చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం
ప్రేమ పంచుకొని బ్రతికేస్తాం
అందరికి ఆదర్శం గా జీవిస్తాం
.
అనురాగం బంభరమైతే
అనురాగం రెక్కలు చూస్తాం
ఆనందం లోతులు చేస్తాం.
ఆనందానురాలతో జీవిస్తాం.
చూస్తారు చూస్తారు కళ్ళు తెరచి - సొల్లుగార్చి, వళ్ళు మఱచి, సిగ్గు విడిచి
వేస్తారు వేస్తారు వళ్ళు విరిచి - వేషం గూర్చి, రాతల్ మార్చి, బూతుల్ పల్కె
కూస్తారు కూస్తారు నోళ్లు తెరచి -
సరిత భూపతి ॥
॥ కలికాలం॥
వస్తాయ్ .. వస్తాయ్
బూతుల్.. రోతల్
రాతల్ .. చేతల్
చూస్తాం .. చూస్తాం
కళ్ళు తెరిచి .. సొల్లు గార్చి
ఒళ్ళు మరచి .. సిగ్గు విడిచి
తెర మీద బొమ్మ నగ్నంగా ఎగిరితే ఎంటర్టైన్మెంట్ ...
రోడ్డు మీద వెళ్ళే అమ్మాయి చీర తప్ప
మరే బట్ట కట్టినా అది రేప్ కు ఉత్ప్రేరకం ...
పదేళ్ళ కుర్రాడు అమ్మాయి ఒంటి కొలతల గురించి మాట్లాడితే
అది పగలబడి నవ్వే జోకు ...
ఐటమ్ సాంగ్లంటూ ఆడదాని ఒంటి మీద
డబుల్ మీనింగ్ పాటలు పెడ్తే
కళ్ళకు , చెవులకు కిక్కే కిక్కు ...
పురాణాల్లో తప్పు చేసినోడు దుస్శాసనుడు
అదే తప్పు అందంగా చేస్తే హీరో ...
రేప్ చేస్తే చేయించుకోవాలి అన్నోడికి సపోర్ట్ చేసే
చదువు'కొన్న' లాయర్లు ...
ఆడదానికి ఆడదే శత్రువై
ఉన్నత స్త్రీ పై పిచ్చి రాతలు, గీతలతో
ఆడ జర్నలిస్ట్ పత్రికా వ్యభిచారం
సారీ .. వాళ్ళు దాన్ని పత్రికా స్వేఛ్చ అంటారేమో...
తోటి విద్యార్థినిని అర్ధనగ్నంగా తిప్పి
ఆత్మహత్య చేసుకునేలా చేసిన విద్యార్థిని ..
మరేమో ఉన్నతమైన చదువులు కదండీ .. అంతా గురుదేవుల చలవే ...
కాషాయం కట్టినోడు కడుపులో తంతే పిల్లలు పుడుతారు ..
మా నమ్మకాలు మావి .. డిస్టర్బ్ చేయకండి...
కరడు గట్టిన ఉగ్రవాదిని ఉరితీసినా ఊరుకోం ...
ఎందుకంటే మా మతం ...
చచ్చిపోయిన వందలాది మంది భరతకులమైతే మాకేంటి ?
మాకు మా మతమే గొప్ప ...
ఒరేయ్ చంటి! పెద్దయ్యాక ఏమవుతావ్?
రాజకీయ నాయకున్నవుతా ...
ఎన్ని నేరాలు చేసినా శిక్షలుండవ్ ..
జైలుకెల్లినా రాజభోగాలే ...
ఓటుకు నోటు , మందు చూపిస్తే
కుక్కకైనా ఓటేస్తాం ..
హహ్హహ్హ ..ప్రజాఆఆఆస్వామ్యం ...
నాకో డౌటు ...
కీచకపర్వం ఆనాడు భారతంలో జరిగినదా? ..
నేడు కలియుగంలో జరిగేదా?
పాపం ఇంకా దుర్యోధన, దుస్శాసనులను
ఆడిపోస్కోవటం అన్యాయం కదూ !
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్ !, మరి!!
నేటి హాస్యం (ప్రాంజలి ప్రభ
"సార్!....ఈ రోజు మేము ఒక లారి ని పట్టుకున్నాము...
దొంగతనం గా విస్కీ బాటిల్స్ తీసుకుని వుళుతున్నారు!!....అన్నాడు ,కొత్తగా చేరిన కానిస్టేబుల్!!
"గుడ్!!! వేరి గుడ్.....అలాగే...
సోడాలు, పొటాటో చిప్సు తీసుకుని వెళ్ళుతున్న లారీ ని కూడా పట్టుకో!!" అన్నాడు ఆరితేరిన "ఇన్స్పెక్టర్!!
నా ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారా, తిడుతున్నారా తెలియుటలేదు
కొన్ని విషయాలు గొప్పగా చెప్పుకుంటే ఫలితము ఉండదు తెలుసా
ఆ.. అంతేనా ... ఆ అంతే ....
