(ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం ) అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
16. గగనతల, గగనకుసమ, గగనధ్యజ,
గజవాహన, గరుడవాహన, గణనీయ,
గజతుర, గజప, గానితవిశారద,
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
17. శ్రీకర:, శ్రీనిధి:, శ్రీమాన్ :
శ్రీవాస:, శ్రీవత్సవక్షా:, శ్రీమతావర :
శ్రీనివాస:, శ్రీవిభావన:, శ్రీ ధర :
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
18 పరమాత్మ:, పరంధామా:, పద్మనాభా :
ప్రభాత:, ప్రత్యర్ధన:, పురుషోత్తమ:,
ప్రజాపతి:, ప్రజాభవ:, పుండరీకాక్ష:,
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
నేటి సినిమా కామిడి యు ట్యూబ్ - చూడండి ఆనందించండి - భగవాన్ మాయ
నేటి శ్లోకం ?
నన్దామి మేఘాన్ గగనేऽవలోక్య
నృత్యామి గాయామి భవామి తుష్ట:
నాహం కృషిజ్ఞ పధికోऽపినాహం
వదంతు విజ్ఞా మమ నామధేయమ్
ఆకాశంలో మేఘాలను చూస్తే
నా మనసు వికసిస్తుంది.
నాట్యమాడతాను, పాటలుపాడతాను,
ఆనందం కలుగుతుంది.
నేను కృషీవలునికాను
పధికునికాను.
మీకు నాపేరు తెలిస్తే చెప్పండి
మయూరమ్
--((*))--
నేటి నేటి గీతం
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
నవ మోహిని రూపంలో కదిలిరా
నవరత్న వెలుగులతో కదలిరా
సుఘంద పరిమళాలతో కదలిరా
మనసుని రంజింప చేయుటకు కదలిరా
పరువం పదిలంగ గాలికి కదలాలి - చూపులన్నీ తరుణంతో కదలాలి
కురులు దొన్నె దొన్నెలుగా కదలాలి - సౌకుమార్యం తో మనసు కదలాలి
కుచ కుంభముల పట్టు కదలాలి - అధరంబులు అదిరిస్తూ కదలాలి
విధిశివాదులొచ్చి కదలాలి - కిరీటకోటి కాంతులు కదలాలి
నవ మోహిని రూపంలో కదిలిరా
నవరత్న వెలుగులతో కదలిరా
సుఘంద పరిమళాలతో కదలిరా
మనసుని రంజింప చేయుటకు కదలిరా
ఇంద్రుని వేయి కళ్ళు కదలాలి - తరువుల శాఖలు కదలాలి
వజ్రవైడూర్య వెలుగు కదలాలి - కర్పూరం భగ్గుమని కదలాలి
నింగి మేఘాలు అన్నీ కదలాలి - చకోర పక్షుల గుంపు కదలాలి
పృథ్వి పులక రింపుకే కదలాలి - పుప్పెడి రేణువులన్నీ కదలాలి
నవ మోహిని రూపంలో కదిలిరా
నవరత్న వెలుగులతో కదలిరా
సుఘంద పరిమళాలతో కదలిరా
మనసుని రంజింప చేయుటకు కదలిరా
కదులుతూ సౌందర్యాన్ని చూపి కదలాలి
- నిన్ను చూస్తె రెప్ప వాల్చక నా మనసు కదలాలి
- నిన్ను చూస్తె రెప్ప వాల్చక నా మనసు కదలాలి
తుషార బిందువులు చుట్టూ కదలాలి
- నీ మనసు నా మనసు ఒక్కటై కదలాలి
- నీ మనసు నా మనసు ఒక్కటై కదలాలి
నవ మోహిని రూపంలో కదిలిరా
నవరత్న వెలుగులతో కదలిరా
సుఘంద పరిమళాలతో కదలిరా
మనసుని రంజింప చేయుటకు కదలిరా
రా రా అంటూ ఆ ప్రేమ పిపాసి పాడగా - ఆమె నాట్య మాడలేక తన్మయత్వం ఒరగగా
ఈ పాటపై గాయకులు, సంగీత కళాకారులు తప్పులుంటే తెలపగలరు ఇది నా కవితా భాష్యము మాత్రమె
No comments:
Post a Comment