Saturday, 4 August 2018

ప్రాంజలి ప్రభ (౦5 - 08 - 2018 )

ఓం శ్రీ రాం - ఓం శ్రీ మాత్రే నమ: - ఓం శ్రీకృ ష్ణాయనమ:


ఆననదం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం  


శుభ శుభోదయపు వందనాలు ఫ్రెండ్స్....

ఓం శ్రీ రాం   ఓం శ్రీ మాత్రేనమ: - ఓం శ్రీ కృష్ణా నమ:
ప్రాంజలి ప్రభ - శృంగార సాహిత్యం 

 తరుణామృతం

మ. మ . త  (పెద్దలకు మాత్రమే )
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) (1)

  పచ్చటి తోటయందు పసిడి రంగుతోడ, ఓరచూపు ఇంపుతోడ, అడుగులు దడా  దాడా అనుచుండ, జారేడు కుచకుంభాలు కదులు చుండ, కాల్నడక పోవు చుండ, వదనాంచల మందున చిన్కుల చెమట, మడుగులా మారుచుండగా, వయ్యారంగా మల్లిక కన్పించే. 
పసిదానిమ్మ పండు  చాయ, కొసరు ఆ కుసుమ గంధి కోమలపు తోడల్ (లేలేత తామర స్వేత తూడులా లేక పాల లాంటి అరటి ఊచలా )  జారు చెమ్మ, నేలరారు ముత్యాల వరుస, సహజ సౌందర్యముతో వెలసిల్లు చుండా, పదహారో వసంతంలో అడుగుపెట్టి, వయసు వన్నెలతో, మాయని మెరుపు కాన వస్తున్నది, బాల్యము వెడలి, నవ యవ్వనపు మొలకులతో లేత సిగ్గుల దొంతరలతో, మధుర మంద హాసంగా ఉండి, నడుస్తుంటే, పురజనులు " ఆ .... ఆ " అని నోరు తెరచి, సొంగ కార్చు చుండే, ముందుకు నడుస్తున్నప్పుడు, ముందు వెనుక ఎవరున్నారు అనే జ్యాస అనేది లేదు, మరయు అమె కళ్ళకు ఎమీ కనిపించలేదు, కాని ఏదో తెలియని వయసు పొంగే మెరుపు ఆవహించినదని  మాత్రం అర్ధం అవుతున్నది. 

ఆమె ఏ శృంగార దేవత, " దేవతాస్త్రి అణుకువ కలిగియే ఔన్నత్యమును పొందుదురు. పరుల గుణములను పొగడుచుచు తమ సహృదయత్వమును కనబరుతురు. పరుల కార్య సాఫల్యమున కై ఎక్కువ ప్రయత్నించి వారి కార్యములను సానుకూలము చేయుచు, తమకార్యములను కూడా చేసికొను చుందురు . తమను పరుషముగా నిందించు దుర్జనుల యందు ఓర్పు కనపరిచి వారే దుఃఖ పడునట్లు చేయుదురు. ఇట్టి నడవడిక గలిగిన స్త్రీలు అందరికీ పూజనీయులే.  అన్నారు  అక్కడ ఉన్న పెద్దలు ముఖ సౌందర్యానికి ముచ్చటబడి " కారణము ఏమగునో  అని పలువురు ముచ్చట్లు చెప్పుకొనసాగిరి, సౌందర్యదేవత నడచి వెళ్ళినట్లు తన్మయులై ఉన్నారు ఆసమయాన? 

ఇంకాఉంది 

ఓం శ్రీ రాం   ఓం శ్రీ మాత్రేనమ: - ఓం శ్రీ కృష్ణా నమ:

ప్రాంజలి ప్రభ - శృంగార సాహిత్యం 

 తరుణామృతం

మ. మ . త  (పెద్దలకు మాత్రమే )

మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం

(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) (2 )


యవ్వన నడకతో నడుస్తుంటే  "  

ఇసుక లో కాళ్ళు ఇరుక్కొని,  ఈడ్చు కుంటూ, తన్మయత్వపు  నడకతో, మేనుపై  వేడి కిరణాల సెగ ఆవహించిన నిట్టూర్పులతో, ఉన్న నడకను చూసిన వారికి కన్నులు  చెదిరినవి, వారి ఊహలు గాలిలో ఎలిపోతున్నవి. 


అమ్మాయి నవ్వి తే రాలు , పెదాల మధ్య  ముత్యాలు  

అమ్మాయి నవ్వే చాలు.  వెలలేని వరహాలు  

అమ్మాయి ఒడి నుంటె, నా గుండె, నెనలేని బలగాలు  

అనురక్తితో, ఆకర్షణతో సుందరి చూపులకే హా హా కారాలు 


పడచు జింక పిల్ల నడిచినట్లు మల్లిక నడుస్తుండగా, కాలి పాదాల చెమ్మ, అద్భుత మెరుపుగా కనిపించే., ఆవిధముగా  పొతూ ఉంటే  అక్కడ కొంత దూరములో మామిడి తోపులు కానవచ్చే, మామిడి పూవు నవ యవ్వన సౌందర్యానికి పరవశించి, 

ఏ ప్రేమ ఫలితమో భూమి - 
ఇరుసు లేకుండా తిరుగు చుండు 
ఏ ప్రేమ ఫలితమే నక్షత్రాలు 
మెరుస్తూ నింగినుండి రాలక ఉండు  

ఏ ప్రేమ ఫలితామో కడలి 
భూమిపై పొంగక ముడుచుకొని ఉండు  
ఈప్రేమ ఫలితమే పర్వతము 
పెనుగాలి విసురుకు కదలక ఉండు 

ఏ ప్రేమ ఫలితమే పురుషుడు 
స్త్రీ మాటకు కట్టు బడి ఉండు 
ఏ ప్రేమ ఫలితమే వనిత
పురుషుని చేష్టలకు కట్టుబడి ఉండు   

ఏ ప్రేమ ఫలితమే సంపద
నష్టపోయిన ధైర్యము తోడుగ ఉండు 
ఏ ప్రేమ ఫలితమే కష్టాలు 
వచ్చిన నేనున్నానని శక్తి తోడుగ ఉండు   

ఏ ప్రేమ ఫలితమే యవ్వనం 
సక్రమ మార్గాన సద్వినియోగం అగుచుండు 
ఏ ప్రేమ ఫలితమే సంసారం 
మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉండు   

కొమ్మలపై రేమ్మలపై నిలువలేక, జల జల రాలి పాదాల ముందు చేరే, ఆమె పాదాలు స్పర్శకు పూలు  నలిగినా చెప్పుకోలేని సంతోషముతో ఉండగా, జిలుగు పూల కళంకారి చీర జాఱ, కాలి కడియాలు మలుపు కొనుచు, తనువంతా వంచి సరిదిద్దు కొనుచు, సందెడు చీర కుచ్చెళ్లు చెదరనీక గట్టిగా అదుము కొనుచు, పిల్ల గాలి సవ్వడికే ఎగసిపడుతున్న చీరను పట్టుకొనుచు ఉండగా, ఆ వనమంతయు చూసి పరవసంతో పూల వర్షం కురుపించే. 

ఇంకాఉంది 
--((**))--


 నెమ్మదిగా
అధిక్షేప ప్రేమ లీల 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రయాణానికి సహకరిస్తూ కదులుదాం నెమ్మదిగా 
- ప్రమాణానికి అనుకరిస్తూ మెదలుదాం నెమ్మదిగా 

విమర్శలు రాకుండా పనులన్నీ చేసేద్దాం నెమ్మదిగా
- చేయూతను ఇచ్చి ఆదుకుంటూ కదులుదాం నెమ్మదిగా

మంచిని పెంచి కలసి మెలసి సాగుదాం నెమ్మదిగా
- కదులుతూ మానవత్వాన్ని బ్రతికించుదాం నెమ్మదిగా

మానవులపై స్నేహభావంతో కదలాలి నెమ్మదిగా
- చేయాలన్నవి చేయలేనివి ప్రయత్నిస్తాం నెమ్మదిగా

బ్రతుకు భారమన్న వారికి సహకరిస్తాం నెమ్మదిగా
- రోగులకు మందులందించి సహకరిస్తాం నెమ్మదిగా
   
మాతృదేశానికి మా వంతు సహకరిస్తాం నెమ్మదిగా   
- మాతృభాషకు ప్రాణాలు ధారపోస్తాం నెమ్మదిగా 

నిత్యం తల్లి తండ్రులకు సేవచేస్తాం నెమ్మదిగా
- నమ్ముకున్న వారికి సేవలందిస్తూ ఉంటాం నెమ్మదిగా 
  
