మాతేవ రక్షతి, పితేవ హితే నియుంక్తే
__(())--
శ్లో|| సద్గురుకృప జ్ఞానంబున
సద్గతి దీపింపు చున్న చాలా చదువుల్
సద్గతి గలుగగ జేయును
సద్గురువే దైవమనుచు జాటర వేమ !.......... 65
తా|| వేదాంత తత్త్వాన్ని విపులంగా చెప్పడానికి లోకంలో ఎన్నో మంచి శాస్త్రాలున్నాయి. అవన్నీ తెలియాలంటే మంచి గురు కటాక్షం వల్ల లభ్యమవుతోంది. కనుక మంచి గురువు దైవం లాంటివాడు.
*******
కర్ణ ఉవాచ 🦌🦌
విప్ర హస్తే ధనం దద్యాత్
స్వభార్యాయాంచ యౌవనం
స్వామి కార్యేషు చ ప్రాణం
నిశ్చయో మమ మాధవ ..... 66
కృష్ణా! తనధనమును బ్రాహ్మణాధీనము చేయుట తనయౌవనమును భార్యయధీనము చేయుట తన ప్రాణమును స్వామి కార్యములో వినియోగించుట ఇది నా నిశ్చయము అని కర్ణుడు చెప్పెను
*****
శ్లో|| సంక్లిష్టనిర్మాణమతిప్రమాదం నిత్యానృతం చాదృఢభక్తిం చ.
విసృష్టరాగం పటుమానినంచాప్యే తాన్ న సేవేత నరాధమాన్ షట్!! 67
విదురనీతి
తా|| క్లేశములు కలిగించు పనులు చేయువానిని, జాగ్రత్త లేనివానిని, ఎల్లప్పుడు అసత్యమునే పలుకువానిని, స్థిరమైన భక్తిలేనివాడిని, ప్రేమలేని వాడిని, తనను తాను సమర్థునిగా తలచు కొనువానిని, ఈ ఆరుగురు నరాధములను సేవింపరాదు.
శ్రీ కృష్ణ ఉవాచ
దుర్భిక్షేచాన్న దాతారం
సుభిక్షేచ హిరణ్యదం
చతురో2హం నమస్యామి
రణే ధీరమృణే శుచిం ... ... 68
(ధీరం, ఋణే)
దుర్భిక్ష కాలంలో అన్నదాతకు,సుభిక్ష కాలంలో ధనమిచ్చు వానికి, యుద్ధంలో వెనుతిరుగని వానికి, ఋణము (అప్పు) లేనివానికి ( ఈ నలుగురికి)
నమస్కరించెదను అని కృష్ణ భగవానుడు చెప్పెను.
శ్లో|| అత్యన్తమతిమేధావీ త్రయాణామేకమశ్నుతే।
అల్పాయుషో దరిద్రో వా హ్యనపత్యో న సంశయః॥ .... 69
తా|| "మహాబుద్ధిశాలికి ఈ మూడింటిలో ఏదో ఒకటి తప్పకుండా వస్తుంది. అతడు అల్పాయుర్దాయవంతుడైనా అవుతాడు, దరిద్రుడైనా అవుతాడు, సంతానం లేనివాడైనా అవుతాడు".
స్వగృహే పూజ్యతే మూర్ఖః, స్వగ్రామే పూజ్యతే ప్రభుః,
స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. .... 70
-భర్తృ.
భావం: మూర్ఖుడు తన ఇంటిలోనే గౌరవింపబడతాడు. అధికారి తన గ్రామంలోనే గౌరవింపబడతాడు. రాజు అతని రాజ్యంలోని వారంతా గౌరవిస్తారు. కాని పండితుడు సర్వత్రా పూజింపబడతాడు.
ఔదుంబరాణి పుష్పాణి
శ్వేత వర్ణంచ వాయసం
మత్స్యపాదం జలేపశ్యేన్
ననారీ హృదయ స్థితం..... ....... 71
మేడిపువ్వులనైననూ, తెల్లని కాకినైననూ, నీటిలో చేపల అడుగుల నైననూ చూడగలమేమో గాని స్త్రీల మనస్సులోని సంగతిని ఎవ్వరునూ చూడౙాలరు.
శ్లో|| కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్!
వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రయా కలహేన వా!!...72
తా|| కావ్యాలు, శాస్త్రాల పఠనంతో, మనోహ్లాదకరమైన వినోదాలతో బుద్ధిమంతులు సమయాన్ని గడుపుతారు. మూర్ఖులు సురాపానాది దురభ్యాసాలతోనో, నిద్రతోనో, ఎవరితోనైనా పోట్లాటలతోనో కాలక్షేపం చేస్తారు.
శ్లో === గజ భుజంగ విహంగము బంధనం |
భావము === ఏనుగులు, పాములు, పక్షులు వీటిని కట్టిపడేయుట, చంద్ర సూర్యలు రాహు కేతువులచే పిడింప బడుట, బుద్దిమంతులు దరిద్రం నను భవించుట, ఇవి యన్నియును చూడగా విధి బలియమైనదని తెలియు చున్నది.
భావము === బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, వీరు కామోద్రకమున తక్కువ జాతి వారితో గూడి సంతతిని పోమ్దినచో వారి మొదటి కులము నశించి శూద్ర త్వము సిద్దించును. కావిన వీరు తక్కువ జాతి స్త్రీలతో కలియుఅతగాని, పెండ్లి చేసుకొనుట గాని శాస్త్రసంమతముగాదని భావము.
--((**))--
ఆదరేణ యథా స్తవుతి ధనవంతం ధనేచ్ఛయా
శ్లో|| మక్షికా వ్రణమిచ్ఛన్తి
ధనమిచ్ఛన్తి పార్థివః।
నీచాః కలహమిచ్ఛన్తి
శాన్తిమిచ్ఛన్తి సాధవః॥.....76
తా|| "ఈగలు పుండ్ల మీదనే వ్రాలును......
పాలకులు ధనముపైనే దృష్టినుంచెదరు.....
నీచులు కలహమునే కోరుకుందురు......
సాధువులు శాంతినే వాంఛించెదరు"..
***"
శ్లో|| నాతః శ్రీమత్తరం కిఞ్చిత్ అన్యత్పథ్యతమం మతమ్ |ప్రభవిష్ణోర్యథా తాత క్షమా సర్వత్ర సర్వదా ||..77
తా|| "సమర్థుడికి అన్నిచోట్ల అన్నివేళలా సహనం కంటే శుభకరమైనది మరొకటి లేదు.
అది అన్నిటికంటే చాలా శ్రేయస్కరం".
"
💐💐 నకుల ఉవాచ 💐💐
మాతృవత్పరదారాంశ్చ
పరద్రవ్యాణి లోష్టవత్
ఆత్మవత్సర్వ భూతాని
యః పశ్యతి స పణ్డితః.....78
పరస్త్రీని తల్లి వలెను పరధనమును మన్ను వలెను సకలభూతములను తన వలెను చూచువాడే పండితుడు. 🐘🐘🐘
నిమంత్రణోత్సవా విప్రా
గావో నవతృణోత్సవాః
భర్త్రాగమోత్సవా నార్యః
సో2హం కృష్ణ! రణోత్సవః.....79
🍉🍉 నీతి శాస్త్ర మందు
అర్జునుడు ఈ విధంగా చెప్పుచున్నాడు
కృష్ణా! విప్రులు పరగృహ భోజనమును , గోవులు లేతగడ్డిని, స్త్రీలు భర్త రాకను, నేను యుద్ధము ను ఉత్సవముగా గలవారము అని చెప్పెను.
🍒🍇🍑🍑
శ్లో|| మక్షికా వ్రణమిచ్ఛన్తి
ధనమిచ్ఛన్తి పార్థివః।
నీచాః కలహమిచ్ఛన్తి
శాన్తిమిచ్ఛన్తి సాధవః॥.....80
తా|| "ఈగలు పుండ్ల మీదనే వ్రాలును......
పాలకులు ధనముపైనే దృష్టినుంచెదరు.....
నీచులు కలహమునే కోరుకుందురు......
సాధువులు శాంతినే వాంఛించెదరు"..
ప్రాణం వాపి పరిత్యజ్య
మానమే వాభిరక్షతు
అనిత్యో భవతి ప్రాణో
మానమాచంద్ర (మానం ఆచంద్ర) తారకం....81
ప్రాణమునునైననూ విడిచి మానమునే రక్షించుకోవలయును.
ప్రాణము అనిత్యమైనది. మానము ఆచంద్రార్కము ఉండునది. కావున మానరక్షణ ముఖ్యము.
--(())--
పక్షీణాం బలమాకాశం
మత్స్యానాముదకం బలం
దుర్బలస్య బలంరాజా
బాలానాం రోదనంబలం.
పక్షులకు ఆకాశమే బలము
చేపలకు (మీనములకు) నీరే బలము
దుర్బలునకు రాజే బలము
చిన్నపిల్లలకు ఏడుపేబలం
(పిల్లలు ఏడ్చుట వలన వారు అడిగినవి ఏడ్పు మాన్పించుటకు
ఇస్తాము. నమో నమః)
వగువకు గడిచిన దానికి
బొగడకు దుర్మతులనెపుడు పొసగని పనికై
యెగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా !
*భావం :*
ఓ కుమారా ! అయిపోయిన పనిని గురించి చింతింపవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేక పోతినని చింతించుట పనికి రాదు. భగవంతుడు యిచ్చిన దానితో తృప్తి చెందుము.
శ్లో|| యావత్స్వస్థో హ్యయం దేహో
యావన్మృత్యుచ్చ దూరతః |
తావదాత్మహితం కుర్యాత్
ప్రాణాన్తే కిం కరిష్యతి || ...82
తా|| ఈ శరీరమెంతకాలము రోగము లేనిదై సాస్థ్యము కలదై యుండునో, యంతవఱకు తనకు మేలు కలిగించు శుభకర్మలను, ధర్మాచరణము, పుణ్యకర్మలు చేయవలెను. మరణించిన తరువాత నేమి చేయగలరు?
వగవకు గడిచిన దానికి
బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై
యెగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!
తాత్పర్యం:
ఓ కుమార! అయిపోయిన పనిని గురించి చింతించవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.👌
# వేమన శతకం
మనం తెలుగు వాళ్ళం కాబట్టి, మనం వేమన శతకం *నుండి ప్రతిరోజూ 1 పద్యం
నేర్చుకుంటాం ఎద్దుకైన యేడాది దెల్పిన
మాట తెలిసి నడచు మర్మ మెఱిఁగి
ముప్పె తెలియలేఁడు ముప్పదేండ్లకు నైన
విశ్వధాభిరామ వినురమేమ .
తాత్పర్యం-
ఒక సంవత్సరము పాటు భోధించిన యెడల యెద్దయినా సంగతి సందర్భములు తెలిసికొనఁ గలదు. కాని మూఢుడు ఎన్ని సంవత్సరాలు గడిచినను తెలిసికొనఁ జాలడు.
శ్లో|| అగ్నిహోత్రఫలా వేదాః శీలవృత్తఫలం శ్రుతమ్l
రతిపుత్రఫలా నారీ దత్తభుక్తఫలం ధనమ్ll..83
తా|| "వేదాధ్యయనానికి ఫలం అగ్నిహోత్రాన్ని అర్పించడమే. శాస్త్రానికి ఫలం సత్ప్రవర్తన. స్త్రీ సంగమానికి ఫలం సుఖసంతానం కలగడమే. ధనానికి ఫలం దానం చేయడం, అనుభవించడమూను!
