Monday, 6 August 2018

Pranjali Prabha (07-08-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆరోగ్యం ఆధ్యాత్మికం 

అధిక్షేప ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఎగసిపడే అలను ఆపే శక్తి ఎవరికుంది 
- జాతిలో మొండి తనాన్ని మార్చే శక్తి ఎవరికుంది 

మమత మాయను తొలగించే శక్తి ఎవరికుంది
- చెలిమి స్థిరముగా కలిపే శక్తి ఎవరికుంది  

వసంత వైభవాన్ని మరిచే శక్తి ఎవరికుంది
- మొదటి శోభనాన్ని మరిచే శక్తి ఎవరికుంది 

నిత్య సూర్య కిరణాల్ని ఆపే శక్తి ఎవరికుంది 
- వెన్నెలను చిమ్మే చంద్రుణ్ణి ఆపే శక్తి ఎవరికుంది 

కన్నీటి హృదయాన్ని మార్చే శక్తి ఎవరికుంది  
- నీ కసాయి తనాన్ని మరల్చే శక్తి ఎవరికుంది 

పువ్వు వికసించకుండా ఆపే శక్తి ఎవరికుంది
- నీలో యవ్వన సుఖాన్ని ఆపే శక్తి ఎవరికుంది  

నిత్య కాలగమనాన్ని ఆపే శక్తి ఎవరికుంది
- నీలో సమయాన్ని ఆపే శక్తి ఎవరికుంది 

తల్లి తండ్రులను ఎదిరించే శక్తి ఎవరికుంది
ఈ దైవాన్ని కాదని బతికే శక్తి ఎవరికుంది 
  
శక్తి అనేది కర్మ బద్ధం 
మత కుల సమన్వితం 
అనురాగబంధ ఆకర్షణ తత్త్వం  
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు 
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు 
చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం 
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం 
గతమే మరిచి బ్రతకాలే మనసా 
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు 
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు 
ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం 
తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం 
కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో 
కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో 
మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా 
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు 
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు 
తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక 
తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా 
కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం 
వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం 
కరిగే కలలే తరిమే మనసా మనసా 
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు 
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు 
చిత్రం : భద్ర (2005) 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ 
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం : రవి వర్మ 



అధిక్షేప ప్రేమలీల 
రచయత: మాలాప్రగడ రామకృష్ణ 

నిన్ను నీవుగా బ్రతుకు ఎందుకు సందేహము 
- నిన్ను నమ్మిన వారిని వదలదు  దేహము 

నిన్ను నీవుగా ప్రేమించు ఎందుకు సందేహము 
- నిన్ను నమ్మిన వారిని వదలదు స్నేహము

నీ జన్మ తహా ప్రేమపై ఎందుకు సందేహము
- నీవు ధనం కోసం చూపు తావు తాపత్రయము

నీ అన్న వారిపై ప్రేమ ఎందుకు సందేహము  
- నీ అనుభవములే  నీకు చూపును మార్గము 

నీ కష్టాలు చెప్పుటలో ఎందుకు సందేహము
-నీ బాధలు పంచుకొనే ప్రేమను వెతుకుము 

నీ ఆకలి తెల్పుటలో ఎందుకు సందేహము 
- నీ ఆకలి తీర్చే ధర్మ మార్గము వెతుకుము  

నీ ధర్మ కార్య బోధకు ఎందుకు సందేహము 
- నీకు నష్టాలొచ్చినా న్యాయాన్ని మరువకుము

నీ శక్తి యుక్తి ఓర్పుపై ఎందుకు సందేహము
నీవు కాలాన్ని బట్టి నడిస్తే అంతా  సౌఖ్యము 

ఈ దేహము సందేహాల పుట్ట 
మంచి చెడులు గమనించి 
బ్రతుకుటే మానవ జన్మము  
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 
--((**))--

ప్రేమ పెళ్లి

ఓ బిడ్డా ఓ బిడ్డా  నీ  అండకోసం 
వేచి ఉన్నావని అనాకురా బిడ్డా 
కాయకష్టములు చేసి
చదువు సంధ్యలు నేర్పించాము కదరా బిడ్డా 
  
కన్న వారి ప్రేమ కల్ల అనుచు
అన్నన్న అన్న వారిని చులకన చేయుచు
చిన్న నాటి మాటలు మరుచు
ఉన్నవాడి కోసం వేమ్పర్లాడుచు 
మమ్ము చులకన చేయకురా బిడ్డా 

నాన్న కలి కాలం ఇది నీకేం తెలుసు
అన్నా నాకు ప్రేమ విలువ తెలుసు
కన్నా అని అమ్మ అన్నా నామనసు
వెన్న గా మారి ఇది కరిగే వయసు కాదు 

ఎన్నో కష్టాలు భరించే శక్తి కావాలి నాకు
నన్నో ఇంటిదాన్ని చేయాలని పడ్డకష్టాలకు
ఎన్నెన్నో ప్రణామాలు అర్పిస్తున్నాను మీకు
నన్నో మోసకాడు ప్రేమించాడు అనుకోకు

నన్ను నేనుగా నమ్మి బ్రతుకుతాను
నన్ను నమ్మినవార్ని అదుకుంటాను
నన్ను నా ప్రేమను దీవించాలంటాను
నన్ను మావారిని నమ్మ మంటాను


అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః
తే హరి ద్వేషిణః పాప్మాః ధర్మార్థం జన్మయద్ధరేః
తాము చేయవలసిన కర్మలను ఆచరింపక  “కృష్ణా, కృష్ణా ” అంటూ కూర్చునేవారు  - హరిద్వేషులు, పాపులు అవుతారు.  హరి - ధర్మకార్యాచరణకే అనేక జన్మలను(అవతారాలను) ధరించాడుకదా
--((**))--

నారికేళపాకము 

సాహితీమిత్రులారా! 
ఈ కథను ఆస్వాదించండి- 
సాయంకాలం. ప్రకృతిలో సంధ్య పుట్టీపుట్టగానే కళ్లు తెరిచి, పగలంతా అలిసిపోయిన జీవజాలాన్ని గమనించి, ప్రేమగా నిద్రదుప్పటి కప్పుదామని మెల్లిగా నేయటం మొదలుపెట్టింది. ఆ నేతలోని నైపుణ్యానికి చెట్లు, మొక్కలు ఆచ్చెరువుతో ఊగటం మానేశాయి. పొలాల గట్లనుంచి ఇళ్లవైపుకి గంగడోలు మీదుగా వేలాడుతున్న దుండుకర్రతో ఇబ్బంది పడుతూ వస్తున్న ఆవులు తమ దూడల ఆకలిని తల్చుకొని బాధని మర్చిపోతూ గబగబా నడుస్తున్నాయి. వాటి కాలిగిట్టల నుండి రేగిన దుమ్ము అంటించుకొని, గాలి దేవుడు స్వార్ధపరుల నిశ్వాసతో అంటిన పాపాన్ని కడుక్కుంటున్నాడు. పాకలలో అమ్మ పాలకోసం ఎదురుచూస్తూ న్న దూడలు పెద్దవిగా చేసిన గుండ్రటి కళ్లని చూసి, అంత అందంగా అవ్వటం ఈరోజు కూడా కుదరలేదనుకుంటూ ఆకాశంలో సూర్యుడు అవమానభారంతో ఎర్రబడి కిందికి దిగుతున్నాడు. 

పొలాల మధ్యలో ఊరు. ఊరి మధ్యలో కూడలి. కూడలికి ఆనుకుని గ్రామదేవత గుడి. గుడికి ఎదురుగా స్థలం. స్థలంలో ఒక కొబ్బరిచెట్టు ఉంది. 


కొబ్బరి చెట్టు పొట్టిది, కాయలు చిన్నగా ఉంటవి, ఊరిలోని చెట్లతో పోలిస్తే. కానీ అది తన బ్రతుకుని భారం అనుకోదు, తనని తాను తక్కువగా అనుకుని విశ్వాసాన్ని కోల్పోయి నీలగదు. తను చిన్నప్పుడు తాగిన నీళ్లలోని చప్పదనానికి వెగటు చెంది, వాటినే తనకి ప్రాణంపోసిన వాడు కూడా తాగుతాడు కాబోలు అని అనుకుని నొచ్చుకుని, తన తలమీద ఉన్న ప్రతీ కాయ లోకీ శాశ్వతంగా తీయదనాన్ని నింపాలనే సంకల్పంతో గాలి వీచినప్పుడల్లా తనకన్నా గొప్ప చెట్లతో కలిసి కనుబొమ్మల్లా ఉన్న తన మట్టల్ని పైకీ , కిందికీ, పక్కలకీ అభినయిస్తూ , వివిధ భంగిమలు రూపందుకోగా తన నైపుణ్యానికి తానే మురిసిపోతూ తీయగా నవ్వుతుంది. ఆ నవ్వు ఎవరికీ అర్ధమవదు. తీపి మాత్రం తెలుస్తుంది. 

ఆరోజు గ్రామదేవత జాతర. జనులందరూ గుంపులుగా రావడం మొదలు పెట్టారు. గరగలు తలమీద ఉంచుకుని గజ్జెలు కట్టుకున్న వాళ్ల నాట్యం అందమూ, సన్నాయి మేళము వాళ్ల వాద్యాల ధ్వని అందమూ జనాలకి ఒకేసారి ప్రత్యక్షమయి, ప్రేమలో మైమరిచిపోయిన తాచుపాముల జంటలా తమ కళ్ల ఆనందం ఏదో, చెవుల ఆనందం ఏదో విడదీయడానికి లేనంతగా పెనవేసుకుపొయ్యాయి. ఈ అనుభూతి ఒకరి నుంచి ఒకరిని ఆక్రమించింది, తెలియకుండానే. క్రమంగా గ్రామస్తులంతా గుడిదగ్గర పోగయ్యారు.అమ్మవారికి హారతులు, పూజలు మొదలయ్యాయి. 

భక్తితో అందరూ మొక్కుతున్నారు. చెట్టు హాయిగా వీస్తున్న గాలికి ఊగుతూ ఉంది. 

గడుసు కుర్రాళ్లు ఉత్సాహంతో రాత్రిని తామే వెలిగిస్తున్నామని విర్రవీగే నక్షత్రాలు, చంద్రుడు సిగ్గుపడేలాగ అంబరపథాన్ని మిరుమిట్లుగొల్పుతూ తారాజువ్వలు వేయటం మొదలుపెట్టారు. ఒకవైపు కోలాహలాన్ని గమనిస్తూ, మరొకవైపు జువ్వలు వెయ్యాలనే కోరికని చంపుకోలేకపోతూ ఇబ్బందులు పడుతున్నారు. వంతులు వేసుకుంటున్నారు. ఒక కుర్రాడి వంతు వచ్చింది. ప్రదర్శనవైపు కళ్లప్పగించి, జువ్వ వెలిగిస్తున్న ఒక కుర్రాడి చేతికి జువ్వతో పాటు నిప్పు తాకింది. అది జువ్వనిప్పుతో జతకట్టింది. కుర్రాడు ఉలిక్కిపడి బాధనుండి తప్పించుకోవాలని ఏం చెయ్యలేక జువ్వని పైకి వదిలేశాడు. అది సర్రుమంటూ గుడి ఎదురుగా ఉన్న కొబ్బరిచెట్టు కేంద్రస్థానాన్ని తాకి, ఆకాశంలో స్వేచ్ఛగా వదలాల్సిన తళుకులని ఆ చెట్టు తలమధ్యలో విదిల్చింది. 

కుర్రాడు బిగ్గరగా అరిచాడు. చెట్టునుండి నిప్పురవ్వలు ఒక్కసారిగా ఎగిశాయి. 

కొంతమంది కుర్రాడిని దూరంగా తీసుకుపోయి, మందు వ్రాశారు. చెట్టు కేసి చూసి ‘అమ్మో’ అని, ‘అయ్యో’ అని అనుకున్నారు. కొంతమంది మంట ఆర్పుదామని ప్రయత్నించారు. సాధ్యపడలేదు. పూజ ముగిసింది. గరగనాట్యమూ అయిపోయింది. భక్తులు ప్రసాదం పుచ్చుకుని ఇళ్లదారి పట్టారు. ఊరిచివర సారాకొట్టు నుంచి తీర్థం పుచ్చుకుని, ప్రచ్ఛన్నస్వేచ్ఛాలోకాలలో విహరిస్తూ కొంతమంది తాగుబోతులు సైకిళ్లమీద మేళం శబ్దం విన్న ఉత్సాహంతో గుడిదగ్గరకి గుంపులుగా రావడం మొదలు పెట్టారు. వారి రాకతో సమాంతరంగా పక్కఊరినుంచి కొంతమంది అమ్మాయిలతో ఉన్న ఒక ట్రాక్టరు, వెనకాలే మనిషి అంత ఎత్తు ఉన్న స్పీకర్లూ, ఒక పాటగాడూ, ఒక పాటగత్తె, సినిమా పాటల టేప్ రికార్డరు సెట్టూ వచ్చినవి. గుడి పక్కనే ఆగినవి. చూసిన వాళ్లంతా బిగ్గరగా కేకలు వేశారు. పాటలు పెట్టారు. 

పాటల శబ్దం పెద్దదైంది. చెట్టుమీది మంట పెద్దదైంది. 

అమ్మాయిలు సినిమా పాటలకి డాన్సు చెయ్యడం మొదలుపెట్టారు. స్పీకర్ల తాకిడికి గుడి, గుడి కి ఆనుకుని ఉన్న వీధులన్నీ కంపిస్తున్నాయి, ‘గుడి ముందు ఇదేం గోల’ అన్న సణుగుడు పైకి వినపడకుండా. వాళ్లని చూస్తూ తాగుబోతులంతా ట్రాక్టరు దగ్గరగా పరిగెత్తుకుంటూ వచ్చి, వాళ్ల విన్యాసాలని మెచ్చుకుంటూ, ఈలలు వేస్తున్నారు. అరుస్తున్నారు. వాళ్లని పట్టుకుందామని పైకి ఎగురుతున్నారు. కుదరక, కిందకి దిగుతున్నారు. ఒకడు ట్రాక్టరు పైకి ఎక్కుదామని చూశాడు. ఆ ట్రూపు తో వచ్చిన వస్తాదు వాడిని పక్కకి తోసిపారేశాడు.. వాడు కిందపడి ఊగిపోతూ కేకలు వెయ్యడం మొదలుపెట్టాడు. మిగిలినవాళ్లు వాడిని పట్టించుకోలేదు. పాటలు మారుతున్నాయి. 

కేకలూ, ఈలలూ ఎక్కువౌతున్నాయి. చెట్టుమీది మట్టలు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి. 

డాన్సు అయిపోయింది. ట్రాక్టర్లు వెళ్లిపొయ్యాయి. ఇంకా కావాలి అంటూ తాగుబోతులు కొంతసేపు అరిచినా, చేసేది లేక సైకిళ్ల మీద ఇంటిమొఖం పట్టారు. కొంతసేపటికి పెద్ద స్పీకర్ల నుండి వచ్చిన పాటల ప్రతిధ్వని కూడా అంతరించింది.మెల్లిమెల్లిగా ఆ ప్రదేశమంతా నిర్జనమైంది. శబ్దమంతా ఆగిపోయింది. నర్తించిన అమ్మాయిల మీద చల్లిన రంగు కాగితాలతో గుడిప్రాగణమంతా కొత్తరూపుగట్టింది. కాసేపటికి కరెంటు పోవడంతో వీధిదీపాలు ఆరిపొయ్యాయి. 

కోలాహలం అణిగింది. చెట్టుమీద మంటా అణిగింది. 

కాసేపటికి పెద్దగాలి ప్రవాహం వచ్చింది. చెట్టుమీంచి నిప్పురవ్వలు ముద్దలు ముద్దలుగా క్రిందకి ధారాపాతంగా రాలుతున్నాయి. ఆ కాంతిలో గ్రామదేవత ముక్కుపోగుపై ఉన్న తెల్లటి రాయి ఎర్రగా ప్రకాశించింది. 


ప్రాతఃకాలం. ప్రకృతిలో సంధ్య పుట్టీపుట్టగానే కళ్లు తెరిచి, రాత్రంతా సొలసిపోయిన జీవజాలాన్ని గమనించి, ప్రేమగా ఉత్తేజపుదుప్పటి కప్పుదామని మెల్లిగా నేయటం మొదలుపెట్టింది. ఆ నేతలోని నైపుణ్యానికి చెట్లు, మొక్కలు ఆచ్చెరువుతో ఊగటం మానేశాయి. పొలాల గట్ల వైపుకి ఇళ్లనుంచి గంగడోలు మీదుగా వేలాడుతున్న దుండుకర్రతో ఇబ్బంది పడుతూ వస్తున్న ఆవులు తమ దూడల ఆకలిని తీర్చిన సంతృప్తితో బరువుని మర్చిపోతూ గబగబా నడుస్తున్నాయి. వాటి కాలిగిట్టల నుండి రేగిన దుమ్ము అంటించుకొని, గాలి దేవుడు స్వార్ధపరులకి ఉచ్ఛ్వాసగా మారడం తప్పక, ఉత్సాహాన్ని నింపుకుంటున్నాడు. పాకలలో అమ్మ పాలు తాగి కళ్లుమూసికొని కునుకుతీస్తూన్న దూడలమీద ఈరోజు గెలుపునాదే అనుకుంటూ ఆకాశంలో సూర్యుడు ప్రజ్వలిస్తూ పైకి ఎక్కుతున్నాడు. 

పొలాల మధ్యలో ఊరు. ఊరి మధ్యలో కూడలి. కూడలికి ఆనుకుని గ్రామదేవత గుడి.గుడికి ఎదురుగా స్థలం. స్థలంలో కొబ్బరిచెట్టు లేదు. 
--------------------------------------------------------- 
రచన - పరిమి శ్రీరామనాథ్, వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో 
--------------------------------------------------------- 

- ఏ.వి.రమణరాజు
--((**))--

శ్లో === ఉపాన హౌచ వాసశ్చ ధృత న్యైర్ణ ధారయేట్| 
ఉపవిత మలంకారం శ్రాజం కరకమేవ చ.|| 

భావము === ఒకరు ధరించిన పాదరక్షలు, వస్త్రములు, యజ్ఞోపవితము ఆభరణాలంకారములు, పూలమాలలు, కమండలములు మరియొకరు ధరిమ్పరాడు.

ఉ.=== జీవన మింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్ 
దావున నిల్చి జీవనమే తద్దయు గోరు విధంబు చొప్పడం 
దావలమైన దాని గురితప్పని వాడు చరించు వాడయా 
తావక భక్తి యోగమున దాశరధీ ! కరుణా పయోనిధీ! 

భావము === రామా! దయాసముద్రా! చెరువులో నీ రిమ్కిపోగా బురదలో దగులుకొని, మిక్కిలి కదలలేక, ఆ తావుననే యుండి యింకను నీటినే కోరు విధమున, అవసరమైన దాని విషయమున లక్ష్యము తప్పనివాడు నీ యందు భక్తి గలిగి యుండి ఎత్తి యాపదలు గలిగినను నీ యందే ప్రవర్తించు చుండును.
 ఉ.=== వారిజ పత్రమం దిడిన వారి విధంబున, వర్త నీయ మం 
దారయ రొంపి లోనండను వంటని కుమ్మరి పుర్వురితి సం 
సారమునన్ మేలంగుచు విశారగుడై పర మొందు గాదె స 
త్కార మెరింగి మానవుడు దాశరధీ ! కరుణా పయోనిధీ! 
భావము === రామా! దయాసముద్రా! తామరాకులో బోసిన నీరు తామరాకునంటని విధమునను బురదలో బోరలినను మేనికంతని కుమ్మరి పురువు విధమునను, మానవుడు సంసారమున మెలగు చుదన్మాలిన్యమునమ్దాక్ మంచి ఏదో తెలిసికొని తాత్త్విక విచారమును బొందిన వాడయి మోక్షము నందును గాక!
ఉ.=== నీసతి పెక్కు కల్ములిడ నేర్పరి, లోక మకల్మషంబుగా 
నీ సుత సేయు బావనము, నిర్మిత కార్యధురీణ దక్షుడై 
నీ సుతుడిచ్చు నాయువును, నిన్ను భజించిన గలగా కుండునే 
దాసుల కీ ప్సితార్ధములు దాశరధీ ! కరుణా పయోనిధీ ! 
భావము === రామా! దయా సముద్రా! నీ భార్య యగు లక్ష్మి అనేక సంపద లిచ్చుట యందు నేర్పుగలది. నీ కూతురగు గంగ లోకమును బాపరహితముగా బవిత్రీ కరిమ్చును . సృష్టి కార్య దురంధరుడై నీ కుమారుడగు బ్రహ్మ ఆయువునిచ్చును. నిన్ను సేవించిన నీ భక్తులకు వాంచి తార్ధములు సిద్ధింప కుందునా! తప్పక సిద్దిమ్చు ననుట.
 --((**))--

శ్లో === విప్రాణాం జ్ఞానతో జ్యైష్ట్యం క్షత్రియాణంతు విర్యతః 
వైశ్యానాం ధన ధన్యాభ్యాం శూడ్రాణా మేవ జన్మతః || 

భావము === బ్రాహ్మణులలో పండితుడును, రాజులలో బలవంతుడు వైశ్యులలో ధనవంతుడు, శూద్రులలో వయస్సు వచ్చినవారు పెద్ద వారగుదురు.
--((**))--

చందమామ కధ. 
. అనగనగా...... 

ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో నివసించే దంపతులు ఇద్దరికి చాలా కాలంపాటు సంతానం కలగలేదు. ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత వాళ్లకొక కొడుకు పుట్టాడు. 

దంపతులు వాడికి సోము అని పేరు పెట్టి, ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. సోము ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆ బడిపిల్లలందరూ కలిసి విహారయాత్రకని గంగానదిని చూడటానికి వెళ్లారు. సోముకు అక్కడి వాతావరణం, ప్రశాంతత చాలా నచ్చాయి. 

అతను అక్కడ కూర్చొని నదిలోకి చూస్తుండగా, దూరంగా కొందరు పిల్లలు గుమికూడి ఏదో అల్లరి చేయటం మొదలెట్టారు. వెంటనే సోము అక్కడికి వెళ్లి చూశాడు. ఆ పిల్లలంతా ఒడ్డుకు వచ్చిన ఒక తాబేలును అటూ ఇటూ పీకుతూ దాంతో ఆడుకుంటున్నారు. 

అది చూసిన సోముకు చాలా బాధ కలిగింది. 
వాడు పిల్లలతో వాదించి, వాళ్లందరినీ అక్కడినుండి పంపించేశాడు. ఆపైన 
గాయాలతో ఉన్న తాబేలును చేతనెత్తి, నదిలోకి తీసుకెళ్లి వదిలేశాడు. 

ఆశ్చర్యం! నీళ్లలో పడగానే ఆ తాబేలు మాట్లాడింది. "ఓ మంచి అబ్బాయీ! నీ మేలు మరువలేనిది. ప్రమాదంలోపడ్డ నాకు, నువ్వు చేసిన మేలు చాలా గొప్పది. ఇందుకు ప్రత్యుపకారంగా నేను నీకు ఏమైనా చేసిపెట్టాలని అనుకుంటున్నాను. అడుగు, నీకేం కావాలో!" అన్నది. 

