"వేణునాదః ( ర న జ భ న స ..18/10 )..
శ్రీధరం కమలధవంసుశీలవిబుధజననుతం ,
శ్రీధవం విమలదయాబ్ధిశీతలఫలదహృదయమ్..
మాధవం విపులధరాత్మమానితభరణ పురుషం ,
గోధరం శ్రవణసునామగుహ్యవరదమను భజే !!!
శ్రీ ఆదిశంకరచార్య విరచితం శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం
ఓంశ్రీమాత్రే నమః
1) మత్తరోగ శిరోపరిస్థిత నృత్య మాన పదాంబుజం!
భక్త చింతిత సిద్ధి కాల విచక్షణం కమలేక్షణం!
భుక్తి ముక్తి ఫలప్రదం భువి పద్మజాచ్యుత పూజితం!
దక్షిణా ముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!!
2) విథ్థత ప్రియ మర్చితం ఘృతా కృశా తీవ్ర తపో వ్రతై:!
ముక్తికామి భిరాశ్రితైర్ ముహూర్ ముణిభిర్ ధృడ మానసై:!
ముక్తిదం నిజ పాద పంకజ సత్కమానస యోగినాం!
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!!
3) కృత్త దక్ష మఖాది పంబర వీరభద్ర గణే నభై:!
యక్ష రాక్షస మర్త్య కిన్నెర దేవ పన్నగ వందితం!
రత్నభుగ్గణనాధ భృత్ భ్రమరార్చితాంఘ్రి సరోరుహం!
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!!
4) నక్తనాథ కళాధరం నగ జాపయోధరం మండలం!
లిప్త చందన పంజ్ఞ కుంకుమ ముద్రి తామల విగ్రహం!
శక్తి మందమ శేష సృష్టి విదానకే సకలం ప్రభుమ్!
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!!
5) రక్త నీరజ తుల్య పాదపయోజసధ్మణి నూపురం!
బంధన త్రయ భేదపేశల పంకజాక్షసలీ ముఖం!
హేమశైల శరాసనం పృధుశింఛినీ కృత దక్షగం!
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!!
6) యః పఠేచ్ఛ దినే దినే స్తవః పంచరత్నం!
ఉమాపతే పురాతలే మయాకృతం నిఖిలాగమ మూల మహానలం!
తస్య పుత్ర కళత్ర మిత్ర ధనాని సంతు కృపాఫలాత్!
తే మహేశ్వర శంకరాఖిల విశ్వనాయక శాశ్వతా !!
*****
మత్స్యావతార వర్ణనము - 2
అద్భతమైన ఆ మత్స్యమును చూచి, మనువు ఆశ్చర్యము చెంది ఇట్లు పలికెను. "నీ వెవరవు? నీవు నిజముగ విష్ణుమూర్తివే. నారాయణా! నీకు నమస్కారము. జనార్థనా! మాయ చేత నీవు నన్నీవిధముగ ఏల మోహపెట్టుచున్నావు?"
మను వీ విధముగా పలుకగా ఆ మత్స్యము ప్రజలకు పాలించుట యందు ( లేదా తనను రక్షించుటయందు) ఆసక్తి గల ఆతనితో ఇట్లనెను- "ఈ జగత్తును నిలుపుటకును, దుష్టులను నశింప చేయటకును అవతరించినాను".
"(నేటినుండి) ఏడవ దివసమున సముద్రము ఈ జగత్తును ముంచివేయును. అపుడు నీదగ్గరకు వ్చచిన నావలో బీజములు మొదలగువాటిని ఉంచుకొని, సప్తర్షిసమేతుడవై బ్రహ్మనిద్రించు రాత్రి అంతయు సంచరింపగలవు. నేను నీ దగ్గరకు వచ్చినపుడు ఆ నావను పెద్ద సర్పముతో నా కొమ్మునకు కట్టి వేయుము".
ఇట్లు పలికి మత్స్యము అంతర్ధానము చెందెను. మనువు ఆ కాలమునకై నిరీక్షించుచు ఉండెను. సముద్రము గట్టు దాటి పొంగగా అపుడు నావను ఎక్కెను. ఒక కొమ్ముగల, పదివేల కోట్ల యోజనములు గల బంగారు మత్స్యము (వచ్చెను). దాని కొమ్మునకు నావను కట్టెను. ఆ మత్స్యమును స్తోత్రములచే స్తుతించుచు, పాపములను తొలగించు మాత్స్యపురాణమును ఆ మత్స్యము చెప్పగా వినెను.
కేశవుడు బ్రహ్మనుండి వేదములను అపహరించిన హయగ్రీవు డను దానవుని సంహరించి వేదమంత్రాదులను రక్షించెను. పిమ్మట వారాహకల్పము రాగా హరి కూర్మావతారం ధరించెను.
అగ్ని మహాపురాణములో మత్స్యావతారమను ద్వితీయాధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment