93.... *హరిఓం ,
కాళిదాసు గర్వభంగం
*మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు.*
*మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.*
*బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.*
*ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది.*
ఆమెను చూసి... *‘బాలికా! నాకు దాహంగా ఉంది.*
*నీళ్లు ఇవ్వమ’ని* అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక...
*‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని* బదులిచ్చింది. కాళిదాసు:
*‘నేను ఎవరో తెలియక పోవడం ఏంటి?*
*పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని* అన్నాడు.*
*అహంకార పూరిత మైన ఆ మాటలు విని బాలిక నవ్వి...*
*‘మీరు అసత్య మాడుతున్నారు.*
*ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు.*
*వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’* అంటుంది.
అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి...
*‘నాకు తెలియదు. గొంతు ఎండి పోతోంది.*
*ముందు నీళ్లు ఇవ్వమ’ని* బతిమాలుకుంటాడు.
అయినా ఆ బాలిక కనికరించదు.
*‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం.* ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’
అని అడుగు తుంది. బాలిక.*
*‘నేను బాటసారి’ని* అన్నాడు కాళిదాసు.
*‘మళ్లీ అసత్య మాడుతున్నారు.*
*బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.*
*మీరేమో అలిసి పోయారు కదా.*
*ఈ లోకం లో అలా అలసి పోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు.*
*వారే సూర్యచంద్రులు!’*
అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.
దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి..
*‘మాతా నీళ్లు ఇవ్వండి.*
*దాహం తో చనిపోయేలా ఉన్నాను..’*
అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు.
లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి...
‘మీరెవరో సెలవివ్వండి...
నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా...
*‘నేను అతిథిని..!’* అని బదులిచ్చాడు.*
*‘మీరు అసత్యం చెబుతున్నారు.*
*ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు.*
*ఒకటి ధనం, రెండోది యవ్వనం.*
*ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’* అంటుంది.*
*కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని* వేడుకుంటాడు.*
*కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు.*
*ఈ ప్రపంచంలో ఇద్దరే సహన శీలురు ఉన్నారు.*
*ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’* అని అడిగింది.
ఓపిక నశించిన కాళిదాసు..
*‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని* అడిగాడు.
*ఆ అవ్వ నవ్వుతూ...*‘
*ఇదీ అసత్యమే.*
*ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు.*
*ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే _రాజు_. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు.*
*ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే _పండితుడు’_ అని అంటుంది.*
ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.*
*ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. _
*ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది.*_
*👉‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా!*
*కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’*అని జలమును అనుగ్రహిస్తుంది
🙏🙏🙏
94
మనకు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రాగానే, పురాణాలను, దేశాన్ని, ఆచారాలను, సంప్రదాయాలను, పెద్దలను, సంస్కృతాన్ని విమర్శించే స్థాయికి వచ్చామని విర్రవీగుతుంటారు కొంతమంది.
వాళ్ళకు బుద్ధి వచ్చే సంఘటన ఈ మధ్యనే జరిగింది.
దివాకర్ అనే వ్యక్తి రాసిన పోస్టు దీనికి మూలం.
''నాసిక్ హై వే మీద, రోడ్డు మీద వెళుతున్న జనాల వంక ఆసక్తిగా చూస్తున్న ఒక వృద్ధ జంటను చూసాను. చూడ్డానికి వాళ్ళు చాలా పేదవారిలా, ఏదో అవసరంలో ఉన్నవారిలా అనిపించింది. నేను వారికి ఆహారం కానీ, మరేదైనా సహాయం కావాలా అని అడిగి వారు మొహమాట పడుతుంటే, ఒక వంద రూపాయల నోటు ఇస్తే వాళ్ళు నిరాకరించారు. నేను వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు చెప్పిన విషయం విని నా మతి పోయింది.
*వాళ్ళు 2200 కిలోమీటర్ల దూరాన్ని మూడు నెలల్లో కాలినడకన పూర్తి చేసి ''ద్వారక''కు తిరుగు ప్రయాణం చేస్తున్నారట.* ఇల్లు చేరడానికి మరొక నెల పడుతుందట.
అలా ఎందుకు నడవడం అని నేనడిగిన ప్రశ్నకు ఆయన,
నా చిన్నప్పుడు నా రెండు కళ్ళలోని చూపు పోతే, మా అమ్మ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. కానీ, అక్కడి డాక్టర్లు, ప్రపంచంలోని ఏ గొప్ప డాక్టరు కూడా కళ్ళు తెప్పించలేడని చెప్పారట. అయినా, వాళ్ళమ్మ పట్టుబట్టి ఆపరేషన్ చేయమని, ఫలితం భగవంతునికి వదిలేద్దామని చెప్పిందట. అంతేగాక, తన కొడుకుకు కంటి చూపు వస్తే, కొడుకుని కాలి నడకన పండరిపూర్, తిరుపతికి యాత్రకు పంపిస్తానని మొక్కుకున్నదట. అతనికి చూపు వచ్చిందట.
అందుకని ఆ కొడుకు కాలి నడకన, అమ్మ కోరిక ప్రకారం యాత్ర పూర్తి చేసి, తిరుగు ప్రయాణంలో ద్వారకకు బయల్దేరారట.
కానీ, మరి ఆ స్త్రీ ఎందుకు ప్రయాణం చేస్తుందనే ఆసక్తితో అడిగితే, ఆమె,
'నా భర్త ఒంటరిగా అంత దూరం కాలినడకన వెళ్ళడం ఇష్టం లేకా, దారిలో ఆయనకు అన్నపానీయాలు అమరుస్తూ, ప్రయాణంలో ముచ్చటించుకుంటూ సరదాగా గడపవచ్చని నడుస్తున్నానని' చెప్పింది.
వాళ్ళిద్దరూ చక్కటి హిందీ, ఇంగ్లీషుల్లో మాట్లాడడం చూసి వారి చదువు గురించి ప్రశ్నించిన నాకు వారు చెప్పిన సమాధానం విని మతిపోయింది.
ఆ మగ వ్యక్తి *ఆస్ట్రో_ఫిజిక్స్* లో *పి.హెచ్.డి* చేసి లండన్ లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఏడేళ్ళు *సీ_రంగరాజన్*, *కల్పనా_చావ్లాతో* కలిసి పనిచేసాడట....
అతని భార్య లండనులోని ఒక విశ్వవిద్యాలయం నుండి *హ్యూమన్_సైకాలజీలో_ పీ హెచ్ డి* చేసిందని చెప్పేసరికి నాకు మూర్ఛ వచ్చినంత పనైంది. వాళ్ళ ముఖాల్లో అంత చదువుకున్నామనే, అంత గొప్పవారమనే ఛాయలు కనిపించడమే లేదు.
వాళ్ళు చెప్పిన మరొక విషయం కూడా నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. వాళ్ళకు వచ్చే పెన్షన్ మొత్తం అంధులకు సహాయం చేసే, ఒక ట్రస్టుకు విరాళంగా ఇస్తున్నారట.
*అతని పేరు డాక్టర్ దేవ్ ఉపాధ్యాయ.*
*ఆమె పేరు డాక్టర్ సరోజ్ ఉపాధ్యాయ.*
తల్లి మొక్కును ఇప్పటికైనా తీర్చిన వాళ్ళిద్దరూ ద్వారకకు చేరారని ఆశిద్దాం
ఇది కదా మనదేశపు ఔన్నత్యం
--9900--
95.. మంచి msg ఒక 2 నిమిషాలు
మంచి msg ఒక 2 నిమిషాలు కేటాయించి చదవండి.....
ఇది ఒక వాస్తవంగా జరిగిన కథ....దయచేసి చదవగలరు......
" అక్కా! నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చేసే పని ఆపి వచ్చి ఇలా కూర్చో." చిన్నకోడలు , పెద్దకోడలితో అంది.
" ఏమైంది? అలా దిగులుగా ఉన్నావు.విషయమేంటి? " అని అడిగింది
పెద్దకోడలు. " ఏమీ లేదు. గుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి 5 సంవత్సరాలు అయింది.
కదా! మామయ్యను అత్తగారే చూసుకునేవారు. ఇప్పుడు మనమే అన్నీ చేస్తున్నాము కదా! మనకు పిల్లలు , సంసారం ఉన్నాయి. మామగారిని ఎన్ని రోజులని చూడగలం.అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను>" అంది చిన్నకోడలు.
" ఏంటది? " అని అడిగింది పెద్దకోడలు.
" మనమిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో చేర్పిద్దాం. అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ వయస్సులో ప్రశాంతంగ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇళ్ళల్లో చెరొక ఇంట్లో మనం మన పిల్లలతో హయిగా ఉండవచ్చు." అంది చిన్నకోడలు.
" దీనికి మన భర్తలు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకంలేదు." అంది పెద్దకోడలు.
" మనం ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ప్రయత్నిద్దాం>" అంది చిన్నకోడలు.
ఇద్దరూ విషయాన్ని తమ భర్తలతో చెప్పారు. వారు తండ్రిని ఆశ్రమంలో చేర్చడానికి ఒప్పుకోలేదు. తల్లి లేకపోయినా తండ్రిని తమ వద్దే ఉంచుకుని చూసుకోవలని వారి ఉద్దేశ్యం. కానీ రోజూ భార్యల నస భరించలేక ఇద్దరు కొడుకులు తండ్రితో ఇలా చెప్పారు.
" నాన్నా! ఈ పిల్లలగొడవతో మీకు సమయానికి ఏవీ అందించలేకపోతున్నాం. మీకు కూడా వయస్సు అయింది. అమ్మ ఉన్నప్పుడు అన్నీ దగ్గరుండి చూసుకునేది. దగ్గరిలోనే మంచి ఆశ్రమం ఉంది. మిమ్మల్ని అక్కడ చేరుద్దామని అనుకుంటున్నాము. మీరేమంటారు? "
" నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎన్నిరోజులని మీరు నన్ను చూసుకుంటారు. మంచి విషయం చెప్పారు. పెట్టే, బేడా సర్ధుకుని బయలు దేరండి ఇద్దరూ!? అన్నారు తండ్రి.
షాక్ కొట్టినంత పనైంది కొడుకులకు నాన్నఅలా అనేసరికి. " అదేంటి నాన్నా ! అలా అనేశారు. మేము వెళ్ళడం ఏంటి? బయట బాడుగలు పెట్టి మేము వేరు కాపురాలు ఎలా వెలగబెట్టాలి. ఆస్తిని మాకే కదా ఇవ్వాలి. ఆలోచించండి ఒకసారి." " నిజమే! మీకే ఇవ్వాలి నా ఆస్తిని. కానీ మీ అమ్మ నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఇది. ఆమె బ్రతికి ఉన్నన్నాళ్ళూ చాలా సంతోషంగా ఉన్నాం. ఆమెను తలచుకుంటు నేను ఈ ఇంట్లోనే కన్నుమూయాలి. నా తదనంతరం ఈ ఇల్లు మీకే! పైన ఇంటి బాడుగతో,నాకు వచ్చే
pention తో ఎలాగోలా బ్రతికేస్తాను. బయలుదేరండి త్వరగా" అన్నారు తండ్రి. " అదేంటి మామగారూ! వూర్లో్ జనాలు ఏమనుకుంటారు? బయటికివెళ్ళి అరకొర జీతాలతో ఎలా బ్రతకాలి. ఆలోచించండి" అన్నారు కోడళ్ళు. ఊర్లో జనాలు ఎప్పుడూ మనకు వ్యతిరేకంగానే మాట్లాడుకుంటారు. ఇది నా ఇల్లు. నా భార్య నాతో ప్రేమగా జీవించిన ఇల్లు. నేను పోయేదాకా ఇది నా సొంతం. నా గురించి ఆలోచించని మీరు జనాల గురించి
ఆలోచిస్తున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఈ ఆలోచన మీదేనని నాకు తెలుసు. మరోదారిలేదు. మీరు ఇక్కడినుండి వేరే కాపురానికి వెళ్ళడమే మంచిది. బయలుదేరండి." అంటూ తండ్రి చెప్పులు వేసుకుని గుడికి బయలుదేరి వెళ్ళిపో్యారు.
షాక్ తో తల దిమ్మెక్కింది ఆ కొడుకులకూ......కోడళ్ళకు.....
తల్లిదండ్రులను భారంగా అనుకోవద్దు. వారు మిమ్మల్ని బాధపెట్టకుండా ఆశ్రమాలకు వెళ్ళిపోతు్న్నా రు. వారు ఇలా తి్రగబడితే తప్ప గౌరవంగా బ్రతకలేరు. ఏమీ లేనివారి పరిస్థితి సరే! ఆధారం ఉన్న తల్లిదండ్రులను, ఆస్తిపాస్తి ఉన్న తల్లిదండ్రులు కూడా అనాధ శరణాలల్లో ఉంటున్నారు. వారు తప్పక తెలుసుకోవలసిన విషయం ఇది.
తల్లిదండ్రులను బిడ్డల్లా కాపాడండి. చివరి దశలో వారిని చిత్రవధ చేయకండి. వారికంటే మించిన దేవుళ్ళు లేరని తెలుసుకోండి. .......ఓపిగ్గా చదివిన మీకు ధన్యవాదములు......
--(())--
96.. పటిక బెల్లం లో మూడవవంతు
అరుణాచల ఆలయంలో యదార్థo
ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.
ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.
అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.
రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు.
ఇద్దరు అరుణాచలుని కి ఎదురుగా నిలబడి మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ ) అన్నారు.
ఇలా ప్రతీ రోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం మాయమవుతోంది.
ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారి కి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని, అరేయ్ పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయం లో 108 ప్రదక్షిణలు చేయండి అని, ఇదేమీ శిక్ష అన్నాడు.
పిల్లలు ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు, ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా తృల్లి పడ్డారు, పరిశీలించి పిల్లల్ని మళ్ళొకసారి చూసారు, ఆ ఇద్దరి పిల్లతో పాటు, మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూసారు, మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని గట్టిగా వాటేసుకున్నాడు.
అద్భుతం!!
అరుణాచలశివ రహస్యాలు - చాగంటి వారి అద్భుత ప్రవచనం
మూడవ పిల్లవాడు కాంతిరేఖ గా మారి, గార్బాలయం లోకి వెళ్లి మాయమై పోయాడు.
అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా, అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట.
ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ " అసలేం జరిగింది " అని అడిగాడు. పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురుంచి చెప్పారు. అది విని వారు ఆశ్చర్యం, ఆనందం లో మునిగిపోయారు.
సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట. ఆలయం లో సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం ఎం కావాలి ??.
నిష్కల్మష ప్రేమకు, నిర్మల భక్తి కి అరుణాచళేశ్వరుడు ఎపుడూ బందియే !! అరుణా చలుడు కాంతి రూపం లో ఉంటాడని, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో మరియు కొడపైన అరుణాచలుడు కాంతి రూపం లో, కాంతి స్తంభం ( bheem of light ) రూపం లో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు అనేకం .
మరిన్ని మంచి ఆధ్యాత్మిక విషయాలకు
((---))
97. విధి
ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది.
ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు.
ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి..!
" మీరేంచేస్తారో నాకు తెలియదు నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను" అని కన్నీరుపెట్టుకుంది..!
దానికి ఇంద్రుడు...
"దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మ కదా..! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను.నువ్వేం దిగులు పడకు..!" అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు.
ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ..!
"నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను. దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు..! కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద.!" అంటూ బయలుదేరారు.
వీరిరాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు.
"నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే..! కానీ..! చిలుక ప్రాణం చివరి దశలో ఉంది..! మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం..! మనం ముగ్గురం శివుని ప్రార్థిస్తాం పదండి..! " అన్నారు.
ముగ్గురూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు.
" ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను..! మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! " అంటూ అందరూ బయలుదేరారు.
ఇంద్ర,బ్రహ్మ,విష్ణువు,శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాదారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు.
"అయ్యో..! అదేమి పెద్ద పనికాదు. మాములుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను,వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. ఏ ఆకు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకకు కాపాడుదాం..! " అని అన్నాడు .
యముడు , అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది.ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం వ్రాసి ఉంది ఇలా..!
"ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది..! "అని వ్రాసి ఉంది.
ఇదే విధి..! విధిని ఎవ్వరూ మార్చలేరు. జీవించి ఉన్నప్పుడే ఇతరులమీద ప్రేమను చూపండి. ద్వేషించకండి. మన సహాయాన్ని ఇతరులకు అందివ్వడం నేర్చుకుందాం*..!
--(())--
సేకరణ. ప్రాంజలి ప్రభ
98. మూడు జల్లెడ్ల పరీక్ష
(ఇప్పటితరానికీ ఉపయోగపడే కధ.)
ఒక సారి ఉత్తమ బ్రాహ్మణుడైన చాణిక్యునిదగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను” అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను “మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)” అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.
మొదటి జల్లెడ “నిజం” – “నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?” అని అడిగాడు.
అందుకు ఆ స్నేహితుడు “లేదు, ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు.
“అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట” అని చాణిక్యుడు అన్నాడు.
సరే రెండో జల్లెడ “మంచి ” – ” నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?” అని అడిగాడు చాణిక్యుడు,
“కాదు” అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .
“అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా మంచి విషయం కాదు అని తెలుసు,, సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం”అన్నాడు చాణిక్యుడు.
మూడో జల్లెడ “ఉపయోగం” – “నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? ” అని చాణిక్యుడు అడిగాడు.
“లేదు” అన్నాడు ఆ మిత్రుడు.
“అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?” అని అన్నాడు చాణిక్యుడు
నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.
స్నేహానికి విలువ తెలిసిన వారికి మాత్రమే ఈ కథ!!👍👌
--(())--
99.“మీ కంటే ధనవంతుడు
“మీ కంటే ధనవంతుడు ఉన్నాడా?” బిల్ గేట్స్ ని ఎవరో అడిగారు.
“ఒకవ్యక్తి ఉన్నాడు” అని సమాధానమిచ్చి - ఇలా చెప్పాడు.
నేను డబ్బు, పేరు సంపాదించక ముందు ఒకరోజులలో ఒక నాడు న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్ లో దిగాను. దినపత్రిక కొందామని చేతిలోకి తీసుకుని సరైన చిల్లర నావద్ద లేకపోవడం వలన తిరిగి పేపర్ ను అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను.
“పర్లేదు...మీవద్ద చిల్లర లేకపోయినా, ఈ పేపర్ తీసుకోండి” బలవంతంగా నాచేతిలో పెట్టాడు. నేను తీసుకోక తప్పలేదు.
మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్ పోర్ట్ లో అదే పేపర్ కుర్రాడి వద్ద మళ్ళీ దిన పత్రిక కొనాలని ప్రయత్నిస్తే నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది.
ఆ కుర్రాడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ “ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందు వలన నేనేమీ నష్టం పోను, ఆ ఖరీదును నా లాభం లోంచి మినహాయించుకుంటాను” అన్నాడు.
ఆ తర్వాత పందొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు, పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రాడి కోసం వెదికాను. నెలన్నర తర్వాత అతడు దొరికాడు.
“నేనెవరో తెలుసా, నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి” అడిగాను.
“మీరు తెలుసు...బిల్ గేట్స్.... ఒకసారి కాదు రెండు సార్లు ఇచ్చాను”
“ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు, నీకు ఏమి కావాలో అడుగు, నీ జీవితంలో పొందాలను కున్నది ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను “
“సర్... మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది? అతడు ప్రశ్నించాడు.
“ఎందుకు సరితూగదు?” నేను ఆశ్చర్య పోయాను.
“నేను పేదరికంతో బాధ పడుతూ, దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేసాను. ఈ రోజు మీరు ప్రపంచం లోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు... ఎలా సరితూగుతుంది?”
అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. అతడు ఇతరులకు సహాయం చెయ్యాలంటే తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు. అవును... నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు.
అప్పుడు నాకు అనిపించింది- కుప్పలు కుప్పలు డబ్బు ఉండే కంటే...ఇతరులకు సహాయ పడాలనే హృదయం కలిగి ఉండటమే నిజమైన ఐశ్వర్యం.
ఇతరులకు సహాయ పడటానికి కావలసింది అదే...@@
--(())--
100. పూర్వం ఒక ఊరిలో
పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు. అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. "ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది. 'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు.
లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.
అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది'
ఇదేనా ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.
ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు.
ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు.
ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.
గుమాస్తా చదవడం ప్రారంభించాడు.
1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!
2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా.
3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?
అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయారు.
సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు.
ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.
1వ వాడు: అన్నదాతా సుఖీభవ!
2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.
3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.
దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.
--(())--
హిందూ మతం ('సనాతన ధర్మం' గా కూడా వ్యవహరిస్తారు) ప్రపంచములో వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక పురాతన మతం. ఈ పురాతన మతం తాలుకా ఆనవాళ్ళు లభ్యమైన g శాసనాలు, దేవాలయాలు, ధ్వజస్తంభాలు, విగ్రహాలు మొదలగునవి కార్బన్ డేటింగు ఆధారంగా వాటి కాలాల బట్టి ఎంత పురాతనమైనదని ఒక అంచనా వేయవచ్చు... ‘భరతవర్ష' భారతదేశంలోని ప్రధానంగా ఉండే ఈ మతం సనాతన, వైధిక మతంగానూ తరువాత హిందూ మతం గా గుర్తింపు పొందింది.
1.) మహాభారతం 5,120 సంవత్సరాలు.
2.) రామాయణం మహాభారతం కన్నా పురాతనమైనది లక్షల సంవత్సరాల క్రితం.
3.) సింహాచలం 8,000 సంవత్సరాలు , తిరుమల.
4.) తిరుపతి 6,000 సంవత్సరాలు.
5.) శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల ససంవత్సరాలు).
6.) శ్రీశైలం ఆలయ ధ్వజస్తంభం వయస్సు 3,000 సంవత్సరాలు.
7.)6000 సంవత్సరాల పూర్వం చెక్కిన #రామ,#హనుమ చిత్రాలు, ఇరాన్.
8.)3000 సవత్సరాల పూర్వం #మన్సేశ్వర శివాలయం,పాకిస్థాన్.
9.)400 సంవత్సరాలకు కింద నిర్మించిన #శివాలయం,ఇండోనేషియా.
10.)600 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన #హింగ్లాజ్ మాత దేవాలయం పాకిస్థాన్.
11.)700 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన ఇండోనేషియా లోని వాల్కనో కొండమీద నిర్మించిన #గణేష్ విగ్రహము.
12.)800 సంవత్సరాల #విష్ణుదేవాలయం, కాంబోడియా.
13.)800 సంవత్సరాలకి పూర్వం నిర్మించిన #డాకేశ్వరీ మాత దేవాలయం, బంగ్లాదేశ్.
14.)1000 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన #శివాలతేజ దేవాలయం, పాకిస్థాన్.
15.)1100 సంవత్సరాల పూర్వం నిర్మించిన #నల్లూర్ కండస్వామి దేవాలయం, శ్రీలంక.
16.)1200 సవత్సరాల పూర్వం నిర్మించిన #ప్రంబనన్ దేవాలయం, ఇండోనేషియా.
17.)1500 సంవత్సరాల క్రితం నిర్మించిన #పశుపతినాథ్ దేవాలయం, నేపాల్.
18.) రామసేతు 18,400 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు (Ram Setu 18,400 years old: Study.)
19.) భూమర ఆలయం భారతదేశంలోని మధ్య ప్రదేశ్ లో సత్నా ప్రదేశంలో ఉంది. ఇది 6 వ శతాబ్దపు గుప్త శకం హిందూ రాతి ఆలయం. ఉన్నాయి. క్రీస్తు పూర్వం 484 నాటి ఒక శాసనం లభ్యమైనది. 2,484 సంవత్సరాలు క్రితం.
20.) ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న గుడిమల్లం గ్రామంలోని శివుడు దేవాలయంలోని శివలింగం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్ద కాలం నాటిదని పురావస్తు శాఖ గుర్తించింది, 2,100 సంవత్సరాల క్రితం.
21.) మొట్టమొదటిగా ఖారవేలుడి (క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం) శాసనంలో ‘భరతవర్ష’ అనే ప్రస్తావన కనిపిస్తుంది. భరతవర్ష అనే పదం అంతకన్నా పురాతనమైనది... ‘భరతవర్ష’ ఎక్కువగా పురాణాల్లో కనిపిస్తుంది. 2,100 సంవత్సరాలు క్రితం.
22.) రాజస్థాన్, పుష్కర్ లోని దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వం నిర్మించిన బ్రహ్మ దేవాలయం. 2,000 సంవత్సరాలు క్రితం.
23.) ఏక లింగ దేవాలయం, ఉదయ్ పూర్ కు 22 కిలోమీటర్ల దూరంలోని కైలాస్ పూర్లోనే ఏక లింగ శివుడు దేవాలయం ఉంది. అత్యంత ప్రాచీనమై ఈ దేవాలయాన్ని క్రీస్తు పూర్వం 734 లో బాపా ఏవాల్ నిర్మించినట్లు చెబుతారు. 2,734 సంవత్సరాలు క్రితం.
24.) చిత్తూరు జిల్లాలో 2,200 యేళ్ళ నాటి పురాతన ఆలయం! క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాల కాలం నాటి గుడిమల్లం ఆలయం.
25.) క్రీస్తు పూర్వం 3,000-1,500 సంవత్సరాలు క్రితం నాటి సింధునాగరికత కాలం. 5,000 సంవత్సరాలు నుంచి 3,500 సంవత్సరాలు క్రితం.
26.) బుద్ధుడి జననం క్రీస్తు పూర్వం 576 సంవత్సరాలు క్రితం. 2,576 సంవత్సరాలు క్రితం.
27.) క్రీస్తు పూర్వం 327-326 భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. అంటే 2,327 సంవత్సరాలు క్రితం.
28.) 273 - 232 అశోకుడి పాలన. అంటే 2,273 నుంచి 2,232 సంవత్సరాలు క్రితం.
బుద్ధుడు మరియు అశోకుని మధ్య గడిచిపోయిన కాలం 300 సంవత్సరాలు.
29.) క్రీస్తు పూర్వం 58-విక్రమ శకం ప్రారంభం. అంటే 2,058 సంవత్సరాలు క్రితం.
30.) క్రీస్తు శకం 380-విక్రమాధిత్యుడి పట్టాభిషేకం.
అంటే సుమారు 1,640 సంవత్సరాలు క్రితం.
31, ఈ #ఎనిమిది_శివాలయాలు
వెయ్యి సంవత్సరాల కన్నా ఎక్కువ పురాతనమైనవి, ఇవి ఒకదానికొకటి #500నుండి_600_కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.అయితే,
వారి రేఖాంశ రేఖ ఒకటే.
పరమపవిత్రమైన మూడు స్థలాలలో మనం రెంటిని చూడగలం,ఒకటి ఎల్లోరా, రెండవది ఆంగ్కోర్ వాటి కానీ ఒక్కటి మాత్రం కష్టసాధ్యం. అదే #మక్కా.
సరళమైన భాషలో చెప్పాలంటే అన్ని దేవాలయాలు సరళ రేఖలో వ్యవస్థాపించబడ్డాయి.
ప్రాచీన హిందూ ఋషులకు భౌగోళిక అక్షాన్ని కొలిచే మరియు ఈ ఏడు శివాలయాలన్నింటినీ సరళ రేఖలో నిర్మించిన సాంకేతికత ఉందా?
కొలత వ్యవస్థ లేకుండా ఈ దేవాలయాలను సరళ రేఖలో చేయడం సాధ్యం కానందున ఇది జరగవచ్చు,
ముఖ్యంగా అవి ఒకదానికొకటి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు.
ఈ దేవాలయాలన్నీ భౌగోళికంగా
79 ° E, 41 ’, 54” రేఖాంశ రేఖలో ఉన్నాయి.
ఏ శివాలయాలు ఉన్నాయో తెలుసుకోండి ...
1)#కేదార్‌నాథ్ ఆలయం - #ఉత్తరాఖండ్ - (30.7352 ° N, 79.096)
2)#కాలేశ్వరం -#కాలేశ్వర ముక్తేశ్వర్ స్వామి ఆలయం - #తెలంగాణ - (18.799 ° N, 79.90)
3)#శ్రీ_కాళహస్తి - శ్రీ #కాళహస్తేశ్వర ఆలయం - #ఆంధ్రప్రదేశ్ - (13.789 ° N, 79.79)
4)#కాంచీపురం - #ఏకాంబరేశ్వర్ ఆలయం - తమిళనాడు - (12.94 ° N, 79.69)
5) #తిరువనైకవల్ - #జంబుకేశ్వర్ ఆలయం - తమిళనాడు - (10.853 ° N, 79.70)
6) #తిరువన్నమలై - #అన్నామలైయార్ ఆలయం తమిళనాడు - (12.231 ° ఎన్, 79.06)
7) #చిదంబరం - #తిల్లై_నటరాజ్ ఆలయం - తమిళనాడు - (11.39 ° N, 79.69)
8)#రామేశ్వరం - #రామనాథస్వామి ఆలయం - తమిళనాడు - (9.2881 ° ఎన్, 79.317)
అన్ని పెద్ద దేవాలయాలు లేదా మఠాలు తమలో తాము ఒక రకమైన గ్రిడ్ పనిలో ఉన్నాయి.
చిత్రంలో ఉన్న ఆలయం కూడా ఒక ప్రత్యేక స్థానంలో ఉంది.
(హరిహరేశ్వర్ మహాత్మ్య అనే వేద పుస్తకం, దీనిలో హరి అంటే 'విష్ణు' మరియు "హరా" అంటే "శివ" అని అర్ధం, వాటి ప్రాముఖ్యత వివరించబడింది, అదే పుస్తకంలో మక్కా హిందూ చరిత్రను వివరిస్తుంది ...
అంటే, విష్ణువు యొక్క మూడు దశలలో ఒకటి "#గయా" నగరంలో, రెండవది #మక్కా(శివాలయం అని కూడా చెప్తారు) నగరంలో మరియు
మూడవది #శుక్ల_తీర్థ సమీపంలో ఉంది. ఆ మూడవ పోస్ట్ యొక్క స్థానాన్ని కనుగొనడం అవసరం. ఆ స్థలం యొక్క జ్ఞాపకశక్తి చరిత్ర యొక్క గందరగోళంలో నాశనం అవుతుంది.
క్రెడిట్: భారత్ దుబే జీ
భవాని పరశురామ్
32, #కైలాస_పర్వతం
ఇది మానవ నిర్మితమని రష్యా శాస్త్రవేత్తల బృందం నమ్మకం.ఈ సంబంధం గురించి #హిందూ_గ్రంధాలు ఏమి చెబుతున్నాయి ??
రష్యన్ శాస్త్రవేత్తల పరిశోధనా బృందం #కైలాస_పర్వతం
ఒక ఖచ్చితమైన కొలతపై నిర్మించిన విధానం,ల్ అని ఇది సహజ పర్వతం కాదు అని,
ఇది మానవ నిర్మిత పిరమిడ్ అని పేర్కొంది.
ఈజిప్ట్ యొక్క పిరమిడ్ 10,000 సంవత్సరాల వయస్సు మాత్రమే, కానీ కైలాస పర్వతం
#మిలియన్ల_సంవత్సరాల_వయస్సు .....
ఇది ఎంత పురాతనమైనప్పటికీ,
సహజమైన లేదా యాదృచ్ఛికమైనప్పటికీ,
దీనిని మంచి ఇంజనీర్ నిర్మించారు అని చెప్పారు
రెఫ్ ఇచ్చాను చూడగలరు ....
దీనికి అనుకూలంగా, రష్యా శాస్త్రవేత్తలు కైలాస పర్వతం పై 4 అక్షరాలు రాశారని, మనుషులు లేకుండా ఎలా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నిజానికి --- మనము కూడా ఆ ఫోటోలను చూశాము, మరియు ఆశ్చర్యపోయాము,
కైలాస పర్వతం హిందూ చిహ్నంగా మిగిలిపోయింది ...
కైలాస పర్వతం ఎలా ఏర్పడిందో ఇప్పుడు పురాణాల నుండి మనకు తెలుసుకోండి.
మన పురాణాలలో, మేము ఈ విషయం యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాము, అప్పుడు మాకు తెలిసింది,భూలోకం లోని కైలాస పర్వతం శివుడి ఆదేశానుసారం శివుడి కోసం స్వయంగా ఏర్పడిన ఊహకు అందని భారీ లోకం.
ఇది,దీని గొప్పతనం గురించి ఏమని చెప్పాలి? ఇంద్రుడి అమరావతి కూడా దాని ముందు గ్రామీణ ప్రాంతంగా అనిపించింది.
విశ్వకర్మ భగవంతుడు కైలాస పర్వతానికి వెళ్లి సకల నిర్మాణలు చేసి ఉండవచ్చు
విశ్వకర్ముడు నటించాడు,
కుబేరుడు సహకరించాడు.
దీని అర్థం స్పష్టంగా ఉంది, కైలాస పర్వతం #స్వచ్ఛమైన_బంగారంతో నిర్మించబడింది. #సూర్యకిరణాలు_పడిన_వెంటనే కైలాస పర్వతం లోపల #బంగారం_ప్రకాశిస్తుంది.
శివుపురానికి స్పష్టమైన వర్ణన ఉంది,
శివునికి దేవతల గొప్ప ఇంజనీర్ కుబేరుడు,
ఈ సంఘటన 300 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది....
సేకరించిన పోస్ట్..
మనవి
గౌరవనీయులైన తెలుగు రాష్ట్రాల ప్రజలు, భారతదేశం మరియు ప్రపంచము తెలుగు భాష ను అదఃరించే ప్రతిఒక్కరిని పేరుపేరునా కృతజ్ఞతలు, నమస్కారములు, ఎందరో మహానుభావులు అందరికి వందనములు నేను అనగా "మల్లాప్రగడ రామకృష్ణ" విశ్రాంతి యకౌంట్స్ ఆఫీసర్ గా (స్కూల్ ఎడ్యు కేషన్ డిపార్ట్మెంట్) పనిచేసి 30 -06 -2019 పదవి విరమణచేసితిని, ముఖ్యముగా నాభార్య శ్రీదేవి సహకారంతో " ప్రాంజలి ప్రభ " ఆన్లైన్ ల్లో 12 బ్యాగుల సహాయంతో, 2012 నవంబర్ ౦౩ నుండి తెలుగును బతికించాలని ఉద్దేశ్యంతో సొంతగా వ్రాయాలని ప్రారంభించాను అప్పటి నుండి ఇప్పటివరకు 50 జి పి గూగుల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా సేకరించటం,(ఆయా సంస్తలలో పనిచేయు వారికీ శుభాకాంక్షలు) మరియు నా సొంత రచనలు ఎప్పటికప్పుడు అందరికి అందిస్తూ వచ్చాను, ఇది ఎవరిని ఉద్దేశించి వ్రాసిన కధలు కావు, నాకు నచ్చి సేకరించిన కధలు ఎవరు వ్రాసారో నాకు తెలియదు వారందరికి నా నమస్కారములు
2012 వ్రాసినవి నాకు నచ్చినవి ఒక క్రమంలో ఉంచుతున్నను. (మాతాతగారు నిజాం ఆస్థానంలో పండితుడు జోశ్యులుగా ఉన్నారు మానాన్న, పెదనాన్నలు అందరూ పండితులే) వారి జ్ఞాపకార్ధం నేను తెలుగులో వ్రాస్తున్నాను) తప్పులుంటే క్షమించగలరు.
ఐ విధేయుడు ... ప్రాంజలి ప్రభ ... మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ , ౯౮౪౯౧౬౪౨౫౦
No comments:
Post a Comment