Friday, 24 August 2018

జంధ్యాల పౌర్ణమి/ రాఖీ పండుగ [ రక్షాభందన్ ] -8-2 0 1 8

ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆధ్యాత్మికం - ఆరోగ్యం


రాఖీ పండుగ [ రక్షాభందన్ ] 
************************ 
ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను "శ్రావణపూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ" మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగ అని పిలుస్తూ ఉంటారు. జంధ్యాలు ధరించే వారందరూ ఈరోజున నూతన జంధ్యాలు ధరిస్తారు. 

ఈ రోజు బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్ధులకు వేదపఠనం ప్రారంభిస్తారు. వేదపండితులు వేదాలను వల్లెవేయడం అంటే; ఆ వృత్తి చెయ్యడం ఈ రోజునుండే ప్రారంభిస్తారు. ఆ విధంగా వీరు ఈరోజు వేదాలన్నింటిని ప్రారంభ ఋక్కును, చివరి ఋక్కును పఠిస్తారు. కాలక్రమంలో ఈ రోజు "రక్షాబంధన్ లేక రాఖీ" పండుగగా ప్రాచుర్యం పొందసాగింది. ఈ రక్షాబంధనము ఈ దిగువ మంత్రాన్ని పఠిస్తూ భార్య - భర్తకు, సోదరి - సోదరునకు యుద్ధానికి వెళ్ళే వీరునకు విజయప్రాప్తి కోసం ఈ రక్షాబంధనన కడుతూఉంటారు. 

యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః| 
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల|| 

శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని మంత్రార్థం. ఈ - రక్షాబంధన్ ఎలా ప్రారంభమైనది అంటే! ఈ గాథ మనకు మంచి ప్రామాణిక మవుతుంది. 

పూర్వం దేవతలకు - రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధము సాగింది. ఆ యుద్ధములో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని 'అమరావతి' లో తలదాచుకుంటాడు. అట్టి భర్తనిస్సహాయతను గమనించిన ఇంద్రాణి 'శచీదేవి' తగు తరుణోపాయమునకై ఆలోచిస్తూ ఉన్న సమయాన ఆ రాక్షసరాజు చివరకు 'అమరావతి'ని కూడా దిగ్భంధన చేయబోతున్నాడు అని గ్రహించి, భర్త దేవేంద్రునకు 'సమరోత్సాహము' పురికొలిపినది. సరిగా ఆరోజు "శ్రావణ పూర్ణిమ" అగుటచేత 'పార్వతీ పరమేశ్వరులను', లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజించబడిన "రక్షా" దేవేంద్రుని చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరు వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునకు కట్టి ఇంద్రుని విజయాత్రకు అండగా నిలచి, తిరిగి 'త్రిలోకాధిపత్యాన్ని' పొందారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన 'ఆ రక్షాబంధనోత్సవం' నేడు అది 'రాఖీ' పండుగ ఆచారమైనది. 

ఈ రాఖీకి ఉన్న పవిత్రత ఏమిటంటే భార్య - భర్తకు, సోదరి - సోదరులకు కట్టే రఖీద్వారా వారి వారు తలపెట్టే కార్యములు విజయవంతమై సుఖసంపదలు కలగాలని, వారి మాన మర్యాదలకు వారు బాసటగా ఉండాలని ఆకాంక్షించే సత్ సంప్రదాయమే ఈ 'రాఖీ' విశిష్టత. అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు వార్కి నూతన వస్త్రాలు చిరుకానుకలు సమర్పించి, అందరు కలసి చక్కని విందు సేవిస్తారు. 

విదేశీయులు మనదేశాన్ని పాలిస్తున్న రోజులలో మొగాలాయీల దుర్నీతికి దురంతాలకు ఏమాత్రం అడ్డూ అపూ అనేది లేకుండా పోయేది. హిందూ జాతి వారి కబంధహస్తాలలో నలిగిపోయేది. స్త్రీలు వారి మాన ప్రాణరక్షణకై వీరులైన యోధులను గుర్తించి వార్కి 'రక్షాబంధనం' కట్టి వారు చూసే సోదర భావముతో, రక్షణ పొందేవారు. ఒకసారి 'రాణి కర్ణావతి' శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించినప్పుడు 'ఢిల్లీపాదుషాకు' రాఖీ పంపగా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆ సోదరి ఇంట భగినీ హస్తభోజనంచేసి, కానుకలు సమర్పించినట్లు గాధలు ఉన్నాయి. 

