ప్రకృతి మాత పులకరింత పెదవి చెంత
మాన వాభ్యుదయానికి మేలు ఎంత
జ్ఞాప కాలతోను చలించు జ్ఞాన మెంత
బతుకు బిగి కౌగిలిలలోన బాడు కెంత .... ... 62
తనువు పరిపక్వ సంబర మందు చిందు
కాల మాకర్షణ అనేటి కావ్య మేది
ప్రకృతి ఆనంద డోలిక పంచి నంత
కమ్మి నంతయు అనుభంచు కాల మొవ్వు .... ... 61
నిత్య ఆనంద ఆనుభూతి నిన్ను మార్చు
ప్రకృతి చూపేటి ప్రేమలు పెంచు విలువ
ప్రేమ సుమఘంధ ఆవిరి పెంచు చుండు
గుండె గుండెకు చప్పుళ్లే గరము గుండు ..... ... 62
ప్రేమ సుమలత వికసించి పాదుచేయు
తరుణ మనుభూతులు మరచి దారిన చేరు
పక్షుల కిలకి లలు విన బడియు కొంత
మనసు ఉల్లాస మైఊహ పదిల మొవ్వు ...63
సకల ప్రాణకోటికి ఊపిరిగను సాకు గాలి
సంతసముసండి సుమచిత్ర సోకు గుండు
దృశ్య మేదైన ప్రాణాల్ని తృప్తి పరచు
తరువుల కదలికలు కొంత దరువు గొల్పు .... 64
--((***))--
నా అనురాగ ము నీయందు నాని ఉంది
నా కలలహరి నీవేగ నమ్మి ఉన్న
నిన్ను ను కలసి ఉండేటి నిమ్న మయ్యె .... ... 71
ఎదురు చూపుల విరహిణి ఏమి నవ్వు
కదిరి లాగిన కలసి యు కలుగు లవ్వు
చెదరి పోలేక మనసునే చపల పరిచె .... ,... 72
తరక నిర్మల కాంతి యు ధనము యగును
చురక వెయ్యక శాంతిని జార్చ వద్దు
మరక అన్నది లేకయు మాను లాగ
పరక జల్లు కొరకు ఉన్న పొలము ఖర్చు .... ... 73
నా యద పరిధి మేరకు నిన్ను పిలుపు
నా మది పరిధి తట్టుకో నేటి శక్తి
నా విధి మహిమ వలన ను నేత అవును
నా ద శ దిశకు వ్యతి రేక నాడి అవ్వు ..... .... 74
మేలి ముసుగులో నారూపు మేలి యగును
దాచి ఉంచిన థళథళ తలపు చిక్కు
హృదయ తాపము తగ్గించు హృదయవీణ
ఆశలు తీర్చేటి మనసున ఆకలవ్వు ....... ..... 75
దేవ చల్లని పాన్పు పై దీక్ష చాలు
బ్రోచె చల్లని మనసుకు పదవి చాలు
వీచె చల్లని గాలులు విక్షనవ్వు
ప్రేమ చల్లని సాక్షిగా పుష్ప మయ్యె ..... .... 76
ప్రేమ పొందియు పంచేటి ప్రేమ దీక్ష
సర్వ శక్తితొ నిత్యము శాంతి దీక్ష
దేశ రక్షణ కోసమ్ము ధ్యాన దీక్ష .... .... 77
వృత్తి విద్యకు ప్రోత్సాహ ముండె దీక్ష
వీధి వెక్కిరించిన విధి వాది ధీక్ష
తల్లి తండ్రుల మాటలు తప్పు కావు
దివ్య ఫల పుష్ప తరువుల దివ్య దీక్ష ..... ... 78
ఆశయ విజయ కాంక్ష ను ఆర్తి యగును
ఏక మార్గపు సేవలు ఏకమవ్వు
బ్రహ్మ రాత అనుకరణ బ్రాంతి కాదు
నచ్చి మెచ్చిన పొందేటి నమ్మకమ్ము ..... ... 79
జ్ఞాన పోరాట పఠిమను జ్ఞప్తి తెచ్చు
జ్ఞాన సంపద పొందేటి జ్ఞాన మొవ్వు
జ్ఞానమే సమాజ వృద్ధికి జ్ఞాన మొవ్వు
జ్ఞాన మువలన మేధస్సు పెర్గు దీక్ష ..... .... 80
చూపుల యెదిటి సోద్యమ్ము జాడ్య మొవ్వు
పాప పుణ్యాల ప్రపంచ పోషనవ్వు
తీపి పుట్టించు దినదిన తృప్తి గలుగు