జాతికి, భార్యా పిల్లలకు, ప్రేమ నందిస్తాం నెమ్మదిగా
- మాలో ఉన్న పరమాత్మను నిత్యం ధ్యానిస్తాం నెమ్మదిగా  

ఓర్పు, ఓదార్పే, మన: శాంతి 
ధర్మ, న్యాయం, సత్య: శాంతి 
దైవం, ప్రేమ, శ్రీమతి : శాంతి 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--

అమ్మాయి నవ్వితె రాలు , 
పెదాల మధ్య  ముత్యాలు ! 
అమ్మాయి నవ్వే చాలు. 
వెలలేని వరహాలు ! 

అమ్మాయి ఒడి నుంటె, 
నా గుండె, నెనలేని బలగాలు !! 
అనురక్తితో, ఆకర్షణతో 
సుందరి చూపులకే హా హా కారాలు 

అంతరిక్షం బయిన , 
అది ఎంత దవ్వైన, 
గుప్పు నెగిరీ నే 
చుట్టి రాలేన ? 

అమ్మ వుంటే 
చెంత ! 
బ్రహ్మ రాకా శైన, 
బహు కష్టమైనా , 
తట్టుకోలేనా ? 

ఒప్పుకో దేముడా ! 
అమ్మంటే అమ్మనీ !! 
అపరంజి బొమ్మనీ! 
అమ్మ నీ కుందనీ ! 
జగదంబ అమ్మనీ !! 


‌సౌందర్య లహరి
(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
(శ్రీ లలితాంబికాయైనమః)
ప్రక్షిప్త శ్లోకము __1
( సౌందర్య లహరి స్తోత్రం లో మూడు శ్లోకాలు ప్రక్షిప్త శ్లోకాలు గా 
ప్రచారంలో ఉన్నాయి)

"సమానీతః పద్భ్యాం  మణిముకురతా మమ్బరమణిః
భయాదన్తర్బద్ద  స్తిమిత కిరణ శ్రేణి మసృణః !
దధాతి త్వద్వక్త్రం ప్రతిఫలిత మశ్రాన్త వికచం
నిరాతంకం చంద్రాన్నిజ హృదయ పంకేరుహ మివ !!

ఈ శ్లోకం లో శ్రీదేవి ముఖ ప్రతిబింబ మహిమ ను స్తుతించారు.

అమ్మా! భగవతీ!ఆకాశానికి మణి వంటి వాడైన సూర్యుడు నీ పాదసేవకుడు గానూ , నీవు పాదము లుం చే మణిదర్పణం గానూ ఏర్పడిన వాడై యున్నాడు. అమిత ప్రకాశ వంతమైన నీ ముఖాన్ని ౘూసి , అతడు భయపడి తన వేయి సూర్యకిరణాలను పైకి ప్రసరింౘ నీ యకుండా తన లోనే అణౘు కుంటున్నాడు. నీ కిరీట మందున్న చంద్రుడి చేత, తన హృదయంలోని తామర
( నీ ముఖ ప్రతిబింబము ) ముడుౘు కొనకుండా వికాసము పొంది వెలుగు ౘుండగా  దానిని ధరిస్తున్నాడు.

సూర్యుడు శ్రీదేవి ముఖ పద్మాన్ని ధ్యానిస్తూ దేవీ పాదసేవను చేస్తున్నాడని భావము. సూర్యుడు దేవీ పాదపీఠ రూపమైన మణిదర్పణముగా స్వీకరింపబడ్డాడు. ఆ దర్పణంలో ప్రతిబింబించిన శ్రీదేవి ముఖ పద్మము, వికసించిన సూర్యుని హృదయ పద్మము వలె ఉన్నది.

ప్రక్షిప్త శ్లోకము __2

" సముద్భూత స్థూల _ స్తనభర ముర శ్చారుహసితం
కటాక్షే కందర్పః _ కుసుమిత కదంబద్యుతివపుః !
హరస్య త్వద్భ్రాంతిం _ మనసి జనయామాస మదనో
మావయ్యా యే భక్తాః పరిణతి రమీషా మియముమే" !!

దేవీ ఉపాసన వల్ల, " సారూప్యము" ఫలితంగా వస్తుందని చెప్పబడింది.

తల్లీ! దేవీ ! నిన్ను ఉపాసించిన మన్మథుడు, సారూప్య రూపమైన ఫలమును పొంది, ఉన్నతము లైన స్తనముల బరువును భరింౘుౘున్న నీ ఉరస్థ్సలమునూ సుందరమైన నీ చిరునవ్వు నూ , కడిమి పూవుల కెంపు ఛాయ గల నీ శరీరము నూ ,కడగంటి ౘూపులయందు అనురాగము నూ వహించి , పరమశివుని మనస్సులో నే తాను ఈ రూపంతో , నీవు అనే భ్రాంతిని కలిగిస్తున్నాడు. 
ఉమాదేవీ! నీ భక్తులందరికీ పరిణామము ఇటువంటిదే అవుతుంది కదా !
( నీ భక్తులందరకూ సారూప్య రూపమైన ఫలము కలుగుతుందని భావము)
అమ్మ ను ఉపాసించిన వారు, ఆమె దయవల్ల దేవీ రూపాన్నే పొందుతారని భావము.
--((**))--

ఓం సర్వశక్తిమయ్యైనమః
ఓం సర్వమంగళాయైనమః
ఓం సద్గతిప్రదాయైనమః

శ్లోకము ( 31 ) 
అవతారిక: 
ఇట్లు మానశౌర్య పద్ధతి ని నిరూపించిన పిదప, ఆ మానశౌర్య ములకు నర్థమే మూలమగుటవలన, అర్థపద్దతి నారంభింౘుౘు మొదట ద్రవ్యతత్పరుల చరిత్రమును దలౘుకొని చెప్పుౘున్నాడు. 

జాతిర్యాతు రసాతలం గుణగుణ స్తత్రాప్యధో గచ్ఛతాత్ 
శీలం శైలదటాత్పతత్వభిజనస్సన్దహ్యతాం వహ్నినా , 
శౌర్యేవైరిణి వజ్రమాశు నిపతుత్వర్దో స్తు నః కేవలం 
యేనైకేన. వినా గుణాస్తృణలవప్రాయాస్సమస్తా ఇమే !! 
టీకా:- 
జాతిః = (బ్రహ్మక్షత్రియాది) జాతి, రసాతలం = పాతాళమునకు, యాతు = పోవునుగాక, గుణగణః = (ధైర్యౌదార్యాది )గుణముల సమూహము, , అధఃగచ్ఛాత్ = అడుగంటునుగాక! ,శీలం = మంచి 
నడవడి, శైలతటాత్ = కొండదరినుండి, పతతు = పడునుగాక!, అభిజనః= వంశము, వహ్నినా = అగ్నిచే, సందహ్యతాం = బాగుగా దగులఁబెట్టఁబడును గాక! ,వైరిణి = ( డబ్బుసంపాదింౘుటకు) 
విరోధియయిన, శౌర్యే = శూరత్వముపై, ఆశు = తటాలున, వజ్రం= పిడుగు, పతతు = పడునుగాక, యేన ఏకేన వినా = ఏది యొకటి లేక, ఇమే = ఈ (పైనచెప్పబడిన), సమస్తాః = అన్నిగుణములు, 
తృణలవప్రాయాః = గడ్డిపోౘవంటివో, (అట్టి) , అర్థఃకేవలం=ద్రవ్యము మాత్రమే, నః = మాకు , అస్తు = కలుగుగాక!. 

తాత్పర్యము:- 
జాతి పాతాళమునకు బోయిననూ, సద్గుణము లంతకంటే గ్రిందువడిననూ, శీలము డమీదినుండి క్రిందపడినను వంశము తగలబడిననూ, శౌర్యమునందుఁ బిడుగుపడినను మాకేమియు లోపము లేదు, మాకు ద్రవ్యమొక్కటి యున్నౘాలును. ఈ ద్రవ్యము లేకపోవునేని పైనచెప్పబడిన వి యండియూ గడ్డిపోౘ కైననూ కొఱగావు. 

ఏనుగు లక్ష్మణకవి 
ఉత్ఫలమాల 
జాతి దొలంగుఁగాత గుణ శక్తి రసాతలసీమకుం జనుం 
గాత కులంబు బూది యగుఁగాత నగంబుననుండి శీలముం 
బాతముఁ జెందుఁ గాత బహు భంగుల విత్తమె మాకు మేలు వి 
ఖ్యాత గుణంబులెల్లఁ దృణ కల్పము లొక్క ధనంబు లేవడిన్ !! 

ఎలకూచి బాలసరస్వతి 
(మల్లభూపాలీయము)  శార్దూలము 

పోవు న్జాతి యధోగతం బయి, కడు న్పోవు న్సదా రస 
ద్భావం, బవ్వయశుద్ధి నిష్పల. మగు న్బాహుబల శ్రీ వృధా 
భావం బొందు, గుణానుభావము తృణ ప్రాయం బగున్, నిర్ధనుం 
డౌ వాఁడెన్నిట ముఖ్యుఁడా సురభిమల్లా, నీతివాచస్పతీ ? 

పుష్పగిరి తిమ్మ కవి 
చంపకమాల 

కులము రసాతలస్థలిని గూలిన, మంచిగుణం బదోగతి 
బొలసిన, శీలమద్రి తట భూమిని జాఱి విదగ్దమైన, ద్వి 
ట్కులహర శౌర్యమందుఁ బిడుగుల్ పడినన్,గడుమేల్, ధనంబెకా 
వలె, నది లేనిౘోఁ దృణలవంబులుగా గుణకోటు లన్నియున్!!
--((**))--

 పొద్దు పోయింది

అగ్నిపర్వతపు జ్వాల ఆరిపోయింది
హిమవన్నగము కరిగి ప్రవహించింది
ధరణి ధరణంతా ఒకపరి దద్దరిల్లింది
పాతాళం లోతుగా పాతుకొని పోయింది

గండుకోయిల కూత ఆగి పోయింది
జలపాత సవ్వడి ఏతావు కేగింది
మనసులో నీ మనసుకి గాయమయ్యింది
పరుగులన్నీ ఆగి తూలిపోయింది

మౌనాన నామాట మూగపోయింది
ఒళ్ళంత వేడిగా కాలిపోతోంది
కాళ్ళలో కదలిక ఆగిపోయింది
కళ్ళలో నీరు వరదలై పారింది

కోపాన ఒళ్ళంత ఊగిపోతోంది
ఆడ పుట్టుక కన్న అడవిలో చెట్టు నయమనిపించింది
గొంతులో పాట లో లోపలే ఆగిపోయింది
దగ్గరౌతూ మురళి రవళి వినిపించింది
అంతరించిన ఆశ మరల చిగురించింది
--((**))--

1) భగవానుడు చెప్పాడు, దేనిని తెలుసుకుంటే అశుభం(సంసారబంధం) నుండి విముక్తి చెందుతావో, అలాంటి అతిరహస్యమైన,అనుభవ జ్ఞానంతోకూడిన బ్రహ్మజ్ఞానాన్ని, అసూయ లేని నీకు బోధిస్తున్నాను.

2) ఈ బ్రహ్మజ్ఞానం, అన్ని విద్యలలోకి శ్రేష్టమైనది, అతి రహస్యమైనది, సర్వోత్కృష్టమైనది, పవిత్రమైనది, ప్రత్యేకంగా తెలుసుకోతగ్గది, ధర్మమైనది, ఆచరించడానికి మిక్కిలి సులభమైనది, నాశనం లేనిది.

3) ఓ యువతి ! ఈ ధర్మం(ఆత్మజ్ఞానం) మీద శ్రద్ధ లేని మానవులు, నన్ను పొందక, మృత్యు రూపమైన సంసార మార్గం లో పడి తిరుగుతున్నారు.

జీవితాన్ని చూడడానికి ఒక సకారాత్మక దృష్టి, ఒక నకారాత్మక దృష్టి, రెండూ ఉన్నాయి. జీవనము పదార్ధం అంటే నకారాత్మకం, పరమాత్మ అంటే సకారాత్మకం. ఎందుకంటే మన దృష్టి ఎలా వుంటుందో ప్రపంచం మనకి అలా కనబడుతుంది.

మనిషి యొక్క ఎటువంటి జ్ఞానమైనా మనిషితో కలవకుండా ఉండలేదు. ఒకవేళ ఇది సత్యమైతే, మనకి నాస్తికునితో విరోధం పెట్టుకోడానికి ఎలాంటి కారణం లేదు. ఎందుకంటే, ఒక నాస్తికుడు, నా దృష్టి ఏదైతే వుందో, దానితో నాకు ఈ జగత్తులో ఈశ్వరుడు కనబడడం లేదు అంటాడు.

4) ఇంద్రియాలకి అందని నాచే ఈ ప్రపంచం మొత్తం ఆవరించబడి ఉంది. సమస్త ప్రాణులు నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను.

5) ఈ ప్రాణులన్నింటినీ సృష్టించి, పోషించేది నేనే. కానీ నేను వాటిలో లేను.

6) గొప్పదైన గాలి ఎప్పుడూ ఎలా అంతటా నిండి ఉంటుందో, అలా నాలో సమస్త ప్రాణులు నాలో నిండివున్నాయి.

శ్రద్ధకి సంబంధించిన విషయాన్ని చెప్పిన తర్వాత కృష్ణుడు మరో విషయం ప్రారంభిస్తున్నాడు. ఎవరు తార్కాన్ని నమ్మడానికి సిద్ధంగా లేడో, అతను దానిని ఆలోచించగలడు. ఈ సూత్రం ఆతార్కికమైనది, రహస్యమైనది, చిక్కుప్రశ్న లాంటిది.

రెండు శరీరాలు ఒకదాన్ని ఒకటి ఆకర్షించు కుంటే శృంగార భావన కలుగుతుంది. రెండు మనసులు ఆకర్షించుకుంటే ప్రేమ ఏర్పడుతుంది. కానీ ఎప్పుడు రెండు ఆత్మలు ఒకదానినొకటి ఆకర్షించుకుంటాయో అప్పుడు శ్రద్ధ ఏర్పడుతుంది. మనము శ్రద్ధ యొక్క పరిణామం చూడగలుగుతాము. ఈ జగత్తులో ఏ ఏ శక్తులు ఉన్నాయో, అవేవీ కనబడవు. వాటి పరిణామాలని చూడగలుగుతాము.

శ్రద్దని పొందిన తరువాత జరిగేది ఆత్మకు సంబంధించిన మార్పు. శ్రద్ధ వలన పాతది మరణిస్తుంది. క్రొత్తది ఆవిర్భవిస్తుంది. ప్రేమలో పాతది మార్పు చెందడం జరుగుతుంది.

ఎవరు కష్టాలు అంటే భయపడతారో, వారు పరమాత్మని ఎన్నటికీ చేరుకోలేరు. ఎందుకంటే అది పరమకష్టం. అక్కడ మిమ్మల్ని మీరు కోల్పోవడానికి, మీరు లేకుండా పోవడానికి ధైర్యం కావాలి.

ఈ జ్ఞానం సరళము అంటే అర్థం మీరు ఏదీ చేయనక్కర లేదు అని కాదు. మీకు పాత్రత ఉండాలి. అది పొందడానికి చాలా చేయాలి. భక్తుడు అవడానికి చాలా సేపు పడుతుంది. భక్తుడు అయ్యాక లభించడానికి ఎంతో సేపు పట్టదు. భక్తుడు అంటే వ్యక్తిత్వం అనే నీరు మరిగి నూరు డిగ్రీలకి చేరుకోవడం. దీనికి దగ్గర దారి లేదు. యాత్ర అంతా పూర్తి చేయవలసినదే. ఇది జీవనం యొక్క శాశ్వత నియమం.

కృష్ణుడు అంటాడు....సాధన చాలా సరళము

శ్రద్ధారహితుడైన వాడు, విన్నా, అర్ధం చేసుకున్నా, ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేసినా పరమాత్మని చేరుకోలేడు. ఎందుకంటే పరమాత్మ దగ్గరకు హృదయం అనే ద్వారం ద్వారా చేరుకోవాలి. ఆయన దగ్గరకు చేరుకునే భావం ప్రేమ. శ్రద్ధ అంటే అర్థం ఒక లోతైన నాది అనే భావన, ఒక భరోసా, ఒక ఆత్మీయత, తెలియని దాని మీద, దాగివున్న దాని మీద ఉండే భరోసా. శ్రద్ధ అనేది ఒక పెద్ద అసంభవమైన ఘటన. అది వేలలో ఒకటిగా విచ్చుకునే పుష్పం. కానీ ఒక్కసారి విచ్చుకుంటే అనంత ద్వారాలు తెరచుకుంటాయి.

No comments:

Post a Comment