అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
అమ్మ భాషను మరవొద్దు
మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది.అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదు. ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మన మాతృభాషను రక్షించుకోవాలి.
🌷మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి 21 నే ఎందుకు జరుపుకోవాలి..?
మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించారటా అందుకే ఫిబ్రవరి 21 వ తేదీని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విషయాల సంస్థ యునెస్కో (నవంబర్ 17, 1999)న ఫిబ్రవరి 21వ తేదీని ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించింది.
అప్పటినుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే తక్కిన భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అని యునెస్కో వెల్లడించింది.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక థీమ్‌ను కూడా యునెస్కో ప్రకటిస్తోంది.
‘అభివృద్ధి, శాంతిభద్రతలు, సయోధ్యకు దేశీయ భాషలు దోహదపడతాయి’ అనేది ఈ ఏడాది థీమ్. పారిస్‌లో ఉన్న యునెస్కో కేంద్ర కార్యాలయంలో ఫిబ్రవరి 21న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏడు సెమినార్లు, ఒక వర్క్‌షాప్ జరగనున్నాయి. ‘భాషల లెక్కింపు’ పై ఒక డిబేట్ కూడా జరగనుంది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషలను సంరక్షించడం, ఇతర భాషలను నేర్చుకోవడానికి మాతృభాషనే ఉపయోగించుకోవడమే ప్రధాన అంశంగా యునెస్కో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలా మంది కవులు చెప్పారు. నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి. అనేక రకాలైన పనుల కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడం సర్వ సాధారణమైపోయింది. అందు వల్ల ఇంగ్లిష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది.
అయితే ఈ ఇంగ్లిష్ భాష నేర్చుకోవటం అన్నది అవసరం మాత్రమే, విజ్ఞానవంతులు అవ్వడానికి ఉపయోగపడాలే కానీ మోజు కాకూడదు. ఈ మోజులో పడి మన మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. ఎగతాళి చేయకూడదు. కాబట్టి సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, మన భాషను, సంస్కృతినీ కాపాడుకోవడం, భావి తరాలవారికి దీన్ని అందిస్తూ ఆ భాషా సౌందర్యసంపదను కాపాడటం అందరి కర్తవ్యం.
*****
🔯అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
అమ్మ భాషను మరవొద్దు
మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది.అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదు. ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మన మాతృభాషను రక్షించుకోవాలి.
🌷మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి 21 నే ఎందుకు జరుపుకోవాలి..?
మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించారటా అందుకే ఫిబ్రవరి 21 వ తేదీని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విషయాల సంస్థ యునెస్కో (నవంబర్ 17, 1999)న ఫిబ్రవరి 21వ తేదీని ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించింది.
అప్పటినుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే తక్కిన భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అని యునెస్కో వెల్లడించింది.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక థీమ్‌ను కూడా యునెస్కో ప్రకటిస్తోంది.
******
✳️‘అభివృద్ధి, శాంతిభద్రతలు, సయోధ్యకు దేశీయ భాషలు దోహదపడతాయి’ అనేది ఈ ఏడాది థీమ్. పారిస్‌లో ఉన్న యునెస్కో కేంద్ర కార్యాలయంలో ఫిబ్రవరి 21న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏడు సెమినార్లు, ఒక వర్క్‌షాప్ జరగనున్నాయి. ‘భాషల లెక్కింపు’ పై ఒక డిబేట్ కూడా జరగనుంది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషలను సంరక్షించడం, ఇతర భాషలను నేర్చుకోవడానికి మాతృభాషనే ఉపయోగించుకోవడమే ప్రధాన అంశంగా యునెస్కో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలా మంది కవులు చెప్పారు. నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి. అనేక రకాలైన పనుల కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడం సర్వ సాధారణమైపోయింది. అందు వల్ల ఇంగ్లిష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది.
అయితే ఈ ఇంగ్లిష్ భాష నేర్చుకోవటం అన్నది అవసరం మాత్రమే, విజ్ఞానవంతులు అవ్వడానికి ఉపయోగపడాలే కానీ మోజు కాకూడదు. ఈ మోజులో పడి మన మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. ఎగతాళి చేయకూడదు. కాబట్టి సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, మన భాషను, సంస్కృతినీ కాపాడుకోవడం, భావి తరాలవారికి దీన్ని అందిస్తూ ఆ భాషా సౌందర్యసంపదను కాపాడటం అందరి కర్తవ్యం.
****
చెం..తెలుగు సినిమా గ తెగులు తెచ్చు భాష వాడు చుండిరంత
వెలుగు దేవుడెరుగు వెకిలిచెష్టలగుట హాస్య మనట ఏల
బలపముపట్టకే బండెడు మోతగా ఆంగ్ల చదువు బ్రతుకు
మళినమాయె తెలుగు మంగళకరమైన తెలుగు ఎప్పుడొచ్చు
******
[12:57, 21/02/2022] మల్లాప్రగడ రామకృష్ణ: ఇంగ్లీష్ భాష ఎందుకవసరమో తెలుపు తారా
: మాతృభాషనుమోసగించుటమాతమదిలో పీఠమెక్కెను పిల్లలందరునాంగ్లమాధ్యము ప్రేమజూపగనొత్తిడులతో బడికి పంపుటనాత్మహత్యయె శాసనాలుత్తర్వులన్నియు బానిసత్వపువన్నెచిన్నెగ
నాంగ్లమందునుతీర్చిదిద్దుచుచిత్రసీమలచిలుక పలుకులు మాతృభాషనుమంటగలిపిరి దృశ్యమాధ్యమదీప్తులన్నియు పిచ్చివాగుడుతెలుగుభాషకు పురుగుమందులపిచ్కారిగ అసలుమొక్కకుచేదువిషమును
అంటగట్టెడుకులమతాలయి తెలుగుభాషకునాత్మశాంతికి వర్ణమాలలప్రాచ్యభాషల వర్ధనమ్ముకొమ్ముగాయుచు పసితనమ్మునబానిసత్వము భాషనేర్పగరాజకీయము అమ్మరొమ్మునుకొల్లగొట్టుచు పాఠశాలలనుత్సవాలను మొక్కుబడిగాజరుపగోరెడు మూర్ఖపాలకనిర్ణయమ్ములు తెలుగు నమ్మిన గురుకులాలను తెగులుపట్టగచీదరించగ ఆత్మవంచనరోజునేడయి ఆత్మవేదకకారణమ్మే *****
యవ్వనం & ముసలితనం
నేను యవ్వనంలో ఉన్నప్పుడు "మొటిమల్ని" గురించి బాధపడే వాడిని...
నాకు ముసలితనం వచ్చినప్పుడు "ముడతల్ని" గురించి బాధపడుతున్నాను.
నేను యవ్వనంలో ఉన్నప్పుడు "ఆమె" చెయ్యి పట్టుకోవాలని ఎదురుచూసే వాడిని....
నాకు ముసలితనం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి "నా చేయి" పట్టుకుంటారా అని ఎదురు చూస్తున్నాను.
నేను యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను "ఒంటరిగా" వదిలేస్తే బాగుండును అనుకునేవాణ్ణి...
నాకు ముసలితనం వచ్చినప్పుడు అందరూ నన్ను "ఒంటరిగా" వదిలేసారే అని బాధపడుతున్నాను.
నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే "చికాకు" పడేవాడిని..
నాకు ముసలితనం వచ్చినప్పుడు నాతో ఎవరూ కనీసం "మాట్లాడటం" లేదే అని బాధపడుతున్నాను.
నేను యవ్వనంలో ఉన్నప్పుడు "అందాన్ని" ఆస్వాదించే వాడిని...
నాకు ముసలితనం వచ్చినప్పుడు నా చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ "అందాన్ని" చూసుకుంటున్నాను.
నేను యవ్వనంలో ఉన్నప్పుడు నాకు " చావే " లేదు అనుకునే వాడిని....
నాకు ముసలితనం వచ్చినప్పుడు .... "రోజులు దగ్గర పడ్డాయి." అని బాధపడుతున్నాను.
నేను యవ్వనంలో ఉన్నప్పుడు "ప్రతి క్షణాన్ని" పండగ చేసుకునే వాడిని....
నాకు ముసలితనం వచ్చినప్పుడు "తీపి జ్ఞాపకాల్ని" నెమరు వేసుకుంటున్నాను.
నేను యవ్వనంలో ఉన్నప్పుడు "నిద్రలేవడం" కష్టంగా ఉండేది......
నాకు ముసలితనం వచ్చినప్పుడు "నిద్రపట్టడం" కష్టంగా ఉంది.
నేను యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా నా "గుండెల మీద" పిడిగుద్దులతో గుద్దుకునే వాడిని....
