నేటి సమస్యను పూరించుట 01 -07 -2021.....
మాతయె పెంచెరా మనసు ప్రేరణ కల్గుట జీవితంబునన్
దాతయె అయ్యెరా సహజ తప్పులు చెప్పుచు సాధనంబునన్
శాంతము కోరెరా ఇపుడు శాపము వల్లన కోపసంబునన్
సీతయె చంపెరా విమల శ్రీరఘురాముని సంతసంబునన్
సీత = పృథ్వి
నేటి సమస్యను పూరించుట .....
అవతారము ఎత్తి నెల్ల మనసు తపించెన్
నవసేవలు నాంది వళ్ళ సహజ భయమ్మున్
కువలేసుని తుప్తి వళ్ళ కలలు జయమ్మున్
అవధానము సేయుచుండ నతివ జనించెన్...
నేటి సమస్య పురాణపద్యాలు .. 01 -07 -2021
సంతస మయ్యెనన్ విషయ శాంతిని కోరియు మోహనంబులో
పంతము పొయ్యినన్ సహజ మౌనము కొరిక తీర్చు తంబులో
చెంతకు చేరియున్ మనసు జాలిని చూపియు సంతసంబులో
అంతయు కాలమున్ జరుపు సహజ లిలయు పొందుమోదమున్
నేటి సమస్యను పూరించుట ......
పాడుతు ఆడుతు చదివిన విద్యయు మెచ్చెన్
గూడుగ మార్చెను అహముయు తోడుగ వచ్చెన్
కూడుకు గుడ్డకు సహనము లేకయు తెల్పెన్
పండితు లందర గొలువగ పాపమె వచ్చున్
ఈ పద్యం చూడండి సరదాగా ఉంది...
తెలుగు + ఇంగ్లీషులో పరమేశ్వరుని స్తుతిస్తూ
శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు చెప్పిన ఉత్పలమాల పద్యం :
"హెడ్డున మూను, స్కిన్నుపయి నెంతయు డస్టును, ఫైరు నేత్రమున్,
సైడున గ్రేటు బుల్లు, బహు చక్కని గేంజెసు హైరు లోపలన్,
బాడికి హాఫెయౌచు నల పార్వతి మౌంటెను డాటరుండ,
ఐ షుడ్డు డివోటు దండములు సోకగ ప్రేయరు సేతునెప్పుడున్ !!"
భావం తెలుస్తోంది కదా...
సమస్యను పూరించండి........
కొట్రా యొక చెంపదెబ్బ గూబలు పగులన్.....
బట్రాజుల మాటవల్ల కోతల తలపుల్
నిట్రా తిని నీడ దైవ మార్గము తెలుపున్
కట్రా వళ్ళ కాల మాయ తీర్చును భయమున్
నేటి సమస్యను పూరిం చు ట ...........
మచ్చిక చేయుటయు ఆశ పెర్గుట సమరమ్
ఐచ్ఛిక సేవలతొ కార్య మార్పులు విదితమ్
వెచ్చని కౌగిలిలొ సర్వ కర్మలు జరుగున్
పచ్చని రాచిలుక మీద పచ్చిక మొలిచెన్.
నేటి సమస్యనుపూరించుట
పన్నుగ నీకు మ్రొక్కెదను పంతము మానర ప్రాణ నాయకా!
మిన్నుని నమ్మి బ్రత్కెదను మక్కువ చూపుము ప్రేమ నాయకా
తన్మయ మంతా తెల్పెదను దాపరికము యే లేదు నాయికా
ప్రాణము నీకే అర్పిదము పొంతన తెల్పెదా మీకు నాయకా
నేటి సమస్యను పూరిం చుట .......