సోము తనకేం అక్కర్లేదనీ, కావాలంటే అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి, ముందుకు సాగాడు. 

ఈ సంఘటన జరిగిన తర్వాత చాలాకాలానికి, సోము యుక్తవయస్సులోకి వచ్చాడు. చాలా విద్యలు నేర్చుకొని, అతను వీరుడుగా పేరుగాంచాడు. 

ఇదిలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురు, తన స్నేహితురాళ్లతో కలిసి స్నానానికని గంగా నదికి వెళ్లింది. నదిలో స్నానమాడుతూండగా ఆమెకిష్టమైన రత్నాల హారం జారి నదిలో పడిపోయింది. చాలా మహిమగల ఆ హారం అంటే ఆమెకు చాలా ఇష్టం. అది పోయిందన్న బెంగతో రాకుమారి సరిగ్గా భోజనం కూడా చేయటంలేదు. 
ఎవరెంత చెప్పి చూసినా ఆమె బెంగమాత్రం తీరలేదు. ఆహారం లేక ఆమె రోజు రోజుకూ కృశించిపోవటం మొదలెట్టింది. ఆమెకు సంతోషం కలిగించటానికి పూనుకున్నారు రాజుగారు. 

గజ ఈతగాళ్ళు అనేక మందిని అమితవేగంతో ప్రవహించే ఆ గంగా నదిలోకి పంపారు. కానీ ఆ నదీవేగానికి వాళ్లందరూ కాగితపు పడవల్లా కొట్టుకపోయారు. కొందరైతే 
నదిలోని ముసళ్లకు ఆహారమయిపోయారు పాపం. 

ఇక చేసేదేమీలేక, తెలివిగలవారూ, సాహసవంతులైన యువకులెవరైనా ఆ రత్నాల హారాన్ని తేగలిగితే వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లిచేయటమేకాక, అర్థ రాజ్యాన్నికూడా ఇస్తామ'ని రాజావారు  చాటింపించారు. 

చాటింపును విన్న సోము ఆలోచించాడు: 

ఇంతమంది గజఈతగాళ్లకు దొరకకుండా ఆ హారం ఎటుపోతుంది?' అని. 'అది నదిలోని ఏ రాళ్ళ అడుగునో ఇరుక్కుని ఉండాలి. దాన్ని తీయటం సాధారణ మానవులకు సాధ్యం కాకపోవచ్చు. అయినా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమౌతుందని, అతను నదిలోకి దూకి, రాళ్ళ అడుగున వెతకటం మొదలుపెట్టాడు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది- 

ఒక పెద్ద బండరాతి అడుగున మెరుస్తూ ఏదో ఆతని కంటపడింది. అయితే దాన్ని చేరుకునే ప్రయత్నంలో అతను నదిలోని ఒక సుడిగుండంలో చిక్కుకుపోయాడు. ఇక తన ప్రాణాలు పోవటం తప్పదనుకున్న ఆ క్షణంలోనే సోము నీటి పైకి తేలాడు! ఎలాగని చూస్తే, అతని సాయంపొందిన తాబేలు! 

సోము కోరికను అడిగి తెలుసుకున్న తాబేలు నదిలోని బండరాళ్లను ఎత్తి మరీ ఆ రత్నాల హారాన్ని తెచ్చి సోముకు ఇచ్చింది. హారాన్ని పొందిన సోము అక్కడి నుండి నేరుగా రాజ భవనానికి చేరుకొని, ఆ రత్నాల హారాన్ని రాకుమారికిచ్చాడు. 

సంతోషించిన రాజు సోముకు తన కూతురుని ఇవ్వడమే కాక, అర్థరాజ్యమిచ్చి గౌరవించాడు కూడా. ఆపైన సోము రాజ్యాన్ని చక్కగా పాలించి, 'దయ గల రాజు' అని పేరు తెచ్చుకున్నాడు.

--((**))--

No comments:

Post a Comment