రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
78....ఇచ్చోటనే జగతి యంతయు చేరు
ఇచ్చోటనే బ్రతుకు మార్గము పోరు
ఇచ్చోటనే కలము కావ్యము తీరు
ఇచ్చోటనే శవము కాష్టము జోరు
ఇచ్చోటనే ప్రణయ ప్రబంధము తీరు
ఇచ్చోటనే హృదయ ప్రభావము పోరు
ఇచ్చోటనే నిస్వార్ధ సమూహము చేరు
ఇచ్చోటనే నిత్యము మనుష్యుల జోరు
ఇచ్చోటనే ఇల్లాలి నల్లపూసలు తీసిన తీరు
ఇచ్చోటనే చిత్రాలు వల్లమానివి తీసిన జోరు
ఇచ్చోటనే పిశాచ నివాసాలేలు తీసిన పోరు
ఇచ్చోటనే మృగాల కపాలాలేలు తీసిన చేరు
ఇచ్చోటనే ముక్కంటి తాండవ మాడిన తీరు
ఇచ్చోటనే గంగమ్మ పారిన మోక్షము చేరు
ఇచ్చోటనే మంత్రమ్ము ప్రభావ దీక్షయు జోరు
ఇచ్చోటనే మనుష్య ప్రార్ధన చేసిన పోరు
82
పాట:
ఇందు వదన కుందరదన
మందహాస మధురగాత్ర
ఎవతెవమ్మ ఇటజేరిన
ఇందీవర నేత్రవమ్మా
అరుణాస్పద పురము మాది
ఆత్రేయస గోత్రమమ్మా
ప్రమదా నే ప్రవరాఖ్యుడ
తెలుపుచుంటి నా దొసుగులు
సిద్ధుడిచ్చిన సిద్ధ లేహ్యము
బుద్ధి తప్పి దాల్చినాడను
గూడువదలిన గువ్వనైతిని
దారిగానక ఖిన్నుడైతీ
చిత్త శుద్ధిగ శివుని గొల్చెద
అతిథి సేవన సేదతీర్చెద
నాదు నగరికి దారి తెలిపి
పొందునీవిక పుణ్యరాశుల
వరూధిని(స్వగతం)
ఎవరీ చక్కని వాడూ
మనసే దోచే సాడు
పున్నమి రేయిన వికసంచిన
చందురు డితగాడో
నందనాలలో యాటలనాడే
నలకూబరుడితడౌనో....॥ఎవరీ॥
(వచనంలొ)
ఆహా ఎవరీ సుందరుడు మదనుడో! వసంతుడో! జయంతుడో! లేక నలకూబరుడో! యన్నట్టుగా నున్నాడు....
(అతనితో) ఓ సుందరా! నేను దేవకన్యను
వరూధిని యను నామాంతరము గలదానను.
నీవు దారితప్పలేదు, ప్రస్థుతం సరియైన దారిలో నున్న వాడవు....నీ సుందర రూపముతో మమ్మలరించినావు.
శరత్కాలకౌముదులొలుకు నీ కన్నుల కాంతులు విశాల వక్షము వృకోదరము తో మంచి ఈడుమీదున్న కొదమ సింగము నడుము లాంటి నీ కటిప్రదేశము....
శాపవశమున నరజన్మమునెత్తీన గంధర్వుడవేమో.....
సుందరా! నిను గాంచినతోడనే నామనసు పరవశించింది. నన్ను మోహమున ముంచెత్తించిన నీ రూపము నాసొంతమవాలన్న కాంక్ష ప్రబలుతున్నది
ప్రవరుడు : హరి హరీ ! వినకూడని మాటలు వినవలసి వచ్చినది కదా! పాపము పరిహరమగు గాక ... తల్లీ...నే ప్రవరుడా!
వరూధిన: యెరిగితిమి
ప్రవ: పరమ నిష్ఠాగరిష్ఠుడను
వరూ: ఈ నిష్ఠానుష్ఠానములు...నరులకసాధ్యములైన స్వర్గప్రాప్తికే కదా! అట్టి స్వర్గ సుఖాలనిక్కడె అందించ గల దాననుండగా ఇంకా ఈ నిష్ఠలూ అనుష్ఠానములూ ఏల?
ప్రవ: హరిహరీ! నేను ఏకపత్నీ దీక్షాధరుడను
వరూ: ఏకాంతలూ మెచ్చనపుడే ఏకపత్నీ వ్రతదీక్షలు...ఇంపుసొంపుల సురకాంత తనకు తానుగా నిను వలచి నిను లాలీంచి పరవశింపజేసే స్వర్గతీరాలకు గొనిపోవ చెంతచేరినపుడు బెట్టుసేయనేలా? మదనా!
ప్రవ: హరీహరీ నన్నొదులు తల్లీ! నా దారిన నన్ను పోనిమ్ము!
వరూ: దారే తెలియనీ నీకు ఏదారని వదలను మదనా!
ఇకపై నీదారీ నాదారి వేరుగారాదు!
మన ఇరువురి దారులూ ఒకటై స్వర్గ తీరాలకు చేరుదాము రారా మన్మథా!
--(())--
వల్లవీవిలాసము -
ఆధారము - వాగ్వల్లభ
నడక - పంచమాత్రలు (రెండు ఎదురునడక గణములు)
యతి - సంస్కృతములో లేదు, ఏడవ అక్షరము
ప్రాస - నియతము
నడక - పంచమాత్రలు (రెండు ఎదురునడక గణములు)
యతి - సంస్కృతములో లేదు, ఏడవ అక్షరము
ప్రాస - నియతము
83..వల్లవీవిలాసము - ర/య/య/గగ UIU IUU - IUU UU
11 త్రిష్టుప్పు 75
పల్లవ మ్మయెన్గాఁ - బ్రసూనమ్ముల్గా
నుల్లమందు నాశల్ - హొయల్ మీఱంగా
మల్లియల్ సుమించెన్ - మనమ్మం దెల్లన్
వల్లవీ విలాసం - బవంగా రావా
మెల్లగా మనోధైర్యమేగా పొందే
కళ్ళలా డకా వేషమంతాచూపే
చుల్లరే కదా విశ్వమాయ చేసే
మల్లెలే కదా ప్రేమ చూపే శక్తీ
అంద మీ మనమ్మున్ - హరించెన్ గాదా
చంద మీ హృదిన్ సం-చరించెన్ గాదా
విందుగా సుసంధ్యల్ - విభావ మ్మిచ్చున్
సుందరిన్ దలంచన్ - సుమమ్ముల్ విచ్చున్
ధైర్యమున్ సుబుద్ధిన్ - ధనమ్ముల్ పెర్గున్
కార్యమున్ ప్రభుద్దుల్ - గణమ్మున్ చేయున్
సౌర్యమున్ క్రమమ్మున్ - సమమ్మున్ చేయున్
మర్యాదే మనమ్మున్ - మనస్సుల్ మార్చున్
రాగవీణ మ్రోఁగెన్ - రసమ్ముల్ జిందన్
నాగమై నటించెన్ - నవమ్మై దేహ
మ్మాగకుండ నీకై - హజారమ్మందున్
యోగవేళ వచ్చెన్ - యుగాదిన్ నేఁడే
కాలమాయ వచ్చెన్ - కనమ్ముల్ కందెన్
గోల చేయ వచ్చెన్ - గళమ్ముల్ విప్పేన్
జోలపాడ వచ్చెన్ - జయమ్ముల్ కల్గెన్
ఈల పాట పాడెన్ - ఇదమ్ముల్ చూపెన్
నింగిలోఁ గనంగా - నిశిన్ జంద్రుండున్
రంగులన్ వెలింగెన్ - స్రజమ్మై తారల్
శృంగమందు మంచుల్ - హృదిన్ శోకమ్మే
రంగడిందు లేఁడే - రమించన్ రాఁడే
వానలో వరంగా - వసిన్ చెందించున్
ప్రాణమే పణంగా - పదమ్ వ్రాయించెన్
మౌనమే ఫలంగా - మనమ్ మ్రోగించేన్
మోసమే చేయంగా - మన్షీ బతికించెన్
--(())--
85.... I I I U I U - I I U U I
కవిత - జత
సమయ పోషణే సహజం అంటె
వినయ సంపదే కనకం అంటె
మనిషి భావనే చరితం అంటె
తలచి పిల్చితే - తపనే అంటె
వగచి కొల్చితే - వయసే అంటె
చిగురు చిమ్మితే - చమటే అంటె
తడిసి తుమ్మితే - పిలుపే అంటె
కనులలోన నే - కలలో నీకు
మనసులోన నే - మధువో నీకు
పిలుపులోన నే - పదవీ నీకు
అడుగులోన నే - అడిగా నిన్ను
కధలలోన నే - తెలిపా నీకు
బతుకులోన నే - బతుకే నీకు
మమతలోన నే - మదియే నీకు
జగతిలోన నే - జతయే కాద
--(())--
87.. *అక్షర గీతి (కవిత )
మదిర నీకేలరా - మధువు నేనిత్తు - మానసమ్మిత్తు
వ్యధలు నీకేలరా - వనిత నేనుండ - వలపుతో నిండ
తక్కువ చేయనురా - తాపము చూడుమురా - తమకం విడుమురా
భాధలు ఎందుకురా - భద్యత నాదియురా - భారము నాదియురా
ఆకలి అణకురా - అసలు నీకేనురా - అంతయు పొందుమురా
దాహము తీర్చుకోరా - దాపరికం వద్దురా - దావాలనం తగ్గునురా
సుఖాలు మనవిరా - సంతోషాలు మనవిరా - సంబరం మనదిరా
కోపాలు మరువురా - కోలాట ఆదుమురా - కోరిక తీరునురా
మదిర నీకేలరా - మధువు నేనిత్తు - మానసమ్మిత్తు
వ్యధలు నీకేలరా - వనిత నేనుండ - వలపుతో నిండ
పక్క చూపు నీకేలరా - పరువం నేనిత్తు - వలపు అందిస్థా
లేదని అనుకోకురా - లోకాన్ని చూడరా - లోకులను గమనించారా
కలవరింపు ఎందుకు - కనులముందు ఉండగా - కనువిందు చేస్తుండగా
పలకరింపు చూపరా - పక్కను మరువకురా - పదిలంగా ఉందాంరా
పోగొట్టుకొంటిరా - పొగమంచులోనఁ - బొదరింటిలోన
నాగవేషణ యెల్ల - నన్ను కన్గొనుట - నగుచు నే మనుట
సాన పట్టుమురా - సతతము కలవరా - సరిగమ అనరా
వేషము వద్దురా - వేగిర రమ్మురా - వెతలు తీరునురా
రాగవీణను మీటె - రమణి రంజిల్ల - రవము రాజిల్ల
యోగ మేమిటొ నాది - యురికి యొప్పారె - నురము విప్పారె
రామకీర్తన పాడే - రవళి రంగరించి - రసము శోభిల్లే
వేగము మరిచా - వేకువ చేరితి - వేదన తీర్చితి
--((***))--
UUU UUU UUI III III III IU
89.. నేటి కవిత్వం - * స్త్రీ తత్త్వం హల్లకమాలిక
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
చిరునగవు వయసుబట్టి కళ
రాగము తాళము పల్లవే కదా
మదిపిలుపు కళలపై తలపు
నాదము గానము శబ్దము కదా
సరిగమల పరుగులే మనసు
ప్రేమతొ చెప్పిన పాఠము కదా
దరియు కధ తెలుపుకున్న కల
కళ్ళ తొ కళ్ళను కల్పును కదా
అభిరుచులు ఒకటిగా కలసి
స్నేహపు భావము ఏర్పడు కదా
పెదవి రుచి కలపగా మెరిసి
స్వేశ్చగ కల్సుట హాయిగ కదా
కల నిజము కళలుగా పెరిగి
ఆకలి కోసము పోరులు కదా
మెరుపుకల నిజముగా మెరుపు
కళ్లను తెర్చిన మాయము కదా
వినయ మగ పలుకులే బతుకు
సత్యపు పల్కులు దాహము కదా
పరువు మన మలుపులే బతుకు
కోపపు పల్కులు దేహము కదా
నయనముల పిలుపులే కలియు
మార్గపు ఆశల తృప్తియు కదా
కరములు కలుపుటే కలల
తాపము తాళము వేయుట కదా
--(())--
91.
*స్త్రీ తత్త్వం
94. .
No comments:
Post a Comment