ఓం శ్రీరామ - శ్రీ మాత్రేనమ:
నేటి సూక్తి : ధ్యానం అంటే శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని పక్కన పెట్టడమే.
చిరంజీవుడైన శివభక్తుడు మార్కండేయుడు
ఫిబ్రవరి 4వ తేదీ శుక్రవారం మార్కండేయ జయంతి సందర్భంగా...
శివభక్తుల గురించి తల్చుకోగానే మార్కండేయుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది. పిల్లల్లో భగవంతుడి పట్ల విశ్వాసాన్నీ, అనుకున్నది సాధించడంలో చూపాల్సిన పట్టుదలనీ పెంచేందుకు మార్కండేయుడి కథను ఆదర్శంగా చెబుతారు. ఈ మాసాన ఆ మార్కండేయుని కథ మరొక్కసారి…
అనగనగా మృకండుడు అనే రుషి ఉండేవారు. మృకండుడు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట. అలాంటి మృకండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవన్నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే లోటు. వారికి పిల్లలు లేరు! సంతానభాగ్యం కోసం వారిద్దరూ వారణాశి క్షేత్రానికి చేరుకుని శివుని పూజించడం మొదలుపెట్టారు. ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు. కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో… `మీకు తప్పకుండా పుత్రసంతానాన్ని ప్రసాదిస్తాను. కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా?` అని అడిగాడు. `వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమేం, మాకు గుణవంతుడైన అల్పయుష్కుడే కావాలి` అని కోరుకున్నారు మృకండుని దంపతులు.
అచిరకాలంలోనే ఆ దంపతులకు వెలుగురేఖలాంటి ఓ బాలుడు కలిగాడు. మృకండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది. శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకలగుణాభిరాముడు! బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టాడు మార్కండేయుడు. మరో పక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు. ఇలా ఉండగా ఓసారి మృకండుని ఆశ్రమానికి సప్తరుషులు వచ్చారు. మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్షు తీరనుందని వారికి అర్థమైంది. మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్తరుషులు. మార్కండేయుని చూసిన బ్రహ్మ, అతడిని నిరంతరం శివారాధన చేస్తూండమని సూచించాడు. అందరూ కలిసి, శివనామస్మరణ చేత అకాలమృత్యవు దరిచేరదని మార్కండేయునికి తెలియచేశారు.
పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చుని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు. ఒకపక్క అతని మృత్యుఘడియలు సమీపిస్తున్నాయి. మరో పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు సరికదా ఒకో నిమిషం గడిచేకొద్దీ మరింత జోరుగా సాగుతోంది. యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయల్దేరారు యమభటులు. కానీ మార్కండేయుని తీసుకురావడం కాదు కదా! అతని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు యముడు. తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి, యమపాశాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు సాగిపోయాడు. `ఆ ధ్యానాన్ని ఆపి ఇవతలికి రా! నీ మృత్యువు సమీపించింది` అని హుంకరించాడు యముడు. కానీ యముని మాటలను విన్న మార్కండేయుడు ఇవతలికి రాలేదు సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు.
ఇక యమునికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆఖరి ఆస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు. కానీ మార్కండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు. తన మీదకీ, తన భక్తుని మీదకీ పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్కపెట్టున సంహరించాడు. ఆ సందర్భంలోనే శివునికి `కాలాంతకుడు` అనే బిరుడు వచ్చింది. అంటే కాలాన్ని/మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం. కానీ యుముడే లేకపోతే ఈ లోకంలో చావుపుట్టుల జీవనచక్రం ముందుకు సాగేదెలా! అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు. అయితే మార్కండేయుని జోలికి అతను ఇక రాకూడదనీ, ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదనీ హెచ్చరించి వదిలివేశాడు పరమేశ్వరుడు. ఈ ఘట్టం తమిళనాడులోని `తిరుక్కడయూర్` అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకం. కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి. మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా, అష్టాదశ పురాణాలలో ఒకటైన `మార్కండేయ పురాణా`న్ని కూడా రాశాడు. శివకేశవుల లీలలే కాకుండా దేవీమాహాత్మ్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది.
🚩ఈరోజుప్రత్యేకత --ప్రాంజలిప్రభ 🚩
ప్రాంజలి ప్రభ..నేటి పద్యాలు.. నవరత్నాలు, 04-02-2023
విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ
మనము రామానుజాచార్య మార్గ మెంచె
హిందువుల ఏక భక్తిగా హిమము నుంచె
వేయి వత్సర పండుగే వేల్పు నెంచె
బ్రాహ్మణ లు యజ్ఞము నుచేయ భక్తి నెంచె
పెద్ద విగ్రహప్రతిష్ట చేయ నెంచె ఈశ్వరా
*****
నిదుర పోవులే అలలన్ని నియమ మైన
మలుపు లుప్రేమ ఫలములు మనసు పైన
పూల కొరకు ఋతువులు లే పూజ కైన
ప్రతివిషయము విడ్డూరమే ప్రీతి యైన
పగలు రాత్రి యే నిలకడ ప్రేమ కథ లె ఈశ్వరా
****
గృడ్డిగా నమ్మటము వద్దు గుణము వుంచు
యోగ అభ్యాస విద్యతో యొచన పెంచు
వినయ మనసు స్వేచ్ఛ పలుకు నిత్య మెంచు
మనలొ కర్తవ్య ము స్థితి మాట నెంచు
పరిచయము కాని వక్తియే ప్రేమ పంచె ఈశ్వరా
*****
ఎవరి కైననూ కావాలి ఏమి యైన
చలి లొ వెచ్చని కౌగిలి జయము యైన
చీకటి నడక చూపేది వెలుగు యైన
చూపులతొ తోడు చీకటి వెలుగు యైన
అసలు సిసలు ఏమి అనక ఆశ తోడు ఈశ్వరా
****""""***
స్ధిరసుఖాసనం ధ్యానాన్కి సత్య నిధియె
వత్తిడి శరీర ధ్యాసయే వచ్చు మదియె
శ్వాస ఉత్సాస నిశ్చాస సరళ విధియె
తృప్తి భావ ప్రశాంతతే నిజము తిధియె
షరతు, స్త్రీ సుఖం అయిననూ సహజ ప్రేమ ఈశ్వరా
****"
కనబడని గాలి ప్రాణాన్ని కలసి నిలుపు
తెలియనిది ప్రేమ మనసుతో కలసి నిలుపు
తెలియకనె తీరు తాపమూ తలపు వలపు
నీరు ఆవిరి మేఘమై నీరు కలుపు
నిప్పుతోకూడు బూడదై నేల చేరు ఈశ్వరా
****"
మూర్ఖ మనసుయే గంభీర్య మూస ఎపుడు
సజ్జన పలుకు చల్లగా సాగు ఎపుడు
స్త్రీ లు ఆడంబరముచట్టు తిరుగు ఎపుడు
వెతుకు సన్మార్గముయె దైవమేను ఎపుడు
మనిషి మనిషి కి గౌరవం మమత ప్రేమ ఈశ్వరా
"""*
దత్తపది.......జపాను, జర్మనీ, జమైక, జాంబియ
ఇఛ్ఛ వల్లనే జనుల జపాను జయము
జర్మని కళలు జనుల స్వచ్ఛతయె జయము
స్నేహతొ జన జమైకయే సేవ జయము
జాంబియ జనుల ప్రేమయే జాతి జయము
****
సందేశవాక్యం
లోకుల తప్పులెంచు మేధావులెందరో ?
తమ తప్పు తెల్సే జ్ఞానిలేడిలలో !
తప్పు లెంచు మేధావికే తపన పెరుగు
తప్పు చేయని వాడైన తపన పెరుగు
తప్పు తెలియక తప్పునే చేసి తిరుగు
తప్పు తనదాక రాలేదు అనుచు పరుగు
జ్ఞాని అజ్ఞాని తప్పుగమనించి బ్రతుకు ఈశ్వరా
0
ఆరోగ్యం బ్రహ్మ..ఆనందం బ్రహ్మ.. ఆధ్యాత్మిక బ్రహ్మ
మల్లాప్రగడ రామకృష్ణ
*వెంట రాని ఆస్తులు చూసి* *విర్రవీగకోయి!!*
*కృశించుకుపోయే శరీరాన్ని చూసి**మురిసిపోకోయి!!*
*కడవరకు కలిసినడవని బంధాలకు* *బానిసవ్వకోయి!!*
*పదవీ, హోదా ఉన్నాయని ఎగిరెగిరి* *పడకోయి!!*
*తరిగిపోయే అందాన్ని చూసుకొని* *పొంగిపోకోయి!!*
*మంచితనమే శాశ్వతమనే సత్యాన్ని* *మరచిపోకోయి!!*
*కదిలిపోయే కాలంలో ఏది శాశ్వతం కాదని**తెలుసుకోవోయి!!*
*మరణం అనివార్యమనే నిజాన్ని గ్రహించి* *మసలుకోవోయి!!*
*డబ్బులు ఉన్నాయని విర్రవీగి గబ్బు పనులు* *చేయకోయి!!* *విలువైన జీవితం గడపాలని విలువలు దిగజారి బతకకోయి!!* *ఉన్నదాంట్లో సాయం చేయడం మనిషితత్వమని*
*అర్ధం చేసుకోవోయి!!ధర్మాన్ని విస్మరించకోయి దరిద్రాన్ని మూటకట్టుకోకోయి!!
దేవుని స్మరించవోయి ధన్యుడవు కావోయి!!
0
మాతృశ్రీ వందనం
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ
నాగుల మల్లెలు ప్రతికలవుతూ
వాసన పుష్పాలు ప్రతిభలవుతూ
వేసవి గాలులు ప్రగతి లవుతూ
కాలపు గానము ప్రతిజ్ఞ లవుతూ
విలువలు పెంచె నడవడి జగతికి
మనసును పంచె మగువకు గడబిడి
తరుణము చూపి పలికెడి పలుకులు
వినయము చూపి చిలికెడి చినుకులు
తప్పక జరిపే కార్య నిర్వాహణకు
ఒప్పియు కదిలే సౌర్య పరాక్రమము
గోప్యమువలనే ఆర్యనిర్వాహణకు
శాంతము తెలిపే మాతృశ్రీ నిర్ణయము
ఉన్నచోటు ఉంటే విజ్ఞానం తెలియదు
అన్నచోటు పోతే అజ్ఞానము తెలియదు
కన్నచోటు పోతే గుర్తింపుయు తెలియదు
మొన్ననేమి లేకే మర్యాదయు తెలియదు
--(())--
శ్లోకం::- దేవో దత్తో మర్త్యజన్మోపి దత్త స్తిర్యంగ్ దత్తః కీటకీటోపి దత్తః!
స్థాణుర్దత్తో జంగమో దత్త ఏవ సర్వో దత్తః సర్వరూపస్త్వరూపః ॥
భావం::- ఈ శ్లోకంలో పూజ్యశ్రీ రంగావధూత గారు చాలా ఆలోచనాత్మకంగా, సర్వవ్యాప్తమైన దత్తాత్రేయ నిరాకార తత్వాన్ని అనేక మార్గాలలో వివరించారు
దత్త స్వామికి ఆత్మ సమర్పణ చేసుకోవాలని వివరిస్తున్న స్వామి వారు, దత్తాత్రేయ స్వామి ఎలా వుంటారో బోధిస్తున్నారు. దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపం. భగవతి అనసూయ తపస్సు ప్రభావంతో త్రిమూర్తులు చిన్నపిల్లలయినారు. కుమారుడిని పోషించాలని వున్నదనే ప్రార్థన అంగీకరించిన త్రిమూర్తులు, స్వయంగా దత్తం అయినారు. ఈ విధంగా దేవుడే మానవాకారంలో జన్మించారు. మనుషులలోను, పశు పక్ష్యాదులలోను, కీటకాలలోను, పర్వతాలలోను, అడవిలో తిరిగే జంతువులలోను పరమాత్మ వ్యాపించి వున్నాడు. ఈ ప్రపంచంలోని అన్ని నామ రూపాలలోనూ దాగి వున్నాడు. అన్నిటిలో ఆ భగవంతుని దివ్య శక్తి నిండి వుంది. చరాచర ప్రపంచంలో ఆయన లేని స్థానం లేదు. రంగావధూత గారు తమ దగ్గరకు వచ్చిన గంజాయి తాగే సన్యాసులలో కూడా మంచి చూశారు. ప్రతి ఒక్కరిలో కొన్ని మంచి లక్షణాలు వుంటాయి. దత్తాత్రేయ స్వామి పిల్లలలో, వేశ్యలలో, ఆకతాయి మనుషులలో మొదలగు వారిలో ఏదో ఒక మంచి చూశారు. వారిని తమ 24 మంది గురువులుగా అనుకున్నారు.
ఈ శ్లోకం దానినే ధృవీకరిస్తున్నది. అందుకే మన దృష్టి మార్చుకుని, ఈ మాయ వెనుక ఉన్న పరబ్రహ్మను గుర్తించమని స్వామి వారు చెప్తున్నారు. మనము ఎటువంటి కర్మలు చేసినా సర్వత్రా వ్యాపించి వున్న ఆ పరబ్రహ్మ తప్పక చూస్తూవుంటాడు అనే దృష్టి అలవరచుకోవాలి.
ఒకసారి ఇటువంటి దృష్టి అలవాటైతే సుఖశాంతులు లభిస్తాయి. ఈ విధంగా అనేక కోణాలనుంచి దత్తాత్రేయ నిరాకార తత్వాన్ని శ్రీ రంగావధూత గారు మనకు వివరిస్తున్నారు.
రచన:::శ్రీ రంగావధూత
తెలుగు::రాజ్యలక్ష్మి శ్రీనివాస బొడ్డుపల్లి.
*****
ఆరోగ్యం బ్రహ్మ... ఆనందం బ్రహ్మ.. ఆధ్యాత్మిక బ్రహ్మ
ఒకసారి ధర్మరాజు తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయించి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు.
కృష్ణా! మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాము. నువ్వు కూడా రావాలి. అన్నాడు. నాకు ఇక్కడ అనేక వ్యవహారాలతో తీరిక లేకుండా ఉంది రావడం కుదరదు. మీరు వెళ్ళండి అన్నాడు శ్రీకృష్ణుడు.
లేదు కృష్ణ నువ్ రావలసిందే అన్నాడు ధర్మరాజు. కుదరదంటే కుదరదు అన్నాడు శ్రీకృష్ణుడు. పట్టువదలకుండా అడుగుతూ ఉంటే.. సరే నేనైతే రావడం కుదరదు. నా ప్రతినిధిని పంపుతాను అంటే చేసేదిలేక ధర్మరాజు సరేనన్నాడు.
వెంటనే శ్రీకృష్ణుడు ఓ సొరకాయ తెచ్చి దశర్మరాజుకి ఇచ్చి "ఇది స్వయంగా నేనే అనుకో. నాకు ఎలాంటి మర్యాదలు చేస్తావో అలాగే దీనికి చెయ్. ఏ తీర్థంలో మునిగినా దీన్ని కూడా పిలక వరకు మంచు. ఏ దేవతా దర్శనం చేసినా దీనికి చేయించు అని చెప్పి పంపాడు. అలాగేనని దానికి ఓ పల్లకీ ఏర్పాటు చేసి సకల లాంఛనాలతో ఊరేగిస్తూ తీసుకెళ్లాడు. తీర్థయాత్రలు అన్నీ తిప్పి తిరిగి శ్రీకృష్ణుడు వద్దకి ఆ సొరకాయ తీసుకొచ్చి శ్రీకృష్ణా ఇదిగో సొరకాయ. అని ఇచ్చాడు.. అప్పుడు శ్రీకృష్ణుడు
ధర్మరాజా! అన్ని తీర్థాలలో ముంచావా? ముంచాను. అన్ని దేవతా దర్శనాలు చేయించావా? చేయించాను. నాగోత్రం ప్రవర చెప్పావా? చెప్పాను. సరే.. తీర్థయాత్రలు చేసొచ్చాక సమరాధన చేయడం ఆనవాయితీ కనుక దీన్ని తీసుకెళ్లి కూర వండించి అందరికి ఆ భోజనాలలో పెట్టు అన్నాడు. అలాగేనని సొరకాయ తీసుకెళ్లి చక్కగా ముక్కలు కోసి కూర వండి అందరికీ భోజనం పెట్టాడు. ఒక్కముద్ద నోట్లో పెట్టుకున్నారో లేదో అందరూ వాంతులు చేసుకున్నారు. ధర్మరాజ ఏమిటి ఈ కూర ఇంత చేదుగా ఉంది. అనేసరికి ధర్మరాజుకి కంగారు పుట్టి శ్రీకృష్ణుడి దగ్గరికి పరిగెత్తుకెళ్లి కృష్ణా! కొంప మునిగింది. సొరకాయ చేదుగా ఉందట. అందరూ వాంతులు చేసుకుంటున్నారు అన్నాడు.
ధర్మరాజా! ఆ సొరకాయ చేదుగా ఉందని నాకు ముందే తెలుసు. తెలుసా! తెలిసి ఎలా ఇచ్చావ్ కృష్ణ. కాశి దర్శించి, గంగలో మునిగి, అనేక క్షేత్రాలను దర్శిస్తే చేదు పోతుందని అనుకున్నాను. పోలేదు అనేసరికి అవాక్కయ్యారు ధర్మరాజు.
అంతరార్థం! మనం ఎన్ని క్షేత్రాలు సందర్శించిన, అనేక తీర్థాలలో మునిగినా గుణం మారిందా లేదా అనేది గమనించాలి. గుణం మారనప్పుడు ఎన్ని తిరిగి ఏమి లాభం. అన్ని వృథానే. ప్రవచనాలు విన్నా, క్షేత్రాలు దర్శించిన, తీర్థాలు సేవించినా మనషి నడవడిక లో కొంతైనా మార్పు రావాలి, కనీసం ఆ మార్పుకోసం ఒక్క అడుగైనా పడాలి. ఆ మార్పు రానప్పుడు ఎన్ని క్షేత్రాలు తిరిగిన ఎందుకు. సమయం వృథా తప్ప..
"ఆత్మశుధ్ధిలేని ఆచారమదియేల
భాండశుధ్ధిలేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా
విశ్వదాభిరామ వినురవేమ"
🙏జై శ్రీమన్నారాయణ🙏
****
ఓకే చిన్న కధ
అనగనగా ఓ రాముడు. అతని తమ్ముడు సోముడు. పెద్దాడికి ఆరేళ్ళు. సిన్నోడికి నాలుగేళ్ళు. వెరసి వారిద్దరి అల్లరికి మాత్రం పదేళ్ళు. సరే. ఓ పండగేదో తరుముకు వచ్చేసింది. పెద్దాడికి సరదా చేసుకోవాలనిపించి వాళ్ళమ్మ దగ్గర గునిసేడు. ఆవిడ అండికి సిఫార్సు చేసింది. (పెనిమిటులను అలాగే పిలవాలంట..గా) ఆయన మొదట ఠాఠ్ అన్నాడు. పిల్లాడు లంకించుకున్నాడు. వాడెందుకేడుస్తున్నాడో తెలియకపోయినా తనూ యాడవాలి కదా అనుకునీసి సోమడు కూడా గొంతు కలిపాడు. తిక్క రేగిన పెద్దాయన విసురుగా బైటకు పోయాడు. కాపీ అయినా తాగలేదే అనుకుంటూ అమ్మ పిల్లలిద్దరినీ గదమాయించి వంటింటోకి నడిచింది.
అన్నదమ్ములిద్దరూ చేసేది లేక అప్పటికి ఏడుపాపేసి, చానెల్లో పడ్డారు. ఓ గంటా రెండు గటలు గడిచాక పిల్లను అన్నాలకు లేవమంది. లేవలేదు. తనే బొచ్చెలు(బౌల్సు) పట్టుకొచ్చింది. యట్టాగో ఇద్దరి నోళ్లలో చెరో చించా కూరింది. ఇంతలో తలుపు చప్పుడు. ఆగకుండా బెల్లు. గబగబ హాల్లోకి తలుపు తీసిన ఆమె విస్మయంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. లోపలకు రానీవా అంటున్న నాన్న గొంతు వింటూనే స్పైడర్ మాన్ కంటే వేగంగా దూసుకు వచ్చేరు పిల్లలిద్దరూ...
చేతిలో పెద్ద ప్యాకెటటుతో ఉస్సురంటూ లోపలకు అడుగు పెట్టాడు రాజుగారు(అన్నట్లూ సదరు అండి పేరే రాజు, అమ్మ పేరు రాణియే). ప్యాకెటుపైకి దూకపోయిన పిల్లలను బౌల్ ఖాళీ చేయాల్సిందేనంటూ గద్దించి భర్తకు మంచినీళ్ళివ్వడానికి లోపలకు నడిచిందావిడ. భోజనాలు పూర్తి కాగానే ఆయనే తొందర పెట్టాడు ప్యాకెట్ తెమ్మని. అంతా వరండాలోకి చేరారు. ఈసారి విస్తుబోవడం పిల్లల వంతయింది.
ఎందుకటా....
ప్యాకెట్లో ఉన్నవి ఏకే ఫార్టీ సెవెనూ, ఉల్లిపాయలూ వగయిరాలే...
సరే వాటినీ, అంతకు ముందెప్పుడో ఓ పదేను మాసాల కిందట చేసిన మతాబాలూ, ఆనాడే కాల్చగా మిగిలిన మతాబాలూ గట్రాలను కూడా కలిపి పెరట్లో నవారు మంచంపై దుప్పటి పరిచి వీటిని దానిపై పరిచి అంతా లోపలకు వెళ్లారు. అలా ఓ రెండ్రోజులు చేసారు. మరి చాలా పాతవి కదా అందుకూ...
సరే. పండగొచ్చింది. అన్నీ పేలాయి. కానీ...కానీ...కానీ...
వొహటి మాత్రం తుస్సు మంది. ఇహ మొదలూ...
టపా కాయా టపా కాయా ఎందుకు ప్లలేదూ గడ్డి మోపు అడ్డమొచ్చింది...
గడ్డి మోపా గడ్డిమోపా ఎందుకు అడ్డం వొచ్చావూ ఆవు తినలేదు అవా ఆవా ఎందుకు తినలేదూ...
బా... మ్ ... మ ... పె ... ట్ ... ట ... లే ... దూ (పాపం నీర్సంగా ఉందాయే) బామ్మోయ్...
ఛఠస్. వింటున్నాలే అరవబాక. అసలే తమ్ము ఏడుస్తుంటే సోమిగా ఎందుకురా ఏడుస్తున్నావూ...
ఉల్లిపాయలైపోయాయా...
కాదూ, కు ..... క్క .... క .... రి .... చిం .... దీ...
టామీ టామీ నీకేం పుట్టిందే వాడినెందుక్కరిచావూ...
వాడికే పుట్టింది...
నాకు తోక పుచ్చుకు లాగాడు యదవ...
హమ్మ...హుష్...(గమనిక...
ఇందులోని నీతి మాత్రమే ప్రధానం. లాజిక్కులు వద్దని మనవి...)
మరోమాట...
ఇదేదో పాత కథకు పాలిషులా ఉందే అనుకుంటే మీ మాటే రైటూ...
****
No comments:
Post a Comment