Saturday, 12 February 2022

సోమవారం కథలు (ప్రేమికుల రోజు)

 



2.31 (ముప్పది ఒకటవ శ్లోకము)


తేనాత్మనాత్మానముపైతి శాంతం ఆనందమానందమయోఽవసానే|

ఏతాం గతిం భాగవతీం గతో యః స వై పునర్నేహ విషజ్జతేఽంగ॥877॥

పరీక్షిన్మహారాజా! మహాప్రళయ కాలమునందు ప్రకృతిరూపమైన ఆవరణముగూడ లయమగుటతో ఆ యోగి చివరకు స్వయముగా ఆనంద స్వరూపుడగును. ఇట్లు భాగవతీగతిని (అర్చిరాది మార్గమును) పొందిన జీవుడు మరల ఈ లోకమునకు తిరిగి రాడు.

2.32 (ముప్పది రెండవ శ్లోకము)

ఏతే సృతీ తే నృప వేదగీతే త్వయాభిపృష్టే హ సనాతనే చ|

యే వై పురా బ్రహ్మణ ఆహ పృష్టః ఆరాధితో భగవాన్ వాసుదేవః॥878॥

మహారాజా! సద్యోముక్తి, క్రమముక్తి అను ఈ రెండు మార్గములును వేదములయందు ప్రస్తావింపబడినవి. ఈ రెండును సనాతన మార్గములే. వీటిని గూర్చియే నీవు అడిగియుంటివి. పూర్వము బ్రహ్మదేవుడు గూడ వాసుదేవుని ఆరాధించి, ఈ ప్రశ్ననే అడిగియుండగా ఆ పరమాత్మ చెప్పిన సమాధానమే ఇది.

2.33 (ముప్పది మూడవ శ్లోకము)

న హృతోఽన్యః శివః పంథా విశతః సంసృతావిహ|

వాసుదేవే భగవతి భక్తియోగో యతో భవేత్॥879॥

సంసార చక్రమునందు పరిభ్రమించు చుండునట్టి మానవులకు భక్థిమార్గము దప్ప సులభమైన మరియొక మార్గమేదియును లేదు. ఇది సకల శుభములను ప్రసాదించునట్టిది.

2.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

భగవాన్ బ్రహ్మకార్త్స్న్యేన త్రిరన్వీక్ష్య మనీషయా|

తదధ్యవస్యత్ కూటస్థో రతిరాత్మన్ యతో భవేత్॥880॥

బ్రహ్మదేవుడు ఏకాగ్రచిత్తముతో మూడు పర్యాయములు పరిశీలనము చేసిన పిమ్మట సర్వాత్మయైన శ్రీకృష్ణభగవానుని యెడ అనన్యభక్తినికలిగియుంటయే సర్వశ్రేష్ఠమైన ధర్మము అను నిశ్చయమును ప్రకటించియుండెను.

2.35 (ముప్పది ఐదవ శ్లోకము)

భగవాన్ సర్వభూతేషు లక్షితః స్వాత్మనా హరిః|

దృశ్చైర్బుద్ధ్యాదిభిర్ద్రష్టా లక్షణైరనుమాపకైః॥881॥

భగవంతుడే సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడు. ఈ దృశ్యమాన ప్రపంచము అంతయును పరమాత్మస్వరూపమే. దానికి ద్రష్టయు అతడే అని అనుభవ పూర్వకముగా నిశ్చయించుకొనినవాడు పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. 

2.36 (ముప్పది ఆరవ శ్లోకము)

తస్మాత్సర్వాత్మనా రాజన్ హరిః సర్వత్ర సర్వదా| 

శ్రోతస్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ నృణామ్॥882॥

మహారాజా! సకలప్రాణులలో ఆ భగవంతుడే అంతర్యామిగా ఉన్నాడు. కనుక మానవులు త్రికరణ శుద్ధిగా ఆయన కథలనే సర్వదా వినుచుండవలెను. ఆయన గుణరూపవైభవములనే కీర్తించుచుండవలెను. ఆయన నామములనే  మననము చేయుచుండవలెను. ఆయనయొక్క దివ్యస్వరూపమునే ధ్యానించుచుండవలెను. మానవులకు ఇదియే శుభప్రదము-సర్వశ్రేష్ఠము ఐన ఉపాయము.

2.37 (ముప్పది ఏడవ శ్లోకము)

పిబంతి యే భగవత ఆత్ననస్సతాం కథామృతం శ్రవణపుటేషు సంధృతమ్|

పునంతి తే విషయవిదూషితాశయం వ్రజంతి తచ్చరణసరోరుహాంతికమ్॥883॥

మహారాజా! శ్రీమహావిష్ణువు సకలప్రాణులకును అంతరాత్మ. అట్టి సత్పురుషులు భగవంతుని కథామృతమును లోకులకు పంచిపెట్టుచుందురు. ఆ సాధుపుంగవుల ముఖారవిందముల నుండి జాలువారిన ఆ కథామకరందమును జనులు తమ శ్రవణపుటములద్వారా (చెవులనెడి దొన్నెలద్వారా) శ్రద్ధాదరములతో గ్రోలవలెను. అప్పుడువిషయసుఖములచే దూషితములైన వారి మనస్సులు పూర్తిగా నిర్మలములగును. ఫలితముగా వారికి శ్రీకృష్ణపరమాత్మ యొక్క పాదపద్మముల సన్నిధి ప్రాప్తించును. అందువలన ఎల్లరును భగవంతుని యెడ అనన్యభక్తిని కలిగియుండవలెన.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే ద్వితీయోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత పురాణమునందలి ద్వితీయస్కంధమునందు రెండవ అధ్యాయము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*****

స్పర కరుణతో సహకార సంఘ ప్రేమ
సురచిర శుభకర సిరితో సూత్ర ప్రేమ
మెరయ సరస చిరఫల మై మోజు ప్రేమ
సరసిజ వసన వలపులే సమర ప్రేమ
శరణకృతులు తెలుపుచునే శక్తి ప్రేమ ఈశ్వరీ

నిలకడ కళ ప్రేమ నిజము తెలుపు
చూపులలొ నిస్వార్ధము గను పిలుపు
మౌనముగను ప్రేమ మమత మలుపు
అక్కరగను ప్రేమ అసలు అదుపు 
ప్రేమ యుద్ధ మయ్యె ప్రేమ వలపు ఈశ్వరీ

స్వచ్ఛ మైన ప్రేమ స్వేచ్చ కోరు
ప్రేమ తొ మన సృష్టి ప్రేమ చేరు
ప్రేమ యేఅనిర్వచనము తీరు
మమతతొ కలయి కలె మనసు పేరు 
అఖిల మైనదియును అమర ప్రేమ ఈశ్వరీ

ఖర్చు ఎవరు చెప్పు ఖర్చు చేరు
ఖర్చు జీవి తమ్ము  ఖర్చు పేరు
ఖర్చు శ్రమ అగుట ఖర్చు వేరు
ఖర్చు అసలు ఏది ఖర్చు నీరు
ఖర్చు వృద్ధి ప్రశ్న ఖర్చు మీరు ఈశ్వరీ

న్యస్తాక్షరి........ వ్యా, లం, టై, ను

పద్య పాదాదిన  పై అక్షరాలు రావాలి.
వ్యాకరణముయే జీవితం వ్యాధి లాగ 
లంఖణములన్ని బ్రతుకులో లాస్యమేను       
టైము బట్టియే బ్రతకాలి టైటు వద్దు 
నురుగుల పరుగు కడలిలో నమ్మ వచ్చు   

నేటి సందేశ వాక్యం 
ధర్మాన్ని - పాటిస్తే దేవుడు 
తప్పితే రాక్షసుడు తెల్సి తప్పినోడు మనిషి !

ధర్మ మార్గము నడిచినా ధరణి దేవ
తప్పితే రాక్షసప్రవృత్తి తపన దేవ  
తెల్సి నిజమను గ్రాహ్యము తెల్పు దేవ 
తప్పు త్రోవఁతొక్కిన దండ తనము దేవ 

ఆమె కుటుంబం చెట్టు
బంధాల కొమ్మలే ఆమె చుట్టూ!
మాతృత్వ వరం సృష్టికి సారధ్యం!!

చెట్టు ఒక కుటుంబము ఆశ చీడగాను 
ఆకు పువ్వు కాయలు బంధ ఆశగాను  
సృష్టి సారధ్య సంపద సంఘ మేను 
స్త్రీలు తరువులై సహనము సేవగాను
0   

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

ముద్దు ముద్దుగా ముద్దంటావు
ముద్దు లోనే మత్తంటావు 
పెట్ట బోతే వొద్దు వద్దంటావు

అలల ముద్దు తీరానికి
కలలు ముద్దు మోనానికి
చినుకు ముద్దు పుడమికి
పంచభూతాల ముద్దు మనిషికి

మేఘానికి గాలి ముద్దు
మెరుపులకు పిడుగు ముద్దు
కలువకు చంద్రుడు ముద్దు
పద్మాలకు సూర్యుడు ముద్దు

మంచుకు అగ్ని ముద్దు
షోడాకు గోళి ముద్దు
కాలానికి సమయం ముద్దు
వెన్నెల నీడకు ముద్దు

పెళ్ళైన కొత్తలో ముద్దులే ముద్దులు
హద్దులు చెప్పక పంచేటిముద్దులు
చిలకా గోరింక సరస ముద్దులు
క్రౌంచ పక్షుల మదనపు ముద్దులు

ప్రేమికుల చుంబనాలు
మర్చి పోలేని గుర్తులు
మనసు దోచే ప్రేమలు
కలలు తీర్చుకొనే దారులు

ముద్దులే ముద్దులు
లేనే లేవు హద్దులు
లెక్కకు రాని పద్దులు
ముద్దు పొందేటి ప్రేమికులు

మెదడు ఆలోచనాలన్ని మాను లాగ
విద్య మెదడుకు వ్యాపకం వెన్న లాగ
పల్కులన్నియు మెదడుకు ప్రభలు లాగ
ప్రశ్న కు జవాబు మెదడు తృప్తి లాగ
స్త్రీ పురుషుని కలిపే ముద్దు లాగ

*****

సీస పద్యం..ప్రేమ (ప్రేమికుల రోజు)

లక్ష్మి యై నిజసే‌వ లాలనే పాలనై
కలిమాయ చిక్కిన భామ ప్రేమ
ప్రేమయాట తెలిపే ప్రేమచూపులుగాను
బృందావనమ్మేమొ బృంద ప్రేమ
మదిలో పులకరింత మధుమాస పిలుపుగా
కెటుల తెలియ దని కలయు ప్రేమ
నగవు మెరయుచుండె నమ్మిన ట్టి పిలుపే
నటన కాదు మనసు నమ్ము ప్రేమ

గున్న మామిగుబురులోన గుర్తు ప్రేమ
సేద తీరువేళ శుభము దీక్ష ప్రేమ
పూల పరిమళాలతొ గంధ పూత ప్రేమ
వివర మంత ప్రేమికుల తో పిచ్చి ప్రేమ
***""""**
అమ్మ నాన్నల లోను ఆశయం ప్రేమగా
తొలినాటి ముచ్చట్లె తెలుపు ప్రేమ
అణువణువులోన ఆరాధ్య ప్రేమగా
చంటి బిడ్డకు చెప్పు చరిత ప్రేమ
గువ్వ గోరింకలై గమ్యమ్ము ప్రేమగా
పుడమిన పంచేటి భక్తి ప్రేమ
హృదయంలొ ఆత్మగా హృదయమై ప్రేమగా
ఘడియ ఘడియ సేవ ఘనత ప్రేమ

ఊహ కందని భావమై ఉండు ప్రేమ
భర్తని మురిపించె మనసు భ్రాంతి ప్రేమ
చెలిమి పంచియు చేయూత చెలియ ప్రేమ
సేవలో తరించు సతిగానె సరయు ప్రేమ
___((()))____

ప్రేమికుల దినోత్సవం సందర్భముగా

మనో మయాసహాయ మే
సదా స్మరించు ప్రేమ యే
మదమ్ము కాదురా ఇదీ
పదార్చనల్ గ్రహింప రా

గతమ్ము మార్చిచూడరా
స్థిరమ్ము యైనదేనురా
స్థితమ్ము గోరుచుంటిరా
మతమ్ము అడ్డులేదురా

చలించు నంతరంగమే
ఫలించు ప్రేమ పంతమే
జ్వలించు దీర్ఘదాహమే
తలంపు నీదినాదిరా

ప్రియమ్ము నీకు ఆశయం
ప్రియము నీకు తన్మయం
ప్రియమ్ము నీకు నిర్ణయం
ప్రియము నీకు సాహసం

క్రమమ్ము దప్ఫ కుందురా
సమమ్ము సేవ నీకు రా
నమస్కరమ్ము నీకు రా
తపమ్ము వద్దు నీవురా

రవమ్ము వెల్గురా ఇదీ
జపమ్ము నాన్యతే ఇదీ
కలమ్ము వ్రాతయే ఇదీ
సుశాంతి ప్రేమయే ఇదీ

ద్విపదమాల-- మనిషిలో పరుగు దేనికి ?

ఆకలి మంటల వల్లనే మనిషి
లోకము నంతయు తిట్టుటే పరుగు 

వీళ్ళ ఆ నవ్వులు చూసియే మనిషి
వళ్ళ ను లే కళ్ళ నులే క పరుగు 

సాటి వారే చూడ కెగతాళి మనిషి
నేటి తరము యేను ఇంతేను పరుగు 

గొంగలి పురుగు ల్లాగనువుండె మనిషి
రోగము వేషము పలుకులే పరుగు 

బానిసలను గనే భావిస్తు మనిషి
వాణిని వినిపిస్తు కళలుతో పరుగు  

శూన్యం లొ నెట్టియు గొప్పలు మనిషి
మాన్య మహోదయ ఎగతాళి పరుగు 

బండ బారిన మనసు కల యే మనిషి
అండ లేక యె బావు టాగను పరుగు

రేపటి దుష్టబుద్ధికి ప్రేమ మనిషి
కోపమంతయు చూపి అరుపులతో పరుగు

సుద్ధిగా సమదృష్టి లేకయే మనిషి
బుద్ధిగా బ్రతకలేక కడలి పరుగు

ప్రశ్నలు వర్షమై కురిసే ను మనిషి
ప్రశ్న ప్రమాదము తోనులే పరుగు

ఎట్టి జవాబును లేకయే మనిషి
వట్టి మాటలు వల్లనే పరుగు

మీసాన్ని మెలివేసి రోషంతొ మనిషి
మోసాన్ని చేసియు పరుగులే పరుగు 

లోకంలో  మంచిగ్రహించని మనిషి  
లోకంతొ నాకేంటి పనియని పరుగు
*****
0

సప్త జ్ఞాన భూమికలు.....

సూర్యుడి నుండి వచ్చే ఏడు కిరణాలు ను సప్త జ్ఞాన భూమికలు అంటారు...

జ్ఞానంలో ఏడు స్థితులున్నాయి. వీటిని సప్త జ్ఞాన భూమికలు అంటాం...

1) శుభేచ్ఛ
2) విచారణ
3) తనుమానసం
4) సత్త్వాపత్తి
5) అసంసక్తి
6) పదార్ధభావని
7) తురీయం

..అన్నవే సప్త జ్ఞాన భూమికలు.

1) శుభేచ్ఛ...

నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష.

2) విచారణ...

బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి.. అన్న మీమాంస "బ్రహ్మజ్ఞాన" ప్రాప్తి విధానమే.. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం.

3) తనుమానసం...

ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. అంటే, ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే "తనుమానసం"

4) సత్త్వాపత్తి...

శుద్ధసాత్త్వికం సాధించడమే సత్త్వాపత్తి, అంటే తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. ఇక మిగిలింది శుద్ధ సాత్త్వికమే...

      "తమోగుణం" అంటే సోమరితనం, 
      "రజోగుణం" అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం.

ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్రస్థాయి నందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీమండలం పూర్తిగా శుద్ధమైన స్థితి; మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే యోగి అయిన స్థితి. అహం బ్రహ్మాస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. బ్రహ్మవిదుడు అయిన స్థితి.

5) అసంసక్తి...

దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు, మరి సంసారం, రెండూ తాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెంటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే అసంసక్తి. దీన్నే పద్మపత్రమివాంభసా అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి వున్నా, ధర్మ-నిష్టుడు, మరి కర్మ – నిష్టుడు; తనువు పట్లా, మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, సత్యద్రష్ట కాబోతున్నాడు కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినివాడు. ఇదే అసంసక్తి. ఇతనినే బ్రహ్మవిద్వరుడు అంటాం.

6) పదార్ధభావని...

అంటే దివ్య చక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు. ప్రతి పదం యొక్క అర్ధంలో, ప్రతి వస్తువు యొక్క భావంలో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే బ్రహ్మవిద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి; ఇదే సవికల్ప సమాధిస్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా, సంశయాలు వున్న స్థితి.

7) తురీయం...

ఇది మానవుని యొక్క పూర్ణవికాసస్థితి, సిద్ధుడు బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకొని, తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై వున్నవాళ్ళనే "బుద్ధుడు" అంటాం. ఇదే "సహస్రదళకమలం".

ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచినప్పుడల్లా "సహస్రదళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది". ఇతనినే బ్రహ్మ విద్వరిష్టుడు అంటాం.

 "తురీయం" అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. తురీయ అంటే మూడింటినీ దాటిన అని అర్థం. అంటే నిర్వికల్పసమాధి స్థితి కి చేరుకున్న స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి.
💐🙏

మాటలు......

లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేది లేదు.. అత్యంత విలువైన బ్రాండ్ కారు నా ఇంటి గేరేజ్ లో వుంది. నేను 

చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను. 

విలువైన వస్త్రాలు, విలువైన అలంకార సాధనాలు, విలువైన రకరకాల పాద రక్షలు 

అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి వున్నాయి. కాని ఆస్పత్రిలో వారు ఇచ్చిన

చిన్న గౌన్ వేసుకుని వున్నాను.నా బ్యాంకు అక్కౌంట్ లో డబ్బు చాలానే వుంది. కాని నాకు ఏది వుపయోగం లేదు. నా ఇల్లు ఒక రాజభవనం లా వుంది కాని నేను ఆస్పత్రిలో  ఒక

చిన్న  పడక మీద వున్నాను. ప్రపంచంలో వున్న ఫైవ్ స్టార్  హోటల్స్ అన్నింటికి  ప్రయాణం చేసేదాన్ని. ఆస్పత్రిలో ఆ టెస్టు కి  యీటెస్ట్ కి లేబ్ లుకి మారి మారి వెడుతున్నాను. 

ఆనాడు నిత్యం శిరోజాలంకరణలవారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు.  ఈనాడు నాకు శిరసు పై శిరోజాలే లేవు.

ప్రసిద్ధి చెందిన హోటల్స్ లోని ఆహారం తింటూ వుండేదానిని. కాని ఈనాడు పగలు రెండు మాత్రలు, రాత్రి ఒక చిటికెడు ఉప్పు ...

ప్రత్యేక జెట్ విమానాల్లో

ప్రపంచం అంతా తిరిగేదాన్ని. కాని నేడు ఆస్పత్రి వరండా దాకా  వెళ్ళడానికి ఇద్దరు అటెండర్ లు సాయం చేస్తున్నారు. ఏ సంపదా,

వసతులు ఏవీ నాకు సహాయ పడలేదు.

ఏ విధమైన ఓదార్పునివ్వలేదు. సహాయపడలేదు. 

కాని కొంతమంది ఆత్మీయుల  ఆత్మీయత, ఆప్యాయత,వారి ప్రార్ధనలు..నాకు జీవం పోస్తున్నాయి. 

ఇంతేనండి యీ జీవతం..

ఎవరికి సహాయం చేయలేని ధనం, పదవి వున్న వారికే విలువ యివ్వకండి.

మంచి మనసు వున్న వారికి విలువనిచ్చి ,

స్నేహం, అప్యాయతా, 

 చూపించండి.

           *👌🏻హిత వాణి👌🏻*

*శ్లో|| బాలకసఖత్వమకారణహాస్యం|

 *స్త్రీషు వివాదమసజ్జనసేవా।*

*గార్దభయానమసంస్కృతవాణీ*

*షట్సు నరో లఘుతా ముపయాతి॥*

_*భా|| చిన్నపిల్లలతో స్నేహం...*_

_*కారణంలేని నవ్వు...*_

_*స్త్రీలతో వివాదం...*_

_*దుర్జనులను సేవించుట...*_

_*గాడిదపై ప్రయాణించుట...*_

_*సంస్కారయుక్తము కాని మాట...*_

_*ఈ ఆరింటి వల్ల....*_

_*మనుష్యుడు అల్పుడగుచున్నాడు...🙏🏻*_

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఎవరీ చినజీయర్ స్వామీజీ..? ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చి స్వామీజీగా ఎందుకు మారారు..?*

చాలా మందికి చినజీయర్ స్వామీజీ గురించి తెలిసే ఉంటుంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అన్న పేరు చాలా మందికి తెలియదు. కానీ చిన జీయర్ స్వామీజీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఆయన టీవీలలో కూడా పలు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తూ.. ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలోను చినజీయర్ స్వామీజీ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


ఇందులో భాగంగానే భారీ సమతా మూర్తి రామానుజాచార్యుల వారి పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఇందుకోసం ప్రధాని మోడీ కూడా విచ్చేసారు. దీనితో ఈ అంశం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేయడంలో చినజీయర్ స్వామివారు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ప్రజలందరి దృష్టి ఈ విగ్రహం పైనే ఉంది. దీనితో.. చినజీయర్ స్వామీజీ ఎవరు..? ఆయన జీవితం ఎక్కడ ప్రారంభమైంది..? అంటూ ఆయన గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు.

చినజీయర్ స్వామి ఓ సాధారణ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1956 సంవత్సరం నవంబర్ 3 తేదీన, దీపావళి రోజున ఆయన జన్మించారు. అలమేలు మంగతాయారు, వేంకటాచార్యుల వారు చినజీయర్ స్వామి వారి తల్లి తండ్రులు. చినజీయర్ స్వామివారికి తల్లితండ్రులు మొదటగా పెట్టిన పేరు శ్రీమన్నారాయణాచార్యులు. ఆయన గౌతమ విద్యాపీఠంలో వైష్ణవ సంప్రదాయాలు, వేద గ్రంధాలపైన శిక్షణ పొందారు. అలాగే నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వద్ద సంస్కృతాన్ని, తర్క శాస్త్రాన్ని అభ్యసించారు.

అలాగే రాజమండ్రిలోనే ఓరియంటల్ స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకున్నారు. అయితే.. ఆ సమయంలోనే ఆయన తండ్రిగారు స్వర్గస్తులయ్యారు. దీనితో.. ఆయనపై కుటుంబ పోషణ భారం పడింది. దీనితో ఆయన ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నారు. ఉద్యోగం కోసం ఒక్క చేతి సంచితో హైదరాబాద్ కు చేరుకున్నారు. మొదట్లో ఎన్నో చేదు అనుభవాల తరువాత ఒక చిన్న ఉద్యోగం లభించింది. ఇక్కడే టైపు, షార్ట్ హ్యాండ్ ను కూడా నేర్చుకున్నారు. తరువాత ఆ ఉద్యోగంలో మరో పైమెట్టు ఎక్కారు.

ఆ సమయంలో అనగా 1975 నాటికి ఓ సారి పెద్ద జీయర్ స్వామిజీ కాకినాడకు విచ్చేసారు. ఓ యజ్ఞం నిమిత్తం ఆయన విచ్చేసారు. యజ్ఞ క్రతువు సాగిస్తుండగా.. అనుకోకుండా.. పెద్ద జీయర్ స్వామిజీ తో శ్రీమన్నారాయణాచార్యులకు (ప్రస్తుతం చిన జీయర్ స్వామిజీ) పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో తనకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి అని పెద్ద జీయర్ స్వామిజీ కోరడంతో.. ఆ పని తానే చేస్తానని, అప్పటికే తానూ టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నానని చినజీయర్ స్వామిజీ పేర్కొన్నారు.

అలా ఇంట్లో తల్లి వద్ద అనుమతి తీసుకున్న శ్రీమన్నారాయణాచార్యులు పెద్ద జీయర్ స్వామీజీ వెంటే తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 23 సంవత్సరాల వయసులో ఆయన తల్లి అనుమతితోనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయన గీతాజ్యోతి ఉద్యమాన్ని ప్రారంభించారు. భగవద్గీత కు ప్రాచుర్యం తీసుకురావడంతో పాటు సమాజంలో బద్ధకాన్ని తొలగించి.. ప్రజల మధ్య సౌభాతృత్వ భావనని పెంపొందించే లక్ష్యంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే.. చినజీయర్ స్వామిజీ వారు ఇక్కడితో ఆగలేదు.

అంధుల కోసం కాలేజీలు కట్టించారు. వారికి కళ్ళు లేకున్నా కంప్యూటర్ శాస్త్రంలో నిపుణులు అవ్వాలని కృషి చేసారు. అంధులకు శిక్షణ ఇవ్వడం కోసం నిపుణులను కూడా నియమించారు. అంతే కాదు.. సమస్త జీవకోటికి జ్ఞానాన్ని అందించే వేద విద్య సారాన్ని అందరికి అందించడం కోసం ఆయన ఎన్నో ఆశ్రమాలను స్థాపించారు. వేద పాఠశాలలను గురుకుల పాఠశాలలుగా తీర్చిదిద్దారు. అక్కడ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసారు. అంతే కాదు, ఆయన 12 నెలల్లో 12 భాషలను నేర్చుకున్నారు. శ్రీరామ నగరం, శంషాబాద్ లో జిమ్స్ అనే ఆసుపత్రిలో ఉచిత వైద్య విధానాన్ని అమలు చేసి వైద్యరంగాన్ని కూడా అనుగ్రహించారు. పొట్టకూటి కోసం హైదరాబాద్ కు వచ్చి, నేడు ప్రపంచానికే సమతామూర్తిని అందించిన ఘనత చినజీయర్ స్వామీజీకే దక్కుతుంది..

సేకరణ..

******

 *వయస్సు దాటుతున్న వేళ*

 *1. ఈ సమయం  ఇన్నాళ్ళూ  సంపాదించినదీ,  దాచుకున్నదీ  తీసి  ఖర్చు  పెట్టె  వయసు.తీసి  ఖర్చు  పెట్టి  జీవితాన్ని  ఎంజాయ్  చెయ్యండి.*  

 *దాన్ని  ఇంకా  దాచి  అలా  దాచడానికి  మీరు  పడిన  కష్టాన్ని,  కోల్పోయిన ఆనందాలనూ*  *మెచ్చుకునేవారు  ఎవరూ  ఉండరు  అనేది  గుర్తు పెట్టుకోండి* 

 *2. మీ  కొడుకులూ,  కోడళ్ళూ  మీరు  దాచిన  సొమ్ముకోసం  ఎటువంటి  ఆలోచనలు చేస్తున్నారో? ఈ  వయసులో  ఇంకా  సంపాదించి*  *సమస్యలనూ,  ఆందోళనలూ  కొని తెచ్చుకోవడం  అవుసరమా?* 

 *ప్రశాంతంగా  ఉన్నది  అనుభవిస్తూ జీవితం  గడిపితే  చాలదా?* 

 *3. మీ  పిల్లల  సంపాదనలూ,  వాళ్ళ  పిల్లల  సంపాదనల  గురించిన  చింత  మీకు  ఏల?*  *వాళ్ళ  గురించి  మీరు  ఎంత  వరకూ  చెయ్యాలో  అంతా  చేశారుగా?*  *వాళ్లకి  చదువు,  ఆహారం, నీడ మీకు  తోచిన  సహాయం  ఇచ్చారు.  ఇపుడు  వాళ్ళు  వాళ్ళ  కాళ్ళమీద  నిలబడ్డారు.ఇంకా  వాళ్ళకోసం  మీ  ఆలోచనలు  మానుకోండి. వాళ్ళ  గొడవలు  వాళ్ళను  పడనివ్వండి.* 

  *4. ఆరోగ్యవంతమైన  జీవితం  గడపండి.   అందుకోసం  అధిక  శ్రమ  పడకండి. తగిన  మోతాదులో  వ్యాయామం  చెయ్యండి. (నడక, యోగా   వంటివి  ఎంచుకోండి) తృప్తిగా  తినండి.  హాయిగా  నిద్రపోండి.*   *అనారోగ్య  పాలుకావడం  ఈ వయసులో  చాలా  సులభం,  ఆరోగ్యం  నిలబెట్టుకోవడం  కష్టం.  అందుకే  మీ  ఆరోగ్య  పరిస్థితిని  గమనించుకుంటూ  ఉండండి. మీ వైద్య  అవుసరాలూ,  ఆరోగ్య  అవుసరాలూ   చూసుకుంటూ  ఉండండి.  మీ డాక్టర్  తో  టచ్  లో  ఉండండి.  అవుసరం  అయిన  పరీక్షలు  చేయించుకుంటూ  ఉండండి.*  *(ఆరోగ్యం  బాగుంది  అని  టెస్ట్ లు  మానేయకండి)* 

 *5. మీ  భాగస్వామికోసం  ఖరీదైన  వస్తువులు  కొంటూ  ఉండండి.  మీ  సొమ్ము  మీ  భాగస్వామితో  కాక  ఇంకెవరితో  అనుభవిస్తారు?* *గుర్తుంచుకోండి ఒకరోజు  మీలో  ఎవరో  ఒకరు  రెండో  వారిని  వదిలిపెట్టవలసి  వస్తుంది.  మీ డబ్బు  అప్పుడు  మీకు  ఎటువంటి  ఆనందాన్నీ  ఇవ్వదు.  ఇద్దరూ  కలిసి  అనుభవించండి.* 

 *6. చిన్న  చిన్న  విషయాలకు  ఆందోళన  పడకండి. ఇప్పటివరకూ  జీవితం  లో  ఎన్నో  ఒత్తిడులను  ఎదుర్కొన్నారు.   ఎన్నో  ఆనందాలూ,  ఎన్నో  విషాదాలూ  చవి  చూశారు.  అవి  అన్నీ  గతం.* 

 *మీ  గత  అనుభవాలు మిమ్మల్ని  వెనక్కులాగేలా  తలచుకుంటూ  ఉండకండి,  మీ భవిష్యత్తును భయంకరంగా  ఊహిచుకోకండి.  ఆ  రెండిటివలన  మీ  ప్రస్తుత  స్థితిని   నరకప్రాయం  చేసుకోకండి. ఈరోజు  నేను  ఆనందంగా  ఉంటాను అనే  అభిప్రాయంతో  గడపండి.   చిన్నసమస్యలు  వాటంతట  అవే  తొలగిపోతాయి .* 

 *7. మీ  వయసు*  *అయిపొయింది  అనుకోకండి.  మీ  జీవిత  భాగస్వామిని  ఈ  వయసులో  ప్రేమిస్తూనే  ఉండండి. జీవితాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. కుటుంబాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. మీ  పొరుగువారిని  ప్రేమిస్తూ  ఉండండి.* 

  *"జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలూ  ఉన్నన్ని నాళ్ళూ   మీరు  ముసలివారు  అనుకోకండి.* *నేను  ఏమిచెయ్యగలనూ  అని  ఆలోచించండి.  నేను  ఏమీ  చెయ్యలేను  అనుకోకండి"* 

 *8. ఆత్మాభిమానం  తో  ఉండండి  (మనసులోనూ బయటా  కూడా) హెయిర్  కట్టింగ్  ఎందుకులే*  *అనుకోకండి.  గోళ్ళు  పెరగనియ్యిలే అనుకోకండి.  చర్మసౌందర్యం  మీద  శ్రద్ధ   పెట్టండి.  పళ్ళు  కట్టించుకోండి. ఇంట్లో  పెర్ఫ్యూమ్ లూ,  సెంట్లూ ఉంచుకోండి. బాహ్య  సౌందర్యం  మీలో అంతః సౌందర్యం  పెంచుతుంది అనే  విషయం  మరువకండి.  మీరు  శక్తివంతులే!* 

 *9. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయిన ఒక  స్టైల్స్ ఏర్పరచుకోండి.  వయసుకు  తగ్గ  దుస్తులు  చక్కటివి  ఎంచుకోండి. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయినట్టుగా  మీ  అలంకరణ ఉండాలి.  మీరు  ప్రత్యేకంగా  హుందాగా ఉండాలి.* 

 *10. ఎప్పటికప్పుడు  అప్ డేట్  గా  ఉండండి. న్యూస్ పేపర్లు  చదవండి. న్యూస్ చూడండి.  పేస్  బుక్ , వాట్సాప్ లలో  ఉండండి. మీ  పాత  స్నేహాలు  మీకు  దొరకవచ్చు.*  

 *11. యువతరం ఆలోచనలను  గౌరవించండి.* 

 *మీ  ఆదర్శాలూ  వారి  ఆదర్శాలూ  వేరు  వేరు  కావచ్చు. అంతమాత్రాన  వారిని  విమర్శించకండి* .

 *సలహాలు  ఇవ్వండి,* *అడ్డుకోకండి. మీ  అనుభవాలు  వారికి  ఉపయోగించేలా  మీ  సూచనలు  ఇస్తే  చాలు. వారు  వారికి  నచ్చితే  తీసుకుంటారు.  దేశాన్ని  నడిపించేది వారే!* 

 *12. మా  రోజుల్లో ...  అంటూ   అనకండి.  మీరోజులు  ఇవ్వే!* 

 *మీరు  బ్రతికి  ఉన్నన్ని  రోజులూ   " ఈరోజు నాదే"  అనుకోండి* 

 *అప్పటికాలం  స్వర్ణమయం  అంటూ  ఆరోజుల్లో   బ్రతకకండి.*  

 *తోటివారితో కఠినంగా  ఉండకండి.* 

 *జీవితకాలం  చాలా  తక్కువ.  పక్కవారితో కఠినంగా   ఉండి* *మీరు  సాధించేది  ఏమిటి?*  *పాజిటివ్  దృక్పధం,*  *సంతోషాన్ని  పంచే  స్నేహితులతో  ఉండండి.*  *దానివలన  మీ  జీవితం  సంతోషదాయకం  అవుతుంది.*  *కఠిన  మనస్కులతో  ఉంటె   మీరూ  కఠినాత్ములుగా  మారిపోతారు.*  *అది  మీకు  ఆనందాన్ని  ఇవ్వదు.  మీరు  త్వరగా  ముసలివారు  అవుతారు.* 

 *13. మీకు  ఆర్ధికశక్తి  ఉంటె,  ఆరోగ్యం  ఉంటె   మీ  పిల్లలతో  మనుమలతో  కలిసి ఉండకండి. కుటుంబ సభ్యులతో  కలిసి  ఉండడం  మంచిది  అని  అనిపించవచ్చు.  కానీ  అది  వారి  ప్రైవసీకి  మీ  ప్రైవసీకి కూడా  అవరోధం  అవుతుంది.వారి  జీవితాలు  వారివి.*  

 *మీ  జీవితం  మీది. వారికి  అవుసరం  అయినా,  మీకు  అవుసరం  అయినా  తప్పక  పిల్లలతో  కలిసి  ఉండండి.* 

 *14. మీ  హాబీలను  వదులుకోకండి.*  *ఉద్యోగజీవితం  లో  అంత  ఖాళీ  లేదు  అనుకుంటే  ఇప్పుడు  చేసుకోండి.* 

 *తీర్థ  యాత్రలు  చెయ్యడం,  పుస్తకపఠనం, డాన్స్, పిల్లినో, కుక్కనో  పెంచడం,  తోట పెంపకం, పెయింటింగ్ ...  రచనా  వ్యాసంగం   ...  ఏదో  ఒకటి  ఎంచుకోండి.* 

 *15. ఇంటిబయటకు  వెళ్ళడం  అలవాటు  చేసుకోండి.  కొత్త  పరిచయాలు  పెంచుకోండి.* *పార్కుకి  వెళ్లండి, గుడికి  వెళ్ళండి,  ఏదైనా  సభలకు  వెళ్ళండి.  ఇంటిబయట  గడపడం  కూడా  మీ  ఆరోగ్యానికి  మేలు  చేస్తుంది.* 

 *16. మర్యాదగా   మాట్లాడడం  అలవాటు  చేసుకోండి.  నోరు  మంచిది  అయితే  ఊరు  మంచిది  అవుతుంది.*  *పిర్యాదులు  చెయ్యకండి. లోపాలను  ఎత్తిచూపడం  అలవాటు  చేసుకోకండి. విమర్శించకండి. పరిస్థితులను  అర్ధం  చేసుకుని  ప్రవర్తించండి. సున్నితంగా  సమస్యలను  చెప్పడం  అలవాటు  చేసుకోండి.* 

 *17. వృద్ధాప్యం  లో  బాధలూ,  సంతోషాలూ  కలిసి  మెలసి  ఉంటాయి.  బాధలను  తవ్వి  తీసుకుంటూ ఉండకండి.* *అన్నీ  జీవితంలో  భాగాలే* 

 *18. మిమ్మల్ని  బాధపెట్టిన  వారిని  క్షమించండి* 

 *మీరు  బాధపెట్టిన  వారిని  క్షమాపణ  కోరండి* 

 *మీ తోపాటు  అసంతృప్తిని  వెంటబెట్టుకోకండి.* 

 *అది మిమ్మల్ని విచారకరం  గానూ,* 

 *కఠినం గానూ   మారుస్తుంది* 

 *ఎవరు  రైటు అన్నది  ఆలోచించకండి.* 

 *19. ఒకరిపై పగ  పెట్టుకోవద్దు* 

 *క్షమించు,  మర్చిపో,  జీవితం  సాగించు.* 

 *20. నవ్వండి నవ్వించండి. బాధలపై  నవ్వండి* 

 *ఎందరికన్నానో  మీరు  అదృష్టవంతులు.* 

 *దీర్ఘకాలం  హాయిగా  జీవించండి.* 

 *ఈ వయసు వరకు  కొందరు  రాలేరు  అని  గుర్తించండి.* 

 *మీరు  పూర్ణ  ఆయుర్దాయం  పొందినందుకు   ఆనందించండి.

🌷🌷🌷🌷🌷🌷 జై శ్రీమన్నారాయణ 🙏🏻:


కాశీలోని ద్వాదశ ఆదిత్యు

దేశం మొత్తం మీద సుమారు పది దాకా ఆలయాలలో మాత్రమే మూల విరాట్టుగా పూజలు అందుకొనే శ్రీ సూర్య నారాయణ స్వామి, కాశీలో ఏకంగా పన్నెండు ఆలయాలలో కొలువై ఉండటం ప్రత్యేకంగా పేర్కొనాలి. 

1. కేశవాదిత్యుడు: 

ఆదిత్యుడు ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని (కేశవుడు) గురువుగా స్వీకరించి, తపమాచరించి శివానుగ్రహం పొందాడు. అందుకే ఈయన కేశవాదిత్యుడు. శ్రీ ఆది కేశవ స్వామి ఆలయంలో (రాజ్ ఘాట్ ఫోర్ట్ దగ్గర ---> రాజ్ ఘాట్ వేరు... రాజా ఘాట్ వేరు. గమనించ గలరు..) కొలువైన ఈ ఆదిత్యుని సేవిస్తే సద్గురు కృప లభిస్తుంది. విష్ణుమూర్తి కాశీకి వచ్చి, మొదటగా నివాసం ఏర్పరచుకున్న స్థలం ఈ ఆదికేశవాలయం. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతివారు తప్పక దర్శనం చేయాలి.

2. మయుఖాదిత్యుడు: 

సూర్య భగవానుడు ధూత్ పాప, ధర్మ నదుల సంగమ స్థానం వద్ద  వైకుంఠ వాసుని ఉపదేశం మేరకు, విశ్వనాధుని అనుగ్రహం ఆపేక్షిస్తూ మహోగ్ర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సు వలన రోజురోజుకీ సూర్య కిరణాలు లోకాలు భరించలేనంతగా వేడెక్కిపోసాగాయి. సూర్య తాపాన్ని ప్రజలు తట్టుకోలేక పోయారు. గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్త స్పర్శతో ప్రచండుడిని చల్లబరిచారు. లోకాలకు ఉపశమనం కలిగించారు. నేటికీ ఈ మాయుఖాదిత్యుని విగ్రహం మీద నిరంతరం నీటి బిందువులు ఉండటం గమనించవచ్చును. ఇదే కిరణా నదీ ప్రవాహంగా మారి పంచగంగా ఘాట్ లో కలుస్తుందట. 

సూర్యుడు ప్రతిష్టించిన పరమేశ్వర లింగం గాభస్తీశ్వరుడిగా, అమ్మవారు మంగళ గౌరి గా పంచ గంగా ఘాట్ లో కొలువు తీరి ఉన్నారు. సూర్యుడు కూడా మయూఖాదిత్యునిగా మంగళ గౌరీ ఆలయంలో వెలిసాడు. ఈ స్వామిని ఆరాధించిన వారికి అనారోగ్యం దరిచేరదు. నిత్య జీవితంలోని అశాంతులు అన్నీ తొలగి పోతాయని విశ్వసిస్తారు.

3. గంగాదిత్యుడు: 

లలితా ఘాట్ వద్ద గల నేపాలీ మందిరం క్రింద భాగాన ఉన్న గంగాదిత్యుని కొలిచిన వారికి ఎలాంటి ధననష్టం ఉండదని అపమృత్యు భయం ఉండదని చెప్తారు.

4. అరుణాదిత్యుడు:

గంగ ఒడ్డున సూర్యుని సహాయం కోరి తపస్సు ఆరంభించాడు ఊరువులు లేకుండా జన్మించిన వినత పుత్రుడైన అనూరుడు. సంతుష్టుడైన రవి తన రధానికి సారధిగా నియమించుకున్నాడు. త్రిలోచన ఘాట్ లో, శ్రీ త్రిలోచనేశ్వర స్వామి మందిరంలో వెనక భాగాన ఉన్న శ్రీ ఆంజనేయుని  విగ్రహం క్రింద ఉన్న ఈ రూపాన్ని పూజిస్తే దారిద్య్రం దాపురించదని, సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పరిపూర్ణ జీవితం సంప్రాప్తిస్తుందని చెప్తారు. 

5. ఖగోళాదిత్యుడు: 

కద్రువ వద్ద దాస్యం తొలగిన తరువాత, వినత గరుత్మంతునితో కలిసి కాశీ చేరుకొని, తన తప్పులకు పరిష్కారం చేసుకోడానికి సూర్య భగవానుని ఖగోళాదిత్యుని రూపంలో కొలవసాగింది. శుభకరుడు సంతసించి ఆమె కుమారులు లోక పూజ్యులు అవుతారని ఆశీర్వదించాడు. మచ్చోదరి ప్రాంతంలోని శ్రీ కామేశ్వర స్వామి మందిరంలోని ఖగోళాదిత్యుని ఆరాధించిన భక్తుల సంతానం, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొంటారని  చెప్తారు. 

6. లోలార్కాదిత్యుడు: 

తులసీ ఘాట్ వద్ద, అసి మరియు గంగా సంగమ తీరంలో లోలార్క కుండం పక్కన కొలువుతీరి ఉంటారు లోలార్కాదిత్యుడు. నదీ సంగమ జలం అంతర్వాహినిగా కుండం లోనికి చేరుకుంటుంది. కుండంలో స్నానం ఆచరించి స్వామిని సేవించిన వారి కోర్కెలు శీఘ్రంగా నెరవేరతాయని చెప్తారు.

7. సాంబాదిత్యుడు: 

నారదుని కారణంగా తండ్రి శాపానికి గురి అయ్యి కుష్ఠురోగం బారిన పడతాడు శ్రీకృష్ణ జాంబవతుల తనయుడైన సాంబుడు. తర్వాత కృష్ణుడి సలహా మేరకు కాశీ చేరి, విశ్వేశ్వరునితో పాటు, సూర్యనారాయణ స్వామిని కూడా నియమంగా ఆరాధిస్తాడు. ప్రభాకరుని కృపతో కుష్టు రోగం తొలగిపోతుంది. సూర్య కుండం (సూరజ్ కుండ్) వద్ద ఉన్న ఈ ఆదిత్యుని ప్రార్ధించిన భక్తులు దీర్ఘ వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారట. 

8. ద్రౌపది ఆదిత్యుడు: 

శ్రీ కృష్ణుని సలహా మేరకు ద్రౌపది గంగా తీరాన సూర్య భగవానుని ధ్యానించింది. అభిమానంతో సూర్యుడు ఆమెకు అక్షయ పాత్ర అనుగ్రహించాడు. ఈ ద్రౌపది ఆదిత్యుని కొలిచిన వారి ఇంట ఐశ్వర్యానికి అంతు ఉండదని గ్రంధాలు తెలియజేస్తున్నాయి. అన్నపూర్ణాదేవి ఆలయం మరియు విశ్వేశ్వర స్వామి ఆలయాల మధ్యలో ఒక ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. అక్కడ ఒక పక్కగా ఈ స్వామి కనపడతారు.

9. ఉత్తరార్క ఆదిత్యుడు: 

జాతక రీత్యా ఉన్న దోషం కారణంగా చిన్నతనం లోనే తల్లితండ్రులను పోగొట్టుకొన్నది సులక్షణ. నియమంగా గంగా తీరాన సుర్యారాధన చేస్తుండేది. ఆమెతో పాటు ఒక మేక కూడా రోజంతా ఏమీ తినకుండా అలా అక్కడే ఉండేది. కొంత కాలానికి ఆమె దీక్షకు మెచ్చిన ఆది దంపతులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. సులక్షణ, శివ పార్వతులకు మొక్కి తనకు బదులుగా ఆ మేకకు ఉత్తమ జన్మ ప్రసాదించమని కోరుకొన్నది. బాలిక నిస్వార్ధ బుద్దికి సంతసించిన సర్వేశ్వరుడు శాశ్వత కైలాసం ప్రసాదించాడు. మేక మరు జన్మలో కాశీ రాజుకు పుత్రికగా జన్మించినది. స్థానికంగా 'బకరీ కుండ్' అని పిలిచే కోనేరులో స్నానమాచరించి, ఉత్తరార్క ఆదిత్యుని ఆరాధించిన వారికి ఇహ పర సుఖాలు లభిస్తాయట.

వారణాశి సిటీ రైల్వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంపూర్ లో ఉంటుందీ మందిరం.

10. విమలాదిత్యుడు: 

అంతు తెలియని చర్మ వ్యాధితో బాధ పడుతున్న విమలుడు అనే బ్రాహ్మణుడు కాశీ వచ్చి అచంచల భక్తి శ్రద్దలతో దినకరుని ప్రార్ధించసాగాడు. స్వామి అనుగ్రహంతో అతని వ్యాధి సంపూర్ణంగా నిర్మూలించబడినది. విమలుడుకి ఆరోగ్యం ప్రసాదించిన స్వామిని విమలాదిత్యుడు అని పిలుస్తారు. ఖారీకువా గల్లీ (జంగంబారి)లో ఉండే విమలాదిత్యుని సేవించిన వారిని అనారోగ్య బాధలు దరి చేరవని చెప్తారు.

11. వృద్దాదిత్యుడు: 

హరితుడు అనే వ్యక్తి నిరంతరం ధ్యానంలో ఉంటూ అనేక దివ్యానుభూతులు అనుభవించేవాడు. జీవులకు సహజమైన వార్ధక్యం కారణంగా గతంలో మాదిరి ధ్యానం చేయలేక ఆదిత్యుని అర్ధించాడు. స్వామి కృపతో పునః యవ్వనాన్ని పొందాడు. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తిరిగితే (కనుక్కుంటూ వెళ్ళాలి) అక్కడ పెద్ద హనుమాన్ మందిరం ఉంటుంది. అక్కడ చిన్న గదిలాంటి మందిరంలో ఉన్న వృద్ద ఆదిత్యుని పూజించిన వారికి వృద్దాప్య బాధలు ఉండవని చెప్తారు. 

12. యమాదిత్యుడు: 

సూర్యుని పుత్రుడైన యమధర్మరాజు, తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్శనం కొరకు గంగా తీరాన తపస్సు చేసాడు. దర్శన భాగ్యం పొందాడు. యముడు ప్రతిష్టించిన శ్రీ యమేశ్వర స్వామిని, యమాదిత్యుని నిశ్చల భక్తితో వేడుకొంటే, శాశ్వత స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని కాశీ ఖండం తెలుపుతోంది. సింధియా ఘాట్ లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు.

జై శ్రీమన్నారాయణ🙏🏻

*****

🔔🔔🔔🔔🔔

No comments:

Post a Comment