Friday, 11 May 2018

Pranjali Prabha -speach

 ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:  శ్రీ కృష్ణాయనమ: 
  (ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం ) 
అందించటమే  ప్రాంజలి ప్రభ లక్షణం 

నేటి విధ్యా వాణి

 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
ప్రాంజలి ప్రభ

నేటి విద్యా వాణి - 
ప్రాంజలి ప్రభ 
రామకృష్ణ మల్లాప్రగడ 

వాగీశాద్యా : సుమనస: సర్వర్దా నాముపక్రమే!
యం నత్వా  కృత కృత్యా స్స్యు: తం నమామి గజాననం !!

బ్రహాది దేవతలందరు ఏ దేవుని మీదట నమస్కరించి, తమ తమ పనుల యందు కార్యసిద్ధి కలవారై నారో అట్టి మహిమగల విఘ్నేశ్వరునికి నేను మొట్టమొదట నమస్కరిస్తున్నాను.        

శ్రీ మహాగణాధిపతయే నమ:

నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము 
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా

కృష్ణా నీవే నా తల్లివి, తండ్రివి, హితుడవు, నీడవలే వెన్నంటి ఉండే. వాడివి. గురువు, 

దైవం, అయిన వాడవు నా ప్రభువు నాకు ఆధారుడవు, నీవే అని నిజంగా నమ్మాను.
.
2. క// ధరణీ దిశ ప్రసారిత ;
          గురుకర నికరంబు లుడిచికొని దీర్ఘనిరం ;//
         తరగతి ఖిన్నుడ పోలెను;

          హరిదశ్వుడు విశ్రమించె నస్తాద్రిదరిన్


దీర్ఘనిరం తరగతిన్= ఎడతెగని నడక చేత //

ఖిన్నము =భేదము నొందినది //

ఖిన్నుడ పోలెను= అలసెనో అనునట్లు//
కరము =కిరణము ,చెయి


విరామము లేని సుదీర్ఘ గతిచేత అలిసెనో యనునట్లు ;సూర్యుడు భూమిపై చాపిన స్వీయ కిరణములనే చేతులను అస్తగిరిగుహ లోకి ముడుచుకొని విశ్రమించాడు .

--((*))--

   No automatic alt text available.
నేటి పద్యం - జీవన జ్యోతి 
ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకిష్ణ 

ఘనమైన నీ చరితంబు లెరుగరు - సమ పాలక సమా వర్తుడవని

కరుణా రసా సమభావ లెరుగరు - విధి పాలక ధర్మా తత్వుడవని

మరణా ఋణాల సహాయ లెరుగరు - ‌‌‌‌‌హిమ వాసిగ జీవా బధ్ధుడవని

సమయా సమవర్తనంబు లేరిగియు - నిజ ప్రాణము  హరిం చేర్చుయెపని  



ఇది ఒక యమధర్మ రాజు గురించి నా ఆలోచన భావము.  ఓ సూర్య పుత్రా నీ ఆలోచనా భావములు ఎరుగని ఈ మనుష్యులు  సుఖముగా ఉన్నప్పుడు గుర్తుకు రారు, ఎప్పుడు అనారోగ్యము పాలైనప్పుడు  భగవంతుని ప్రార్ధించాలని ప్రయత్నిస్థారుకాని నిన్ను గుర్తించరు. నివు సమపాల కర్తవని, సమపాల భర్తవని,  విధి పాలక ధత్ముడవని, మరణ సహాయకుడవని, జీవులను నియమ భద్ధముగా వారి కర్మాను సారముగా తీసుకు వెల్లె వాడవని, జనన మరణాలకు నీవే కారకుడవని, నీ పనికి ఎవ్వరూ అడ్డుచెప్పలేని "యమధర్మ రాజువని "  నిన్ను తలవని వారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు - ఇదే లోకరీతి.  


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
పొట్టి పిచిక కథ’...(.చందమామ కధ.)!
మల్లాప్రగడ  రామకృష్ణ కధలు-25 
కొందరు తనలో విద్య లేక పోయిన, మాటల చాతుర్యముతో ప్రక్కవారిని నమ్మించి బ్రతుకుతారు, మంచి పాటలు పాడి కొందరిని నమ్మిస్తారు ఒక్కసారి ఈ పిచ్చుక కధ చదవండి మైక్ తెలుస్తుంది .
అనగా అనగా ఒక ఊళ్లో కుంచమంత బ్రాహ్మడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్నచేను వేసుకున్నాడు. అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయటం మొదలు పెట్టే వరకు రెండు భమిడిలేళ్లూ, రెండు వెండి లేళ్లూ వచ్చి రాత్రిళ్లు తినివేయటం మొదలు పెట్టినై. అవి తినిపోగా ఒకటీ అరా కంకి మిగిలితే మన పొట్టి పిచిక వచ్చి పగలు తిని వేస్తూ ఉండేది.

ఒకనాడు బ్రాహ్మణుడు పొలం వచ్చి చూసుకునే సరికి  చేనంతా ఈటుపోయి ఉంది. ఒకటీ అరా అక్కడక్కడ మిగిలిన కంకులు పిచ్చిక తింటూ ఉంది. పాపం బ్రాహ్మడికి ఏడుపు వచ్చింది. కోపం వచ్చింది. ఈ పిచ్చిక పని పట్టాలి అనుకుని బోయవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చు లేశాడు.

పాపం పొట్టి పిచ్చిక అది కాన కుండా వచ్చి ఉచ్చుల్లో చిక్కుకుంది. ఇంకేం, బ్రాహ్మడు ఎగిరిగంతేసి దాన్ని చంకలో పెట్టకుని ఇంటికి బయలుదేరాడు. ఇక మన పిచ్చిక ఊరుకుంటుందా? చంకలో కూచునే పాట ఎత్తకుంది!

కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ!
కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ!
రెండుభమిడిలేళ్లు గూ, గూ, గూ!
రెండు వెండిలేళ్లు గూ, గూ, గూ!
చేనుకాస్త మేశాయి గూ, గూ, గూ!
నేను కూడా తినబోతే గూ, గూ, గూ!
పొట్టివాడొచ్చాడు గూ, గూ, గూ!
పొంచిపొంచి చూశాడు గూ, గూ, గూ!
నన్ను పట్టుకున్నాడు గూ, గూ, గూ!

ఈ పాట వినేవరకు బ్రాహ్మడికి కోపం వచ్చింది. చంక బాగా బిగించాడు. ఊహూ, మన పిచ్చిక నోరు ముయ్యలేదు. మన బ్రాహ్మడు ఏం చేస్తాడూ? ఊళ్లోకి పోతే దీని పాటవిని అంతా నవ్వుతారు! అందుకని ఊరి బయట ఉన్న శెట్టిగారి అరుగు మీద కూచున్నాడు.

మన పిచ్చిక నోరుమూస్తేగా! పాడుతూనే ఉంది.

కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ!
కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ! అని.

 దీని పాటవిని శెట్టి బయటకి వచ్చి “ఏమండి శాస్త్రుల్లుగారు మీ జొన్నచేనెంతండీ?” అన్నాడు. బ్రాహ్మడు దోసిట చూపి “ఇంత!” అన్నాడు. “ఇంతేనా?” అన్నాడు శెట్టి. “కాదు!” అని బ్రాహ్మడు రెండు అరచేతులు కాస్త ఎడంగా తీసి “ఇంత!” అన్నాడు.

“ఓసి ఇంతేనా!” అన్నాడు శెట్టి. అప్పుడు బ్రాహ్మడికి కోపం వచ్చి రెండు చేతులూ బారచాపి “ఇంత!” అన్నాడు. ఇంకేం చేయి తీసేవరకు మన పిచ్చిక తుర్రున పారిపోయి చెట్టుమీద కూచుని “కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ!


కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ!” అని పాడటం మొదలుపెట్టింది. బ్రాహ్మడు బాగా మోసపోయానే అని తన్ను తిట్టుకుంటూ ఇంటికి వెళ్లాడు.

ప్రాంజలి  ప్రభ తెలుగు - జికె 
సేకరణ : మల్లాప్రగడ రామకృష్ణ 
3
త్రి మూర్తులు – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు (హరి, హర, బ్రహ్మ)
త్రి గుణములు – సత్వ, రజో, తమో
త్రివిధ గుణములు – దేవ, మనుష్య, రాక్షస
త్రి భువనాలు – భూలోకము, భువర్లోకము, సువర్లోకము
త్రి కరణములు – మనస్సు, వాక్కు, శరీరం (పని)
త్రి గంధములు – ఏలకులు, జాపత్రి, దాల్చిన చెక్క
త్రికాలములు – వేసవి, వర్ష, శీతల
త్రివిధ కాలములు – భూత, భవిష్యత్, వర్తమాన
త్రి లోకాలు – ముల్లోకాలు – స్వర్గ (దేవ), మర్త్య (మానవ), పాతాళ
త్రి మతములు – ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము
త్రివిధ మార్గములు – జ్ఞాన, కర్మ, ఉపాసన
త్రివిధ ఋషులు – బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి
త్రిఫల – ఉసిరి, కరక్కాయ, తానికాయ (జాజికాయ)
త్రిదోషములు – వాత, పిత్త, కఫ
త్రి సంధ్యలు -ప్రాతః, మాధ్యాహ్నిక, సాయం సంధ్యలు
త్రివర్ణములు :1.బ్రాహ్మణులు, 2. క్షత్రియులు, 3.వైశ్యులు (అగ్రకులాలు)
త్రిలింగములు :1.తారకలింగము (ఆకాశమున)2.మహాలింగము (భూలోకమున)3.హటకేశ్వరలింగము (పాతాళలోకమున)
1.శ్రీశైలము, 2. ద్రాక్షారామము, 3.కాళేశ్వరము
త్రిమదములు : 1.విద్యామదము, 2.ధనమదము, 3.కులమదము
త్రిపురుషులు : 1.పితృ, 2. పితామహ, 3. ప్రపితామహ
త్రిపత్రికములు : 1.తులసి, 2.మారేడు,3.కుందము
త్రినేత్రములు : 1.సూర్యుడు, 2.చంద్రుడు, 3. అగ్ని (ఈశ్వరునివి)
త్రినాడులు : 1.ఇడ, 2. పింగళ, 3. సుషుమ్న
త్రిజ్యేష్టములు : (వివాహమునకు)1, గ్బొలిచూలి వరుడు. 2. తొలి కన్యక, 3. జ్యేష్ట మాసము.
త్రికవులు : 1.నన్నయ, 2. తిక్కన, 3. ఎఱ్ఱాప్రగడ= కవిత్రయము
త్రికంటకములు : 1.శొంఠి, 2. తిప్పతీగ, 3.దూలగొండి
త్రికంటక ద్రవ్యములు : 1. వాకుడు. 2. దూలగొండి. 3. పల్లేరు.
త్రివిధ కాంక్షలు : 1. కాంత, 2 .కనక, 3.కీర్తి
త్రికరణములు : 1.మనస్సు, 2.వాక్కు, 3.పని
త్రిలోకములు : 1.స్వర్గలోకము, 2.మర్త్యలోకము, 3.నరకలోకము
త్రివేణీసంగమ నదులు : యమున, గంగా, సరస్వతి నదులు
త్రివిధాగ్నులు :1.కామాగ్న. (కోరిక) 2.క్రోదాగ్ని, (కోపము) 3.క్షుద్రాగ్ని (ఆకలి)
త్రివిధాక్షీణులు :1. కంచి కామాక్షి. 2. మధుర మీనాక్షి. 3. కాశీ విశాలాక్షి
త్రివిధ సుగంధ ద్రవ్యములు :1.చందనము. 2. కురువేరు. 3.నాగకేసరి.
త్రివిధ సుందర పురములు : 1.బ్రహ్మపురము 2.విష్ణుపురము. 3. శివపురము
త్రివిధ శాంతములు : (శాంతత్రయము) 1. సత్యము. 2. శాంతము. 3. మౌనము.
త్రివిధ శరీరాంగములు : 1.దేహము. 2. ఇంద్రియాలు. 3. ప్రాణము
త్రివిధ వేదకాండలు :1.ఉపాసనాకాండ, 2.కర్మకాండ, 3.జ్జానకాండ.
త్రివిధ వృద్ధులు : 1.జ్ఞావృద్ధులు. 2. తపోవృద్ధులు. 3. వయోవృద్ధులు.
త్రివిధ మార్గములు : మూడు మార్గాలు: 1జ్ఞానమార్గము, 2. కర్మమార్గము, 3. ఉపాసనా మార్గము
త్రివిధ మండలములు : సూర్య మండలము, చంద్రమండలము, అగ్ని మండలము
త్రివిధ గుణదేవతలు : 1.సాత్వికము.. వసువు. 2. రాజసము. రుద్రుడు. 3. తామసము. ఆదిత్యుడు.
త్రివిధ కళలు : (అభినయ) 1. గానము, 2. వాద్యము 3. నర్తనము
త్రివిధ కల్పములు : 1.బ్రహ్మ కల్పము. 2. వరాహ కల్పము. 3. పద్మ కల్పము
త్రివిధ శబ్దశక్తులు : 1.అభిధ 2.లక్షణ 3.వ్యంజన
త్రివిధ ఋషులు : త్రివిధ ఋషులు – బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి
త్రిశక్తి దేవతలు : 1.లక్ష్మీ 2. పార్వతి. 3. సరస్వతి.
త్రిపిటకములు : (భౌద్ధ మత సంబంధమైనవి) అవి. 1.సుత్త పిటకము, 2. వినయ పిటకము, 3. అభిధమ్మ పిటకము (బౌద్దం)
త్రిక్షారములు : మూడువిధాలైన క్షారములు 1,సజ్జాక్షారము, 2. యవాక్షారము, 3. వెలిగారము
ధనగతి త్రయము : 1.దానము. 2. భోగము. 3.నాశము.
సంపాదించిన ధనాన్ని ఉపయోగించాలి అనగా అనుబవించాలి.
లేదా దానం చేయాలి. ఈ రెండు చేయకుంటే అది నాశనమౌతుందని దీని అర్థము.
శక్తిత్రయము : 1.ప్రభుశక్తి, 2. ఉత్సాహశక్తి, 3. మంత్రశక్తి
తాపత్రయములు : మూడువిధాలైన తాపములు (అవి. ఆధ్యాత్మికము, 2.ఆధిభౌతికము, 3.ఆధిదైవికము)
అంబాత్రయము : 1.మూకాంబిక, 2. జ్ఞానాంబ, 3.బ్రమరాంబ.
పాకత్రయము : మూడువిధములైన కావ్య శైలి పాకములు. అవి. 1.ద్రాక్షాపాకము. 2. కదలీ పాకము. 3. నారికేళ పాకము
కావ్యరీతిత్రయము : 1.వైదర్భి. 2. గౌడి. 3. పాంచాలి.
నాయికాత్రయము : 1.స్వీయ, 2.పరకీయ, 3.సామాన్య
త్రివిధ నాయికలు : 1.ముగ్ద: ఉదయించుచున్న యౌవనము లజ్జ గల స్త్రీ. 2. మద్య, సగము లజ్జ వీడిన స్త్రీ., 3. ప్రౌడ. సిగ్గు విడిచిన సంపూర్ణస్త్రీ.
త్రిమతములు : 1. ద్వైతము, 2. అద్వైతము, 3.విశిష్టాద్వైతము
క్రియాత్రయము : 1.మణి, 2.మంత్రము, 3. ఔషదము
అవస్థాత్రయము : 1.జాగ్రదవస్థ, 2.స్వప్నావస్థ, 3.సుషుస్త్వవస్థ

No comments:

Post a Comment