Tuesday, 29 May 2018

ప్రాంజలి ప్రభ (1-06-2018)



వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము 

7. ఆత్మదర్శనము 
ఆధ్యాత్మిక శాస్త్రమును విచార పూర్వకముగ గ్రహించి ఆత్మతత్వమును సాక్షాత్కరింప జేసుకొనిన, మానస వ్యాధులు దహింపబడగలవు. జ్ఞాని ప్రశ్నించువాని అర్హతను బట్టి బోధించవలెను. అలానే ప్రశ్నించువాడు తగిన జ్ఞానినే ప్రశ్నించవలెను. మొదట చంచలమగు ఈ మనస్సును శుద్ధమొనర్చుకొనవలెను. అందులకు నిరంతరము సాధువుల సంగమ మొనర్చవలెను. 1) శమము 2) విచారము 3) సంతోషము 4) సాధుసంగమము. ఈ నాలుగు మోక్ష ద్వారమునకు ద్వారపాలకులు వాటిలో ఏ ఒక్కటైననూ వశపర్చుకొనిన, మిగిలినవి కూడ క్రమముగ లోబడును. శాస్త్రము, జ్ఞానము, తపస్సు, శ్రుతి వలననే యోగ్యత లభించును. మనస్సును రజస్తమోగుణ రహితమొనర్చి సత్వ గుణము సంపాదించుకొనవలెను. సంసార సాగరమును తప్పించుకొననిచో, నరకములో అనేక క్లేశముల ననుభవించవలసి వచ్చును. కత్తితో నరకబడుట, కొండ నుండి త్రోయబడుట, రాళ్ళతో మోదబడుట,నిప్పుచే కాల్చబడుట, అవయవములు కత్తిరించబడుట, ముళ్ళలో త్రోయబడుట, తల నరుకబడుట మొదలగు అనేక కష్టముల ననుభవించవలెను. అందువలన శాస్త్రవిచారము ద్వారా, జ్ఞానము ద్వారా నరకము నుండి తప్పించుకొనవలెను. అట్టివారు శోకింపరు. దేనిని కోరరు. శుభాశుభముల నర్ధింపరు. శాస్త్ర సమ్మతమైనవే కాని, శాస్త్ర విరుద్ధ కర్మలనొనర్చరు. పవిత్రతతో వసించి సన్మార్గ వర్తనులై జీవించెదరు. సుఖములననుభవింతురు. వీరు మాయను జయించినవారు. ఆత్మదర్శనమే వీరికి అట్టి స్థితిని కల్పించినది. అభ్యాసము వలన అనుభవము పొంది, శాస్త్రానుశీలముగా, దానిని ఉపాసించుచు జ్ఞానమును పొందిన వాడే, ఆత్మదర్శనము పొందగలడు. సంసార బంధములు తెగాలంటే గురువు, శాస్త్రము అను ప్రమాణముల ద్వారా ఆత్మ స్వరూపము నెఱగి, మహర్షులవలె జీవన్ముక్తులు కాగలరు. అనంతరము క్లేశహీనమగు మోక్షమును పొందుట కొరకే వివేకి ప్రయత్నింప వలెను. ముల్లోకములందు మోక్షము కంటే సుఖము వేరొకటి లేదు, ఇంద్రియ సుఖములు, స్వర్గసుఖములు వీనికి సరిపోవు. అందుకు ధనము బంధుమిత్రులు, తీర్ధయాత్రలు, 
ఉపవాసములు, ఏ మాత్రము తోడ్పడజాలవు. శాంతి సంతోషము ద్వారా, మనోజయము ద్వారా ఆనందమును పొందవలెను. ముక్తినందిన వాని మనస్సు నిర్మలము, యత్నశూన్యము వాంఛాశూన్యము అయిన; వాడు ఎద్దానిని కోరడు, పరిత్యజించడు, కర్మల యొక్క ఫలమును పొందడు. 
శమము ద్వారా శత్రువులు కూడ మిత్రులగుదురు. శమము వలన లభించు సుఖము, ఇంద్ర పదవియందు కాని, విష్ణు పదవియందు కాని లభించదు. శ్రమశాలియగు పురుషుని పిశాచములు, రాక్షసులు, దెయ్యాలు, విరోధులు, పాములు, పులులు గూడ ద్వేషింపవు. అలాగే విచారము వలన సంసారమను భూతము, మనోమోహము వలన కల్పింపబడినదని, దుఃఖమును కల్గించునవని తెలియుచున్నది. ఆత్మదర్శనము పొందిన యోగులు, జీవన్ముక్తులై సంచరించుచూ చాలా కాలము జీవించి పిదప ఉపాధి లేశమును కూడ పరిత్యజించి విదేహ ముక్తిని పొందుదురు. విచారము నుండి తత్వజ్ఞానమును, అందుండి ఆత్మ విశ్రాంతియు, తద్వారా మనశ్యాంతి లభించి దుఃఖము నశించును. మిగిలినది సంతోషమే. సంతోషము వలన మనోవ్యాధులు, శారీరక వ్యాధులు కలుగవు. ఇట్టి వారు నిరుపేదయైనను సామ్రాజ్య సుఖమనుభవించును. 
సాధుసంగమము కూడ నరులకు సంసార సాగరమును దాటుటకు తోడ్పడును. సాధు సంగమము వలన బుద్ధి వర్ధిల్లును. అజ్ఞానమను చెట్టు ఛేధించబడును. మనో వ్యాధులు నశించును. ఈ విధముగా సంతోషము, సాధుసంగమము, విచారము, శమము, ఇవియే నరులకు సంసార సముద్రమును దాటుటకు ఉపాయములు. ఈ నాల్గింటిలో ఏ ఒక్కటైన అభ్యసించిన మిగిలినవన్నియు లభించినట్లే భావించాలి. ప్రతి వ్యక్తికి వివేక అభ్యాస మొక్కటియే అవసరము. అభ్యాస రహితమైన ఏ విద్యయు ఫలము నొసంగజాలదు. 
శాస్త్రము పఠించిన వాని మనస్సు బుద్ధి రత్న దీపశిఖవలె ప్రకాశించి, మోహమును, అజ్ఞానమును బాపి బ్రాహ్మ పదార్ధమును తదితరమును చక్కగ తోపింపజేయును. కవచ ధారిని బాణములు కొట్టజాలనట్లు, దైన్య దారిద్య్ర దోషములలో నిండిన సంసార సృష్టి, ఈ శాస్త్రవేత్తను ఛేదింపజాలవు. జన్మ ముందా? కర్మ ముందా? దైవం ముందా? లేక పురుషాకారము ముందా? విత్తు ముందా? చెట్టు ముందా? మొదలగు సంశయములు పగటి యందు రాత్రివలె, తత్వజ్ఞుని ముందు దూరమగును. ఈ గ్రంథమును విని మనన పూర్వకముగ అర్ధము గ్రహించగల్గిన, మోక్ష విషయమున ధ్యాన జపాదులు వుపయోగబడవు. సంసారతాప శాంతి నొసగు జ్ఞానమును, పొందగోరు వారు, ఈ శాస్త్రముతో పాటు, సుఖాసనము, లభ్యభోగము, సదాచారములు సత్సంగము, ఇతర శాస్త్రములైన ఉపనిష్పత్తులు, మోక్ష ధర్మము మొదలగునవి పఠించుట వలన, గొప్ప జ్ఞానము లభించి పునర్జన్మ తొలగును. మరల యోని యంత్రమునబడ నక్కరలేదు. కాంచిన విషయము సాదృశ్యము వలన, కాంచనట్టి విషయమును గ్రహించి తోడ్పడును. ఒక్క పరబ్రహ్మమునకుతప్ప, తక్కిన ఉపమానోపమేయ పదార్ధములన్నింటి యందు కార్యాకారణ భావమున్నది. అలాగే బ్రహ్మ బోదనిమిత్తముగ్రహింపబడుఉపమానములన్నియు, స్వప్నమున గాంచు వస్తువులవలెమిథ్యయగు జగత్తునకు చెందినవే అని గ్రహింపనగును. 
సువర్ణము వలన వివిధ ఆకారములు ఏర్పడినట్లు, బ్రహ్మము వివిధ వికారములు పొందదు. సువర్ణము వస్తువులుగా మారునపుడు రాగి టంకము మొదలగు వికృతులు చేరును. గాని బ్రహ్మములో ఎట్టి మార్పు సంభవించదు. కేవలము కాంతి వలననే వస్తువులు గాంచవీలైనట్లు, బ్రహ్మము వలననే వస్తువులు ఏర్పడును. జీవ బ్రహ్మముల గ్రహింప నుపయోగపడు దృష్టాంతము నెఱగిన, అఖండాకార చిత్తవృత్తి ఉదయించును. అలానే మహా వాక్యార్ధ బోధ వలన, ఆత్మతత్వము స్ఫురించును. ఈ స్ఫురణ వలన అజ్ఞానము, దాని కార్యము నశించిపోవును. అదియే నిర్వాణము. 
ఆత్మ విశ్రాంతి లభించు వరకు శాస్త్రోపదేశము, సౌజన్య ప్రభావము, సాధు సంగమముల నాశ్రయించి, ధర్మార్ధములను, పురుషార్ధములను సంపాదించవలెను. తదుపరి శాస్త్రార్ధమును గ్రహించి, విచార పరాయణుడవవలెను. అపుడే తురీయపదమైన శాంతి లభించును. మనస్సు శూన్యమైనపుడు, జ్ఞానేంద్రియములు తమ పనులు నెరవేర్చుచున్నను కర్మఫలమంటదు. నెరవేర్చకపోయినను ఫరవాలేదు. మనస్సు లేని కార్యములకు సంస్కారముండదు. యంత్రములు నడపనిచో నడవనట్లు మనస్సు యత్నము శూన్యమైనపుడు, శాంతించిన కర్మేంద్రియములు కర్మల నొనరింపజాలవు. విషయ వాసనలు లేనిచో మనస్సు శాంతించును. అపుడు కర్మలతో పని లేదు. ఉపాసకుడు, ఇంద్రియములను జయించి శూరుడని పేర్గాంచి, దైవమును దూరముగ పరిత్యజింప, పౌరుష ప్రభావమున, నిజహృదయముననే బ్రహ్మసాక్షాత్కారమునొందును. స్వీయబుద్ధి బలము వలన అనంత బ్రహ్మమును సాక్షాత్కరింప జేసుకొను వరకు ఆచార్యుల ప్రమాణ సిద్ధ సత్యమతము ననుసరించవలెను. తత్వ విచారము నొనర్పవలెను.


---------------------------------శుభోదయం --------------------------------------------
"Truth,Purity,unselfishness:-- Where ever these are present there is no power bellow or above the sun - to crush the possession there.Equipped with these one individual face the whole universe in opposition. SWAMY VIVEKANANDA.
సత్యము, పవిత్రత,నిస్వార్థము-- ఈ సుగుణాలున్న వాడిని అణగద్రోక్క గల సామర్థ్యం ముల్లోకాలలో ఎవరికీ లేదు. అలాంటి సుగుణ సంపన్నుడు విశ్వమంతా ఏకమైనా ఒంటరిగా ఎదిరించ గలుగుతాడు.
స్వామి వివేకానంద

అతనికి వార్ధి కుల్య యగు నగ్ని జలంబగు మేరు శైల మం
చిత శిలలీల నుండు మద సింహము జింక తెరంగు దాల్చు గో
పిత ఫణి పూలదండ యగు భీష్మ విషంబు సుధారసం బగున్
క్షితి జన సమ్మతం బగు సుశీల మదెవ్వని యందు శోభిలున్ (భర్తృహరి సుభాషితము)
తా:-- భూమిలోనున్న సుజనులు అందరూ ఒప్పుకునే సుగుణాలు ఎవ్వరి యందు ఉంటాయో ,అతనికి
సముద్రము పిల్లకాలువతో సమానమవుతుంది,అగ్ని నీటి తో సమానమవుతుంది,మేరు పర్వతము చిన్న రాయి లాగ కనబడుతుంది,మద సింహము జింక లాగా ప్రవర్తిస్తుంది,కోపముతోనుండు పాము గూడ పూలదండ అయిపోతుంది,భయంకరమైన విషము అమృతము లా తయారవుతుంది,



Pranjali Prabha - 31-05-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణయానమ:

ఆనందం - -ఆరోగ్యం - ఆధ్యాత్మికం

నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీలా ) -10
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

19. అల్ప విద్వాన్సుడు నాక్షేపణకు పెద్ద - మూర్ఖచిత్తుడు కోపమునకు పెద్ద
పెట్టనేరని రండ పెక్కు నీతులు బెద్ద - గొడ్రాలి పెళ్ళానికి గొంతు పెద్ద 
డబ్బురాని వకీలుకు దంబంబు పెద్ద - రిక్తుని మనస్సుకు కోరికలు పెద్ద
వెలయు నాబోతుకు కండలు పెద్ద - మధ్య వైష్ణువులకు నామములు పెద్ద

అప్పు ఇచ్చి వద్దన్న వాడు అందరిలో పెద్ద
ఆలస్యముగా వచ్చువాడు అందరిలో పెద్ద
ఆదమరవక అందరితో సహకారించేవాడే పెద్ద
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

20. నమ్ముకున్న వాడికి శాలువా లిస్తి - చాకలి గంజికి జారీ కోకలిస్తి 
కడియాల కుమ్మర కంకికి దర్శిస్తి - పోగులు పొలంగికి పోగులిస్తి
వంట మనిషికి దుప్పట్లు దర్శిస్తి - దాని తల్లికి నూరు ధార పోస్తి
దాస రచ్చికి దేవతార్చన లమ్మిస్తి - గుర్రాన్ని ఉప్పర కొండ కిస్తి 

చేయు తప్పులు బయట పడకుండా
నమ్మ పలికి అపాత్ర దానము చేసి
చెప్పు కొందురు సిగ్గు విడిచి

ఇది వేణుగోపాల ప్రేమ సుమా


 

సాహితీమిత్రులారా!

మధురవాణీవిలాసమును రచించిన
చింతపల్లి వీరరాఘవయ్యగారు క్రీ.శ.1660
ప్రాంతంలో మహబూబునగర్ జిల్లా,
వట్టెం గ్రామంలో నివసించారు.
ఈ కావ్యం అయిదు ఆశ్వాసాలు గలది
దీనిలో మధురవాణీ కార్తవీర్యుల కథ కూర్చబడినది.
ద్వితీయాశ్వాసంలోని చిత్రకవిత్వంలోని
ఏకాక్షర , ద్వ్యక్షర త్య్రక్షర - పద్యాలను చూడండి-

ఏకాక్షరకందపద్యం-
'న'- అనే ఒకే హల్లుతో కూర్చిన కందము.

నిన్నే నెన్నేనని నే
నెన్నైనను నెన్నునిన్నని నేనా
ని న్నాన నూన నేనిన్
నన్నానును నాననాను నననీనన్నా (2-11)

ద్వ్యక్షర కందము-
'న', 'క' - అనే హల్లులుపయోగించి కూర్చినది.

నానా నాకౌకోనీ
కేనాకన నిన్నెకాక నికనేనొకనై
నానెన్ని కినుక నూనక
కానుకకైకొన్న నిన్ను కన్నా నికఁనే (2-12)

న,మ - అనే రెండు హల్లులతో
కూర్చిన ద్వ్యక్షరకందం-

నేమమ్మున నీనామము
మామనమున నమ్మినాము మము మనుమను మో
మామానినాన నెమ్మిని
మే మనుమానమ్ముమాన మి మ్మెన్నేమా (2-13)

త్య్రక్షరకందము-
ద,న,వ- అనే మూడు హల్లులను
ఉపయోగించి కూర్చిన
కందపద్యం ఇది

దానవవనదవవనదా
నానావిద్వన్నవీన నవననిదానా
దీనానాదీనవదా
నానుదు నెద నీదువాదు నాదవినోదా (2-14)

ఈ కావ్యంలోని మరికొన్ని విషయాలను
తరువాత తెలుసుకొందాము.
------------------------------------------------
- ఏ.వి.రమణరాజు




రావణుని మానసిక అవస్థ 


సాహితీమిత్రులారా! 
ప్రవరసేనుని సేతుబంధము పదకొండవ ఆశ్వాసములో సీతకు రావణుడు రామచంద్రుని మాయాశిరమును చూపుటను, దానిని చూసి సీత ఉద్వేగముతో మూర్ఛపోయి, అటుపై అనేకవిధములుగా విలపించటము, త్రిజట యనే రక్కసి సీతను ఊరడించి, ధైర్యము చెప్పుట చిత్రింపబడినాయి. ఈ ఆశ్వాసమున మొదటి ముప్పై అయిదు శ్లోకములలో రావణుని తీవ్ర ఉన్మత్తావస్థను కవి మహానైపుణ్యముతో చిత్రించినాడు. రాముడు కపిసేనతో కూడి యుద్ధమునకై లంకకు ఏతెంచిన వార్త విని రాక్షసరాజుకు నిద్రపట్టుట లేదు. సీతమీది మోహము వేధించుచున్నది. 

తం పులఇఅమ్మి పేచ్ఛఇ ఉల్లవన్తో అ తీఅ గేహ్ణఇ గోత్తమ్| 
ఠాఇ అ తస్స సమఅణే అణ్ణమ్మి వి చిన్తిఅమ్మి స చ్చిఅ హిఅఎ|| 

ఛాయ: 

తాం ప్రలోకితే పశ్యత్యుల్లపంశ్చ తస్యా గృహ్ణాతి గోత్రమ్| 
తిష్టతి చ తస్య సమదనేऽన్యస్మిన్నపి చిన్తితే సైవ హృదయే|| 

చూచిన ప్రతి చోటా సీతముఖమే కనిపిస్తోంది. మాటాడిన ప్రతి మాటలోనూ ఆమె నామము దొరలుతూంది. ఆమెను మర్చిపోవటానికి ప్రయత్నము చేసే కొద్దీ, ఆమెయే హృదయంలో నిలుస్తోంది. 

ఈ ఘట్టములో దశకంఠుని అవస్థ మయసభలో పరాభవం చెందిన కురురాజు దుర్యోధనుని మనఃస్థితిని కొంత ప్రతిబింబిస్తుంది. ఆ యవస్థను నివారించటానికి దశవదనుని పత్నులు విఫలప్రయత్నము చేస్తారు. ఈ దురవస్థను అతను సైపలేక చివరకు ఈ విధముగా చింతించినాడు: జనులు తమ ఆశలు శిథిలమయినప్పుడు, తమకు రక్షణ కరవైనపుడు, మిత్రులు దొరకనపుడు భయము చేత లజ్జను విడనాడి తమ నియమముల నతిక్రమింతురు. 

ఈ విధముగా క్రూరముగా ఆలోచించి, రాక్షసరాజు భటులకు రాముని ఖండిత మాయాశిరమును తయారు చేయమని ఆజ్ఞనిచ్చినాడు. ఆ శిరమును జూపి భీతావహురాలైన సీతను స్వాధీనము గావించుకొనవలెనన్న కర్కశమైన కాంక్ష యతనిది. దశవదనములతో దనుజరాజు భటులకు యాజ్ఞనిచ్చునప్పుడు రావణుని (అవస్థ) వర్ణన ఇది. ఉన్మత్తతకు పరాకాష్ట. 

అణ్ణేణ సమారద్ధం వఅణం అణ్ణేణ హరిసగహి అప్ఫిడిఅమ్| 
అణ్ణేణ అద్ధభణిఅం ముహేణ అణ్ణేణ సే కఇ వి ణిమ్మవిఅమ్|| 

ఛాయ: 

అన్యేన సమారబ్ధం వచనం అన్యేన హర్షగృహీతస్ఫేటితమ్| 
అన్యేనార్ధభణితం ముఖేన అన్యేనాస్య కథమపి నిర్మాపితమ్|| 

మొదటి ముఖముతో వచనమునారంభించినాడు. ఇంకొక ముఖము రాక్షసానందముతో ఆ మాటలనందుకొనినాడు. ఆపై మాటలు రాక మరొక ముఖముతో మాటలాడినాడు. చివరన యెటులో మరొక ముఖముతో ఆజ్ఞను ముగించినాడు. 

రావణాసురుని మనమునందున్న తీవ్రమైన అరిషడ్వర్గవిన్యాసము ముప్పది ఐదు శ్లోకములలో చిత్రింపబడి, పై శ్లోకమందు శిఖరాగ్రము నందుకొనినది. 

సేతుబంధకారుని సీతాదేవి అసహాయ. అయినప్పటికీ ధీర. పరమ ముగ్ధ కాదు. ఆమె మాటలలో రాచకన్య యొక్క ధీరత్వము, ప్రతీకారేచ్ఛ కానవస్తుంది. సీతయందు ప్రవరసేనుడు నిలిపిన ధీరత్త్వము ’కుందమాల’ అను దృశ్య కావ్యమున తిరిగి కానవచ్చును. జానకిని ఊరడించుట త్రిజట వంతయ్యింది. సేతుబంధకవి రాముడు సాక్షాత్తు నారాయణుడు. ఈ విషయమును త్రిజట ముఖమున కవి చెప్పించినాడు. చివరకు వానరుల యుద్ధసంరంభమును, భేరీ నినాదములను విని సీత ఊరడిల్లును. 

ఈ ఆశ్వాసము నందు సేతుబంధకారుడు సీతయొక్క పాత్రచిత్రణమునూ, రావణుని ఉన్మత్త మానసిక అవస్థను అపూర్వముగా చిత్రించినాడు. పూర్వఘట్టములందు సుగ్రీవుని పాత్రచిత్రణమును, నాయకత్త్వప్రతిభను గురించిన ప్రస్తావన ఇదివరకు ఉటంకింపబడినది. 

యుద్ధము మొదలైనది. వానరయోధుని బలమును, పరాక్రమమును కవి చిత్రించుచున్నాడు. 

కఇవచ్ఛత్థలపరిణఅణిఅఅముహత్థమిఅదన్తిదన్తప్ఫలిహమ్| 
ణిహఅ భడ మహిఅ ణివడిఅ సురవహుచల వలఅ ముహలపవ అవఇవగమ్|| 

ఛాయ: 

కపివక్షఃస్థలపరిణత నిజముఖాస్తమిత దన్తిదన్తపరిఘమ్| 
నిహత భట మహిత నిపతిత సురవధూచల వలయ ముఖరప్లవగ గతిపథమ్|| 

అసురసైన్యమందలి యుద్ధగజమొక్కటి ఒకానొక వానరయోధుని పాషాణసదృశమైన వక్షఃస్థలమును తన కొమ్ములతో కుమ్మింది. ఆ అదటుకు వానరశ్రేష్టునికి యేమీ నొప్పి కలుగలేదు కానీ, గజము యొక్క దంతము మాత్రము వెనుకకు వంగి దానిముఖములోనికే చొచ్చినది. ఇక్కడ వానరయూధుల దేహదారుఢ్యము వ్యంజితము. నిహతులైన వానరయోధుల కొనిపోవుటకు వచ్చిన స్వర్గలోకవాసులైన అప్సరల నూపురనాదములతో యుద్ధపథమతిశయించినది. 
----------------------------------------------------------- 
ప్రాకృతకవనము: సేతు బంధ కావ్యము - అనే వ్యాసం నుండి 
దీని రచయిత రవి. ఈ మాట- జనవరి 2016 
--------------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు

Friday, 25 May 2018

Pranjali Prabha (30-05-2018)

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ: - శ్రీ క్రిష్ణాయనమ:

ఆనందం - అర్గ్యం - ఆద్యాత్మికం


                              నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 
                             ప్రాంజలి ప్రభ   
                              రచయత మల్లాప్రగడ రామకృష్ణ 
      
                 25. ఆరాటం, అర్భాటంలేని, అనందలోలువు ,
                   ఆదర్శ,         ఆత్మీయ
తా,      ఆరాధ్యువు ,
                  అందరిలో,వెలసియున్న, అత్మీయబన్దువు
వు ,

                 నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 

                   26చంచల,  చమత్కార,     చతుర్వ్వెది,
                  చక్రవాస,   చక్రహస్త,       చతుర్భుజి,
                  చతుర్వేద్వ్వరో,  రత్నాయ,  చక్రపాణి,
                                                                           నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

  
                27. నీ నామమే మాకు నిధియ నిదానము,
                    నీ నామమే యాత్మనిదినాన్జనము,
                    నీ    శామము     సర్వ  పాప  హారము,

                     నమో నమో శ్రీ తిరుమల  తిరుపతి వేంకటేశ.
                                                           

             28. హనుమంతునకు శ్రీరామ నామము నిత్యఔషధం ,
                 నారదునకు  నారాయణ  నామమునిత్యఔషధం,
                 నీ కొండయక్కినవారికి గోవింద నామము నిత్యఔషధం,
                 నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

               29.పదారువేల భామ అలకలు తీర్చినమోహన రూపం,
                  గొల్లపడచుల కులుకు చూపులకు సరియగు రూపం,
                 సత్యభామ కౌగిలి సోమ్పులుమరగిన వేడుక  రూపం,
                 నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
   
              30. ఆశ్రితులకు  అమృతం దొరుకు  తిరుపతి   క్షేత్రం,
               వలయ భుద్ధినిమార్చే జ్ఞాణామృత 
తిరుపతి క్షేత్రం,
               భక్తుల  కోర్కలుతీర్చే  ఘంధపరిమల 
తిరుపతి క్షేత్రం,

                నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
  
                                                         --((*))--



నేటి పద్యం  
ప్రాంజలి ప్రభ 


సేకరణ రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

దాశరధీ శతకము నుండి శ్రీ కంచర్ల గోపన్న కవి విరచిత - 

2  చ.    హరిపద భక్తి నింద్రియజయాన్వితుడుత్తముంద్రియంబులన్ 
             మరుగక నిల్వ నుదినను మధ్యము, దింద్రియ పారవష్యుడై 
             పరగినచో నికృష్టుడని పల్కగా, దుర్మతి నైన నన్ను ణా 
             దారమున నెట్లు కాచేదవో! దాశరధీ! కరుణా పయోనిధీ! 

        భావము === రామా! దయాసముద్రా! విష్ణు పాద భక్తితో నింద్రియ ములను జయించు 
        వాడుత్తముడు. ఇంద్రియము లకు లోనుగాక నిలుచు వాడు మధ్యముడు, ఇంద్రియ 
        ములకు వశ పడువాడధముడు అనగా దుర్భుద్ది నైన నన్నేట్లాదరిమ్చి రక్షిమ్తువో.

--((*))--
                                                               


నేటి హస్త్యం 



అమ్మ అనసూయ గారు! మరోసారి ఆలోచించండి.

మీకు వ్రుద్దాప్యము,అనారోగ్యము,ఆర్దిక సమస్యలు.

మీ ఆయన చాలా మంచివారు.

ఈ పరిస్తితులలో విడాకులు సమంజసం కాదని నా అభిప్రాయము.


లాయర్ గారూ! నిజంగా మా ఆయన దేముడేనండీ!
ఆయన లేనిదే నా రోజు గడవదు.
నా అంతట నేనేమీ చేసుకోలేని నిస్సహాయురాల్ని. ఆయనంటే నాకు గౌరవం, ప్రేమ, అభిమానం, జాలి

మరింకేమిటమ్మ?

ఆయనలోని అపరిచితుడు నా మనసును
తీవ్రాతి తీవ్రంగా గాయ పరుస్తున్నాడు.
ఎప్పుడు మేల్కుంటాడో తెలీదు.
నా యుక్తవయసు నుండి నా విషయాలు
చిలువలు పలువలుగా తెలుసుకుని, అనేక కట్టు కధలు వండి వార్చుకుని,
అభూత కల్పనల కన్నా గోప్ప పాత్రలు స్రుష్టించుకుని నాకు సంబందం లేని పాత్రలకు నాతో ముడి పెట్టి ప్రశ్నల పరంపరలతో నా మనసును
కకలా వికలం చేస్తున్నారు

ఆ ఓక్క క్షణం నెమ్మదిగా మట్లాడితే?

అవును.
నెమ్మదిగా మాట్లాడితే
ఇంత అవమానకర విషయాన్ని సహించేవంటే నువ్వు తప్పు చేసేవనీ, గట్టిగా మాట్లాడితే చింత చచ్చినా పులుపు చావలేదని నిలదీస్తారు!!!



నేటి గీతం
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

గంటలు గణ గణ మ్రోగే - గుండెలు దడ దడ లాడే 
కాలుష్యంతో శ్వాస తగ్గే -  శబ్దములతో వయసే మ్రింగే
ఏమిటి ఈ లోకం - ఎప్పుడు మారును ఈ లోకం
ఇదియేనా స్వర్గ  లోకం - కాదు కాదు ఇది నరక లోకం


కులాలలో, మతాలలో ప్రతి ధ్వని
వలపులో,  ధనములో ప్రతి ధ్వని
ప్రేమలో, స్నేహములో ప్రతి ధ్వని
తండ్రిలో,  తల్లిలో    ప్రతి ధ్వని

పట్టణాలలో, పల్లెటూరులలో ప్రతి ధ్వని
ఎడారులలో, సముద్రాలలో   ప్రతి ధ్వని
అడవులలో,  మానవులలో    ప్రతి ధ్వని
మంచి చడులలో, పుట్టి గిట్టుటలో ప్రతి ధ్వని   

గంటలు గణ గణ మ్రోగే - గుండెలు దడ దడ లాడే 
కాలుష్యంతో శ్వాస తగ్గే -  శబ్దములతో వయసే మ్రింగే
ఏమిటి ఈ లోకం - ఎప్పుడు మారును ఈ లోకం
""ఇదియేనా ""స్వర్గ  లోకం - కాదు కాదు ఇది నరక లోకం

కార్యాలయములో, కారాగృహములో ప్రతి ధ్వని
శృంగారంలో, బిడియములో ప్రతి ధ్వని
దేవుని గుడిలో, విద్యార్థుల బడిలో ప్రతి ధ్వని 
నీహృదయములో, నాహృదయములో ప్రతిధ్వని

పరిహాసములో,  పరివర్తనలో  ప్రతి ధ్వని
ఉల్లాసములో, ఉద్రేకములో ప్రతి ధ్వని
విశ్వాసములో, ఉన్మాదములో ప్రతి ధ్వని
అనురాగములో, ఆర్భాటములో ప్రతి ధ్వని 

గంటలు గణ గణ మ్రోగే - గుండెలు దడ దడ లాడే 
కాలుష్యంతో శ్వాస తగ్గే -  శబ్దములతో వయసే మ్రింగే
ఏమిటి ఈ లోకం - ఎప్పుడు మారును ఈ లోకం
ఇదియేనా స్వర్గ లోకం - కాదు కాదు ఇది నరక లోకం

రాజకీయములో, రాజీ వ్యయములో ప్రతి ధ్వని
భయములో, అభయములో  ప్రతి ధ్వని
క్రోధములో, శాంతిమయంలో  ప్రతి ధ్వని
పండితులలో పామరులలో  ప్రతి ధ్వని

గంటలు గణ గణ మ్రోగే - గుండెలు దడ దడ లాడే
కాలుష్యంతో శ్వాస తగ్గే -  శబ్దములతో వయసే మ్రింగే
ఏమిటి ఈ లోకం - ఎప్పుడు మారును ఈ లోకం
ఇదియేనా స్వర్గ లోకం - కాదు కాదు ఇది నరక లోకం


Image may contain: 2 people



Tuesday, 22 May 2018

Pranjali Prabha - (28-05-2018)

ఓం శ్రీ రామ్  - ఓం శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:


ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం

                         16. గగనతల,  గగనకుసమ,    గగనధ్యజ,
                           గజవాహన, గరుడవాహన,  గణనీయ,
                             గజతుర,      గజప,     గానితవిశారద,
                         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
                    17.  శ్రీకర:,        శ్రీనిధి:,          శ్రీమాన్ :
                           శ్రీవాస:, శ్రీ
వత్సవక్షా:, శ్రీమతావర :
                           శ్రీనివాస:, శ్రీవిభావన:,       శ్రీ ధర :
                  నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                    18   పరమాత్మ:,  పరంధామా:,  పద్మనాభా :
                    ప్రభాత:,  ప్రత్యర్ధన:,          పురుషోత్తమ:,
                    ప్రజాపతి:,  ప్రజాభవ:,        పుండరీకాక్ష:,
                    నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.



తిలక ధారణలోని పరమార్థం

తిలక శబ్దం శ్రేష్ఠతా వాచకం. ఒక వ్యక్తి ధరించే వాటిలో శ్రేష్ఠమైనది అనే అర్థంలో నుదుట ధరించే బొట్టుని తిలకమని అంటారు. ఇది సర్వాంగాల్లో శ్రేష్ఠమైన శిరస్సున ధరించేది. శ్రేష్ఠతను ఆపాదించేది. హిందువులందరు తప్పనిసరిగా నుదుట తిలకాన్ని ధరించేవారు . ఒకవ్యక్తి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాడనటానికి గుర్తు బొట్టు పెట్టుకోవటం. భగవంతుణ్ణి నమ్ముతున్నాడనటానికి కూడా బొట్టే నిదర్శనం. బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. కానీ అదే దాని పరమార్థం కాదు.అది అనునిత్యం జరిపే ఒక గొప్ప సంస్కారం. కనుబొమల మధ్య ప్రదేశంలో వెనుకగా ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఆ ప్రదేశాన్ని మధ్య వేలితో సున్నితంగా స్పృశించి ఆజ్ఞాచక్రాన్ని ప్రచోదన చేయటం తిలక ధారణలోని పరమార్థం. శక్తి ప్రసరణ, వితరణ కేంద్రాలైన షట్చక్రాల పైన పెత్తనం చేస్తూ వాటిని తన అదుపులో ఉంచుకునేది, వాటిని ఆజ్ఞాపించి పని చేయించ గలిగినది కనుక భ్రూమధ్యంలో ఉండే ఈ చక్రానికి ఆజ్ఞా చక్రం అనే పేరు సార్థకం. ఇది సరిగ్గా ఉంటే మిగిలిన చక్రాలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఆజ్ఞా చక్రం ప్రచోదనమైతే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. అందుకే గురువు శిష్యునికి ఉపదేశం చేసే సమయంలో బొట్టు పెట్టే నెపంతో భ్రూ మధ్య ప్రదేశాన్ని స్పృశించి ఆజ్ఞా చక్రాన్ని ప్రచోదన చేస్తాడు.

ఈ విధంగా ప్రచోదన చేసినదానికి సంకేతంగా ఏదో ఒక గుర్తుని ఉంచటం ఆచారంగా వచ్చింది. దీని కోసం భారతీయులు ఉపయోగించిన సామాగ్రి వారి భావ విస్తృతిని తెలియజేస్తుంది. తరచుగా వాడేది కుంకుమ . అది పసుపులో కుంకుమ రాళ్ళు వేసి చేసినది కావచ్చు, నిమ్మరసంలో పసుపు కొమ్ములను నానవేసి చేసినది కావచ్చు, ఇంకా సిందూరం, తిరుచూర్ణం , గంధం, అక్షతలు,విభూతి, చాదు [దీన్ని ఎన్నోరకాలుగా తయారు చేస్తారు] ..... ఇంకా శక్తి ఉంటే కస్తూరి, పునుగు,జవ్వాది, పచ్చ కర్పూరం, నవ రత్నాలు........ ఎవరి శక్తి ననుసరించి వారి వైభోగం ధరించిన తిలకాన్ని బట్టి ఏ సంప్రదాయానికి చెందిన వారో సులభంగా గుర్తించవచ్చు. ముఖాన బొట్టు ఉండటం మరెన్నో అంశాలని సూచిస్తుంది. బొట్టు లేకపోతే అది పాచి మొహం. . ఇంకా స్నానం కాలేదని సామాన్యార్థం. శుభ కార్యాలు చేయటానికి అర్హత లేని సూతక సమయం కూడా కావచ్చు. అంటే, నుదుటనున్న తిలకం శుభ కార్యాలు చేయటానికి, నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నిర్వర్తించటానికి అర్హత ఉన్నదని సూచిస్తుంది. అందుకే స్నానం చేయగానే ముందుగా తమ తమ సంప్రదాయాల కనుగుణంగా తిలక ధారణ చేసి మరీ పూజాదికాలు నిర్వర్తిస్తారు. ముత్తైదువలైన స్త్రీలు ముఖాన బొట్టు లేకుండా ఒక్క క్షణమైనా ఉండరు. అది అయిదోతనానికి చిహ్నం కదా! వివాహ సమయంలో వరుడు తన పంచ ప్రాణాలను వధువు శరీరంలో నిక్షేపం చేసే స్థానాల్లో బొట్టుపెట్టుకునే చోటు కూడా ఒకటి.

బొట్టు పెట్టుకోవటమే కాదు పెట్టటం కూడా మన సంప్రదాయంలో భాగం. బొట్టు పెట్టటం మర్యాదకి చిహ్నం. ఆహ్వానించటానికి బొట్టు పెట్టి మరీ పిలవటం ఆచారమై పోయింది. ఎవరికైనా పని అప్పచెప్పేటప్పుడు చందన మలది కుంకుమ పెడతారు. పిల్లలకి బొట్టు పెడితే దిష్టి తగలదని నమ్మకం. ఒకప్పుడు మంచి రంగు పరిమళం ఉన్న కుంకుమ తయారు చేయటం ఒక కళగా భావించేవారు. తరువాత ద్రవ రూపంలోను , ఆపై పేస్టు రూపంలోను, తిలకాలు వచ్చాయి. ఇప్పుడు బొట్టు బిళ్ళలు రకరకాల రంగులు, ఆకృతులలో వస్తున్నాయి. ఇవి స్త్రీలకే పరిమితం. కాని, తిలక ధారణ మాత్రం స్త్రీ పురుష భేదం లేక అందరు పాటించ వలసినది. మేలు కూర్చేది.
°
స్వేస్చ సేకరణ 
సుదర్శనం తిరుమలసత్యశాయి. గారికి ధన్యవాదములు 
చిన్నపిల్లల చిత్రము చూసి మీ అభిప్రాయాలు తెలపగలరు  


మహాకవి శ్రీశ్రీ గారి కావ్యము 

దేశ చరిత్రలు 
ఏ దేశచరిత్ర చూచినా 
ఏమున్నది గర్వకారణం? 
నరజాతి చరిత్ర సమస్తం 
పరపీడన పరాయణత్వం. 
నరజాతి చరిత్ర సమస్తం 
పరస్పరాహరణోద్యోగం.. 
నరజాతి చరిత్ర సమస్తం 
రణరక్త ప్రవాహసిక్తం. 
భీభత్సరస ప్రధానం, 
పిశాచగణ సమవాకారం! 
నరజాతి చరిత్ర సమస్తం 
దరిద్రులను కాల్చుకు తినడం 
బలవంతులు దుర్బల జాతిని 
బానిసలను కావించారు.. 
నరహంతలు ధరాధిపతులై 
చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి 
రణరంగం కానిచోటు భూ 
స్థలమంతా వెదకిన దొరకదు.. 
గతమంతా తడిసె రక్తమున, 
కాకుంటే కన్నీళులతో 
చల్లారిన సంసారాలూ, 
మరణించిన జన సందోహం, 
అసహాయుల హాహాకారం 
చరిత్రలో మూలుగుతున్నవి 
వైషమ్యం, స్వార్ధపరత్వం, 
కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్ధలు 
మాయలతో, మారుపేర్లతో 
చరిత్ర గతి నిరూపించినవి 
జెంఘిజ్ ఖాన్, తామర్లేనూ 
నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ, 
సికందరో ఎవడైతేనేం? 
ఒక్కొక్కడూ మహాహంతకుడు 
వైకింగులు, శ్వేతహూణులూ, 
సిధియన్లూ, పారశీకులూ, 
పిండారులూ, ధగ్గులు కట్టిరి 
కాలానికి కత్తుల వంతెన 
అగ్నానపు టంధయుగంలో, 
ఆకలిలో, ఆవేశంలో- 
తెలియని ఏ తీవ్రశక్తులో 
నడిపిస్తే నడచి మనుష్యులు- 
అంతా తమ ప్రయోజకత్వం, 
తామే భువి కధినాధులమని, 
స్ధాపించిన సామ్రాజ్యాలూ, 
నిర్మించిన క్రుత్రిమ చట్టాల్ 
ఇతరేతర శక్తులు లేస్తే 
పడిపోయెను పేక మేడలై! 
పరస్పరం సంఘర్షించిన 
శక్తులలో చరిత్ర పుట్టెను 
చిరకాలం జరిగిన మోసం, 
బలవంతుల దౌర్జన్యాలూ, 
ధనవంతుల పన్నాగాలూ 
ఇంకానా! ఇకపై చెల్లవు 
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ, 
ఒక జాతిని వేరొక జాతీ, 
పీడించే సాంఘిక ధర్మం 
ఇంకానా? ఇకపై సాగదు 
చీనాలో రిక్షావాలా, 
చెక్ దేశపు గని పనిమనిషీ, 
ఐర్లాండున ఓడ కళాసీ, 
అణగారిన ఆర్తులందరూ – 
హాటెన్ టాట్, జూలూ, నీగ్రో, 
ఖండాంతర నానా జాతులు 
చారిత్రక యధార్ధతత్వం 
చాటిస్తా రొక గొంతుకతో 
ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? 
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో? 
తారీఖులు, దస్తావేజులు 
ఇవి కావోయ్ చరిత్రకర్ధం 
ఈ రాణీ ప్రేమపురాణం, 
ఆ ముట్టడికైన ఖర్చులూ, 
మతలబులూ, కైఫీయతులూ 
ఇవి కావోయ్ చరిత్రసారం 
ఇతిహాసపు చీకతికోణం 
అట్టడుగున పడి కాన్పించని 
కధలన్నీ కావాలిప్పుడు! 
దాచేస్తే దాగని సత్యం 
నైలునదీ నాగరికతలో 
సామాన్యుని జీవన మెట్టిది? 
తాజమహల్ నిర్మాణానికి 
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? 
సామ్రాజ్యపు దండయాత్రలో 
సామాన్యుల సాహసమెట్టిది? 
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, 
అది మోసిన బోయీలెవ్వరు? 
తక్షశిలా, పాటలీపుత్రం, 
మధ్యధరా సముద్రతీరం, 
హరప్పా, మొహేంజదారో, 
క్రో – మాన్యాన్ గుహముఖాల్లో – 
చారిత్రక విభాత సంధ్యల 
మానవకధ వికాసమెట్టిది? 
ఏ దేశం ఏ కాలంలో 
సాధించిన దేపరమార్ధం? 
ఏ శిల్పం? ఏ సాహిత్యం? 
ఏ శాస్త్రం? ఏ గాంధర్వం? 
ఏ వెల్గుల కీ ప్రస్థానం? 
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?



Pranjali Prabha (27-05-2018)


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ: 


(ఆనందం -ఆరోగ్యం -ఆధ్యాత్మికం)

13.  అభిరామ, అసహయ, అవనీతనయ,
                               అమాత్త్య,  అభిఘాత,   అసాధ్యాయ,
                              అక్షపాద,        ఆక్షేపక,    ఆర్యవర్తక,
                         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.




                           14.  జనార్ధన:,      జగద్రక్ష:, జగత్కర్త:,
                                  జగజ్జేత:,   జగత్జ్యోతిష:, జగజ్జీవ:,
                                 జగద్గురు:, జగత్జయ:, జగత్సాక్షి:,
                          నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.




                            15.  కులక్షణ:, కులసంభవ:, కులసేష్ట:,

                                  కులీన:,     కులేస:,    కులేస్వర్య:,
                                  కూత్తమ:,  కూతేజార:,       కుధీర:,     
                          నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.*



“చదువుల తల్లియైన సరస్వతీదేవిని శ్రీపంచమినాడు విద్యార్థిని విద్యార్థులు పూజిస్తే, చదువుల్లో సత్వర పురోగతి ఉంటుంది. విజ్ఞాన వికాసాలు వృద్ధి చెందుతాయి.”

క్షోణితలంబున్ నుదురు సోకక మ్రొక్కినుతింతు సైకత 
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి, రక్షితామర 
శ్రేణికి దోయజాతభావచిత్త వశీకరణైక వాణికిన్ 
వాణికి నక్షదామశుక వారిజపుస్తక రమ్యపాణికిన్

నల్లని అందమైన శిరోజాలు గల తల్లికి, దేవతలను రక్షించే ఆమెకు, బ్రహ్మదేవుని మనస్సును వశపరచుకున్న దేవికి, రుద్రాక్షమాల, చిలుక, పద్మం, పుస్తకాన్ని చేతులలో ధరించు వాణికి, సరస్వతీదేవికి, నా నుదురు నేలను తాకేటట్లు వంగి, భక్తితో నమస్కరిస్తాను.

ఈ సమస్త విశం శబ్దమయం. నాదం తోనే జగత్ సృష్టి ప్రారంభమైంది. ఆ నాదశక్తికి ప్రతిరూపంగా, సరస్వతీమాత బ్రహ్మవిద్యాస్వరూపిణియై శోభిస్తుంటుంది. విద్యకు అధిష్టాత్రి సరస్వతీదేవి. ఆ తల్లి మాఘశుద్ధ పంచమి నాడు అంటే శ్రీపంచమినాడు ఆవిర్భవించింది. శాస్త్రవాక్కు, శ్రీపంచమినాడు విధిగా సరస్వతీదేవిని ఆరాధించాలని దేవిభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీపంచమినాడు సరస్వతీదేవిని పుస్తకాలు లేక విగ్రహా రూపంలో ఆవాహన చేసి పూజిస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయని, జ్ఞాపకశక్తి మేధ, బుద్ధి, వృద్ధి చెందుతాయని చెప్పబడింది. అందుకే ఈరోజున జ్ఞానాభివృద్ధి కోసం దేవతలు సైతం సరస్వతీదేవిని పూజిస్తారట.

సర్వజీవులలో చైతన్యస్వరూపిణిగా ప్రవహించే శక్తి స్వరూపిణే ‘సరస్వతీ’. ‘శ్రీమాతా’ అని కీర్తించబడిన ఆ తల్లి విశ్వేశ్వరుని వాక్, బుద్ధి, జ్ఞానాది ధీశక్తులకు అధిష్ఠాత్రి. సృష్టిలోని సమస్త జీవులకు ఆ తల్లి వల్లనే ఉలుకూ, పలుకూ ఎరుక ఏర్పడుతున్నాయి.

మాఘశ్య శుక్ల పంచమ్యాం… 
మానవో మనవోదేవా మునీంద్రాశ్చ ముముక్షవః 
వసవో యోగినస్సిద్ధ నాగా గంధర్వ రాక్షసాః 
మద్వరేణ కరిష్యంతి కల్పేకల్పే లయావధి 
భక్తియుక్తశ్చ దత్త్వావై చోపచారాణి షోడశ

మాఘశుద్ధ పంచమినాడు ఈ విశ్వమంతా మానవులు, మనువులు, దేవతలు, మునులు ముముక్షువులు, వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు…అందరూ సరస్వతీదేవిని ఆరాదిస్తారని దేవీ భాగవతం చెబుతోంది.

మన బుద్ధి శక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి సరస్వతీదేవి. అందుకే సూర్యుడు,

సర్వ చైతన్య రూపాం తాం ఆద్యం విద్యాంచ 
ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్

అని ప్రార్థించాడు. ఏ విద్యను గ్రహించాలన్నా అమ్మ అనుగ్రహం తప్పదు.

చత్వారి వాక్పరిమితా పదాని తానీ 
విదుర్భ్రాహ్మాణా యే మనీషిణీః 
గుహాత్రీణి నిహితా నేజ్గ్యంతి 
తురీయం వాచో మనుష్యా వదంతి

– అనిపించి సరస్వతీసూక్తంలో వాక్ స్వరూపం గురించి చెప్పబడింది. వాక్యం యొక్క స్వరూపం నాలుగు విధాలుగా ఉంటుంది.

1. పరా 
2. పశ్యంతీ 
3. మధ్యమా 
4. వైఖరీ

మనలో మాట పలకాలన్నా భావం స్ఫురింపచేసేదే “పరా”. మాట పలికే ముందు ‘పర’ ద్వారా ప్రేరితమై భావాత్మకంగా గోచరించేదే ‘పశ్యంతీ’. ఆ భావం మాటలుగా కూర్చుకున్న స్థితి ‘మాధ్యమా’ ఆ మాటలు శబ్దరూపంలో పైకి వినబడేదే ‘వైఖరీ! యోగశాస్త్ర పరంగా వీటి యొక్క ప్రయాణం గురించి చెప్పాలంటే, మూలాధారం నుండి నాభి, హృత్, కంఠ, నాలుకలు. వీటన్నింటికీ మూలమైన నాదం కూడ సరస్వతీరూపమే. ఇక, భావప్రకటన కోసం చెట్లు ‘పరా’ వాక్కుని, పక్షులు ‘పశ్యంతీ’ వాక్కును, జంతువులు ‘మధ్యమా’ వాక్కును, మనుషులు ‘వైఖరీ’ వాక్కును ఉపయోగిస్తున్నారు.

ఆ తల్లి శ్వేతపద్మవాసిని కనుక "శారదా" అని అన్నారు. అందుకే పోతనామాత్యుడు –

శారదనీరడెందు ఘనసార పటీర మరాళ మల్లికా 
హార తుషార పేనరజతాచలకాశ ఫణీశకుంద మం 
దార సుధాపయోధిసిత తామర సామరవాహిని శుభా 
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ

అని ప్రార్థించాడు. సరస్వతీదేవి తెలుపుదనాన్ని సందర్శించి అర్చించాలని కోరుకున్నారు పోతన. తెల్లని పద్మముపై కూర్చుని, ఒక కాలు నిలువుగా ఒక కాలు దానిపై అడ్డంగా మడుచుకుని కూర్చున్నట్లు, లేక నిలబడి, ఒక చేతిలో వీణ, ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకుని ఉన్నట్లు పద్మపురాణంలో చెప్పబడింది. ఆ తల్లి తెల్లనిపువ్వులు ధరించి, తెల్లనిపూసల

కంఠాహారం ధరించి, ఆ కంఠాహారంపై తెల్లని గంధంపూతతో దర్శనమిస్తుంది. అందుకే ఆ తల్లిని కూచిమంచి తిమ్మకవి ఈ క్రింది విధంగా స్తుతించాడు.

బలుతెలిపుల్గు వారువము, బంగరు వీణయ, మిణ్కు టందెలున్ 
జిలుక తూటారిబోటియును, జిందపు వన్నియమేను బొత్తమున్ 
జెలువపు దెల్ల దమ్మి విరి సింగపుగద్దెయు గల్గి యొప్పున 
ప్పలుకుల చాన, జానలరు పల్కులొసంగెడు గాత నిచ్చలున్

"బాగా తెల్లనైన పక్షి హంసనే గుర్రపువాహనంలా చెసుకున్న తల్లి, బంగారువీణను, మెరిసే అందెలను, చిలుకను, పుస్తకాన్ని ధరించి, శంఖంవంటి తెలుపు మేనితో ప్రకాశిస్తూ, అందమైన తెల్లని పద్మాన్నే ఆసనంగా చేసుకున్న "వాగ్దేవి" సరస్వతి, చక్కని పలుకులను నాకు నిత్యం అనుగ్రహించుగాక" అని కవీశ్వరుడు వేడుకుంటున్నాడు. అందుకే ఆ తల్లిని ప్రతి శ్రీపంచమినాడు భక్తి శ్రద్ధలతో పూజించుకోవలెను. శ్రీపంచమినాదు విద్యార్థినీ విద్యార్థులు ఆ తల్లిని పూజించడం వల్ల, చదువుల్లో మంచి ప్రగతిని సాధిస్తారు
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
తిరుమలసత్యశాయి గారికి ధన్యవాదములు .


మహర్షి వాల్మీకి విరచిత యోగ వాశిష్ట సారము 



4. సూక్ష్మశరీరము 
తదుపరి వశిష్ఠుడు శ్రీరామునికి సూక్ష్మశరీరతత్వమును బోధించుచున్నాడు. ఏ ప్రాణియైనను, మృతి చెందినపుడు, జీవాత్మ సూక్ష్మశరీరము ధరించి హృదయాకాశమున వాసనామయములగు (సంస్కారములు) త్రిలోకములను గాంచుచుండును. నిజానికి ఈ జీవాత్మ జన్మాది వికార రహితుడగు పరబ్రహ్మము. మరణ సమయమున మానసమందు నిలబడు కోర్కెలలో నేది అగ్రగణ్యమో దానినే జీవు డనుభవించును. నిజానికి జగత్తుమిధ్య, అసత్యమైనది. ఈ విషయము మరణ సమయ మందు, జనన సమయమందు, హృదయాకాశమున అనుభూతమగును. అనగా మరణ వేదనలో తన సంస్కారములన్ని, అనుభూతికి వచ్చి అంతా భ్రమయని తోచును. కాని సంస్కారములు నశించవు. జన్మ సమయములో గూడ, ఆ సంస్కారములు భ్రమయని తెలిసినప్పటికి జన్మించిన తరువాత, మాయ ఆవరించి తన గత సంస్కారములు అలానే వుండును. బ్రతుకు నందలి ఆశ, పుట్టుక, చావు అనుమిధ్యా ప్రపంచము నిజమని తలచును. 

స్ధూల శరీరములో సూక్ష్మ శరీరము, సూక్ష్శశరీరములో కారణ శరీరము గలదు. ఈ మూడు శరీరములే సంసారమునకు కారణమగుచున్నవి. సాధన ద్వారా ఈ మూడు శరీరములు దగ్ధమైనపుడే ముక్తి లభించును. ఈ సంస్కార తరంగములు నిద్రాసమయమందును, ప్రళయ సమయమందును చలనము లేక స్ధిరముగ వుండును. అది విశ్రాంతి సమయము. సృష్టి సమయము, స్వప్న సమయము లందు మరల భ్రాంతులు, తరంగములు లేచుచున్నవి. ఈ దేహత్రయములకు బ్రహ్మయే ఉపాధి. అందువలన స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు నశించగానే బ్రహ్మము మిగులును. సంస్కారముల ననుసరించి జన్మ లభించును. 

జనులు మాటి మాటికి పుట్టుచూ, చచ్చుచూ క్రమముగా సంస్కారములలోమార్పు తెచ్చుకొనుచు, చివరికి విదేహముక్తులగుదురు. ఉదాహరణకు వ్యాసుడు ఈ బ్రహ్మయుగములో ముప్పది రెండవ వ్యాసుడు. అనగా పూర్వపు సృష్టులందు, ముప్పది ఒక్క వ్యాసులు చనిరి. ఇంకను వ్యాసులు ఎనిమిది పర్యాయములు జన్మించి, భారత ఇతిహాసములను, వేదవిభజనను ఎనిమిది పర్యాయములు చేసి భారత వంశమునకు కీర్తి దెచ్చి, పిదప విదేహముక్తుడై బ్రహ్మమును పొందును. అలానే ప్రతి జీవి లక్షల జన్మములు ఎత్తి చివరకు ముక్తులు కావలసినదే. వివిధ జన్మలలో, ఇప్పుడున్న వారె అప్పుడు యధావిధిగ జన్మించి, సమకాలికులుగ వుందురు. అప్పుడప్పుడు విడివిడిగా గూడ జన్మింతురు. ఆయా జన్మలలో వారి వారి భార్య, బంధువులు, ఆయుర్ధాయము, జ్ఞానము ఒకే విధముగ ఇప్పుడున్నట్లే వుండును. 

కేవలము ఒక్క తత్వజ్ఞాని మాత్రమే, వికల్పములు లేక పరమ శాంతుడై సంతృప్తుడై బ్రహ్మ పదమును పొందును. జ్ఞాని సదేహముక్తుడైనను, విదేహముక్తుడైనను ఒకటియె. ఈ రెండు ముక్తులును భిన్నములు కావు. సదేహముక్తునకు విషయ భోగములున్నచో, విదేహముక్తుని కంటే, తక్కువగ నెంచుకొనవచ్చును. అయితే విషయ భోగమందు రసబోధ లేనందు వలన రెండును నిర్వాణముక్తి వంటివే. నీరు అలలుగా వున్నను, కదలకున్నను నీరు నీరే కదా! అలానే గాలి కదులుచున్నను, కదలకవున్నను గాలి గాలే కదా!.
"శ్రీమతిగారు! నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు, నా జీవితంలో ఒక భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేనీస్థితిలో ఉన్నానంటే దానికి నువ్వే కారణం. నువ్వు నా దేవతవి.
నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్.
నువ్వు చాలా మంచిదానివి నువ్వు నా దేవతవి"

"శ్రీవారూ! మీ SMS ఇప్పుడే చదివాను. ఆలస్యానికి మన్నించగలరు. తాగడం అయిందా,
ఇంక SMSలు ఆపి ఇంటికి వేంటనేి దయచేయండి.
ఇవాళ మిమ్మల్ని నేనేమీ అనదల్చుకోలేదు,
మీకిష్టమైన గోళీకాయంత బంగాళాదుంప ఫళంగా కరకరలాడే వేపుడు, చిన్ని వంకాయ కాయ ఫళంగా వుల్లికారం కూరా, పనసపొట్టు మసాలా కూర, మామిడికాయ పచ్చడి, కందిపప్పు పచ్చడి, సాంబార్, బెంగాల్ టైప్ తీయని గడ్డ పెరుగు మీ కోసం రెడీ..

అన్నట్లు చెప్పడం మరిచాను! మీ క్రెడిట్ కార్డ్ మీద నెక్లెస్ కొనుక్కున్నాను"