నాల్గు పూటలు సేవింప నయమగునది
కళ్ళు కల్గిన కాలాన్ని అనుకొనినది
ముళ్ళు గుచ్చిన భాదల్ని పడమనునది
ఒళ్ళు వంచిన రోగాన్ని వదలనునది
నాల్గు పూటలు సేవింప నయమగునది
కాళ్ళు లాగిన కామాన్ని వదలనునది
కుళ్ళు రోగము అన్నాను మరువననెది
కళ్ళు తిర్గిన పొందేది కలలనునది
నాల్గు పూటలు సేవింప నయమగునది
--(())--
శ్రీకరధవళాంగ, శ్రితజనావనసంగ, | కరనివిష్టకురంగ, పురవిభంగ,
తరణిచంద్రరథాంగ, ధరణీతలశతాంగ, | విదళితానంగ, గోవృషతురంగ,
వలయీకృతభుజంగ, విలసితఖట్వాంగ, | ధృతనభోగంగ, వార్నిధినిషంగ,
మునిమనోంబుజభృంగ, ఘనసమరాభంగ, | అతిదయాపాంగ, పుణ్యాంతరంగ,
ఆకలే ధనముగా ఆర్తి ఉండె
మైకమే ఫలముగా బుధ్ధి ఉండి
రొక్కమే చదువుగా ఉండె వాని
ముక్కు గోయవలయు త్రొక్కి పట్టి
నేటి సమస్యను పూరిం చుట ......... 4 /౦౬.2021
తీటయె దేవేంద్ర పదవి తిరముగ జగతిన్....
ఆటల మోసమ్ము మనసు మలినము అగుటన్
కోటలు దాటేటి పలుకు జగడము జరుగున్
మాటలు చెప్పేను వెలుగు లలితపు కళలన్
తీటయె దేవేంద్ర పదవి తిరముగ జగతిన్....
***
వస్తే యెమి లాభముంది వానితొ కాకా
చేస్తే పని అవ్వ దేమొ వాడొక నీనా
రాస్తే యేమి సౌఖ్యముంది పాటల ఉండే
నాస్తే యనికూసె వాని నాలుక పీకా
***
నేటి సమస్యను పూరిం చుట ......... 31/05
మోహపు మంద బుధ్ధి మది మాయను చేయును మానసమ్ములో
ఊహకు అందకుండ హృదియాగుచు నుండగ సమ్మ తమ్ములో
దేహము దారిచూపు దరియోగము శాంతిగ విశ్మయమ్ము లో
రోహిణి వచ్చినంత గనిరోసె శశాంకుడు భీతిచిత్తుడై...... 68
నడక మదీయ నాదము ల నాన్యతయున్ మురిపించు వానికిన్
కొడుకు వినోదము వాదములు భాగ్యముయున్ కలిగించు వానికిన్
గొడవ అనేదియు లేదునులె సంతసమే నివసించు వానికిన్
కడు హిత మబ్బులే గ్రహణ కాలమునన్ భుజియించు వానికిన్ ...69
మనసే మందిరం ప్రేమా వినయం నీ సేవలె
గురు వే పూజ్యుడై నేర్పే సహనం నీ ప్రేమయె
శ్రమ నీ ఆయుధం మైతే విజయం నీ బానిసె
క్రమ లక్ష్యమ్ముయే విద్యే విలియం నీ కోసమె..... 70
ఓనారీ రి కానన్ రా గానమ్మా నీనవ్వే
శ్యామాంగీ ప్రేమాంగీ నీమోవీ సోమమ్మే
భాగమ్మే భోగమ్మే రాగమ్మే యోగ మ్మే
భావమ్మే జీవంమ్మో నావారా శ్రీ వారే ..... 71
జలపాత శబ్దాలై మదిలోన భావాలు
వినసొంపు విన్యాసం విధి వేద లక్ష్యాలు
తరుణాన తద్భావం మది మోహ మార్గాలు
సహనమ్ము సంతోషం తిధి నాద గమ్యాలు ..... 72
మనసంత మాధుర్యం చెలికాడు పిల్చేను
వయసెంత వయ్యారం వలపుళ్లు కుర్సేను
సొగసంత సింగారం తనువుల్లొ కల్సేను
చిగురంత చిందేసే చిరునవ్వు పంచేను ....71
విషవాంఛ విడ్డ్యూరమ్ సమయమ్ము నందేను
మదివాంఛ సౌభాగ్యమ్ వినయమ్ము చూపేను
మరుమల్లె వాసంతం మనసాయ విచ్చేను
మదిశాంతి సౌందర్యం చనువాఎ మెచ్చేను...... 72
నేటి సమస్యను పూరిం చుట .........31/05
కన్నీటం బడి క్రాగి పోయినవి నిక్కంబిందు పాషాణముల్...
కొన్నీచెప్పుటకే మనస్సు మహిమై గోరంత కొండంతగన్
వేన్నీళ్లే కలిపీ మనోమయముగా వాదాన్నివేదమ్ముగన్
కన్నీటం బడి క్రాగి పోయినవి నిక్కంబిందు పాషాణముల్...
పన్నీరై పదిలంబుగా వినయమే ప్రాధాన్య మిచ్చేను లే ..... 73
నేటి సమస్యను పూరించూ పద్యము ...30/05
వాడనర్హుండు కొననాదు వందనంబు..
ఆడి పాడాలి కొన మెర్పు సంబరంబు
చెడ్డ వారేను చేరి డబ్బు పంచు చుండు
వాడనర్హుండు కొననాదు వందనంబు
పాడి ఆవ్వుళ్ళ ఉండు వార్కి వందనంబు
నేటి సమస్యను పూరించూ పద్యము ...29.5
వాడనర్హుండు కొననాదు వందనంబు.......... 74
ఆడి పాడాలి కొన మెర్పు సంబరంబు
చెడ్డ వారేను చేరి డబ్బు పంచు చుండు
వాడనర్హుండు కొననాదు వందనంబు
పాడి ఆవ్వుళ్ళ ఉండు వార్కి వందనంబు ...75
నేటి సమస్యను పూరించూట ...........28/21
పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్
మగ చేష్ఠను చూపి మంద బుద్ధి కల్గిన్
పగ వాళ్ళను చూసి ఏమి చేయ లేకున్
పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్
సెగ చూపి గొప్ప లెన్నొ చెప్పు చుండెన్ 76
మధురిమలు
చెందస్సు చీకటిలో - వెన్నెల చెప్పే
కన్నెల ముప్పే = వన్నెలు చిందే చీకటిలో ....77
మధువు నేనిత్తు - మానసమ్మిత్తు
కళలే ఒకెత్తు - సెలవులే ఎత్తు
మధిర ఒక సోత్తు - వ్యధలతో మత్తు
వనితతో చిత్తు - మగణినే మొత్తు .......78
వనిత నేనుండ - వలపుతో నిండ
చెరువు నీరుండ - కలువల తొ నిండ
తగువు లేకుండ - సుఖముగా ఉండ
సహనము ఏవుండ - సహజమే ఉండ ...... 79
మదిర నీకేలరా - మనసు లేదేమిరా
మనసు వాదమ్మురా - మధిర త్రాగురా
వయసు పొంగేనురా - సొగసు పంచేనురా
సొగసు చిందేనురా - వారు పందేనురా ..... 80
ఆకలే అణకురా - జాతరే తెలకురా
మోహమే అనకురా - సేవలే మనకురా
అసలు నీకేనురా - కొసరు కోరేనురా
వెతలు నీకేనురా - పసరు మింగాలిరా ..... 81
తక్కువ చేయనురా - ఎక్కువ చేయనురా
మక్కువ చూపుమురా - చక్కగ ఉండుమురా
భాధలు ఎందుకురా - వేదన ఎందుకురా
సేవలు నీకునురా - స్వేదము ఎందుకురా ...... 82
తాపము చూడుమురా - తమకం విడువుమురా
కోపము వద్దునురా - లాస్యము ఆడకురా
భాద్యత నాదియురా - భారము నాదియురా
భాగ్యము నాదియురా - భావము నిదియురా ..... 83
అంతయు పొందుమురా - సాంతము నీదియురా
బ్రాంతియు వద్దునురా - సొంతము చెప్పకురా
దాహము తీర్చుకోరా - దాపరికం వద్దురా
ప్రేమను పొందాలిరా - దాస్యరికం హద్దురా ..... 84
ఆటవెలది
సమస్యను పూరించండి......
ముండా! రమ్మని పిలువగ భూపతి వ చ్చెన్......
అండా డమ్మున పరుగును పిండము సంతో
షుండా ఊపిరి సలుపును బిడ్డగ సూర్యా
అండా పొందియు బతుకుట వల్లననే యా
ముండా! రమ్మని పిలువగ భూపతి వ చ్చెన్ ..... 85
సమస్యను పూరించండి.......
మదగజ యానకుం రవిక మాత్రమె చాలును చీర యేటికిన్.......
సుధలను పంచుటే భువికి చెల్లును దీర్ఘము ఏల ఎప్పుడున్
కధలను తెల్పుటే కవికి చెల్లును మౌనము ఏల ఇప్పుడున్
మదగజ యానకుం రవిక మాత్రమె చాలును చీర యేటికిన్...
