Friday, 18 May 2018

Pranjali Prabha (21-05-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : - శ్రీ కృష్ణాయనమ:

(ఆనందం - ఆరోగ్యం- ఆధ్యాత్మికం ) ప్రాంజలి ప్రభ లక్ష్యం

ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

 17.  శ్రీకర:,        శ్రీనిధి:,          శ్రీమాన్ :
        శ్రీవాస:, శ్రీ
వత్సవక్షా:, శ్రీమతావర :
        శ్రీనివాస:, శ్రీవిభావన:,       శ్రీ ధర :

        నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


 18.  పరమాత్మ:,  పరంధామా:,  పద్మనాభా :
        ప్రభాత:,  ప్రత్యర్ధన:,          పురుషోత్తమ:,
        ప్రజాపతి:,  ప్రజాభవ:,        పుండరీకాక్ష:,

        నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

 19.  ప్రాణదాత,  ప్రాణే నేశ్వర,     ప్రధమగణాధీశ,
         ప్రత్యేకాత్మ,  ప్రసన్నాత్మ,   ప్రమేయాత్మ,
        పద్మనిభేక్షణ,  పరమస్పష్ట,  పరమేశ్వర,

        నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
--((*))--

త్రిపురేశ్వర్యై నమః . . . . . . . 
మంత్రం . . . అర్థం . . అమ్మ ముల్లోకాలను పాలించే అధినాయకురాలు. త్రిపుర అంటే , తార మధ్యమ మంద్ర స్వరములు ఆధీనములో వుంచుకొనునది . త్రిపుర అంటే , కంఠము హృదయము నాభి మూడిటియందూ వుండి , కల్మషము లేని స్వర సాధనలో త్రిపుర యే త్రిపుర భైరవి గా పిలవ బడుతుంది . త్రిపుర భైరవి నాదోపాసన లో అనుగ్రహ అభయ అనుగ్రహాలు కలిగించి ఆనందాను రసానుభూతి లో వోలలాడించి త్రిపుర సుందరి అనబడుతుంది. త్రిపుర సుందరి ఎల్లప్పుడూ ఆనంద పరవశంలో వుండి ఆనంద లసోన్మిత అనబడుతుంది. 
తార దివ్య ప్రజ్ఞగా , మధ్యమ మానవ ప్రజ్ఞగా , మంద్ర అంతః ప్రజ్ఞగా వుండి త్రిపురా అనే అర్థం కూడా వుంది. 
జీవుడు సూక్ష్మ స్థూల కారణ దేహాలుగా వుంటాడు. ఈ మూడు దేహాలు అమ్మ ఆధీనంలో నే వుంటాయి కాబట్టి త్రిపురేశీ అనబడుతుంది. త్రిపుర సుందరి , త్రిపురేశ్వరి , త్రిపుర వాసిని , త్రిపుర భైరవి కి నమస్కారం .
నేటి  హాస్యం 


ఒరేయ్ అబ్బీ! 
జామ పళ్ళు ఎలా ఇస్తున్నావ్ ? 

ఎన్ని కావాలండి? 

వంద కావాలయ్యా! 

వంద నూట ఏభై చేసుకు ఇస్తానండి ! 

అబ్బో నూటేభయ్యే? ఉహు! ఎనభైకి ఇస్తావా? 

అమ్మొ ! తల్లి తల్లీ! అంత మాటనకండి! 
వంద చేసుకోండి 

ఎనభైకి ఇస్తే వంద ఇచ్చెయ్యి లేకపోతే వెళ్ళిపో! 

సరే! పెద్ద బేరం ఎందుకు పోగొట్టుకోవాలండి. ఇదిగో లెఖ్ఖెట్తాను చూసుకోండి ఆ సంచీ ఇల్లా ఇవ్వండి అందులో వేస్తాను ! 

లాభం ..ఒకటి..రెండు..మూడు.. 
అబ్బాయిగారికి పిల్లలా? 

ఒక కూతురయ్యా! 

ఎన్నో ఏడండి? 

ఎనిమిది 

చిత్తం ఎనిమిది..తొమ్మిది..పది.అమ్మాయిగారికండి? 

దానికోకొడుకు 

ఎన్నేళ్ళండి 

పదమూడు 

సరిజోడేమోనండి పదమూడు..పద్నాలుగు పదిహేను, పదహారు, పదిహేడు తమకి అమ్మాయి తర్వాతండి …? 

ఆ ఇంకో అమ్మాయి వుంది. 
ఇరవై నాలుగేళ్ళు వచ్చాయి. 
సంబంధాలు చూస్తున్నాం 

అలాగాండి ఇరవై నాలుగు, ఇరవై ఎయిదు, ఇరవై ఆరు, ఇరవై ఏడు, ఇర్వై ఎనిమిది , 

కోడలుగారివయస్సు ముప్ఫై వుంటాయాండి? 

మొన్ననే ముప్ఫై ఎనిమిది వచ్చాయి 

ముప్ఫై ఎనిమిది,ముప్ఫై తొమ్మిది, నలభై.. పెద్దబ్బాయిగారికెన్నేళ్ళంది 

నలభై ఐదు 

నలభై అయిదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నల్భై తొమ్మిది, ఏభై 

ఏంటోనండి సోతంత్రం వచ్చి ఏభై ఏళ్ళైనా మా బతుకులు ఇలాగేవున్నాయండి 

అదేమిటయ్యా! మనకు స్వాతంత్రం వచ్చి అరవై ఏళ్ళైంది 

అవునాండి. అయినా చూడండి లేనోడు అట్టానేవున్నాడు. వున్నోడు ఎదిగిపోతున్నాడు 

అరవై, అరవై ఒకటి అరవై రెండు, అరవైమూడు అరవైనాలుగు , అయితే బాబుగారికి సొతంత్రం వచ్చిన్నాటికి పెళ్ళయిపోనాదాండి 

అహా! ఇప్పుడాయన వయస్సు ఎంతనుకున్నావ్ ? ఎనభై ఒకటి. 

అలాగా! ఎనభై ఒకటి, ఎనభై రెండు, ఎనభై మూడు, ఎనభై నాలుగు, తమ తల్లిగారు? 

మూడేళ్ళైందయ్యా పోయి. 

అయ్యో పాపం ఏం జబ్బండి? 

జబ్బేంలేదు తిరుగుతూనేవుంది. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది 

అలాగాండి. ఏం మాయదారి జబ్బులో! ఆరు పోయేనాటికి తొంభై వున్నాయాండి 

తొంభై నాలుగయ్యా 

అల్లాగా! తొంభై నాలుగు, తొంభై అయిదు, తొంభై ఆరు, తొంభై ఏదు, తొంభై ఎనిమిది, తొంభై తొమ్మిది, నూరు. ఇదిగో అమ్మగారు. లెఖ్ఖ చూసుకోండి 

అదేమిటి వంద వేసి వూరుకుంటావా? కొసరు ఒక చెయ్యి వెయ్యి 

ఏమిటో అమ్మగారూ! అక్కడకీ గిట్టకపోయినా ఎనభైకి ఒప్పుకున్నా. ఇంకా కొసరంటే ఎలాగండి! 

కొసరు వెయ్యకపోతే నాకు అక్కర్లేదు. తీసుకుపో 

కోపం పడకామండి. 
ఇందండి అయిదు వేసా 

వందకి చిల్లర వుందా? 

ఇదిగో ఇరవై ..వస్తానండి అమ్మగారు.. 

ఇల్లాలి స్వగతం"- 
"హు! వంద నూట ఏభైట!! నా దగ్గరా వీడి బేరాలు!!"


నేటి ప్రాంజలి  ప్రభ - శఠ గోపము గురించి 

చాలామంది గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు. తీర్థానికి కాని,  
శఠగోపానికి కాని ప్రాధాన్యం ఇవ్వరు. ఈ శఠగోపం అంటే ఏమిటో, దీనిని గుడికి వెళ్లినపుడు తప్పనిసరిగా ఎందుకు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.  

దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపం తప్పక తీసుకోవాలి. 

చాలామంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనై పోయిందని చక చకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, శఠగోపం పెట్టించు కుంటారు. 

శఠగోపం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే శఠగోపం. మానవునికి శత్రు వులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇకనుండి దూరముగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం. 

సహజంగా చిల్లర లేకపోవటం వల్ల శఠగోపంను ఒక్కోసారి వదిలేస్తుంటాం. ప్రక్కగా వచ్చేస్తాం. అలా చెయ్యకూడదు. 


పూజారి చేత శఠగోపం పెట్టించుకొని, మనసు లోని కోరికను స్మరించుకోవాలి. ఈ శఠగోపంను రాగి, కంచు, వెండిలతో తయారుచేస్తారు. పైన విష్ణుపాదాలుంటాయి. ఈ శఠగోపమును తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగి లినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.

గజల్ 2200.

అభిప్రాయ బేధాలా..ఉండకుండ ఉంటాయా..!
గుండెలోని గుబుళ్ళన్ని..ఇగురకుండ ఉంటాయా..!

తిరుగుతున్న భూమికున్న..యాతనెవరి కుందిక్కడ..
రెక్కలున్న కోరికలే..ఎగురకుండ ఉంటాయా..!

మిఠాయీలు తింటుంటే..సంతోషమె సంతోషం..
కలకాలం ధనరాశులు..కరగకుండ ఉంటాయా..!

నవ్వుతున్న పసిడిపూల..తోటలోకి తొంగిచూడు..
అలరించే పండ్లెన్నో..అందకుండ ఉంటాయా..!

