ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
చిన్న కధ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
సుబ్బారాయుడు ఒకడు ఉన్నాడు, అతడు గొప్పలు చెప్పఁటంలో ప్రసిద్ధి, ఒక రోజు పిల్లందరి మద్య కూర్చొని కధలు పిల్లలకు చెపుతున్నాడు. సముద్రం నీళ్లు ఎవరైన త్రాగుతారా? అని అడిగాడు. త్రాగుతాయి అన్నారు పిల్లలు, ముందు మీరు ఇవి త్రాగండి అన్నారు పిల్లలు గ్లాసు నీళ్లు ఉంచి , ఓసి ఇవేగా త్రాగుతా చూడండి అంటూ నోట్లో పోసుకున్నాడు అంతే ఒక్కసారి బోళ్ళుమని కక్కాడు సుబ్బారాయుడు ఎవరు ఉప్పు కల్పిన నీరు పెట్టింది అన్నాడు కోపంగా. వెంటనే పిల్లలు మీరు తిమింగళంగా మారండి అప్పుడు సముద్రం నీరు త్రాగవచ్చు అంటూ నవ్వు కుంటూ వెళ్లారు పిల్లలు. కారణం లేకుండా నవ్వుతున్నారు మీరు అన్నాడు. మీరు చెప్పే గొప్పలకు కారణం కూడా ఉండాలా అన్నారు పిల్లలు వెళుతూ. అప్పుడే సుబ్బారావు భార్య బయటకు వస్తూ, పిల్లలదగ్గర చులకనై పోతారు, పిట్టలదగ్గర చులకనై పోతారు ఎం బతుకండి అన్నది. అప్పుడే సంస్కృతం బుక్కు ఒకటి ఉంటె చదవాలనుకున్నాడు, దుర్మార్గులను, మూర్ఖులను ఎవ్వరు మార్చలేరు అని పెద్దగా చదివాడు. అబ్బా ఆపండి చదువు మీరు ఆకోవకు చెందిన వారైతే ఇపాటి కళ్ళ, ఆ ఇపాటికల్లా వదిలేసి జండా ఎత్తేసేదాన్ని అన్నది భార్య. అయితే నన్ను మంచివాడిగా గుర్తించావుగా అన్నాడు. నీలాంటి వాడు ఒకడు నడిరోడ్డులో రెడ్ లైట్ పడ్డ ఆగక పో బొయ్యాడు, ఒకతను గట్టిగా ఆపి అట్లా పోకండి క్రమ శిక్షణ తప్పి ప్రవర్తించకండి అన్నాడు. పోలీసులకు నేను భయపడను, అసలు మృత్యువుకే భయపడను అన్నాడు. వారిద్దరికీ భయపడ నవసరము లేదు. మా పిల్లలు చూస్తే చెడిపోతారని మా భయం అంతే అంటూ ఈ శ్లోకం చెప్పాడు ఆ పెద్ద మనిషి తెలుసా అంటూ చదివిన్పించింది ఆ ఇల్లాలు.
నీతి శాస్త్రము - పండిత పరిష్కృతము
శ్లో === బాలసఖత్వ మకారణ హాస్యం | స్త్రిషువివాద మసజ్జన సేవా |
గార్ధభయాన మసంస్కృత వాణీ | షట్సు నరో లఘుతా ముపయాతి||
భావము === చిన్న వారితో స్నేహము, కారణము లేని నవ్వు, స్త్రీమూలక వివాదము, దుర్మార్గుల సేవ, గాడిదనెక్కి తిరుగుట, సంస్కృత భాషను చదువకుమ్దుట అను నీ ఆరింటిచే పురుషుడు చులకనై పోవును.
--((**))--
యోఽన్య ముఖే పరివాదః ,స ప్రియ ముఖే పరిహాసః
ఇతరేంధనజో ధూమః , సోఽగరు జాతో భవేద్దూపః.
ఇతరుల నోటినుంచి వస్తే దూషణం అనిపిస్తుంది. అదే మాట తనకు ఇష్టమైన వాని నోటినుంచి వస్తే , హాస్యం అనిపిస్తుంది.ఇతరములైన కట్టెల నుండి వచ్చినది ధూమమౌతుంది. చందనపు చెక్కనుంచి వస్తే ధూపమౌతుంది!
బావా మఱఁదుల సరసం (2013) మరలా
ఫేసుబుక్లో పొందుపరుస్తున్నా అభిప్రాయం తెలపగలరు
జనపద గీతం - ప్రభ (రచయత: మల్లాప్రగడ రామకృష్ణ )
1 వెన్నెలలో చిరునవ్వులు విరజిమ్మే ' మరదలా ' ఓ మరదలా '
కన్నులలో కలకాలం దాచుకోవాలీ 'మరదలా ' ఓ మరదలా
నామీద వయ్యారపు వగలు చూపకూ ' బావా ' ఓ బావా
మోసపూరిత ప్రేమను కుమ్మరించకూ ' బావా ' ఓ బావా
2 వయ్యారపు నడకతో మది దొచకూ 'మరదలా ' ఓ మరదలా
పెదవులు చూపీ మందహాస మెందుకూ 'మరదలా ' ఓ మరదలా
మరులూరించే వేణు గాణము చేయకు బావా ఓ బావా
పరవసంతో పాడి తాపాన్ని పెంచకూ బావా ఓ బావా
3 చల్లగాలి భలే భలే మత్తెక్కిస్తుంది 'మరదలా ' ఓ మరదలా
మనసంతా ఎదో ఎదో కావాలంటుంది 'మరదలా ' ఓ మరదలా
మధురంగా ఉంది అధరమ్ అందిస్తావా బావా ఓ బావా
కౌగిల్లో మాధురాణుభూతి కల్పిస్తావా బావా ఓ బావా
4 చలిగాల్లో పరువాలు పంచుకుందామే 'మరదలా ' ఓ మరదలా
సొగసైనా నామేనుపై పవళించుమూ 'మరదలా ' ఓ మరదలా
చలిగాల్లో నా మేను పులకరిస్తుందీ బావా ఓ బావా
సొగసైన వయసంతా ఆక్రమించవే బావా ఓ బావా
ఈ రోజుకు చాలు బావా సరసానికి రేపుకలుస్తా
అంతేనా ..... అంతే ఆ..... ఆ ....
5 ఈ హాయి కలకాలం ఉండాలి మరదలా
నీ సుఖం కోసం ఏమైనా చేయాలా మరదలా
నా ద్యాస అంతా, ఆశలన్ని నీ పైనే బావా
ఏనాటి పుణ్యమో నీ ప్రేమకు చిక్కాను బావా
6 బెలవు అనుకున్నా, కాదు గడసరివి మరదలా
ప్రేమ కతలు వ్యక్త పరుస్తున్నావు మరదలా
నిన్ను చూస్తుంటే వళ్ళంతా పులరిస్తుంది బావా
నా చెంగుకు దొరకకుండా ఉన్నావు బావా
7 కలవరపాటు లో నిను చూడలేదు మరదలా
కలవాలనుకున్న కలువలేకున్న మరదలా
నీ ప్రక్కన ఉన్నాను చుడలేదా బావా
నీలో నె ఉన్నాను దిగులు పడకు బావా
8 నీ నీడ సోకగానే నామనసునిలవనంటుంది మరదలా
హాయి హాయి గా మనం తిరుగాలి మరదలా
చల్లని వెన్నేలను పంచె నేలరాజువు బావా
విచ్చుకున్న కలువను ముద్దడవేమి బావా
9 నిను వీడను నీవే నా సుఖం మరదలా
ని చుపులలో చిక్కాను మరువలేను మరదలా
నీ చల్లని చరణంబుల నీడలో ఉంటాను బావా
నీ పాద సేవ చేస్తూ సుఖం పంచుతాను బావా
10 పిలిచిన పలుకవు నా ప్రియమైన మరదలా
పలకరింపుకు ఒక్కనవ్వు నవ్వవే మరదలా
పలికిన ముద్దు ముద్దు కావాలంటావు బావా
నీ అమాయకపు మాటలకు లొంగను బావా
11 మధుర శృంగార మందార మరదలా
మందహాసమ్తొ మధురిమలు పలుకవే మరదలా
నా మదిని దోచిన మన్మధుడవు బావా
నా మనసులోని మాటను చెప్పాలని ఉంది బావా
12 నీలి కళ్ళు చూపూలతో మురిపిస్తున్నావు మరదలా
ఈ కళ్ళు నీకోసం వేచి ఉంటాఈ మరదలా
నీ కళ్ళను చుస్తే నా వల్ళును మరీచాను బావా
నా మనసంతా నికే అర్పించాలని ఉంది బావా
13 దిబ్బరొట్టె మొహం, బుంగా మూతి పెట్టె మరదలా
రబ్బర బంతిలా ఎగిరెగిరి పడుతున్నా ఇమరదలా
గొట్టాం పాంటు వేసుకొని కాడిలాగున్నావు బావా
గాలికి కొట్టుకు పేయా గడ్డి పరకాలాగున్నావు బావా
14 ముద్ద బంతి పువ్వులా, ముద్డొస్తున్నావే మరదలా
కన్ను గీటి నన్ను ఉడికిస్తున్నవే ముద్దుల మరదలా
సొగసుకాడవు నీవు, కోరా మిసాలున్న ముద్దులబావా
వేడెక్కిస్తేగద నాలోవేడిని చల్లపరచవా ముద్దులబావా
15 నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు గడిపాను మరదలా
కనులు మూసినా తెరిచినా నీవే ఉన్నావు మరదలా
నీవువస్తావేమోననినాతలుపులుతెరిచిఉంచానుబావా
నాయద అంతా బరువేక్కి బటన్స్ తెగినా ఈ బావా
16 పన్నీటితో స్నానము చేఇస్తాను మరదలా
పవళించుటకు పూలపాన్పువేస్తాను మరదలా
జలకాలాడుటకు నీవుఉంటే చాలు బావా
నీ మేను నాదైనప్పుడు పూలతో పనియేంటి బావా
17 నీలి కన్నులతో నిగ నిగ లాడుతున్నావు మరదలా
నీజడకదలిక చూస్తె గుండెజల్లుమంటుందిమరదలా
చలికి చల్లగాలేస్తుందా మగసిరిగల ముద్దుల బావా
నీ ఆశను వమ్మూచేయను ఓర్పు వహించు బావా
18 నీ శిగలో పువ్వులు చూస్తెశివమెత్తుతుంది మరదలా
మనం తీగలా చుట్టుకొని ప్రవశించుదామా మరదలా
ఆడుతూ పాడుతూ హాయిగాఅల్లారిచేస్తూ ఉండుబావా
జాబిలీ చూపిస్తాను, వెన్నేలను అందిస్తాను బావా
19 గాలిలో తేలే పూలలా విహారిద్దామా మరదలా
ఆకాశంలో మేఘంలా విహారిద్దామా మరదలా
కన్నేమనసును అర్ధం చేసుకోవాలి బావా
ఆశల వలయంలో చిక్కి భాధపడకుబావా
20 నాకునీవు నీకునేను కలసిమెలసిఉందామా మరదలా
తీయనికలలుకంటుకోరికలుపంచుకుందామామరదలా
మురిపాల ముద్దులు ఇవ్వాలని ఉంది బావా
సొగసైనా వయసు పందిరి వేయాలని ఉంది బావా
21 హిమగిరి సొగసులు చూచుటకు పొదామా మరదలా
శీతల పవనాలలో కలసి తిరుగుదామా మరదలా
వెచ్చగా నీవు ప్రక్కన ఉంటేనేను వస్తాను బావా
నా ఆశలన్ని నీపైన నీసుఖమే నాకు కావాలి బావా
22 తోటలోకి వస్తావా నీతో మాట్లాడాలని ఉంది మరదలా
గూటిలొ ఉంటే గుసగుస లాడుట కష్టముమరదలా
తోటలోకి వస్తే ముద్దులు కావాలని అంటావు బావా
బయటకువస్తేబజారులు తిరుగుదామ్ అంటావు బావా
23 పొదచాటున ఉండి తొంగి తొంగి చూడకు మరదలా
నీ పొంగులు చూసి కోగిలిలోకి రావాలుమ్ది మరదలా
తొందర పడకు నీ ఆసలను తీరుస్తాను బావా
మూడు ముల్లు వేసి నీ దానిని చేసుకో బావా
24 ఉల్లిపొరచీరలొఅందంచూపుతూఉడికిస్తునావుమరదలా
గాలిసవ్వడికిచీరకదలికలువళ్ళుజల్లుజల్లుగామరదలా
బలపం పట్టి పాటాలు నేర్పుతానులే ముద్దుల బావా
తాపములో ఉన్నావు దప్పిక తీర్చి సుఖమిస్తా బావా
25 ముద్దబంతిపువ్వులాఉండిముద్దివ్వనంటావుమరదలా
ముసిముసి నవ్వులతో మత్తెక్కిస్తున్నావు మరదలా
కసురుకున్న,వద్దన్న నాకు ఏదో కావాలంటావు బావా
నా సర్వస్వంనీకు ఆర్పిస్తాను తొండరేందుకు బావా
26 బావా మరదల మధ్య ఎడబాటు పెరిగింది
చిలిపికోరికలుమరువలేక భాధ మిగిలింది
నువ్వంటే నాకిష్టం,నేనంటే నీకీష్టంఏమైంది
వట్టి ఆకర్షణ అని ఒకరికొకరం తిరిగానంది
27 నన్నిలా ఉడికించావేందుకే, కవ్వించావేందుకే
నీ ప్రేమ పొందే అర్హత నాకు లేదన్నావెందుకే
అమ్మ నాన్నలను వప్పించే భాద్యత లేదనకే
నాప్రేమవద్దన్న,కన్నవాళ్లను మోసం చేయకే
28 నీమనసు నాదన్నావు, నామనసు నీదన్నావు
జీవితామ్తమ్ కలసి ఉంటాంఅని బాసలుచేశావు
ప్రేమే జఇస్తుందని నమ్మకంతో బ్రతకాలన్నావు
షరతులు పెట్టావు,ఆశలు రేపావు, తప్పుకున్నావు
29 రగులుతుంది మోగలిపోద, కావాలాంటుందికన్యయద
నీచుట్టూ తిరిగికావ్విస్తూ చేశాను తుమ్మెదలారొద
నామీద నీకు ప్రేమ ఉంటుందని ఆశించాను సదా
ప్రేమతోమంచంపైకి రమ్మంటావాని ఆశించాను కదా
30 నిన్ను చూడకుండా ఉండలేను, వదిలి ఉండలేను
కరిగిపోయే కలని, వెలసిపోయే చిత్రమనిఅనుకోను
నాహ్రుదిలొ నీవున్నావు, నీ మదిలో నేనుంటాను
వంటిపై పచ్చబొట్టుగా,విడిపోని బంధంలాఉంటాను
31 తీయని మాటలు విని గోతిలో పడ్డాను
చేతకానివాడిలా మూల పడి ఉన్నాను
విడిపోయామని మరచి వెతుకుతున్నాను
నీప్రేమకొరకు కన్నవాళ్లనుమోసం చేశాను
32 వెలిగుచూపే వలపుదీపమ్ఎందుకేనామీదకోపం
మనసులో నిను మరువలేక వెలుగుకలతదీపం
నీ మోముపై కుంకుమ పెట్టాలని ఆసాదీపమ్
నీవు నాకోరకు వెలిగించవే వలపు దీపం
33 నన్నేల విడనాడి పొతావని నేను అనుకోలేదు
కన్ను కన్ను కలిసాఈ కానీ ఒకటవ లేదు
నిన్నునేను మరువలేను అందుకే వదలలేదు
నీపెదవి నాపెదవి కలవండే నాకు నిద్ర రాదు
34 నిను వదలి నేను వెళుతున్నా నా మరదలా
నీతో కలిసిన జీవితము ఒక కలేగా మరదలా
నీ జ్ఞాపకాలతో జీవించాలని ఉంది మరదలా
నీవు దూరమైన మనసుదూరముకాదుమరదలా
35 గుండెలోని కోరికలన్ని గాలిలో కలసి పోవాలా
మనసులోని మమతలన్నీ మరచి పోవాలా
ఆశల రెక్కలతొ ఆరాధకుడిగా మారిపోవాలా
ప్రేమ సద్వినియోగం చేసుకొనే శక్తి రావాలా
36 ప్రియుడి సన్నిధిని చేరాలని తహతహ లాడవా
ని కోసం పారిజాత వృక్షం తెమ్మన్నా తానా
గగన సీమలొవిహరించాలని ఎప్పుడైనా అనుకోవా
నన్ను అవహేళన చేశావు పనికిరాని వాడినా
37 కొత్త దారి చూపావే చిలకా, నా అందాల పలకా
తుల్లి పాటలు పాడవే చిలకా, నా ముద్దుల గిలకా
గుండె సవ్వడి వినవే చిలకా, నామువ్వల మొలకా
హృదయ లోగిలిలోకి రావా చిలకా, నా పై అలకా
38 విరహముతో నీవు కుంగి పోవటం సమంజసమా
జడివానలో తడిసి తపనలు తగ్గించు కొందామా
వలపువరదలో వళ్ళుమరచిసుఖంగా విహారిద్దామా
మంచు తెరలలో, పూలపవలింపుపై నిద్ర పోదామా
చింత చిగురు చిన్న దాన, లేత వగరు వయసుదానా
చిగురురసంపిండి ఇవ్వనా,వయసుతగ్గ వలపందించనా
పనిపాటలుమానేసి నీచుట్టూతిరగనా, వలపుల జానా
చిలక పలుకులు పలికినా, కోఇలలా కూస్తూ ఉండనా

హరిః ಓమ్
5) శ్లోకము
స్వయంభు శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః !
అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః !!
తొమ్మిది పుణ్యనామముల తో శ్రీహరి ఈ పుణ్యశ్లోకము నస్తవనీయుడు.
40) పుష్కరాక్షః ఓం పుష్కరాక్షాయనమః
పుష్కరమనగా తామరపూవు. అట్టి నేత్రము గలవాడగుటచేత పుష్కరాక్షః అని భగవానుడు పిలువబడును. భారతీయ వేదాంత సంస్కృతిలో పద్మమునకు గల స్థానము మహనీయమైనది. పద్మము సౌందర్యమునకు, సౌకుమార్యమునకు ప్రసన్నతకు, ప్రశాంతికి చిహ్నము. పద్మము సంగరాహిత్యమును తెలుపును. తామర జలములలో సంగమమును బొందదు. సంగరాహిత్యమే జ్ఞానము. నిస్సంగము, నిర్లిప్తత, మహానుభావ చిహ్నములగుట చేతనే శ్రీమహావిష్ణువు తన హస్తమునందు పద్మమును ధరింౘుట కానవచ్చును. అంతమాత్రమేగాక భగవంతుడు పద్మమువలె " నిస్సంగుడు_ నిర్లిప్తుడు " అని తెలుపుటకే ఆయన అవయవములన్నియును పద్మముతోనే వర్ణింపబడుౘుండుట గమనార్హము. ఉదా:- పద్మనేత్రుడు, పద్మముఖుడు, పద్మనాభుడు, పద్మహస్తుడు, పద్మపాదుడు మున్నగునవి గమనింౘునది. ఇచ్చట. " పుష్కరాక్ష " నామము శ్రీహరియొక్క ప్రశాంత నేత్రములను సూచింౘును. ఆయన నేత్రములు ప్రేమామృత ప్రపూర్ణములు. కరుణారసభరితములు. ఆయన ౘల్లని ౘూపులచేత భక్తుల సకల తాపములను హరింౘును గాన భగవానుడు పుష్కరాక్షుడుగా కీర్తింపబడును. ఈ ఈనామముయొక్క పర్యాయ పదములే ముందు రానున్న నామము లే గూడా పాఠకులు ౘూడగలరు.
41) మహాస్వనః ఓం మహాస్వనాయనమః
" స్వన " మనగా " ధ్వని " లేక " నాదము " అనియర్థము మహాస్వనుడనగా గంభీరమగు దివ్య నాదస్వరూపుడని భావార్థము ప్రతిమానవుని హృదయకుహర మందును దివ్యనాదమును
గావింౘువాడు పరమేశ్వరుడే గదా. " స్వన " మనగా నిశ్శ్వాసమనియును అర్థము. చతుర్వేద ములును భగవానునియొక్క నిశ్వాసములుగా చెప్పబడి యున్నవి. (బృహదారణ్యకము 4_4_10) వేదస్వరూపుడగుట చేతను_ వేదప్రియుడగుట చేతను శ్రీహరి మహాస్వనః అను నామమున ప్రసిద్దుడాయెను. ఈ నామము వేదగానమును ప్రోత్సహింౘుౘున్నది.
42) అనాదినిధనః ఓం అనాదినిధనాయనః
ఆది (జననము). మఱియు నిధనము (నాశనము) లేనివాడగుట చేత భగవానుడు " అనాదినిధనః " అని పూజనీయు డగుౘున్నాడు. జననమరణ రహితుడు _ ఆద్యంత శూన్యుడని భావము.
--((**))--
మొదటి భార్య(అనువాద కథ)
సాహితీమిత్రులారా!
కాలేజినుండి తిరిగొస్తుండగా వర్షం బలపడి, చివరి ఫర్లాంగ్ లో ముద్దగా తడిసిపోయింది రాజ్యలక్ష్మి. ఇది చాలదన్నట్టు రయ్యిమని పోతున్న సిటీబస్సొకటి బురద నీళ్లని వంటిమీద చిమ్మేసిపోయేసరికి ఇల్లు చేరేసరికి కోపం నషాళానికంటింది. పాలవాడు రాలేదు. మేనక ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంట్లో టెలిఫోన్ ఆగకుండా మోగుతోంది. అమె కళ్ళల్లో కోపం తాండవిస్తోంది. గుప్పిళ్ళు బిగించడంతో, రక్తం స్థానచలనం చెంది మణికట్టు పాలిపోయింది.
రాజ్యలక్ష్మీ, కోపాన్నితగ్గించుకో. లేకపోతే బ్లడ్‌ప్రెషర్ తగ్గదు. పాలురాకపోతే పోనీ? మేనక లేట్ గా వస్తే రానీ? ఫోన్ అలా మోగి చావనీ..
మేనక భయపడుతూ సైకిల్ దిగింది.
రాజ్యలక్ష్మి కోపాన్ని ఇంకా పెంచింది. ఆ అమ్మాయి వేసుకున్న పాంటూ, గుండీలూ ఎగాదిగా పెట్టుకున్న షర్టు!
“ఎప్పుడొచ్చావమ్మా?”
“ఫోన్ మోగుతోంది.. తలుపు తియ్యి” అదిలించింది.
“ఈజీ మమ్మీ!”
“సరే పోవే.. తలుపు తియ్యి ముందు.. తర్వాత పెద్దవాళ్ళకి పాఠాలు చెప్దువుగానీ”
“లుక్ అట్ దిస్! నేనేం పాఠాల్చెప్పానని?”
తలుపు తీసి ఫోనుకోసం పరుగెట్టి తీసేలోపు మూగబోయింది.
“ఛా..”అని అసహనంగా సోఫాలో కూలబడింది.
“రిలాక్స్ అమ్మా! ముందు ఆ తడిచీర మార్చుకుంటావా?” అంది.
అంత కోపంలోనూ నల్లత్రాచులాంటి పొడవైన మేనక జడ రాజ్యలక్ష్మిని భయపెట్టింది. పెళ్ళి చెయ్యాలి. మంచి అబ్బాయిని చూసి.. నా మొగుడి లాంటివాడు కాకుండ.
ఫోన్ మళ్ళీ మోగింది. మేనక తీసింది.
“……?”
“రాంగ్ నంబర్” అంది.
అవతలివాళ్ళు మళ్ళీ ఏదో అడిగారు. మేనక, “అవును.. నంబర్ కరెక్టే. మీకెవరు కావాలి?”
“……?”
“మిసెస్ రామచంద్రన్ అని ఎవరూలేరిక్కడ”
“తప్పుకోవే..”అని ఫోన్ లాక్కుంది రాజ్యలక్ష్మి…
“ఎవరమ్మా మిసెస్ రామచంద్రన్?”
“రామచంద్రన్ మీ నాన్న పేరు” మేనకతో చెప్పి ఫోన్ అందుకోగానే రాజ్యలక్ష్మికి చేతులు వణికాయి.
“హలో… ఎవరు?”
“మిసెస్ ఏ.వీ. రామచంద్రన్ ఇల్లాండీ? నంబర్ ఇచ్చారు” అని వినిపించింది, మధ్యవయస్సు ఆడ గొంతులో.
“అవును. మీరు ఎవరు?”
“నేను ఎం.ఆర్. హాస్పిటల్నుండి మేట్రన్ ని మాట్లాడుతున్నాను”
“ఏంటి విషయం?”
“మీ హస్బెండ్ ఇక్కడ అడ్మిట్ అయ్యి, గత వారం రోజులుగా స్పృహలేకుండ పడి ఉన్నారు. అడ్మిషన్ రిజిస్టర్ లో అడ్రస్సూ ఫోన్ నెంబరూ ఉన్నాయి. చార్జీలేవీ ఎవరూ కట్టలేదు.. అందుకనే..”
“ఆయనకేమైంది?”
“త్రాంబోసిస్. స్పృహలేకుండ ఉన్నారు. టోమోగ్రఫి స్కాన్ తీయమని రాశారు డాక్టర్. అయితే, ఎవరూ డబ్బు కట్టలేదుకాబట్టి..”
మేనక రాజ్యలక్ష్మికేసి పరీక్షగాచూస్తూ ఉంది..
“అడ్రస్ చెప్పండి”
“ఎం.ఆర్. హాస్పిటల్ తెలియదా? పూందమల్లి హైరోడ్ లో ఈగా థియేటర్ దాటగానే…”
“రూం నెంబర్? ”
“పద్నాలుగులో పడుకున్నారు. వస్తున్నారా? క్యాష్ గా తీసుకొస్తే మంచిది.”
“ఎంత కట్టాల్సి ఉంటుంది?”
“సుమారు పదిహేడు వందలు”
“సరే.. వస్తాను” అంది రాజ్యలక్ష్మి.
“ఎవరమ్మా?”
“మీ నాన్న”
“ఏంటట?”
“హాస్పిటల్లో స్పృహలేకుండ ఉన్నారట”
“అయితే?”
“డబ్బులు కట్టాలంట.. డిస్చార్జ్ చేయించుకుని..”
“ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎవడు వాడు? వాడిగురించి నీకు ఫోన్ చెయ్యడం ఏంటి?”
“వాడు వీడు అని అనకు.. ఎంతైనా మీ నాన్న”
“నో మమ్మీ, నో… ఆ మనిషి నిన్ను వదిలేసి ఎన్నేళ్ళైంది?”
అప్పుడు మేనక మూడేళ్ళ పాప.
“వాడి ముఖం కూడా తెలీదమ్మా. నిన్ను దిక్కులేనిదానిగా వదిలేసి.. ఎవతితోనో.. దాని పేరేదో చెప్పావే.. ఏంటి?”
“పునీతవల్లి”
రాజ్యలక్ష్మి తడిచీర మార్చుకుని, గబగబా తలదువ్వుకుని, పర్స్ లో డబ్బులు లెక్కపెట్టి, చెక్ బుక్ తీసి దగ్గర పెట్టుకుంది.
“మా, నేను చెప్తున్నది వినిపించట్లేదా?”
“ఏంటి?”
“అక్కడికి వెళ్తున్నావా?”
“అవును. నువ్వు కూడా వస్తున్నావు!”
“నో వే! అది ఈ జన్మలో జరగదు”
“మేనకా, ఈ చర్చలూ వితండవాదాలూ తర్వాత చెయ్యొచ్చు. ఇప్పుడు నాతో రావలసిందే. లోపలికొచ్చి చూడకపోయినా పరవాలేదు. హాస్పిటల్ వరకు రా”
“మమ్మీ, నీకు పిచ్చిపట్టిందా?”
పవుడర్ పూసుకుంటూ నుదుటిబొట్టుని కాస్త పెద్దది చేసుకుంటూ, “చూడు, మీ నాన్నో, నా మొగుడో కాదు ఒక స్ట్రేంజర్ అనుకుందాం..”
“మమ్మీ, యూ ఆర్ అన్‌బిలీవెబుల్! భారత నారి! ఏంటీ మదరిండియా వేషం?– పదిహేనేళ్ళుగా పట్టించుకోని వెధవకి”
“అంతకు ముందు పదిహేనేళ్ళుగా పరిచయం!”
“ఇది పిచ్చితనమే. నేను భరత్ కి ఫోన్ చేసి చెప్తాను”
“తర్వాత చెప్పొచ్చు. వస్తున్నావా, నేనొక్కదాన్నే వెళ్ళనా?”
ఆటోలో వెళ్తుండగా ఆగకుండ కురిసే వర్షానికి కాళ్ళ దగ్గర చీర కొంచం తడిచింది.మిట్లపల్లాలలో ఆటో కుదిపేస్తోంది, వర్షపు హోరు మధ్యలో మేనక చిరాగ్గా సణుగుతూనే వచ్చింది.
“అలాంటి మనిషికి ఇలాంటి పెళ్ళాం”
“వాగుడాపు. వెళ్ళి పరిస్థితేంటో కనుక్కుందాం ముందు”
“చచ్చుంటాడు. ఖాళీ గ్లాసు”
ఎందుకోసం అతన్ని చూడాటానికి వెళ్తున్నాను? నన్ను పెట్టిన హింసలకి, చేసిన ద్రోహానికి భగవంతుడు ఇచ్చిన శిక్షని స్వయంగా చూసి ఋజువు చేసుకోవాలనా? లేకుంటే, అపకారం చేసినవారు సిగ్గుపడేలా ఉపకారం చెయ్యడానికా.. ఎందుకిలా తాపత్రయపడిపోతున్నాను? ఎందుకని పదిహేనేళ్ళుగా చూడని భర్తకోసం వెళ్తున్నా?
“ఈ ఉత్తరం ఎవరు రాశారు? ”
“చదివావుగా.. చివర్లో ఏం రాసుంది – పునీతవల్లి అనేగా? ”
“ఎవరీ పునీతవల్లి?’’
“ఎవరైతే నీకేంటి?”
“ ఫ్రెండా?”
‘ఇప్పటికి అంతే’
‘తర్వాత?’
‘పెళ్ళి చేసుకునే చాన్స్ ఉంది.’
‘ఇలా గుండెల్లో పొడిచినట్టు తాళికట్టిన పెళ్ళానికే సూటిగా చెప్తున్నారు.. సిగ్గులేదూ? ఇదేమైనా న్యాయంగా ఉందా? మీకు నేను ఏం తక్కువ చేశానని?
‘ఏం తక్కువ చెయ్యలేదు రాజి.’
‘మరి ఇదేంటి?’
‘అదొక అవసరం రాజీ. నీకు చెప్పినా అర్థం కాదు. నీకు ఎలాంటి లోటూ లేకుండ..’
‘మీ నాన్నకి టెలిగ్రాం ఇచ్చి పిలిపించండి’
‘వెంటనే రప్పిస్తాను. నాకేం భయంలేదు’
‘నాకు దిక్కు లేదు, ధైర్యం లేదు, చదువు లేదు, సమర్థత లేదు.. ఒక ఉద్యోగం సద్యోగం చేసే వీల్లేదనేగా మీరిలా చేస్తున్నారు’
‘బీ రీజనెబుల్. దీనివల్ల నీకేం ఇబ్బంది రాదు. నీలో లోపం ఉందని కూడా నా ఉద్దేశం కాదు. ఎంతోమంది ఇద్దరు పెళ్ళాలతో సంతోషంగా ఉన్నారు, తెలుసుకదా? ఏడుకొండలవాడే శ్రీదేవి, భూదేవి అని..’
‘దీనికి నేనొప్పుకోను’
‘ఐనా ఇప్పుడు ఎవరు పెళ్ళి చేసుకుంటానన్నారు? మాటవరసకన్నానంతే. పిచ్చిదానా… వెళ్ళు, మొహం కడుక్కుని గుడికెళ్ళిరా..’
‘దయచేసి నాకు ద్రోహం తలపెట్టకండి. నాకు అమ్మానాన్నలు లేరు. అన్నయ్య ఇంట్లో నాకు చోటు లేదు. ఒంటరిగా ఈ సమాజంలో జీవించలేను. ప్లీజ్! నన్ను వదిలెళ్ళకండి.’
‘చీ, అలా ఏం జరగదు. పైకి లే.. కాళ్ళు పట్టుకోకు!’
మేనక రిసెప్షన్ లో ఉంటాను అంది. “నేను ఎవరినీ చూడాలనుకోవట్లేదు. అర్ధగంట సేపు కూర్చుంటా, అంతే” అంది.
“ఎక్కడికీ వెళ్ళకే బంగారం. ప్లీజ్, ఈ ఒక్క రోజు నా మాట విను”
“ఏడవకు, వెళ్ళు”
14వ నంబర్ గదిని చేరుకుంది రాజ్యలక్ష్మి. ఫ్యాన్ గాలికి ఊగుతున్న తెల్లని తెరకి అవతల, డ్రిప్ పెట్టి దుప్పటి కప్పిన మనిషి పడుకుని ఉన్నాడు. నోట్లో ట్యూబ్ పెట్టి ఉంది. గదిలో ఇంకెవరూ లేరు. రాజ్యలక్ష్మి బెడ్ దగ్గరకి వెళ్ళింది. తనకి తెలీకుండానే కళ్ళు చెమర్చాయి రామచంద్రన్ ని చూడగానే. వారంరోజుల మాసినగడ్డం. ఇంజెక్షన్ కోసం చాలా చోట్ల పొడిచిన గాయాల్లో రక్తపు మరకలు నల్లగాకనిపిస్తున్నాయి. నోరు తెరచుకుని ఉంది. ఊపిరి పీల్చుకునే శబ్దం వినిపిస్తుంది. కళ్ళు మూసుకుని ఉన్నాయి.
‘ఈ ముఖమా.. ఈ ముఖమేనా.. ఇతనేనా నన్ను తరిమేసిన భర్త?’
‘నేను ఎక్కువ రంగా? నువ్వు ఎక్కువ రంగా? చెప్పు?’
‘మీరేనండి. సందేహం దేనికి.’
‘చిన్నతనంలో చెవులకి పోగులేసుకుని.. సాగిపోయుంటాయి వజ్రాల బరువుకి. మా నాన్న పాపనాశం మైనర్. పేరుగాంచిన సరసుడు. వెయ్యి ఎకరాలు కరిగించేశాడు.’
“వచ్చేశారా?” అన్న మాట వినిపించి తిరిగింది. ఒక నర్స్ పరుగుకీ నడకకి మధ్య స్థాయిలో లోపలికొచ్చింది. ఆవిడ గర్భవతిలా ఉంది.
“ఇతనే.. ఇతనే..”
“మీరేనా అతని భార్యా?”
“అవునండీ”
“రాజ్యలక్ష్మి అంటే మీరేగా?”
నర్స్ చార్ట్ తీసుకుని చేయిపట్టుకుని గడియారం చూసుకుంటూ నిలబడింది.
“ఇప్పుడెలా ఉంది?”
“డాక్టర్ చెప్తార్లెండి. అయినా, వారం రోజులుగా ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎవరో ఏంటో ఎలా తెలుస్తుంది మాకు? టోమోగ్రఫి స్కాన్ తీయాలని న్యూరాలజీ ఎన్.ఎస్. అరుస్తున్నారు”
“ఇప్పుడు పరిస్థితేంటి?”
“అదే చూస్తున్నారుగా. బెడ్‌సోర్స్ రాకుండ చూసుకుంటున్నాం అంతే”
“మాట్లాడుతారా?”
“గుండెలమీద కొంచం అదిమిపెట్టి రుద్దితే కళ్ళు తెరుస్తారు. ఆవిడ ఎవరు? ఈయన్నిక్కడ అడ్మిట్ చేశారే?”
రాజ్యలక్ష్మి జవాబివ్వలేదు.
“డిస్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్ళిపోవడం మంచిది. ఇక్కడ రోజుకి రెండువందలా యాభై అవుతుందిగా?”
“రామూ సార్” అని బలవంతంగా రామచండ్రన్ ని చాతిపైన గట్టిగా రుద్ది కదిలించింది నర్స్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.
“నేను వచ్చాను” అంది రాజ్యలక్ష్మి.
