261) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
అస్తి కూటస్థ ఇత్యాదౌ పరోక్షం వేత్తి వార్తయా ౹
పశ్చాత్కూటస్థ ఏవాస్మీత్యేవం వేత్తి విచారతః ౹౹31౹౹
31. గురూపదేశాదుల వలన పరోక్షముగ కూటస్థము కలదు అని తెలిసికొనును.పిదప విచారణ పూర్వకముగ స్వానభవముననే
"నేను కూటస్థమును" అని తెలియును. (ఇది అపరోక్షజ్ఞానము).
వ్యాఖ్య:- శబ్దం వల్ల వచ్చే జ్ఞానము సాధారణంగా పరోక్షజ్ఞానము.అది దూరవస్తువయితే ఎప్పటికీ పరోక్షజ్ఞానమే. "కాశీ"కి వెళ్ళని వానికి ఆశబ్దం వలన వచ్చిన జ్ఞానము సర్వదా పరోక్షమే.అనుభవంలోకి రాదుగదా !
ఇంద్రాది దేవతలు,స్వర్గం మొదలగునవన్నీ అంతే గదా !
దగ్గరలోనే ఉన్న ఘటమును 'ఘటమున్నది అని బోధిస్తే అదీ పరోక్షమే', అలాగక ఎదురుగా చూపించి బోధిస్తే అది అపరోక్షజ్ఞానమగును.
ఇది ఘటము, నేను బ్రహ్మమును, నీవు దశముడవు మొదలగునవి ఉదాహరణలు. ఇందులో పదిమంది పరమానందయ్య శిష్యులు నదిలో స్నానము చేసి బయటకు వచ్చి లెక్క చూస్తే లెక్కచూచిన వానికి తాను తప్ప తొమ్మిది మంది లెక్కకు వస్తున్నారు.
అందువలన దశముడు అనగా పదవ వాడు నదిలో కొట్టుకొని పోయాడని ఏడుస్తున్నాడు.
ఒక బాటసారి వీరిని చూచి మీరు పది మంది ఉన్నారయ్యా (దశమః అస్తి) అన్నాడు.ఇది పరోక్షజ్ఞానము. అపుడు వారు పదవవాడు(దశముడు)ఏడి అని అడిగితే, ఆ లెక్కించినవాడే దశముడని(దశమః త్వమసి) చెప్పాడు.అప్పుడు కలిగినది అపరోక్షజ్ఞానము. అలాగే బ్రహ్మమున్నదని చెప్పినది, జీవుడు - ఆత్మ అన్నది పరోక్షజ్ఞానము.
"ఆ ఆత్మ నీవే", "ఆ బ్రహ్మము నీవే" అని చెప్పిన వాక్యము అపరోక్ష జ్ఞానము. కనుక
మహావాక్యం చెప్పేది అపరోక్షజ్ఞానమే.
చర్చల ద్వారా,విచారణద్వారా,సద్గురువుచేత బోధింపబడినవాడై "కూటస్థుడున్నాడు కూటస్థోఽస్తి" అని తెలుసుకుంటాడు ఈ విధంగా తెలుసుకోవటం పరోక్షజ్ఞానం.
పిమ్మట శ్రవణాదులు పరిపక్వమైన పిమ్మట -
"నేనే బ్రహ్మము కంటే భిన్నం కానట్టి కూటస్థుడను!కూటస్థోఽహమేవాస్మి" అని స్వానుభవమున తెలుసు కుంటున్నాడు.ఇది అపరోక్షజ్ఞానం.
--(())--
కర్తా భోక్తేత్యేవమాది శోకజాతం ప్రముఞ్చతి ౹
కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తుష్యతి ౹౹32౹౹
32.ఆపై 'పుణ్యాపుణ్య కర్మలకు నేను కర్తను,సుఖదుఃఖములను అనుభవించు భోక్తను నేనే ' మొదలగు దుఃఖసమూహమును వదలివేయును.
వ్యాఖ్య:-
శ్రవణమననాదుల ద్వారా "నేను బ్రహ్మం కంటే భిన్నం కానట్టి కూటస్థుడను" అని తెలుసుకుని స్థితుడైన వానికి ప్రపంచము నందలి వస్తుసముదాయమంతయు కేవలం వస్తువులు మాత్రమే కాక బ్రహ్మం నందు కదలాడు అలలులాగా కనబడుతుంటాయి.
వస్తువులతో గల తాదాత్మ్యాన్ని విడనాడి సత్యవస్తువులకు అధిష్ఠానమయిన బ్రహ్మానుసంధానముతో వుండువానికి
"నేను కర్తను,నేను భోక్తను" అనే వాటివల్ల కలిగే శోకాన్ని దుఃఖాన్ని వదిలివేస్తాడు.
"నేను చేయవలసినదంతా చేసాను", "పొందవలసినదంతా పొందాను" అనే సంతోషాత్మకమైన జ్ఞానాన్ని పొందుతాడు.
దీనినే తృప్తీ అంటారు.
క్రమం తప్పని నిరంతరాభ్యాసం వలన సాధకుడు ముందుగా అనంత చైతన్యాన్ని అప్పుడప్పుడు స్వానుభవంతో గ్రహిస్తాడు.
దీక్షతో సాధనను కొనసాగించగా చివరగా ఆనందనందమయమయిన స్వరూప స్థితిలో వ్యష్ఠి భావననేది లేకుండా లీనమయిపోతాడు.
తానూ బ్రహ్మంకంటే వేరుకాదనీ,తానే బ్రహ్మమనీ గ్రహించాలి.
"అహం బ్రహ్మస్మి" అని తెలుసుకుంటూ ప్రజ్ఞాన ఘనమయి నిలుస్తాడు.
అజ్ఞాన మావృత్తీ స్తద్వద్విక్షేపశ్చ పరోక్షధీః ౹
అపరోక్షమతిః శోఖ మోక్ష స్తృప్తిర్నిరఙ్కుశా ౹౹33౹౹
అజ్ఞానము, ఆవరణము, విక్షేపము, పరోక్షజ్ఞానము, అపరోక్షజ్ఞానము,దుఃఖనివృత్తి,
నిరతిశయమైన తృప్తి.
సప్తావస్థ ఇమాః సన్తి చిదాభాసస్య తాస్విమౌ ౹
బన్దమోక్షౌ స్థితౌ తత్ర తిస్రో బంధ కృతః స్మృతాః.. 34
చిదాభాసుడగు జీవుడు ఈ సప్తదశలనుగడచును.అందు మొదటి మూడూ బంధకారణములని చెప్పబడినవి.
ఓంశ్రీమాత్రే నమః
*న జానామీత్యుదాసీన వ్యవహారస్య కారణమ్ ౹ విచార ప్రాగభావేన యుక్తమజ్ఞానమీరితమ్ ౹౹35౹౹*
35. నాకు తెలియదు అనుభావము,సత్యమును గూర్చి నిర్లిక్ష్యము,వివేకము లేకపోవుట అనేవి అజ్ఞానమని చెప్పబడినవి.
వాఖ్య:-
అజ్ఞానము, ఆవరణము(ఆవృత్తి),
విక్షేపము,పరోక్షజ్ఞానము,
అపరోక్షజ్ఞానము,శోకనివృత్తి,
నిరతిశయానందము అనేవి చిదాభాసలోని సప్తావస్థలు.
ఇవే బంధమును మోక్షమును కూడా కల్పించును.
ఈ ఏడు అవస్థల్ని ఆత్మధర్మాలుగా అంగీకరిస్తే,
ఆత్మ అనేది నిర్వికారమైనది ఎట్లా అవుతుంది?
అంటే,సమాధానం -
ఈ ఏడు అవస్థలు చిదాభాసకు(జీవునికి) ఉండేవే తప్ప కూటస్థునివి కావు.ఈ ఏడు అవస్థల్లోనూ బంధమోక్షాలు రెండూ ఉన్నాయి.
మొదటి మూడు అవస్థలూ (అజ్ఞానం,ఆవరణ,విక్షేపం)
బంధాన్ని కలిగించేవి.
మిగిలిన నాలుగూ (పరోక్షజ్ఞానము,
అపరోక్షజ్ఞానము, దుఃఖనివృత్తి,
నిరతిశయమైన తృప్తి) మోక్షాన్ని కలిగించేవి.
ఇప్పుడు వీటిలో అజ్ఞానస్వరూపం -
ఎవనియందైనా సరే,
ఆత్మతత్త్వ విచారణకు సంబంధించిన ప్రావభావం -
ఆత్మ తత్త్వవిచారణ లేకపోవటంతో కూడిన తూష్ణీ భావంతో ఉదాసీనుడుగా ఉండటం అనేవి కనిపిస్తే వాటికి కారణం అజ్ఞానం అన్నమాట.
అట్లాగే,
"నేను కూటస్థుని ఎరుగను" అనే ఈ విధమైన అనుభవానికి
విషయమైనదే అజ్ఞానం. ఔదాసీన్యం,సత్యత్వము పై నిర్లిక్ష్యము,వివేకము లేకపోవుట అనేవి అజ్ఞాన స్వరూపమని,
"నేను ఎరుగను" అనే అనుభవం అజ్ఞానానికి కార్యం అన్నమాట.
