ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:
అందరి (ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం ) మా లక్ష్యం
4.
4.
చతుర్ధామములు : రామేశ్వర ధామం,బదరీనాథ్ ధామం, ద్వారక ధామం, జగన్నాథ్ ధామం
చతుర్వేదములు – ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అథర్వణ వేదము
చతుర్విధ ఆశ్రమాలు – బ్రహ్మచర్యం, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము
నాలుగు దిక్కులు – తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము
నాలుగు మూలలు – ఆగ్నేయము, ఈశాన్యము, నైరృతి, వాయువ్యం
చతుర్విధ బలములు – బాహు, మనో, ధన, బంధు
చతుర్విధ పాశములు – ఆశా, మోహ, మాయా, కర్మ
చతుర్విధ కర్మలు – ధ్యానము, శౌచము, భిక్ష, ఏకాంతము
చతుర్విధ దానములు – కన్యాదానము, గోదానము, భూదానము, విద్యాదానము
చతుర్విధోపాయములు – సామము, దానము, భేదము, దండము
చతుర్విధ ఫలములు/పురుషార్థాలు – ధర్మ, అర్ధ, కామ, మోక్ష
చతుర్విధ స్త్రీ జాతులు : 1.పద్మినీ జాతి. 2. హస్తినీ జాతి. 3. శంఖిని జాతి. 4. చిత్తినీ జాతి.
చతుర్విధ స్త్రీ గుణములు : 1. సందేహము, 2. భయము, 3. తెలియనితనము, 4. లజ్జ.
చతుర్విధ స్వభావములు : 1.బ్రాహ్మణ స్వభావము, 2. క్షత్రియ స్వభావము, 3. వైశ్యస్వభావము, 4. శూద్ర స్వభావము.
చతుర్విధ సంభవములు : 1.యజ్ఞము వలన వర్షం 2. వర్షమువలన అన్నము. 3. అన్నము వలన కర్మము, 4. కర్మము వలన మోక్షము.
చతుర్విధ లింగములు : 1.ఇష్టలింగము, 2. ప్రాణలింగము, 3. భావలింగము, 4. ఆత్మలింగము.
చతుర్విధయుగాంతములు : 1.కృతయుగము. .. శ్రావణ బహుళ అష్టమి. 2. త్రేతాయుగము,,,, కార్తీక బహుళ దశమి, 3. ద్వాపరయుగము…. మాధ బహుళ చతుర్థ, 4. కలియుగము…. మాఘ బహుళ నవమి.
చతుర్విధ బ్రహ్మ (మానస)పుత్రులు : 1.సనకుడు. 2. సనందుడు. 3. సనత్కుమారుడు. 4. సనత్సుజాతుడు.
చతుర్విధ బ్రహ్మచార్యులు : 1.గాయత్రీ బ్రహ్మచారి. 2. బ్రాహ్మణ బ్రహ్మచారి. 3. ప్రజాపత్య బ్రహ్మచారి. 4. బృహద్భహ్మచారి.
చతుర్విధ దుర్గములు : 1.గిరిదుర్గము. (పర్వతము) 2. వనదుర్గము. (వనము) 3. స్థలదుర్గము. (ప్రాకారము). 4. జలదుర్గము (సముద్రము)
చతుర్విధ జ్ఞాతులు : .సపిండులు, 2. సోదరులు, 3. సగోత్రులు, 4. సనాభులు
చతుర్విధ గణితములు : 1. సంకలితము., 2. ఉత్కలితము, 3. గుణహారము, 4. బాగహారము
చతుర్విధ కష్టములు : 1. శరీరిక కష్టము, 2. మానసిక కష్టము, 3. సామాజిక కష్టము, 4. అధ్యాత్మిక కష్టము
చతుర్విధ అలంకారములు : (స్త్రీలకు) కేశాలంకారము. 2.శరీరాలంకారము. 3. భూషణాలంకారము. 4. లేపనాలంకారము.
చతుర్విధ అగ్నులు : 1. బడబాగ్ని. 2. జఠారాగ్ని. 3. గృహాగ్ని. 4. దావగ్ని.
చతుర్విధ అంతఃకరణములు : 1. మనస్సు. 2. బుద్ధి. 3. చిత్తము. .4. అహంకారము.
చతుర్వర్ణదేవతలు : 1.బ్రాహ్మణులకు – శివుడు, 2. క్షత్రియులకు – విష్ణువు, 3.వైశ్యులకు.. లక్ష్మి, 4. శూద్రులకు .. గణపతి.
చతుర్లవణములు : 1.సైంధవము లవణము. 2. సావర్చము. 3. బిడాలవణము, 4. సముద్ర లవణము.
చతుర్దిశమూలలు : 1.ఆగ్నేయ మూల, 2. వాయువ్వ మూల, 3. ఈశాన్యమూల. 4. నైరుతి మూల.
కావ్యవృత్తి చతుష్టయము : 1.కైశికి. 2. అరభటి. 3. సాత్వితి. 4. భారతి.
స్త్రీజాతి చతుష్టయములు : 1. పద్మిని. 2. హస్తిని. 3. చిత్తిని. 4.శంఖిని
పురుషజాతి చతుష్టయము : 1. భద్రుడు, 2. దత్తుడు, 3. కూచిమారుడు. 4. పాంచాలుడు.
చతుర్విధ రధకులు : 1.మహారథుడు. 2. అతిరధుడు. 3. సమరథుడు. 4. అర్థరధుడు.
చతుర్విధ వ్యూహములు : 1.వాసుదేవ, 2. ప్రద్యుమ్న. 3. అనిరుద్ధ, 4. సంకర్షణములు
చతుర్విధ ప్రమాణములు : 1.ప్రత్యక్ష ప్రమాణము., 2. అనుమాన ప్రమాణము, 3. ఉపమాన ప్రమాణము, 4. శబ్దప్రమాణము
చతుర్విధ అభినయములు : 1.ఆంగికాభినయం 2. వాచికాభినయం 3. ఆహార్యాభినయం 4. సాత్త్వికాభినయం
చతుర్విధ కవిత్వములు : 1.చిత్ర కవిత్వము, 2. ఆశుకవిత్వము, 3. బంధ కవిత్వము, 4. గద్యకవిత్వము. నేటి గీతం
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
అబ్బో అబ్బో ఎంత మురిసి పోతున్నావే
ఎదమీటి ఏమీ ఎరగనట్లు ఉన్నావే
ఆ ఏమన్నావ్
అబ్బో అబ్బో ఎంత మురిసి పోతావు లేరా
ఎదమీటి ఏమీ ఎరగనట్లు ఉన్నావేమీరా
ఎనుదిరిగి చూడకుండానే ఎదో చెపుతావు
నవనీతమంటావు, నవ్వకుండా ఉంటావు
కన్నేపిల్లనంటావు, కన్నుగీటి పోతుంటావు
ముద్ద బంతులమోము చూపి వేనుతిర్గావు
అబ్బో అబ్బో ఎంత మురిసి పోతున్నావే
ఎదమీటి ఏమీ ఎరగనట్లు ఉన్నావే
ఆ ఏమన్నావ్
అబ్బో అబ్బో ఎంత మురిసి పోతావు లేరా
ఎదమీటి ఏమీ ఎరగనట్లు ఉన్నావేమీరా
ఎదలోపుల పులకింతను ఎగతన్నుతున్నావు
మగతనము మబ్బులా మదన పడుతున్నావు
నీవు సర్డుమని గాక సరసానికి రమ్మంటావు
ముసి ముసి నవ్వులతో నన్ను మాయచేస్తావు
అబ్బో అబ్బో ఎంత మురిసి పోతున్నావే
ఎదమీటి ఏమీ ఎరగనట్లు ఉన్నావే
ఆ ఏమన్నావ్
అబ్బో అబ్బో ఎంత మురిసి పోతావు లేరా
ఎదమీటి ఏమీ ఎరగనట్లు ఉన్నావేమీరా
మల్లెలన్ని కొప్పుకు చుట్టి మత్తు పెంచేస్తావు
ఉల్లిపొర చీరకట్టి ఉవ్విల్లూరించి ఉడికిస్తావు
వెన్నె లాడి ఎన్నునిమిరి వెన్నరాసి పోతావు
ముసిముసి నవ్వులాతో ముందు కొచ్చి పోతావు
అబ్బో అబ్బో ఎంత మురిసి పోతున్నావే
ఎదమీటి ఏమీ ఎరగనట్లు ఉన్నావే
ఆ ఏమన్నావ్
అబ్బో అబ్బో ఎంత మురిసి పోతావు లేరా
ఎదమీటి ఏమీ ఎరగనట్లు ఉన్నావేమీరా
అబ్బ అబ్బా తొందర పడకు ఆకలి తీరుస్తాలే
అబ్బో అబ్బో ఆవేశం తగ్గించుకొని ఉండవలే
అబ్బ అబ్బా తొందర పడనులే ఆకలి తీర్చవే
అబ్బో అబ్బో ఆవేశం తగ్గించుకొని ఉంటానులే
అబ్బో అబ్బో ఎంత మురిసి పోతున్నావే
ఎదమీటి ఏమీ ఎరగనట్లు ఉన్నావే
ఆ ఏమన్నావ్
అబ్బో అబ్బో ఎంత మురిసి పోతావు లేరా
ఎదమీటి ఏమీ ఎరగనట్లు ఉన్నావేమీరా
--((*))--
మీ రచనలు అమోఘం అద్భుతం.
ReplyDeleteమీ రచనలు ఆలోచనాత్మకంగా ఉండి మనుషులను మంచి దారిలో నడిచేలా ప్రేరేపిస్తున్నవి
ReplyDeleteB Ramesh kumar
PGT
APMS Gooty
ANANTAPUR district
AP