Tuesday, 8 February 2022


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 346  / Sri Lalitha Chaitanya Vijnanam  - 346🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀  77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀

🌻 346. 'విజయా'🌻 

విజయ స్వరూపము శ్రీమాత అని అర్థము. సంధ్యాకాలము కొంచెము దాటిన పిదప నక్షత్రములు కొంచెము ప్రకాశించు కాలము విజయ అని పిలువబడును. ఈ కాలమున ప్రారంభించు కార్యములు విజయవంతమగును. అట్లే దినములో పదునొకండవ ముహూర్తమును విజయ అని వర్ణింతురు. విజయమును కోరు వారందరూ పయనించుటకు అది ఉత్తమ కాలమని తెలుప బడినది. ఆ సమయమున కాలము విజయ రూపమై యుండునట. ఆశ్వయుజ మాసమునందు శుక్లపక్ష దశమి తిథి యందు నక్షత్రోదయ కాలము సర్వ కార్యార్థ సిద్ధి నొసగును. ఈ తిథి విజయ దశమి అని ప్రసిద్ధి గాంచినది.

విశేషమగు జయము కలిగించునది గనుక శ్రీమాత విజయగ వర్ణింపబడినది, కీర్తింపబడినది. దేవీ పురాణమందు 68 శివ తీర్థములు పేర్కొనబడినవి. వానిలో కాశ్మీరమున గల శివతీర్థమును విజయ తీర్థమని తెలిపిరి. ఆ శివ తీర్థములకు శ్రీమాతయే అధ్యక్షురాలు. విశ్వకర్మ శాస్త్రమందు తెలుపబడిన గృహ నిర్మాణములలో విజయ అనునది విశేష రూపము గల గృహముగ తెలుపబడినది. పాండవులలో అర్జునుని విజయుడని కీర్తించినారు. అతని నెప్పుడునూ శ్రీమాత విజయ రూపము ఆవరించి యుండెడిదట. విజయదశమినాడు విజయుడు ఒంటరిగ కురుసైన్యమును నిర్జించి విరటుని గోవులను కాపాడినాడు. అంతః శత్రువులను, బాహ్యశత్రువులను జయించిన వారు విజయులు. యోగులు, సిద్ధులు అట్టివారు. వారి యందు శ్రీమాత పరిపూర్ణ సాన్నిధ్య ముండును. విజయ నామము అత్యంత శుభప్రదమైనది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
వేద దేవతలు ౩౩ మందే

🌻🌻🌻🌻🌻

‘దా-దానే’,‘దా, ద్త్యుత్, దీప్, దివు’ అనుధాతువులతో ‘దేవ’ శబ్దము ఏర్పడును. “దేవో దానాద్ వా, దీపనాద్ వా, ద్యోతనాద్ వా, ద్యుస్థానో భవతీతి వా” ఇచ్చునది, ప్రకాశించునది, ప్రకాశింపజేయునది, ద్యుస్థానంలో ఉండునది ‘దేవత’ శబంతో చెప్పబడును. అనగా జ్ఞానం, ప్రకాశం, శాంతి, ఆనందం, సుఖం మొదలగునవి ఇచ్చు సకల జడచేతన పదార్ధాలను దేవతలనబడును. యజుర్వేదంలో… అగ్నిర్దేవతా దేవతా సూర్యోదేవతా చన్ద్రమా దేవతా వసవో దేవతా రుద్రా దేవతా దిత్యా దేవతా మరుతో దేవతా విశ్వేదేవా దేవతా బృహస్పతిర్దేవతేన్ద్రో దేవతా వరణో దేవతా.

అగ్ని, వాయు, సూర్య, చంద్ర, వసు, రుద్ర, ఆదిత్య, ఇంద్ర వరుణాది ప్రకృతి పదార్థాన్ని దివ్యగుణయుక్తాలు కావున ‘దేవ’ శబ్దంచే చెప్పబడును. “విద్వాంసో వై దేవాః” సత్య(వేద) విద్యల నెరిగినవారు, జ్ఞానదానం చేయుచు ప్రపంచంలో జీవేశ్వర ప్రకృతులు మొదలగు పదార్ధాల యథార్థ జ్ఞానంను లోకంనకు తెలుపుతుంటారు.