పుణ్య సంసార భోగము పుడమి నందు .... .... 81
మనసు లోపలి మర్మబు మౌన దీక్ష
జనన మరణ శరీరము జపము దీక్ష
వెనక దిరుగుట వెడలం వేకువవ్వు
కనకపు వలలో చిక్కిన కామ దీక్ష ... ...... 82
ఆత్మ శుద్ధితో ప్రేమను అంద గలిగి
భావ తత్వంతొ విశ్రాంతి బాధ తొ లిగి
ధైర్య లక్ష్యంతొ భయాన్ని దాచ గలిగి
నిత్య ధర్మాన్ని బోధిస్తు నటన చూపు .... 83
పరుల వంచన చేరినా బుద్ది గలిగి
పరధ నమును ఆశించక మనసు గలిగి
పరుల కీడును తలచక ప్రేమ గలిగి
స్త్రీల బుద్దిని గ్రహించి శాంత పరుచు ..... 84
నాస్తికుడు ఆస్తికుడిగాను నమ్మ గలుగు
ఆస్తికుడు మారి జ్ఞాని గాను అవ్వ గలిగి
గురువు జ్ఞానిగా మార్పులు గలిగి ఉండు
వైద్యుడే రోగికి శుశ్రూష వైద్య మొవ్వు
రోగి వైద్యుడు చెప్పినవి రాగమొవ్వు
రోగి వైద్యునిలో దైవాన్ని రోజు చూడు
వైద్య మందించు మార్గమే వేదమవ్వు .... 86
వన్య ప్రాణులకు స్వేశ్చ వ్యాధి కలుగు
వనము సోయగ ప్రకృతిని వాన పంచు
వినయ భావము నిత్యము విద్య యందు
మనిషి జన్మకు తృప్తియే మోక్ష మొవ్వు ..... 87
శ్వేత వర్ణపు జలములు శీతలమ్ము
కళలు లోగిలి యంతయు కలుగు మేలు
ఆశ పాశపు కోపము ఆశ పెంచు
ధర్మ మార్గపు నడకలు దారిచూపు .... 88
వెదికి చూడగ కల్పన వెల్ల డగును
జ్ఞానసంస్థితినందును జాతి అనకు
జ్ఞాని కర్మలు చేసినా జ్ఞాన ముండు
జ్ఞాన మంతయు తెల్పినా జ్ఞాని కాను
జ్ఞాన ముక్తిని అందించు జ్ఞాన దాత .... ..... 93
కర్మసంక్షయ మొనరింప నిర్మలమగు
ధర్మ మార్గము సహకార కర్మ లొసఁగు
మర్మ మంతయు ఉపకార పక్వ మగును
చర్మ మేలును అనుకూల జాడ్య మవును ..... .... 94
పేగు భంధము మించిన ప్రేమ లేదు
నిగురు కప్పిన నిప్పులా నిన్ను చేరు
క్రమము శిక్షన పేరుతొ గమన ముంచి
కళ్ళను మరచి వెళ్ళక కలలు కంది ..... ..... 95
విన్న మాటలన్ని మధుర వినయ మొవ్వు
అన్న మార్పులన్ని విషయ అలక లవ్వు
కన్న బిడ్డ స్వేశ్చ హరించి గాల మొవ్వు
నిన్న రాత్రి నుండి భయంతొ నిదుర రాదు ..... ... 96
తే : తండ్రి సంపద కూర్చియు ధర్మ బుద్ధి
తల్లి సేవలు చేసియు తత్వ బుద్ధి
భార్య భాద్యత దక్షత భాగ్య సిద్ధి
గురువు సత్యము తెల్పేటి గమన బుద్ధి..... 97
మగువ మాయకు చిక్కియు మధుర పొందు
మహిళ మాటలు తెనియలు మన్ను లాగ
తరుణి పిల్లల సేవల తలుపు లాగ తోన
కలలు తీర్చేటి కారుణ్య కధలు తెచ్చు .... 98
మరువ వద్దును ఎప్పుడూ మనసు నందు
వదల వద్దులే స్నేహాన్ని వడిసి పట్టు
మనసు పంచియే ప్రేమను మంచు లాగ
మనము చిరుహాస జీవితం మనుగ డంత ...99
ఇతర విషయాల పైఆశ ఇరుకు అవ్వు
సమయ సద్విని యోగము సంబరమ్ము
సుఖము వదలియుఁ కష్టము సఖ్యతవ్వు
ఎపుడు కోపమ్ము తెచ్చేటి ఎదల చూపు ..... 100
--(())--
No comments:
Post a Comment