కృష్ణుండు యశోద బుల్లివాడు
కృష్ణుండు అర్జునిని చెలికాడు
కృష్ణుండు రాధా మానసచోరుడు
కృష్ణుండు భగవద్గీతాచార్యుడు
మాధవుడు మనవాడు
మనలోని మామంచివాడు
బందుగుడు, హితుడు,
స్నేహితుడు; భగవంతుడు
కృష్ణభక్తి అలవడుట జన్మ జన్మాంతర
పుణ్యఫలము; కృష్ణుండు మనసున
నిండుట అష్టాక్షరీ మంత్రోపాసనా ఫలితము
ద్వైతము అద్వైతముల సారము ఆది దైవము
రాక్షసాంతకుడు రమణీ సంగ రసోల్లాసుడు
మన యోగక్షేమముల వహించు దైవతము
రాసలీల వలె జగములనేలు జనుల కాచు
శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్, ఉడిపి వాసియును
భాగవతుల భావనా దర్శనా గమ్యము
కుభూపతుల శిక్షించె కుంతీపుత్రరక్షకుడు
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ
దుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి"
యుగే యుగే" అని మనకై అవతరించు దైవవతంసము
--((**))--
// ఆ..రాధ ( నే)
కనరానిదూరాలఎక్కడోనీవు
కనులనీరునింపిఇచటనేను..!
గుండె ప్రమిదగచేసి
వలపుచమురునుపోసి
ఆశ దివ్వెను నిలిపి
ఎదురుచూస్తుంటిని..నేను.!
కలలగుత్తుల కూర్చుచుంటి
కనులువిచ్చంగ
వెచ్చని నీరునుజార్చుచుంటి!
నీపిలుపువినినంత
మేనుపులకించు..!
తపియించు కోర్కెలు
కోసలూని.. కొనసాగు..!
తనువుమరతునునేను..
తనివితీరదునాకు..
తాపముప్పొంగు..
మనసు ఉరకలువేయు..!
అన్ని మరతునునేను..
మాయ యేదోనీవుచేసినావు..!
మంత్రమేసినన్ను..
చింతబెడుతున్నావు...!
జాణతనమేగాని జాలిలేదేల?
వెన్నదొంగానన్నిటుల
వేధింతువేల?..!
కళ్యాణగౌరి.కాశీభట్ల.(.భమిడిపాటి)
--((**)--
(ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
చలియనక ఎండనక
అవిరామ కృషి శ్రమతో
దేశ సరిహద్దుల్లో కాపుకాస్తున్న
జవానులు త్యాగాలే మహోన్నతాలు
లోక హితాభి వృద్ధికై
సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్న
విజ్ఞాన శాస్త్రవేత్తల మేధావులు మహోన్నతాలు
జీవనంలో జరిగే సంఘటల్ని
మనోనిగ్రహముగా ఎదుర్కొని
మనుష్యుల బోధలు మహోన్నతాలు
రేయనక పగలనక
నిత్యం శ్రమతో
పంటను పండించి
సకల జనుల ఆకలి తీర్చి
రైతన్నల త్యాగాలు మహోన్నతాలు
ఓం శ్రీ రాం - శ్రీమాత్రేనమ: శ్రీష్ణాయనమ:
ఆననడం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
నేటి హాస్యం
కిర్కెట్ మ్యాచ్ లు ఫిక్స్ అయ్యాయని గొలపెడతావ్!!
మరి, నీ పెళ్లి మటుకు "ఫిక్స్" అవ్వకుండానె జరిగిందా??!!!
"లంచం" తప్పు అంటావ్ !
మరి, నువ్వు కట్నం తీసుకోలేదా!!??
--((**))--
అధిక్షేప ప్రేమ లీల
ప్రాంజలి ప్రభ ప్రేమ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఇక్కడ, అక్కడ వెతికిన దొరకదు
- నీలోన ఉన్నది కాన రాదు అదే ప్రేమ
ఎక్కువ తక్కువ అనియన కానరాదు
- ఉగిసలా ఉండే తక్కెడ లాంటిది ప్రేమ
ఎక్కము వక్కాణించినట్లు చెప్పి రాదు
- మనసు రంజిల్లతేగాని కాన రాదు ప్రేమ
ఒక్కడు కోసం సమయాన్ని మించి రాదు
- వయసులో వలపును పంచునదే ప్రేమ
ఆనందం అర్ణవ జలంలా మార రాదు
- అనురాగం ఆర్భాటంలేక పొందేదే ప్రేమ
ఆశకు చిక్కి అభాసుపాలు కారాదు
- అనురాగపు అంచులలో ఉండేదే ప్రేమ
ఆదర్శం కోసం అప్పులకు చిక్కరాదు
- ఒకరికొకరు అర్ధం చేసుకోవటంలో ప్రేమ
ఆరోగ్యం కోసం అడ్డ దారి తొక్కరాదు
- సగం ద్వందాలతో ఉండే జీవితమే ప్రేమ
అనురాగం ఆత్మీయత అంతా ఒక భూటకం
ఆత్మశుద్ధితో అర్ధంతో పరమార్ధాన్ని గ్రహించటంలో
ఉన్నది అసలైన నిజమైన ప్రేమ
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఇక్కడ అక్కడ ఎందుకు ప్రేమ
ఎక్కడ కక్కడ ఆగదు ప్రేమ
మక్కువ తక్కెడ లా ఉండు ప్రేమ
ఎక్కములా వక్కానిమ్చలేవు ప్రేమ
ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
ఆర్భాటం ఆశగా మారితే
అప్పుల భాద ఇక తప్పదు
అనురాగపుటంచుల చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం
ప్రేమ పంచుకొని బ్రతికేస్తాం
అందరికి ఆదర్శం గా జీవిస్తాం
.