అట్టి శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ, మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగ అమితానందంతో జరుపుకుని మన చక్కని భారతీయ సంప్ర!దాయ విలువలను కాపాడుదాం!! 
…… @ గురూజీ .


ప్రియమైన సోదరి, సోదరులందరకూ 
రక్షాబంధన్ శుభాకాంక్షలు 
ప్రియమైన అక్కా,చెల్లెలకు,అన్న తమ్ములకు 
రక్ష బంధన్ శుభాకాంక్షలు.
మమతల మాగాణిలో పూసిన పువ్వులం
స్నేహ అనురాగాలు నింపుకున్న నవ్వులం
అనురాగాలకి ప్రతికలం అనుబంధానికి
ప్రతిరూపాలము అయన అన్న,చెల్లలం, అక్కా
తమ్ములం పున్నాగ వనంలో పూచిన పువ్వులం.
ఎన్నాళ్ళైన ఎన్నెళ్ళైనా చెరిగిపోని, చెదరిపోని
అనురాగ,స్నేహ బంధాలు మన పున్నాగ వన
బంధాలు.అందరికి రక్షా బంధన్ శుభాకాంక్షలు.
ముఖ పుస్తక పున్నాగ వన మిత్రులకు


గజల్ 2415. 

నీ వాంఛా గగనాలను..కాల్చేదే జ్ఞానమోయ్..! 
ఆశయాలు కిరీటాలు..వీడేదే జ్ఞానమోయ్..! 

ఆనందం వేరేగా..లేదన్నది తెలిసిందా.. 
పరుగులన్ని కులాసాగ..నిలిపేదే జ్ఞానమోయ్..! 

పండుగలో పబ్బాలో..లోకువేగ బొబ్బట్లకు.. 
ఆత్మీయత పండించగ..చూసేదే జ్ఞానమోయ్..! 

విత్తుముందొ చెట్టుముందొ..ఎందుకటా గొడవిప్పుడు.. 
గోర్వెచ్చని శ్వాసగుట్టు..తెలిపేదే జ్ఞానమోయ్..! 

ఈ మాటల సోయగాల..రాజ్యమేలు ముచ్చటేమి.. 
మౌనమనే తోటలోన..చేర్చేదే జ్ఞానమోయ్..! 

మానవుడే మాధవుడై..విశ్రాంతిగ ఉండాలిక.. 
చెలిమికలిమి పెంచి తోడు..ఉండేదే జ్ఞానమోయ్..!

--((**))--

Image may contain: text
సుప్రియ - స/న/జ IIUI III UI 
అధిక్షేప ప్రేమ లీల 
రచయతలు మల్లాప్రగడ రామకృష్ణ 

నవ నాగరికము నాంది, మనసే మగువకు నాంది 
- తనువే తమకము నాంది, వలపే వరుసకు నాంది 

రంగువే మమతకు నాంది, వరుసే వలపుకు నాంది 
- మెరుపే చినుకుకు నాంది, జిగురే అతుకుకు నాంది

వికసించు లతకు నాంది, పరికించు వయసు నాంది 
- అరుపే అలకుకు నాంది, రగిలే సెగలు పగ నాంది      

విరహం పరువము నాంది, వయసే వలపుకు నాంది   
- తపనే కలతకు నాంది, పలుకే మనసుకు నాంది 

నాంది అనగా ప్రారంభం 
నాంది అనగా పునాది 
నాంది అనగా మొదలు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 
--((**))--
   
No automatic alt text available.
అరుదెంచెగ 'నెలరాజు' 
వికసించెను 'కలువమ్ము' 
పరికించెలె 'విరజాజి' 
'పురినే'.. విరిసె 'మ.. యూరి ' 
'మనసే'.. మురిసెను జూడ 
'పిలుపే'.. విను మనసార ! 

వినిపించన 'మది'.. నీకై 
అనిపించులె 'యది'.. నీదై 
'రగిలే' సెగలను 'గూడి' 
'తగిలే' విరహపు 'వేడి' 
'మనసే' తలచెను 'వేడి' 
'తనువే' పిలిచెను 'జోడి' 

అరుదెంచెగ 'నెలరాజు' 
వికసించెను 'కలువమ్ము' 
'మనసే' మురిసెను 'జూడ' 
'పిలుపే' విను మనసార ! 

