శ్రీపవనాంశజప్రభామ్..
శ్రీ జగత్త్రాతదేవం , తం,
శ్రీప్లవగం ప్రణతోऽస్మిసదా!!! "
🍀. నేటి సూక్తి : కర్తవ్యము వీడిన వారు స్వారీ చేయుచున్న గుఱ్ఱపు పగ్గములను వదిలిన వాడివలె మార్గము చెడి అగమ్యమగు స్థితిని చేరును. 🍀
ఓం నమః శివాయ🚩:
శ్రీరుద్రాష్టకమ్
1) నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపమ్!!
అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేఽహమ్!!
2) నిరాకారమోంకార మూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్!
కరాళం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్!!
3) తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్!
స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్ఫాలబాలేందు కంఠే భుజంగా!!
4) చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలమ్!
మృగాధీశచర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి!!
5) ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటిప్రకాశమ్!
త్రయః శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్!!
6) కలాతీత కల్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ!
చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ!!
7) న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్!
న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వ భూతాధివాసమ్!!
8) న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా శంభు తుభ్యమ్!
జరా జన్మ దుఃఖౌఘ తాతప్యమానం ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో!!
రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే! యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి!!
ఇతి శ్రీగోస్వామి తులసీదాసకృతం శ్రీరుద్రాష్టకం సంపూర్ణమ్.
***
1) నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపమ్!!
అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేఽహమ్!!
1) నిర్వాణ రూపమైన ఈశాన మూర్తికి నమస్కారములు (శివుని పంచ ముఖ రుద్ర రూపములలో ఈశాన ముఖము ఒకటి).విభుడు (రక్షకుడు, శుభకరుడు, ప్రభువు అని అర్థం), సర్వ వ్యాపకుడు, పర బ్రహ్మం, వేద స్వరూపుడు, సత్యమైన వాడు, గుణములు లేని వాడు, వికల్పము లేని వాడు, విశ్వ వ్యాపుడు, ఆకాశ రూపుడు, దివ్యాకాశంలో నివసించే వాడు అయిన శివుని భజిస్తున్నాను.
2) నిరాకారమోంకార మూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్!
కరాళం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్!!
2) నిరాకారుడు (ఆకారము లేని వాడు), ఓంకారానికి మూలమైన వాడు, తురీయుడు (జాగ్రత్, సుషుప్త, స్వప్నావస్థలను దాటిన అత్యుత్తమమైన అవస్థ), గిరిపై నివసించే వాడు, పర్వతములకు అధిపతి, కరాళుడు (దుష్ట శిక్షణలో), యముని పాలిటి మృత్యువు (మృత్యువుని జయించుటకు సాధనం అని అర్థం), కృపాకరుడు, గుణములకు అతీతమైన వాడు, సంసార వారధిని దాటించే వాడు అయిన పరమ శివునికి నమస్కారములు.
3) తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్!
స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్ఫాలబాలేందు కంఠే భుజంగా!!
3) హిమాలయములు, శంఖము కంటే మిక్కిలి తెల్లని దేహకాంతి కలవాడు, గంభీరుడు, కోటి మన్మథుల మించిన దేహ సౌందర్యము కలవాడు, తన జటా ఝూటములో తరంగాలతో ఉప్పొంగే గంగను, నుదుట నెలవంక, మెడలో నాగరాజును ధరించిన పరమ శివునికి నా నమస్కారములు.
4) చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలమ్!
మృగాధీశచర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి!!
4) ఊగే కర్ణ కుండలములు ధరించిన వాడు, విశాలమైన మంచి నేత్రములు, ప్రసన్నమైన ముఖము కలవాడు, నీలకంఠుడు, దయాళువు, మృగరాజు చర్మాన్ని ధరించిన వాడు, మెడలో కపాలమాల కలిగిన వాడు, అందరికి ప్రియుడు అయిన శంకరుని నేను భజిస్తున్నాను.
5) ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటిప్రకాశమ్!
త్రయః శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్!!
5) ప్రచండుడు (భీషణుడు, ప్రజ్వలించే వాడు), ఉత్కృష్టమైన వాడు, గంభీరమైన భాషణ చేసే వాడు, సమర్థుడు, దివ్యమైన వాడు, అఖండుడు, జన్మ లేని వాడు, కోటి సూర్యుల ప్రకాశము కలవాడు, త్రిశూలముతో దుష్ట సంహారము చేసే వాడు, శూల పాణి, భవానీ పతి, భావ గమ్యమైన వాడు అయిన శంకరుని భజిస్తున్నాను.
6) కలాతీత కల్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ!
చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ!!
6) కాలమునకు (మృత్యువుకు) అతీతమైన, కల్పాంతమున (ప్రళయ కాలమున) సమస్తమును నాశనము చేసే, సజ్జనులకు మంచి చేసే, త్రిపురారి, మోహమును నాశనము చేసి చిదానందమును ప్రసాదించే, మన్మథుని సంహరించిన ఓ పరమ శివా! నన్ను అనుగ్రహించుము.
7) న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్!
న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వ భూతాధివాసమ్!!
7) నీ పద కమలముల మ్రొక్కి శరణు కోరే వరకు జనులకు ఈ లోకములో కానీ, పర లోకములో కానీ దుఖములనుండి విముక్తి కలిగి సుఖము, శాంతి కలుగదు. కావున, సర్వ భూతములలో నివసించే
పరమశివా! నన్ను అనుగ్రహించ…
******
9. మధ్యపానముతోను మత్తుచిలికె వేళ
బడలిక తోనడి జొచ్చు వేళ
సుఖముకొరకు కోప సూక్తులున్న వేళ
ఒప్పు తప్పని వాద ఓడు వేళ
ఒంటరిగా చింత ఓర్పులేకయు వేళ
నాలుక తోనులే నటన వేళ
దొర మనసున దాగు దిగులుచూపిన వేళ
భక్తితో నూ రక్తి బడయు వేళ
ఆశ భావమీ సలక్షణ ఆకలగుట
లాభ భావము కనబాబు లాలీ యగుట
వెన్నెలతొ శక్తి యుక్తును వేల్పు యగుట
ప్రాంజలి ప్రభ గోపాల ప్రేమ యగుట
10 సౌందర్య మతి దృఢ శక్తి విలాసంబు
సంగీత సాహిత్య సౌఖ్య మంబుఁ
అగ్రజన్మ మతియే ఆత్రుత వాసంబు
యుక్త వయసు మతి యస్య మంబు
సంపన్నతయుబంధు సంరక్షజనణంబు
అనుకూల సతి నిత్య మానసంబు
సౌందర్య మతి దృఢ సౌఖ్యమంబు
నిత్యనిష్ఠ జ్ఞాన నిర్మలంబు
ఇన్నియుకలిగి వర్తించు చున్న నరుడు
భూతల స్వరమునుపొంది భూమి చూడు
అక్షరము సత్యమనినమ్మి యుండు చుండు
ప్రాంజలి ప్రభ గోపాల ప్రేమ చూడు
--((**))--
No comments:
Post a Comment