నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీలా ) -4
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
7. దండ కమండల దారులై కాషాయమ్ములు ధరించిన బోధకు ముక్తి రాదు
విభూతి పూసి, పులిచర్మము ధరించి ముక్కుమూసి మౌనానికి ముక్తి రాదు
సంసారిగా ఉన్న, సన్యాసిగా ఉన్న గుణాలు సరిగా లేకున్నా ముక్తి రాదు
పుణ్యక్షేత్రాలు తిరిగి, దాన ధర్మాలు చేసిన అహంకారం ఉంటె ముక్తి రాదు
గురు వాక్యాలు ఆచరించి
తల్లి తండ్రులను గౌరవించి
భక్తితో దయచూపితే ముక్తి వచ్చు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
8. ప్రజల దారిద్రం తొలగించేది హరి భక్తే వజ్రాయుధంబు
అజ్ణాణమనే అంధకారం తొలగించేది నీ భానూదయంబు
దుర్భుద్ధి మాపి ధర్మబుద్ధి పెంచేది నీ సేవ దావానలంబు
నిత్య అమృత తత్వం ఇచ్చేది నీ స్మరణ దివ్యౌషధంబు
వెన్న ఉన్న నేతిని వెతికినట్లు
భార్య ఉన్న పరస్త్రీ కోరినట్లు
పర దేవతను ప్రార్ధించి నట్లు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
No comments:
Post a Comment