‘దివు విజిగీషా వ్యవహార ద్యుతిస్తుతిమోదమద స్వప్నకాంతిగతిషు’ అను ఈ ధాతువుచే కూడా దేవశబ్ధం ఏర్పడును. విజయంను సాధించు కోరిక గల వీరక్షత్రియులు, పరమేశ్వరుని స్తుతించుచు పదార్థాల యథార్థ స్వరూపంను తెలుపు విద్వాంసులు, జ్ఞానదానమొనర్చు బ్రాహ్మణులు, ప్రకాశించు సూర్యచంద్ర, అగ్ని, విద్యుత్తు మున్నగు పదార్థాలు, సత్యవ్యవహారాలను ఆచరించే వైశ్యులు, సత్యకర్మలనాచరించు శూద్రులు మొదలగు వారందరును దేవతాశబంనకు అర్హులు. అనగా ప్రపంచంనకు ఉపకారం చేయు జడచేతన పదార్థాలన్నీ దేవతలనబడును. దేవతాపదంనకు అర్థం మంత్రం ప్రతిపాద్యవిషయమని తెలుసుకోవలెను.

దేవతలు ఎందరు?

నాలుగు వేదాలలో అనేక దేవీదేవతల గుణగణాలు వర్ణించబడ్డాయి. ఆ దేవతలు ప్రకృతి తత్వాలకు చెందినవి. సూర్యుడు బుద్ధికి, అగ్ని సంకల్పానికి, సోముడు చంద్రుడు భావానికి ప్రతినిధులు. వేదంలో 1. సూర్యాది ద్యుస్థాన దేవతలు 2. ఇంద్రాది అంతరిక్ష దేవతలు 3. అగ్న్యాది పృథివీస్థాన దేవతలు 4. విశ్వకర్మాది అమూర్త భావ దేవతలు 5. పురంధ్య్రాది స్త్రీదేవతలు 6. అగ్నీషోమాది దేవతాద్వంద్వాలు 7. స్థానరక్షక దేవతల వంటి ద్వితీయశ్రేణి దేవతలు అని ఏడు విధాలుగా అనబడతారు.

ఒక్కొక్క వేదమంత్రంనకు ఆధిభౌతిక, ఆధ్యాత్మిక అధిదైవికం అను మూడు విధాలుగా అర్థం చెప్పుకోవచ్చును. ఉదాహరణకు ఉషస్సూక్తంలో ఉషశ్శబ్దానికి ప్రతి ఉదయం సాక్షాత్కరించే ‘అరుణోదయ’ మని ఆధిభౌతికార్థం. మనుష్యులను నిద్రనుండి మేల్కొలిపి జాగృతులను చేస్తూ ఉపకరించే ఉషః కాలాధిపతియైన ‘ఉషోదేవత’ అని ఆధిదైవికార్థం. మనుష్యులను అహంకార మమకారాదిరూపమైన అజ్ఞానాన్ని నశింపచేసి ఆత్మస్వరూప సాక్షాత్కారానికి ఉపయోగించే ‘ఆత్మతత్తజ్ఞానం’ అని ఆధ్యాత్మిక అర్థం. ఈ రీతిలో ప్రతిసూక్తంలో ప్రతి మంత్రానికి మూడు రకాలుగా అర్థాన్ని పొందవచ్చును. కొందరు ప్రాకృతిక దేవతలను మూడు వర్గాలుగా విభజించారు. అవే పృథ్వీ, అంతరిక్ష, ద్యుస్థానీయ దేవతలు.

‘కతి వై దేవాః’ దేవతలు ఎందరు? అని నిరుక్త కారుడైన యాస్క మహర్షి ప్రశ్నవేసుకొని ‘త్రయః త్రింశో వై దేవాః’ 33 దేవతలని సమాధానం చెప్పినాడు. అవి అష్టౌవసవః ఏకాదశ రుద్రాః, ద్వాదశ ఆదిత్యాః, ఇంద్రః ప్రజాపతిశ్చ’ 8 వసుదేవతలు, 11 రుద్రదేవతలు, 12 ఆదిత్య దేవతలుత, 1 ఇంద్రుడు, 1 ప్రజాపతి మొత్తం 33 దేవతలు. ‘పంచ భూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు’ ఈ ఎనిమిది వసుదేవతలనబడును. ఇవి జగత్తును వసింప కావున వసుదేవతలనబడును.5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 1. జీవాత్మ ఈ పదకొండు రుద్రదేవతలనబడును. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ప్రాణులను రోదించేలా (ఏడ్పింప) చేస్తుంది కావున రుద్రదేవతలనబడును.

