నేటి సూక్తి ✳ అచలములోని చలనమే శక్తి , ✳ చలనము లోని నిశ్చలమే ఆత్మ
.: ముక్తి మార్గంలో అత్యుత్తమైనది జ్ఞాన మార్గం. అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవడం.
నేడు ...శ్రీ పంచమి . వసంత పంచమి శుభాకాంక్షలు మరియు శుభ శనివారం మిత్రులందరికీ
స్థిర వాసరే, 05, ఫిబ్రవరి 2022 కు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
మల్లాప్రగడ రామకృష్ణ
🍀. శ్రీ సరస్వతీ స్తోత్రం 🍀
నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |
విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ||
శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ||
🌻 🌻 🌻 🌻 🌻
. శ్రీ సరస్వతీ సాధన స్తోత్రం
ఓం అస్య శ్రీసరస్వతీ స్తోత్ర మంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః శ్రీసరస్వతీ దేవతా ధర్మార్థ కామ మోక్షార్థే జపే వినియోగః |
ఆరూఢా శ్వేతహంసే భ్రమతి చ గగనే దక్షిణే చాక్షసూత్రం
వామే హస్తే చ దివ్యాంబరకనకమయం పుస్తకం జ్ఞానగమ్యా |
సా వీణాం వాదయంతీ స్వకరకరజపైః శాస్త్రవిజ్ఞానశబ్దైః
క్రీడంతీ దివ్యరూపా కరకమలధరా భారతీ సుప్రసన్నా 1
శ్వేతపద్మాసనా దేవీ శ్వేతగంధానులేపనా |
అర్చితా మునిభిః సర్వైః ఋషిభిః స్తూయతే సదా |
ఏవం ధ్యాత్వా సదా దేవీం వాంఛితం లభతే నరః 2
శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం
వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహామ్ |
హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం
వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్ 3
యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా 4
హ్రీం హ్రీం హృద్యైకబీజే శశిరుచికమలే కల్పవిస్పష్టశోభే
భవ్యే భవ్యానుకూలే కుమతివనదవే విశ్వవంద్యాంఘ్రిపద్మే |
పద్మే పద్మోపవిష్టే ప్రణతజనమనోమోదసమ్పాదయిత్రి
ప్రోత్ఫుల్లజ్ఞానకూటే హరినిజదయితే దేవి సంసారసారే 5
ఐం ఐం ఐం దృష్టమంత్రే కమలభవముఖాంభోజభూతస్వరూపే
రూపారూపప్రకాశే సకలగుణమయే నిర్గుణే నిర్వికారే |
న స్థూలే నైవ సూక్ష్మేఽప్యవిదితవిభవే నాపి విజ్ఞానతత్వే
విశ్వే విశ్వాంతరాత్మే సురవరనమితే నిష్కలే నిత్యశుద్ధే 6
హ్రీం హ్రీం హ్రీం జాప్యతుష్టే హిమరుచిముకుటే వల్లకీవ్యగ్రహస్తే
మాతర్మాతర్నమస్తే దహ దహ జడతాం దేహి బుద్ధిం ప్రశస్తామ్ |
విద్యే వేదాంతవేద్యే పరిణతపఠితే మోక్షదే ముక్తిమార్గే |
మార్గాతీతస్వరూపే భవ మమ వరదా శారదే శుభ్రహారే 7
ధీం ధీం ధీం ధారణాఖ్యే ధృతిమతినతిభిర్నామభిః కీర్తనీయే
నిత్యేఽనిత్యే నిమిత్తే మునిగణనమితే నూతనే వై పురాణే |
పుణ్యే పుణ్యప్రవాహే హరిహరనమితే నిత్యశుద్ధే సువర్ణే
మాతర్మాత్రార్ధతత్వే మతిమతి మతిదే మాధవప్రీతిమోదే 8
హ్రూం హ్రూం హ్రూం స్వస్వరూపే దహ దహ దురితం పుస్తకవ్యగ్రహస్తే
సంతుష్టాకారచిత్తే స్మితముఖి సుభగే జృంభిణి స్తంభవిద్యే |
మోహే ముగ్ధప్రవాహే కురు మమ విమతిధ్వాంతవిధ్వంసమీడే
గీర్గౌర్వాగ్భారతి త్వం కవివరరసనాసిద్ధిదే సిద్ధిసాధ్యే 9
స్తౌమి త్వాం త్వాం చ వందే మమ ఖలు రసనాం నో కదాచిత్త్యజేథా
మా మే బుద్ధిర్విరుద్ధా భవతు న చ మనో దేవి మే యాతు పాపమ్ |
మా మే దుఃఖం కదాచిత్క్వచిదపి విషయేఽప్యస్తు మే నాకులత్వం
శాస్త్రే వాదే కవిత్వే ప్రసరతు మమ ధీర్మాస్తు కుంఠా కదాపి 10
ఇత్యేతైః శ్లోకముఖ్యైః ప్రతిదినముషసి స్తౌతి యో భక్తినమ్రో
వాణీ వాచస్పతేరప్యవిదితవిభవో వాక్పటుర్మృష్టకంఠః |
