Tuesday, 25 May 2021

ప్రాంజలి ప్రభ పాత కధలు (31- 40)



Who do you see? Devata or Devi? | Creative Gaga

31......ఏనుగుపిల్ల::

ఓ అడవిలో ఎన్నో జంతువులు ఉండేవి. అవన్నీ దాహం తీర్చుకోవడానికి మధ్యలో ఉన్న చెరువుకి వెళ్లేవి. ఆ చెరువు చాలా పెద్దది. అందులో చేపలు, తాబేళ్లు, మొసళ్లు ఉండేవి.

అక్కడకు వచ్చే ఏనుగుల గుంపులో ఉండే పిల్ల ఏనుగుకు వెలక్కాయంత తిక్కుంది. తన బలం ముందు ఎవరూ సరిపోరని విర్రవీగుతూ, కోరి తగువులు తెచ్చుకుని ఏడిపించేది. చెరువు నీటిలో దాగి కాళ్లతో రొప్పుతూ బురద రేపేది. తొండంతో నీటిని జల్లి అలజడి సృష్టించేది. అలా చేయకూడదని చెప్పిన పెద్ద మొసలితో తగువు తెచ్చుకుని ‘దొంగతనంగా నీటిలో దాగి, గుటుక్కున మింగేసే కపట బుద్ధి మీది. నాకు నీతులు చెబుతావా’ అని ఎగతాళి చేసింది.

ఆ మాటలకు అన్ని మొసళ్లూ బాధపడ్డాయి. చేపలు, తాబేళ్లు వాటిని ఓదార్చాయి.

అది మొదలు పిల్ల ఏనుగు చెరువుకి వచ్చిన ప్రతిసారీ మరింత రెచ్చిపోయి చేపల్ని, తాబేళ్లని భయపెట్టి మొసళ్లని తిట్టి వెళ్లేది. రోజూ జరుగుతున్నది చూసిన ఓ కుర్ర మొసలికి పిల్ల ఏనుగుకి బుద్ధి చెప్పాలనిపించి పిల్ల ఏనుగు వచ్చినప్పుడు ‘కొండంత బలమున్న పిల్ల ఏనుగా! బాగున్నావా? ఓడిపోతానని తెలిసి నీతో పందెం కాయాలని ఉంది. నా కోరిక తీరుస్తావా?’ అని అడిగింది కుర్ర మొసలి.తాతల కాలంలో మొసలి చేతిలో భంగపడిన మచ్చ ఎలాగూ తమ జాతికి ఉంది. అది పోయే అవకాశం, సమయం వచ్చాయేమో అనుకున్న పిల్ల ఏనుగు పందెం గురించి అడిగింది. కుర్ర మొసలి ‘బలమైన తాడుకి ఒక చివర నేనూ రెండో వైపు నువ్వూ లాగుదాం. నా బలం నీటిలోనే కాబట్టి చెరువు అడుగుకి వెళతాను. నీ బలం ఉపయోగించి తాడు గుంజి ఒడ్డు మీదకి నన్ను రప్పించు. నువ్వు గెలిస్తే నీ మాట వింటాను. నేను గెలిస్తే మొసళ్లని ఏమీ అనకూడదు. నీటిని పాడు చేయకూడదు’ అంది.‘ఇంతేనా సరే’ అంది పిల్ల ఏనుగు.

పొలంలో ఉన్న రైతు దగ్గర్నించి తాడు తెచ్చింది కోతి. ఎలుగుబంటి ఏనుగు తరఫున, తాబేలు మొసలి తరుఫున న్యాయనిర్ణేతలుగా నిలబడ్డారు. తర్వాత రోజు పోటీ జరిగింది. బోలెడన్ని జంతువులు, పక్షులు పోటీని ఆసక్తిగా చూశాయి. తాడుకొస నోటితో పట్టుకుని నీట్లోకి వెళ్లింది కుర్ర మొసలి. రెండో కొస పట్టుకుని తొండంతో బలమంతా ఉపయోగించి తాడు లాగింది పిల్ల ఏనుగు. అంగుళమన్నా కదిలించలేకపోయింది. అలసిపోయింది తప్ప ఫలితం కనబడలేదు. పిల్ల ఏనుగు ఓటమిని ఒప్పుకొంది. తాబేలు వెళ్లి కుర్ర మొసలిని పిలిచింది. కుర్ర మొసలి ‘నీకూ చాలా బలముంది. ఒక దశలో ఓడిపోతానని అనుకున్నా’ అంది. ఆ మాటలకు పిల్ల ఏనుగు పొంగిపోయి బుద్ధిగా ఉంటానని మాట ఇచ్చింది. మొసళ్లు, చేపలు, తాబేళ్లు కుర్ర మొసలిని అభినందించి ‘నీలో ఇంత బలముందని ఊహించలేదు’ అన్నాయి. కుర్ర మొసలి నవ్వుతూ ‘గెలిచింది బలంతో కాదు తెలివితో’ అంది. అదెలా అని ఆశ్చర్యపోయి చూశాయి. అంతలో తాబేలు ‘మొసలన్నయ్య ఏం చేశాడో చెబుతా. నీళ్ల అడుగున బలమైన పురాతన చెట్టు మొదలు ఉంది కదా. దానికే తాడు కొసను కట్టేసి హాయిగా కూర్చున్నాడు. నేను రమ్మనగానే తాడు విప్పి నీటి మీదకు వచ్చాడు’ అంది.

విషయం తెలియగానే కుర్ర మొసలి తెలివికి ఆశ్చర్యపోయి ‘ఎలాగైతే నేం పిల్ల ఏనుగు తిక్క కుదిర్చి బుద్ధి చెప్పావని’ అభినందించాయి మొసళ్లు.

ఈనాడులో ప్రచురింపబడిన నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారి రచన.

191

ు. మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి' అని వేధించసాగింది. వాటిని వెళ్లగొట్టాలని అనుకుంటుండగా... ఓ రోజు వేటగాడు ఒక చిలుకను పట్టుకెళ్లి చిలుక జ్యోతిషం చెప్పేవానికి అమ్మడం కాకి చూసింది, జతలేని చిలుక బిక్కుబిక్కుమంటూ అల్లాడడం చూసి కాకి సంతోషంతో గంతులేసిందే కానీ,... చిలకల కిలకిలారావాలు, విన్యాసాలు కనపడకపోయే సరికి ఏదో వెలితిగా అనిపిస్తుండేది కాకికి.

కొన్ని రోజులు గడిచాయి. రచ్చబండ దగ్గరలోని బడిలో ఆ రోజు పర్యావరణ పరిరక్షణ గురించి, పక్షులు, జంతువులని కాపాడడం గురించి సైన్స్‌ టీచర్‌ ఇస్తున్న ఉపన్యాసం స్పీకర్లో వినబడుతోంది. కాకి ఉపన్యాసం వింటూ 'ఆ... ఈ మనుషులు, ఈ ఉపన్యాసాలూ, మాటలలో పక్షుల్ని, జంతువుల్ని రక్షించుకోవాలని చెప్పడం.. ఒకపక్క వాతావరణాన్ని కాలుష్యం చేస్తూనే ఉన్నారు'. అని నిట్టూర్చి ఆహార అన్వేషణకు బయలుదేరింది.

అప్పుడే ఒక ఇంటివద్ద కొందరు 'కావ్‌ ..... కావ్‌ అంటూ అరుస్తున్నారు. కాకికి పిండం పెట్టడానికి ఆ ఇంటి నుంచి కమ్మని పప్పు, వడలవాసన రావడంతో అక్కడే ఉన్న చెట్టుపై కాకి వాలింది. అంతలో అక్కడే ఉన్న ఇంటి అరుగుపై చిలకని కొన్న జ్యోతిష్యుడు కూర్చున్నాడు. అప్పుడే ఆ దారిలో పోతున్న ఒక పల్లెవాడు జ్యోతిష్యుడిని చూసి జ్యోతిషం చెప్పమన్నాడు. మంచి బేరం తగిలిందని సంతోషంతో వాడిని కూర్చోపెట్టి చిలకని బయటకురమ్మని పక్కన ఉన్న అట్టముక్కలలో ఒకదాన్ని తీయమన్నాడు. చిలక పంజరం నుంచి బయటకు వచ్చి కార్డు తీసిచ్చి నీరసంగా లోపలికి వెళ్లింది.

ఇదంతా గమనిస్తున్న కాకికి బడిలో వాళ్ల ఉపన్యాసం గుర్తుకొచ్చింది. 'మమ్మల్ని దేవతల వాహనాలుగాను, శాస్త్రాలకు ఆపాదించి ఉపయోగించుకోవడం తప్ప ఈ మనుషులు మనల్ని రక్షించడం అటుంచి... మమ్మల్ని మేమే రక్షించుకోవాలి. ఇందుకు మనలో ఐక్యత లేకపోవడం ఒక కారణం.. పాపం చిలుక..! ఎంతో తెలివిగలవాడైన మనిషి పనీ పాట లేకుండా ఈ చిన్న చిలకతో డబ్బు సంపాదిస్తున్నాడు. ఎలాగైనా రక్షించాలి' అని అనుకుంటుండగా అప్పటికే అక్కడకు కాకులు వచ్చి చేరగా వాటికి విషయం చెప్పి వాటితో సరేననిపించింది. అవకాశం కోసం చూస్తుండగా మరొకడు జ్యోతిషం చెప్పించుకోవడానికి రావడం, చిలుక పంజరం నుంచి బయటికి రావడం, కాకులన్నీ కలిసి జ్యోతిష్యుడిపై దాడి చేయడం అన్నీ ఒక్క సారిగా జరిగిపోయాయి. జ్యోతిష్యుడు పారిపోవడంతో వెంటనే 'రా చిలకమ్మా పోదాం.. నీ పెనిమిటి దిగులు పెట్టుకున్నాడు.' అనగానే ఎక్కడలేని హూషారుతో చిలుక రివ్వున ఎగిరింది.

అప్పుడే బడి పిల్లలు పర్యావరణ ర్యాలీ బయలుదేరి అటువైపు రాసాగింది. ఆకాశంలో ర్యాలీనీ చూస్తూ స్వేచ్ఛగా కాకులు, చిలుక ఎగిరిపోసాగాయి.

ప్రజాశక్తి లో ప్రచురించబడిన శ్రీ కంచనపల్లి ద్వారకానాథ్‌ గారి రచన.

--(())--

32...ఒక #గురువు తన ఇద్దరు 

#శిష్యుల్ని పిలిచి ‘ఈరోజు మీరిద్దరూ యాభై కోసుల దూరం వెళ్లాలి.’ అన్నాడు. ఒక శిష్యుడికి ఓ సంచిలో #తినుబండారాలు నింపి ఇచ్చి ‘ఎవరైనా వీటి అవసరం ఉన్నవాళ్లు కనిపిస్తే వారికి #పంచుకుంటూ వెళ్లు’ అన్నాడు. 

#రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి ‘దారిలో విలువైన వస్తువు ఏదైనా కనిపిస్తే దాన్ని సంచిలో #వేసుకుంటూ వెళ్లు’ అన్నాడు. 

ఇద్దరూ #సంచుల్ని భుజాలకి తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టారు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. 

ఖాళీ సంచివాడు ఆడుతూపాడుతూ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక అతనికి ఒక #బంగారురాయి దొరికింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక మరొకటి కనిపించింది. దాన్నీ తీసి సంచిలో వేసుకున్నాడు. అలా ఎక్కడ బంగారు రాయి కనిపిస్తే దాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు. దాంతో సంచి #బరువెక్కసాగింది. 

నడక #భారంగా మారింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది. ఉండేకొద్దీ అడుగు తీసి అడుగేయడమే చాలా కష్టమైపోయింది. 

ఇక #రెండోవాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తిను బండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్లాడు. క్రమంగా సంచి #బరువు_తగ్గినడక #సులభం అయింది. 

పంచుకుంటూ వెళ్లినవాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు. 

పోగేసుకుంటూ వెళ్లిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. ప్రయాణమూ కష్టంగా సాగింది. 

మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి... 

మీ #గమ్యాన్ని ఎలా చేరుకోదలచుకున్నారు..?

.......(సేకరణ)........


--((***))--

33....ఏనుగుపిల్ల::

ఓ అడవిలో ఎన్నో జంతువులు ఉండేవి. అవన్నీ దాహం తీర్చుకోవడానికి మధ్యలో ఉన్న చెరువుకి వెళ్లేవి. ఆ చెరువు చాలా పెద్దది. అందులో చేపలు, తాబేళ్లు, మొసళ్లు ఉండేవి.

అక్కడకు వచ్చే ఏనుగుల గుంపులో ఉండే పిల్ల ఏనుగుకు వెలక్కాయంత తిక్కుంది. తన బలం ముందు ఎవరూ సరిపోరని విర్రవీగుతూ, కోరి తగువులు తెచ్చుకుని ఏడిపించేది. చెరువు నీటిలో దాగి కాళ్లతో రొప్పుతూ బురద రేపేది. తొండంతో నీటిని జల్లి అలజడి సృష్టించేది. అలా చేయకూడదని చెప్పిన పెద్ద మొసలితో తగువు తెచ్చుకుని ‘దొంగతనంగా నీటిలో దాగి, గుటుక్కున మింగేసే కపట బుద్ధి మీది. నాకు నీతులు చెబుతావా’ అని ఎగతాళి చేసింది.

ఆ మాటలకు అన్ని మొసళ్లూ బాధపడ్డాయి. చేపలు, తాబేళ్లు వాటిని ఓదార్చాయి.

అది మొదలు పిల్ల ఏనుగు చెరువుకి వచ్చిన ప్రతిసారీ మరింత రెచ్చిపోయి చేపల్ని, తాబేళ్లని భయపెట్టి మొసళ్లని తిట్టి వెళ్లేది. రోజూ

జరుగుతున్నది చూసిన ఓ కుర్ర మొసలికి పిల్ల ఏనుగుకి బుద్ధి చెప్పాలనిపించి పిల్ల ఏనుగు వచ్చినప్పుడు ‘కొండంత బలమున్న పిల్ల ఏనుగా! బాగున్నావా? ఓడిపోతానని తెలిసి నీతో పందెం కాయాలని ఉంది. నా కోరిక తీరుస్తావా?’ అని అడిగింది కుర్ర మొసలి.

తాతల కాలంలో మొసలి చేతిలో భంగపడిన మచ్చ ఎలాగూ తమ జాతికి ఉంది. అది పోయే అవకాశం, సమయం వచ్చాయేమో అనుకున్న పిల్ల ఏనుగు పందెం గురించి అడిగింది. కుర్ర మొసలి ‘బలమైన తాడుకి ఒక చివర నేనూ రెండో వైపు నువ్వూ లాగుదాం. నా బలం నీటిలోనే కాబట్టి చెరువు అడుగుకి వెళతాను. నీ బలం ఉపయోగించి తాడు గుంజి ఒడ్డు మీదకి నన్ను రప్పించు. నువ్వు గెలిస్తే నీ మాట వింటాను. నేను గెలిస్తే మొసళ్లని ఏమీ అనకూడదు. నీటిని పాడు చేయకూడదు’ అంది.

‘ఇంతేనా సరే’ అంది పిల్ల ఏనుగు.

పొలంలో ఉన్న రైతు దగ్గర్నించి తాడు తెచ్చింది కోతి. ఎలుగుబంటి ఏనుగు తరఫున, తాబేలు మొసలి తరుఫున న్యాయనిర్ణేతలుగా నిలబడ్డారు. తర్వాత రోజు పోటీ జరిగింది. బోలెడన్ని జంతువులు, పక్షులు పోటీని ఆసక్తిగా చూశాయి. తాడుకొస నోటితో పట్టుకుని నీట్లోకి వెళ్లింది కుర్ర మొసలి. రెండో కొస పట్టుకుని తొండంతో బలమంతా ఉపయోగించి తాడు లాగింది పిల్ల ఏనుగు. అంగుళమన్నా కదిలించలేకపోయింది. అలసిపోయింది తప్ప ఫలితం కనబడలేదు. పిల్ల ఏనుగు ఓటమిని ఒప్పుకొంది. తాబేలు వెళ్లి కుర్ర మొసలిని పిలిచింది.

కుర్ర మొసలి ‘నీకూ చాలా బలముంది. ఒక దశలో ఓడిపోతానని అనుకున్నా’ అంది. ఆ మాటలకు పిల్ల ఏనుగు పొంగిపోయి బుద్ధిగా ఉంటానని మాట ఇచ్చింది.

మొసళ్లు, చేపలు, తాబేళ్లు కుర్ర మొసలిని అభినందించి ‘నీలో ఇంత బలముందని ఊహించలేదు’ అన్నాయి. కుర్ర మొసలి నవ్వుతూ ‘గెలిచింది బలంతో కాదు తెలివితో’ అంది. అదెలా అని ఆశ్చర్యపోయి చూశాయి. అంతలో తాబేలు ‘మొసలన్నయ్య ఏం చేశాడో చెబుతా. నీళ్ల అడుగున బలమైన పురాతన చెట్టు మొదలు ఉంది కదా. దానికే తాడు కొసను కట్టేసి హాయిగా కూర్చున్నాడు. నేను రమ్మనగానే తాడు విప్పి నీటి మీదకు వచ్చాడు’ అంది.

విషయం తెలియగానే కుర్ర మొసలి తెలివికి ఆశ్చర్యపోయి ‘ఎలాగైతే నేం పిల్ల ఏనుగు తిక్క కుదిర్చి బుద్ధి చెప్పావని’ అభినందించాయి మొసళ్లు.

ఈనాడులో ప్రచురింపబడిన నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారి రచన.

--((***))--

34. దుష్టులతో స్నేహం::

{పంచతంత్ర కథ}

జంబూద్వీపంలో ఓ అడవి ఉంది. దాని పేరు కామ్యకం. అందులో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఓ పొద ఉంది. ఆ పొదలో ఓ పులి ఉండేది. దానికి దగ్గర్లోనే ఓ జువ్విచెట్టుంది. ఆ చెట్టు మీద ఓ కొంగ ఉండేది. గూడుకట్టుకుని ఉందక్కడ కొంగ. ఒక రోజు దుప్పిని వేటాడింది పులి.

తనివి తీరా దాని మాంసం తింది. మాంసం తింటుంటే ఓ చిన్న ఎముక ముక్క పళ్ళల్లో గుచ్చుకుపోయింది. బయటికి రాదు, లోనికి పోదు. భరించలేకపోయింది పులి. నానా బాధలూ పడింది దాంతో. నాలికతో ఎముకముక్కని లాగి లాగి చూసింది. రాలేదది. నాలిక కూడా తెగినట్టుగా ఉంది. మండుతోంది. దాంతో పిచ్చి పిచ్చిగా తయారయింది. పెద్ద పెద్దగా కేకలేస్తూ గాండ్రించసాగింది.

దాన్ని కొంగ గమనించి పులిని అడిగిందిలా. ‘ఏమయింది?’‘పళ్ళల్లో ఎముక ముక్క ఇరుక్కుంది. రావట్లేదు. చాలా బాధగా ఉంది.’ అంది పులి.‘ఎక్కడా?’ నోరు తెరవమంది కొంగ. తెరిచింది పులి.‘అదా’ చూసింది కొంగ.‘అవును, తీసిపెడదూ, నీకు పుణ్యం ఉంటుంది.’ బ్రతిమలాడింది పులి. కళ్ళు చెమర్చుకుంది. జాలిపడింది కొంగ. తన పొడుగాటి ముక్కుతో పులి నోట్లో ఇరుక్కున్న ఎముక ముక్కని తీసి పారేసింది. అది మొదలు, ఆ రెండూ మంచి స్నేహితులయ్యాయి. ఎవరి వేట వారు సాగిస్తూ, తిన్న తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకునేవి.


కొన్నాళ్లు గడిచాయి. ఒకనాడు పులి అడవంతా తిరిగినా ఆహారం దొరకలేదు. దానికి ఆకలి బాధ చాలా ఎక్కువగా ఉంది.


పులి దుర్మార్గమైంది కదా! వెంటనే ఒక ఆలోచన చేసింది. తనకంత మేలు చేసిన కొంగను చంపి తిని, ఆకలి తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇంతకు ముందులాగే బాధపడుతున్నట్లు నటించింది. కొంగ పులి మోసం తెలుసుకోలేక పోయింది. అంగిట్లో ఎముకను తీద్దామని పులి నోట్లో తన ముక్కును పెట్టింది. వెంటనే పులి దాని మెడ కొరికి చంపి, తినేసింది.

నీతి : దుష్టులను నమ్మి స్నేహం చేయకూడదు.

మరేమో #ఆషాడమాసం గురించి మొన్న ఒకళ్ళు అడిగారండి ... వాళ్ళకి ఒక్కలికే చెప్పేకంటే ఇలా ఇక్కడ చెప్తే దీని గురించి తెలియని కొంత మందికి తెలుస్తాది అని చెప్తునామండి 

--(())--

35....#ఆషాడమాసం అంటే ... డిస్కౌంట్ సేల్ కాదండి బాబు దాని ఎనక చానా కథ ఉందండి .. ఓపిక చేసుకొని చదివేయండి మరి 😊

చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాషాఢ నక్షత్రం సమీపంలో గాని సంచరిస్తాడు కనుక ఈ మాసాన్ని “ ఆషాఢమాసం ” అని అంటారు. ఇప్పుడే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. దీనిని సూన్యమాసం అని కూడా అంటారండి .. సూన్యమాసం అంటే శుభకార్యాలకు అనుగుణంగా లేని మాసం అని అర్ధం ... 