సంవత్సరంనందలి 12 మాసాలు ద్వాదశ ఆదిత్యులు అనబడుదురు. ఇవి మన ఆయుష్‌ను ప్రతిదినం తరిగించును అనగా తీసుకొని పోవును. ఇలా 31 దేవతలయ్యారు. 1. ఇంద్రుడువిద్యుత్తు, 1. ప్రజాపతి ఈ రెండు కలిసి మొత్తం 33 దేవతలయ్యారు. ఈ 33 దేవతలను పూజించుట అనగా యథాయోగ్యముగ ఉపయోగించుకొనుట అని అర్థం. కేవలం పూజనీయుడు ఆ పరమేశ్వరుడొక్కడే. మిగతావన్ని దివ్యగుణాలు గల వస్తువులు. వీటిని ఉపయోగించుకొని దివ్యత్వాలను పొందును.

దేవతల విషయంలో యాజ్ఞికుల కథనం మరొక రకంగా ఉంది. వేదాలలో వివిధ నామాలతో పేర్కొనబడిన దేవతలన్నీ వివిధ శక్తులే కాని ఒకే దేవతకు గల వివిధ నామాలని వారు అంగీకరించరు. దానికి యాస్కమహర్షి సమాధానం చెబుతూ స్థానాన్ని బట్టి వర్గీకరిస్తే పృథ్విపై వివిధ పదార్థాలన్నీ పృథ్వీస్థానాలే అవుతాయి కదా! అని వారంటారు. కనుక ఇచట పృథ్వి స్థానీయ దేవతలలో (వివిధ పదార్థాలలో) అగ్ని ముఖ్యదేవత అని, అంతరిక్షంలో వాయువు లేక విద్యుత్ ముఖ్యదేవత అనీ, ద్యుస్థాన దేవతలలో సూర్యుడు ముఖ్యదేవత అనీ గ్రహించాలి. వేదాలలో దేవతలను గూర్చి స్తుతి ప్రార్థనలను పరిశీలించినపుడు దేవతలు మానవాకృతి గలవేమోనని అనిపిస్తుంది. కానీ.. ఇది సత్యం కాదు. ప్రాకృతిక దేవతలన్నీ జ్ఞానం లేని జడపదార్థాలే. ఆ వర్ణనలన్నీ అలంకారికాలే. ఆ విధంగా వర్ణించబడినంత మాత్రాన అవి మానవాకృతిగల జ్ఞానం గల దేవతలని తలంచరాదు. ఏలయన కొన్ని రాళ్ళను, రప్పలను, నదులను, వృక్షాలను సంబోధిస్తూ ప్రార్థనలు కనబడతాయి. అప్పుడు అవి జ్ఞానం గల దేవతలని అంగీకరించగలమా?

కనుక సారాంశమేమిటంటే వేదాలలో వివిధ ప్రాకృతిక దేవతలన్నీ ప్రాకృతిక పదార్థాలు దివ్య శక్తులు. మనం ఆ స్తుతుల ద్వారా ఆయా పదార్థాల గుణగణాలను తెలుసుకుంటూ, వాటిని మననం చేస్తూ పరిశోధనలు చేస్తే ఎన్నో విజ్ఞాన విషయాలు వెలుగులోకి వస్తాయి. మన జీవితం సుఖమయం అవుతుంది. ఇవే మంత్రాలకు ఆధిభౌతికంగా అర్థం చెప్పుకుంటే అట్టి గుణగణాలు గల రాజులకు, విద్వాంసులకు, వ్యక్తులకు అవి వర్తిస్తాయి. ప్రకరణాన్ని బట్టి ఇవే మంత్రాలు ఆధ్యాత్మికార్థాన్ని బోధిస్తాయి. అప్పుడు ఆ పదాలతో పరమేశ్వరుడు సూచింపబడతాడు. ఈ విధంగా వేదాలు అనేకార్థబోధకాలు. ప్రకరణాన్ని, ప్రసంగాన్ని బట్టి అర్థం చెప్పుకోవడమే ఉత్తమం.

🌻🌻🌻🌻🌻

🙏🙏🙏🙏🙏

మన పురాణ ఘట్టములలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాటిలో ఒకటి "క్షీరసాగర మధనము". దూర్వాస మహర్షి శాపము చేత తన ఐశ్వర్యం కోలోయిన దేవేంద్రుడు దేవతలను, దానవులను ఇరు ప్రక్కలా నిలబెట్టి, మంధర పర్వతమును కవ్వముగా నెంచి, వాసుకి సర్పమును త్రాడుగా జేసి క్షీరసాగరమును మధించెను. ఆ సమయమున శ్రీహరి శిష్టరక్షణకై పలు రూపములు దాల్చెను. వాటిలో ప్రముఖమైనది "శ్రీ కూర్మావతారము". ఆ నారాయణుడు తాబేటి రూపమున మంధర పర్వతమును తన మోపు పై భరించెను. శ్రీహరి చేసిన మహోపకారమునకు ప్రత్యుపకారముగా క్షీరసాగర మాధనము నందు ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మి తల్లి ని నారాయణునకు ఇచ్చి దేవతలు వివాహము చేసిరి.

క్షీరసాగర మదనము నందు ముందుగా ఉద్భవించినది భయంకరమైన హాలాహలము. ఆ హాలాహలమును శంకరుడు తన కంఠమున నిలిపి "శ్రీ నీలకంఠుడు" అయి లోక రక్షణ చేసెను. అయితే ఆ హాలాహలము ఆవిర్భావ సమయమున కూర్మధారి అయిన శ్రీహరికి అత్యంత క్లేశము కలిగించెను. క్షీరసాగర మధనము ముగిసిన తరువాత తన క్లేశ నివారణకై శ్రీహరి మహేశుని ప్రార్థించెను. అంతట సదాశివుడు హరితో, కాంచి క్షేత్రమునకు వెళ్లి తనను అర్చించమని మార్గము చెప్పెను. నారాయణుడు కాంచి క్షేత్రమున మహేశ్వరుని ఆరాధించి తన క్లేశ నివారణ చేసుకొనెను. ఈ క్షేత్రమున నారాయణుడు చేసిన శివ పూజ ఫలితము గా శ్రీహరికి మన్మధుడు పుత్రునిగా జన్మించెను.

ఖచ్చపము అనగా తాబేలు. తాబేటి రూపమున యున్న శ్రీహరిని కరుణించిన కారణమున ఈశ్వరుడు ఖచ్చపేశ్వరుడైనాడు. శ్రీ ఖచ్చపేశ్వరుని ఆలయము కాంచిపురము నందు గల అత్యంత సుందర ఆలయములలొ ఒకటి. బస్టాండ్ నుండి శ్రీ ఏకామ్రేశ్వరుని ఆలయము

నకు వెళ్ళు మార్గమున ఉత్తరాభి ముఖమైన గొపురముతో యున్నది. ఈ ఆలయము నందు అత్యంత మహిమాన్వితమైన "యిష్ట సిద్ధి" తీర్థము యున్నది. ఈ పుష్కరిణి లో నాలుగు వైపులా నుండి ప్రవేశించి స్నానము చేసిన వారికి నాలుగు రకములైన ఫలితములు కలుగునని ప్రతీతి. ఈ తీర్థము నందు భానువార స్నానము రోగనివారిణిగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయము నందు శ్రీ సరస్వతీ మాత అష్టభుజములతో దర్శనమిచ్చుట మరియొక విశేషము.

గద్య గాంభీర్యం

ఈయనెవరో  గుడిబయట చెప్పులు కలగా పులగం చేసినట్లు అక్షరాలు మార్చి పారేశాడు.  కొంచం సర్థి  పెట్టండి దయచేసి.  నా వల్ల కావటం లేదు. 😀

1) హతమురితసత.

2) లుపితాహుప్రమ.

3) టుపవిముకత్వత్వ

4) ర్యావణరపము

5) అలోలోమమవినుము

6) లతరాతరంఅం.  

7) చణంర్విర్వతచ

8) ల్బముద్రణవ్యో

9) సదివినోరనిస

10) లుకతానురళధ్వ

11) వీడునుకార్యార్తర్జు

12) తాతసముహణ్యతరిర

13) కాధంకాబంరర్యణసం

14) మృగంరణమదం

15) వడివసుట్రు

16) జీతంభామంగేర్ణసుషి

17)  పస్తుపురివశోరాధన.

18) హత్తుబృకోపరణ్యనిషదా

19) హహ్రూజల్ నెవలార్

20) నదులునాదసనంకస

21) చంచనర్చద.

22)శ్రీలుదేరావకృయష్ణ.

23) వీరుడుఅరకయంభరి

24) రరఅనికొధులు.

25) రతివిధభావి

🙏🙏💐💐👍👍💐💐🙏🙏

1.   సతతహరితము

2.   వ్రపితామహులు

3.   కవిత్వపటుత్వము

4.   పర్యావరణము

5.   అనులొమవిలోము

6.  అంతరంతరాల

7.  చతర్విర్వచణం

8.   ద్రవ్యోల్బణము

9.  అనులోమవిలోమము

10. కరతాళధ్వనులు

11. కార్తవీర్యార్జునుడు

12.  నతతహరితారణ్యము

13.  కార్యకారణసంబంధం

14. మరణమృదంగం

15.  వట్రుసువడీ

16.

17. పురావస్తుపరిశోధన

18.  బృహధారణ్యకోపనిషత్తు

19. జవహర్ లాల్ నెహ్రూ

20  సనకసనందనాదులు

21   చందనచర్చ

22.   శ్రీకృష్ణదేవరాయలు

23.  అరివీరభయంకరుడు

24.  అరకొరనిధులు

25.  వివిధభారతి

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక

సర్వేజనా సుఖినోభవంతు

ఓం శ్రీమాత్రే నమఃఅయిదు అమ్మవారి ప్రధానరూపాలు....

మూలప్రకృతినుంచి ఆవిర్భవించిన రూపాలు ప్రధానమైనవి మాత్రం

వాటిలో 

            మొదటిరూపం శివప్రియ, గణేశమాతదుర్గ. శివరూప, విష్ణుమాయ, నారాయణి, పూర్ణబ్రహ్మ స్వరూపిణి, సర్వాధిష్టాత్రి, శర్వ రూప, సనాతని, ధర్మసత్య, పుణ్యకీర్తి. యశోమంగళ దాయిని, సుఖమోక్ష, హర్ష ధాత్రి, శోఖార్తి దు:ఖనాశిని, శరణాగత దీనార్తపరిత్రాణ పరాయణ, తేజ:స్వరూప, సర్వశక్తి స్వరూప, సిద్ధేశ్వరి, సిధ్ధరూప. సిద్ధిద, బుద్ధి, నిద్ర క్షుత్తు, పిపాస, చాయ, తంద్ర, దయ, స్మృతి, జాతి, క్షామ్తి, భ్రాంతి, శాంతి, చేతన, తుష్టి, పుష్టి లక్ష్మీ, ధృతి, మాయ -----ఇత్యాది నామాలతో కీర్తింపబడుతుంది.

            ఇక రెండవది శుధ్ధ శక్తి స్వరూప మహాలక్ష్మి. సర్వ సంపత్స్వరూప. సంపదధిష్టాత్రి, పద్మ, కాంత, దాంత, శాంత. సుశీల, సర్వ మంగళ, లోభకామ మోహ మదహంకార వివర్జిత భక్తానురక్త, పతివ్రత, భగవత్ప్రాణతుల్య, భగవత్ ప్రేమపాత్ర, ప్రియంవద, సర్వాత్మిక, జీవనోపాయరూపిణి. వైకుంఠం లో ఈ మహాలక్ష్మి పతిసేవాపరాయణయై నివసిస్తూ ఉంటుంది. సర్వప్రాణి కోటిలోనూ శోభారూపంగా ఉంటుంది. స్వర్గం లో స్వర్గ లక్ష్మిగా,రాజులలో రాజ్య లక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా విరాజిల్లుతుంటుంది. 

              పుణ్యాత్ములకు కీర్తిరూప, నరేంద్రులకు ప్రభావరూప, వైశ్యులకు వాణిజ్యరూప, పాపాత్ములకు కలహాంకురరూప. వేదాలలో హయరూపంగా వర్ణింపబడినది సర్వపూజ్య, సర్వ వంద్య.

              ఇక మూడవరూపం వాగ్బుధ్ధి విద్యా జ్ఞానాధిష్టాత్రియైన సరస్వతి. సర్వవిద్యా స్వరూప, బుధ్ధి కవిత, మేధ, ప్రతిభ, స్మృతి, ఇత్యాదులన్నీ మానవులకుఈవిడ దయవలనే కలుగుతున్నాయి. సిధ్ధాంత బేధాలు అర్ధబేధాలు కల్పించేది ఈతల్లే. ఈవిడే. వ్యాఖ్యాస్వరూపిణి, బోధస్వరూపిణి సర్వ సందేహ భంజని. విచారకారిణి, గ్రంథ కారిణి, శక్తిరూపిణి,. సర్వసంగీత సంధాన తాళ కారణ రూపిణి, విషయ జ్ఞాన వాగ్రూప, ప్రతి విశ్వోపజీవని, వ్యాఖ్యావాదకరి, శాంత. వీణాపుస్తకధారిణి, శుద్ధసత్వరూప, సుశీల, శ్రీహరిప్రియ,, హిమ, చందన. కుంద, ఇందు, కుముద, అంభోజసన్నిభ. రత్న జపమాలికతో శ్రీకృష్ణున్ని ధ్యానించే తప:స్వరూపిణి. తప:ఫలప్రద. సిద్ధవిద్యాస్వరూప. సర్వసిధ్ధి ప్రద. ఈ తల్లి లేకుంటే సర్వజనులు మూగవారవుతారు.

              ఇక నాల్గవరూపం చతుర్వర్ణాలకు చతుర్వేదాలకు వేదాంగాలకు అధిష్టానదేవత. సంధ్యా వందన మంత్ర తంత్ర స్వరూపిణి, ద్విజాతి జాతిరూప, తపస్విని, జపరూప, బ్రహ్మణ్యతేజోరూప సర్వసంస్కార రూపిణి, సావిత్రి, గాయత్రి, బ్రహ్మప్రియ. ఆత్మశుద్ధి కోసం సర్వతీర్ధాలు ఈతల్లి సంస్పర్షను కోరుకుంటాయి. శుధ్ధస్పటికవర్ణ, శుధ్ధ స్వరూపిణి పరమానంద, పరమ, సనాతని పర బ్రహ్మస్వరూపిణి నిర్వాణ ప్రదాయిని బ్రహ్మ తేజోమయి, ఈతల్లి పాదధూళిసోకి జగత్తు పునీతమవుతున్నది.

             అయిదవరూపం. పంచప్రాణాలకు అధిష్టానదేవత. పంచ ప్రాణ స్వరూపిణి, ప్రాణాధికప్రియతమ, అందరికన్నా అందగత్తె. సౌభాగ్యమానిని గౌరవాన్విత, వామాంగార్ధస్వరూప, తేజోగుణసమన్విత. పరాపరసారభూత, పరమ. ఆద్య. సనాతని పరమానందరూపిణి,, ధన్య, మాన్య,, పూజ్య, శ్రీకృష్ణునికి రాసక్రీఢాధిదేవత, రాసమండల సంభూత, రాసమండల మండిత, రాసేశ్వరి, సురసిక, రాసావాస నివాసిని, గోలోకవాసిని, గోపీవేషవిధాయక. పరమాహ్లాదరూప. సంతోష హర్షరూపిణి ,,నిర్గుణ, నిరాకార, నిర్లిప్త, ఆత్మస్వరూపిణి, నిరీహ, నిరహంకార. భక్తానుగ్రహ నిగ్రహ, విచక్షణులు వేదానుసార జ్ఞానం తో ఈవిడను తెలుసుకుంటారు. సురేంద్రమునీంద్రాదులైనా చర్మచక్షువులతో ఈవిడను చూడలేరు. వహ్నిలాంటి అంశుకాన్ని ధరించి ఉంటుంది. నానాలంకార విభూషిత. కోటిచంద్రప్రభ. పుష్టిసర్వశ్రీయుక్తవిగ్రహ. శ్రీకృష్ణుని పట్లభక్తితో దాస్యం చేస్తూ ఉంటుంది. వరాహావతారకాలంలో ఈవిడ వృషభానునిఇంట కూతురుగా ఉద్భవించింది.

ఈ తల్లి పాదస్పర్షతో వసుంధర పావనమయ్యింది. శ్రీకృష్ణుని వక్షస్థలం లో నివసిస్తూ నీలమేఘావృతమైన ఆకాశం లో మెరుపుతీగలా భాసిస్తున్నది.

            ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాలిగోటిని సందర్శించి తనను తాను శుద్ధిచేసుకుందామని ఆశించి అరవైవేల దివ్యసంవత్సరాలు తపస్సుచేసినా ఫలితం దక్కలేదు. కనీసం కలలోనైనా దర్శనం కాలేదు. అతడికి అలాదొరకని సందర్శన భాగ్యం భూలోకంలో లభించింది. బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది. ఈరాధ దేవీ పంచమరూపం 

             స్రుష్టిలో కనిపించే ప్రతిస్త్రీలోనూ దేవీరూపం

కళారూపంగానో, కాలరూపంగానో,అంశరూపంగానో కళాశాంశారూపంగానో ఉంటూనే ఉంటుంది. స్త్రీలందరూ దేవీ స్వరూపాలే. పరిపూర్ణ స్వరూపాలు మాత్రం ఈ అయిదే.

--((*))--

1 comment: