ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ:
అఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
ప్రేమ లీల - ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
నాకున్నది నీకు, నీకున్నది నాకు లేదోయి
లేనిదాని గూర్చి ఆలోచించుట ఎందుకోయి
నామాట నీమాట ఒకే రకంగా ఉండదోయి
సర్దుకుపోయే గుణం 'నీనా' మనలో ఉందోయి
నీ కోరిక నా కోరికా ఏ నాడు కల్వదోయి
ఆరోగ్యం పంచుకొనే బుద్ధి ఉంటే చాలునోయి
వయసు కోరికలు తిర్చలేక ఉన్నఓయి
క్షణ ఓర్పు వహించా వంటే అంతా సుఖమోయి
మాటి మాటికీ కోపం మన మధ్య ఎందుకోయి
బలహీనత భయం తో వచ్చే లక్షణ మోయి
మంచి చెడును గూర్చి ఎందుకు చెర్చించవోయి
మంచి భావనతో ఉంటె దుర్భుద్ధి ఉండదోయి
జాగర్త గూర్చి నీ వెందుకు ఆలోచించ వోయి
ఆకలి తీర్చటం తప్ప ఏమీ చేయ లేమోయి
అర్హత లేని ఆశలతో ఉంటా వెందుకోయి
జీవితం ఆశయంగా జాగర్త పడ తానోయి
మూడుముళ్ల పెళ్లి గౌరవించు
మూడునాళ్ళ ముచ్చట కాదు
జీవించినన్నాళ్లు అది నీకు తోడు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
స్నేహబంధం
.............
ఎర్రోజు వెంకటేశ్వర్లు
థమ్సప్ లో అజ్ఞాతంగా కలిపి చాపకింద నీరులా తడిపే ఎర్రమందవుతుంది నేటి స్నేహం
సిగరెట్లో మత్తుపొడై జీవితాల్ని నుసి నుసి చేస్తోంది
అశ్లీల దృశ్యాల వికృతానందానికి సెల్ ఫోనవుతుంది స్నేహం
వన్ సైడ్ లవ్ కు వెన్నెముకై యాసిడ్ దాడుల పులి పంజానే మైత్రి
అత్యాచారాలు హత్యలు చేసే సామూహిక మూకకు నేర స్నేహమే పెవిక్విక్ బంధం
బాధ్యత లేని బైక్ రైడింగులకు బానిసై తార్రోడ్ల నల్లత్రాచుకు బలై కన్నవాళ్లకు పుట్టెడు దుక్కానిస్తున్నాయి ఈనాటి స్నేహాలు
పబ్బులకు క్లబ్బులకు చాలీ చాలనీ బట్టలేసుకొని జంటలు విచ్చలవిడిగా ఆకాశమెత్తు ఎగిరేది స్నేహమేనా?
వైట్ కాలర్ నేరాలకు ఉపాయాల పేకమేడనే చాటింగులతో సమయజలాన్ని ఇసుకలో పోయడమే కదా
లక్ష్యం పండు కోసం మొక్కను నాటుకొని కలుపు మొక్కల మాయలో పడి మాయమౌతుంది నేటి మైత్రి
ఇంకా ఆకర్షణల బెలూన్లు పెరుగుతూనే ఉన్నాయి .........................................
మట్టిలో మాణిక్యాల్లా, రాళ్లల్లోనూ రత్నాల్లా స్నేహాలు సమాజ సౌధానికి నిలువెత్తు దీపాలు
కులమతాల కుళ్లును పుటం బెట్టి తీసేసే నిఖార్సైన బంగారం మైత్రి
అరేయ్ మిత్రమా!అనే పిలుపు ఆగిపోతున్న ఊపిరికి ఆక్సిజన్ మరి.
రాశి కధలు :
జ్యోతిష శాస్త్రంలో తారలు 27 అని , ఒక్కొక్క తారకు 4 పాదాల చొప్పున మొత్తం 108 పాదాలని, వీటిని 12 రాశులుగా( ఒక్కొక్క రాశిలో 9 పాదాల చొప్పున) విభజించి ఒక్కొక్క రాశికి నామకరణం చేశారని మనకు తెలిసినదే! అయితే ఆ రాశుల పేర్లను బట్టి సరదాకోసం వాటి లక్షణాలను విశ్లేషించే ప్రయత్నం చేశాను. వీటిని ఎవరూ వ్యక్తిగతంగా అన్వయించుకొని బాధపడవద్దని, కేవలం సరదాగా వ్రాసినదానిని సరదాగానే తీసుకోవాలని, యిది మన సంప్రదాయాన్ని విమర్శించే రచన కాదని మనవి చేస్తూ. . .
1. మేషం(మేక)
చేతలోన సున్న, మేతప్రేమయే మిన్న
పిడుగు పోజె తప్ప పిరికిలోన;
విషయమేదియైన విదుర! "మేమె " యనును
వినగ మేషరాశి " వివర " మిదియె!
2. వృషభం(ఎద్దు)
గంతకళ్ళతోడ గానుగ చుట్టునూ,
గడపలంటి తిరుగు గంగిరెద్దు;
కొమ్ములున్న నేమి? కొమ్ము గాయు పరుల
నరుడ! వృషభరాశి " నాడె "మిదియె!
3. మిధునం(దంపతులు)
తగవులందు పరుల తగులుకోనీయరు
"సంజె " మార్పె సేయు సర్దుబాటు;
మూడు ముళ్ళ మడిని మురిపాలు పండించు
వేడి మిధునరాశి " వేష " మిదియె!
4.కర్కాటకం(ఎండ్రకాయ/పీత)
" బీచి " గట్టులందు బీటు గొట్టుచునుండు
చిన్న చప్పుడైన చేరు నిల్లు;
అలల కలల తేలెడల్పజీవులు వీరు
కర్కటంపురాశి " కతన " మిదియె!
5.సింహం
చిన్నవారి నెపుడు చీల్చి చెండగబోదు
కొండ గజము గొట్టు కోర్కె హెచ్చు;
జిత్తు నక్క మతికె చిత్తుగ లొంగును
సింహరాశి నున్న " చిత్ర " మిదియె!
6. కన్య
ఊకదంపులన్న, ఊసులన్న ప్రియము
పెళ్ళి యన్న విసుగు, ప్రేమ మోజు;
నోటగొలుసు నుంచు నోమును సల్పెడు
కన్యరాశి వారి " కతన " మిదియె!
7.తుల(త్రాసు)
మదిని సమత యున్న మనల కేమి ఫలము?
బరువు పడ్డ వైపె నొరుగుచుండు;
ఊగులాడు బుద్ధి నుగ్గుతొ పట్టిన
త్రాసురాశిలోని " త్రాణ " యిదియె!
8.వృశ్చికం (తేలు)
ఎత్తిపొడుపులన్న నెలమిని చూపుతూ
గొందులందు దాగు గుణము హెచ్చు;
అల్పుడైన మరువ నాతిధ్యమిచ్చెడు
వృశ్చికంపురాశి "వృత్త " మిదియె!
9. ధనుస్సు(విల్లు)
పరుల కయ్యమందు విరుగు వీరి నడుము
తప్పిపోతెనేమి? తాడు తెగును;
" మేకు " చిన్నదైన " మెడ " బట్టి వ్రేలాడు
ధనూరాశి నున్న " దర్ప " మిదియె!
10.మకరం (మొసలి)
పట్టుదలకు పోయి పట్టు నేనుగునైన
" పట్టు " లున్న వీరి " పట్టు "లందు;
మొసలి కంట నీట మోసాల వేషమ్ము
చెల్లు; మకరరాశి " చేవ " యిదియె!
11.కుంభం(కుండ)
చంక, నెత్తి కెక్కు చనువిచ్చు వారల
జారనంత వరకె " జాతి " విలువ;
ఉట్టిలోన బంది యూరివారి కొరకు
కూటమైన కుంభ " వాట " మిదియె!
12. మీనం(చేప)
నిలకడంచు లేక నీటివాలును బట్టి
సాగిపోవునదియు సంద్రమైన;
నీటిచాటు బిడ్డ; " నీల్గు " గట్టన బడ్డ
మిడిసిపాటు దాసి; మీనరాశి!
పూవు, సంఖ్య లడిగి పురుషులు కొందరు
వ్రాయుచుందు రిటుల రాశిఫలము;
మీన, మేషమంచు మిత్రులు కొందరు
మాటలల్లుతూనె పూట గడుపు!
