Thursday, 23 August 2018

Pranjali Pabha (telugu patrika) -8-2018

ఓం శ్రీ రాం - శ్రీ మత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:


ఆనందం ఆరోగ్యం - ఆధ్యాత్మికం 



అధిక్షేప ప్రేమ లీల - ప్రాంజలి ప్రభ .కం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఆలోచన ముందు ఆవేశం అధికం 
- అయినా ఆలోచింపచేసేదే శాశ్వితం  

నిరుత్సాహము ముందు ఉత్సాహం అధికం 
- అయినా నిరుత్సాహమే శాశ్వితం   

చిరునవ్వుల ముందు ప్రేమానందం అధికం 
- అయినా చిరునవ్వులే శాశ్వితం  

స్త్రీ చూపుల ముందు పరిమళం అధికం 
- అయినా చూపుల్లో చిక్కే  శాశ్వితం  

శృంగారము  ముందు మధువు అధికం 
- అయినా స్త్రీ శృంగారమే శాశ్వితం 

పరిమళం  ముందు స్నేహమే అధికం 
- అయినా పరిమళమే శాశ్వితం 

ఆశయము ముందు మౌనమే అధికం 
- అయినా ఆశయమే శాశ్వితం

సంసారము ముందు సంపదే అధికం 
- అయినా సంసారమే శాశ్వితం     

ఏది ఏమైనా కాలాన్ని వ్యర్థం 
చేయక నడిచే వాడే శాశ్వితం  
ప్రేమించి ప్రేమింపబడేవాడే శాశ్వితం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  

--((**))--


సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్
|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||



వరలక్ష్మీ తల్లీ రావమ్మా
వరమిచ్చే వరలక్ష్మీ రావమ్మ 
పసుపు , కుంకుమ
పూల పళ్ళెము తోడ ముత్తైదవులంతా
స్వాగతమిత్తుము శ్రావణ శుక్రవార
వరలక్ష్మీ తల్లీ రావమా !!

సౌభాగ్యములు మాకిచ్చే జననీ
నీ రాకాతో మే తరించూ వేళ
మామిడి తోరణాల , ముత్యాలముగ్గుతో
రాశిగా పూలతో పూజించుమమ్మా
పసుపు కుంకుమ అక్షింతల తోడ
కొలిచేము తల్లీ ..
తోరములు కట్టీ , రూపునూ పూజించి
గృహమున వనితలకు వాయనాలు ఇచ్చుచూ
వరముల వరలక్ష్మీ నిన్ను మేము స్మరింతుము
కళకళ లాడే గృహమున
నీవే మా కల్పవల్లీ తల్లీ
నీవమ్మా .. నీ కరుణా , ప్రేమను
మా పై కురిపించువమ్మా
ఇలలో నీకే అందరమూ వేచీయున్నాము తల్లీ !!
వరలక్ష్మీ తల్లీ రావమ్మా !!
నీ పూజా వ్రతమూ చేసే
భాగ్యము , వరమును ఇవ్వమ్మా
తల్లీ పిల్లా పాపల తోడ హారతి
నీ కిచ్చేము మనసా మా తల్లీ
వరలక్ష్మీ రావమ్మా !!
సకల లోక జనులను రక్షించే
తల్లీ నీ దయా కృప లతో మమ్ము ఎల్లవేళలా
కాపాడు వరలక్ష్మీ తల్లీ ..
వరములిచ్చే వరలక్ష్మీ రావమ్మా
భూలోక వనితలా నోము పండించమ్మా
వరమివ్వు తల్లీ వరలక్ష్మీ తల్లీ రావమ్మా !!
~దివ్య చేవూరి


    23..8..18. సుందరకాండ. 

కారణైర్బహుభిర్దేవి రామప్రియచికీర్షయా, 

స్నేహప్రసన్నమనసా మయైతత్ సముదీరితమ్. 
లంకాయా దుష్ప్రవేశత్వాద్దుస్తరత్వాన్మహోదధేః, 
సామర్ధ్యాదాత్మనశ్చైవ మయైతత్ సముదీరితమ్. 
ఇచ్ఛామి త్వాం సమానేతుమధ్యైవ రఘుబంధునా, 
గురుస్నేహేన భక్త్యా చ నాన్యథైతతదుదాహృతమ్.. 

ఓ దేవీ! రాముని పట్ల నాకు గల అచంచల భక్తిప్రపత్తుల కారణాన, ఆయనకు ప్రీతిని కలిగించాలనే కోరిక వలన మనస్సు కరిగి నిన్ను నాతో పాటు తోడ్కొనిపోతానని చెప్పాను. ఇందుకు ప్రత్యేకించి మరో కారణం ఏదీ లేదు. 

లంకలో ప్రవేశించడం అసాధ్యం కనుక సముద్రం దాట శక్యం కానిదవడం చేత, నిన్ను తోడ్కొని వెళ్ళగల సామర్ధ్యం నాకు ఉందనుకోవడం వల్లా నేను ఇలా పలికాను. అంతకన్నా మరో కారణం లేదు. 
అమ్మా! నిన్ను రాముని సన్నిధికి సత్వరమే చేరుద్దామనే బలీయమైన కోరికచేత, రాముని పట్ల నాకున్న విశేష భక్తిప్రపత్తులు, అభిమానం కారణంగానే నేను ఇలా పలికానుగానీ మరో కారణం ఏదీ లేదు.
--((**))-- 


అంతా నేనే అనుకుంటున్నాను, 
నన్ను నేను గుర్తించలేక పోతున్నాను! 

కాళ్ళకు గజ్జె కట్టుకునే ముందు 
కళ్ళకు అద్దుకోటం మరిచి పోతున్నాను! 
విద్యను ప్రదర్శించేముందు గురువు గార్ని 
గుర్తు చేసుకోలేక పోతున్నాను! 
ముద్ద నోట్లో పెట్టుకుంటూ వైద్యుణ్ణి 
మాత్రం తలపోసుకుంటున్నాను! 
ఆర్జన మాత్రమే చేస్తున్నాను 
అనుభూతిని విస్మరిస్తున్నాను! 

స్వయం శక్తి విలువ తెలియక 
సిఫార్సులకు తంటాలు పడుతున్నాను! 
ఎదుటివాడి మెప్పుకోసం 
వ్యక్తిత్వం తాకట్టు పెడుతున్నాను! 
విలువలేని వాడికి గులామునవుతున్నాను! 
గందరగోళం తాళంలో కంగాళీ చేస్తున్నాను! 

అమ్మో ఇప్పుడు ప్రవచనం వచ్చే వేళైంది, 
ఆలోచిస్తూ కూర్చుంటే అది మిస్సవుతుంది! 
అందుకనే ఆలోచించటం మానేస్తున్నాను, 
తలుపులు మూసి తలపుల్ని బయటకు గెంటేస్తున్నాను!
 --((**)
రచయత: జయంతు ఎం. 
నిత్య నీస్తోత్రాల 
విలసిల్లే దేవీ 
శుచి శుభ్రతల 
పరిభ్రమించె దేవీ 
నీ ధ్యానం లేకుంటే 
నీకరుణే లేకుంటే 
ధన కనకములకూ 
చోటేదమ్మా 

ప్రతి యింట 
విష్ణు గానములతో 
పులకించేవమ్మా 
నిత్యానుష్టాన పూజలతో 
విలసిల్లేవమ్మా 
అనురాగ మాత్మీయత 
అల్లుకున్నవారిలోన 
అనుదినమునీవు 
చల్లని చూపులతో 
వికసించేవమ్మా 

మాయింటి గృహలక్ష్మీ 
మముగన్న తల్లీ 
విద్యబుద్దులతో 
అష్టైశ్వర్యం ప్రసాదించే 
మాతల్లివమ్మా మాయింటి 
మహలక్ష్మివమ్మా
--((**))-- 
            
మళ్లీ వనమయూరము -

నాకు నచ్చిన వృత్తములలో వనమయూరము ఒకటి. ఇది కూడ తాళవృత్తమే. ఇంతకు ముందే చెప్పియున్నాను ఈ వృత్తములోని నరసింహస్తోత్రము (శ్రీమదకలంక పరిపూర్ణ...) చాల ప్రసిద్ధమైనది.

వనమయూరము - భ/జ/స/న/గగ
14 శక్వరి 3823

శారదను దల్చ నవ - చారుమతి గల్గున్ 
మేర లిఁక లేక కడు - మేలు గలిగించున్ 
హారములె భావములు - హర్షలత పూయున్ 
చేరువగుఁ జిత్రముగఁ - జెల్వముల గీతుల్

ఈదినము మంచి దిన - మెల్లరకుఁ గాదా 
ఖేదములు మాయమగుఁ - గృష్ణుఁ డనరాదా 
మోదమిడు రాగ మది - మోహనము గాదా 
సాధానము సేతు నిఁక - సారిగపధాసా

సందె యరుణార్ణవము - శ్యామలము రాత్రుల్ 
మంద మృదు రావమును - మారుతము దెచ్చెన్ 
విందు లిడు వేళ యిది - ప్రేమ మధు పాత్రన్ 
సందియము లెందు కిఁక - సాకి దయ నీవా