ఆషాడమాసం లో పూర్వం నుండి పాటించే కొన్ని సంప్రదాయాలు చూస్తే ఈ ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లై అత్తవారింటికి వచ్చిన కొత్త కోడలు , అత్తగారు ఒకేచోట ఉండకూడదు అని అంటారు. అలాగే అత్తా అల్లుడు కూడా ఎదురు పడకూడదు అని అంటారు. అలా ఎందుకు అంటే పూర్వం మనకి వ్యవసాయమే జీవనాధారం. కొత్త వలపు మోజులో పడి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తారు అని పూర్వం ఈ నిబంధన పెట్టినట్టు మనకి పూర్వికులు చెబుతారు. ఏరువాక ( మొదటి పంట ) మొదలై పొలం పనులు జోరందుకునే సమయం ఇది ఈ సమయంలో కొత్త అల్లుడు ఇంటికి వస్తే అత్తింటివారు అతిధి మర్యాదలు చేయడానికి కుంచెం ఇబ్బంది పడతారని, అందులోను పెళ్ళైన మొదట్లో భార్య భర్తలకు ఒకరిమీద ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఈ మాసంలో దూరంగా ఉంటె ఎడబాటు బాధ కూడా వారికీ తెలుస్తుంది. అది వారి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది అందుకే పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టినట్టు చెబుతారు. 

ఇక సైన్స్ ప్రకారం చూస్తే కొత్తగా పెళ్ళైన జంట ఈ నెలలో కలిసి ఉన్న కారణంగా గర్భం వస్తే బిడ్డపుట్టే సమయానికి ఎండాకాలం వస్తుంది. అప్పుడు ఎండలు మరింత ఎక్కువగా ఉంది బాలింతరాలు (తల్లి), పసిపాపలు తట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. అందువలన ఈ మాసంలో దూరంగా ఉండమని చెబుతారు. ఈ మాసంలో వాతావరణ మార్పులు కూడా చాలానే వస్తాయి ఎండలు తగ్గిపోయి వర్షాలు రావడం ఇప్పుడే మొదలవుతుంది ఆలా ఒక్కసారే వాతావరణం మారడం వలన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి ఈ సమయంలో గర్భం వస్తే అవి పుట్టబోయే బిడ్డమీద ప్రభావం చూపుతాయని ఒక నమ్మకం ...

--(())--

36..ఇకపోతే ఆషాఢమాసం అంటే మగువల చేతికి #గోరింటాకు

నిత్యం పనుల్లో ఉండే మహిళల చేతులు, పాదాలు పగిలిపోతూ ఉంటాయి. ప్రధానంగా వర్షాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసేశక్తి ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరీయా లక్షణాలు ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినే టప్పుడు నోటి ద్వారా క్రిములు వెల్లకుండా కాపాడుతుందని చెబుతుంటారు. అందుకే ఆషాడంలో గోరింటాకు ఎక్కువగా పెట్టుకుంటారు. ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని కూడా అంటారనుకోండి అది వేరే విషయం ... కాని ఈ కోన్ లు పెట్టుకునే చేతుల కంటే గోరింటాకు పెట్టుకొని పండిన చేతులు చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు చాలా పద్ధతులు మారిపోయాయి కాబట్టి పట్టించుకోవడం లేదు పెద్దగా కాని ఒకప్పుడు గోరింటాకు కోసం పది మంది కలిసి ఎక్కడ చెట్లు ఉన్నాయా అని వెతికేవారు. రుబ్బి చేతులకు కాళ్ళకు పెట్టుకొని మరుసటి రోజు అందరికి భలే పండింది అని చాలా ఆనందంగా చెప్పుకునేవారు.

ఇంతకీ ఆషాఢమాసం ఎప్పుడో చెప్పలేదు చూసారా ... మొన్న " జులై 3 నుండి ఆగష్టు 1 వరకు " అండి ( తెలుగు పంచాంగం ప్రకారం )

వామ్మో ఇంత స్టోరీ రాస్తుంటే  ఇదంతా చదువుతున్నారో లేదో

ికి పోయాడు భటులు వాడిని జమీందారు దగ్గరకు తీసుకు వచ్చి సోదా చేస్తే వజ్రాల సంచీ కనిపించింది అయితే అందులో 99 మాత్రమే ఉన్నాయి.

ఏదీ మరో వజ్రం బయటకి తియ్‌ అంటూ జమీందారు గద్దించాడు ఆ దొంగ వణికి పోతూ నేను సంచీ విప్పి చూస్తే వజ్రాలు కనిపించాయి వాటిని సంచీలో వేసుకుని పారిపోయానేగానీ, ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు అన్నాడు ఆ సమాధానం విన్న మల్లన్నకి వణుకు పుట్టింది వెంటనే దొంగ దగ్గరకి వెళ్లి వాడి చెంప మీద కొట్టి నిజం చెప్పకపోతే వూరుకునేది లేదు అంటూ దబాయించాడు ఆ వూపులో అనుకోకుండా మల్లన్న తలపాగా కిందపడి వందో వజ్రం బయటకి దొర్లింది జమీందారు సంగతంతా గ్రహించి, ఇద్దరూ దొంగలే చెరో వంద కొరడా దెబ్బలు కొట్టి తరిమేయండి అన్నాడు కోపంగా.

అది విన్న మల్లన్న మొండిగా ఇది అన్యాయం 99 వజ్రాల దొంగకి, ఒకటి తీసుకున్న నాకూ శిక్ష ఒకటేనా అని ఎదిరించాడు జమీందారు ఒక్క క్షణం ఆలోచించి సరే నువ్వన్నట్టే శిక్ష మారుస్తాను అంటూ దొంగవైపు తిరిగి నువ్వు ఎన్ని దొంగిలించావు అని అడిగాడు, తొంభై తొమ్మిది అన్నాడు దొంగ, అయితే నీకు 99 కొరడా దెబ్బలు అన్న జమీందారు, ఆపై మల్లన్న వైపు తిరిగి, నువ్వు ఎన్నో వజ్రం దొంగిలించావు అని అడిగాడు, వందోది అన్నాడు మల్లన్న అయితే వందో దెబ్బ నీకు అన్నాడు జమీందారు అమ్మయ్య అనుకున్నాడు మల్లన్న.

భటులు ముందుగా దొంగకి తొంభై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు. మల్లన్న వెంటనే ఆ వందోది నాకు వేసేయండి అన్నాడు జమీందారు నవ్వి వందో దెబ్బ తినాలంటే మొదట తొంభైతొమ్మిదీ భరించాలి కదా కీలకమైన బాధ్యతలో ఉంటూ నమ్మకద్రోహం చేసిన నువ్వు ఆ దొంగ కన్నా ప్రమాదకారివి అన్నాడు. మల్లన్న తెల్లబోయి మొత్తం వంద కొరడా దెబ్బలూ తిన్నాడు.

--(())--

37...... సెప్టెంబర్ 26, 2019 ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవంగా జరుపబడుతుంది. 2007 లో ప్రారంభమైన ఈ కార్యక్రమం, యువతలో జనన నియంత్రణలలో విభిన్న పద్ధతుల గురించిన అవగాహన పెంచే లక్ష్యంతో ప్రారంభించబడింది. కేవలం ప్రపంచ జనాభాని దృష్టిలో ఉంచుకోవడమే కాకుండా, పరిస్థితుల కారణంగా పిల్లలు తాత్కాలికంగా వద్దు అనుకునే వారిని కూడా దృష్టిలో ఉంచుకుని ఈ రోజును ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రపంచ గర్భ నిరోధక దినం యుక్క నినాదం (థీమ్) "ఇది మీ జీవితం, ఇది మీ బాధ్యత". హిందూస్తాన్ టైమ్స్ గణాంకాల నివేదిక ప్రకారం, భారతదేశంలో 47.8% మంది మహిళలు గర్భ నిరోధక పద్దతులను వినియోగిస్తున్నారని వెల్లడించింది. కానీ వారికి పూర్తి స్థాయిలో ఇతర గర్భ నిరోధక పద్దతుల గురించిన వివరాలు తెలియవని, మరియు అనేకమందికి ఉత్తమమైన గర్భ నిరోధక పద్దతుల గురించిన అవగాహన లేదని కూడా చెప్పడం జరిగింది. మీ ప్రాధాన్యత మరియు ఆరోగ్య స్థితిని అనుసరించి మాత్రమే గర్భనిరోధక పద్ధతులు ఎంపిక చేయబడతాయి. వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఈ జనన నియంత్రణ పద్దతులు మారుతూ ఉంటాయి. ఈ వ్యాసంలో, వివిధ రకాలైన తాత్కాలిక జనన నియంత్రణ పద్ధతుల గురించిన పూర్తి వివరాలను పొందుపరచడం జరిగింది. మరియు ఇవి మహిళలకు ఏవిధమైన ఫలితాలను ఇస్తాయో కూడా చర్చించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు వ్యాసం చూడండి. ఇక్కడ వివిధ రకాల జనన నియంత్రణ పద్ధతులు ఉన్నాయి: 

1. కండోమ్ 2. గర్భ నిరోధక మాత్రలు 3. గర్భ నిరోధక ఇంజెక్షన్ 4. ఇంట్రా - యుటరిన్ (అంతర్గత గర్భాశయం) పరికరం (IUD) 5. వెజైనల్ (యోని) రింగ్.

 1. కండోమ్ : నిజానికి వాడకం తెలిస్తే దీనంత ఉత్తమమైన పద్దతి లేదు అని చెప్పవచ్చు. ఎటువంటి దుష్ప్రభావాల జోలికి వెళ్ళని ఆరోగ్యకర మార్గంగా సూచించబడుతుంది. కండోమ్ గర్భధారణను నివారించడానికి వినియోగించే సాధారణమైన పద్ధతిగా ఉండడమే కాకుండా, జంటను లైంగిక సంక్రమణ వ్యాధులు(STDs) మరియు ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది మరియు సురక్షితమైన లైంగిక సంభోగాన్ని ప్రోత్సహిస్తుంది. కండోమ్ వాడకం, మహిళల యోనిలోకి వీర్య కణాలను ప్రవేశించకుండా నిరోధిస్తుంది. క్రమంగా గర్భం రాకుండా అడ్డుకోగలుగుతుంది. ఏదిఏమైనా మిగిలిన అన్ని పద్దతుల కన్నా కండోం వాడకం శ్రేయస్కరం అని వైద్యులు సైతం సూచిస్తుంటారు. 

2. గర్భ నిరోధక మాత్రలు : నిజానికి ఈ గర్భ నిరోధక మాత్రలు, అండోత్సర్గ ప్రక్రియను ఆపి గర్భం రాకుండా నిరోధించగలుగుతాయి. ఈ మాత్రలు గర్భాశయంలో, గర్భవతికి సమానమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంటాయి. అనగా స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు అండం విడుదల కాని విధంగా. ఇటువంటి వాతావరణాన్ని గర్భాశయంలో సృష్టించడం ద్వారా, గర్భనిరోధక మాత్రలు గర్భం నివారించడంలో ప్రభావాన్ని కలిగి ఉంటాయి. గర్భనిరోధక మాత్రల వాడకం అనేకరకాల దుష్ప్రభావాలను కలుగజేస్తాయి. కావున వైద్యుని సూచనలు అవసరమని మరువకండి. మరియు దీర్ఘకాలికంగా వాడడం అనేక ఇతర తీవ్ర దుష్పరిమాణాలకు దారితీస్తుంది. ఈ దుష్ప్రభావాలలో కొన్ని, వికారం, తలనొప్పి, కడుపు ఉబ్బరం, తీవ్ర రక్తస్రావం, రొమ్ముల సున్నితత్వం, శరీరంలో నీరు చేరడం మొదలైనవిగా ఉంటాయి. ఈ మాత్రలు మహిళల హార్మోన్లను సైతం ప్రభావితం చేస్తాయి, మరియు హార్మోనుల అసమతుల్యానికి దారితీస్తుంది. కావున వారు తీసుకునే మందులు శరీరతత్వం మీద ఆధారపడి వైద్యులు ధృవీకరించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. 

