Sunday, 23 May 2021

ప్రాంజలి ప్రభ పాత కధలు (51- 60)

 

sekarana Mallapragada Ramakrishna 

51 .... ఎర్ర వడ్ల గింజలు..


 కష్టం గా వుంది స్వేచ్ఛ గా ఊపిరి పీల్చుకోవడం .నోరు తెరిచేలోపలే కోసేసావ్ నాలుకను 

నీకుట్రలను వినకుండా పోసేసావ్ చెవిలో సీసం. నీ కదలికలను గమనిస్తున్నాని నా కళ్ళు పేల్చేసావ్  నీ భాగోతం కవితగా వ్రాస్తున్నారని   నా వేళ్ళు విరిచేసావ్ నా గుండెల్లో భావజాలం జనం లోకి వేలుతాడని భయం నీకు వెన్ను లో వణుకు పుట్టిస్తోంది కా బోలు నా తలా కోసేసావ్

నా తలనుండి కారిన రుధిరం కాలవ ల ప్రవహిస్తూ చేరుకొంది పొలం లోకి భూమిలో కి చేరిన కొన్నాళ్లికే పండింది పంట కొస్తే ఎర్ర వడ్ల గింజలు  సామ్రాజ్య వాది కర్ధమౌతోందా!

నేను చంపేసిన భావాలూ కనిపించడం లేదా ఎర్రవాడిలా గింజల రూపం లో??

ఎందుకో వడ్ల గింజ నీగొంతు కడ్డం పడి   నీ ఉసురు తీయక పోతుందా ఎదో ఒక రోజు? ?

అంత  వరకు నా సామ్య వాద భావజాలం నీకు నిద్రలేకుండ చేస్తూనే ఉంటుంది.

--(())-- 

52 .." మహాలయ అమావాస్య "

    ********************

    అమావాస్య రోజున  మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంకల్పం చెప్పుకుంటే మంచిది .

మీ గోత్రం ..

మీ పేరు చెప్పుకొని...


నా జన్మకు మూల కారణమైన నా తల్లి - దండ్రులకు నా యొక్క అనంతకోటి నమస్కా

రములు.అలాగే నా తల్లి - దండ్రులకు మూలమైన తాతలకు , ముత్తాతలకు అనంతకోటి ప్రణామ

ములు సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకూ ఈ వంశ పరంపరల్లో జన్మించిన పూర్వీకులైన వారందరికీ అనంతకోటి నమస్కారము లు . 

   ఎందరో యోగులు ,మహాత్ములు ,పుణ్యాత్ములైన మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి ,నేను ఇంతటి గొప్ప జ్ఞానంతో కూడిన జీవితాన్ని పొందియున్నాను. ఈ వంశంలో జన్మించినందుకు నేను ఎంతగానో గర్వించు చున్నాను .మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవే శించి లోక హిత  కార్యాలు చేసేటటువంటి శక్తిని ప్రసాదించండి . ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆ చంద్రార్కము అవనిలో విలసిల్లునట్లుగా ఆశీర్వ దించండి .

     నాలోనూ , నా కుటుంబ  సభ్యులలందరిలోనూ ఉన్నటువంటి దోషాలను తొలగించి , క్షేమ , స్థైర్య , ధైర్య , విజయ ,అభయ , ఆయుః , ఆరోగ్య , ఐశ్వర్య ముల నొసగి , ధర్మార్ద , కామ , మోక్ష ముల నొసగి , అహం పదార్ద రహిత స్తితి కలిగేటట్లుగా దీవించి నా జన్మ ధన్యత చేకూర్చ 

గలరని కోరుతూ 

అష్ట వసువులు , ఏకాదశ రుద్రులు , ద్వాదశ ఆదిత్యులు ,త్రిమూర్తులు ,త్రిమాతలు ,అష్ట దిక్పాలకులు , నవ గ్రహాలు , సమస్త సద్గురువులు మరియు  సమస్త దేవతా మూర్తుల యొక్క ఆశీస్సులను  కోరుతూ  నాయోక్క అనంత కోటి నమస్కారములు సమ

ర్పించుచూ మనసా , వాచా , కర్మణా , త్రికరణ శుద్ధిగా ,ఈ మహాలయ అమావాస్య రోజున సంకల్పం చేసి పెద్దలందరికీ నమస్కరించు చున్నాను .ప్రతిఒక్కరు పెద్దల పేర్లు చెప్పుకొని దాన ధర్మాలు, చెయ్యాలి, తద్దినాలు పెట్టాలి.

--(())--

53  * తాత - మనుమడు *

ఆ రోజు  ఒక పేరున్న రెష్టారెంట్ ముందు కారు లో సుమారు తొంబై దాటిన వారి తాతగార్ని నెమ్మదిగా చెయూత నిచ్చి నడిపించుకొని తీసుకు వచ్చాడు. ఓ మూల ఉన్న టూ సిట్టర్ టేబుల్ దగ్గరకు నడిపించుకుని  జాగ్రత్తగా కూర్చో బెట్టాడు.

చెప్పండి తాతగారు ! ఏంటి తింటారు ? అడిగాడు మనవడు.

నాకు మటన్ చాలా ఇష్టం, కాని పళ్లు లేవుగా! ఎలా తింటాను అన్నాడు.

ఓస్ ! ఇంతే కదా ! అని బేరర్ ను పిలిచి, ఓ ప్లేట్  చాల మెత్తని మటన్ ఖైమా,  బాగుండాలని ఆర్డర్ పెట్టాడు. ఇదిగో! అది అయ్యేలోపు చికెన్ సూప్ ఫ్రెష్ గా పట్టుకు రా ! అని చెప్పాడు.

ఐదు నిమిషాల్లో  చికెన్ సూప్ వచ్చింది!

ఆ మనుమడు ఒక తెల్లటి టవల్ ను తాతయ్య మెడ ముందు అమర్చి....సూప్ నెమ్మదిగా స్పూన్ తో త్రాపిస్తున్నాడు. అయినా అది ఆబోసి నోరు చుట్టూ అంటుకుంది.  కర్చిఫ్ తో మూతి శుభ్రం చేసాడు. ఈ లోగా మటన్ ఖైమా వచ్చింది.

తాతయ్యకు నెమ్మదిగా స్పూన్ తో తినడం వలన చాలా సమయం పట్టింది...! ఐనా విసుగు చెందకుండా నెమ్మదిగా తాతయ్యతో కబుర్లు చెబుతూ....నానమ్మ పై జోకులు వేస్తూ తినిపించాడు. చనిపోయిన భార్య జ్ఞాపకాలు అంత అందంగా మనవడు గుర్తు చేసినందుకు, ఆ తాతయ్య కళ్లలో ఆనందం...ఓ పక్క కంటనీరు.

రెష్టారెంట్ లో అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఆ కుర్రాడు ఏమాత్రం పట్టించుకోలేదు. బిల్ పే చేసి నెమ్మదిగా మరలా నడపించుకొని తీసుకు వెళ్లిపోయాడు.

కొడుకు, కోడలు చాలా మంచి వాళ్లు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుందని ఏది పడితే అది పెట్టరు. మనవడు అలా కాదు. వచ్చిన ప్రతీ సారి తాతయ్యను కార్లో వేసుకుని షికారు తిప్పడమే కాకుండా, చిన్న పిల్లలకు తినిపించినట్లు, ఐస్ క్రీమ్స్ , రక రకాల చిరుతిండి తినిపిస్తాడు. తండ్రి చెప్పినా వినడు!

ఒక్కరోజుకు ఏం కాదు డాడీ.... నేను చూసుకుంటాను కదా అని....రాత్రి పడుకునే ముందు జీర్ణం కావడానికి పళ్ల రసం, టాబ్లెట్ వేసేస్తాడు.

మామూలు సమయంలో చాలాఇబ్బంది పడే పెద్దాయన.... చిత్రంగా మనవడు వచ్చినపుడు హుషారుగా ఉంటారు. ఒక్క కంప్లైంట్ కూడ ఉండదు. కొడుకు ముసి ముసిగా నవ్వుకుంటాడు.

ఓసారి ఉండలేక కొడుకుని అడిగాడు..,,ఏరా! వచ్చినపుడల్లా తాతయ్యను కుషీ చేస్తావ్ ! తాతయ్య అంటే అంత ఇష్షమా?

దానికి కొడుకు చెప్పిన సమాధానం....డాడీ ! నా చిన్నతనంలో అమ్మా, మీరు క్షణం తీరిక లేకుండా ఉద్యోగాల వలన బిజీగా ఉండేవారు. ఇంట్లో నాన్నమ్మ తాతయ్య, నా విషయంలో చాలా శ్రద్ధ చూపేవాళ్లు. తాతయ్యా ! ... నన్ను స్కూల్ నుండి తీసుకొని వస్తూ....నేను ఏది అడిగితే అది కొనిచ్చి ముద్ధు చేసేవారు. ఒక్కోసారి నా బట్టలు పాడు చెసేవాడిని. తాతయ్య నాన్నమ్మ ఆ రోజులలో నాకు చేసిన సేవలు గుర్తున్నాయి. నేను ఏమిచ్చి వాళ్లను ఆనంద పరచ గలను. నానమ్మ ఇప్పుడు లేదుగా. అందుకే వచ్చిన  ప్రతిసారీ కనీసం తాతయ్య తో ఒక్కరోజైనా గడపి నా జ్ఞాపకాలు సజీవం గా ఉంచుకుంటాను అని చెప్పాడు.

సమాధానం విన్న తండ్రి కళ్లలో నీళ్లు....నీ జ్ఞాపకాల మాటేమో గాని... నీవు వచ్చిన వెంటనే తాతయ్య కళ్లలో ఉత్సాహం.. చూస్తుంటే నేను ఆయనకు ఎంత రుణపడి ఉన్నానో అర్ధం అవుతుంది. నాకు మీ అమ్మకు అందమైన వార్ధక్యం కళ్ల ముందు కనిపిస్తూంది...! యు ఆర్ గ్రేట్ మై సన్.