అనురాగం బంభరమైతే
అనురాగం రెక్కలు చూస్తాం
ఆనందం లోతులు చేస్తాం.
ఆనందానురాలతో జీవిస్తాం.
చూస్తారు చూస్తారు కళ్ళు తెరచి - సొల్లుగార్చి, వళ్ళు మఱచి, సిగ్గు విడిచి
వేస్తారు వేస్తారు వళ్ళు విరిచి - వేషం గూర్చి, రాతల్ మార్చి, బూతుల్ పల్కె
కూస్తారు కూస్తారు నోళ్లు తెరచి -
సరిత భూపతి ॥
॥ కలికాలం॥
వస్తాయ్ .. వస్తాయ్
బూతుల్.. రోతల్
రాతల్ .. చేతల్
చూస్తాం .. చూస్తాం
కళ్ళు తెరిచి .. సొల్లు గార్చి
ఒళ్ళు మరచి .. సిగ్గు విడిచి
తెర మీద బొమ్మ నగ్నంగా ఎగిరితే ఎంటర్టైన్మెంట్ ...
రోడ్డు మీద వెళ్ళే అమ్మాయి చీర తప్ప
మరే బట్ట కట్టినా అది రేప్ కు ఉత్ప్రేరకం ...
పదేళ్ళ కుర్రాడు అమ్మాయి ఒంటి కొలతల గురించి మాట్లాడితే
అది పగలబడి నవ్వే జోకు ...
ఐటమ్ సాంగ్లంటూ ఆడదాని ఒంటి మీద
డబుల్ మీనింగ్ పాటలు పెడ్తే
కళ్ళకు , చెవులకు కిక్కే కిక్కు ...
పురాణాల్లో తప్పు చేసినోడు దుస్శాసనుడు
అదే తప్పు అందంగా చేస్తే హీరో ...
రేప్ చేస్తే చేయించుకోవాలి అన్నోడికి సపోర్ట్ చేసే
చదువు'కొన్న' లాయర్లు ...
ఆడదానికి ఆడదే శత్రువై
ఉన్నత స్త్రీ పై పిచ్చి రాతలు, గీతలతో
ఆడ జర్నలిస్ట్ పత్రికా వ్యభిచారం
సారీ .. వాళ్ళు దాన్ని పత్రికా స్వేఛ్చ అంటారేమో...
తోటి విద్యార్థినిని అర్ధనగ్నంగా తిప్పి
ఆత్మహత్య చేసుకునేలా చేసిన విద్యార్థిని ..
మరేమో ఉన్నతమైన చదువులు కదండీ .. అంతా గురుదేవుల చలవే ...
కాషాయం కట్టినోడు కడుపులో తంతే పిల్లలు పుడుతారు ..
మా నమ్మకాలు మావి .. డిస్టర్బ్ చేయకండి...
కరడు గట్టిన ఉగ్రవాదిని ఉరితీసినా ఊరుకోం ...
ఎందుకంటే మా మతం ...
చచ్చిపోయిన వందలాది మంది భరతకులమైతే మాకేంటి ?
మాకు మా మతమే గొప్ప ...
ఒరేయ్ చంటి! పెద్దయ్యాక ఏమవుతావ్?
రాజకీయ నాయకున్నవుతా ...
ఎన్ని నేరాలు చేసినా శిక్షలుండవ్ ..
జైలుకెల్లినా రాజభోగాలే ...
ఓటుకు నోటు , మందు చూపిస్తే
కుక్కకైనా ఓటేస్తాం ..
హహ్హహ్హ ..ప్రజాఆఆఆస్వామ్యం ...
నాకో డౌటు ...
కీచకపర్వం ఆనాడు భారతంలో జరిగినదా? ..
నేడు కలియుగంలో జరిగేదా?
పాపం ఇంకా దుర్యోధన, దుస్శాసనులను
ఆడిపోస్కోవటం అన్యాయం కదూ !
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్ !, మరి!!
నేటి హాస్యం (ప్రాంజలి ప్రభ
"సార్!....ఈ రోజు మేము ఒక లారి ని పట్టుకున్నాము...
దొంగతనం గా విస్కీ బాటిల్స్ తీసుకుని వుళుతున్నారు!!....అన్నాడు ,కొత్తగా చేరిన కానిస్టేబుల్!!
"గుడ్!!! వేరి గుడ్.....అలాగే...
సోడాలు, పొటాటో చిప్సు తీసుకుని వెళ్ళుతున్న లారీ ని కూడా పట్టుకో!!" అన్నాడు ఆరితేరిన "ఇన్స్పెక్టర్!!
నా ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారా, తిడుతున్నారా తెలియుటలేదు
కొన్ని విషయాలు గొప్పగా చెప్పుకుంటే ఫలితము ఉండదు తెలుసా
ఆ.. అంతేనా ... ఆ అంతే ....