వ్యధలను మాపుటే శివుని శక్తికి మాత్రము చెల్లు చుండియున్ ...... 86
సుతుని పరిత్యజించి యొకతల్లి సుదూరము చేసె బత్కునన్
మతిని పరిశీలించి యొక మాత ముభావము తెల్పె సంఘమున్
స్థితియు అనుకూలించి యొకవాణి సమానము మాన తృప్తి యున్
పతిని పరిత్యజించి యొకభామ పతివ్రత యయ్యె యిమ్ములన్..... 87
పతులు పరివేష్టించు ఒక భార్య వయస్సును పంచె ఆశగన్
పతిని మరచీ ప్రేమ అను భార్య వయస్సును వేరె పంచియున్
సతులు మరగీ ఉన్న ఒక భర్త మనస్సు ను భార్య ఒప్పియున్
పతిని పరిత్యజించి యొక భామ పతివ్రత యయ్యె యిమ్ములన్ 88
తే :: మనసు చేసేది నిత్యమ మగువ మాయ
మతము చెప్పేది జరిగిన మలుపు మాయ
గురువు తెల్పేది నేర్చిన గుణము మాయ
కాల మెప్పుడు చెప్పేది గాధ మాయ ... ... 89
తే : ముసుగు అసమర్ధుడు తెలుపు మునక మాయ
మగువ ఆభరణం మతి మధుర మాయ
యువత బద్ధకం విద్యకు యుగపు మాయ
మనిషి మమతను కధలను మగని మాయ ... ... 90
తే :: పలుకు చెయలేని గొప్పల పగటి కర్ర
అలక శోధనకు సాధనకు అమలు కర్ర
పనికి సంపద శక్తియే పలుకు కర్ర
వినయము బతికి బతికించు విమల కర్ర ... ... 91
తే :: మగని మనశాంతి తెగువను మగువ కర్ర
తరుణి మనశాంతి తపననుఁ తరుణ కర్ర
వలపు ఉయ్యాల పిల్లలు వరుస కర్ర
తలఁపుఁ తువ్వాల తిండిని తపన కర్ర ... 92
పతిని సతిని కలుపు పడక మనసెరిగి
ఆశలంటు కదిలె ఆట లాగ
అవధు లెన్నవారి అడుగు వెనక ఉన్న
కడ వరకు సుఖమును కనుల యందు కదులు ... 93
అవసరములన్ని తీరితే అలుపు రాదు
సవరమును పెట్టిన వనిత సరస మీరి
అవయవములను చూపేను అణవణువును
దేవుడను వాడు లేడని చెప్పె ... ... 94
కవులు తెలుపును హృదయంలొ గాయమైంది
చెవులు ఆలకించును శబ్ద చేష్ట దీన్ని
తవుడు పశువు ల గ్రాసము తృప్తి పరచు
దేవుడను వాడు లేడని చెప్పె ... ... 95
తప్పు మాటలు మధ్యనే తురుము చుండు
తప్పు ఒప్పని వాదన తరుము కొచ్చు
తప్పు చెప్పిన మాటలు నలుగు చుండె
చెప్పు దెబ్బలు నెత్తికి చేటు కలిగె ... .... 96
నిప్పు చేతబట్టు అనుట నిజము కాదు
నిప్పు లో ఉప్పు లాగున్నా నిన్ను చూసి
నిప్పు సెగలు కావచ్చు ను నిన్ను తాకు
నిప్పు దెబ్బలు నెత్తి కి చేటు కలిగె ... ...97
అప్పు చేయుట జీవికి ఎంత తెలివి
తప్పు చేయుట అలవాటు పడ్డ మనిషి
ఒప్పు అయినను నమ్మేటి ఓర్పు లేదు
చెప్పు దెబ్బలు నెత్తికి చేటు కలిగె .... .... 98
అప్ప నేనొప్ప అంటూనే అటక ఎక్కు
కప్ప లాగునా పుడమిపై గంతులేయు
చిప్ప నాకేటి కోతిలా చూడ లేను
చెప్పు దెబ్బలు నెత్తికి చేటు కలిగె..... .... 99
ముప్పు వచ్చెను అంటూనే మూల ఉండు
తుప్పు పట్టిన ఇనుములా దాగి ఉన్న
విప్పలేని సమస్యలా వీధి నున్న
చెప్పు దెబ్బలు నెత్తికి చేటు కలిగె ... ..... 100
--(())--
No comments:
Post a Comment