గమనిక :-డబ్బువెనుక పరుగులుపెట్టే ఈ కాలంలో  ఇలాంటి సంబంధ బాంధవ్యాలు కాపాడుకునే కుటుంబాలు మాత్రం నిజంగా స్వర్గధామాలే.... !అన్ని కుటుంబాలు కూడా ఇలాగే ఉండలని ఆశిస్తూ...!

ఈ గ్రూప్ లో ఇది అనవసరం అని అనుకోవద్దు. కుటుంబ వ్యవస్థ ఇలా ఉంటే సమాజం   కూడా బాగుంటుందని భావిస్తూ.....

--(())--

54... *హృదయ పరివర్తనం.*

కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినకు రాజయ్యాడు. ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు అందుకోసాగాడు. కొన్నాళ్లకు ధర్మరాజు తీర్థయాత్ర చేయాలని భావించాడు.

సోదరులను, సామంత రాజులకు తన మనోభీష్టాన్ని తెలిపాడు. వారిలో కొందరు ధర్మరాజుతో కలిసి యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు. అదే సమయంలో ధర్మజుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్లి..

‘కృష్ణా! నేను, మరికొంత మంది తీర్థయాత్రలకు వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో వస్తే అంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు’ అన్నాడు. యాత్రలు చేసే సమయం తనకు లేదన్నాడు కృష్ణుడు. ధర్మరాజు పట్టు వీడలేదు. అప్పుడు కృష్ణుడు.. ధర్మజుడికి ఒక సొరకాయను ఇచ్చి..

‘ధర్మరాజా! పనుల ఒత్తిడి వల్ల నీతో పాటు యాత్రలకు రాలేకపోతున్నాను. నా ప్రతినిధిగా ఈ సొరకాయను నీ వెంబడి తీసుకుని వెళ్లు’ అని చెప్పాడు.

కృష్ణుడి ఆదేశం ప్రకారం ధర్మరాజు.. సొరకాయను నెత్తిన పెట్టుకుని యాత్రలకు వెళ్లాడు.

మూడు నెలల తర్వాత యాత్రలన్నీ పూర్తి చేసుకుని తిరిగి హస్తినకు చేరుకున్నాడు. మర్నాడు అన్న సమారాధన చేయాలని భావించాడు. శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి.. ‘కృష్ణా! మా యాత్ర విజయవంతంగా పూర్తయింది. నీవు ఇచ్చిన సొరకాయను నేను మునిగిన అన్ని తీర్థాల్లో ముంచాను. రేపు అన్న సమారాధన ఉంది. నీవు తప్పకుండా రావాల’ని కోరాడు.

అప్పుడు కృష్ణుడు.. ‘ధర్మరాజా! అన్న సమారాధనలో ఈ సొరకాయను వండి అందరికీ ప్రసాదంగా పంచండి’ అన్నాడు. అలాగే చేశాడు ధర్మరాజు. సొరకాయతో వండిన పదార్థం తిన్నవారంతా చేదు భరించలేక వాంతులు చేసుకున్నారు.

రాజా! చేదుగా ఉన్న సొరకాయతో ఎందుకు వంట చేయించారు’ అని ప్రశ్నించారు. కలత చెందిన ధర్మరాజు సమారాధనకు వచ్చిన కృష్ణుడితో... ‘స్వామీ! మీరిచ్చిన సొరకాయ చేదుగా ఉన్నది’ అన్నాడు. కృష్ణుడు నవ్వి..

‘ధర్మరాజా! ఆ సొరకాయ చేదుగా ఉందని నాకు ముందే తెలుసు. నీతో పాటు ఎన్నో తీర్థాల్లో మునక వేసింది కదా..! దాని చేదుదనం పోయిందేమో అనుకున్నాను. ఇంకా అలాగే ఉన్నట్లుందే?’ అన్నాడు. ధర్మరాజుకు విషయం అర్థమై.. కృష్ణుడికి దండప్రణామాలు చేశాడు.

*వేలమంది నిత్యం తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. జపతపాలు చేస్తున్నారు. కానీ, మనసులో గూడు కట్టుకుని ఉన్న అసుర గుణాలు, పాప సంస్కారాల గురించి చింతించడం లేదు.*

_హృదయ పరివర్తనం లేని యాత్రలు ఎన్ని చేసినా, తీర్థాల్లో ఎన్నిసార్లు మునిగినా ఫలితం ఉండదు._

ఇంట్లో పాటించాల్సిన - పాటించకూడని ఆచారాలు.

     కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి.

1. కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి గోళ్ళను తిన్నవాడు వినాశమును పొందుతాడు.

2. లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి మంచివి కావు. ఊరకనే మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని చెప్పు వాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు.

3. రెండు చేతులతో తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకోవద్దు. తలను విడిచి కేవలము కంఠ స్నానము చేయకూడదు. (తల స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనములో ఉన్నది).

4. రాత్రుల్లు చెట్ల కింద ఉండరాదు. దూరంగా ఉండాలి.

5. ఎక్కువ కాలం జీవించాలనుకునే వాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.

6. చాలా మంది సరదా కోసం పాచికలు (జూదము) ఆడుతారు. అలా ఆడటం సరికాదంటున్నారు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు. చేతిలో తినే పదార్థాన్ని పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు.

7. రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు. వస్తహ్రీనుడై(బట్టలు లేకుండా) పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడకు వెళ్ళకూడదు.

8. కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయాలి. దాని వలన దీర్ఘాయువు కలుగును. తడి కాళ్ళతో నిద్రకు ఉపక్రమించకూడదు.

*మోక్షానికి ఎవరు పోగలడు* భోజ మహారాజు ఒక నాడు తన ఆస్థాన పండితుల తో

*“మోక్షానికి పోగలిగే వాడెవ్వడు” అంటూ ప్రశ్నించాడట.* మహా క్రతువుల తో పోవచ్చు నని కొందరు, జ్ఞానం పొందితే పోవచ్చు నని కొందరు, భక్తి తో పోవచ్చు నని కొందరు,

సత్సంగము తో పోవచ్చు నని కొందరు, అలా దాని తో పోవచ్చు దీని తో పోవచ్చు అంటూ

ఒక్కొక్కరు ఒక్కో విధముగ చెప్పుకు పోతున్నారు. కాళిదాసు లేచి *“నేను పోతే పోవచ్చు”* అని అన్నాడు.  ఆ మాట తక్కిన వార ికి చుర్రు మనిపించింది.*“ఇతడేనా మోక్షాని కి పోయే వాడు”* అంటూ ఆక్షేపణలు మొదలయ్యాయి. కాళిదాసు లేచి *“మహా ప్రభూ! "నేను" అనే అహంకారం పోతే, ఎవడైనా సరే పోవచ్చును అన్నాను. గాని, నేను పోతానంటు చెప్పలేదండీ”* అని సమాధాన మిచ్చాడు. 

         --(())--

55.... నేటి  ప్రాంజలి ప్రభ స్పెషల్ కధ   

కాలం కదులుతుంది అది మనకు తెలియదు, పగలు రాత్రి కలయికతో ఒక రోజు కదుల్తుంది. ఆ మధ్య సమయంలో అనేక మార్పులు నిత్యమూ గోచరమౌతాయి. అందుకే నేను మీకు ఒక చిన్న కదా చెపుదామనుకున్నాను. 

అందరి కన్నా గొప్ప నేను అనుకుంటారు ఎవరికి వారు అనగా ఓ అందమైన భవనాన్ని నిర్మించు టకు ఇటికలు గొప్పవని చెప్పుకున్నాయి. ఆ ప్రక్కనే ఉన్న సిమెంటు అన్నది  మీరు విడిగా ఉన్నప్పుడు ఎవరు గమనించరు, ఇటుకలను  ఎక సూత్రముగా కలుపుటకు నేనుండగా మీ గొప్ప పెరిగింది అన్నది. అక్కడే ఉన్న దర్వాజాలు, కిటికీలు అందముగా మేము ఉండుటవల్లే ఇంటికి అందం పెరిగింది అది మీరు గమనించండి అన్నాయి.

అప్పుడే అటుగా మేస్త్రి పోతూ వీళ్ళ సంభాషణలు విని నేను కూలీలను  చేర్చి చక్కగా నిర్మించుట  వళ్ళ గొప్పగా కనిపించింది ఈ భవనము. అప్పుడే  అటుగా పోతున్న ఇంటి యజమాని వచ్చి మీ రందరు కాదు ఇది నా సంపాదన వళ్ళ ఏర్పడినది మీరందరు  నేను పిలవగా వచ్చినవారు అన్నాడు.. అప్పుడే అటుగా ఒక స్త్రీ భాదపడుతూ వచ్చింది. 

అమ్మా ఎవరు మీరు బాధ పడుతున్నారు అని అడిగాయి. నేను పుడమి తల్లిని మీ బరువు నంతా మోసున్నాను నన్ను మరిచి పోయారు మీరు, మీరే గొప్ప అని అను కుంటున్నారు అది ఎంత వరకు నిజం  మీలో  "సంయమనం, సహనం, పరస్పర  సహకారం " లోపించింది. అందువల్లే నేను భాధ పడుతున్నాను . మమ్మల్ని క్షమించండి మా తప్పులు మన్నించండి. మేమందరం మీ బిడ్డలం . 

మీకందఱకు నేను ఒకటే చెప్పేది ఐకమత్యం లోపించి, వ్యక్తిత్వమే ప్రాధాన్యత వహించిన చోట  సదా పతనం, పరాభవం లభిస్తుంది. మీ గొప్పలు ఆవతలు పెట్టి  ఐకమత్యంగా ఉండి " సంయమనం  సహనం పరస్పర  సహకారం ఉన్నత కాలం నేను మీ వెంటే ఉంటాను. మీరు ఎదురు తిరిగితే నేను పెట్టె కష్టాలను భరించ వలసి ఉంటుంది అని తెలుసు కొండి. ఒకరికొకరు సహకరాం అందించుకుటూ ఉంటేనే పగలు రాత్రి ప్రశాంతముగా ఉంటాయి.                    

 --((***))--

56...శుక మహర్షి::

శుక మహర్షి వ్యాసదేవుని తనయుడు. జాబాలి తనయ వ్యాసదేవుని భార్య. భార్యా భర్తలు ఇద్దరు అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వ్యాసుడు తన పత్నికి బీజప్రదానం చేశాడు. కాని శిశువు 12 సంవత్సరాల వరకు తల్లి కడుపులోనే  వుండిపోయాడు. దానికి చింతాగ్రస్తుడైన వ్యాసుడు ఆ పిల్లవాడిని బయటకు రమ్మని పిలిచాడు. తాను రానని తల్లి గర్భములోనే తపస్సు చేసుకుంటుా వుండిపోతానని పిల్లవాడు జవాబిచ్చాడు. బయట ప్రపంచం అంతా సంసార మయం, దుఃఖమయం. ఆ ఊబిలోనికి నన్ను లాగొద్దు అని అన్నాడు. వ్యాసుడు గృహస్థాశ్రమంలో వుండడమే దానికి కారణము. ద్వారకకు వెళ్ళి తన సమస్య కృష్ణునికి చెప్పాడు. అది వినిన కృష్ణుడు స్వయంగా వ్యాసాశ్రమానికి వెళ్ళి అతనిపై మాయా ప్రభావము వుండబోదని అభయమిచ్చాడు ఆ గర్భంలోని బాలుడికి. కృష్ణుని మాటమీద ఆ పిల్లవాడు బయటకు వచ్చాడు. ఆ బాలుడే శుకమహర్షి. బాలుడు తపోదీక్షకు వెళ్ళిపోతుంటే వ్యాసుడు పుత్రా పుత్తా అని పిలుస్తాడు. శుకుడు ఒక నకిలీ శుకుని సృష్టించి వ్యాసుడికిస్తాడు.

మెుదటి శుకుడు ఆజన్మబ్రహ్మచారి. ఆయన కామాన్ని జయించిన మహాపురుషుడు. చాలా సుందరుడు. దిగంబరంగానే సంచరిస్తుా వుండేవాడు. ఆయన అలా సంచరిస్తుా ఒక సరస్సు ప్రక్కగా వెళ్ళాడు. అందులో కొందరు దేవతా స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తున్నారు. శుకదేవుడు యువకుడు. సౌందర్యవంతుడు. పైగా నగ్నంగా వున్నాడు. అయినా స్త్రీలు సిగ్గుపడలేదు. తమ పనిలో తాము వుండి పోయారు. శుకదేవుడు కుాడా వారిని పట్టించు కోకుండా ముందుకు సాగిపోయాడు. అంతలో వ్యాసదేవుడు అటుగా వచ్చాడు. ఆయనను చుాడగానే దేవతా స్త్రీలు గబగబా బయటకు వచ్చి బట్టలు ధరించారు. వారి చర్యకు ఆశ్చర్యపడి వ్యాసుడు అదే విషయాన్ని వారిని అడిగాడు. శుకదేవుడు బ్రహ్మభావంలో వుండే వ్యక్తియని, స్త్రీ పురుష భావము ఆయనకు లేదని అందరిని బ్రహ్మస్వరుాపులుగానే చుాస్తారని స్త్రీలు బదులిచ్చారు. కాని గృహస్థాశ్రమంలో వున్న వ్యాసునికి ఇంకా ఆస్థితి రాలేదని చెప్పారు. మిమ్మల్ని చుాసి బట్టలు ధరించామని చెప్పారు.

శుకదేవుని ముఖతః వెలువడిన భాగవతం అందుకే సర్వజనావళికి మధురమైనది. తండ్రినుండి వినినది వినినట్లు గాక భాగవతమును సర్వజనులు వినిఆనందించు రీతిలో మానవాళికి అందించడంలో కృతకృత్యులయ్యీరు. తండ్రి రచించిన భాగవతాన్ని తనలో ముందు జీర్ణించుకుని అందులోని కృష్ణ గానామృతాన్ని అనుభవించి మెుదట తన ముఖతః ప్రజలకు అందించారు, పరీక్షిత్తు మహారాజు కోరికపై భాగవత మకరందాన్ని వారం రోజులపాటు మెుదట గంగానది మధ్యలో వినిపించారు.

--((***))--

57...మునిదంపతులు

బోధ చేస్తూ ఒక మునిదంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు. సకలశాస్త్రాలు, విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా, ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి.

వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు. ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు.

ఇదిలావుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు.

కాసేపట్లో లోపలి నుండి చంటిబిడ్డల ఏడుపులు వినవచ్చాయి. గురుపత్ని కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి వుండేవాడు కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ''. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు.

బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు - నాయనా! ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు.

ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువుగారిని బ్రహ్మ రాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది.

ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా? అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. దానికితోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య, అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు.

వారందరిని వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరు చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు అని. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది.

ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు.

వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా! అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ, నువ్వు బాధపడకు. ఇప్పటినుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా! ఇకనుండి నువ్వు ఎలా చెపితే అలానే
చేస్తాను'' అన్నాడు శంకరుడు.

ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు.

తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా! ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు. దానికి వసంతుడు తమ్ముడూ, నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో. ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు.

ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు.

ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.

వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా! నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ! ఊరుకోమ్మా! ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన.

ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా! ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం.

కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు.

ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు.
చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి, లోపలి ప్రదేశం

--((***))--


58... “ఖాళీ పడవ" 

ఒక ముని ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామని ఒక చిన్న పడవను తీసుకుని, తన ఆశ్రమానికి దూరంగా వెళ్ళి, సరస్సు మధ్యలో ఆపి, ధ్యానంలో నిమగ్నమయ్యాడు.

నిరాటంకంగా కొన్ని గంటల పాటు ధ్యానం చేసిన తర్వాత, తన పడవను మరొక పడవ ఢీకొట్టడంతో, ధ్యానానికి భంగం కలిగేసరికి, అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

తన ధ్యానానికి భంగం కలిగించిన వాడిని శపించాలన్నంత కోపంతో కళ్ళు తెరిచాడు.

*కానీ, అక్కడ ఒక ఖాళీపడవ మాత్రమే ఉంది. అందులో మనుష్యులు ఒక్కరూ లేకపోయే సరికి ఆశ్చర్యపోయాడు !*_

అది గాలివాలుకు కొట్టుకు వచ్చిందేమోనని అనుకుంటున్న క్షణంలోనే, అతనికి ఒక సత్యం గోచరించింది. ఆత్మ సాక్షాత్కారం కలిగింది.

అసలు ''కోపం'' తనలోనే ఉందని, కేవలం బయట నుండి ఒక కుదుపు కారణంగానే అది బయట పడిందని గ్రహించాడు.

అప్పటి నుండి, ఆ ముని తనకెవరైనా కోపం తెప్పించినా, చిరాకు కలిగించినా, 'అవతలి వ్యక్తి ఒక ఖాళీ పడవ మాత్రమే'. కోపం తనలోనే ఉందన్న ఙ్ఞానాన్ని గుర్తెరిగి ఆవేశం చెందకూడదని గ్రహించాడు.

అందుకే, మనం కూడా అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మనకు ఎదురయ్యే సమస్యలను ఒక సమగ్ర దృష్టితో విశ్లేషించి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయాలి.

“ఖాళీ పడవ" అనేది ఒక గొప్ప నానుడి. ఖాళీ పడవ మంచిదే. మనను మనకు పరిచయం చేస్తుంది 

సాధన - దివ్యా నుభూతులు - పురుషోత్తమ స్థితి :

   నీరు కుండలో ఉన్నంత వరకు, దానికి శక్తి ఏమీ ఉండదు. కానీ గంగలో కలిస్తే....మహా ప్రవాహం. అంతా చేస్తుంది కదా!

    శ్వాస గతి బహిర్ముఖంగా ఉన్నంత కాలం...దాంట్లో ఏమీ శక్తి  ఉండదు. ఎందుకంటే బహిర్ముఖ శ్వాస,దేహమనే ఘటంలో హద్దులకు పరిమితమై ఉంటుంది. కానీ అంతర్ముఖియై, స్థిరమైనప్పుడు .....అనంత మహా శూన్యంతో సంబంధమేర్పరచుకొని అనంత శక్తి సంపన్నం అవుతుంది. ఈ స్థితికి ఆయన చేరుకొని, వారు ఇలా వ్రాస్తూ వచ్చారు.

बडा मजा सब अगं टूटने लगा

(భలే ఆనందం కలుగుతోంది. అంగాలన్నీ తెగిపోతున్నాయి)

కానీ ఆత్మలో మొదట మనస్సు కలిసి, తరువాత లయమైన మీదట చూచుట,వినుట , ప్రాప్తి - అప్రాప్తులు ఉండవు. అందువల్ల వారు 1871-జూలై-28 వ తారీఖున ఇలా వ్రాసారు.

నిర్మలమైన ఒక శూన్యాన్ని చూసాను. అదే బ్రహ్మ. మనస్సు లయం చెయ్యవలసినది దానిలోనే. రెండూ కలసినపుడు ఒకటే అవుతాయి. రెండు ఉండవు. ఆ ఏకావస్థే "హమ్జాద్"- అంటే పురుషోత్తముడు.----

59-60.....గురుదేవ్ శ్యామాచరణ లాహిరి

Krishna Images, Wallpaper, Photos, Pics, And Graphics
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

నేను పుట్టింది తెనాలి, పెరిగింది, విద్యాభ్యాసము, ఉపాధ్యానిగా పని చేసినది, గుంటూరు.   ఒక్కసారి మా గుంటూరు విశేషాలు (ఆంధ్రప్రదేశ్ ) చదివి తెలుసుకోండి   

 నల్ల చెరువు,ఎర్రచెరువుల..తమాషా, కలయిక ...
నల్లచెరువుని పూడ్చి ఆర్.టి.సి.బస్టాండు రాక..ఎర్రచెరువు ఏవైనదో ఎవరికెరుక !!

పరమాయికుంట ..ఎప్పుడూ నీళ్ళుండేవంట..
అది తప్పితే ఇంకన్ని చోట్లా,పడాలి ..నీళ్ళకి తంటా..

బ్రిటిషర్స్ గుర్తుగా..అరండల్ పేట..బ్రాడీ పేట..
పాతగుంటూరు తో పాతగానే ఉన్న .. కొత్త పేట

" క్రృష్ణ "నగర్ పక్కనే .." బ్రృందావన్ " గార్డెన్స్
" చంద్రమోళీ " నగర్ ని ఆనుకునే.."కమ్మదనం" తో నిండిన " శ్రీ " నగర్ కాలనీ..

మండుటెండల వేసవికాలానికి..కొలమానం ..రెంటచింతల
ఆ చింత తోపులతో నిండిన ..ఆ పేరేచెర్ల

కాకులు వాలని కొండ కాదా..ఆ కోటప్పది !!
ఫిరంగిలేని పురమేమో ..దాని పక్కది..

ఇవి చూసే కదా..  శ్రీనాధుని కలం నించి జాలువారినదీ పద్యం..
" చిన్న చిన్న రాళ్ళు
చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్లు.. నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు..సర్పంబులున్, తేళ్ళు
పలనాటి సీమలు..పళ్ళెటూళ్ళు "

కొరివితో తల గోక్కోవచ్చు కానీ..
ఈ ఊరి కొరివి"ఖారంతో " ..అది సాథ్యమవునే..

" ఆంథ్రమాత " గా ,హస్తిన రారాజు మదిని కొల్లగొట్టలేదే ..మా గోంగూర..

దాని పక్కనే దొరుకు గదా.." నవయవ్వన" సనసన్నని..వంకాయ ,నక్కదోసకాయ..

గుంటగ్రౌండ్ లో ..ఎన్ని ఆణిముత్యాలు ఆడాయో
ఆ తరవాత..దాని వెనకాలే దొరికే " రుక్కయ్య" బజ్జీల సరసన వాలాయో..

కోస్తాంధ్ర లోనే మొదటి బి.ఆర్. స్టేడియం..రంజీట్రోఫీకి వేదికైన వేళ..

పోలీసుల సహ్రృదయం.. పెరేడ్ గ్రౌండ్లో తెచ్చింది ఆటకో కళ !!

రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ..శంకర్ విలాస్..

ఓ పెద్ద కూడలిగా ఎదిగి ..చిత్ చోరులకైనదో మూగమానస్ !!

వుమెన్స్ కాలేజీ రోడ్ లో పోగొట్టుకున్న ..బాథాతప్త హ్రృదయాల గోల..

భాస్కర డీలక్స్, క్రృష్ణమహల్ ,నాజ్ టాకీసులలో ..తీరేవి పదకొండు గంటల వేళ !!

విశాలమైన తాలూకా ఆఫీసు ఆవరణలో..

రాజకీయ శుష్క చర్చలూ,వేడి టీలతో,ధూమపానాలు !!

" లాడ్జ్ "  కాని ధియోసాఫికల్ సొసైటీ ..తెచ్చింది ఆ సెంటర్ కి ఆ పేరు !!

రీజనల్ లైబ్రరీ ,ఊరికే తలమానికమైంది..వచ్చే వారు..అన్ని వర్గాలవారు !!

ఎల్.వి.ఆర్ అండ్ సన్స్ క్లబ్ లో పేకాట జోరుగా సాగితే..

" ఆఫీసర్స్ " కూర్చునే వారు ఇంకోచోట..అన్నిటితో పాటు .. టెన్నిస్ కూడా ఆడుతూ..తూలుతూ..

వరుసకట్టిన .. "గోల్డెన్ టుబాకో,నవభారత్,బొమ్మిడాల .. ఇత్యాది   పొగాకు కంపెనీల ,విదేశీ ఎగుమతుల వ్యాపారం...

పొద్దున్నే అలంకరణలతో ఏగి..సాయం సమయంలో వడిలి పోయినా ..కనిపించే " పూబంతుల "  వయ్యారం !!

 ప్రతి వంటింటి జాడీలో దర్శనమిచ్చే ఘాటైన    చుట్టుగుంట " మిర్చి"  యార్డు కి పోటీగా..

నల్లరేగడిలో జన్మించిన పత్తి ..కానరాదే..గుంటూరు చీరల ప్రతి యార్డ్ లోనూ..

మిరపబజ్జీలు ,పుల్లటి పునుగులతో పాటు ..

" హిమానీ" శీతలపానీయాలకీ..దొరుకును చోటు..

వెంకట్రామా బుక్ డిపో లో ..ఆథ్యాత్మిక వెతుకులాట..

గణేష్ సెకండ్ హాండ్ షాపులో..పాత పుస్తకాల వేట !!

పేరుగాంచిన కుటుంబాలకి ఆలవాలం..

ఓపక్క ..వల్లభజోశ్యుల,నడింపల్లి,అన్నంరాజు,జంథ్యాల ,కస్తల,పిల్లలమర్రుల వారసత్వం..

ఇంకొక పక్క కొంజేటి,తెల్లాకుల,పచ్చిపులుసు ల వ్యాపార- సరళత్వం !!

ఘనకీర్తిగాంచిన హిందూ కళాశాల , ఎ.సి.కళాశాలల మధ్య .. ప్రతిష్టాత్మక మైన విమెన్స్ కాలేజీ..

"రవి" కాంచనిచో..ఎంసెట్ కాంచునే అను నానుడితో సాగిన ట్యుటోరియల్ కి దొరికిన మైలేజీ !!

దేశంలో ఎటు పోయినా ..ఆయన శిష్యులే !!.ఆయననే  ఐడల్ గా , మోడల్ గా  తీసుకున్న,ఏకలవ్యుల .. ఆరాధ్యదైవం.. త్రిభాషా పండితుడు..విదేశీయుల్నీ అలరారించి,తన భాషా నైపుణ్య, ప్రవీణత లతో కీర్తిగాంచి..ఉపాథ్యాయులకే   ఓ నిర్వచనమై..ఎంత ఎదిగినా తన లైఫ్ స్టైల్ ని మార్చని ..ఓ యోగి.. హిందూ కాలేజీలో ప్రిన్సిపాల్ గా పేరుగాంచిన వల్లభజోశ్యుల సుబ్బారావు గారి గురించి ఎంత చెప్పినా,తక్కువే !!

ఆయన సమకాలీకుడు,స్ఫురద్రూపి, ఆజానుబాహుడు,సొగసరి మీసాల నిత్య యవ్వనుడు..ఓ డాక్టర్ గానే కాక, "పోతన" లో సింగభూపాలుడు గా సినీరంగంలో ప్రవేశించి పేరుతెచ్చుకున్న డాక్టర్ వి.ఆర్.శర్మ ..ఆ తరవాత ఆ రంగాన్ని తన తమ్ముడు వి.శివరాం కి వదిలి తన ప్రాక్టీసులో  తానుండగా..

" పల్లెటూరు  పిల్ల " , " పోతన " , " గుణసుందరి కధ " నించి " రంగుల రాట్నం" దాకా ఎన్నో పాత్రలకి న్యాయం చేసిన శివరాం గారు. ..విజయా- వాహినీల ఎన్నో సినిమాలకీ సౌండ్ ఇంజనీర్ గా ఎదిగారు.

వీరు ముగ్గురూ మా మేనమావలని చెప్పుకోడం ఓ గర్వకారణం !!

ఇంకో విలక్షణ విశేషం..సుమారు నూరు సంవత్సరాల చరిత్ర కలిగి.. హైదరాబాద్ తరవాత ఆంధ్రప్రదేశ్ లోనే పేరుగాంచి..ఐదు దశాబ్దాల నించి , ఎక్కువశాతం డాక్టర్లని అమెరికాకి  పై చదువులకి పంపిన ఘనత ఆ మెడికల్ కాలేజీదే...

పిన్నమనేని,కాసరనేని,చిగురుపాటి,ధూళిపాళ, సత్య భామ,సావిత్రి,ఇ.ఎన్.బి.శర్మ ,లక్ష్మణరావు,కోదండరాం,బ్రహ్మానందం లాంటి ఘనాపాటీల పుట్టినిల్లు..కొండకచో మెట్టినిల్లైనదీ సంస్ధ...

గడియారం లేని ..గడియారంవారి వీధి..
ఫాక్టరీ కానరాని..ఫాక్టరీ రోడ్..
డొంకలతో నిండిన డొంకరోడ్..
వేసంకాలంలో ..ఎక్కువ ఫైరింజన్లు అవసరం వచ్చే ..బొంగరాలబీడు..
డాక్టర్లతో నిండిపోయిన ..ఓల్డ క్లబ్ రోడ్
రామచంద్రామెడికల్స్ నించి..జి.వీ.ర్.సి .మెడికల్ స్టోర్స్ దాకా సాగే ..జన " ఔషద " గమ్యం...
అల్లం,జీలకర్రల గుబాళింపుతో‌..పెసరట్టుప్మాల సహజీవనం..
అమ్రృతపాణి,చక్రకేళీల ..రుచి అనుపమానం..

మడ్రాసు మెయిల్ తర్వాత వచ్చిన డైరెక్ట్ ఎక్స్ ప్రెస్ " సర్కార్ "

నవాబుల " గోల్కండ " అయిందో ఉపహార్..

 కారంపూడి ..పౌరుషం..
దుర్గి " సాండ్ స్టోన్ " ప్రతిమల సౌందర్యం..
" వినుకొండ " ముగ్గు తో..ఆయెను పాత్రలు..శుభ్రం
అలసిన మేనును ,వాల్చి.. .కాలు చాచుకునే సౌలభ్యం..
" నరసరావు పేట " కుర్చీ ఇచ్చెగదా ..ఆ సౌకర్యం !!

ఇదే నాకు తెలిసిన ..మా వూరు..గుంటూరు

.......మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ...........

No comments:

Post a Comment