ఏ చైతన్యస్వరూపమైన ఆత్మవల్ల సమస్తమూ తెలుసుకొనబడుతోందో,అటువంటి సత్యమును దేనివల్ల తెలుసుకోగలము ? అనే శ్రుతివచనాన్ని బట్టి ఏ ఆత్మతత్త్వంతో ఈ దృశ్యాన్నంతనూ తెలుసుకోగలుగుతున్నామో అటువంటి సత్యాన్ని ఏ జడవస్తువుతో చూడగలగుతాము?
తెలుసుకోగలుగుతాము?
జ్ఞానానికి సాధనమైన మనస్సు కూడా జ్ఞాతవ్యమైన విషయాన్నే తెలుసుకోగలుగుతుందేతప్ప జ్ఞాతయైన ఆత్మను తెలుసుకోలేదు.
మరొక శ్రుతి కూడా ఇదే చెపుతొంది.
"నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యోన చక్షషా..."
కఠ 2-3-13.
ఆత్మను వాక్కుతో గాని,మనస్సుతోగాని,చక్షురాది ఇతర ఇంద్రియాలతో గాని పొందటానికి వీలులేదు.వాఖ్య:-అజ్ఞానము, ఆవరణము(ఆవృత్తి),
విక్షేపము,పరోక్షజ్ఞానము,
అపరోక్షజ్ఞానము,శోకనివృత్తి,
నిరతిశయానందము అనేవి చిదాభాసలోని సప్తావస్థలు.
ఇవే బంధమును మోక్షమును కూడా కల్పించును.
ఈ ఏడు అవస్థల్ని ఆత్మధర్మాలుగా అంగీకరిస్తే,
ఆత్మ అనేది నిర్వికారమైనది ఎట్లా అవుతుంది?
అంటే,సమాధానం -
ఈ ఏడు అవస్థలు చిదాభాసకు(జీవునికి) ఉండేవే తప్ప కూటస్థునివి కావు.ఈ ఏడు అవస్థల్లోనూ బంధమోక్షాలు రెండూ ఉన్నాయి.
మొదటి మూడు అవస్థలూ (అజ్ఞానం,ఆవరణ,విక్షేపం)
బంధాన్ని కలిగించేవి.
మిగిలిన నాలుగూ (పరోక్షజ్ఞానము,
అపరోక్షజ్ఞానము, దుఃఖనివృత్తి,
నిరతిశయమైన తృప్తి) మోక్షాన్ని కలిగించేవి.
ఇప్పుడు వీటిలో అజ్ఞానస్వరూపం -
ఎవనియందైనా సరే,
ఆత్మతత్త్వ విచారణకు సంబంధించిన ప్రావభావం -
ఆత్మ తత్త్వవిచారణ లేకపోవటంతో కూడిన తూష్ణీ భావంతో ఉదాసీనుడుగా ఉండటం అనేవి కనిపిస్తే వాటికి కారణం అజ్ఞానం అన్నమాట.
అట్లాగే,
"నేను కూటస్థుని ఎరుగను" అనే ఈ విధమైన అనుభవానికి
విషయమైనదే అజ్ఞానం. ఔదాసీన్యం,సత్యత్వము పై నిర్లిక్ష్యము,వివేకము లేకపోవుట అనేవి అజ్ఞాన స్వరూపమని,
"నేను ఎరుగను" అనే అనుభవం అజ్ఞానానికి కార్యం అన్నమాట.
ఏ చైతన్యస్వరూపమైన ఆత్మవల్ల సమస్తమూ తెలుసుకొనబడుతోందో,అటువంటి సత్యమును దేనివల్ల తెలుసుకోగలము ? అనే శ్రుతివచనాన్ని బట్టి ఏ ఆత్మతత్త్వంతో ఈ దృశ్యాన్నంతనూ తెలుసుకోగలుగుతున్నామో అటువంటి సత్యాన్ని ఏ జడవస్తువుతో చూడగలగుతాము?
తెలుసుకోగలుగుతాము?
జ్ఞానానికి సాధనమైన మనస్సు కూడా జ్ఞాతవ్యమైన విషయాన్నే తెలుసుకోగలుగుతుందేతప్ప జ్ఞాతయైన ఆత్మను తెలుసుకోలేదు.
మరొక శ్రుతికూడా ఇదే చెపుతొంది.
"నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యోన చక్షషా..."
కఠ 2-3-13.
ఆత్మను వాక్కుతో గాని,మనస్సుతోగాని,చక్షురాది ఇతర ఇంద్రియాలతో గాని పొందటానికి వీలు లేదు.
No comments:
Post a Comment