కృష్ణుండు యశోద బుల్లివాడు
కృష్ణుండు అర్జునిని చెలికాడు
కృష్ణుండు రాధా మానసచోరుడు
కృష్ణుండు భగవద్గీతాచార్యుడు
మాధవుడు మనవాడు
మనలోని మామంచివాడు
బందుగుడు, హితుడు,
స్నేహితుడు; భగవంతుడు
కృష్ణభక్తి అలవడుట జన్మ జన్మాంతర
పుణ్యఫలము; కృష్ణుండు మనసున
నిండుట అష్టాక్షరీ మంత్రోపాసనా ఫలితము
ద్వైతము అద్వైతముల సారము ఆది దైవము
రాక్షసాంతకుడు రమణీ సంగ రసోల్లాసుడు
మన యోగక్షేమముల వహించు దైవతము
రాసలీల వలె జగములనేలు జనుల కాచు
శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్, ఉడిపి వాసియును
భాగవతుల భావనా దర్శనా గమ్యము
కుభూపతుల శిక్షించె కుంతీపుత్రరక్షకుడు
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ
దుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి"
యుగే యుగే" అని మనకై అవతరించు దైవవతంసము
--((**))--
ఒక ఫోన్ కాల్ (అనువాదకథ)
సాహితీమిత్రులారా! ప్రాంజలి ప్రభ అభిమానులారా
దేవుడా దేవుడా, అతను నాకు ఫోన్ చేస్తే బాగుండు. పోనీ నేనే చేస్తే? నిజంగా ఇంకెప్పుడూ నిన్నేం కోరుకోను, నిజ్జం. భగవంతుడా…ఇదంత పెద్ద కోరిక కూడా కాదు, నీకిది చాలా చిన్నది. చాలా చాలా చిన్నది. దేవుడా అతను ఫోన్ చేసేలా చూడు. ప్లీజ్ ప్లీజ్.
ఒకవేళ నేను ఈ సంగతి ఆలోచించకపోతే ఫోన్ మోగుతుందేమో. అవును, కొన్నిసార్లు అలాగే ఔతుంది. పోనీ వేరే ఏదైనా విషయం గురించి ఆలోచిస్తే? ఐదైదు అంకెలు వదుల్తూ ఐదొందలు లెక్కపెట్టుకుంటా, నిదానంగా. లెక్క పూర్తయ్యేసరికి మోగొచ్చు. అన్ని అంకెలూ లెక్కపెడతా, ఏదీ వదలను. మూడొందలు లెక్కపెట్టేశాక మోగినా కూడా లెక్క ఆపను. ఐదొందలూ పూర్తయ్యేదాక ఫోన్ మోగుతూ ఉన్నా ఎత్తను. ఐదు, పది, పదిహేను, ఇరవై, ఇరవై ఐదు, ముప్ఫై. అయ్యో, ఇంకా రింగవదే?
ఇంక ఇదే చివరిసారి. గడియారం వంక చూడను. ఇంకోసారి చూస్తే ఒట్టు. ఇప్పుడు ఏడు పది ఐంది. అతను ఐదింటికే కాల్ చేస్తానన్నాడు. “ఐదింటికి ఫోన్ చేస్తాను బంగారం.” అప్పుడే అనుకుంటా “బంగారం” అంది. నాకు బాగా గుర్తు. ఖచ్చితం అప్పుడే . ఆ మాట రెండుసార్లన్నాడు. రెండోసారి గుడ్ బై చెప్పేటప్పుడు. “గుడ్ బై బంగారం” అని కూడా.
అప్పుడతను చాలా పనిలో ఉన్నాడు. ఆఫీస్ లో అంతకంటే ఏం చెప్పగలడు. ఐనా కూడా రెండుసార్లు అలా పిలిచాడు. నా అంత నేను ఫోన్ చేసినా అతనేం అనుకోడు. కానీ, అలా ఎప్పుడంటే అప్పుడు చెయ్యకూడదు. మగవాళ్లకి అలా చేస్తే నచ్చదు. నువ్వు వాళ్ల గురించే ఆలోచిస్తున్నావనీ, తపించిపోతున్నావనీ తెలిసిపోతుంది. అప్పుడు నువ్వసలు నచ్చడం మానేస్తావు. కానీ… నేనతనితో మాట్లాడి మూడురోజులైంది. మూడు రోజులు. ఇంతాచేసి, నేను చేసింది, అతడెలా ఉన్నాడో కనుక్కోవడమే. వేరే ఎవరైనా ఐతే ఎలా అడుగుతారో అచ్చం అలానే. నేను విసిగిస్తున్నానని అతనేం అనుకుని ఉండడు. “అబ్బే, అదేం లేదు.” అన్నాడు కూడా. మళ్ళీ అతనే అన్నాడు నాకు ఫోన్ చేస్తానని. అతను అలా అనాల్సిన అవసరం లేదు. పైగా నేనూ ఏం అడగలేదు కూడా, అస్సలంటే అస్సలు అడగలేదు. అతను ఫోన్ చేస్తానని మాటిచ్చి చెయ్యకుండా ఉండేమనిషి కాదు. దేవుడా, అతన్ని మర్చిపోనివ్వకు.
“ఐదింటికి కాల్ చేస్తాను బంగారం.” “గుడ్ బై బంగారం.” అతను చాలా బిజీ, చుట్టూ మనుషులు, హడావిడి. ఐనా కూడా అతను నన్ను రెండు సార్లు “బంగారం” అని పిలిచాడు. అది నాదే. ఆ పిలుపు నాదే. మళ్ళీ అతన్నెప్పుడూ చూడకపోయినా ఫర్లేదు. ఊహూ… చాలదు. ఒకవేళ నేనతన్ని మళ్ళీ చూడలేకపోతే, మిగాతావి ఎన్నున్నా చాలదు. దేవుడా, నాకతను కావాలి. అతను కావాలి. దేవుడా, నేను మంచిగా ఉంటాను, ఇదివరకటికంటే బాగుంటాను. అమ్మతోడు. నువ్వొక్కసారి అతనితో ఫోన్ చేయించు. అయ్యో, ఒక్కసారి, ఒక్క ఫోన్ కాల్.
దేవుడా, నా కోరికని మరీ అంత తీసిపారెయ్యొద్దు. అక్కడెక్కడో దేవతల మధ్య నువ్వు, గంభీరంగా, ధవళకాంతితో వెలిగిపోతూ ఉంటావు. నక్షత్రాలు నీ చుట్టూ దోగాడుతూ ఉంటాయి. నేనేమో నీ దగ్గర ఒక చిన్న ఫోన్ కాల్ కోసం సాష్టాంగపడుతూ ఉంటాను. అదిగో, నవ్వుతున్నావ్. చూడు, ఇదంతా నీకర్థం కాదు. నీకేం, నువ్వు భద్రంగా నీలికాంతి వలయాల మధ్యన నీ సింహాసనం మీద ఉంటావు. నిన్నేదీ తాకదు, నీ హృదయాన్నెవరూ బాధతో మెలిపెట్టలేరు. ఇదెంత నరకమో! ఈ బాధ, చెప్పలేనంత బాధ. నువ్వు నాకు సాయం చేస్తావుగా? నిన్ను ప్రార్థించి ఏం కోరుకుంటే అది జరుగుతుందని చెప్తారుగా. అతన్నొక్కసారి నాకు ఫోన్ చేసేలా చూడవా?
ఛా, నేనిలా ఉన్నానేంటి? ఇలా ఉండకూడదు. సరే, ఇంకోలా అనుకుందాం. ఒక కుర్రాడు ఒకమ్మాయికి ఫోన్ చేస్తానని చెప్పి, అతనికేదైనా జరిగి కాల్ చెయ్యలేదనుకో. అమ్మో, దారుణం. మరీ అంత దారుణం కాదేమో, లోకంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి- ఈ క్షణంలో కూడా. ఐనా లోకానికి ఏమైతే నాకెందుకు? నాకా ఫోన్ రింగయితే చాలు. యే? ఎందుకని మోగదు? ఒసేయ్ నల్లగా, తుమ్మమొద్దులా, ఏడుపుగొట్టు మొహమా, ఎందుకు మోగవు? కాస్త మోగితే నీ సొమ్మేవైనా పోయిందా? అరిగిపోతావా? నిన్ను.. నిన్నేం చేస్తానో చూడు. ముక్కలు ముక్కలు చేసి గోడవతల పారెయ్యకపోతే అడుగు.
అబ్బా! నేనింకేదైనా ఆలోచిస్తే బాగుండు. అదే చేస్తా. ఈ గడియారాన్ని పక్క గదిలో పడేసొస్తా. టైం చూడాలనిపించినప్పుడల్లా ఆ గది దాకా నడవలేక ఊరుకుంటానేమో. ఏమో, నేను మళ్ళీ టైం చూసేలోగా అతను కాల్ చేస్తాడేమో. అప్పుడు నేను చక్కగా మాట్లాడతాను. అతను ఒకవేళ ఫోన్ చేసి ఈ రాత్రికి కవలడం కుదర్దని చెప్తే నేనంటాను- “అయ్యో, భలేవాడివే, ఈమాత్రం దానికేనా?.” అతన్ని మొదటిసారి కలిసినప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. అప్పుడతనికి మళ్ళీ నచ్చుతాను. నేనసలు మొదట్లో ఎంత చక్కగా ఉండేదాన్నో అతనితో. హూఁ! ప్రేమించకముందు ఎవర్తో ఐనా బాగానే ఉండొచ్చు.
అతనికి నేనంటే కొద్దిగా ఐనా ఇష్టం ఉండే ఉంటుంది. లేకపోతే రెండు సార్లు “బంగారం” అనెందుకు పిలుస్తాడు? నేనేం ఆశ వదులుకోను. కొద్దిగా, ఇంతైనా, ఒక్క రవ్వంతైనా ఇష్టముంటే చాలు. దేవుడా, నువ్వు గనక అతనితో ఫోన్ చేయించకపోతే, నేనింక నిన్ను అడగాల్సిందేం లేదు. నేనతనితో ఇష్టంగా, ముద్దుగా, హాయిగా మాట్లాడతాను, అచ్చం మొదటిసారి లాగే. అప్పుడతను మళ్ళీ నన్నిష్టపడతాడు. అప్పుడెలానూ, నేను కోరుకోవాల్సింది ఇంకేం మిగలదు. అర్థమౌతుందా? దేవుడా, ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి ఫోన్ చేయించు.