విధేయుడు - మోహన
--((**))--


ఉల్లి చేసిన మేలు చేయదు తల్లి
ఉల్లి కారం కలిపి తినిచూది కిల్లి
ఉల్లితినాలనిపిస్తునిది మల్లి మల్లి
ఉల్లి కోసం చేయకు ఇపుడు లొల్లి

ఉల్లి తరిగితే కారు తుంది కన్నీరు
ఉల్లి కొనాలంటే వస్తున్నాయి కన్నీరు
ఉల్లి లేని సాంబారు ఉత్తుత్తి కన్నీరు
ఉల్లి తెస్తే పన్నీరు లేకపోతె కన్నీరు

ఉల్లి రేటుకు వాడని హోటళ్ళు
ఉల్లి ఎక్కువ కమ్మే లోగిళ్ళు
ఉల్లి కొనాలంటే సంసారికి కన్నీళ్ళు
ఉల్లి అమ్మేచోట అంతటా కుళ్ళు

ఉల్లి కొంటున్నారు ఉన్నవారు రేటు ఎక్కువైన
ఉల్లి ముక్కలు లేని అట్టు తింటారు ఎక్కువైన
ఉల్లి ధరపెరిగితే ప్రభుత్వాలుపడును ఎప్పుడైన
ఉల్లి ప్రభుత్వమా కళ్ళుతెరిచి అమ్మాలి తక్కువకైన

ఉల్లి రక్షించు వేసవి వడదెబ్బ
ఉల్లి కాంక్షించ వద్దు నీ వబ్బ
ఉల్లి వాడని తిండి తినాలబ్బ
ఉల్లి కోసం పిల్లాడులా లొల్లి చేయకబ్బ
--((**))--
ఓం శ్రీ సరస్వత్యై నమః

శ్రీ గురుభ్యో న్నమః
అజ్ఞతా చిహ్నము "గు"కార మట్టి దాని గడచు జ్ఞాన చిహ్నంబు "రు" కార మంద్రు
అజ్ఞతాంధ్యమ్ము బాపి సత్యాధ్వమందు జ్ఞాన దీప్తిని దయచేయు యనుడె గురువు!

సహనావవతు యన్న సమభావనా పూర్ణ సత్సాంప్రదాయంపు సార మలది
ప్రేయస్సు నెడబాపి శ్రేయస్సు సమకూర్చు దివ్య విజ్ఞానంపు దీక్ష నొసగి
వినయ వివేకాది వితరణ గుణభూతి చేతంబులన్ నిండ జేర దీసి
సౌశీల్య విశ్వాస సత్య నిష్టల బెంచు శిక్షా విధానంపు చెలిమి నిచ్చి

విద్య గరుపంగ గురువులీ విశ్వమందు పరిణతిన్ బొంది మనజాతి పంచిపెట్టె
విహిత సంస్కార చైతన్య విమల దీప్తి మహి సమస్తంబు శోభాయమాన మవగ!

పరిసరాలోకనా ప్రాపిత విజ్ఞాన శోధనమ్మున ఆత్మ శుద్ధి నంది సతతంబు నియమాను సారమా విజ్ఞాన సాధన జేయుచు సార మరసి శోధనా సాధనా స్ఫూర్తి శిష్యుల దేర్ప
బోధనా శీలురై బుద్ధి గరిపి సంస్కార చైతన్య సౌశీల్య దీప్తుల వ్యక్తిత్వ నిర్మాణ పథము చూప త్రివిధ ధన యుక్తులై యొప్పి అవని మీద జాతి నిర్మాణ నేతలై సాగువారె
గురువు లన జెల్లు! చెల్లునే గురువు లనగ విద్య నమ్మెడి అక్షర విదిత జనుల!

వట తరుచ్ఛాయలో బ్రహ్మ తేజోదీప్తి శోభిల్లు పిన వయస్కుండె "గురువు"
ఆచార్యు ముంగిట అతి భక్తి నియతులై చెలువారు వృద్ధులె శిష్య గణము
ఆధ్యాత్మ తత్త్వమ్ము వ్యాఖ్యానమును చేయ జ్ఞాన ధనుడు పూను మౌన ముద్ర
అతి రహస్యమౌ ఆ భావ మెద చేర్చి  సంశయములు శిష్య చయము బాయు

ఆ గురువె దత్తనాధుండు; అంత వారె శంకరాచార్యులాది శిష్యౌఘ మనగ
అట్టి గురు శిష్యులీ భూమి నవతరించి రెందరో ఆ పరంపర కివియె నతులు!
(చిత్రం వట తరోర్మూలే వృద్ధా శిష్యాః గురుర్యువాః గురోః మౌనం వ్యాఖ్యానం శిష్యాః ఛిన్న సంశయః అన్న ఈ శ్లోకానికి స్వేచ్చానువాదం చివరి పద్యం)

--((**))--



1 comment: