Saturday, 12 May 2018

Pranjali prabha -(14-05-2018)

 ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:  శ్రీ కృష్ణాయనమ: 
  (ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం ) 
అందించటమే  ప్రాంజలి ప్రభ లక్షణం 

నేటి కవిత - మాతృ దినోత్సవము


 ప్రాంజలి ప్రభ - నేటి జి .కే 
5.
పంచ లోహాలు – వెండి,ఇనుము, బంగారము,సీసము, రాగి
పంచ జ్ఞానేంద్రియాలు – శ్రోత్రం (చెవులు), త్వక్కు (చర్మం), చక్షు (కళ్లు), జిహ్వ (నాలుక), ఘ్రాణం (ముక్కు)
పంచ కర్మేంద్రియాలు – వాక్కు, పాణి, పాద, భగము, ఉపస్థ
పంచ విషయాలు – శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు
పంచ ప్రాణాలు – ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము
పంచ పాండవులు – ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు
పంచ భూతాలు – భూమి, ఆకాశము, వాయువు,జలము, అగ్ని
పంచ లింగాలు – పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగం
పంచమహాపాతకములు : 1.స్త్రీ హత్య. 2. శిశుహత్య, 3. గోహత్య. 4. బ్రహ్మహత్య. 5. గురుహత్య
పంచమత గ్రంధములు : 1.భగవద్గీత, 2. ధర్మపదము, 3. బైబులు, 4. ఖురానీషరీఫ్, 5. దివ్వగ్రంధము.
పంచభక్తులు : 1.పితృభక్తి, 2. రాజభక్తి, 3. గురుభక్తి, 4. దేశభక్తి, 5. దైవభక్తి.
పంచ పర్వముల కర్మలు : 1.కృష్ణాష్టమి. స్నానము. 2. కృష్ణ చతుర్ధశి. దానము. 3. అమావాస్య. తర్పణము. 4. పౌర్ణము. దేవతారాధన. 5. సంక్రాంతి. దేవోత్సవములు (పితృ కార్యములు.)
పంచ పత్రములు : 1.తులసి. 2. బిల్వము. 3.శమీపత్రము. 4. మాచీ పత్రము. 5. రుద్రజడ
పంచ పతివ్రతలు : 1.సీత. 2. సావిత్రి. 3. అనసూయ 4. ద్రౌపతి. 5. దమయంతి.
పంచనియమములు : 1.శౌచము, 2. సంతోషము, 3. తపస్సు, 4. స్వాధ్యాయము, 5. ఈశ్వరప్రణిధానము.
పంచధాతువులు :1.బంగారము, 2. వెండి, 3. రాగి, 4. కంచు, 5. ఇనుము
పంచ ధర్మములు : 1.జాతి ధర్మము. 2. ఆశ్రమ ధర్మము. 3. మత ధర్మము. 4. దేశ ధర్మము. 5. గుణ ధర్మము.
పంచదేవతలు : 1.మహాదేవతలు, 2. కర్మదేవతలు, 3. ఆజానజ దేవతలు, 4. పితృదేవతలు. 5. గందర్వలు.
పంచ జయతిధులు : 1.శుద్ధ ఏకాదశి. 2. ద్వాదశి. 3. త్రయోదశి. 4. చతుర్ధశి. 5. పౌర్ణము.
పంచగవ్యములు : 1.గోమూత్రము, (ఆవు పంచితము), 2. గోమయము (ఆవు పేడ) 3, గీక్షీరము (ఆవు పాలు) 4. గోదధి (ఆవు పెరుగు) 5. గోఘృతము (ఆవు నెయ్యి)
పంచక్షీర వృక్షములు : 1.మఱ్ఱి. 2. రావి. 3. జువ్వి. 4. మేడి. 5. గంగరావి.
పంచకావ్యములు : (తెలుగులో) 1. శృంగార నైషధము, 2. మనుచరిత్ర, 3. పారిజాతాపహరణము., 4 వసుచరిత్ర, 5. విజయవిలాసము.
సంస్కృతంలో: 1. రఘువంశము, 2.కుమార సంభవము, 3. శిశుపాలవధ 4.మేఘసందేశము, 5.కిరాతార్జునీయము
పంచ కషాయ వృక్ష ద్రవ్యములు : 1.జువ్వి. 2. రావి. 3. మోడి. 4. దిరిసెన., 5. మర్రి పట్ట.
పంచకళ్యాణి : (గుఱ్ఱమునకు వుండవలసినవి) 1. నాలుగు కాళ్ళు. 2. ముఖముపై తెల్లటి చుక్క. 3. తెల్లటి కుచ్చు తోక. 4. తెలుపురంగు వీపు. 5. తెలుపు రంగు మెడజూలు.
పంచకల్పములు : 1.మందారము. 2. పారిజాతము. 3. సంతానము. 4. హరిచందనము. 5. కల్పవృక్షము.
పంచ కర్మ సాక్షులు : 1.సూర్యుడు. 2. చంద్రుడు. 3. యముడు. 4. కాలము. 5. పంచ భూతములు
పంచకర్తల దేవేరులు : 1. బ్రంహపత్ని, సరస్వతి, 2. విష్ణుపత్ని… లక్ష్మి, 3. రుద్రపత్ని…. పార్వతి, 4. ఈశ్వరుని పత్ని…. ఉన్మని, 5. సదాశివపత్ని…. మనోన్మని.
పంచ ఋషులు : సానగ బ్రహ్మఋషి, సనాతన బ్రహ్మఋషి, అహభువన బ్రహ్మఋషి, ప్రత్నస బ్రహ్మఋషి, సుపర్ణస బ్రహ్మఋషి
పంచామృతములు : 1. నీరు. 2. పాలు 3. పెరుగు.4. నెయ్యి. 5. తేనె
మాతృపంచకములు :1.పెంచిన తల్లి, 2. గురువు భార్య, 3. భార్యను గన్న తల్లి, 4. తనను గన్న తల్లి, 5. అన్న భార్య.
పంచగంగలు : 1. గంగానది. 2. కృష్ణానది. 3. గోదావరి నది. 4. తుంగభద్ర నది. 5. కావేరి నది.
పంచమహాపాపములు : 1. బంగారము దొంగిలించుట. 2. సురాపానము. 3. బ్రహ్మహత్య. 4. గురుపత్నీగమనము, 5. మహాపాతకుల సహవాసము
పంచాంగములు : జ్యోతిషం ప్రకారం అందులోని ఐదు అంగములు. అవి………. 1.తిథి, 2. వారము, 3. నక్షత్రము, 4.యోగము, 5. కరణము.
పంచసూతకములు : 1. జన్మ సూకకము. 2. మృత సూతకము. 3. రజఃసూతకము. 4. అంటు (రోగ)సూతకము. 5. శవదర్శన సూతకము.
పంచసూక్తములు : (మతాంతరము) 1. పురుష సూక్తము. 2. దేవీ సూక్తము. 3. సూర్య సూక్తము. 4. వర్జన్యసూక్తము. 5. శ్రీసూక్తము;
పంచశుద్ధులు : 1.మనశ్శుద్ధి 2. కర్మశుద్ధి, 3. బాండశుద్ధి, 4. దేహశుద్ధి, 5. వాక్ శుద్ధి
పంచవిధ శకములు : 1. క్రీస్తు శకము. 2. విక్రమార్క శకము. 3. శాలివాహన శకము. 4. హిజరీ శకము. 5. ఫసలీ శకము.
పంచవిధ ధన వారసులు : 1. తాను. 2. తండ్రి. 3. తాత. 4. కొడుకు, 5. కొడుకు కొడుకు
పంచవిధ దేవతా పీఠములు : 1.పద్మ పీఠము. 2. శేషపీఠము. 3.కుముద పీఠము. 4. సోమ పీఠము. 5. భద్ర పీఠము.
పంచవాయువులు : 1.ప్రాణము. 2. అపానము. 3. వ్యానము. 4. ఉదానము. 5. సానవాయువు.
పంచ దోషములు : (అ.) 1. వ్యభిచారము, 2. విరోధము, 3. సత్ప్రతిపక్షము, 4. అసిద్ధి, 5. బాధ. [ఇవి హేతుదోషములు. చూ.


పంచహేత్వాభాసములు] (ఆ.) 1. కామము, 2. క్రోధము, 3. భయము, 4. నిద్ర, 5. శ్వాసము. (ఇ.) 1. మిథ్యాజ్ఞానము, 2. అధర్మము, 3. శక్తిహేతువు, 4. ద్యుతి, 5. పశుత్వము.
--((*))-

నేటి పద్యం -జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత. మల్లాప్రగడ రామక్రృష్ణ

మాత్రృదేవో భవ: అమ్మ పలుకులు మాకు దీవెనలు

పడి లేచుటే నీకు అనుభవాల ధైర్యం 
- అడుగులేస్తే తరుగును దూరం

పనిలో ఉంటే నీకు అనుకరాల మౌనం -
పనులుచేస్తే పెరుగును భారం

చిరునవ్వంటే నీకు తొలగిపోవు శోకం -
నటనచేస్తే కలుగును మోసం

సహనముంటే నీకు తెలుపుతుంది గమ్యం
తరుముకొచ్చే తరుణము భవ్యం


తల్లి పిల్లలకు తెలియ పరుస్తుంది మీ కర్మాను సారం మీ గుణ ప్రవర్తన మంచిగా  మార్చుకోండి. సుఖ దు:ఖ్హాల్లో పడి లేచే మనిఫికి నామాట నీకు కొండత ధైర్యాన్నిస్తాయి.  అడుగులు వేస్తే దూరం తెలియదు. అంతా నేనే చేయాలను కుంటే అందరి మౌనం తెలుసుకోవాలి, దానివలన కలుగును భారం. నిజ నవ్వు అయితే ఉండదు శోకం, అదే నటన అయితే కలుగును మోసం. నీకున్న సమయం నీలో సహనం ఉంటే నీకు ఎప్పుడు శుభం అన్న మాటలు అందరూ ఆచరిస్తే జీవితం సుఖం తల్లి మాటను ధిక్కరిస్తే జీవితమే నరకం - ఇదే లోకరీతి.    


1 comment:

  1. రామకృష్ణ గారు,
    లక్ష్మాజి ద్వారా మీ పత్రిక్ గురించి తెలిసింది. చదివాను. అమ్మ కధ, జ్ఞానం, విజ్ఞానం బావున్నాయి. ఎక్కడ ఉండెది మిరు. నా నంబరు. 6302072622.BHAGAVAN, MACHILIPATNAM.

    ReplyDelete