నేను చెడ్దదాన్నని శిక్షిస్తున్నావా? నేనాపని చేశానని కోపమొచ్చిందా? చుట్టూ బోల్డంతమంది చెడ్దవాళ్ళున్నారు. నాకొక్కదానికే ఎందుకీ శిక్ష? ఐనా నేను చేసింది అంత పెద్ద తప్పేం కాదు. నేనెవర్నీ బాధపెట్టలేదు. వేరే ఎవర్నైనా కష్టపెడితేనే అది నేరం. నేను ఏ మనిషికీ మనస్తాపం కలిగించలేదు. నీకు తెలుస్తూనే ఉందిగా? దేవుడా, మంచివాడివి కదూ, అతనికి ఫోన్ చెయ్యమని చెప్తావు కదూ?
ఇదిగో, అతను గనక నాకు ఫోన్ చెయ్యకపోతే నీకు నామీద కోపమొచ్చినట్టే అర్థం. నేను ఐదైదు అంకెలు వదుల్తూ ఐదొందలు లెక్క పెడతాను. ఈలోగా అతన్నుంచి ఫోన్ రాకపోతే నువ్వు నన్నిక పట్టించుకోవని అర్థం. ఎప్పటికీ . అదొక అపశకునం. ఐది, పది, పదిహేను, ఇరవై, ఇరవై ఐదు, ముప్ఫై, ముప్ఫై ఐదు, ఇది అన్యాయం, చాలా అన్యాయం. సరే, మంచిది, నేను నరకానికి పోతాను. నరకాన్ని చూపించి నన్ను భయపెడుతున్నావు కదా. నా నరకం కంటే అది భయంకరమా?
చ చ.. ఇలా అనుకోకూడదు. అతనికి కాస్త ఆలస్యం అయుండొచ్చు. అందుకని నేనింత పిచ్చెక్కిపోనవసరం లేదు. బహుశా అతను కాల్ చెయ్యకుండా సరాసరి వచ్చేస్తాడేమో! అతనొచ్చేటప్పటికి ఇలా ఏడుపుమొహంతో ఉంటే అతనికి కోపమొస్తుంది. అట్లా ఏడిస్తే మగవాళ్లకు నచ్చదు. అతనెప్పుడూ ఏడవడు. అతన్నేడిపించాలి. బాగా ఏడిపించి అతని గుండె బరువెక్కి గొంతుకడ్డం పడితే చూసీ చూడనట్టు వెళ్ళిపోవాలి. విపరీతంగా ఏడిపించాలి.
అతను మాత్రం నన్ను ఏడిపించాలనుకోడు. అసలు తనకోసం నేనెంత అల్లాడిపోతున్నానో అతనికి తెలీదు. నేను చెప్పకుండానే అతనికి తెలిస్తే బాగుండు. వాళ్లవల్ల ఏడ్చామని చెప్తే మగవాళ్లకి నచ్చదు. అట్లా చెప్తే మొండికేసి సాధిస్తున్నామని, పెత్తనం చేస్తున్నామనీ అనుకుంటారు. మనమీద చిరాకొస్తుంది. అనుకున్నది అనుకున్నట్టు చెప్తే వాళ్లకి చిరాకొస్తుంది. వాళ్లతో ఎప్పుడూ కాస్త దోబుచులాడుతూ ఉండాలి. ఏంటో, ఇంత నాటకం అవసరమా? ఏదనిపిస్తే అది చెప్పెయ్యలేమా? ఉన్నదున్నట్టు చెప్పలేనంత పెద్ద విషయమా. అసలే విషయమైనా దాచాల్సినంత పెద్ద విషయమా? అతనొకవేళ ఫోన్ చేస్తే నేనతనికోసం దిగులు పడుతున్నానని చెప్పను. వాళ్లకి దిగులుగా ఉంటే నచ్చదు. అతను ఫోన్ చేసినప్పుడు నేను కులాసాగా, హాయిగా ఉంటాను, అప్పుడతను చచ్చినట్టు ఇష్టపడతాడు. అతను ఫోన్ చేస్తే… అతను ఫోన్ చేస్తే…
బహుశా అతనదే చేస్తూ ఉండొచ్చు. నాకు చెప్పకుండానే ఇక్కడికి బయల్దేరిపోయాడేమో. ఇప్పుడు దారిలో ఉండుంటాడు. దారిలో ఏమైనా అయిందేమో. లేదు, అతనికెప్పుడూ ఏమీ అవదు. ఏమైనా జరిగినట్టు ఊహించలేను. అతనికేదైనా జరిగి కదలకుండా పడిపోయి ఉండటం ఊహించలేను. అసలతను చచ్చిపోతే బాగుండు. ఏంటీ పాడు కోరిక? కాదు కాదు, ఎంత మంచి కోరికో! అతను చచ్చిపోతే అచ్చంగా నాకే ఉండిపోతాడు. అప్పుడు అతని గురించి బాధపడ్డ ఈరోజులన్నీ మర్చిపోగలను. మంచి రోజులను మాత్రమే గుర్తు పెట్టుకుంటాను. ఇక ఏ దిగులూ ఉండదు. నిజంగా అతను చచ్చిపోతే బావుండు. చచ్చిపోవాలి. చచ్చిపోవాలి.