--(())--
శ్లో|| అధర్మేణైధతే తావత్
తతో భద్రాణి పశ్యతి |
తతః సపత్నాన్ జయతి
సమూలస్తు వినశ్యతి ||....84
తా|| అధర్మంతో కొన్ని సార్లు వృద్ధిచెందువాడు మంచి సుఖములను చవిచూడును. తన శత్రువులనూ గెలుచును. అయితే సమూలముగా నాశనము కావడము తథ్యము
--(())--
హిందవః సోదరా స్సర్వే న హిందుర్ పతితో భవేత్ !
మమదీక్షా హిందు రక్షా మమ మంత్ర: సమానతా !!.... 85
హిందువులందరూ సోదరులు ఏ హిందూ కూడా నీచుడు బాధితుడు కాడు హిందూ సం రక్షణమే నా దీక్ష సమానత్వమే నా మంత్రం.
"ప్రవాహినీ దేస్యా "అంటే సమాజము గతిశీలమైనది. ఈ పరిణామ క్రమంలో అనేక వికృతులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ప్రవేశించిన వికృతి అసమానత. విజ్ణులు ఈ విషయం తెలుసుకుని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. సమానతా మంత్రాన్ని ముక్తకంఠంతో ఏకగ్రీవంగా ఘోషిస్తారు. ఇది మన అందరికీ శిరోధార్యం కావాలి. మహాత్మాగాంధీ, డాక్టర్ అంబేద్కర్ ఆ ప్రయత్నానికే నడుము కట్టారు.
సమరసత సమాజంలో వెల్లి విరియాలి. ఈ సమర్ధత కలిగిన సమాజంలో అందరూ విధాయాస్య ధర్మస్య సంరక్షణం అని ధర్మరక్షణకు నడుం బీగి స్తారు. అప్పుడు సమాజంలో సంక్షేమం చోటు చేసుకుని నిలద్రొక్కుకొంటుంది.
--((***))--
విద్యా ధన మదో న్మత్తః యః కుర్యా త్పిత్రు హేళనం
స యాతి నరకం ఘోరం సర్వ ధర్మ బహిష్కృతః.... 86
అర్థము:--విద్యా ధన మదముతో కళ్ళు గానక పొగరు పోతు తనముతొ తండ్రినెవ్వడు చులకన చేయునో వాడు ధర్మచ్యుతుడై నరకమున బడును.
విద్యా ధనము చంచలమైనది. దానికి వీరు వారు అనే బేధాలు లేవు, నమ్మి కొలిచిన వారి ఇంట ధర్మంగా సంపాదించినా వారయినా నిలకడగా ఉంటుంది. అధర్మ పరులైనంత ఉంటుంది కానీ మనస్సును నిద్రను రానీయకుండా చేస్తుంది. కొడుకు మీద ప్రేమతో వారు ఎన్ని అన్న నోరు ఎత్తక ఈలోకంలో ఉన్నా "విద్యా ధన మదముతో కళ్ళు గానక పొగరు పోతు తనముతొ తండ్రినెవ్వడు చులకన చేయునో వాడు ధర్మచ్యుతుడై నరకమున బడును".
--((***))--
మనో ధావతి సర్వత్ర మదో న్మత్త గజా యధా
జ్ఞానాం కుశేన తన్విద్ధి తస్య నో ఛతి లతే మనః...... 87
అర్థము:-- మదించిన ఏనుగు లాంటిదైన యుక్తవయసులో మనసు దాని యిష్టము వచ్చినట్లు పరిగెడుతుంది జ్ఞానమనే అంకుశము తో దాన్నినియంత్రిచ గలగాలి (నియంత్రించ గలవాడి మనస్సు చలించదు)
శాస్త్రా ణ్య ధీత్యాపి భవన్తి మూర్ఖో
యస్తు క్రియావాన్ పురుషః స విద్యాన్
సుచింతితం ఔషధ మాతురాణం
న నాను మాత్రేణ కరోతి శాంతిమ్ ...... ....88
అర్థము:--- శాస్త్ర వాసన కలిగి పండితులైన చాలా మంది మూర్ఖులుగానే వుంటున్నారు. ఆచరణ చేయు క్రియావంతుడే విద్వాంసుడు గానీ వట్టి చదువుగలవాడు కాదు, గొప్ప ఔషధ మైనను రోగి బాధ ఔషధం పేరు చెబితేనే రోగ నివారణ కాదుకదా! బోధించుటకంటె
ఆచరణముఖ్యమని కవి చెప్పుచున్నాడు
వయోని ర్నాపి సంస్కారో న శ్రుతం న చ
కారణాని ద్విజత్వస్య వృత్తమే తస్య కారణం..... 89
అర్థము:-- పుట్టుక కానీ, సంస్కారము కానీ, పాండిత్యము కానీ, సంతతి కానీ ద్విజత్వమునకు (బ్రాహ్మణత్వమునకు) కారణములు గావు. నడవడి యొక్కటే దానికి కారణము. నడవడి మంచిది కానట్టయితే బ్రాహ్మణుడు కూడా శూద్ర సమానుడే.
న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమమయం కురంగః
తథాపి తృష్ణా రఘునందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి: ..... 90
అర్థము:-- బంగారు లేడిని ఎవరూ చూడలేదు,దానిని గురించి వినను కూడా లేదు. కానీ ఇవేమీ ఆలోచించ కుండా సీత అడిగిన వెంటనే రాముడు దానికోసము వెళ్ళినాడు కదా! కష్టములు రావలిసిన కాలము వచ్చినప్పుడు ఎవరికైనా ఇటువంటి విపరీత బుద్ధులు పుడుతుంటాయి కదా !
విద్యా ధన మదో న్మత్తః యః కుర్యా త్పిత్రు హేళనం
స యాతి నరకం ఘోరం సర్వ ధర్మ బహిష్కృతః....... 91
అర్థము:--విద్యా ధన మదముతో కళ్ళు గానక పోగరుపోతు తనముతొ తండ్రినెవ్వడు చులకన చేయునో వాడు ధర్మచ్యుతుడై నరకమున బడును.
మనో ధావతి సర్వత్ర మదో న్మత్త గజా యధా
జ్ఞానాం కుశేన తన్విద్ధి తస్య నో ఛతి లతే మనః...... 92
అర్థము:-- మదించిన ఏనుగు లాంటిదైన యుక్తవయసులో మనసు దాని యిష్టము వచ్చినట్లు పరిగెడుతుంది
జ్ఞానమనే అంకుశము తో దాన్నినియంత్రిచ గలగాలి (నియంత్రించ గలవాడి మనస్సు చలించదు)
శాస్త్రా ణ్య ధీత్యాపి భవన్తి మూర్ఖో
యస్తు క్రియావాన్ పురుషః స విద్యాన్
సుచింతితం ఔషధ మాతురాణం
న నాను మాత్రేణ కరోతి శాంతిమ్ .... .... 93
అర్థము:--- శాస్త్ర వాసన కలిగి పండితులైన చాలా మంది మూర్ఖులుగానే వుంటున్నారు. ఆచరణ చేయు క్రియావంతుడే విద్వాంసుడు గానీ వట్టి చదువుగలవాడు కాదు, గొప్ప ఔషధ మైనను రోగి బాధ ఔషధం పేరు చెబితేనే రోగ నివారణ కాదుకదా! బోధించుటకంటె
ఆచరణముఖ్యమని కవి చెప్పుచున్నాడు
****
సత్యమేవ వ్రతం యస్య దయా దీనేషు సర్వథా
కామ క్రోధౌ వాసే యస్య తేన లోక త్రయం జితం.... 94
అర్థము:-- ఎవనికి సత్యము పలుకుటే వ్రతమో, దీనుల పట్ల దయ చూపుటే నియమమో,
కామ క్రోధములు ఎవ్వనికి వశవర్తులై వుంటాయో అతనే ఈ మూడు లోకములు జయించిన వాడు.