3. గర్భ నిరోధక ఇంజెక్షన్ : ఇది మరొక ఉత్తమ గర్భ నిరోధక పద్ధతిగా చెప్పబడుతుంది. గర్భం నిరోధించడానికి హార్మోన్ షాట్లను మహిళలకు ఇస్తారు. గర్భ నిరోధక పద్దతులలో మాత్రల కన్నా, తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. ఈ షాట్స్ ప్రోజెస్టోజెన్ అని పిలువబడే హార్మోన్ను కలిగి ఉంటాయి. ఈ సూది మందులు ఎటువంటి ఈస్ట్రోజెన్ హార్మోనులను కలిగి లేనందున, మహిళలు ఎదుర్కొనే దుష్ప్రభావాల అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఇది వరకే హార్మోన్ సంబంధిత సమస్యలతో భాదపడుతున్న వారు మాత్రం వైద్యుని సూచనల ప్రకారం నడుచుకోవలసి ఉంటుంది. 

4. అంతర్గత గర్భాశయ పరికరాలు (IUD) : గర్భనిరోధక మాత్రలు మరియు ఇంజెక్షన్ రూపంలో కాకుండా, ఈ అంతర్గత గర్భాశయ పరికరాల వాడకం, హార్మోనులతో సంబంధంలేని సురక్షిత మార్గంగా చెప్పబడుతుంది కూడా. IUD అనేది ప్రాథమికంగా ఒక T - ఆకారపు పరికరంగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యుల ద్వారా మాత్రమే గర్భాశయంలోకి చొప్పించబడుతుంది. ఇది 5 నుండి 10 సంవత్సరాల వరకు గర్భాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. మరియు అత్యంత సమర్థవంతమైన జనన నియంత్రణ పద్ధతిగా కూడా చెప్పబడింది. అయినా కూడా కొన్ని ప్రతికూల ప్రభావాల కారణంగా ప్రజలు దీనిపట్ల ఆసక్తిని కనపరచడం లేదు. ఈ పరికరంతో కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. పరికరం గర్భాశయంలోకి చొచ్చుకుని పోవడం, లేదా మీ శరీరంలో కొన్ని ప్రతికూల లక్షణాలను ప్రేరేపించడం వంటివి. క్రమంగా శస్త్రచికిత్స ద్వారా దీనిని తొలగించాల్సిన అవసరం ఉంటుంది.

 5. వెజైనల్ (యోని) రింగ్ : ఇది హార్మోన్స్ నిండిన రింగ్ వలె ఉంటుంది. ఇది గర్భ నిరోధకంగానే కాకుండా, మహిళలకు ఇతర దుష్ప్రభావాలు లేకుండా రక్షణ అందించేదిగా కూడా ఉంటుంది. ఈ రింగ్ మహిళ యొక్క యోనిలోకి మానవీయంగా చొప్పించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఈ కారణం చేత అనేకమంది మహిళలు, ఈ పద్ధతి పట్ల అసౌకర్యానికి గురవుతుంటారు. గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించినప్పుడు, అవి కాలేయం ద్వారా ప్రేగులలోనికి శోషించబడి, ఆ తర్వాత గర్భ నిరోధకంగా పనిచేస్తాయి. కానీ ఒక వెజైనల్ రింగ్ ఉపయోగించినప్పుడు, నేరుగా రక్త ప్రవాహంలోకి శోషించబడతాయి. క్రమంగా గర్భ నిరోధక మాత్రలు, ఇంజెక్షన్లతో పోల్చినప్పుడు హార్మోన్ అసమతుల్యత అనేది తక్కువగా ఉంటుంది. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను తెలపండి  

--(())--

38.....భగత్ సింగ్ పుట్టినరోజు ఈరోజు

భరతమాత ముద్దుబిడ్డ జోహార్!!

ఇలాటి వీరుల బలిదానం వలన వచ్చిన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న మనం

కనీసంగా తలచుకోవలసిన రోజు-

ఒక పాట ఈ సందర్భంగా విందాం..

భగత్ సింగ్ జీవితచరిత్ర,స్వాతంత్ర సంగ్రామంలో అతని పాత్ర గురించిన విశేషాలు -(వికీపీడియానుండి)

భగత్ సింగ్ పంజాబ్‌లోని లాయల్‌‌పూర్ జిల్లా, బంగా సమీపంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ మరియు విద్యావతి దంపతులకు పుట్టిన సంధు ఝాట్ కుటుంబీకుడు.భగత్ అనే పదానికి "భక్తుడు" అని అర్థం. సింగ్‌ యొక్క దేశభక్త సిక్కు కుటుంబంలోని కొందరు భారత స్వాతంత్ర్యోద్యమాల్లోనూ మరికొందరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలోనూ పనిచేశారు భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్‌ను చంకకెత్తుకొని, తన స్నేహితుడు నందకిశోర్ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. వెంటనే కిందికి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు. తండ్రి " ఏం చేస్తున్నావ్ నాన్నా" అని ప్రశ్నిస్తే, భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని వాళ్ళు అవాక్కయ్యారు. భగత్ సింగ్ అన్న మాటలివి " తుపాకులు నాటుతున్నా". భవిష్యత్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. విద్యార్థి దశలో స్కూల్లో కూడా ఆటపాటల్లోనే కాదు అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్ కౌర్ ను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు. స్వామి దయానంద సరస్వతి అనుచరుడైన సింగ్ తాత అర్జున్ సింగ్ హిందూ సంస్కరణ ఉద్యమం, ఆర్యసమాజ్‌లో భాగం కావడం కూడా ఆయనపై విపరీతమైన ప్రభావం పడేందుకు దోహదపడింది. ఆయన పినతండ్రులు అజిత్ సింగ్, స్వరణ్ సింగ్ తండ్రులు కర్తార్ సింగ్ సారభా గ్రివాల్ మరియు హర్ దయాల్ నేతృత్వంలోని గద్దర్ పార్టీ సభ్యులే. తనపై ఉన్న అపరిష్కృత కేసుల కారణంగా అజిత్ సింగ్ పెర్సియాకు పారిపోగా, కకోరి రైలు దోపిడీ 1925లో హస్తముందంటూ స్వరణ్ సింగ్‌ను 19 డిసెంబరు 1927న ఉరితీశారు. బ్రిటీషు సంస్థల యెడల పాఠశాల అధికారులకు ఉన్న విధేయత ఆయన తాతకు నచ్చకపోవడంతో భగత్ తన వయస్సు సిక్కులు వలె లాహోర్‌లోని ఖల్సా ఉన్నత పాఠశాలకు హాజరు కాలేదు.బదులుగా ఆర్యసామాజిక పాఠశాల దయానంద్ ఆంగ్లో వేదిక్ ఉన్నత పాఠశాలలో భగత్‌ను ఆయన తండ్రి చేర్పించాడు 13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో  ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. ఆయన అహింసావాదంపై అసంతృప్తి చెందిన సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి, తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు.

1923లో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ నిర్వహించిన వ్యాసరచనా పోటీలో భగత్ విజయం సాధించాడు. దాంతో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ భీమ్ సేన్ విద్యాలంకార్ సహా పలువురు సభ్యుల దృష్టిని ఆకర్షించాడు. ఆ వయసులోనే ప్రముఖ పంజాబీ సాహిత్యాన్ని ఉటంకించడమే కాక పంజాబ్ సమస్యల ను ప్రస్తావించాడు. పంజాబీ రచయితలు మరియు సియోల్‌కోట్‌కు చెందిన తనకెంతో ఇష్టమైన కవి అల్లామా ఇక్బాల్ రాసిన పలు కవితలు, సాహిత్యాన్ని ఆయన పఠించాడు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు భగత్ సింగ్ లాహోర్‌]లోని నేషనల్ కాలేజ్‌లో విధ్యనభ్యసించాడు. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని ఆయన ఇల్లు విడిచి పారిపోయి నౌజవాన్ భారత్ సభ ("భారత యువ సంఘం")లో చేరాడు నౌజవాన్ భారత్ సభ ద్వారా భగత్ ఆయన సహ విప్లవకారులు యువత దృష్టిని ఆకర్షించారు. ప్రొఫెసర్ విద్యాలంకార్ విజ్ఞప్తి మేరకు అప్పట్లో రామ్‌ప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫాఖుల్లా ఖాన్ నాయకత్వం వహిస్తున్న హిందూస్తాన్ గణతంత్ర సంఘంలోనూ సింగ్ చేరాడు.కకోరి రైలు దోపిడీ గురించి ఆయనకు అవగాహన ఉందని భావించారు. ఆయన అమృత్‌సర్ నుంచి ప్రచురించబడిన ఉర్దూ మరియు పంజాబీ వార్తాపత్రికలలో వార్తలను వ్రాశాడు మరియు సరిదిద్దాడు.సెప్టెంబరు 1928లో దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది విప్లవకారులు కీర్తి కిసాన్ పార్టీ పేరుతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. దానికి భగత్ సింగ్ కార్యదర్శిగా వ్యవహరించాడు. అనంతరం సంఘం అధ్యక్షుడిగా భగత్ పలు విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాడు. HRA ప్రధాన నాయకులను పట్టుకుని ఉరితీయబడిన కారణంగా ఆయన తన సహ విప్లవకారుడు సుఖ్‌దేవ్ థాపర్‌తో పాటు అనతికాలంలోనే ప్రత్యేక అధికారాన్ని చేజిక్కుంచుకోవడానికి కారణమైంది.

ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాతే కాదు అంతకు ముందు నుంచి కూడా కటకటాల వెనకాల భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ, విప్లవకారుడు రాంప్రసాద్ భిస్మిల్ వ్రాసిన ఈ పాటను పాడేవాడు.

మేరా రంగ్ దే బసంతీ చోలా

ఇసీ రంగ్ మే రంగ్ కే శివానే, మాకా బంధన్ ఖోలా

మేరా రంగ్ దే బసంతీ చోలా

యహీ రంగ్ హల్దీ ఘాటీ మే, ఖుల్ కర్కే థా ఖేలా

నవ్ బసంత్ మే, భారత్ కే హిత్ వీరోంకా యహ్ మేలా

మేరా రంగ్ దే బసంతీ చోలా

గంభీరమైన గొంతుతో భగత్ సింగ్ పాడుతున్న ఈ పాటను విని జైలు వార్డర్లు కూడా ముగ్ధులయ్యేవారు.

సింగ్ అరెస్టు అనంతరం అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపథ్యంలో J. P. సాండర్స్ హత్య వెనుక ఆయన హస్తంపై బ్రిటీష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లపై అభియోగాలు మోపారు. భారత స్వాతంత్ర్యానికి తన గళాన్ని వినిపించుకునేందుకు కోర్టునే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు.హత్యా నేరాన్ని అంగీకరించిన ఆయన విచారణ సమయంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు.[విచారణ సమయంలో HSRA సభ్యులు లేకుండా కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించారు. తద్వారా సింగ్ తన భావాలను ఇక ఎప్పుడూ ప్రచారం చేయలేడనే ఆవేదనతో ఆయన మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు.

ఖైదీలు మరియు విచారణ ఖైదీల హక్కుల కోసం భగత్ సింగ్ మరియు ఇతర ఖైదీలు జైలులోనే నిరాహారదీక్ష చేపట్టారు. చట్టం ప్రకారం ఉత్తమ హక్కులు కల్పించాల్సిన భారత రాజకీయ ఖైదీల కంటే బ్రిటీష్ హంతకులు మరియు దొంగలకు ప్రాధాన్యత ఇవ్వడం దీక్షకు దారితీసింది. రాజకీయ ఖైదీలకు పౌష్టికాహారం, పుస్తకాలు, దినపత్రికల సదుపాయం, మంచి బట్టలు, టాయిలెట్ ఇతర దైనందిన సదుపాయాలు కల్పించడం వారి డిమాండ్లు. అలాగే కార్మిక లేదా హోదాకు తగని పనిచేసే విధంగా రాజకీయ ఖైదీలపై ఒత్తిడి తీసుకురాకూడదని సింగ్ డిమాండ్ చేశాడు] 63 రోజుల పాటు కొనసాగిన నిరాహారదీక్ష సింగ్ డిమాండ్లకు బ్రిటీష్ ప్రభుత్వం తలొగ్గడం ద్వారా ముగిసింది. తద్వారా ఆయనకు సాధారణ భారతీయుల్లో ఆదరణ పెరిగింది. దీక్షకు ముందు ఆయన ప్రాభవం ప్రధానంగా పంజాబ్ ప్రాంతం వరకే పరిమితమైంది


కేంద్ర శాసనసభపై బాంబు దాడి జరిగినప్పుడుఅక్కడున్న రాజకీయ నాయకుల్లో ఒకరైన మహ్మద్ అలీ జిన్నా లాహోర్ ఖైదీలకు బహిరంగంగానే తన సానుభూతి తెలిపాడు. నిరాహారదీక్షపై మాట్లాడుతూ "నిరాహారదీక్ష చేసే వ్యక్తిలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మతోనే తను ముందుకు సాగుతాడు. తన పోరాటానికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తాడు" అని వ్యాఖ్యానించాడు. సింగ్ చర్యలపై మాట్లాడుతూ, "ఏదేమైనప్పటికీ, వారిని ఎక్కువగా నిందించినా మరియు ఎక్కువగా చెప్పినా వారు తప్పుదోవ పడుతారు. తద్వారా ఏర్పడే పాలనా ధిక్కార వ్యవస్థను ప్రజలు చీదరిస్తారు" అని అన్నాడు.


డైరీని వ్రాసే అలవాటు ఉన్న భగత్ సింగ్‌ చివరకి 404 పుటలను నింపాడు. తాను సమర్థించే పలువురు ప్రముఖుల ఉల్లేఖనాలు మరియు వారి గొప్ప వాక్యాలకు సంబంధించి సింగ్ తన డైరీలో పలు సూచనలు చేశాడు. అందులో కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడ్రిచ్ ఏంజిల్స్ ఆలోచనలను ప్రముఖంగా ప్రస్తావించాడు] భగత్ సింగ్ డైరీలోని పలు వ్యాఖ్యలు ఆయన విశిష్టమైన దార్శనిక అవగాహనకు అద్దం పడుతాయి.["దేవుడిపై విశ్వాసం లేని అహంకారి అనిపించుకున్న సింగ్ మరణానికి ముందు కూడా నేను ఎందుకు నాస్తికుడయ్యాను?" అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశాడు

23 మార్చి 1931న భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లను లాహోర్‌లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు ఆయన్ను ఆ క్షణమే షహీద్ లేదా అమరవీరుడుగా ప్రకటించారు] అప్పటి సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ V.N. స్మిత్ ప్రకారం, సింగ్‌ను ముందుగానే ఉరితీశారు:


సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరితీశారు. అయితే ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే ఆయన్ను ఉరితీయాలని నిర్ణయించారు...సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. సింగ్‌ జీవితానికి చివరగా తెర దించబోతున్నారన్న విషయానికి అది సంకేతమయింది.[


సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద సింగ్‌‌ను దహనం చేశారు. భగత్ సింగ్ స్మారకచిహ్నం నేడు భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుకు తెస్తుంది.

భగత్ సింగ్ మరణం భారత స్వాతంత్ర్యోద్యమ కొనసాగింపుకు సాయపడేలా వేలాది మంది యువకుల్లో స్ఫూర్తిని నింపింది. ఆయన ఉరి అనంతరం ఉత్తర భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ప్రభుత్వమునకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి.

భగత్ సింగ్ మరణం ఊరికే వృథా కాలేదు, ఎందరో యువకులను భారత స్వాతంత్ర్యోద్యమము వైపుకు మరల్చింది. భగత్ సింగ్ ఉరి శిక్ష అమలు తరువాత ఉత్తర భారతదేశంలో ఎందరో యువకులు బ్రిటిషు ప్రభుత్వం మరియు గాంధీ కి విరుద్ధంగా ఆందోళనలు చేపట్టారు.

--(())--


39......భోగి, సంక్రాంతి, కనుమ : పండుగలు (1/2019)


సంక్రాంతి అభ్యుధయ కాముకులను కూడా సంప్రదాయం వైపు మళ్ళిస్తుంది. పండుగలు, పర్వాలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు సైతం సంప్రదాయం వైపు మొగ్గుచూపుతారు. అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలతో అలంకరించడం నెలరోజులపాటు సాగుతుంది. చివరి రోజున రధం ముగ్గును వేస్తారు. జానపదుల కళలు ఈ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా బహిర్గతమవడమే కాకుండా ప్రదర్శింపబడతాయి. వీటిలో చెప్పుకోతగ్గది "గంగిరెద్దుల" ఆట. కొన్ని గ్రామాలలో ఐతే 'కోడి పందాల ఆట' కూడా ఆడుతారు. 


ఇంకా సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాల ఇరువది ఏడు. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని 'మకర సంక్రాంతి' అని అంటారు 


హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో "సంక్రాంతి" ప్రముఖస్ధానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు "మకరరాశిలో" ప్రవేశించిన పుణ్యదినం. ముగ్గులు ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు వివరణ చెబుతూ "మకరం" అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, మొక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు. అలా! కేవలం అప్పుడే కాకుండా! నిత్య జీవనంలో కూడా దాని బారిని పడకుండా చూచుకుంటూ ఉండాలికదా! మరి. ఇక ఈ పండుగల లోని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. 


తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు, వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా 'సంక్రాంతి' అని పిలుచుకుంటాం. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, చక్రాలలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి. 


మొదటి రోజు 'భోగి'. మూల మూలల చెత్తా, పనికిరాని కర్ర దుంగలూ ఓచోట చేర్చి, భోగి మంటలు వేసి, ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు. ఇళ్ళలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తాయి. పంట చేతికొచ్చిన ఆనందలో ఇళ్ళకు అల్లుళ్ళని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు.  


రెండో రోజు 'సంక్రాంతి'. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినం. ఈ పండుగకు కొత్తశోభ తీసుకురావడానికి, వారం, పది రోజుల ముందే ఇళ్ళకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ. చనిపోయిన పెద్దలను తలచుకుని మొక్కుతారు. పిండివంటలు చేస్తారు. నలుగురికీ పంచిపెట్టి, తాము తిని సంబరంగా గడుపుతారు. 


మూడో రోజు 'కనుమ'. దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడిపందాలు, ఎడ్లపందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహ్లదకరంగా కనిపిస్తాయి. 


ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటినుండి వివిధ ఆలయాలలోని అర్చకస్వాములు "సంక్రాంతి" నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యాలతో నదీజలాలను "తీర్ధంబిందులలో" తోడ్కొని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు. ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ! ప్రతిరొజు వివిధ రకాల ముగ్గులతో! సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది "ఇంద్రధనుస్సులను" ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు. 


ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే "సంక్రాంతి" పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం.



ఒక్కండేమియు చేయలేను, 

నిజమారోపించి ధైర్యంబుగా

నొక్కాణించితినంతె కాని,

మనముల్ నొప్పించ కాదెంతయున్!

29 జనవరి 

“హికీ బెంగాలీ గెజిట్” లేదా “ కలకత్తా జెనరల్ అడ్వెర్టైసర్” పేరుతో 1790 సం>లో కలకత్తానుండి వెలువడ్డ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున జాతీయ వార్తాపత్రిక దినోత్సవంగా జరుపుకుంటారు. . 


30 జనవరి 

మహాత్ముడు మరణించిన తేదీయైన 30 జనవరియే కాకుండా పలువురు స్వాతంత్ర్య వీరుల మరణతేదీలనుకూడా అమరులదినోత్సవంగాలుగా వ్యవహరిస్తుండంటంవల్ల ఏర్పడే గందరగోళాన్ని నివారించడానికి గత సంవత్సరం ప్రధాని మోడీ జనవరి 30 వ తేదీని సర్వోదయ దివస్ గా ప్రకటించాడు. సర్వోదయ దివస్‌ను జాతీయ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాము. పాఠశాలు, కార్యాలయాలలో ఉదయం 11 గం. విజిల్ లేదా ఒక బడిగంట శబ్దం నుండి అమరుల ఆత్మకు శాంతిగా 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. 


మహాత్ముని స్మృతికి నివాళిగా జనవరి 30వ తేదీని జాతీయ పరిశుభ్రత దినోత్సవంగా నిర్వహిస్తారు. 


తెలంగాణా సమరయోధుడు, ఖమ్మం జిల్లాకుచెందిన రావెళ్ల వెంకటరామారావు జయంతి (1927). ఈయన రాసిన తల్లి తెలంగాణా గేయం 1950దశకాలలో బహుళ ప్రాచుర్యం . మలి తెలంగాణా ఉద్యమంలో దేశపతి శ్రీనివాస్ గాత్రంతో ఉద్యమ కారులను ఉర్రూతలూగించింది. రావెళ్ళ ‘జయశ్రీ’ కలంపేరుతో రాగజ్యోతులు, జీవన రాగం, చితన్య స్రవంతి, పల్లె భారతి అనే పుస్తకాలు రాశారు. 


మరిన్ని వివరాలతో మళ్ళి కలుద్దాం. 