మాటలెంత బావున్నా..ఆ మౌనపు గుబాళింపె..
కట్టుబాట్ల సంకెళ్ళను..తెంచకుండ ఉంటాయా..!

మరి మాధవ గజల్ గాక..చెలిమిగీత మెక్కడటా..
నీ చూపులు అరమరికలు.. కాల్చకుండ ఉంటాయా..!


నవ చక్రములు : 1. మూలాధారము,2.స్వాధీష్ఠానము, 3.నాభి చక్రము, 4. హృదయ చక్రము, 5.కంఠచక్రము, 6.ఘంటిక,7.భ్రూవు, 8.బ్రహ్మరంద్రము, 9.గగనము
నవరంధ్రాలు – కళ్ళు (2), ముక్కు (2), చెవులు (2), నోరు, మల ద్వారం, మూత్ర ద్వారం
నవగ్రహాలు – సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు (మంగళగ్రహం), బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు
నవనాడులు – ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తినీ, పుషా, జయస్వినీ, అలంబస, కుహ
నవవిధ దుఃఖములు :1.పీడ, 2. బాధ, 3. వ్వధ, 4. దుఃఖము, 5. అమనస్యము. 6.ప్రసూతిజము, 7. కష్టము, 8. కృచ్ఛము, 9. అభలము.
నవవిధ ధర్మములు : 1.పుణ్యము. 2. న్యాయము, 3.సామ్యము. 4. స్వభావము, 5.ఆచారము, 6. అహింస, 7. వేదోక్తవిధి, 8.ఉపనిషత్తు, 9.యజ్ఞము
నవవిష స్థానములు : 1. చోరులకు చేతులందు, 2. స్త్రీలకు స్థనములందు, 3. కొండెగానికి నాలుక యందు, 4. కాముకునకు కన్నుల యందు, 5. పాముకు కోరలయందు, 6.తేలుకు కొండె యందును, 7. ఈగకు తలయందును, 8. నరునకు శరీరమంతా, 9.వేశ్యకు మనస్సాంతా విషము
నవసంచార నిషిద్ధ స్థలములు : 1.చింపిపీలికలు. 2. ఎముకలు. 3. ముండ్లు, 4. మలమూత్రములు. 5. వెండ్రుకలు. 6.వరిపొట్టు, 7. బూడిద, 8. కుండ పెంకులు. 9. స్నానము చేసిన నీరు పారు స్థలము.
నవతారా శుభాశుభ ఫలితములు :1. జన్మతార, దేహనాశనము. 2, సంపత్తార. సంపద., 3. విపత్తార. దరిద్రము., 4. క్షేమతార., క్షేమము. 5. ప్రత్యక్తార.. కార్య నాశనము.6. సాధనతార., కార్యసాధనము, 7. సైధన తార ./ మరణము. 8. మిత్రతార. మైత్రి., 9. పరమమైత్రి తార. పరమ మైత్రి.
నవగ్రహదేశములు : 1.సూర్యుడు. కళింగ దేశము. 2. చంద్రుడు. యవన దేశము. 3. అంగారకుడు. అవంతి దేశము. 4. బుదుడు. మగధదేశము. 5. బృహస్పతి. సింధుదేశము. 6. శుక్రుడు. కాంబోజ దేశము. 7. శని. సింధు దేశము. * 8. రాహువు. బర్బర దేశము. 9. కేతువు. అంతర్వేధి దేశము.
నవగ్రహా హోమ సమిధలు : 1. రావి 2. అత్తి. 3. జిల్లేడు, 4. జమ్మి. 5. గరిక, 6. దర్భ 7. ఉత్తరేణి 8. మోదుగ 9. చండ్ర
నవ శక్తులు : (అ.) 1. దీప్త, 2. సూక్ష్మ, 3. జయ, 4. భద్ర, 5. విభూతి, 6. విమల, 7. అమోఘ, 8. వైద్యుత, 9. సర్వతోముఖ్య.
(ఆ.) 1. ప్రభ, 2. మాయ, 3. జయ, 4. సూక్ష్మ, 5. త్రిశుద్ధ, 6. నందిని, 7. సుప్రభ, 8. విజయ, 9. సిద్ధిద. [ఆప్టే.]

(ఇ.) 1. విభూతి, 2. ఉన్నతి, 3. కాంతి, 4. కీర్తి, 5. సన్నతి, 6. సృష్టి, 7. పుష్టి, 8. సత్పుష్టి, 9. బుద్ధి.


నవవర్షాలు : 1.కురు 2.హిరణ్మయ 3.రమ్యక 4.ఇలావృత 5.హరి 6. కేతుమాల 7. భద్రాశ్వ 8. కింపురుష 9.భరత

No comments:

Post a Comment