సః స్యాదిష్టాద్యర్థలాభైః సుతమివ సతతం పాతితం సా చ దేవీ
సౌభాగ్యం తస్య లోకే ప్రభవతి కవితా విఘ్నమస్తం వ్రయాతి 11
నిర్విఘ్నం తస్య విద్యా ప్రభవతి సతతం చాశ్రుతగ్రంథబోధః
కీర్తిస్రైలోక్యమధ్యే నివసతి వదనే శారదా తస్య సాక్షాత్ |
దీర్ఘాయుర్లోకపూజ్యః సకలగుణనిధిః సంతతం రాజమాన్యో
వాగ్దేవ్యాః సమ్ప్రసాదాత్త్రిజగతి విజయీ జాయతే సత్సభాసు 12
బ్రహ్మచారీ వ్రతీ మౌనీ త్రయోదశ్యాం నిరామిషః |
సారస్వతో జనః పాఠాత్సకృదిష్టార్థలాభవాన్ 13
పక్షద్వయే త్రయోదశ్యామేకవింశతిసంఖ్యయా |
అవిచ్ఛిన్నః పఠేద్ధీమాంధ్యాత్వా దేవీం సరస్వతీమ్ 14
సర్వపాపవినిర్ముక్తః సుభగో లోకవిశ్రుతః |
వాంఛితం ఫలమాప్నోతి లోకేఽస్మిన్నాత్ర సంశయః 5
బ్రహ్మణేతి స్వయం ప్రోక్తం సరస్వత్యాః స్తవం శుభమ్ |
ప్రయత్నేన పఠేన్నిత్యం సోఽమృతత్వాయ కల్పతే 16
ఇతి శ్రీసరస్వతీ స్తోత్రమ్ |
*శ్రీ పంచమి* ప్రాంజలి ప్రభ
*మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి అని పేర్లు*
*జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము , విద్య , చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత , జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి , స్మరించి , పూజించే రోజే వసంత పంచమి*.
*యావద్భారతావనిలో ప్రజలంతా , ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు*.
*యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి*.
*శ్రీ పంచమి రోజు చేయవలసిన పూజలు:*
*మాఘ శుక్ల పంచమ్యాం*
*విద్యారంభే దినేపి చ*
*పూర్వేహ్ని సమయం కృత్యా*
*తత్రాహ్న సంయుతః రుచిః ॥*
*వసంత పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించి , శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు , జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను , లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చేయాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో , సుగంధ ద్రవ్యాలతో , చందనంతో , అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి*.
*చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారంకూడా ఉంది. తద్వారా , ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి , నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం*.
*పూర్వ కాలంలో రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి , కవితా గోష్టులు జరిపి కవులను , పండితులను , కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది*.
*సరస్వతీ కటాక్షం:*
*బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి , ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు*.
*గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో , సూర్యుని ఆరాధించగా , ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు*.
*సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు*.
*వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసాడని పురాణాలు చెబుతున్నాయి*.
*అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన గావించి , పురాణాలను ఆవిష్కరించాడని , మహాభారత , భాగవత , బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి*.
*తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక , ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు*.
మాతృశ్రీ వందన పుష్పాలు
మోహముతో ఆకార్షణ కల్పించి
మొనముతో ఆదర్శము చూపించి
హాస్యముతో ఆనందము కల్పించి
వేదముతో వాక్కందము చూపించె
పూజకే సౌభాగ్య సంపదలు అందించి
మాటకే కారుణ్య భావములు కల్పించి
నిత్యమూ సద్బుద్ధి కల్పనలు కల్పించి
ధైర్యమూ సౌఖ్యము శక్తియును కల్పించె
మన్మధుడు ఆవహించి రతిని ప్రొద్భవించిన
తన్మయము చెంది వచ్చి పతిని తృప్తిపర్చిన
విస్మయము తెల్పి మంచి చేసియు మభ్యపర్చిన
సంఘమును బాగు చేసె తల్లిగ ఉద్భవించుట
స్త్రీ పురుష భేదము చూపక సమస్తము కాపాడి
మంచి చెడు చూడక నిత్యము నిమిత్తము కాపాడి
వచ్చిపొవు వారల సౌఖ్యము సమస్యను కాపాడి
సేవ సహ వాసము బలిమిని తల్లిగ కాపాడె
లలితా సహస్రనామాలలో ప్రస్తుతము 1 నుండి 100 వరకు మరియు వాటి అర్థం
ప్రార్థన
చతుర్భుజే చంద్ర కలావతంసే
కుచోన్నతే కుంకుమ రాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ
హస్తే నమస్తే జగదేక మాతః
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ,
చాల పెద్దమ్మ,సురారులమ్మకడుపారడిపుచ్చినయమ్మ
దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల
నుండెడి యమ్మ దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి
యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
ధ్యానమ్
*అరుణాం కరుణా తరంగితాక్షీం
ధృతపాశాంకుశ పుష్పబాణ చాపామ్
*అణిమాదిభిరావృతాం మయూఖై
రహమిత్యేవ విభావయే భవానిమ్
*ధ్యాయేత్ పద్మాసనస్థాo వికసితవదనాం
పద్మపత్రాయతాక్ష్మీం
* హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధెమ
పద్మాం వరాంగీమ్
* సర్వాలంకారయుక్తాం సకల మభయదాం
భక్తనమ్రాం భవానీం
* శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం
సర్వసంపత్ప్ర దాత్రీమ్
సకుంకుమవిలేపనా మళికచుంబి కస్తూరికాం
సమంద హసితేక్షణాo సశరచాప పాశాంకుశాం
అశేషజనమోహినీ మరుణమాల్యభుషోజ్జ్వలాం
జపాకుసుమ భాసురాం జపవిదౌ స్మరేద్దమ్బికామ్
అనంతమైన భగవంతుని స్వరూపమును వర్ణించడానికిఉపాసించడానికి స్మరించడానికి సహస్రనామాలు చెప్పబడినవి. భగవంతుడు అనంతుడు. 'శతమనంతం భవతి'. నామము అంటే ఆ దేవత జ్ఞానము. ఇది ఉపనిషత్తు. ఈ సహస్ర నామ పారాయణము శివుని సంకల్ప శక్తిని ఉపాసించుట. మనిషికి ఎన్ని అవసరాలో అన్ని దేవతా రూపాలు. ఉదా: విధ్యకి సరస్వతి, ధనము కొరకు లక్ష్మి. లలిత అంటే లావణ్యము, లాలించేది మొదలగు అర్థములు చెప్పవచ్చు. లలిత ఉపాసన అంటే సౌందర్యమును ఉపాసించుట. లోకాతీత లావణ్యము లలిత. లోకాతీత లావణ్యముతో అన్ని లోకములయందు వ్యాపించి యున్నది, ప్రపంచానికి కారణమైనది పోషకమైనది, రక్షకమైనది అయిన అమ్మనే లలితాంబ
ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి, అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉంది. లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మేధిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది. స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధి సాధనాలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని, విశ్వసిస్తారు. లలిత (క్రీడించునది) ను స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గ, కాళి, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, అర్చన, హోమం వంటి అనేక పూజావిధానాలలో ఈ సహస్రనామస్తోత్రం పఠించడం జరుగుతుంది
1. శ్రీమాతా:- మంగళకరమైన, శుభప్రథమైన తల్లి
2. శ్రీ మహారాజ్ఞి:- శుభకరమైన గొప్పదైన రాణి
3. శ్రీ మత్సిం హసనేశ్వరి:- శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.
4. చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది
5. దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది
6. ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది
7. చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది.
8. రాగస్వరూప పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది.
9. క్రోధాకారాంకుశోజ్జ్వలా : క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది.
10. మనో రూపేక్షు కోదండా : మనస్సును రూపముగా గల్గిన చెఱకుగడ విల్లును ధరించింది.
11. పంచతన్మాత్ర సాయకా : ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించింది.
12. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన సహజమైన ఎఱ్ఱని కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.
13. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా : సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది.
14. కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండితా : పద్మరాగముల వరుసచేత ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడింది.
15. అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా : అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది.
16. ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా : ముఖము అనెడి చంద్రునియందు మచ్చవలె ఒప్పెడు కస్తురి బొట్టును కలిగినది.
17. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : ముఖమనెడు మన్మథుని శుభమైన నివాసమునకు తోరణమువలె ఒప్పు కనుబొమలు కలిగినది.
18. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా : ముఖదీప్తి అనెడు సంపదప్రథమైన స్రోతస్సునందు కదలాడుచున్న చేపలవలె ఒప్పుచుండు కన్నులు కలిగినది.
19. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా : క్రొత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలెడు ముక్కుదూలముతో ప్రకాశించునది
20. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా : ఆకాశములో ప్రకాశించునట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కు బులాకీ చేత ప్రకాశించునది.
21. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా : కడిమి పూల గుచ్చముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా నున్నది.
22. తాటంక యుగళీభూత తపనోడుప మండలా : చెవి కమ్మలుగా జంటగా అయిన సుర్య చంద్ర మండలమును గలది.
23. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః - పద్మరాగ మణుల అద్దమును పరిహసించు చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది
24. నవవిద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్ఛదా - కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది.
25. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా - శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది.
26. కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా - కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది
27. నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ - తన యొక్క సంభాషణ యొక్క తియ్యదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్ఛపీ అను పేరుగల వీణ గలది
28. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మనసా - చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది.
29. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా - లభ్యము గాని లేదా దొరకని పోలిక గల గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించునది.
30. కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా - పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే, పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడ గలిగినది.
31. కనకాంగద కేయూర కమనీయ భూజాన్వితా - బంగారు ఆభరణాలు, వంకీలతో అందమైన బాహువులు కలిగినది.
32. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా - రత్నముల చేత కంఠమునందు ధరించు చింతాకు అనే ఆభరణముతో కదులుచున్న ముత్యాలహారంతో కూడినది.
33. కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ - కామేశ్వరుని యొక్క ప్రేమ అనెడి శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు గలది
34. నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ - బొడ్డు అనెడి పాదు లోని నూగారు అనెడి తీగకు పండ్లవలె ఒప్పు జంట స్తనములు గలిగినది.
35. లక్ష్య రోమలతాధారతఅ సమున్నేయ మధ్యమా - కనబడుచున్న నూగారు అనెడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది
36. స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా - వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడుతలౌ గలది
37. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ - ఉదయ సూర్యుని రంగువలె కుంకుమపువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది.
38. రత్నకింకిణికా రమ్యా రశనాదామ భూషితా - రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడింది
39. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా - కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది
40. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా - మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఒక్కు మోకాళ్లతో ప్రకాశించునది.
41. ఇంద్రగోప పరీక్షిప్త స్మర తూణాభజంఘికా - ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలది.
42. గూఢగుల్ఫా - నిండైన చీలమండలు గలది.
43. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా - తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది.
44. నఖదీధితి సంఛన్న సమజ్జన తమోగుణా - గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం గలది.
45. పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా - పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు గలది.
46. శింజానమణి మంజీర మండిత శ్రీపదాంభుజా - ధ్వని చేయుచున్న మణులు గల అందెలచేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది.
47. మరాళీ మందగమనా - హంసవలె ఠీవి నడక కలిగినది.
48. మహాలావణ్య శేవధిః - అతిశయించిన అందమునకు గని లేదా నిధి
49. సర్వారుణా - సర్వము అరుణ వర్ణంగా భాసించునది.
50. అనవద్యాంగీ - వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.
51. సర్వాభరణ భూషితా - సమస్తమైన నగల చేత అలంకరించబడింది.
52. శివకామేశ్వరాంకస్థా - శివస్వరూపుడు కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.
53. శివా - వ్యక్తమైన శివుని రూపము కలది.
54. స్వాధీన వల్లభా - తనకు లోబడిన భర్త గలది.
55. సుమేరు శృంగమధ్యస్థా - మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో ఉంది.
56. శ్రీమన్నగర నాయికా - శుభప్రథమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్ఠాత్రి.
57. చింతామణి గృహాంతఃస్థా - చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉంది.
58. పంచబ్రహ్మాసనస్థితా - ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో ఉంది.
59.మహాపద్మాటవీ సంస్థా - మహిమగల లేదా గొప్పవైన పద్మములు గల అడవియందు చక్కగా ఉంది.
60. కదంబ వనవాసినీ - కడిమి చెట్ల యొక్క తోటయందు వసించునది.
61. సుధాసాగర మధ్యస్థా - చక్కగా గుర్తించుకొని తనయందు ధరించి అవసరమైనపుడు వ్యక్తము చేయగలుగునది.
62. కామాక్షీ - అందమైన కన్నులు గలది.
63. కామదాయినీ - కోరికలను నెరవేర్చునది.
64. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా - దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము గలది.
65. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా - భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.
66. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా - సంపత్కరీ దేవి చేత చక్కగా అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడింది.
67. అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా - అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుఱ్ఱముల యొక్క కోట్లానుకోట్లచే చుట్టుకొనబడింది.
68. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా - చక్రరాజము అను పేరుగల రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది.
69. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా - గేయచక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది.
70. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా - కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండము చేతియందు ఎల్లప్పుడూ వుండు దేవి ముందు ఉండి సేవింపబడునది
71. జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా - జ్వాలా మాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము యొక్క మధ్యనున్నది.
72. భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా - భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించింది.
73. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా - నిత్యాదేవతల యొక్క పరులను ఆక్రమించుకోగల శక్తి, సామర్థ్య, ఉత్సాహాలను చూసి సంతోషించింది.
74. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా - భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించునది.
75. మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా - మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతసించింది.
76. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా - విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది.
77. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా - కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది.
78. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా - మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది.
79. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ - రాక్షస రాజైన భండాసురిని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది.
80. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః - చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది.
81. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా - మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత - నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది.
82. కామేశ్వరాస్త్ర ప్రయోగముతో నిశ్శేషంగా దహింపబడిన భండాసురునితో కూడిన శూన్యకా నగరము గలది.
83. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా - బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది.
84. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః - శివుని యొక్క మూడవ కంటికి నిశ్శేషంగా దహింపబడిన మన్మథునికి సంజీవనము వంటి మందువలె పనిచేసినది అనగా పునర్జీవనము ప్రసాదించునది.
85. శ్రీ మద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా - మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అను పేరుగల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగాగల పద్మము వంటి ముఖము గలది.
86. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ - కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట స్వరూపముగా గలది.
87. శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ - శక్తికూటముతో సామ్యమమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది.
88. మూలమంత్రాత్మికా - మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపముగా గలది.
89. మూలకూట త్రయకళేబరా - మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది.
90. కులమృతైక రసికా - కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది.
91. కులసంకేత పాలినీ - కుల సంబంధమైన ఏర్పాటులను పాలించింది.
92. కులాంగనా - కుల సంబంధమైన స్త్రీ.
93. కులాంతఃస్థా - కులము యొక్క మద్యములో ఉంది.
94. కౌలినీ - కులదేవతల రూపంలో ఆరాధింపబడునది.
95. కులయోగినీ - కుండలినీ యోగ దేవతా స్వరూపిణి.
96. అకులా - అకులా స్వరూపురాలు లేదా కులము లేనిది.
97. సమయాంతఃస్థా - సమయాచార అంతర్వర్తిని.
98. సమయాచార తత్పరా - సమయ అనే ఆచారములో ఆసక్తి కలది.
99. మూలాధారైక నిలయా - మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది.
100. బ్రహ్మగ్రంథి విభేదినీ - బ్రహ్మగ్రంథిని విడగొట్టునది...
.
నేడు శ్రీ రామదాసు జయంతి....!!
కంచెర్ల గోపన్న రామభక్తునిగా మారిన తరువాత భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందాడు.
ఖమ్మంజిల్లా నేలకొండపల్లి గ్రామంలో 1620 సంవత్సరంలో జన్మించాడు.
తండ్రి లింగమూర్తి. తల్లి కామాంబ. దాశరధీశతకంతో సహా ఎన్నో రామకీర్తనలు రామదాసు అందించినవే.
తెలుగులో కీర్తనలకు ఆద్యుడు రామదాసు అంటారు.
ఇతని గురువు రఘునాథభట్టాచార్యులు. గోపన్న మేనమామ మాదన్న గోల్కొండ నవాబు తానీషా ఆస్థానంలో ఒక ముఖ్యఉద్యోగి.
ఇతని సిఫార్స్ వలన గోపన్న పాల్వంచ పరగణాకు తహసిల్దార్ గా నియమించబడ్డాడు.
గోదావరి నదీతీరంలోని భధ్రాచలంకూడా ఈ పరగణాలోనిదే. అప్పటికి భద్రాచల రామాలయం పాడుపడిన స్థితిలో ఉంటుంది.
పోకల దమ్మక్క అనే రామభక్తురాలు ఈ గుడిని పునరుద్దరించమని గోపన్నను కోరతుంది.
గోపన్న దానికి అంగీకరిస్తాడు. ఆలయ నిర్మాణానికి తానీషాకు కట్టవలసి భూమిశిస్తు సొమ్మును వాడతాడు.
ఈ విషయం తెలిసిన తానీషా ఆగ్రహంతో గోపన్నను ఖైదు చేస్తాడు. 12 సంవత్సరాలు జైలులో బాధలు పడతాడు గొపన్న.
జైలుగది గోడల మీద సీతా రామలక్ష్మణులను చిత్రాలను గీసి వారిని గురించి గానం చేస్తూ కాలం గడుపుతాడు.
ఈ సమయంలోనే ప్రసిద్ధ సంకీర్తనలు రచించాడు. వాటిలో కొన్ని
"నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి"
"పలుకే బంగారమాయెనా"
"అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా" వంటివి.
ఇంకా తన బాధను చెప్పుకున్న
"ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్రా", కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది-
"నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు? నీబాబిచ్చాడా? నీ మామిచ్చాడా?" - అని వాపోయి మరలా -
"ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు. నా బ్రతుకిలాగయ్యింది. నీవే నాకు దిక్కు" - అని వేడుకొన్నాడు.
12 సంవత్సరాలు తరువాత, రామలక్ష్మణులు గోల్కొండ నవాబు తానీషా వద్దకు వెళ్ళి, గోపన్న బాకీపడ్డ ఆరు లక్షల వరహాల శిస్తు సొమ్ము చెల్లించి, రామదాసును విడిపించటానికై పత్రము వ్రాయించుకున్నారని కథనం.
వారిచ్చిన నాణెములను రామటంకాలు అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము, మరొకవైపు రామభక్తుడు హనుమంతుని ముద్రలు ఉన్నాయి.
ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై కొంత భూమిని ఇచ్చారు.
ఇప్పటికి కూడా రామదాసుని ఖైదులో ఉంచిన గదిని గోల్కొండ కోటలో చూడవచ్చు.
శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పటి నుండి ప్రారంభమైంది తరువాత నుండి కంచర్ల గొపన్న భక్తరామదాసుగా పేరుపొందాడు.
రామదాసు సీతమ్మ వారికి చేయించిన చింతాకు పతకము, లక్ష్మణునకు చేయంచిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ భద్రాచల దేవస్థానములో భద్రపరచి ఉన్నాయి.
శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు.
త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు...స్వస్తి...
ప్రాంజలి ప్రభ
మాతృశ్రీ వందన పుష్పాలు
పలుకు లన్నిమెత్తని ముద్దుల పనులు వేరు
ఫలములు సుందరంబులు రుచులువేరు
కొడుకులు బుద్ధిమంతులు గుణములు వేరు
మనసును పంచి బుద్ధులు సరిచెయు తల్లి
సాదుసంగమంబు, సత్కావ్యపఠనంబు నిత్యం
ఆటపాటలందు, ఆరోగ్యసహనంబు నిత్యం
చెప్పుచేతలందు, విద్యాభోధనలందు నిత్యం
మంచిచెడ్డలందు, సంతృప్తి పరిచేది తల్లే
అతిథిజనుల వీడక, అభ్యాగతుల వీడక
ఆదిపురుషుల వీడక ఆదేవతలు వీడక
అన్నము సమము చేసియు నైవేద్యములు పెట్టియు
ధర్మ నియమము తెల్సికొ సత్యమె జననీ కళ
హంస బకము ఒకేరంగు ఉన్న గుణం వేరు
గాజు మణియు ఒకే మెర్పు ఉన్న ధనంవేరు
తెల్పు నలుపు ఒకే సారి అన్న పదం వేరు
బుద్ధి మనసు ఒకే తీర్పు తల్లి తనం వేరు
జవ్వనంబు గలిగి, సౌందర్యమును గల్గి,
చక్కనమ్మ గలిగి, బాంధవ్యమును గల్గి,
విద్య తృప్తి గలిగి, ఆకర్షణ ను గల్గి,
తప్పులెన్నొ చెసియు జీవించుటయు తప్పు
త్యాగభావమున తరువులే గురువులు
రాజకీయమున పదవులే గురువులు
ప్రేమపాకమున పెదవులే గురువులు
సేవ సాధనకు జనకులే గురువులు
చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచివాని చెలిమి మంచువోలె
భార్యకాని చెలిమి చిచ్చువోలె
భార్యాభర్త బలిమి మంచు వోలె
మందమతులకెపుడు ఉండదు ముందుచూపు
తిండిపరుల కెపుడు ఉండదు దాహ చూపు
మొండి బతుకు ఎపుడు ఉండదు ఆశచూపు
కాల మడుగు కెపుడు ఉండదు వెన్క చూపు
పుష్పసౌరభంబు పొంద లేదు దారం
గంధవాసనంబు పొందలేదు భాష్పం
మంచిమాటలన్ని పొందలేరు మూర్ఖం
జీవ శక్తి తల్లి పొందలేదు సత్యం
--(())--
ఆరోగ్యం బ్రహ్మ... ఆనందం బ్రహు.. ఆధ్యాత్మిక బ్రహ్మ
సేకరణ..మల్లాప్రగడ రామకృష్ణ
*నీవే అదృష్టవంతుడివి*
*50 ఏళ్ల పెద్దమనిషి తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు మరియు అతని భార్య మెడికల్ కౌన్సెలర్‌తో అపాయింట్‌మెంట్ తీసుకుంది.*
కౌన్సెలర్ తన కౌన్సెలింగ్ ప్రారంభించాడు. అతను కొన్ని వ్యక్తిగత విషయాలు అడిగాడు మరియు పెద్దమనిషి భార్యను బయట కూర్చోమని చెప్పాడు.
పెద్దమనిషి మాట్లాడాడు...
"నేను చాలా ఆందోళన చెందుతున్నాను ...
ఇన్‌ఫాక్ట్‌లో నేను చింతలతో మునిగిపోయాను...!" ...... "ఉద్యోగ ఒత్తిడి... పిల్లల చదువులు మరియు ఉద్యోగ టెన్షన్‌లు... ఇంటి లోన్, కార్ లోన్..." ...... *"నేను విపరీతమైన డిప్రెషన్.."*
అప్పుడు నేర్చుకున్న కౌన్సెలర్ ఏదో ఆలోచించి, "నువ్వు 10వ తరగతి ఏ స్కూల్లో చదివావు?"
పెద్దమనిషి స్కూల్ పేరు చెప్పాడు.
కౌన్సెలర్ చెప్పారు:-
*"మీరు ఆ పాఠశాలకు వెళ్లాలి. మీ పాఠశాల నుండి, మీరు మీ 'క్లాస్ X' రిజిస్టర్‌ని గుర్తించి, మీ తోటివారి పేర్లను వెతికి, వారి ప్రస్తుత క్షేమం గురించి సమాచారాన్ని పొందడానికి ప్రయత్నించండి.*
*సమాచారమంతా డైరీలో రాసి ఒక నెల తర్వాత నన్ను కలవండి."*
పెద్దమనిషి తన పాఠశాలకు వెళ్లి, రిజిస్టర్‌ని కనుగొని, దానిని కాపీ చేసుకున్నాడు.
అందులో 120 మంది పేర్లు ఉన్నాయి. అతను ఒక నెలలో పగలు మరియు రాత్రి ప్రయత్నించాడు, కానీ 75-80 సహవిద్యార్థుల గురించి సమాచారాన్ని సేకరించలేకపోయాడు.
*ఆశ్చర్యం!!!*
*వారిలో 20 మంది చనిపోయారు...*
*7 మంది వితంతువులు/వితంతువులు మరియు 13 మంది విడాకులు తీసుకున్నారు...*
*10 మంది వ్యసనపరులుగా మారారు, వారి గురించి మాట్లాడటానికి కూడా విలువ లేదు...*
*5 మంది చాలా పేలవంగా బయటకు వచ్చారు, వారికి ఎవరూ సమాధానం చెప్పలేరు..*
*6 చాలా ధనవంతుడయ్యాడు, అతను నమ్మలేకపోయాడు...*
*కొందరికి క్యాన్సర్, మరికొందరు పక్షవాతం, మధుమేహం, ఆస్తమా లేదా గుండె జబ్బులు..*
*ప్రమాదాలలో ఒక జంట చేయి/కాలు లేదా వెన్నుపాముకు గాయాలై మంచంలో ఉన్నారు...*
*కొందరి పిల్లలు మతిస్థిమితం లేనివారు, విచ్చలవిడిగా లేదా పనికిరాని వారిగా మారారు...*
*ఒకడు జైలులో ఉన్నాడు... రెండు విడాకుల తర్వాత ఒక వ్యక్తి మూడో పెళ్లి కోసం చూస్తున్నాడు...*
ఒక నెలలో, పదవ తరగతి రిజిస్టర్ విధి యొక్క వేదనను వివరిస్తుంది ...
*కౌన్సెలర్ అడిగాడు, "ఇప్పుడు చెప్పు నీ డిప్రెషన్ ఎలా ఉందో?"*
పెద్దమనిషికి అర్థమైంది, 'ఆయనకు ఏ రోగం లేదు, ఆకలితో అలమటించలేదు, అతని మనస్సు పరిపూర్ణంగా ఉంది, అతను కోర్టు / పోలీసులు / లాయర్లచే పెంచబడలేదు, అతని భార్య మరియు పిల్లలు చాలా మంచి మరియు ఆరోగ్యంగా ఉన్నారు. అతను కూడా ఆరోగ్యంగా ఉన్నాడు...
*ప్రపంచంలో నిజంగా చాలా దుఃఖం ఉందని, తాను చాలా సంతోషంగా మరియు అదృష్టవంతుడిని అని ఆ పెద్దమనిషి గ్రహించాడు.*
*ఇతరుల ప్లేట్‌లను చూసే అలవాటును వదిలేయండి, మీ ప్లేట్‌లోని ఆహారాన్ని ప్రేమతో తీసుకోండి. ఇతరులతో పోల్చవద్దు. ప్రతి ఒక్కరికీ వారి స్వంత విధి ఉంటుంది.*
ఇంకా, మీరు డిప్రెషన్‌లో ఉన్నారని అనుకుంటే, మీరు కూడా మీ పాఠశాలకు వెళ్లి, పదో తరగతి రిజిస్టర్‌ని తీసుకురావాలి.
సేకరణ: మానస సరోవరం
0 Comments
రసిక - మ/న/లగ UU UII IIU 8 అనుష్టుప్పు 121
==
నీకై కోర్కెలు మదిలో
నాకై రమ్మిట సకియా
లోకమ్మంతయు మనదే
నాకమ్మందున మనమే
==
హేమంతమ్మునఁ జలిలో
నీమాయన్ బడితినిగా
కామాశ్లేషపు సుగమే
ప్రేమాచ్ఛాదక మననా
==
ఏకాంతమున నెలుఁగై
ఆకాశమ్మున వెలుఁగై
రాకాచంద్రుని కళయై
రా కందోయికిఁ గలయై
==
అక్షరసామ్య యతితో -
==
శ్రీదేవీ - చెలువముతో
నాదమ్మై - నగవులతో
మోదమ్మై - పులకలతో
వేదార్థా - వెలుఁగిడవా
==
మల్లారీ - మధురముగాఁ
బిల్లంగో-వికి మది రం-
జిల్లంగాఁ - జెలువిడరా
మెల్లంగా - మృదుతరమై
==
రావోయీ - రసికుఁడ నీ
రావాలే - రసభరితం
బీవే నా - యిరవు గదా
జీవమ్మా - చిఱునగవే
==
* పంచ' దంపతులు
ఈలోకంలో కోట్లాదికోట్ల దంపతులున్నా వాళ్ళంతా 5 విధాలు గానే ఉంటారు.
1. మొదటివారు:- *గౌరీశంకరులు!
అర్థనారీశ్వరరూపం, తలనుంచి కాలిబొటనవ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత, ఆలోచనలకు తల, కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం!కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.
2. రెండవవారు:- *లక్ష్మీనారాయణులు!
విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచనకూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట.
3. మూడవవారు:- *బ్రహ్మ సరస్వతుల జంట
బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా ఏ మాట మాట్లాడినా, ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య .. ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.
4. నాల్గవవారు:- *ఛాయా సూర్యులు!
సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు,
అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.
తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు. అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది, ఛాయాదేవి.
ఏ ఇంట భర్త కఠినంగా, కోపంగా పట్టుదలతో ఉంటాడో,
ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.
5. ఐదవవారు:- *రోహిణీ చంద్రులు
రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే సామెత ఉంది, చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ,
ఏ జంట భర్త మెత్తగా ఉండి, లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోను ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.
******
॥ దత్త నామస్మరణ ॥ 🙏🏻🙏🏻
రచన::శ్రీ రంగావధూత
తెలుగు::రాజ్యలక్ష్మి శ్రీనివాస బొడ్డుపల్లి.
🌹శ్లోకం::- జ్ఞానం భక్తిః కర్మయోగశ్చ యోగః సర్వేప్యేతె దత్తధామ్ని ప్రలీనాః !
దత్తస్కంధే సర్వశాఖా మిలింతి మూలం తస్మాద్దత్తనామ స్మరాత్మన్ ॥
🌹భావం::- ఈ శ్లోకంలో పూజ్యశ్రీ రంగావధూత గారు భారతీయ సంస్కృతిలోని అన్ని యోగాలకు, మార్గాలకు మూలం దత్తాత్రేయ స్వామి అని వివరిస్తున్నారు
మనం తరచూ చెట్టు మూలం పట్టుకోవటానికీ బదులు కొమ్ములు పట్టుకుంటాము. ఆ పట్టుకోవటంలో కూడా పొరపాటు చేస్తాము. భగవంతుని పొందేటందుకు జ్ఞాన, భక్తి, కర్మ, యోగా మార్గాలు వున్నాయి. గీతలో అర్జనుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు, " ఏ దారిలో వెళ్ళాలి" అని. శ్రీ కృష్ణుడు అన్ని మార్గాలు ఉత్తమమైనవి అని, అన్ని భగవంతుని వైపు నడిపించేవని చెప్తాడు. రంగావధూత మహరాజ్ గారు ఇక్కడ ఒక చెట్టు ఉదాహరణగా తీసుకుని వివరించారు. చెట్టు కొమ్ముల…
నేటి ఆనందం
మంత్రోపదేశం:
బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాల కు సరియైన కేటాయింపు లు లేవని కలత చెందిన కొందరు హిమాలయాల్లో ఉన్న ఓ స్వామీజీ ని ఆశ్రయించారు.
ఆయన అనుగ్రహించి ఈ.తెలుగు వారందరికీ ఓ మంత్రోపదేశం చేశారు.
''డింక్కో నా రుమీ కంచ మీ''
ఈ మంత్రం ప్రతి ఒక్కరూ ఒక లక్ష జపం చేసుకోండి 2024 వరకు.
మరో ముఖ్య మైన మాట ఎట్టి పరిస్దితి లోనూ ఈ మంత్రం తిరగేసి చదవరాదు.
అలా చదివాక చేసే జపం పనిచేయదు.జాగ్రత్త సుమా!
No comments:
Post a Comment