--))**((--
దేశమేదియైన దేహచింతన మాని
చేయవలయు గాదె చెడుగు, మంచి;
రాశిఫలములనుచు రాత్రులు పుచ్చక
"వెండికొండ" లోని " వెలుగు " కండి!
ఒక నడి వయస్కుడి వెనుక , స్కూల్ పిల్లలు పరుగెత్తి,.. పట్టుకుని ,...
స్కూల్ కి ఈడ్చుకుని తీసుకెళుతున్నారు!!
ఇదంతా ఒక పెద్దాయన చూసాడు !!
స్కూల్ పిల్లలని గదమాఇంచాడు!!
"తప్పు పిల్లలూ .....మీరు ఆయన్ని అలా బలవంతం గా స్కూల్ కి లాకెళ్లకూడదు.....
ఆయనది చదువుకునే వయస్సు కాదు....వదిలేయండి పాపం " అన్నాడు .
పిల్లలన్దరూ ఏక కంఠం తో ....
"ఆయన మా టీచర్.!!!.....
రొజూ పాఠాలు చెప్పకుండా, ఏదో సొంత పని మీద పొతూ ఉంటాడు....అందుకే ఇలా!!!!" అన్నారు సర్కారి బడి పిల్లలు!!
--((**))--
స్నేహితుల రోజు శుభాకాంక్షలు
స్నేహం (సజ్జన సాంగత్యం)
ఈసంసార విషవృక్షానికి
మధుర ఫలాలు రెండు న్నాయి
అవి 1) కావ్యామృత రసాస్వాదనం
2) సజ్జన సాంగత్యం
తే॥గీ॥ సుజన సాంగత్య మాధుర్య శుభము దక్క
సుకవి కావ్యంపు పఠన కౌశలము దక్క
స్వాదు ఫలములు సంసార వృక్ష మందు
భువినిఁ గాంచగ లేడుగ బుద్ధి జీవి !!
తే॥గీ॥ స్నేహ మన్న కృష్ణ కుచేల సన్నిహితము
స్నేహ మన్న కృష్ణా ర్జున సఖ్య మేను
స్నేహ మన్న జటాయు దశరథ మైత్రి
లోక విదితంబు కర్ణ ధుర్యోధ నంబు !!
తే॥గీ॥ మధుర మృదు చిత్తముల మిమ్ము మనుపు నట్టి
ఆప్త తను జూపి అభయపు హస్త మొసగు
మనుషు లెవరైన మతము వేరైన నేమి
స్నేహ మెవ్వరి తోనైన చేయ వచ్చు !!
మిత్రులందరికీ స్నేహితులరోజు సందర్భంగా
శుభాకాంక్షలతో శుభాభినందనలతో
హరిః ಓమ్
1) శ్లోకం
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః!
భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావనః!!
6) భూతభృత్ ఓం భూతభృతేనమః
ప్రాణులను పోషింౘువాడని ఈ నామముయొక్క తాత్పర్యము. " గామా విశ్వచ భూతాని ధారయామ్యహ మోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమోభూత్వారసాత్మకః " అని గీతా వాక్యము స్మరణీయము. ( అ_15_శ్లోకం_13).
నేను భూమినాశ్రయించి యుండి సమస్త భూతములను ధారణ చేయుౘున్నాను. మఱియు రసాత్మకుండగు చంద్రుడనై సకల సస్యములను పండింౘుౘు భూతములను పోషింౘు ౘున్నాను, అని గీతాచార్యుని దివ్యవాణి. సత్త్వగుణము నాశ్రయించి సకలప్రాణి కోటులను, పోషించి, రక్షించి,కాపాడువాడు శ్రీహరియే యగుటచేత. " భూతభృత్ " అను భగవానుడు
కీర్తనీయుడగు ౘున్నాడు అట్టి పరమాత్మనాశ్రయింౘుట యే మానవుని ధర్మము.
7). భావః ఓం భావాయనమః
" భవతి " ఇతిభావః. ఉనికియై యున్నవాడనిదీని భావార్థము . నామ రూపాత్మకమైన చరాచరాత్మక మగు నీయనంత. విశ్వమందంతటనూ విస్తరించి, విరాజిల్లు నది. శాశ్వత మగు " ఆత్మ " యొక్కటి యే యగుటచే భగవానుడు భావః అను పుణ్యనామము న ప్రసిద్దుడగుౘున్నాడు.
" యస్స సర్వేషు భూతేషు నశ్యత్సున న వినశ్యతి "(గీతా8_20)
సకల భూతజాలములూ నశించిననూ నాశనము లేనట్టిది ఆత్మయొక్కటియే యని భావము.
8) భూతాత్మా ఓం భూతాత్మనేనమః
సకల భూతములకు ఆత్మయైయున్న వాడని ఈ నామము యొక్క భావము. ప్రతివానియందు ఆత్మకలదు. తాను నశింౘునట్టి శరీరము కాదనియు, నాశనరహితమగు " ఆత్మ " యనియు, భావించి, చింతించి, ధ్యానించి మానవుడు కృతకృత్యుడు గావలయును. ఈ మహా సందేశమునిచ్చు
పుణ్యనామమే " భూతాత్మా " యని శ్రీహరి గానము చేయబడెను.
9) భూతభావనః ఓం భూతబబావనాయనమః
" సకల బూతకోటులనూ సృష్టించి పోషింౘు వాడని"
ఈ నామముయొక్క తాత్పర్యము. మానవుడు అహంకరించి తనవల్లనే సృష్టి కలుగుౘున్న దనియును. తానే తన పురుషకార ప్రయోజనముల చేత వృద్ధి ని పొందుౘున్నాననియును భావింౘును కానీ ఇది సత్యము కాదు. ఈశ్వరుడే సృష్టి కి మూలముగానీ స్త్రీ పురుష సమాగమము కాదు. భగవంతుడే పోషణకర్త గాని మానవుడు గాదు. కావున. ఈ పరమసత్యమును బోధించు
దివ్యనామముతో శ్రీహరి కీర్తనీయుడగుౘున్నాడు.
--((**))--
దేశభక్తిగేయం
ఏశ్వాసలో చేరితే....నేనున్నాను సినిమా పాటకి పేరడి
ఏ గిరులను కాంచితే...మనసు ఆనందమౌతుండునో
ఏ గుండెలో రాగమే అనురాగమై వర్థిల్లునో
ఆనేలతొ నేలీనమై ఆమాతనే నామోదమై
నే కొల్వనీ భారతీ.......|| ఏ గిరులనూ ||
ఉరుకులు పరుగుల లహరులు కలిగినదా....
జాహ్నవీ నదీ
హిమగిరి శిఖరమె చేసిన దానమిదా.....
పుడమిని నిలువున తడిపిన శ్రీకరమే మనధాత్రికీ
తరగని ఘనమగు సిరులను ఒసగినదా...
గంగానిన్ను చేరింది బంగారము నిచ్చింది
నేలా పులకరించింది మురిసితాను పొంగింది
తల్లి భారతీ పెన్నిధీ......,....
|| ఏ గిరులనూ కాంచితే ||
పచ్చని యా కారడవులు గనులునుగా
నదిలోయలే
నలువైపుల మనధాత్రికీ సిరులవగా
అల్లన నీ యుపనదులును విడివడక హృదయానికీ
అలజడితో అణువణువూ తడబడదా......ఆఁ.......
నువ్వే నడిచె ధాత్రియిదీ సిరులే పండు క్షేత్రమిదీ
అనాదిగా మా హృదీ నివేదించు గీతమిదీ
తల్లి భారతీ పెన్నిధీ...........
**
**
**
భారతీ హృదయ పుష్పాంజలీ
నీ పాదముల వ్రాలు కుసుమాంజలీ.....
ఈ గీతాండలీ....,,
మనo అక్కరలేని విషయాల గురించి అలోచించి భాద చెందవద్దు
చదువుకున్నవారు కూడా చెప్పలేరని వాదించ వద్దు
దేవునిలీల గురించి ప్రశ్నలు వేయొద్దు
ధర్మమార్గమునే నడుచు కోవటం మనకు హద్దు
మనసనేది ఉన్నదా - ఉండినా ఎక్కడున్నాదో తెలియదు
ప్రేమ అనేది ఉన్నదా - ప్రేమకు కొలమానం ఎమిటో తెలియదు
హృదయ మనేది ఉన్నదా - ఉండినా రక్త జలాలమద్య ఎలాఉందో తెలియదు
బుడ్డి అసలు ఉందా - ఆ బుద్దు ఎప్పుడు ఎలామరుతుందో ఎవరికీ తెలియదు
ఈ విషయం ఎలా చెప్పాలి - విషయం ఎలా తెలియాలి
నిజం తెలియాలి - గుట్టు తెలిసుకోవాలి
లొసుగు విప్పాలి - సద్దు చేయాలి
ప్రేమ పండించాలి - సుఖాన్ని ఇవ్వాలి
మనకు అసలు సమస్య ఎలా వివరించాలో తెలియదు
ఎప్పుడు మొదలు పెట్టాలో అసలే తెలియదు
ఎప్పుడు అపా లో అంతకన్నా తెలియదు
ఆ మద్యలో ఏంచేయాలో తెలియదు
అన్నీ ఉన్నప్పుడు మన వైఖిరి తెలుస్తుంది -
ఎమీలేనప్పుడు మన ఓర్పు కనిపిస్తుంది
--((**))--
***ఏం చెప్పను?***
మనసంతా నువ్వే ..అందామంటే,
మనసు అంటే ఏమిటో,
ఎలా ఉంటుందో..
శరీరంలో ఎక్కడ, ఎంత ఉంటుందో..తెలియదు
అలా చెప్పడం..అబద్ధం అవుతుంది కదూ..??
గుండెనిండా నువ్వే..అందామంటే..,
ఆ పిడికెడు జాగాలో..
మురికి రక్తం, ఉడుకు రక్తం..
వడిగా సాగే సడిలొ..
ఉన్నావనడం..ఏం బాగుంటుంది కదూ..??
బుద్ధి నిండా నువ్వే..అందామంటే..
బతుక నేర్వని మనిషివి,
వయసొచ్చినా..బుద్ధిరాలేదు..
అని ఎప్పుడో కితాబిచ్చారు జనం.
లేని దాంట్లో ఉన్నావనుకోవడం..భ్రమ కదూ..??
అయ్యో..ఇక ఏం చెయ్యను..?
ఏం చెప్పబోయినా, ఎలా చెప్పబోయినా..
ఏదో ఒక లొసుగు కనబడుతోంది.
అర్ధం కాని ముసుగు తొలగి,
అసలు నిజం బయటపడకుంది..!!.
--((**))--
తరువులు జగతి ఆదరువులు
( ఆగష్టు తెలుగువెలుగు లో ప్రచురితమైన నా పద్య ఖండిక)
పాదపములు వీచి ప్రాణవాయువునిచ్చి
జీవ కోటి కొసగె జీవితాలు
పాదపములె భువిన భగవంతు డౌనురా
పాదపమ్ము జనుల ప్రాణదాత.
నరుల కొరకు సురులు తరువుల సృజియించి
భువికి పంపినారు భూరుహముల
వృక్షజాతి నరుల వేల్పులై నిలిచెను
భూసురావళంద్రు భూరుహంబు
భూమిలోన బుట్టి భూజాత సీతమ్మ
అవని జనుల పూజ లందుకొనియె
ధరణి లోన పుట్టు తరువుల నీనాడు
వేల్పులనగ నేమి? వింత గలదు
తరువులున్న చోట కరువుకే కరువొచ్చు
తరువులే జగతికి సిరులనిచ్చు
తరువులన్ననేమి తరగని పెన్నిధి
తరువులే నిజముగ ధరణి రక్ష
తరువులున్న నేల హరితమై విలసిల్లు
హరిత మున్న చోట హరియు నిలుచు
హరిని యనుస రించి సిరితాను కదిలొచ్చు
తరువులున్న చోట సిరియు నిలుచు
నేనొక మర్రిమానుకడ నిల్చికరంబున గొడ్డలూనియా
కానల భూరుహాల నరకంగను యోచన చేసినంతనే
మ్రానులు జాలితో పలికె మమ్ముల చంపదలంతురేల
మీ
మానవ జాతికెల్లెడల మంచిని కూర్చెడు వారమే కదా!
గాలిని పంచి జీవులను గాతుము సుందర సౌకుమార్యమౌ
పూలను కాయలన్ మధుర పూర్ణఫలంబుల నిచ్చుచున్ సదా
శ్రీలను పెంపుజేసి తమ క్షేమము గోరెడు వారమైన
మమ్మేల నశింప గోర్తురు మహీతల మందున స్వార్థ బుద్ధితో

No comments:
Post a Comment