చెత్తగా ఉంది. ఎవరైనా ఫోన్ చేస్తానని చెయ్యకపోతే, మరుక్షణంలోనే వాళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటారా ఎక్కడైనా? అసలీ గడియారం సరిగ్గా పనిచేస్తున్నట్టు లేదు. తొందరగా తిరిగేస్తుందేమో. అసలు అతను చెప్పిన టైం ఇంకా అవ్వలేదేమో. ఏదైనా పనిలో పడి కాస్త లేటయిందేమో. ఇంకా ఆఫీస్ లోనే ఉన్నాడేమో. లేకపోతే ఇంటినుంచి ఫోన్ చేద్దామని ఇంటికెళ్లాడేమో. ఈలోపు ఎవరో వచ్చుంటారు. వాళ్ళెదురుగా నాకు ఫోన్ చెయ్యడం బాగోదని ఊరుకుని ఉంటాడు. పాపం నేను ఎదురు చూస్తున్నానని కంగారు పడుతున్నాడేమో. కాస్తైనా కంగారు ఉండే ఉంటుంది. ఒకవేళ నేనే ఫోన్ చేస్తానని ఎదురు చూస్తున్నాడేమో కూడా. నేనే చేస్తే పోలా?
ఊహూ. వీల్లేదు. నేను చెయ్యకూడదు. దేవుడా, నేనతనికి ఫోన్ చెయ్యకుండా చూడు. ఎలాగోలా నన్ను ఆపు. దేవుడా, నీకు తెలిసినట్టే నాక్కూడా తెలుసు. అతనికి ఏమాత్రం నామీద అక్కర ఉన్నా ఎక్కడో ఒకచోటనుంచి ఫోన్ చేసేవాడు . చుట్టూ ఎంతమందున్నా పట్టించుకునేవాడు కాదు. ఇంతచిన్న విషయం బుర్రలోకి ఎక్కదు నాకు. దేవుడా, నేనిదంతా తేలిగ్గా తీసుకునేలా చెయ్యడం నీకైనా కష్టమే. అదంతా ఏమొద్దుగానీ, ఈ చిన్న విషయం నా బుర్రకెక్కేలా చూడు. ఇంక ఆశలు పెట్టుకోకుండా, నాకు నేను నచ్చజెప్పుకోకుండా చూడు. నన్ను ఆశపడనీకు. దయచేసి…
నేనతనికి ఫోన్ చెయ్యను. ఈ జన్మలో, నా గొంతులో ప్రాణముండగా. నేనతనికి కాల్ చేసేలోపు అతను నరకంలోపడి అనుభవిస్తూ ఉంటాడు. దేవుడా, నాకు కొత్తగా నువ్వు ఏ బలాన్నీ ఇవ్వక్కర్లేదు. తట్టుకోడానికి నాకున్న శక్తి చాలు. నేను కావాలనుకుంటే అతడే నన్ను వెతుక్కునేవాడు. నేనెక్కడుంటానో అతనికి తెలుసు. నేను కచ్చితంగా ఎదురుచూస్తానని కూడా తెలుసు. తెలుసతనికి, అనుమానం లేదు. తనకోసం ఎదురు చూస్తానని, తనకోసమే ఉంటానని తెలీగానే ఎందుకింత అలుసో? నిజానికి అలా ఎదురు చూసే మనిషి ఉండటం, ఆ భరోసా ఉండటం ఎంత హాయినిచ్చే విషయం?
నేను కావాలనుకుంటే ఉన్నపళాన అతనికి ఫోన్ చెయ్యొచ్చు. అసలేమైందో తెలుస్తుంది. నేనే ఫోన్ చేస్తే తప్పేం లేదు. అతనేం అనుకోడులే. పైగా సంతోషపడతాడు కూడా. నాకోసం ప్రయత్నిస్తున్నాడేమో. ఒక్కోసారి పదే పదే ప్రయత్నించాల్సొస్తుంది ఫోన్ చెయ్యడానికి. నంబర్ పని చెయ్యట్లేదనో, పలకట్లేదనో ఏదో సమాధానమొస్తుంది. నచ్చజెప్పుకోడానికి కాదు. నిజంగా చాలాసార్లు అట్లా అవుతుంది. దేవుడా, నిజంగా. నన్నా ఫోన్ నుంచి ఇవతలికి లాగి పడెయ్యి. కాస్త నా అభిమానం నాకు మిగలనీ. నాకేమాత్రం సిగ్గున్నా అది ఇప్పుడే అడ్డుపడాలి.
ఇంతలా ఓర్చుకోలేనప్పుడు అభిమానాన్ని పట్టుకు వేలాడితే ఏం లాభం? అదొక పనికిమాలిన మాట. అసలు అభిమానం లేకపోవడమే నిజమైన గౌరవం మనిషికి. అతనితో మాట్లాడ్డానికి ఈ సమర్థన చేసుకోడం లేదు. ఇది నిజం. ఎప్పుడూ నిజమే. ఈ చిన్న చిన్న మర్యాదల్ని వదిలేసి నేను ఎదగాలి.
దేవుడా! నేనతనికి ఫోన్ చెయ్యకుండా నన్నుఆపు.
ఐనా ఇంతోటి దానికి అభిమానం, మొహమాటం అవసరమా? ఇంత నాన్చడం, నీలగడం, ఇంత చిన్న విషయానికి? అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నానేమో. ఒకవేళ అతనే నన్ను ఐదింటికి ఫోన్ చెయ్యమని చెప్పాడేమో! “ఐదింటికి ఫోన్ చేస్తావుగా బంగారం?” అనుంటాడు. నిజమే, అలాగే అన్నాడు. దేవుడా. ఆపెయ్. నన్ను నేనే ఇంకా మభ్యపెట్టుకోనివ్వకు. ఉన్నదున్నట్టు ఒప్పుకోనీ.
నేనింకేదైనా ఆలోచిస్తా. నిశ్శబ్ధంగా కూర్చుంటా. కదలకుండా, ఏ ఆలోచనా లేకుండా, కూర్చోగలిగితే! ఏదైనా చదువుకుంటే నయం. ఈ పుస్తకాలన్నిటిలో ప్రేమ కథలే. స్వచ్ఛ మైన, మధురమైన ప్రేమకథలు. ఈ రాసేవాళ్లంతా ఇలాంటి కథలెందుకు రాస్తారో. ఇదంతా పచ్చి అబద్ధమనీ, మోసమనీ తెలియకనా? చదివేవాళ్లని అవెంత బాధ పెడతాయో తెలీదా వీళ్లకి? చెత్త రాతలు. చెత్త వెధవలు.
ఇంకేమీ చెయ్యను. మెదలకుండా ఉంటాను. అంత అతిగా ఇదవ్వాల్సిందేం లేదు. ఇదిగో, అతను గనక నాకు బాగా తెలీదనుకో. అతను మగవాడు కాకుండా ఒక అమ్మాయనుకో. అప్పుడు ఎంచక్కా ఫోన్ చేసి “ఏమైందోయ్. బానే ఉన్నావా?” అని తేలిగ్గా అడిగేదాన్ని. అసలు దాని గురించి ఇంత సతమతమయ్యేదాన్నే కాదు. అందరితో లాగా అతనితో కూడా మాముూలుగా, తేలిగ్గా ఎందుకుండలేను? అతన్ని ప్రేమించినందుకా? ఎందుకుండలేను? ఉండగలను. కావాలంటే ఇప్పుడే ఫోన్ చేసి చాలా మాములుగా హాయిగా మాట్లాడతా. అలా మాట్లాడలేకపోతే చూడు. దేవుడా, వద్దు. అతనికి ఫోన్ చెయ్యనివ్వద్దు. వద్దు.
దేవుడా, నువ్వు నిజంగా అతనితో ఫోన్ చేయించవా? అంతేనా? నీ మనసేం కరగదా? కనికరం లేదా? ఈ నిమిషంలోనే చెయ్యమని కాదు. కాసేపట్లో చేసినా ఫర్లేదు. ఐది ఐదు వదుల్తూ ఐదొందలు లెక్క పెడతాను. నిదానంగా, తొండి చెయ్యకుండా లెక్క పెడతాను. ఈలోగా అతను పలకరించకపోతే నేనే పలకరిస్తాను. దేవుడా, మంచివాడివి కదూ! గొప్పవాడివి కదూ! ప్లీజ్, ప్లీజ్. దేవుడా…
ఐదు, పది, పదిహేను, ఇరవై, ఇరవై ఐదు, ముప్ఫై, ముప్పై ఐదు.
----------------------------------------------------------
మూలం - డొరోతీ పార్కర్, అనువాదం - స్వాతికుమారి బండ్లమూడి,
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో (నా మైల్కు పంపినది ప్రచారిస్తున్నాను )
----------------------------------------------------------
మీరు సహకరించండి మీ రచనలు పంపండి, ప్రాంజలిప్రభను ఆదరించండి
కనరానిదూరాలఎక్కడోనీవు
కనులనీరునింపిఇచటనేను..!
గుండె ప్రమిదగచేసి
వలపుచమురునుపోసి
ఆశ దివ్వెను నిలిపి
ఎదురుచూస్తుంటిని..నేను.!
కలలగుత్తుల కూర్చుచుంటి
కనులువిచ్చంగ
వెచ్చని నీరునుజార్చుచుంటి!
నీపిలుపువినినంత
మేనుపులకించు..!
తపియించు కోర్కెలు
కోసలూని.. కొనసాగు..!
తనువుమరతునునేను..
తనివితీరదునాకు..
తాపముప్పొంగు..
మనసు ఉరకలువేయు..!
అన్ని మరతునునేను..
మాయ యేదోనీవుచేసినావు..!
మంత్రమేసినన్ను..
చింతబెడుతున్నావు...!
జాణతనమేగాని జాలిలేదేల?
వెన్నదొంగానన్నిటుల
వేధింతువేల?..!
కళ్యాణగౌరి.కాశీభట్ల.(.భమిడిపాటి)
--((**)--
No comments:
Post a Comment