40...22 జనవరి ఆంధ్రపితామహ మాడపాటి హన్మంతరావు జయంతి (1885) 


జన్మస్థలం కృష్ణా జిల్లాయైనప్పటికీ మాడపాటి హన్మంతరావు ప్రజాకార్య క్షేత్రం నాటి హైద్రాబాద్ రాజ్యం (నేటి తెలంగాణా రాష్ట్రం). ఆయన బహుముఖ ప్రతిభాశాలియే గాక బహుముఖ ప్రజ్ఞాశాలి. తనకున్న బహుముఖ సామర్ధ్యాలను స్వార్జితంకోసం కాకుండా తాను జీవిస్తున్న, తనకు జీవితాన్నిచ్చిన ప్రాంత ప్రజల సంక్షేమంకోసం, ఆ ప్రజల ప్రజల వికాసం కోసం ఉపయోగించిన మహానుభావుడు. 


నల్గొండజిల్లా సూర్యాపేటలోను, వరంగల్‌లోనూ విద్యను పూర్తిచేసుకున్న తర్వాత వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం‌లో ఎనిమిది సం.ల పాటు గుమాస్తాగా పనిచేశారు. ప్రజాసేవపట్ల ఆపేక్షగల మాడపాటికి ప్రభుత్వోద్యోగం బంధాలు వేసింది. నిజాం ప్రభుత్వం‌లో అనువాదకునిగా ఉద్యొగం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని 5సం. ల కాలం‌లో న్యాయ విద్యను పూర్తిచేసి న్యాయవాద వృత్తిని అవిశ్రాంతంగా పాతిక సం. కొనసాగింఛాడు. 

రాజకీయాలు: 


హైద్రాబాద్ రాజ్యం‌లోని తెలుగుమాట్లాడేవారి వేదికగా ఆంధ్రజనసంఘాన్ని మాడపాటి 1921లో వ్యవస్థాపక కార్యదర్శిగా ప్రారంభించాడు. శాఖోపశాఖలను తెలంగాణా వ్యాప్తంగా విస్తరింపజేశాడు. ఈసంఘం 1930 నాటికి నిజాం రాజ్య ఆంధ్ర మహాసభగా రూపుదిద్దుకొన్నది. తెలంగాణా సాయుధపోరాటంగా రూపుదిద్దుకొనే దశలో మాడపాతి మితవాదిగానే మిగిలిపోయినప్పటికీ రావి నారాయణరెడ్డి ఆయన కృషిని ప్రస్తావిస్తూ "తెలంగాణాలో తెలుగుభాషకు ఒక గౌరవస్థానాన్ని కలిగించి, తెలుగువారికి తెలుగుభాషను నేర్పిన ఘనత కూడా వారిదే. నాతోటి యువకులెందరో ఆయన వల్ల ప్రాభావితులై ఆంధ్ర వాఙ్మయంతో పరిచయం ఏర్పరుచుకున్నారు. నాలాగే ఇంకెందరినో ప్రభావితులను చేసిన పంతులుగారికి ఆంధ్ర పితామహుడన్న బిరుదు ఆయన పట్ల సార్థకతను సంతరించుకుంది." 


మాడపాటి హైద్రాబాదు నగరపాలక సంస్థకు తొలి మేయరుగానూ, ఆం.ప్ర. శాసన మండలికి అధ్యక్షునిగానూ సేవలందించారు 


గ్రంథాలయోద్యమం: 

మాడపాటి గ్రంథాలయోద్యమంలోనూ ఇతోధిక కృషి చేశారు. తనకు సన్మానం ద్వారా లభించిన సొమ్మును కూడా గ్రంథాలయాల అభివృద్ధికే అందజేశారు. రావిచెట్టు రంగారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు తదితరులతో ప్రారంభమైన నిజాం పాలిత తెలుగు ప్రాంతంలోని తొలి తెలుగు గ్రంథాలయం . చారిత్రిక ప్రశస్తినొందిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం (హైదరాబాద్‌) , హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషానిలయంల అభివృద్ధికి కార్యవర్గ సభ్యుడుగానూ, కార్యదర్శిగానూ సేవలందించారు.గ్రంథాలయాల ద్వారానే రాజకీయ చైతన్యాన్ని వ్యాప్తిచేయాలన్న దృక్పథంతో సాగిన ఆయన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది. 


విద్యారంగం: 

విద్యారంగానికికూడా ఆయన తన సేవలను విస్తరించారు. వరంగల్ వాస్తవ్యులు అభ్యుదయవాదీయైన వడ్లకొండ నరసింహా రావు తోడ్పాటుతో దేశం‌లోనే తొలి బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించాడు. అనేక బాలికల పాఠశాలల తోడ్పాటునందింఛారు. ఆయన పేర ఈనాటికీ హైదరాబాద్ నారాయణగూడలో ఈ పాఠశాల దాదాపు 3000మంది విద్యార్ధులతొ కొనసాగుతున్నది. 


సాహితీ సేవ 

మాడపాటి హనుమంతరావు బహుభాషావేత్త. ఆయన రాసిన పదమూడు కథలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తకరూపం‌లో ప్రచురించారు. అవి హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం- నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు , ఎవరికి, విధి ప్రేరణం అనే కథలు, రచయితగా శాశ్వత కీర్తిని తీసుకొచ్చిన గ్రంథం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'. తెలంగాణా రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి? పలువురి ప్రశంసలు పొందింది. పాత్రికేయునిగా కూడా ఆయన తనసేవలనందించారు. 


పురుషులందు పుణ్య పురుషులు వేరయాయన్న రీతిన నేడు నిత్యం తెలుగు సెంటిమెంటునుచ్చరించే సీమాంధ్ర వ్యాపారవేత్తలకు మాడపాటి, ఆయన తరంవారు భిన్నం. 

వారు తెలంగాణా ప్రజలకు చిరస్మరణీయులు.

 శుభోదయం..


ఒక్కండేమియు చేయలేను, 

నిజమారోపించి ధైర్యంబుగా

నొక్కాణించితినంతె కాని,

మనముల్ నొప్పించ కాదెంతయున్!

29 జనవరి 

“హికీ బెంగాలీ గెజిట్” లేదా “ కలకత్తా జెనరల్ అడ్వెర్టైసర్” పేరుతో 1790 సం>లో కలకత్తానుండి వెలువడ్డ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున జాతీయ వార్తాపత్రిక దినోత్సవంగా జరుపుకుంటారు. . 


30 జనవరి 

మహాత్ముడు మరణించిన తేదీయైన 30 జనవరియే కాకుండా పలువురు స్వాతంత్ర్య వీరుల మరణతేదీలనుకూడా అమరులదినోత్సవంగాలుగా వ్యవహరిస్తుండంటంవల్ల ఏర్పడే గందరగోళాన్ని నివారించడానికి గత సంవత్సరం ప్రధాని మోడీ జనవరి 30 వ తేదీని సర్వోదయ దివస్ గా ప్రకటించాడు. సర్వోదయ దివస్‌ను జాతీయ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాము. పాఠశాలు, కార్యాలయాలలో ఉదయం 11 గం. విజిల్ లేదా ఒక బడిగంట శబ్దం నుండి అమరుల ఆత్మకు శాంతిగా 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. 


మహాత్ముని స్మృతికి నివాళిగా జనవరి 30వ తేదీని జాతీయ పరిశుభ్రత దినోత్సవంగా నిర్వహిస్తారు. 


తెలంగాణా సమరయోధుడు, ఖమ్మం జిల్లాకుచెందిన రావెళ్ల వెంకటరామారావు జయంతి (1927). ఈయన రాసిన తల్లి తెలంగాణా గేయం 1950దశకాలలో బహుళ ప్రాచుర్యం . మలి తెలంగాణా ఉద్యమంలో దేశపతి శ్రీనివాస్ గాత్రంతో ఉద్యమ కారులను ఉర్రూతలూగించింది. రావెళ్ళ ‘జయశ్రీ’ కలంపేరుతో రాగజ్యోతులు, జీవన రాగం, చితన్య స్రవంతి, పల్లె భారతి అనే పుస్తకాలు రాశారు. 


మరిన్ని వివరాలతో మళ్ళి కలుద్దాం. 


22 జనవరి ఆంధ్రపితామహ మాడపాటి హన్మంతరావు జయంతి (1885) 


జన్మస్థలం కృష్ణా జిల్లాయైనప్పటికీ మాడపాటి హన్మంతరావు ప్రజాకార్య క్షేత్రం నాటి హైద్రాబాద్ రాజ్యం (నేటి తెలంగాణా రాష్ట్రం). ఆయన బహుముఖ ప్రతిభాశాలియే గాక బహుముఖ ప్రజ్ఞాశాలి. తనకున్న బహుముఖ సామర్ధ్యాలను స్వార్జితంకోసం కాకుండా తాను జీవిస్తున్న, తనకు జీవితాన్నిచ్చిన ప్రాంత ప్రజల సంక్షేమంకోసం, ఆ ప్రజల ప్రజల వికాసం కోసం ఉపయోగించిన మహానుభావుడు. 


నల్గొండజిల్లా సూర్యాపేటలోను, వరంగల్‌లోనూ విద్యను పూర్తిచేసుకున్న తర్వాత వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం‌లో ఎనిమిది సం.ల పాటు గుమాస్తాగా పనిచేశారు. ప్రజాసేవపట్ల ఆపేక్షగల మాడపాటికి ప్రభుత్వోద్యోగం బంధాలు వేసింది. నిజాం ప్రభుత్వం‌లో అనువాదకునిగా ఉద్యొగం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని 5సం. ల కాలం‌లో న్యాయ విద్యను పూర్తిచేసి న్యాయవాద వృత్తిని అవిశ్రాంతంగా పాతిక సం. కొనసాగింఛాడు. 

రాజకీయాలు: 


హైద్రాబాద్ రాజ్యం‌లోని తెలుగుమాట్లాడేవారి వేదికగా ఆంధ్రజనసంఘాన్ని మాడపాటి 1921లో వ్యవస్థాపక కార్యదర్శిగా ప్రారంభించాడు. శాఖోపశాఖలను తెలంగాణా వ్యాప్తంగా విస్తరింపజేశాడు. ఈసంఘం 1930 నాటికి నిజాం రాజ్య ఆంధ్ర మహాసభగా రూపుదిద్దుకొన్నది. తెలంగాణా సాయుధపోరాటంగా రూపుదిద్దుకొనే దశలో మాడపాతి మితవాదిగానే మిగిలిపోయినప్పటికీ రావి నారాయణరెడ్డి ఆయన కృషిని ప్రస్తావిస్తూ "తెలంగాణాలో తెలుగుభాషకు ఒక గౌరవస్థానాన్ని కలిగించి, తెలుగువారికి తెలుగుభాషను నేర్పిన ఘనత కూడా వారిదే. నాతోటి యువకులెందరో ఆయన వల్ల ప్రాభావితులై ఆంధ్ర వాఙ్మయంతో పరిచయం ఏర్పరుచుకున్నారు. నాలాగే ఇంకెందరినో ప్రభావితులను చేసిన పంతులుగారికి ఆంధ్ర పితామహుడన్న బిరుదు ఆయన పట్ల సార్థకతను సంతరించుకుంది." 


మాడపాటి హైద్రాబాదు నగరపాలక సంస్థకు తొలి మేయరుగానూ, ఆం.ప్ర. శాసన మండలికి అధ్యక్షునిగానూ సేవలందించారు 


గ్రంథాలయోద్యమం: 

మాడపాటి గ్రంథాలయోద్యమంలోనూ ఇతోధిక కృషి చేశారు. తనకు సన్మానం ద్వారా లభించిన సొమ్మును కూడా గ్రంథాలయాల అభివృద్ధికే అందజేశారు. రావిచెట్టు రంగారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు తదితరులతో ప్రారంభమైన నిజాం పాలిత తెలుగు ప్రాంతంలోని తొలి తెలుగు గ్రంథాలయం . చారిత్రిక ప్రశస్తినొందిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం (హైదరాబాద్‌) , హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషానిలయంల అభివృద్ధికి కార్యవర్గ సభ్యుడుగానూ, కార్యదర్శిగానూ సేవలందించారు.గ్రంథాలయాల ద్వారానే రాజకీయ చైతన్యాన్ని వ్యాప్తిచేయాలన్న దృక్పథంతో సాగిన ఆయన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది. 


విద్యారంగం: 

విద్యారంగానికికూడా ఆయన తన సేవలను విస్తరించారు. వరంగల్ వాస్తవ్యులు అభ్యుదయవాదీయైన వడ్లకొండ నరసింహా రావు తోడ్పాటుతో దేశం‌లోనే తొలి బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించాడు. అనేక బాలికల పాఠశాలల తోడ్పాటునందింఛారు. ఆయన పేర ఈనాటికీ హైదరాబాద్ నారాయణగూడలో ఈ పాఠశాల దాదాపు 3000మంది విద్యార్ధులతొ కొనసాగుతున్నది. 


సాహితీ సేవ 

మాడపాటి హనుమంతరావు బహుభాషావేత్త. ఆయన రాసిన పదమూడు కథలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తకరూపం‌లో ప్రచురించారు. అవి హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం- నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు , ఎవరికి, విధి ప్రేరణం అనే కథలు, రచయితగా శాశ్వత కీర్తిని తీసుకొచ్చిన గ్రంథం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'. తెలంగాణా రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి? పలువురి ప్రశంసలు పొందింది. పాత్రికేయునిగా కూడా ఆయన తనసేవలనందించారు. 


పురుషులందు పుణ్య పురుషులు వేరయాయన్న రీతిన నేడు నిత్యం తెలుగు సెంటిమెంటునుచ్చరించే సీమాంధ్ర వ్యాపారవేత్తలకు మాడపాటి, ఆయన తరంవారు భిన్నం. 

వారు తెలంగాణా ప్రజలకు చిరస్మరణీయులు.

--(())-- 










*ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ల ఆదాయం*... వేలల్లో...
1. సైనికుడు 
2.రైతు 
3. టీచర్

🐰 *ప్రపంచాన్ని ఉపయోగించుకునే వాళ్ల ఆదాయం*.... _లక్షల్లో... 
1. ఇంజనీర్స్ 
2. డాక్టర్స్ 
3. బ్యూరోక్రాట్స్

🐰 *ప్రపంచాన్ని నాశనం చేసే వాళ్ల ఆదాయం*... కోట్లలో.. 
1. రాజకీయ నేతలు 
2. కార్పోరేట్స్ 
3. సినిమా వాళ్లు
సమాజంలో మార్పులు🌸 ఓ ఆసక్తికరమైన విశ్లేషణ👇

1. గతంలో ఇంట్లో తిని బహిర్భూమి కోసం దూరంగా వెళ్లేవారు...
ఇప్పుడు బయట తిని, ఇంట్లోనే కానిచ్చేస్తున్నారు.

2. గతంలో మనుషులకు కాపలా కోసం బయట కుక్కల్ని పెట్టుకునేవారు...
ఇప్పడు ఇంట్లో కుక్కల్ని పెట్టుకుని బయట కాపలాగా మనుషుల్ని పెట్టుకుంటున్నారు.

3. గతంలో ఇంట్లో వాళ్లు వండితే బయటివాళ్లు వచ్చి తిని పోయేవాళ్లు...
ఇప్పుడు బయటివాళ్లు వచ్చి వండి పెడితే ఇంట్లోవాళ్లు తింటున్నారు.

4. గతంలో పెళ్లిళ్లు జరిగినప్పుడు బయటినుండి వచ్చినవాళ్లు ఆడి పాడితే ఇంట్లోవాళ్లు, బంధువులు చూసి ఆనందించేవారు...
ఇప్పుడు పెళ్లిళ్లలో సంగీత్ పేరిట ఇంట్లో వాళ్లు ఆడిపాడితే బయటివాళ్లు చూసి ఆనందిస్తున్నారు.

5. ఇది వరకు పిల్లలు పుట్టిన తర్వాత ముహూర్తాలు, జాతకాలు చూసేవారు...
ఇప్పుడు ముహూర్తాలు చూసుకుని సిజేరియన్ ద్వారా పిల్లలను కంటున్నారు.


6.  ఒక్కప్పడు నీతులు స్కూల్ లో చెప్పేవారు ....ఇప్పుడు whatsapp , facebook లో చెపుతున్నారు ....కానీ ...పాటించే వారు మాత్రం ఎవరు లేరు 😞😞
 --(())--
శ్రీరామకృష్ణునికధామృతం లోని కొన్ని అమృత బిందువులు- 1
శ్రీరామకృష్ణులు -విద్యాసాగర్.

రామకృష్ణులు, అందరూ యెంతో శ్రద్ధగా తనవాక్కులు వింటుండగా, వారి ప్రసంగాన్ని విద్యాసాగరుల సమక్షంలో, చేస్తున్నారు.
దుఃఖం, పాపం, అశాంతి యివన్నీ చైతన్యం ఉన్నంతవరకే ! బ్రహ్మ నిర్లిప్తం. పాములో విషం వున్నది. అది కాటు వేస్తే, విషం వలన మనిషి మరణిస్తాడు. కానీ నిలువెల్లా విషం వున్న పామును ఆ విషం ఏమీ చేయలేదు. బ్రహ్మ అంటే ఇదీ అని ఇదమిద్ధంగా ఏమీ చెప్పలేం. అది అనుభూతి మాత్రమే. దీనికిఉదాహరణగా ఒక కథను చెబుతాను వినండి.
అన్నాదమ్ములిద్దరు, అనేక సంవత్సరాలు కష్టపడి గురువుగారి వద్ద బ్రహ్మవిద్య నేర్చుకుని తిరిగి వచ్చి తండ్రికి నమస్కరించారు. తండ్రి యెంతో సంతోషించి, ముందుగా పెద్ద కొడుకుని, ' నాయనా ! నువ్వు శాస్త్రాలన్నీ శ్రద్దగా చదివావు కదా ! బ్రహ్మం గురించి కొద్దిగా వర్ణించగలవా ? ' అని అడిగాడు. దానికి పెద్దకుమారుడు, యెంతో ఉత్సాహంగా, వేదాలనుంచి, ఉపనిషత్తులనుండీ అనేక శ్లోకాలు వల్లిస్తూ,బ్రహ్మ స్వరూపాన్ని వర్ణించసాగాడు. తండ్రి మౌనంగా విని, ఆ తరువాత,చిన్న కుమారుడిని అదే ప్రశ్న వేసాడు.
అయితే చిన్న కుమారుడు, తలవంచుకుని ఒక్క మాటైనా మాట్లాడకుండా, నిలబడి వున్నాడు. తండ్రి ఇద్దరు కుమారులనూ దగ్గరకు తీసుకుని, ' చిన్నవాడు బ్రహ్మాన్ని గురించి కొద్దిగా తెలుసుకోగలిగినట్లున్నాడు. అది వర్ణింపనలవి కానిదని తెలిసి మౌనంగా వున్నాడు. ' అని ఇరువురినీ ఆశీర్వదించాడు.
అలాగే, భగవంతుడిని తెలుసుకున్నాం అనుకుంటారు కొందరు. అది యెలాంటిదంటే, చీమ చక్కర గుట్ట దగ్గరకు వెల్లి, ఒక్క కణం నోట్లో వేసుకోగానే, దాని కడుపు నిండిపోతుంది. ఇంకో కణాన్ని తీసుకుని ఇంటి దారి పడుతుంది. ఈసారి వచ్చినప్పుడు, ఈ గుట్టనంతా తీసుకుపోవాలని దారిలో తలపోస్తుంది.
అల్పజీవులు కూడా అలాగే, బ్రహ్మాన్ని గురించి తలుస్తారు. అది వాక్కుకు, మనస్సుకు గోచరం కానిది అని తెలుసుకోలేరు. యెంతో గొప్పవాడైనా, బ్రహ్మాన్ని మొదలంటా తెలుసుకోవడం సాధ్యం కాదు. శుకమహర్షి లాంటి వారు గండుచీమల వంటి వారు, మహా అయితే ఏడో ఎనిమిది చక్కర కణాలు నోట్లో పెట్టుకున్నట్లు మాత్రమే !
సముద్రాన్ని చూసివచ్చిన వాణ్ణి, సముద్రం గురించి చెప్పమంటే, ' ఆహా ! ఏమి చెప్పను. సముద్రమంటే, గొప్ప గొప్ప అలలు, భయంకరమైన శబ్దము. ' అని మాత్రం చెప్పగలిగాడట. ఎందుకంటే, వాడు సముద్రాన్ని చూసి అనుభవించిన స్థితి అది.
సమాధిస్థితికి మానవుడు రాగలిగితే, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. యిలాంటి స్థితిలో విచారణ ఆగిపోతుంది. మనిషి మూగవాడై పోతాడు. బ్రహ్మం యిలా ఉంటుంది అని చెప్పే శక్తి వుండదు.
సమాధిస్థితి కలిగి బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి ప్రజలతో మాట్లాడరా అనే సందేహానికి, రామకృష్ణులు, ' శంకరాచార్యుల వంటి వారు, లోక కల్యాణార్థం, విద్యతో కూడిన నేను అనే భావం నిలుపుకుని, ప్రజలను జాగృతం చేసారు. సామాన్యులు బ్రహ్మజ్ఞానం పొందిన తరువాత, ఇక మాట్లాడరు. ఆత్మ సాక్షాత్కారం అయేంత వరకే విచారణ. ' అని సమాధానం చెప్పారు.
ఈ విషయం చెబుతూ రామకృష్ణులు, ' వెన్నకాగేటప్పుడు మాత్రమే చిటపట శబ్దం వస్తుంది. నీరు ఆవిరి అయిపోయి, నెయ్యి తయారైతే, అంతా నిశ్శబ్దమే ! ఆనేతిలో పూరీ వేస్తే, మళ్ళా చిటపట. పూరీ తయారైన తరువాత, మళ్ళీ నిశ్శబ్దం. అలాగే సమాధి స్థితి పొందిన వ్యక్తి లోకకళ్యాణార్థం మామూలు స్థితికి వచ్చి ఆత్మజ్ఞానం గురించి మాట్లాడి, మరికొందరిని తరింపజేస్తాడు.
మకరందం త్రాగబోయేదాకా తేనెటీగ ఝు౦కారం చేస్తుంది. తేనెగ్రోలే సమయం లో నిశ్శబ్దం. ఆ తరువాత మళ్ళీ ఝు౦కారం. నీళ్లలో ముసుగుతున్న బిందె బుడబుడ శబ్దం చేస్తుంది. ఒక్కసారి నీరు బిందె లోనికి రాగానే, ఆ శబ్దం ఆగిపోతుంది. యిలా అనేక ఉదాహరణలతో బ్రహ్మజ్ఞాని మానసిక స్థితి తెలుసుకోవచ్చు.
ఆ తరువాత ఋష్యాదులు, బ్రహ్మజ్ఞాన సాధనకు యెంత శ్రమించారో, రామకృష్ణులు చెబుతున్నారు.
🕉🌞🌎🌙🌟🚩


 ఈ ఆత్మ జ్ఞానం కలగ డానికి ధ్యానం అనే ఆత్మ విద్యను మనకి బోధిస్తారు.

తల్లి సాహసం::
మాతలుంగ రాజ్యపు రాజు యశోవర్థనునికి యుద్ధాలంటే ఆయనకు అస్సలు గిట్టేది కాదు అయితే ఆయన మంచితనాన్ని బలహీనతగా ఎంచుకొని వేరే ఎవరైనా రాజులు మాతలుంగ మీదికి దండెత్తే అవకాశం ఉన్నది. "అలా జరగకుండా ఏం చేయాలి?" అని మంత్రులతో‌ బాగా ఆలోచించెడు . తన కోట చుట్టూ గోడ లాంటిది ఒకటి ఇప్పటికే ఉన్నది. అయితే అది బాగా శిధిలం అయిపోయింది. ఇప్పుడు దాన్ని బలోపేతం చేసి, అలాగే దాని లావునూ ఎత్తునూ మరింతగా పెంచాల్సి ఉన్నది. ఇలా కోటగోడను పునర్నిర్మించటం అన్నది ఏమంత సులభమైన పని కాదు. ఏమంటే, మాతలుంగ రాజ్యంలో సగభాగం నిజానికి కోటలోనే ఉంది- మిగిలిన సగం కోటకు బయట. ఈ రెండు ప్రాంతాల్లో నివసించే ప్రజల్నీ వేరు చేయటం కొంచెం కష్టమే.
అయినా రాజుగారు తలచుకుంటే కానిదేమున్నది? కోటగోడ తయారు కాసాగింది. ఎక్కడికక్కడ ఎత్తైన కట్టడాలు లేచాయి. కోటలోంచి బయటికీ, లోపలికీ తిరగటం మీద ఆంక్షలు విధించబడ్డాయి. నిర్ణీత సమయాల్లో మాత్రమే అటునుండి ఇటు, ఇటు నుండి అటు ప్రజల్ని రానిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఉండే కోట ద్వారాల వద్ద సైనికులు నిలబడి, వచ్చే పోయే వారిని పరిశీలిస్తుంటారు.
కోట గోడకు అవతల పహాడీ అనే చిన్న పల్లె ఒకటి ఉండేది. పహాడీలో త్రాగు నీటి ఎద్దడి అధికంగా ఉండేది. అక్కడి ప్రజలంతా త్రాగునీటి కోసం కోట లోపల ఉన్న బావిపైనే ఆధారపడేవాళ్ళు. ఆ చుట్టు ప్రక్కల పాతగోడ పూర్తిగా శిధిలం అయి ఉండటంతో, ఇన్నాళ్ళూ కోటలోకి వచ్చి పోయేందుకు అది ఊరి జనాలకు బాగా అనువుగా ఉండేది. కూలిన ఆ గోడ గుండానే ప్రజలు కోటలోకి వచ్చి నీళ్లను తీసుకెళ్లేవారు. అయితే ఇప్పుడు ఆ వీలు లేదు- ఎత్తైన కోట గోడలు ఊరివాళ్ళను, కోటను వేరు చేయసాగాయి. వాళ్ళు ఇప్పుడు తమ ఇష్టం వచ్చినట్లు లోనికి-బయటికి తిరిగే వీలు లేదు..
ఆరోజు సాయంత్రం కోట ద్వారాలు మూసి వేస్తున్న సమయానికి, పహాడీలో నివసించే ఒక యువతి, ఖాళీ బిందెని ఒకదాన్ని పట్టుకొని పరుగు పరుగున కోటలోనికి రాబోయింది. బరువైన కోట తలుపులను సైనికులు ఆ సరికే కదిల్పి ఉన్నారు- వాటిని మరునాటి ఉదయం వరకూ ఇక తెరువరు. సైనికుడు ఒకడు ఆమెను లోనికి పోకుండా అడ్డుకున్నాడు. ఆమె అతన్ని ప్రాధేయపడింది- "అయ్యా!‌ కరుణించండి! ఇంట్లో ఒక్క చుక్క నీళ్ళు లేవు. కనీసం ఈ బిందెడు నీళ్ళు తీసుకుపోతే మాకు ఈరోజు వంట కుదురుతుంది. లేదంటే మేమూ, మా పిల్లాడూ దాహానికి మాడాల్సిందే. దయచేసి లోనికి పోనివ్వండి- ఒక్క క్షణంలో తిరిగి వచ్చేస్తాను" అని.
"చూడమ్మా! నియమాలు నియమాలే. నిన్ను లోనికి పోనివ్వగలం. కానీ కోట తలుపులు మూసే సమయం అయిపోయింది. ఇప్పుడు తలుపులు మూసేశామంటే ఇక మేమెవ్వరం ఉండం. రేపు తెల్లవారు జామున మళ్ళీ వచ్చి తలుపులు తెరుస్తాం. నువ్వు నీళ్ళు తీసుకొని వెనక్కి ఎట్లా వస్తావు? కుదరదు. అందుకని, మా మాట విని వెనక్కి వెళ్ళిపో. నీళ్ళు రేపు ఉదయాన్న తెచ్చుకోవచ్చులే" అన్నారు.
ఆమె పట్టు వదల్లేదు. "నన్ను ఇప్పుడు లోనికైతే పోనివ్వండి- బయటికి వచ్చేది మళ్ళీ చూసుకుందాం" అని ప్రాధేయపడింది సైనికులను. సైనికులు ఆమెని కోటలోపలికి రానిచ్చి, ద్వారాలు మూసి, తమ దారిన తాము వెళ్ళారు.
మరునాడూ ఇలాగే జరిగింది. సరిగ్గా వీళ్ళు ద్వారం మూసే సమయానికి ఆమె రావటం, కోటలోపలికి వెళ్ళాలని పట్టుపట్టటం, వీళ్ళు ఆమెని లోనికి వదిలి కోట తలుపులు మూసేయటం.
మూడవరోజూ ఇదే జరిగే సరికి సైనికులకు అనుమానం వచ్చింది- "రోజూ కోట ద్వారం మూసే సమయానికి ఈమె లోనికి పోతున్నదే, మరి బయటికి ఎలా వస్తున్నది?" వెంటనే వాళ్ళు ఆమెని బంధించి రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు. "మహా ప్రభూ! ఈ biయువతి మూడు రోజులుగా ప్రతిరోజూ సాయంత్రం కోట ద్వారాలు మూసేసే సమయానికి లోనికి పోతున్నది. బయటికి ఎలా వస్తున్నదో తెలీటం లేదు ప్రభూ. ఇందులో ఏదో మోసం ఉన్నది. తమరు ఈమెను విచారించాలి" అని.
రాజుగారు ఆమెని అడిగారు: "ఏం తల్లీ! కోటలోకి ఎందుకు వస్తున్నావు, రోజూ?"
"మా ఊరు పహాడీలో నీళ్ళు లేవు ప్రభూ! మా ఊరివాళ్లం అందరం కోటలోని బావి నీళ్ళనే వాడతాం"
"మరి రోజూ ఆలస్యంగా ఎందుకు వస్తున్నావు?"
"నాకో చిన్న కొడుకు ఉన్నాడు ప్రభూ. పాలు త్రాగే పసిబిడ్డ. ఏ రోజునైనా వాడు నిద్రపోయేంత వరకూ నేను బయటికి రావటం‌ కుదరదు"
"మరి నువ్వు లేకుండా వాడు రాత్రంతా‌ ఎలా ఉంటాడు?"
"ఉండడు ప్రభూ! అందుకనే నేను నీళ్ళు తోడుకున్న వెంటనే గబగబా మళ్ళీ ఇల్లు చేరుకుంటాను"
ఎట్లా వెళ్తావు, కోట ద్వారం మూసేసి ఉంటుంది గదా?"
"అది కొంచెం సమస్యే ప్రభూ" కొంచెం చిన్నబోయి. తిరిగి చెప్పింది-ే నేను గోడ దూకి ఇల్లు చేరుకుంటాను రోజూ"
రాజుగారు ఆశ్చర్యపోయారు- "గోడ దూకుతావా? ఎలాగ? ఇంత పెద్ద గోడను నువ్వు ఎట్లా దూకుతున్నావు? గోడకు ఎక్కడైనా రంధ్రం ఉందా?"
"గోడకు రంధ్రం‌ ఏమీ లేదు ప్రభూ! కానీ‌ తన బిడ్డను కలవగోరే తల్లిని ఏ కోటగోడలు మటుకు ఆపుతాయి?" కొంచెం తీవ్రంగానే అడిగింది ఆ యువతి.
రాజుగారు ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు. ఆపైన ఆమెను విడుదల చేసి, "నువ్వు వెళ్ళచ్చు" అన్నారు. "-కానీ నువ్వు గోడను ఎట్లా దూకుతావో‌ చూడాలని ఉంది నాకు"
రాజుగారు, పరివారం చూస్తుండగా ఆమె కొత్తగా కట్టిన గోడను అవలీలగా ఎక్కి అవతలి వైపుకు దూకింది. దూకేందుకు మరి ఆమె దగ్గర మరే ఇతర సాధనాలూ లేవు!
"ప్రభూ! గోడ ఎత్తును ఏమైనా పెంచుదామంటారా..?" రాజశిల్పి అడిగాడు ముఖం చిన్న బుచ్చుకుని. "-ఏమీ అవసరం లేదు. ముందు ఆ తల్లిని అభినందిస్తూ మా తరపున ప్రత్యేక బహుమానాన్ని పంపండి. ఆవిడ నా కళ్ళకు కమ్మిన పొరను తొలగించింది" అన్నారు రాజుగారు చిరునవ్వుతో.
కోటగోడలకు అవతల ఉన్న గ్రామాలన్నిటి నీటి సమస్యలూ తీరేటట్లు ఊరూరా బావులు త్రవ్వించారు; చెరువుల నిర్మాణం చేపట్టారు.
కోట గోడకు ద్వారాలున్న చోటునల్లా సైనికులు ఇరవైనాలుగు గంటలూ కాపలా ఉండేట్లు, ప్రజలకు- ప్రత్యేకించి తల్లులకు- ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ప్రవర్తించేట్లు ఆదేశాలు జారీ చేశారు!
కొత్తపల్లి వారి సౌజన్యం.
అంతా బాగున్న ఈ కథలో ఆమె బిందెనెలా తీసుకెళ్తుందో చెప్పలేదు.
--(())--

No comments:

Post a Comment