నాకు ముసలితనం వచ్చినప్పుడు ఈ "గుండె ఎప్పుడు ఆగి పోతుందో" అని భయపడుతున్నాను.
జీవితంలో రకరకాల "ఆటు పోట్లు" వస్తుంటాయి.
దేనికీ భయపడ కూడదు.
ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం కావాలి.
అదే నిజమైన "జీవితానుభవం".
అది "యవ్వనంలో" నైనా.. "ముసలితనంలో" నైనా..అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా "ప్రశాంతంగా" ఉంటుంది.
సగటు మనిషి పడక గది దాంపత్య సన్నివేశాలు.
(పెళ్లి అయిన రోజు నుండి 75 సంవత్సరాల అంతిమ నిద్ర వచ్చే వరకు క్లుప్తంగా)
1 మొదటి అంకం...
సమయం : రాత్రి 10 గంటలు
ప్రదేశం : మధ్యతరగతి పడక గది
వయసు. : భర్త : 27 ఏళ్ళు, భార్య 25ఏళ్ళు.
భర్త : అబ్బా రాత్రి 10 అవుతుంది, ఇంకా ఎంత సేపు ఎదురు చూడాలి నీకోసం , తొందరగా రావచ్చుగా గదిలోకి, ఒక్కడినే ఉండి ఏంచేయాలో తోచక చేతులు, దిండు నలుపుతున్నా....
భార్య : నాకూ రావాలనే ఉంది...కానీ, మీ అమ్మ వదిలితేగా, ఏదో ఒక పనో, మాటలో చెప్తూ ఉంది, అవన్నీ అయ్యేటప్పటికి ఈసమయం అయింది.
2) రెండవ అంకం...
వయసు: 37, 35
సమయం : రాత్రి 10
ప్రదేశం : అదే పడకగది*
భర్త : పెద్దోడితోటి బాధ లేదు, వాడు మా అమ్మ పక్కన పడుకుంటున్నాడు, బాధ అంతా ఈ చిన్నోడి తోటే, నాయనమ్మ పక్కన పడుకోమంటే పడుకోడు, మనం మంచి మూడ్ లో ఉన్నప్పుడు లేచి నాకు బాత్రూం వస్తుంది, మంచి నీళ్ళు కావాలి, ఆకలి ఐతుంది అంటాడు....
భార్య : ఏం చేస్తాం మనమే సర్దుకుపోవాలి, వాడు చిన్నోడు కదా అంతే మరి...
3) మూడవ అంకం...
వయసు : 47,45
సమయం : రాత్రి 10 గంటలు
ప్రదేశం : అదే పడక గది
భర్త : గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేశావా, పాలు తోడు పెట్టావా..
భార్య :ఆ ఆ అన్నీ చేశా, మీరు కళ్ళజోడు, ఫోన్తె చ్చుకున్నారా?
భర్త : ఇక పడుకో అని కుడి పక్కకు తిరిగి పడుకున్నాడు.
భార్య : సరే అని ఎడమ పక్కకు తిరిగి పడుకుంది.
4) నాలుగవ అంకం...
వయసు. : 57, 55*
సమయం : రాత్రి 10* *ఎప్పటి లాగే
ప్రదేశము : అదే పాత పడక గది
భర్త : బి.పి, షుగరు టాబ్లెట్ లు వేసుకున్నవా, పిల్లలు పండగకి వస్తామన్నారా?
భార్య : నేను, వేసుకున్నా, మీరు వేసుకున్నారా, పెద్దోడికి సెలవు దొరకలేదట, చిన్నోడు ఆఫీసులో తీరిక లేకుండా ఉన్నాడట కుదరదన్నాడు.
భర్త : సరే ఏం చేస్తాం , పడుకో, అన్నట్టు పాలు తోడు పెట్టావా?
భార్య : తోడు పెట్టాను, మీరు ఫోను, కళ్లజోడు దగ్గర పెట్టుకున్నారా?
ఇద్దరు చెరో వైపు తిరిగి పడుకున్నారు
5) అయిదవ అంకం...
వయసు : 67, 65
సమయం : రాత్రి 10 గంటలు
ప్రదేశం : అదే పాత పడకగది
భర్త : బి.పి, షుగరు తో పాటు మోకాళ్ళ నొప్పుల మందు కూడా వేసుకున్నవా....
భార్య : నేను వేసుకున్నా, మీవి కూడా పట్టుకొచ్చా వేసుకోండి...
భర్త : సరే ఇటియ్యి, వేసుకుంటా, అవునూ, అమెరికా నుండి మనవళ్లు, మనవరాళ్లు ఫోన్ చేసారా ఈమధ్య , ఎప్పుడయినా వస్తామంటున్నార, పుట్టి పదేళ్లు వస్తున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు, ఫోన్లో వీడియో కాల్ లో చూడటమే తప్ప నిజంగా ఒక్కసారి చూసింది లేదు.
భార్య : నిన్న చిన్నవాడు, పెద్దవాడు ఇద్దరి కుటుంబాలు ఎదో హోటల్ లో కలుసుకొని అక్కడినుండి ఇద్దరు వాళ్ళ , వాళ్ళ పిల్లలతో ఫోన్ లో మాట్లాడించారు. మంచి డాక్టర్ కి చూపించుకోండి, మందులు వాడండి ఎన్ని డబ్బులు అయినా ఫరవాలేదు పంపిస్తాము అన్నారు, వాళ్ళకి ఇంకో 2 ఏళ్ల దాకా రావటానికి కుదరదట, సరే పొద్దు పోయింది పడుకోండి..
భర్త : వాళ్ళు రారు, మనం వాళ్ళని, వాళ్ళ పిల్లలని చూడలేము, ఇక మన పరిస్థితి ఇంతే,
పడుకుందామంటే మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలతో రాత్రి ఒంటిగంట దాకా నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే పిల్లలు గుర్తొచ్చి మనసంతా దిగులుగా ఉంటుంది, అసలు వాళ్ళని ఇద్దరిని అమెరికా పంపి తప్పు చేసామేమో, ఒక్కడినన్న ఇక్కడ ఉండమనాల్సింది, సరే లే ఇప్పుడు అనుకోని ఏంచేస్తాం, నీకన్నా నిద్ర పడుతున్నదా?
భార్య : నాది మీ పరిస్థితే నాకూ ఒంటిగంట తరువాతే నిద్ర, కళ్ళు తెరిచినా, మూసినా పిల్లలే కళ్ళలో మెదులుతున్నారు, ఏంచేస్తాం అంతా మన ఖర్మ ,
సరే నిద్ర రాకపోయినా అట్లాగే కళ్ళు మూసుకొని పడుకుందాం ఎప్పటికో నిద్ర పట్టక పోదు.
ఇద్దరూ బలవంతాన కళ్ళు మూసుకున్నారు.
6) చివరి అంకం...
వయసు : 75
సమయం : రాత్రి 11 గంటలు
ప్రదేశం : ముసలి కంపు కొట్టే పాత పడక గదిలో, కాళ్ళు సరిగా లేని కుంటి మంచం.
భార్య : ఆయన పోయి నెల రోజులు అయింది, ఇంతవరకు ఒక్క కొడుకు కానీ, ఒక్క కోడలు కానీ, మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ వచ్చిన పాపాన లేదు, కన్నతండ్రి చనిపోతే అంతిమ సంస్కారాలు కూడా చేయలేని, తీరిక లేని కొడుకులు, సమయానికి మా తమ్ముడు, వాడి కొడుకు రాబట్టి కనీసం స్మశాన కార్యక్రమాలు అయినా పూర్తి అయినయి.
ఇక నా పరిస్థితి ఏమి కానుందో....
ఎప్పటికయినా నా పిల్లలు వస్తారో..రారో అనుకుంటూ కళ్ళు మూసుకుంది, అంతే ఆ కళ్ళు మళ్ళీ తెరుచుకోలేదు,
జీవితంలో ఆఖరు పడకగది సన్నివేశం ముగిసింది
మర్నాడు పనిమనిషి వచ్చి తలుపు ఎంత సేపు కొట్టినా తలుపు తెరుచుకోలేదు, అనుమానం వచ్చి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తలుపు పగలగొట్టి చూస్తే "భార్య" శాశ్వత నిద్రలోకి పోయింది...
చుట్టుపక్కల వాళ్ళు ఆమె తమ్ముడి నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆయన వచ్చి అంతిమ సంస్కారం చేసి వెళ్ళిపోయాడు.
మధ్యతరగతి జీవిత నాటకరంగంలో సగటు మనిషి పడక గది సన్నివేశాలు... మధ్య తరగతి దాంపత్య ప్రతిఫలాల నిలువుటద్దాలు... ఇవే----//-
[20/02, 10:08] మల్లాప్రగడ రామకృష్ణ: *ఋణానుబంధం*
*అన్నిటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాటి మండుటెండలో వెడుతూ ఎండకి ఓర్చుకోలేక, ఒక చెప్పులు కుట్టే వాడు దారిలో పెట్టిన చెప్పులపై కొంత సేపు నిలబడ్డాడు.*
*ఆ మాత్రం నిలబడినందున, ఆ ఋణం తీర్చు కోవడానికి మరుజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు - అనే దంపతులకు సునందుడు అను పేరుతో పుట్టాడు.*
*జాతకం చూపిస్తే, పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తారు.*
*ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. 'వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి. అతడికి మీరే అన్నీ ఇస్తూండండి' అని చెప్తారు.*
*నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు.*
*పూర్వజన్మ గుర్తున్నందున ఆపిల్లవాడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు* .
*ఒకరోజు రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా తాను రాజనగరుకు కాపలా కాయవలసి వచ్చింది.*
*అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు నగరప్రజలను హెచ్చరిస్తూ హితవు ఒకటి చెబుతుండే వాడు.*
*రాజుగారు మారువేషంలో తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు.*
*మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు.*
*పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు.*
*అతడు వెంటనేె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో, నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది.*
*వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు.*
*తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యువకుడు రాత్రి కావలి సమయంలో చెప్పిన ఈ క్రింది ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు*:
1. మాతా నాస్తి, పితా నాస్తి,
నాస్తి బంధు సహోదరః|
అర్థం నాస్తి, గృహం నాస్తి,
తస్మాత్ జాగ్రత జాగ్రత||
*తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు.*
*కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.*
2. జన్మ దుఃఖం, జరా దుఃఖం,
జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం
తస్మాత్ జాగ్రత జాగ్రత||
*తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి.*
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
3. కామః క్రోధశ్చ, లోభశ్చ
దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ
తస్మాత్ జాగ్రత జాగ్రత||
*తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు.*
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
4. ఆశయా బధ్యతే జంతుః
కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి
తస్మాత్ జాగ్రత జాగ్రత||
*తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు గడుపుతుంటారు*. *ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు.*
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
5. సంపదః స్వప్న సంకాశాః
యౌవనం కుసుమోపమ్|
విద్యుచ్చంచల ఆయుషం
తస్మాత్ జాగ్రత జాగ్రత||
*తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.* *యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.*
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
6. క్షణం విత్తం, క్షణం చిత్తం,
క్షణం జీవితమావయోః|
యమస్య కరుణా నాస్తి
తస్మాత్ జాగ్రత జాగ్రత||
*తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.*
7. యావత్ కాలం భవేత్ కర్మ
తావత్ తిష్ఠతి జంతవః|
తస్మిన్ క్షీణే వినశ్యంతి
తత్ర కా పరివేదన||
*తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో, అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు.*
8. *ఋణానుబంధ రూపేణ*
*పశుపత్నిసుతాలయః|*
*ఋణక్షయే క్షయం యాంతి*
*తత్ర కా పరివేదన||*
*తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి.* *అందుకు వ్యథ చెందడ మెందుకు.*
*9. పక్వాని తరుపర్ణాని*
*పతంతి క్రమశో యథా|*
*తథైవ జంతవః కాలే*
*తత్ర కా పరివేదన||*
*తా:- పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?*
*10. ఏక వృక్ష సమారూఢ*
*నానాజాతి విహంగమాః|*
*ప్రభతే క్రమశో యాంతి*
*తత్ర కా పరివేదన||*
*తా:- చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి.* *తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి.*
*అదే విధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్న మైనపుడు తన శరీరాన్ని, ఇంటిని వదలి వెళ్ళిపోతాడు.* *అందుకు బాధపడనవసరములేదు*.
*11. ఇదం కాష్టం ఇదం కాష్టం*
*నధ్యం వహతి సంగతః|*
*సంయోగాశ్చ వియోగాశ్చ*
*కా తత్ర పరివేదన||*
*తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.*
*ఈ చివరి శ్లోకం భార్యభర్తల గురించి సంకేతంగా చెప్పినదే! ఒక అమ్మాయి,ఒక అబ్బాయి వేరు వేరు కుటుంబాలలో జన్మిస్తారు. వీరిద్దరు జీవితమనే నదిలో కలుస్తారు. కొంతకాలం కలిసి బతుకుతారు. కాలం సమీపించడంతో ఒకరు కైవల్యం చెందుతారు, మరొకరు ఉండిపోతారు మరికొంతకాలం. ఇది సహజం మరియు సృష్టి క్రమం.*
*ఇందులో వేదన ఉండదని చెప్పలేదు. వేదన పడవద్దనీ చెప్పలేదు. సృష్టి సహజంగా వేదన తప్పదు. అందునా ఇద్దరు చాలా సంవత్సరాలు కలిసి జీవించిన వారిలో ఒకరు జారిపోతే మరొకరు వేదన పొందక ఎలా ఉండగలరు? సహజమైన వేదనను అడ్డుకోలేం. దానిని అనుభవించవలసినదే!*
*మరి పరివేదన పనికిరాదన్నారు. వేదనకి, పరివేదనకి తేడా ఉంది. వేదన సహజాతం. దానిని అను భవించాలి, పరివేదన అలాకాదు, మనం తలుచుకుని తలుచుకుని వేదన చెందడాన్నే పరివేదన అంటారు. ఈ పరివేదన పనికి రాదన్నారు.*
*ఇది సహజం, సృష్టి క్రమం సుమా! ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా? రాగలరా? సాధ్యమా? సృష్టి క్రమం ఇలాగే జరుతుంది, వేదన తప్పదు, పరివేదన పడకు అన్నారు.*
*మానవులలో చాలా రకాల బంధుత్వాలున్నాయి, కాని భార్యాభర్తలది ప్రత్యేక బంధం, ఇటువంటిది మరొకటి లేదు. అందుకే వీరిగురించి మాత్రమే ప్రత్యేకంగా ఉదహరించి చెప్పేరు. దంపతులిద్దరూ ఒకసారి పోరు, ఎవరి సమయమొస్తే వారు జారిపోతారు, రెండవవారు మిగిలిపోతారు,కొంతకాలం, ఒంటరిగా.*
*ఇది అందరు భార్యభర్తలకీ జరిగేదే!*
*ఇది సహజ పరిణామం,సృష్టి క్రమమమని చెప్పి ఓదార్చడమే లక్ష్యం.*
🕉️
[20/02, 10:19] Mallapragada Sridevi: *స్వర్గం - ఫ్రీ (ఉచితం)*
*నరకం - ఛార్జ్ (బోలెడు ఖర్చు).*
వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లినప్పుడు, అలసిపోయి కూర్చున్నప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి, ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి అన్నాడు ఒకతను.
కాసేపు ఆలోచించి ...
స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు ఖర్చు, అన్నాను.
ఆశ్చర్యంగా అతను నా వంకచూసి అదెలా? అన్నాడు,
నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను...
జూదం ఆడటానికి డబ్బు కావాలి,
మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి,
సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి,
పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలా ఇంకా, ఇంకా....
కానీ,
ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు,
దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు,
సేవచేయడానికి డబ్బు అవసరం లేదు,
అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు,
క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు,
మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు ఆవసరంలేదు.
దేవుణ్ణిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి...
డబ్బు ఖర్చు చేసి నరకాన్ని వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం ఇష్టపడతారా? ఆలోచించండి!
*సత్సంగత్వే నిస్సంగత్వం*
*నిస్సంగత్వే నిర్మోహత్వం*
*నిర్మోహత్వే నిశ్చలతత్వం*
*నిశ్చలతత్వే జీవన్ముక్తి:*
సత్పురుషుల మార్గదర్శనం,
సత్సంగత్యం, సహవాసం,
సత్ప్రవర్తనతో జీవించడం
మించి, ఈ భౌతిక ప్రపంచంలో ఇంకొకటి, మరొకటి లేదు కదా!
🙏🙏🙏🙏🙏
[20/02, 10:25] Mallapragada Sridevi: *అనుభవాల పాఠం వృద్ధాప్యం*
మనిషి జన్మ చాలా చిత్రమైనది. శిశువుg జన్మించినపుడు అందరికీ ఆనందాలు వెదజల్లుతాడు. అదేవిధంగా చనిపోయినప్పుడు అందరికీ కన్నీళ్ళు మిగిల్చి అనంతవాయువుల్లో కలిసిపోతాడు. శరీరం మాత్రం తన ఆకృతిని కోల్పోయి కాలిపోవడమో, భూగర్భంలో కలిసిపోవడమో జరుగుతుంది. ఇది సృష్టి ధర్మం. మనందరికీ తెలిసిన నగ్నసత్యం. ఉపనిషత్తులలో కూడా మానవ జీవితాన్ని ఆసక్తికరంగా వర్ణించారు. బాల్యాన్ని ఉదయంతోను, మధ్యాహ్నం యవ్వనంతోను, సాయంకాలాన్ని వృద్ధాప్యంతోను, రాత్రిని మరణంతోను వర్ణించారు. బాల్యం ఎంత ఆనందంగా గడుస్తుందో, అంతే బాధాకరంగా వృద్ధాప్యం నడుస్తుంది.
ఈ వృద్ధాప్యం అనేది మనిషి జన్మలో అతి ముఖ్యమైంది.
ఆరు పదుల జీవితం కొందరికి వెలుగులు, మరికొందరికి చీకటి వెలుగులు పంచి పెడుతుంది. 60 సంవత్సరాల వయస్సువరకు మనిషి జన్మ ఓ విధంగా నడిస్తే ఆపై వచ్చే దశనే వృద్ధాప్యం అంటారు. హాయి హాయిగా గడిచే జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొంటూ వచ్చి చివరికి మనిషిని మ్రగ్గిన పండులా మార్చి రాలిపోయేలా చేస్తుంది వృద్ధాప్యం.
అన్ని కష్టాలు 60 నుండే ఆరంభం అవుతాయి. ఆరోగ్య, మానసిక, సాంఘిక సమస్యలు ప్రతిమనిషిలోనూ తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితులు చాలా గొప్పగా వున్నా ఈ సమస్యలు మాత్రం అందరిలో వస్తాయి. ఎంతో అందంగా కాపాడుకొంటూ వచ్చిన మానవ దేహం రిపేరుకొచ్చేస్తుంది. శరీరంలోని ఒక్కో అంగం నిస్సత్తువ అవుతూ వస్తుంది. కొందరికి ముందుగా పంటి సమస్యలు, కంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కొందరిలో 60 సం.లనుండి ఆరంభం అయితే, మరికొందరికి 65 సం.లో ప్రారంభమవుతాయి. కొందరు వేగంగా వెళ్లిపోతారు. ఇంకొందరు కాస్త నెమ్మదిగా నడుస్తూ వెళ్లిపోతారు. అందరూ చేరే గమ్యం ఒక్కటే! కర్మ సిద్ధాంతాలతో మిగిలినవారు సరిపుచ్చుకుంటారు. ఇది జీవనతరంగం.
అన్నేళ్ళ ఆనందాలన్నీ ఆవిరైపోయి శేషజీవితం విషాదంతో ముగుస్తుంది. భగవంతుడు ఒక్కసారిగా మనిషికి వృద్ధాప్యంలో కష్టాల్ని ఆరంభిస్తాడు. ఎన్నో ఎన్నెన్నో సమస్యలు ఒకదానికొకటి తోడై బాధిస్తాయి. ఆలోచనలు పెరుగుతాయి. కానీ క్రమంగా ఆలోచించేశక్తి సన్నగిల్లుతుంది. ఎంత గింజుకున్నా కొన్ని గుర్తుకురావు. మనకు కావాల్సిన వ్యక్తుల్నే మనం గుర్తించలేము. ఒక్కోసారి ఆత్మీయుల పేర్లనుకూడా మరచిపోతాం. మందుబిళ్ళలు వేసుకొన్నా అవి మనకు పూర్వ శక్తిని తీసుకురాలేవు. కొందరికైతే శరీరంలో శక్తి పూర్తిగా నశిస్తుంది. నడుం నొప్పులు, కీళ్ళనొప్పులు ఇంకా ఇంకా ఎన్నెన్నో.. బాధలు అపరిమితం. ఒక్కోసారి అసహనం, కోపం కూడా వృద్ధాప్యాన్ని వెక్కిరిస్తాయి. చక్కెర వ్యాధిగ్రస్థుల బాధలైతే మరీ వర్ణనాతీతం. ఈదశలో కొందరికి సరైన ఆదరణ కన్పించదు. వాళ్ళ జీవితం మరీ దుర్భరం. ఒంటరి బ్రతుకు. సాంఘికంగా, ఆర్థికంగా మానసికంగా అన్నీ సమస్యలే. భార్యలు కోల్పోయిన భర్తలు, భర్తల్ని కోల్పోయిన భార్యల పరిస్థితి మరింత విచారకరం.