'వయసే' వలపుగ 'మారె' 
'వలపే' సలపులు 'రేపె' 
'మరుడే' మరులను 'దూసె' 
'చెలుడే' సరసకు 'రాడె' 

అరుదెంచెగ 'నెలరాజు' 
వికసించెను 'కలువమ్ము' 
'మనసే' మురిసెను 'జూడ' 
'పిలుపే' విను మనసార ! 

Image may contain: 1 person, sitting, eating and child
         
అధిక్షేప ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఆలోచన ముందు ఆవేశం అధికం 
- అయినా ఆలోచింపచేస్తుంది శాశ్వితం  

నిరుత్సాహము ముందు ఉత్సాహం అధికం 
- అయినా నిరుత్సాహమే శాశ్వితం   

చిరునవ్వుల ముందు ప్రేమానందం అధికం 
- అయినా చిరునవ్వులు శాశ్వితం  

స్త్రీ చూపుల ముందు పరిమళం అధికం 
- అయినా చూపుల్లో చిక్కే  శాశ్వితం  

శృంగారము  ముందు మధువు అధికం 
- అయినా స్త్రీ శృంగారమే శాశ్వితం 

పరిమళం  ముందు స్నేహమే అధికం 
- అయినా పరిమళమే శాశ్వితం 

ఆశయము ముందు మౌనమే అధికం 
- అయినా ఆశయమే శాశ్వితం

సంసారము ముందు సంపదే అధికం 
- అయినా సంసారమే శాశ్వితం     

ఏది ఏమైనా కాలాన్ని వ్యర్థం 
చేయక నడిచే వాడే శాశ్వితం  
ప్రేమించి ప్రేమింపబడేవాడే శాశ్వితం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  
--((**))--

Image may contain: 2 people, people smiling, text
హరిః ಓమ్ 

7) శ్లోకము 

అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ! 
ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం !! 

ఈ శ్లోకము నందు పరమాత్మ తొమ్మిది పుణ్యనామములతో 
స్తవనీయుడగుౘున్నాడు. 

57) కృష్ణః ఓం కృష్ణాయనమః 


పవిత్రమగు మంగళనామముగా భక్తులు నిరంతరమునూ 
గానము చేయు దివ్యనామ మిది. 

1) " కృష్ణస్తు భగవాన్ స్వయమ్ " శ్రీకృష్ణుడు సర్వకళా పరిపూర్ణుడగు భగవంతుడని భాగవత వాక్యము. 

2) కురుక్షేత్ర రణరంగంలో పార్థుని నిమిత్త మాత్రునిగా నుంౘు కొని అద్భుతమగు గీతోపదేశమును చేసిన కారణమున శ్రీకృష్ణుడు జగద్గురువయ్యెను. భారతీయులకు మాత్రమే కాకుండా ఖండ ఖండాంతర పుణ్యసీమ కెల్లా విశ్వమునకెల్లా గీతోపదేశము శిరోధార్యమై యున్నందున శ్రీకృష్ణుడు విశ్వగురువు. 

3) కృష్ణునకు ఒక్క ప్రణామము చేసినంత మాత్రముచేతనే దశాశ్వమేథయాగఫలము ప్రాప్తింౘునని భారతము వచింౘును. కృష్ణస్మరణము కోటిజన్మకృత పాపహరణమని శాస్త్రవాక్యము. 

4) " కృష్ " అనగా నిరతిశయమైన (Infinite) అని అర్థము. 
"నః " అనగా ఆనందము (Bliss) అనగా సచ్చిదానంద స్వరూపుడు (Infinite Bliss). 

5) సర్వమునూ ఆకర్షింౘువాడగుట చేత " కృష్ణు " డన బరగెననియూ మరియొక అర్థముగలదు. 

6) శ్యామసుందరుడగు కృష్ణుఁడు మానవకోటికి దివ్య వాగ్దానములు, అభయప్రదానములు గావించినాడు. " యోగ క్షేమం వహామ్యహం , నీయొక్క యోగక్షేమములను వహింౘు వాడను నేను 
నివసిష్య " మామేకం శరణవ్రజ " నన్నే శరణుబొందుము. నిన్ను సకల పాపములనుండి విముక్తుని చేసెదను. (అ_18_66) 

" మచ్చిత్తః సర్వదుర్గాణి _ తరిష్యసి " నీ మనస్సు ను నాకర్పించిన సకల దుఃఖములనుండియు దాటిపోగలవు. (అ_18_55) 

" మయ్యేవ మనఆధత్స్వ నివసిష్యసిమయ్యేవ " నాయందే  మనస్సునుంౘుము _ నన్నేపొందెదవు. (అ 12_8) మన్మనాభవ_ 

మామేవైష్యసి " నీమనస్సు నాయందుంచిన నన్నేపొందెదవు. (అ 18_65). ఈ రీతిగా విశ్వమానవకోటికి ఎన్నియోరీతుల వాగ్దానములు, ప్రమాణములు గావించిన కృష్ణుడు సాక్షాత్తు 
పరమాత్మయేకదా.అందుచే ఈ స్తవరాజము నందు దేవకీనందనుడు అధిష్ఠాన దివ్యదేవతగా తెలుపబడెను. 

58) లోహితాక్షః ఓం లోహితాక్షాయనమః 

" ఎఱ్ఱని నేత్రములు గలవాడు" అని భావము. ఎరుపు  రజోగుణము ను సూచింౘును. ఎఱ్ఱని నేత్రములు క్రోధమును సూచింౘును. భగవంతుడు ప్రేమస్వరూపుడే యయ్యును, తన 
కుమారులు అక్రమమార్గములలో,ధర్మవిరుద్ధముగా ప్రవర్తింౘు నపుడు వారిని సరిదిద్దుటకు క్రోధపూరితుడగుౘుండును. కనుక శ్రీహరి లోహితాక్షుడనబడు ౘున్నాడు. దుష్టులపట్లనూ, దుర్మార్గుల పట్లనూ ఆయన కోపమువహింౘును. మానవులందరూ పరమేశ్వరానుగ్రహమును పొందవలయునన్నచో వారు తప్పక ధర్మమార్గాన శాస్త్రం చెప్పిన చొప్పున నడౘుకొనవలెనని ఈ నామము యొక్క ప్రబోధము. అట్టి ధర్మప్రవర్తకులకే భగవదనుగ్రహము లభింౘును. 
దుర్మార్గులు ఆయన యొక్క లోహితాక్షములకు గుఱియై దుఃఖ భాజనులగుదురు.
--((**))--


బాధించే మచ్చ ముందు..గాయమెంత అసలు..! 
తిరిగిరాని క్షణం ముందు..శోకమెంత అసలు..!

చిరునవ్వుకు సరితూగే..మల్లెమొగ్గ ఏది..
పరిమళించు చెలిమి ముందు..స్వర్గమెంత అసలు..!

విరహానికి మధువుతోటి..అనుబంధం మెండు.. 
అందమైన మనసు ముందు..గగనమెంత అసలు..!

నాటకాన శృతిమించిన..అయోమయం మిగులు..
మౌనమైన తలపు ముందు..సంద్రమెంత అసలు..!

చెలి అందెల సవ్వడులే..గుండెలయల తోడు..
మెఱుపుపూల వానముందు..పవనమెంత అసలు..!

ఓ మాధవ ఆరాధన..గీతమేదొ పొంగె..
ఉప్పొంగే గజలు ముందు..కవనమెంత అసలు..!


ఒకరోజు ధర్మరాజు పొద్దున్నుంచీ దానాలు చేస్తూ వున్నాడు .సాయింత్రం అయేసరికి అలసిపోయి ఇవాల్టికి యింక చాలించేస్తాము అన్నాడు భీముడితో.అలా అనుకుంటుండగా ఒకతను దానం కోసం వచ్చి తనబిడ్డ పెళ్లి చేయాలను కుంటున్నాను.కొంత ధనం కావాలి అని అడిగాడు.అప్పుడు ధర్మరాజు అయ్యా!యివ్వాల్టికి సమయముఅయిపొయింది రేపు రండి.యిస్తాను అన్నాడు.ఈ మాట విని భీముడు పక్కుమని నవ్వాడు.ధర్మరాజు భీమా ఎందుకు అలా నవ్వు తున్నావు? అని అడిగాడు.అన్నా!మంచి పని ని వాయిదా వేయకూడదు.రేపటికి నీవు బతికి వుంటావని హామీ ఏమిటి?అతను బతికి వుంటాడో లేదో చెప్పగలవా?దానం చెయ్యాలని అనిపించినప్పుడే చెయ్యాలి.వాయిదా వెయ్యకూడదు,ఎవరికి తెలుసు రేపటికి నీ మనసు మారిపోవచ్చు.యివ్వటానికి నీదగ్గర ఏమీ లేకపోవచ్చు. అంటూ ఈ క్రింది పద్యము చెప్తాడు.

భోజనాత్ త్పూర్వ భాగే చ భోజనాత్ పరత స్తథా 
క్షణే క్షణే మతిర్భిన్నా ధర్మస్య త్వరితా గతి:
అర్థము:--భోజనం చేయక ముందు వున్న బుద్ధి భోజనం చేసి సుఖంగా కూర్చున్నప్పుడు వుండదు. మానవుల చిత్తప్రవృత్తులు క్షణ క్షణానికి మారుతుంటాయి. కావున ధర్మకార్య మేదైనా సరే చేయబుద్ధి పుట్టిన వెంటనే చేసెయ్యాలి. లేకుంటే బుద్ధి మారిపోయే ప్రమాదం వుంది.అప్పుడు ధర్మరాజు సిగ్గుపడి ఆ యాచకునికి కావలిసినంత ధనం యిచ్చి పంపివేశాడు.
--((**))--

తిరుపతిలోని నా ప్రసంగం లోని కొన్ని భాగాలు. 2  

మనం ఇళ్ళలో విష్ణుసహస్రనామ స్తోత్రపారాయణ చేసుకుంటూ వుంటాము. ఐతే పుస్తకం ఎదురుగుండా పెట్టుకుని గబగబా చదివేస్తాము కాని స్వామి వారి నామాలయొక్క అర్థాలు మనకు తెలియవు. అలాకాక మనం అర్థాలు తెలుసుకుని పారాయణ చేస్తే మరింత ఉపయోగం వుంటుంది కదా? మనకీ ఓహో, మనం చదువుతున్న నామాలకు అర్థాలు ఇవా అని ఒకరకమైన సంతృప్తి కలుగుతుంది కదా? అందుకనే నేను ఈ రోజు విష్ణుసహస్రనామాలలోని నామాల యొక్క అర్థాలు క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. 
అసలు ఈ విష్ణుమూర్తి ఎవరండీ? ఎందుకు మనం ఆయనను ధ్యానించాలి? అందువలన మనకు ఏమిటి ఉపయోగం? 
ఆవికారాయ శుధ్ధాయ నిత్యాయ పరమాత్మనే| సదైక రూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే || పుట్టుక, చావు వంటి వికారములు లేని వాడు, పరిశుధ్ధుడు, ఎల్లప్పుడు వుండేవాడు, పరమాత్మ, మార్పు నొందని ఆకారము గలవాడు. సర్వసమర్థుడు అయిన ఆ శ్రీమన్నారాయణునికి నమస్కారం. 
యస్య స్మరణ మాత్రేణ జన్మసంసార బంధనాత్, విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే| ఏ పరంధాముడిని తలచినంతనే పునరపి జననం, పునరపి మరణం - జనన మరణాలు, సంసార బంధనాలనుండి జీవుడు విముక్తిని పొందుతాడో, ఆయనే శ్రీమన్నారాయణుడు. 
ఐతే ఈ విష్ణుసహస్రం ఎవరు ఎందుకు ఉపదేశించ వలసి వచ్చింది? మనకు నాలుగు యుగాలు ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది. త్రేతాయుగంలో మూడుపాదాలమీద, ద్వాపరయుగంలో రెండు పాదాల మీద నడుస్తే, కలియుగంలో మాత్రం ఒక్క పాదం మీదే ధర్మం నడుస్తోంది. కృతయుగంలో మానవులు వేలకొద్దీ సంవత్సరాలు జీవించారు. కానీ కాలక్రమేణ కలియుగం వచ్చేసరికి వారి ఆయుః ప్రమాణం వంద సంవత్సరాలకు పరిమితమై పోయింది. కృతయుగంలో తపస్సు ద్వారా మోక్షం లభించేది. ఋషులు, మునులు వేలకొద్దీ సంవత్సరాలు తపస్సు చేసి మోక్షాన్ని పొందగలిగే వారు. త్రేతాయుగంలో యజ్జాల ద్వారా మోక్షం లభించేది. అందుకే దశరథమహారాజు పుత్రకామేష్టి యాగం చేసి పుత్రులను పొందాడు. ద్వాపరయుగంలో వ్రతాల ద్వారామోక్షం లభించేది. సత్యభామ భర్తను వశంలో పెట్టుకునే నిమిత్తం వ్రతమాచరించింది. శ్రీకృష్ణతులాభారం మీకు అందరికీ తెలిసున్నదే. కానీ కలియుగంలో అంత ఓపికగా జపతపాదులు, యజ్జయాగాలు, వ్రతాలు చేసే అవకాశం వుండదని, పైగా మనుష్యుల జీవనప్రమాణం అల్పమైపోయిందని, జనులకు సులభంగా మోక్షం లభించే మార్గం తెలియజేయడానికి, శ్రీకృష్ణనిర్యాణం జరిగి ద్వాపరయుగాంతం కాబోతున్న తరుణంలో ఆ శ్రీమన్నారాయణుడే భీష్ముని ద్వారా ధర్మరాజుకు విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని బోధింపజేశాడు. అంతేకాదు, స్వఛ్ఛందమరణం పొందుతున్న, అంపశయ్య మీద వున్న భీష్మునిచేత నారాయణుని వేయినామాలతో కీర్తింపజేసి, ఆయనకి మోక్షాన్ని ప్రసాదించాడు. కలౌ నామస్మర ణాన్ ముక్తిః. కలియుగంలో మోక్షం పొందడానికి నామస్మరణే ధన్యోపాయమ్. అందుకని కలియుగంలో ముక్తి లభించడానికి సులువైన మార్గం నామస్మరణే. అయితే విష్ణుసహస్రనామ స్తోత్రపారాయణే ఎందుకు చెయ్యాలి? 
ఇటువంటి సందేహమే ధర్మరాజుకున్నూ కలిగింది. ఆయన భీష్మపితామహుణ్ణి సమీపించి ఇలా అడిగాడు, 'కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణమ్, స్తువంతః కంకమర్చంతః ప్రాప్నుయుర్మానవాశ్శుభమ్? తాతా! ఈ లోకంలో ప్రధానమైన దేవుడెవరు? మనుష్యులు ముఖ్యంగా పొందదగిన స్థానమేది? మానవులు ఏ పరమాత్మను స్తోత్రం చేయడం వల్లను, పూజించడం వల్లను శుభాలను పొందగలరు? 
"కోధర్మస్సర్వ ధర్మాణాం భవతః పరమో మతః, కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్?" అన్ని ధర్మాలలోకి నీకు ఏ ధర్మము మిక్కిలి ఇష్టమైనది? మానవుడు ఏ మంత్రజపం చెయ్యడం వల్ల ఈ పుట్టడం, మరణించడం, తిరిగి పుట్టడం, తిరిగి మరణించడం అనే సంసార బంధం నించి తప్పుకోగలడు?



శ్రీగురుభ్యో నమః 
జంధ్యాల పౌర్ణమి 

శ్రావణపౌర్ణమిని ‘జంధ్యాలపౌర్ణమి’ అని కూడా అంటారు. జంధ్యాల పౌర్ణమిగా పిలుచుకునే శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతములు ధరించి వేదాధ్యయనానికి శ్రీకారం చుడతారు. యఙ్ఞోపవీధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణపౌర్ఱమినాడు, విధిగా నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే, యఙ్ఞోపవీతంగల ప్రతివారు, నిత్యకర్మానుష్ఠాన యోగ్యతకోసం, ప్రతినిత్యం సంధ్యావందనం చేసితీరాలి. కానీ, ఏదోఒక కారణంగా, ఏదోఒక సందర్భంలో తెలిసో తెలియకో, ఈ నియమానికి భంగం జరిగే అవకాశం వుంది. ఒకవేళ అదే జరిగితే, ధరించిన యఙ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితిలో నూతన యఙ్ఞోపవీతిన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లనుసరిదిద్దడానికే ‘శ్రావణపౌర్ణమి’ నాడు నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వులు ఓ ఆచారంగా ఏర్పాటుచేసారు. పూర్వకాలంలో కొత్తగా వేదం నేర్చుకునే వారు కూడా ఇదే రోజున విద్యాభ్యాసం ఆరంభించేవారు.ముహూర్తంతో పనిలేకుండా ఈ రోజు ఉపనయనాలు చేసే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. 

య జ్ఞో ప వీ త ము 

యజ్ఞధృతం ఉపవీతం - యజ్ఞోపవీతం లేక యజ్ఞసూత్రమనియు నందురు. బౌధాయనః|| కౌషంసౌత్రం, త్రిస్తివ్రృతం, యఘ్నోపవీతమానామేః| మనుః - కార్పాసముపవీతంస్యాత్‌. 

కార్పాసముపవీతం, షట్తస్తుత్రివృతం, బ్రాహ్మణస్య అను థర్మశాస్త్రకారుల వచనముల ననుసరించి, ప్రత్తితో వడికిన దారములు మూడు పొరలతో చేర్చి నొక్కపోగువలె మూడు పోగులుకు మూడు మూడులతొమ్మిది పోగులుండులాగున యజ్ఞోపవీతము ధరింపదగినది. 

యజ్ఞోపవీతం కుర్వీతసూత్రాణినవతన్తవః ఏ కేనగ్రంధినాతన్తుస్తిగ్రుణోధనా. 

యనురీతిని తొమ్మిది పోగులతో చేర్చిన మూడుపోగులను "బ్రహ్మముడి' యనుపేర నొకముడి వేయదగినది. ""ఏకోగ్రంధిరీతి, నానాత్వ నిషేధార్థం'' యనురీతిని యొ కేముడి యుండదగినది. ఇట్టి నవతన్తు నామకయజ్ఞోపవీతథారణార్థమై గర్భాష్ఠమేబ్దే బ్రాహ్మణస్యోపనయనంశస్తం'' అను ధర్మాన్ని పురష్కరించుకొని యేడవ వర్షముననే యుపనయనము బ్రాహ్మణ బాలునకు చేయుట యుత్తమము. 

షోడశవర్షాణాం ఉపనయనాంగయప్రతీయతే 
పతితా యస్యసావిత్రీదశవర్షాణింపంచచా, 

అనురీతిని పదు నేడు సంవత్సరములు కాగానే సావిత్రీ పతితుడగును, గాన పదునారు సంవత్సరములలోపుగనే బ్రాహ్మణ బాలున కుపనయనము చేయుట ముఖ్యము. 

""బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే'' యను తైత్తిరీయారణ్యకమున యజ్ఞొవీతము బ్రాహ్మణునకు ముఖ్యాతిముఖ్యమని వచింపబడియున్నది, 

నవతన్తు యజ్ఞోపవీతమునకు అధిపతులు 

ఓంకారః ప్రథమస్తన్తుః 
ద్వితీయోగ్నిస్తధైవచ 
తృతీయోభగదైవత్యః 
చతుర్థస్సోమదైవతః 
పంచమః పితృదైవత్యః 
షష్ఠశ్చెవప్రజాపతి ః 
సప్త మోవిష్ణుదైవత్యః 
దర్మశ్చాష్టమఏవచ 
నవమః సర్వదైవత్యః 

ఇత్యే తేనవతన్తవః. 

"వినాయచ్ఛిఖయాకర్మ, వినాయజ్ఞోపరీతతః| 
రాక్షసం తద్ధి విజ్ఞేయం, సమస్తాన్నిష్నలాఃక్రియాః 

అను ధర్మము ప్రకారము, శిఖ లేకపోయిననూ, యజ్ఞోపవీతము లేకున్ననూ, వైదికకార్యము లాచరించినచో నిష్పలములే గాన, శిఖా యజ్ఞొపవీతములు సంధ్యావందనమునకుగూడ ముఖ్యమనియే గ్రహింపదగినది. 

నాభేరూర్థ్వ మనాయుష్యం| అధోనాభేస్త పక్షయః| 
తస్మాన్నాభిసమం కుర్యాత్‌, ఉపవీతం విచక్షణఇతి. 

యను రీతిని యజ్ఞొపవీతము నాభికి సమంగా పొడవుండదగినదిగాని, నాభి కూర్థముగానున్నచో ఆయుస్సు క్షీణించును, నాభికి క్రిందనుండినచో చేసిన జపాది తపస్సు నశించును గాన నాభి సమంగా యజ్ఞొపవీతమున్నది లేనిది గమనించి నాభి సమంగా నొనర్చుకొని సంధ్యావందనాది కర్మలాచరింపదగినది. 

"స్తనాదూర్థ్వం, అథోనాభేఃనకర్తవ్యంకదాచనా'' అనురీతిని నాభికి పైకినుండరాదు, నాభికి క్రిందికి నుండరాదు. నాభి సమంగానుండుటయే శ్రేయము. 

శిఖా యజ్ఞొపవీతము లెప్పటికి ధరించియే యుండవలయును గాని, అవసరమగుతరిని యుంచుకొని మిగతా సమయములలో తీసివేయరాదు. ఇందుకు ప్రమాణంగా ధర్మశాస్త్రకారిట్లు వచింతురు. 

