కమలములు నీట బాసిన సోకె కమ్మ నైన నిత్య గమలాప్తు రాసిమి నిలకడైన కమిలె మిత్రులు
గుడి అంటే వెంటనే గుర్తుకు వచ్చేది తీర్థ ప్రసాదాలు. తీర్థం అంటే ప్రధానం దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు. శివుడికి, లేదా శ్రీ మహావిష్ణువున్నిసాలగ్రామ శిలలకు రుద్ర నమకచమకాలతో, పురుష సూక్తం ,పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును అర్ఘ్యపాద్య ఆచమనములు భగవానునకు పుజచేయు వేళ సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్ర యందువుంచి, స్నపనము చేసిన జలము కుడా కలిపి ( తులసీదళ సహితమై ,పవిత్రమునూ, పాపహరమునూ అగునీరము తీర్ధము అనబడును) ఇస్తారు.
ఈ తీర్ధమును అర్చన పూర్త అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికీ, సన్యసించిన వారికినీ , అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.
గుళ్లో తీర్థం ఎందుకు తీసుకోవాలిబాహ్యశుద్ధి, అంతశ్శుద్ధి అని శుద్ధి రెండు రకాలు. తీర్థము అంతశ్శుద్ధికి కల్పించబడింది. మనం ప్రతిరోజు స్నానమాచరించి బాహ్యశుద్ధి చేసుకోగలం. కామ, క్రోధ, లోభ, మహ, మాత్సర్యములనెడి అరిషడ్వర్గములను జయించినవాడే పరమ పదమును పొందలడు. ఈ అంశ్శత్రువులను జయించుటకు మనస్సు శుద్ధి చేసుకొనుటకోసం తీర్థము గ్రహించాలి. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్మాత్మికత శక్తి మెరుగవుతాయి.
భక్తులు ఆలయానికి వెళ్లి భగవంతుని దర్శనం చేసుకున్న తరువాత అర్చకుడు భగవంతునికి నివేదించిన తీర్థాన్ని అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణుపాదోదకం లేదా శివపాదోదకం పావనం శుభం అంటూ భక్తుల చేతిలో మూడు సార్లు పోస్తారు. పరమాణు సమానమైన ఈ తీర్థాన్ని సేవించడం వలన పంచ మహాపాతకాలన్ని తొలగిపోతాయని అర్చకులు చెపుతుంటారు. ఇంతటి పవిత్రమైన తీర్థాన్ని భక్తులు కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి. ఒక వేళ తీర్ధం నేల మీద పడితే అది ఎనిమిది రకాల పాపాలు చుట్టుకుంటాయని భక్తుల నమ్మకం. తీర్థం తీసుకోవడం వలన కలిగే లాభాలు.. సాధారణంగా గుళ్ళలోని దేవతా విగ్రహాలని కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని, పాలను దేవాలయాలకి వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారు. కొన్ని గుళ్ళల్లో మామూలుగా తులసి, పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన తీర్థాన్ని దేవుడికి నివేదన చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు. భగవంతుడిని నైవేద్యంగా పెట్టిన తీర్థాన్ని భక్తలు తీసుకుంటే వారికి సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యం సిద్దిస్తుంది చెపుతుంటారు. అంతే కాక ఆ భగవంతుని ఆశ్వీర్వాదాలను పొందుతారని పురాణాల్లో తెలిపారు. అదే విధంగా తులసితో కూడిన సాలగ్రామ తీర్థాన్ని తీసుకోవడం వలన అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్తున్నాయి. భగవంతునికి నైవేద్యంగా పెట్టే తీర్థంలో ఉదకం, చందనం, చక్రం, శంఖం, తులసీదళం, ఘంట, పురుషసూక్తం, తామ్రపాత్ర, సాలగ్రామం అనే తొమ్మిది పదార్థాలను కలుపుతారు.
గుళ్లో తీర్థం ఎందుకు తీసుకోవాలితీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది. ద్వితీయంగా స్వీకరించే తీర్థం ధర్మసాధన కోసం, తృతీయంగా తీసుకునే తీర్థం మోక్షము సిద్ధించేందుకు. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత భక్తి వస్తుంది.
గుళ్లో తీర్థం ఎందుకు తీసుకోవాలితీర్థం తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, భావంతో తీసుకోవాలి. మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. అలాగే కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కానీ అలా చేయకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే మంచిది.
శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు. ఈ తీర్ధమును అర్చన పూర్త అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికీ, సన్యసించిన వారికినీ , అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.
తీర్ధమును ఎలా తీసుకోవాలి?
మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడువేలు ఏ మాత్రం తగలకుండా బ్రొటన వేలును నడిమి వ్రేలి క్రింద కణుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి తీర్ధం క్రింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా ఓం అచ్యుత ,అనంతా ,గోవిందా అనే నామాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వినమ్ర పూర్వకంగా త్రాగాలి. తీర్దం త్రాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసుకోవద్దు.తీర్ధం త్రాగునప్పుడు జుర్రుమని శబ్దం రానియకుండా తాగాలి. ఇకపోతే అసలు తీర్ధం తీసుకునేటప్పుడు చూపుడు వేలుని, బొటన వేలుని అలా అమర్చి పెట్టడంలో ఇక్కడ ఓ విశేషం ఉంది. హస్తసాముద్రికం ప్రకారం బొటన వేలు ఐహికమైన సుఖ భోగాలకి, మమకారవికారాలకి కారణం అయిన శుక్రుడిది. అదేవిధంగా చూపుడు వేలు భగవత్సమానుడు జ్ఞానప్రదాత అయిన గురువుది. అందువలన పవిత్రమైన, పాపహారణమైన ఆ తీర్ధాన్నిఐహికమైన వాంఛలని పోగొట్టుకోమ్మంటూ, అవి అన్నీ దైవసమాన మైన గురువు అనుగ్రహం, దీవెన ఉంటేనే పోతాయనే భావంతోనే గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బోటనవేలుని మడిచి నొక్కి పట్టి తీర్థం తీసుకుంటారు. గుళ్లో తీర్ధం తీసుకోగానే... ఆ చేతిని తలకు రాసుకోవడం చూస్తూ ఉంటాం. చాలామంది ఇలాగే చేస్తారు. నిజానికి అది చాలా తప్పు. కారణం తీర్థం తీసుకోగానే.. చేయి ఎంగిలి అవుతుంది. ఆ ఎంగిలిని తలపై రాసుకోకూడదు. తలపై సహస్రర చక్రం ఉంటుంది. సప్త రుషీ మండల స్థానం కూడా. అందుకే.. ఎంగిలితో తలను అపవిత్రం చేయరాదు.
తీర్థాల రకాలు తెలుసుకుందాం…
జలతీర్ధం, కషాయ తీర్ధం, పంచామృత తీర్ధం, పానకా తీర్ధం జల తీర్ధం ఈ తీర్ధం సేవించడం ద్వార అకాల మరణం, సర్వ రోగాలు నివారించాభాడుతాయి. అన్నికష్ట్టలు ఉపసమానాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది .
కషాయ తీర్ధం
ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం ,కొల్లూరు ముకాంబిక దేవాలయం, హిమాచలప్రదేశ్ లోని జ్వాల మాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు. రాత్రి పూజ తరువాత తీర్థనీ కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించటం ద్వారా కని కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి.
పంచామృత అభిషేక తీర్థం
పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
పానకా తీర్ధం
శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునిడికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు. కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు.
పానకా తీర్ధాన్నిసేవిస్తే దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది . దేహంలో వుండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది . రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు.ఎముకులుకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వార మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది.
జీవితంలో శత్రువుల పీడ తగ్గుతుంది. బుద్ది చురుకుగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఇవేకాకుండా తులసీ తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వతీర్థం, ఇలా రకరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తుంటారు. వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది.
....,....,
మన మహాత్ముడు..
గుజరాత్ రాష్ట్రంలో పుట్టి,
బారిస్టర్ పట్టాను చేపట్టి,
దక్షిణాఫ్రికా లో అడుగెట్టి,
అవమానాలను ఎదురొడ్డి,
అహంకారాన్ని తరిమికొట్టి,
ప్రక్షాళనను చేపట్టి.......!
ఆసేతుహిమాచలం దర్శించి, హింసావాదాన్ని వ్యతిరేకించి, అహింసామార్గాన్ని ఎంచి, గ్రామస్వరాజ్యాన్ని స్థాపించి, సంసమాజాన్ని నిర్మించి , బానిస సంకెళ్లను తెంచి, నవభారతాన్నీ రచించి, బోసినవ్వుల బాపూజీ, భావిభారత దిక్షుచి.....!
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం, మనుషులను మనిషిగా చూడని సమాజం,
తారతమ్యాలు లేని సరికొత్త భారతం, శాంతి,అహింసలే తన ఆయుధం,
బడుగు బలహీన వర్గాలకు ఆశాకిరణం, స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి కేతనం...!
ఒంటరిగా పోరాడిన వీరుడు, హింసను విడనాడిన ధీరుడు, అహింసను చేపట్టిన దేవుడు, ఐక్యతను చాటిన నాయకుడు, ఐన్ స్టీన్ కు ఆదర్శప్రాయుడు, హిట్లర్ ను ఆలోచింపచేసిన ఘనుడు, గ్రామగ్రామాలలో, వాడవాడలలో, స్వదేశంలో,
విదేశంలో వినుతి కెక్కిన విశ్వవిఖ్యాతి మన మహాత్ముడు.......!
....
No comments:
Post a Comment