“దిండు మార్చేద్దామా?” అడిగింది నర్స్.
కళ్ళు చెమర్చాయి. చిక్కిపోయిన చేతులు పట్టుకుంది.
“రాజీని వచ్చాను” అంది.
కళ్ళు ఆమెను గుర్తుపట్టే ప్రయత్నం చేశాయా, గుర్తుపట్టాయా, గుర్తుపట్టాక దుఃఖించాయా.. ఏదీ స్పష్టంకాకుండానే మళ్ళీ మూసుకున్నాయి.
“మాట్లాడగలరా?” నర్స్ వైపు చూసి అడిగింది.
“లేదండి. మాటలు, కదలికలు ఏం లేవు. లంబార్ పంక్చర్ చేసినప్పుడు రక్తం క్లాట్ అయ్యి గడ్డలుగా ఉంది.”
“ఆహారం..?”
ఆన్నీ ట్యూబ్ ద్వారానేనండి. ఎన్.ఎస్. వచ్చాక అడగండి. డిస్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళి ఒక నర్సుని పెట్టుకోవడం మంచిది.”
“వాళ్ళు ఎవరూ రాలేదా?”
“ఎవరు? అడ్మిట్ చేసెళ్ళారు అంతే. ఒక తెల్లటి వ్యక్తి ఆవిడతో వచ్చాడు. వాళ్ళలోవాళ్ళే మాట్లాడుకున్నారు. ‘దాన్ని రమ్మని అప్పజెప్పేయ్’ అని వాదులాడుకున్నారు. వాళ్ళతో మేము కాస్త కటువుగా కూడా మాట్లాడాల్సివచ్చింది.. ఆవిడ పేరేదో చెప్పింది. రామూ రామూ అని పిలుస్తూనే ఉది.”
“పునీతవల్లి”
“ఇద్దరు భార్యలా? రామూ సార్, మీరు గొప్పోళ్ళండి” అని రామచంద్రన్ చెంపలమీద మెల్లగా తట్టింది నర్స్. తల కాస్త ఊగింది.
“మీరు మొదటి భార్యా?”
“అవును”
“ఎన్నాళ్ళనుండి ఇలా?”
రాజ్యలక్ష్మి ముఖం పక్కకి తిప్పుకుని మెల్లగా ఏడవసాగింది.
“ఎన్.ఎస్. వచ్చే టైం. ఏడవకండి. కోప్పడతారు”
కళ్ళు తుడుచుకుని “కింద నా కూతురు ఉంది, పేరు మేనక. రమ్మని చెప్తారా?”
“వార్డ్ బాయ్ తో కబురు చేస్తాను. డిస్చార్జ్ చేసికుని తీసుకెళ్ళిపోండి… ఖర్చుతగ్గుతుంది. నాకెందుకో పెద్ద నమ్మకం లేదు. బ్రెడ్ ఏమైనా కావాలంటే చెప్పండి”
“ఇతనా మా నాన్న?” అన్న మాటలు విని వెనక్కి తిరిగింది. అక్కడ మేనక నిల్చుని ఉంది.
“ఇతనేనా ఆ మనిషి?”
“గట్టిగా మాట్లాడకండి. పక్క గదుల్లో పేషెంట్లున్నారు. ఆమ్మాయీ, నువ్వు ఇతని కూతురివా?”
“నాకూ ఇప్పుడే తెలిసింది. మమ్మీ చూసేశావుగా? ఇక వెళ్దామా? లేట్ అయితే ఆటోలు, బస్ లు ఏవీ దొరకవు”
“ఉండు మేనకా. డాక్టర్ వస్తున్నారట. ఒకసారి కలిసి….”
“కలిసి..?”
“పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలిగా?”
“మమ్మీ, మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. నేను కింద రిసెప్షన్ లోఎన్‌క్వైరీ చేశాను. మూడు రోజులకి పేమెంట్ చేశారట. ఆ తర్వాత ఎవరూ రాలేదట. బాలెన్స్ ఇంకా పదిహేడు వందలు ఉంది. ఆది కడితేనే డిస్చార్జ్ చేస్తారు.”
“డబ్బు పెద్ద విషయం కాదు మేనకా”
“ఆవిడ వచ్చారా?” అని నర్స్ ని అడిగింది రాజ్యలక్ష్మి.
“చెప్పాను కదండి. మొదటి రోజు వచ్చారు. ఇద్దరూ ఏవేవో వాగ్వాదం చేసుకున్నారు. తర్వాత ఎవరూ రాలేదు ఇక్కడికి”
“వాళ్ళ అడ్రస్ ఉందా?” మేనక అడిగింది.
“రెజిస్టర్ లో లేదు”
“రెజిస్టర్లో మన అడ్రస్, ఫోన్ నంబర్ అంతా కరెక్ట్ గా ఇచ్చారమ్మా. క్లెవర్ గాచేశారంతా. ఆ పునీతవల్లి ఎక్కడుంటుందో తెలుసుకోవాలిప్పుడు”
“మైలాపూర్ లో ఎక్కడో. ఇప్పుడు ఎందుకు తెలుసుకోవడం?”
“ఎందుకంటావేంటి? ఈ మనిషిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి గుమ్మందగ్గర పడేసి రాడానికి”
“ఏంటి మేనకా?”
“అవునమ్మా. చెప్తున్నా విను. వీడ్ని ఇంటికి గింటికి తీసుకురావాలన్న ఆలోచనేమైనా ఉంటే ఈక్షణమే మానుకో. దొంగతనంగా మన ఇంటి అడ్రస్ ఇచ్చేసి మనమీద బాధ్యత వేసి ఎలావెళ్ళిపోతారు? దిస్ ఈజ్ నాట్ ఆన్.”
“మేనకా, ఈ సమయంలో వీటన్నిటి గురించి ఆర్గ్యూ చెయ్యడం అనవసరం అనిపిస్తుంది” అని నర్స్ వంక ఓర కంట చూస్తూ అంది రాజ్యలక్ష్మి.
“ఆర్గ్యూమెంట్కి కూడా ఆ ప్రసక్తే లేదు సిస్టర్. ఈ మనిషి మా అమ్మని ఎలా ట్రీట్ చేశాడో తెలుసా? మా అన్నయ్య భరత్ చెప్పాడు. అప్పుడు నాకు మూడేళ్ళట. వర్షంలో నిజంగానే సినిమాలో చూపించినట్టే వీధిలోకి తోసేసి తలుపేశాడట. ఒక మెడికల్ షాపులో వర్షం ఆగేంతవరకు తల దాచుకున్నామట. రాత్రి తిండిలేదు. వీళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళి తలుపు తడితే అతని పెళ్ళాం తలుపు తియ్యకుండానే వెళ్ళగొట్టిందట. ఇదంతా ఇమేజిన్ కూడా చేసుకోలేరు మీరు. రా మమ్మీ, వెళ్దాం.”
“అవునా రామూ సార్, అలాంటి మనిషివా నువ్వు?” అని నర్సు అతని చెంపమీద తట్టింది. అనువుగా తల ఆడించాడు.
“ఏ ధర్మం ప్రకారం ఈ మనిషిని మేం తీసుకెళ్ళాలో చెప్పండి”
“ఇప్పుడు ఇతను వేటికీ జవాబిచ్చే స్థితిలో లేడు. ఒక బస్తాలాగ ప్లాట్ఫారమ్మీద వదిలేసినా పడివుంటాడు అంతే”
“చెవులువినిపిస్తాయా?” – మేనక చార్ట్ చూసింది. బోలెడన్ని పేపర్లు, పది రోజుల చరిత్ర రాసుంది. సెరిబ్రల్ త్రాంబోసిస్.. ఎంబాలిజం అని ఏవేవో.
“వినిపించదు” – నర్స్ ఉన్నట్టుండి మాటలాపి చీఫ్ డాక్టర్ వస్తున్నట్టు సైగ చేసింది.
చీఫ్ డాక్టర్ కి పెద్ద వయసేమీ ఉండదు. ముప్పైఐదు ఉండచ్చు. తెల్లకోటు జేబు పక్కన ‘జీ. ఆర్. గోపినాథ్’ అని ఉంది. “హలో! అట్లాస్ట్ సంవన్.. ఏంటమ్మా ఈ మనిషిని అలా వదిలేసి వెళ్ళిపోయారు?”
“ఈమె మొదటి భార్య డాక్టర్”
“ఎవరైతేనేం రోజూ ఎవరో ఒకరు చూసుకోవాలి. అండర్స్టాండ్? మీరు డాటరా?”
మేనక తలూపింది.
“లుక్ యంగ్ లేడీ. యువర్ ఫాదర్ ఈజ్ రియల్లీ సిక్. కంట్రోల్ చెయ్యలేని డయాబెటీస్. హైపర్ టెన్షన్, ఆర్టీరియల్ తికెనింగ్, త్రాంబోసిస్ – బ్లడ్ క్లాట్ అయింది. అఫేషియా ఉంది. అన్ని కలగలిపి ఒక పక్కన అంతా పెరాలిసిస్ వచ్చేసింది. చాలా క్లాట్స్ ఉన్నాయి. అన్నిట్నీ కరిగించడానికే ఆపకుండ మందులిస్తున్నాము. ఒక సీ.టీ. స్కాన్ తీయాలి. ఎంత డామేజ్ అని తెలుసుకోడానికి.. ఇతని తాలూకువాళ్లు ఎవవరనిచూస్తే, అడ్మిట్ చేసినవాళ్ళు అసలు కనిపించట్లేదన్నారు. విచిత్రంగా ఉంది!”
“నేను చెప్తాను డాక్టర్”
“మేనకా, నువ్వూరుకో. డాక్టర్, ఇతని ప్రాణానికి ప్రమాదమా?”
“అలా ఏంలేదు. బెడ్ సోర్ లేకుండా చూసుకుని, మందులతోబాటు పూటపూటకీ ఆహారం పెట్టామంటే, పదిరోజుల్లో కొన్ని ఫేకల్టీస్ ని వెనక్కి తెచ్చుకోవచ్చు. లేచినడవలేకపోయినా రైట్ హ్యాండ్ కంట్రోల్లోకి వస్తుందని నమ్మకం ఉంది.
“డాక్టర్, దిస్ బాస్టర్డ్ ట్రీటెడ్ మై మదర్ లైక్ షిట్” అని చెప్పడం మొదలుపెట్టిన మేనకని నెమ్మదిగా తిరిగి చూసి, “లుక్ ఈ మనిషి నా దృష్టిలో ఒక పేషెంట్. ఇతను పర్సనల్ లైఫ్ లో ఎలా ఉండేవాడన్నది నాకనవసరం. ఒక హంతకుడు బెయిల్ మీద వచ్చినా నేను ఇదే ట్రీట్మెంట్ ఇచ్చేవాణ్ణి. నాకు ఇతను ఒక పల్స్, ఒక ఊపిరి, ఒక ఎక్స్రే, ఒక స్కాన్ ఇమేజ్, ఒక సిండ్రోం.. అంతే”
“స్కాన్ అని ఏదో అన్నారు. అది తీయడానికి ఎంత ఖర్చవుతుంది?”
“ఆఫీసులో అడగండి, చెప్తారు. రేపు తీయొచ్చు. ఇతణ్ణి ఇంకో పది రోజులైనా ట్రీట్ చేస్తే స్పృహ వస్తుంది. ఇప్పటీకే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఛాతిపైన గట్టిగా రుద్దితే లేచి చూస్తాడు”
డాక్టర్, “రమచంద్రన్ వేక్ అప్ రామచంద్రన్. వేక్ అప్. ఎవరు వచ్చారో చూడండి, వేక్ అప్” అని మొరటుగా కదిపాడు.
“పది రోజుల తర్వాత తను మాట్లాడుతాడా?” అడిగింది మేనక.
“మాటలు రావడానికి కొన్ని రోజులు పట్టొచ్చు”
“చెప్పింది అర్థం చేసుకోగలడా?” రామచంద్రన్ రెప్పలు తెరచుకుని కనుబొమ్మలు కదిలాయి.
“ఇప్పుడే చూచాయగా అర్థం అవచ్చు. ఏంటి రామచంద్రన్, ఈ అమ్మాయెవరో, చెప్పండి. మీ డాటర్”
“అతను పదిహేనేళ్ళుగా చూడలేదు డాక్టర్”
“అవునా? ఎక్కడైనా అమెరికాలో ఉండేదా?”
“లేదు. అశోక్ నగర్ లో” అంది మేనక.
ఇప్పుడు మేనకని పరీక్షగా చూసిన డాక్టర్, “సారీ, పర్సనల్ ట్రాజెడీలా ఉంది. కోలుకున్నాక నిలదీద్దాంలెండి” అన్నాడు.
డాక్టర్ వెళ్ళగానే నర్స్, “ఇతనేనండి ఇండియాలోనే పెద్ద న్యూరో సర్జన్. ఎంత యంగ్ గా ఉన్నారో చూడండి.” మేనక వినిపించుకోకుండ “మమ్మీ, వెళ్దామా?” అంది.
“లేదు. రాత్రికి నేనిక్కడే ఉంటాను. నువ్వెళ్ళి నాకు బట్టలు తీసుకురా. కాలేజీకి ఫోన్ చేసి చెప్పేయ్ నేను రావట్లేదని”
ఏం చెప్తున్నదో వినకుండా మేనక తల్లిని ఆశ్చర్యంగా చూస్తూ నిలుచుని “దిస్ లేడీ ఈజ్ అన్ బిలీవెబుల్” అంది.
“సిస్టర్, ఈ మనిషి పెట్టిన వాత తాలూకు మచ్చ ఉంది మా అమ్మ భుజమ్మీద”
“మేనకా, ఎక్కువ మాట్లాడకుండ వెళ్తావా లేదా?”
మేనక, పడుకునున్న రామచంద్రన్ ని చూసి “చూడవయ్యా భారతీయ సంస్కృతి.. డిస్గస్టింగ్!” అంటూ విసురుగా వెళ్ళిపోయింది.
మేనక వెళ్ళగానే నర్స్ “ఈ వయసులో అర్థం కాదులెండి” అని తన కడుపు తడిమి చూసుకుంది.
రోజూ ఉదయాన్నే మేనక ఆటోలో అవిష్కార్ రెస్టారెంట్ నుండి అమ్మకి టిఫిన్, కట్టుకోడానికి బట్టలు తెచ్చి ఇచ్చి కాలేజికి వెళ్ళేది. సాయంత్రం వచ్చేప్పుడు కాఫీ, టిఫిన్ తీసుకొచ్చేది. తల్లికీ కూతురికీ మధ్య పెద్దగా మాటలు లేవు. రాజ్యలక్ష్మి మాత్రం “ఈరోజు కళ్ళు తెరచి నన్ను చూశాడు” అని చెప్పేది. “గుర్తుపట్టినట్టు ఉన్నాడు. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి!”
“మందుల రియాక్షన్ వల్ల అయుంటుంది మమ్మీ. నిన్నొకటి అడగాలి.”వాత మాట్లాడుకోవచ్చు. ముందు కోలుకుని లేచి నడవనీ”
“ఆ పునీతవల్లి గురించి ఏమైనా తెలిసిందా?”
“లేదు. ఆమె చేతులు దులుపుకుందనుకుంటాను”
“పీల్చిపిప్పి చేసి, ఈ మనిషిని అవతలకి ఉమ్మేసినట్టుంది. అది ఉమ్మేసినదాన్నిదాచుకుంటున్నావు మమ్మీ. నువ్వు ఏం నిరూపించుకోవాలని అనుకుంటున్నావు?”
“ఏం లేదు. మేనకా, ఏమీ నిరూపించుకోవాలని లేదు నాకు”
“ఇతను నిన్ను పెట్టిన హింసలన్నీ మరిచిపోయావా?”
“లేదు”
“మరెందుకు?”
“ఏదో ఒక అనాథకి చేస్తున్నా అనుకుంటున్నా. హ్యుమానిటీ అనుకోవచ్చు. దానికి తోడు పాత బంధం ఒకటుంది. అదేంటో మా జెనరేషన్ వాళ్ళకి అదొక తెగని బంధం అనిపిస్తుంది.”
“ఇన్‌క్రెడిబిల్ లేడీ” అని తల్లి దగ్గరకొచ్చి చెంపలు రాసుకుని వెళ్ళింది మేనక.
డాక్టర్ గోపినాథ్ ఊహించినట్టే ఎనిమిదో రోజు రామచంద్రన్ కి పూర్తి స్పృహ వచ్చి, కుడిచేయిని కదపడం వీలైంది. మనుషుల్ని గుర్తుపడుతున్నట్టు అతని చూపుల ద్వారా తెలుస్తోంది.
“నేనేవరో తెలుస్తోందా?” అంది రాజ్యలక్ష్మి.
కళ్ళల్లో నీళ్ళు కారుతుండగా తలమాత్రం ఆడించాడు.
“మాట్లాడలేరా?”
“మాటలు రావడానికి ఇంకా మూడు, నాలుగు రోజులు పట్టచ్చు”
అప్పుడే లోపలికొచ్చిన మేనకని చూసి డాక్టర్ నవ్వి, “మేనకా, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మీ నాన్నకి పూర్తి స్పృహ వచ్చింది. ఏవేవో అడగాలన్నావే? అడుగు. దిస్ మాన్ ఈజ్ లూసిడ్ నౌ.”
“సిస్టర్, ఈ రోజు వార్డ్ బాయ్ కి చెప్పి షేవింగ్ చెయ్యమనండి”
మేనక తండ్రిని కళ్ళార్పకుండ చూసింది.
“మాట్లాడుతున్నారా?”
“లేదు, అర్థం చేసుకుంటున్నారు. ఈమె ఎవరో గుర్తుపట్టారా?” నీళ్ళు తిరిగిన అతని కళ్ళు తేరిపారచూసి గుర్తుపట్టే ప్రయత్నం చేశాయి.
“మన మేనక! అప్పుడు మూడేళ్ళు. మీ కూతురు మేనక.. మేనక.”
రామచంద్రన్ కళ్ళు తన కూతుర్ని మెల్లగా చూపులతో తడిమాయి.
మేనక బెడ్ కి దగ్గరగా వచ్చి నిల్చుంది.
“చెప్పావామ్మా, ఎనిమిది రోజులుగా నువ్వు ఈయనకి చేసిన సేవలన్నీ? మలమూత్రాలతో సహా చూసుకున్నావని? చెప్పావా? నిన్ను నడివీధిలోకి గెంటేసినందుకు ఎలా మమ్మల్నిపెంచి పెద్ద చేశావో? చెప్పావామ్మా? ఎలా ఉద్యోగంలో చేరి మమ్మల్నిచదివించావో.. చెప్పమ్మా… ఈ మనిషికి బుద్ధొచ్చేట్టు చెప్పమ్మా!”
“మేనకా, అదంతా వద్దు. ఊరుకో”
రామచంద్రన్ చేయి మెల్లగా పైకెత్తి, మేనక చేతిలో వున్న నోట్ బుక్ ని చూపించాడు.
“ఏం చెప్తున్నాడు?”
“నోట్ బుక్ కావాలంటున్నాడు”
“పేపర్ కావాలని అడుగుతున్నట్టున్నాడు”
“ఏవైనా రాసిచూపించాలా?”
రామచంద్రన్ తలూపాడు. మేనక దగ్గర్నుండి నోట్ బుక్కూ పెన్నూ తీసుకుని అతని ఒడిలో పెట్టింది రాజ్యలక్ష్మి. రామచంద్రన్ వేళ్ళసందులో పెన్ను పెట్టగా, అతనుమెల్లగా రాశాడు.
“పునీతవల్లి ఎక్కడ?”
---------------------------------------------------------
మూలం: ప్రముఖ అరవ రచయిత సుజాత రాసిన “ముదల్ మనైవి” కథ,అనువాదం: అవినేని భాస్కర్, వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

- ఏ.వి.రమణరాజు
ఆదిక్షేప ప్రేమ లీల-
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఎప్పుడో ఇంకెప్పుడో మనం ఏకమయ్యే దెప్పుడో
ఎందుకో మరెందుకో మనం ఒక్కటయ్యే దెప్పుడో
ఒప్పుకో ఊపందుకో మనం సరిఅయ్యే దెప్పుడో
చెప్పుకో చెలిమికో మనం చేరువయ్యే దెప్పుడో
తప్పుకో తప్పించుకో మనం దగ్గిరయ్యే దెప్పుడో
అందుకో అందమంతా మనం వరుసయ్యే దెప్పుడో
ప్రేమతో ప్రేమించటం మనం సొంతమయ్యే దెప్పుడో
గుణంతో సేవించటం మనం పెళ్లి ఆయ్యే దెప్పుడో
ప్రేమను బతికించుకో
పెళ్లి బంధాన్ని పెంచుకో
జీవితాన్ని సార్ధకం చేసుకో
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఎప్పుడో, ఇంకెప్పుడో
నీ దరికి చేరేదెప్పుడో, స్వామీ!
త్రోవ తెలియని పథకుడై
తావినెఱుగని పూవునై
కలత మమతల
నేతలో పడి
వెతల పాలై పోతినయ్యా!
ఎప్పుడో, ఇంకెప్పుడో!
అణువు అణువున నీవనీ,
అందరందున కలవనీ
ఎందరెందరో చూసినామని
అందురయ్యా! ఎందుకో మరి?
నేనెంత వెతికిన
కానరావది శోదనా?
ఎందుకు నాకీ
అంతు తెలియని వేదన?
ఎప్పుడో, ఇంకెప్పుడో?
నీవే ఉన్నది నిజమైతే,
నేనే అందుకు ఋజువైతే
పదముల గతులను
తడబడనీయక
నా పథమును నీవే మార్చుకో!
నీ అక్కున నన్నూ చేర్చుకో!
అందుకో, చేయందుకో!
ఆదుకో, నన్నాదుకో!
ఎప్పుడు? ఇంకెప్పుడు స్వామీ?

No comments:
Post a Comment