కాయస్థమేవతత్కార్యం, ఉత్థాప్యంనకదాచన| 
సదోపవీతినాభావ్యం, సదాబద్ధశిఖేనచ|| 

ఎప్పటికి శరీరముననే థరించియుండదగిది. శిఖను ముడివేసియే నుంచదగినది. ఉతవీతిగనే యజ్ఞోపవీతము థరించియుండదగినది. ఈరీతిని శిఖా యజ్ఞోపవీతములు థరించి యుపనయన ప్రభృతి గాయత్రీ యనుష్ఠానమున కుపక్రమింపదగియున్నది. 

మౌంజీబంధదినే తిష్టేత్‌ సావిత్రీమభ్యసన్‌ గురోః 
సూర్యేస్తశిఖరం ప్రాప్తే సాయం సంధ్యాం సమభ్యసేత్‌. 

ఉపనయనమున వెంటనే నిలచియే సాయంకాలమువరకు సావిత్రీయుపాసనము (గాయత్రీజపము) చేయుచండవలయును. సూర్యాస్తమయమగుతరిని సాయంసంధ్యా వందనము చేయదగినది. 

ఉపనయన వటువు సంధ్యావందనమువలెనే మరునాటినుంచి బ్రహ్మయజ్ఞముగూడా నాచరింపవలయును. వేదాద్యయనమే ప్రారంభించలేదు గాదా? బ్రహ్మయజ్ఞమెట్లు చేయడమను సందియముగలుగవచ్చును. అందులకు ధర్మకారుల సమాధానము పరికించునది. 

ఆరభేత్‌ బ్రహ్మయజ్ఞన్తు, మధ్యాహ్నెతు పరేహని మరుదినము మథ్యాహ్నమునుంచి బ్రహ్మయజ్ఞముగూడా చేయవలయును. 

అను పాకృత వేదస్య, బ్రహ్మయజ్ఞః కథంషవేత్‌| 
వేదస్థానేతు గాయత్రీ గద్యతేన్యత్స మంభవేత్‌|| 

వేదము రాకపోయిననూ వేదస్ధానమున గాయత్రీ మంత్రమే పఠింపదగినది 

వేద మథ్యాపయేత్‌ ఏనం, శౌచాచారాంశ్చ శిక్షయేత్‌ || 

ఉపనయనము చేసిన వటువునకు వేదము నేర్పించవలయును. శౌచాచారాదులలో బాగా శిక్ష యిప్పించవలయును. 

దివా సంధ్యాసుకర్ణన్థః బ్రహ్మసూత్రః ఉదఙ్ముఖః 
కుర్యా న్మూత్ర పురీషేవా రాత్రౌచేద్దక్షిణాముఖః|| 

ఉపనయన వటువు శౌ చా చా ర ము లు తప్పక పాటించడము నేర్వదగియున్నది గాన, పగలుగాని సంధ్యాకాలములలోగాని మూత్ర పురీషములు విడువదగినచో, యజ్ఞొపవీతము కుడి చెవునకు చుట్టుకొని ఉత్తరముఖముగ కూర్చొని మూత్ర పురీషాదులు వదలదగినది. 

రాత్రికాలమున మూత్ర పురీషాదులు వదలవలసివచ్చినచో యజ్ఞోపవీతము చెవునకు (కుడిచెవుకు) చుట్టుకొని దక్షిణాభి ముఖముగకూర్చొని విడువదగినది, 

మధు మాంసాం జనోచ్ఛిష్టశుక్తం, స్త్రీప్రాణిహింసనం, 
భాస్కరాలోకనా శ్లీల పరివాదాది వర్జయేత్‌ 

మధు మాంసములు తినరాదు, ఎంగిలి తినరాదు. నిష్ఠురమైన మాటలు పలుక రాదు. (శుక్తం-నిష్ఠుర వాక్యం) స్త్రీలను తదితప్రాణి లోకమును బాధించరాదు, సూర్యుని చూడ రాదు. అశ్లీలమైన పలుకులు పలుక రాదు కొట్లాడరాదు. ఈ నియమములు బ్రహ్మచారి (ఉపనయనమైన బాలునకు బ్రహ్మచారి యని పేరు) తప్పక యాచరింపదగినది. ఈ నియమములు విధిగ పాటించుచు సంథ్యావందనము చేయుచు వేదాధ్యయనము చేయుట ముఖ్యము. 
🌷🌷🌷అంతాశివసంకల్పం🌷🌷🌷

1 comment: