అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
ఈ రోజు పుట్టిన ఒక్కరికి ప్రాంజలి ప్రభ తరుఫున శుభాకాంక్షలు
ప్రాంజలి ప్రభ
ప్రాంజలి రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
పుస్తకము మద్భుతమ్ము వికాస విజ్ఞాన భాండాగారము
- గుప్త రహస్యాలను తెలుపు పరోపకారి
పుస్తకము విప్పి చద్వి మనో సమ ధ్యాన కర్మాగారము
- శక్తి తొ ఉద్యోగము గొలుపు పరోపకారి
పుస్తకము భావ జాల మదీయ విద్యా శు కర్మాగారము
- యక్తి తొ సద్భావము తెలుపు పరోపకారి
మస్తకపు ప్రేమ దోష కృపామయ శ్వాస కర్మాగారము
- భక్తి తొ ఉద్భోదయు సహన పరోపకారి
పుస్తకమనేది మనసుని రంజింపచేసి వినయ విధేయతలతో పాటు వికాస విజ్ఞానమును తెలుపునది, ఇది అనేక గుప్త రహస్యాలను తెలుపునది, ఇది పూర్తిగా చదివితే మేధస్సు పెరిగి, ఆరోగ్యమును సమానంగా ఉంచి భగవానుని ధ్యానించుటకు వీలు కల్పిస్తున్నది. మన: సంకల్పంతో చదివిన వారికి శక్తిని ఇచ్చి ఉద్యోగమును తెప్పించునది. సంప్రదాయాల విషయాలు, గత చరిత్ర విషయాలు తెలుసు కొనే పుస్తక బాండాగారము ఒక శు కర్మాగారము అనగా మంచి ఆలోచనలతో కొత్తగా విషయాలు తెలుపునది. మనిషికి శ్వాస ఎంత అవసరమో మన మేధస్సు పెరుగుటకు పుస్తక చదువు అంతకన్నా ఎక్కవ అవసరము, సహనము, భక్తి, ప్రేమ, పరోపకారిగా మారుటకు ఉపయోగ పడు ను - ఇదే లోకరీతి
ఓం
ReplyDelete