కొందరు వృద్ధాప్యంలో బాగా డిప్రెషన్‌కు గురవుతారు. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అందరిపై పెత్తనం చెలాయించాలని చూస్తారు. పిల్లల్ని తమ అదుపు ఆజ్ఞలో ఉంచాలనుకొంటారు. అన్ని విషయాల్లో తాము చెప్పిందే శాసనం కావాలనుకొంటారు. కొంతమంది వృద్ధాప్యంలో మంచానబడి కదలలేని స్థితిలో అచేతనంగా దుర్భర జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటివారిని చూసి రెండు కన్నీటిబొట్లు విడవడం తప్ప ఏం చేయలేం.
చాలామంది వృద్ధులు తమ ఇంటికే పరిమితమై జీవిస్తుంటారు. వీళ్లలో ఆత్మన్యూనతా భావన ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనూ కలవాలనుకోరు. ముఖ్యంగా తమకన్నా చిన్న వయసున్న వారితో. కొందరిలో మతిమరుపు ఎక్కువకావడం చాలా అనర్థాలకు కారణవౌతాయి. రాను రాను చెవుడు కూడా తోడుకావడం మరింత బాధాకరం అన్పిస్తుంది. ఆ వయస్సులో కూడా కొందరిలో ఏదో చేయాలన్న తపన. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత.
కొంతమంది పిల్లలు వృద్ధుల్ని నిర్లక్ష్యంగా చూస్తారు. మానవ సంబంధాలకన్నా ఆర్థిక సంబంధాలే ప్రాధాన్యత సంతరించుకొన్న ఈ జన జీవనంలో వృద్ధుల్ని తమకు భారంగా కూడా భావిస్తారు. ఇలాంటివారికి సమాజంలోని కొందరైనా చేయూతనివ్వాలి.
వృద్ధుల్ని పిల్లల్లా చూసుకోవాలి. ఆఖరి దశలో వీరిలో పిల్లల ప్రవర్తనే ఎక్కువ చోటుచేసుకుంటుంది. తమని కూడా చిన్నపిల్లల్లా చూసుకోవాలనుకుంటారు. వాళ్ళ చిన్న చిన్న కోర్కెలు తీర్చాలి. క్రమం తప్పక చికిత్సలు అందజేయాలి. వీలైనన్ని సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లు, వృద్ధాశ్రమాలు ప్రభుత్వమే నెలకొల్పాలి. ముఖ్యంగా వీరికి అన్ని మందులు ఉచితంగా అందజేయాలి. విధిగా ప్రతి ఆసుపత్రిలో వృద్ధులకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి సబ్సిడీపై చికిత్స జరిపించాలి. మానసికంగా కూడా వీళ్ళకు మనోధైర్యాన్ని నింపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆ దిశగా కొన్ని సదుపాయాలను కల్పించాయి. టాక్స్ బెనిఫిట్స్, డిపాజిట్లకు అదనపు వడ్డీతోపాటు విమాన, రైలు, బస్సు ప్రయాణ ఛార్జీల్లో రాయితీలిస్తున్నాయి. బ్యాంకుల్లో కొత్తగా 65 సం.లు దాటిన వృద్ధులకు ప్రత్యేక సహాయం ఏర్పాట్లు చేశారు.
వృద్ధులు కూడా జీవిత సత్యాన్ని గ్రహించి ఉన్నంతకాలం హాయిగా, ఆనందంగా ఎలాంటి దురాలోచనలు చేయకుండా బ్రతకడం నేర్చుకోవాలి. జననం తథ్యమని.. మరణం తప్పదని గుర్తెరగాలి. తొలి జీవితాన్ని కడవరకూ కోరుకోవడం అత్యాశే. అందరికీ ఆదర్శంగా బ్రతకాలి. కనీసం ఇపుడైనా వయస్సులో అహంకారంతో ఎవరినైనా బాధించి ఉంటే గుర్తు తెచ్చుకుని వీలైతే వారికి క్షమాపణలు చెప్పడం లేదా పశ్చాత్తాపం చెందడం లాంటివి కూడా చేస్తే మంచిది. దైవచింతన కూడా కొంతవరకు వీరికి మనశ్శాంతిని అందిస్తుంది. ఇంట్లోనే హాయిగా ఆత్మవిశ్వాసంతో, ఆనందంతో జీవించండి.. ప్రతి ఒక్కరూ కాబోయే వృద్ధులే! అనుభవాల పాఠం వృద్ధాప్యం.
No comments:
Post a Comment