స్వాయత్త మేకాంతహితం విధాత్రా
వినిర్మితం ఛాదన మజ్ఞతాయా:
విశేషతః సర్వవిదాం సమాజే
విభూషణం మౌన మపండితానాం. .... 95
అజ్ఞానమును కప్పిపుచ్చుటకై తప్పక ఉపకరించునది, తమ చేతిలోనే వున్నది యగు ఒక
ఉపాయము బ్రహ్మచే యేర్పరుపబడినది అది యేదనగా అన్ని విషయములు బాగుగా
తెలిసినవారున్న సమాజములో (సభలో) మాట్లాడకుండా మౌనము వహించుటయే
ఆపండితులకు అలంకారము. . (భర్తృహరి సుభాషితము)
***
, కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణైః కంఠగతైరపి !
అకర్తవ్యం న కర్తవ్యం ప్రణైః కంటే గతైరపి!!...... 96
భావము: కంఠములో ప్రాణం ఉన్నంత వరకు చేయవలసిన కర్తవ్యమును చేసియే తీరవలెను. ప్రాణములు గొంతు దాకా వచ్చి పోయే స్థితిలో ఉన్నప్పటికినీ చేయరాని పనిని పని చేయకూడదు.
సమాజంలో పనులు రెండు రకాలు 1 కావలసినవి చేయడానికి మనుషులో నమ్మకం ఉండాలి మరియు బాధ్యతతో వ్యవహరించాలి అప్పుడే చేయదగిన పనులు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా చేస్తాడు అటువంటి వాడే చేయకూడని పనులు ప్రాణాలు పోయినా సరే/ చేయకుండా ఉంటాడు
--(())--
యోవనం ధనసంపత్తి: పభుత్వమవివేకితా !
ఏకై కమప్యనర్ధాయ, కిముయత్ర చతుష్టయం!!..... 97
భావం: మానవుడు కన్నుమిన్ను గానని నడియవ్వనములో నుండుట, అప్పుడు ధనసంపదకల్గుట, అట్టి సంపద సమయంలో ఉన్నతో ద్యోగం లబించుట, ఈ మూడింటికి తోడుగా అట్టివానికి అవివేకం అ బ్బును అనే ఈ నాలుగు సన్నివేశాలలో మానవునకు ఏ ఒక్కటి ఉన్ననూ అది అతనిని
అనర్ధములలో పడవేయును, పైని చెప్పిన నాల్గును కలసి ఉన్నవాడు మూర్ఖాటి మూర్ఖుడై పతితుడై పోవును.
ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే
పయః పానం భుజంగానాం కేవలం విష వర్ధనం .... ... 99
తా:-నీచులకు ఉపకారము చేసినా వాళ్ళు మనకు అపకారమే చేస్తారు.ఎలాగయితే పాముకు పాలు పోయడం వలన దానికి విషము వృద్ధి యై మనల్ని కాటువేస్తుందో అలాగ.
ఆయుర్వేదేన నిర్ణీత మౌషధం రోగిణాం
జ్ఞానం తదైవ నిర్ణీతం సర్వేషాం భవ రోగిణాం ..... ... 100
అర్థము: ఆయుర్వేదము రోగముగల సర్వ మానవులకొఱకు ఎట్లు యేర్పడినదో అలాగున అజ్ఞాన రోగముగల సర్వ మానవులకు బ్రహ్మ జ్ఞానమను ఔషధము భవరోగము లను తగ్గించుట కొఱకు వేదము చే నిర్ణయింప బడి నది.
ప్రాంజలి ప్రభ ... రోజుకొక సంస్కృత శ్లోకం
యాంతి ధర్మ ప్రవృత్తస్య తిర్యం చోపి సహాయతాం
అపంథానంతు గచ్చానం సోదరోపి విముంచతి. ..... 101
అర్థము:-ధర్మ మార్గమున నడచు వానికి పశు పక్ష్యాదులు కూడా సహాయ పడతాయి.అధర్మ నార్గం లో నడిచే వానిని సోదరుడు కూడా విడిచి పెడతాడు.(సోదరుడు విడిచి పెట్టినా వానికి పాపము అంటదు)(రామునికి కోతులు సహాయము చేశాయి కదా!)
No comments:
Post a Comment