Thursday, 17 February 2022

శుక్రవారం -- *


 





*శ్రీ పాండురంగాష్టకం*

ఓంశ్రీమాత్రే నమః

*శ్రీఆది శంకరాచార్యులు  రచించిన శ్రీ పాండురంగాష్టకమ్‌*

*ॐॐॐॐॐॐॐॐॐॐ*

*1) మహాయోగపీఠే తటే భీమరథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః!*

*సమాగత్య తిష్ఠంత మానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌!!*


*2) తటిద్వాసనం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్‌!*

*పరం త్విష్టకాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌!!*


*3) ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం నితంబః కరాభ్యాంధృతో యేన తస్మాత్‌!*

*విధాతుర్వసత్యై ధృతో నాభికోశః పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌!!*


*4) స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే, శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్‌!*

*శివం శాంతమీడ్యం వరం లోకపాలం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌!!*


*5) శరచ్చంద్ర బింబాననం చారుహాసం లసత్కుండలాక్రాంత గండస్ధలాంగమ్‌!*

*జపారాగబింబాధరం కంజనేత్రం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌!!*


*6)కిరీటోజ్జ్వలత్సర్వదిక్ప్రాంత భాగం సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః!*

*త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌!!*


*7)విభుం వేణునాదం చరంతం దురంతం స్వయం లీలయాగోపవేషం దధానమ్‌!*

*గవాం బృందకానందదం చారుహాసం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌!!*


*8) అజం రుక్మిణీప్రాణసంజీవనం తం, పరం ధామ కైవల్యమేకం తురీయమ్‌!*

*ప్రసన్నం ప్రసన్నార్తిహం దేవదేవం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌!!*


*9) స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్‌!*

*భవాంభోనిధిం తేపి తీర్త్వాంతకాలే హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి!!*

*ఇతి శ్రీఆదిశంకరాచార్య విరచితం శ్రీపాండురంగాష్టకం*

****

*తాత్పర్యము:-*

*1) మహాయోగ పీఠం అయిన పండరీపురంలో, భీమ రథీ తీరంలో, మునీన్ద్రులతో కూడి పుండరీకునికి వరములిచ్చిన, అనంతమైన ఆనందమునకు మూలమైన, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.*

*2) తన పాదపద్మములను ఇటుకలో స్థిరముగా ఉంచిన వాడు (విఠలుడు), మెరుపు తీగవలె అలంకరించబడిన వాడు, నీల మేఘ శ్యాముడు, లక్ష్మీ దేవికి నివాసమైన వాడు, సుందరమైన వాడు, ప్రకాశించే అంతరంగము కలవాడు,  పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.*

*3) చేతులను వంచి నడుముపై ఉంచుకొని ఈ మిథ్యా ప్రపంచమంతా నడుములోతు వరకే అని సందేశాన్ని ఇచ్చే, తన నాభి నుండి కమలమును సృష్టించి అందులో బ్రహ్మకు నివాసము ఏర్పరచిన వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.*

*4) కౌస్తుభ మణిని మెడలో ధరించిన వాడు, అందమైన భుజకీర్తులు కలవాడు, అందంగా అలంకరించబడిన కురులు కలవాడు, లక్ష్మీ దేవికి నివాసమైన వాడు, శాంతమైన వాడు, శుభకరుడు, జగత్తును కాపాడే వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.* 

*5) శరత్కాలములోని చంద్రుని వంటి ముఖము కలవాడు, సమ్మోహనము కలిగించే చిరునవ్వు కలవాడు, మెరిసే కర్ణ కుండలములు  చెంపలపై వరకు కలవాడు, ఎర్రని మందారము రంగులో, దొండపండు వంటి పెదవి కలవాడు, కలువ పూల వంటి కళ్ళు కలవాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.* 

*6) నలుదిక్కుల ప్రసరించే ప్రకాశము గల కిరీటమును ధరించిన వాడు, దేవతలచే అమూల్యమైన రత్నములతో పూజించబడే వాడు, మూడు వంపుల ఆహర్యములో నిలబడిన వాడు, వన మాలలు, శిఖి పించము ధరించిన వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.*

*7) సర్వ వ్యాప్తమైన వాడు, వేణువును వాయించే వాడు, దుష్టుల పాలిటి చరమ గీతమైన వాడు, ఆటగా గోపాలుని వేషములో ఉండేవాడు, గోవులకు ఆనందము కలిగించే వాడు, వికసించిన కలువ వంటి చిరు నవ్వు కలవాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.*

*8) జననము లేని వాడు, రుక్మిణీ వల్లభుడు, అనంతమైన ప్రకాశకుడు, ఏకైక మోక్ష కారకుడు, నాలుగవ స్థితి (తురీయం) అయిన వాడు,  ప్రసన్నుడు, దేవ దేవుడు, శరణాగతుల ఆర్తిని పోగొట్టే వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.*

*9) పాండురంగని నుతించే ఈ స్తోత్రాన్ని భక్తి మరియు శ్రద్ధతో పఠించే వారు సులభముగా సంసార సాగరాన్ని దాటి, విష్ణు లోక నివాసము పొందుతారు.*

******


నారద భక్తి సూత్రాలు - 61  

ప్రథమాధ్యాయం - సూత్రము - 36

. 36. అవ్యావృత భజనాత్‌ ॥ - 1 

పూర్వ సూత్రంలోని వ్యతిరిక్తాలను త్యాగం చేయడంతోపాటు, పొందవలసిన కల్యాణ గుణాలను పొందే ప్రయత్నం కూడా చెయాలి. నిరంతరం భగవంతుని భబించాలి. భగవల్రైరకంగా ఏది చేసినా అది భజనె అవతుంది. భక్తి కారణమైతే, భక్తి భావ ప్రకటనయే భజన. 

భజనాదులు సాధనలై భక్తిని పెంపొందిస్తాయి. భజనాదులు అనేక క్రియలుగా ఉన్నాయి. విసుగు కలగకుండా ఉందెటందుకు, వాటిని మార్చి మార్చి చేయడాన్ని అవ్యావృత భజన అంటారు.

అనగా తెంపు లేకుండా చేసిన సాధనలనె మరల మరల చక పద్ధతిగా చేయడం. 

సాధనను మనఃపూర్వకంగా ప్రీతితో చేయాలి. కూలి కొరకు చేసే పనిగా కాదు. ఎవరికోసమో చేసెదిగా కూడా కాదు అని పతంజలి యోగ సూత్రం.  కొందరు భక్తులు ఇతరులచెత చేయించే పూజాదుల ఫలితం కూడా ఆ భక్తులకు రాదు. ఇతరులైనా భక్తితో చేయక కూలికి చేస్తే వారికి కూడా ఫలితం దక్కదు.  

ప్రహ్లాదుడు తన తండ్రితో వచించినట్లు భక్తి నవ విధములు.

తను హృద్భాషల సఖ్యమున్‌, శ్రవణమున్‌ దాసత్వమున్‌, వందనా రృనముల్‌, సేవయు, ఆత్మ లోనెరుకయున్‌ సంకిర్తనల్‌, చింతనం బను తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్‌ హరిన్‌ నమ్మి స 

జ్ఞనుదై యుండుట భద్రమంచు దలతున్‌ సత్యంబు దైత్వోత్తమా ! 

తా: హృదయ పూర్వకంగా చేసే భక్తి సాధనలు (1) సఖ్యం (2) శ్రవణం (3) దాసత్వం (4) వందనం (5) అర్చన (6) సేవ (7) ఆత్మ నివేదనం (8) సంకీర్తనం 

(9) చింతనం అని తొమ్మది విధాలు.

 వీటిని సర్వాత్ముడైన భగవంతుని నమ్ము, సజ్జనుడుగా ఉండి చేసినచో ఫలవంతమగును. 

ఈ విధమైన భజనలో ఏ ఒక్కటైనా సరిపోతుంది. కాని అలసట కలిగి నప్పుడు, లెక విసుగు పుట్టినప్పుడు ఈ తొమ్మిదిలో కొన్నింటిని మార్చి మార్చి చేయవచ్చు. భక్తి రసాస్వాదన నిరంతరం ఉండాలంటే ఈ తొమ్మిదె కాక మరి కొన్నింటిని, అనగా జప తపాదులను కూడా మార్చి మార్చి చేయవచ్చు. 

ఒకానొక  భక్తి క్రియకు విరామమిచ్చి, మరొక భక్తి క్రియతో పూరిస్తే విశ్రాంతి లేకుండానే, ఉత్సాహంగా ఉంటుంది. భక్తి నాధనకు ఫలితం వచ్చిలోగా ఆపితే, రావలసిన ఫలితం జాష్యమవుతుంది. విరామ సమయంలో మళ్ళీ విషయ సంగత్వం కలిగితే ఇక తిరోగమనమే. అతడిక సాధనను పునః ప్రారంభించ లేడు. 

అందువలన భక్తి సాధకుడు సంకీర్తన చేసి అలసిపోతే సంకీర్తన ఆపి, పురాణ, వేదాంత గ్రంథ పఠనం చేయాలి. మళ్ళీ పఠనానికి విరామ మిచ్చి వెంటనె ధ్యానానికి కూర్చోవాలి. ధ్యానం కుదరకపోతే సత్సంగం చేయాలి. అనగా వేదాంత చర్చ చేయాలి. 

ఒక క్రియలో ఉత్సాహం తగ్గగానె మరో క్రియ ప్రారంభించాలి. అదే విధంగా విరామం లేకుండా నిరంతరం ఏదో ఒక సాధన జరిగేలా చూచుకోవాలి. 

విరామమిస్తే పారిపోయిన అరిషడ్వర్దం పొంచిఉండి, అవకాశమిస్తే మళ్ళీ ప్రవేశిస్తుంది. అది తిష్ట వేస్తే రెండవసారి పారద్రోలడం కష్టతరమవుతుంది. 

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర

ప్రతీ రెండేండ్ల కోసారి మాఘమాసం వచ్చిందంటే చాలు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం యావత్తూ జన సంద్రగా మారిపోతుంది. నిజానికి అది పెద్ద ఊరు కాదు, చెప్పుకోదగ్గ పట్టణమూ కాదు. అదొక కీకారణ్యం. అక్కడక్కడ కొన్ని ఇండ్లు తప్ప పెద్దగా జనం లేని కారడవి. ప్రతి రెండు ఏండ్లకొకసారి అక్కడో మహానగరం వెలుస్తుంది. అక్కడి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ జన సంద్రం ఆవిర్భవిస్తుంది.

అది కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజు నుంచి మూడు రోజులు మాత్రమే. అదే మేడారం జాతర. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర 2022 ఫిబ్రవరి 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగనున్నది. తెలంగాణా కుంభమేళగా, ప్రపంచంలో అతి పెద్ద గిరిజన జాతర.

ఏటా మాఘమాసంలో నాలుగురోజులపాటు జరిగే సమ్మక్క- సారక్క జాతర ఈ నెల 16 నుండి ప్రారంభం కానుంది. కన్నెపల్లిలో కొలువైన సారలమ్మను మేడారానికి తీసుకురావడంతో ఈ జాతర ఆరంభం అవు తుంది. సమ్మక్కను గద్దెకు చేర్చడం, మొక్కులు తీర్చుకోవడం, తరు వాత దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. గిరిజ నులు తమ గుండెల్లో గుడి కట్టుకుని కొలుచుకునే వనదేవతల జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో జరుగనున్నది.

* ఎవరీ సమ్మక్క ? *

కథ - 1

13వ శతాబ్దంలో ఒకసారి ఇక్కడి కోయదొరలు వేటకని వెళ్లినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొరుతూ కని పించిన పాటికి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. సమ్మక్క, వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టు పులులు, సింహాలూ ఆమెకు రక్షణగా నింపడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావిం రాము. సమసన పని వారి సమ్మక్క యుక్తవయసు రాగానే ఆమెను మేడారాన్ని పాలించే పగిడిద్ద రోగమైనా పెట్టి బయమైపోయేదలు తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రాజకి ఇచ్చి మరంగా వివాహం చేశారు. వారెరువురికీ బంపన్లు, సారక్క, నాగులమ్మ అని ముగ్గురు పిల్లలు. ఒక దశలో మేడారం మళ్లీ కరువు కోరలలో చిక్కుకుపోయింది. మరోవైపు ఎలా తనకి కట్టాల్సిన కుప్పాన్ని పంపమంటూ ఓరుగల్లు రాజైన ప్రతాపరుద్రుడు ఆదేశిస్తాడు. కరువు వల్ల తాను కప్పాన్ని కట్టలేవని పగిడిద్ద రాజు ఎంతగా వేరుకున్నా లాభం లేకపోయింది. ఇప్పం కట్టలేకపోతే వారు తప్పదని హెచ్చరించాడు. అలా యుద్ధం ప్రారంభమైంది.

కాకతీయుల చేతిలో పగిడిద్దరాజు కన్నుమూశాడు. భర్త మరణవార్తను వినగానే సారక్క తన పిల్లలు, అల్లుడు గోవిందరాజుతో కలిసి యుద్ధంలోకి దూకింది. కాకతీయులు సమ్మక్క సారక్కల మీద విరుచుకుపడి బాణా లను సంధించారు. సారక్క, అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమ్మర్య మాత్రం నడుచుకుంటూ చిలకల గుట్ట పైకి వెళ్లి మాయమైంది. సమ్మక్కను వెంబడిస్తూ వెళ్లిన వారికి ఆమె అగుపించలేదు. అక్కడ ఒక చెట్టు కండ కుంకుమభరిణె కనిపించింది. సమ్మస్తే, ఆ సంకుమభరిణగా మారిపోయిందని భక్తుల నమ్మకం

కథ - 2

12 - 13వ శతాబ్దంలో నాటి కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాలో ఉన్న "పొలవాస' (పోలాస)ను వరి పాలించే గిరిజన దొర మేడరాజా. తన ఏకైక కుమార్తె సమ్మన్యను మేనల్లుడైన మేడారంను పాలించే పగి డిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేస్తారు. ఈ పుణ్య దంపతులకు పొరలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము ఇదిలా ఉంటే కాకతీయల మొదటి ప్రభువు ప్రతాప రుద్రుడికి రాజ్య విస్తరణ చేయా అనే కోరిక అమితంగా ఉండేది. అలా గిరిజన దొర మేడరాజు పాలించే పాలవాసపైకి దండెత్తుతారు. ఈ దండయాత్రలో ప్రతాపరుద్రుడి బాడి తట్టుకోలేని మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపు తుంటాడు.ఇక మేడారాన్ని పాలించే కోయరాజు "పగిడిద్దరాజు కాకతీయుల సామంతుని గా ఉంటూ కరువు కాటకలతో పన్నుచెల్లించలేకపోతాడు. దీంతో తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగు లమ్మ, గోవింద రాజులు మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహ త్యకు పాల్చడుతారు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క గాయాలతో చిలుకుట గుట్టపైకి వెళ్లి మాయమవుతుంది. ఆమెను వెంబడిస్తూ వెళ్లిన గోయవారికి నెమలి చెట్టుకింద కుంకుమభరిణ కనిపిస్తుంది. ఆ భరిణనే సమ్మక్కగా భావించి పూజలు చేస్తారు...
***


[20:50, 17/02/2022] Mallapragada Sridevi: ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి.

మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి,,రెండవది బలరాముడు.ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి.
 
  దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది.ఉడిపిరాజైన నరేషుడు
  సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. 

అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు.
మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.

అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది,
నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు.
 అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము.వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు  చెపుతాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది,50 లక్షల మందికి భోజనం వండటం
 అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది,అందరికీ భోజనాలు తయారుచేయమని చెపుతాడు.

50 లక్షల మందికి భోజనాలు వండాలంటే  
 భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం
 భీముడు కు ముఖ్యం.అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు.అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు.

నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న  సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేష్ ఎలా 
వండేవాడు అంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా,వృధాకాకుండా వండేవాడు.

రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది.
అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా 
వండేవాడు నరేశుడు.
ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు.
 ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు,అది కూడా ఒక్క మెతుకు కూడా
 మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు.
 అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది?
 ఈ రోజు  ఇంతమంది మాత్రమే చనిపోతారని,మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..

ఇలా18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతుంది.అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు.కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.

అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు.
అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు.
 అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం.కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణుని కే చెందుతుంది అని చెప్తాడు.
  ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు.
  ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా
  కారణం అని నరేషుడుని అడుగుతారు. 
అప్పుడునరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు...

శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను లెక్క పెట్టి పెట్టే వాడిని.
శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని...
 శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలుఅయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే
 శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు.
  దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు.
  ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు.
  ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు.
ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.

*****

 చక్రార్ధ నిరూపణ

(ఉప చక్రాలు - నిర్వాణ చక్రం)

"నిర్వాణ చక్రం", తల పైభాగంలో, అనగా ఆజ్ఞా చక్రానికి- సహస్రార చక్రానికి మధ్య ఉంటుంది. ఈ చక్రం తెల్లని రంగులో భాసిస్తుంది. ఇది 100 దళాల కమలంగా ఉండే సూక్ష్మ చక్రం. "సుషుమ్న నాడి" యొక్క ఉపరి భాగంలో ఈ చక్రం స్థితమై ఉంటుంది. 

   యోగి, తాను సర్వోన్నతుడైన పరమాత్మను చేరడానికి,  సాధనలో భాగంగా పలు ధారణలు చేస్తాడు. ఈ ధారణలన్నీ యోగాభ్యాసంలో భాగమే.

    ఈ ధారణలన్నీ ఈ "నిర్వాణ చక్రం" పరిధిలోనే ఉంటాయి. "మోక్షము" అనేది ఒక స్థితి అనుకుంటే, సాధనలో అట్టి స్థితి రావడానికి మూల కారణం "నిర్వాణ చక్రం".

   ఈ శరీరంలో ఏ శక్తులైతే "మోక్షాన్ని" పొందుతాయో, ఆ శక్తులు "బ్రహ్మానంద చక్రం" ద్వారా పరమాత్మలో సంలీనం అవ్వడానికి వెళతాయి.

    నిర్వాణ చక్రాన్ని "జాలాంధర చక్రం" అని కూడా అంటారు. "జాలాంధర" అంటే......."జాల్" అంటే వల. "ధర" అనగా, నాడుల యొక్క అమృత స్రావాన్ని పట్టి ఉంచడం.

    ఇక్కడ నాడులు అనగా శక్తి వాహకాలు. ఎవరైతే నిర్వాణ చక్రం వరకు వెళతారో, వారు పూర్ణ జ్ఞానులు.

   ఈ "నిర్వాణం" అన్న పదం "సౌభాగ్యోపనిషత్తులో కలదు. దీనిని "బ్రహ్మ రంధ్ర చక్రము" అనికూడా అంటారు. యోగ శిఖోపనిషత్తులో ఈ చక్రాన్ని "బ్రహ్మ రంధ్ర మహా స్థానము" అన్నారు.

   ఈ చక్రం పై మనం ధ్యానం చేస్తే, మనకు  "పొగ చూరిన దివ్య కాంతిని" మనం ధ్యానం చేయడం ద్వారా ఈ చక్ర చైతన్య స్థితి అనుభవానికి వస్తుంది. ఉన్నత మైన చైతన్యం  ఇక్కడ వసిస్తుంది.

******

నిన్న  "కళాప్రపూర్ణ" "చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి" గారి 72 వ వర్ధంతి. 

ఎవరికీ పట్టని విషయం.

"జండాపై కపిరాజు", "బావా ఎప్పుడు వచ్చితీవు", "చెల్లియో చెల్లకో", "అలుగుటయే ఎరుంగని", "తమ్ముని 

కొడుకులు", "సంతోషంబున సంధిచేయుడు" అనే ప్రసిద్ధిగాంచిన పద్యాలు గుర్తుండే ఉంటాయి.

ఇవి రచించిన జంటకవులలో వారే "శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి" గారు.

చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి

జననం : ఆగస్టు 8, 1870, కడియం

మరణం:  15 ఫిబ్రవరి 1950

ఇతర పేర్లు "తిరుపతి వేంకట కవులు", "జంట కవులు"

ప్రసిద్ధి: తెలుగు కవిత్వం, నాటకాలు, అవధానం (ప్రప్రథమ శతావధాని), పాండవ జనన- ఉద్యోగ - ప్రవాస  - అశ్వమేధ  - విజయాలు , శ్రీ కృష్ణ రాయబారం, కాశి  యాత్ర, శ్రవణానందం, జాతక చర్య, ఇటీవలి చర్య , కింగ్ జార్జ్ V పట్టాభిషేక పద్యాలు, మృత్యుంజయ స్తవము మరెన్నో....

వీరు రచించిన పద్యాలు, నాటకాలు ఎన్నో తెలుగు చలన 

చిత్రాలలో వాడుకున్నారు.

*తొలి ఆస్థానకవి చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి:*

------------------------------------------------------

"అలనాటి మద్రాసు ప్రభుత్వం తొలి ఆస్థానకవి చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (1949)" అవధాన విద్యకు రూపు రేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులులో ఒకడు. దివాకర్ల తిరుపతిశాస్త్రితో జంటగానూ, ఆయన మరణానంతరం విడిగానూ ఎన్నో పద్యనాటకాలు, కావ్యాలు, వచన రచనలు రచించారు. చెళ్లపిళ్ల తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆయన శిష్యులుగా చదువుకున్నవారు చాలామంది ఆ తర్వాతి కాలంలో తెలుగు సాహిత్యరంగంలో, భాషాశాస్త్రంలోనూ కవులుగా, పండితులుగా ప్రఖ్యాతి పొందారు.


అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం

డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో

హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే

శల చాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళ్ల వంశస్వామి కున్నట్లుగన్ ”

                                                     —విశ్వనాథ సత్యనారాయణ

గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాథకు తన ప్రతిభ పైన అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవాడు. తనంతటివాడు (అనగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివాడు) శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు లభించలేదని, చెళ్ళపిళ్ళవారికి దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో అన్నారు విశ్వనాథ.

చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి ప్రమోదూత సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి సోమవారం అనగా 1870 ఆగస్టు 8న తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించారు. ఆయన ముత్తాత తమ్ముడు "వేంకటేశ్వర విలాసము", "యామినీ పూర్ణతిలక విలాసము" అనే మహద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకట శాస్త్రికి అందుబాటులో ఉన్నాయి. తరువాత వారు యానాంకు మకాం మార్చారు. యానాంలో వేంకట శాస్త్రి తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషలు అధ్యయనం చేశారు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు. 18 ఏండ్ల వయసులో యానాం వేంకటేశ్వర స్వామి గురించి వ్రాసిన శతకంలో వ్యాకరణ దోషాల గురించి స్థానిక పండితులు విమర్శించారు. అది అవమానంగా భావించిన వేంకటశాస్త్రి సంస్కృత వ్యాకరణం నేర్చుకోవడానికి వారాణసి వెళ్ళాలని నిశ్చయించుకొన్నారు. కాని ఆర్థికమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పై ఆయనకు పుట్టుకనుండి ఒక కన్నుకు సంబంధించిన సమస్య ఉండేది. తరువాత వేంకట శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నపుడు తిరుపతి శాస్త్రితో పరిచయం ఏర్పడింది.

వేంకట శాస్త్రి అధ్యాపకునిగా ఉన్నపుడు ఆయన శిష్యులుగా ఉండి, తరువాత సుప్రసిద్ధులైనవారిలో కొందరు - విశ్వనాధ సత్యనారాయణ, వేటూరి ప్రభాకర శాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, మరె

విశ్వనాథ గురించి తన శిష్యుని గురించి గురువు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి ఇలా అన్నారు:

నా మార్గమ్మును కాదు, వీని దరయన్ నా తాత ముత్తాతలం దే మార్గమ్మును కాదు; మార్గమదియింకేదో యనంగా వలెన్ సామాన్యుండనరాదు వీని కవితా సమ్రాట్ వవుత మా హేతువై, యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్..

 భారత భూమి పోరులో..

బాంబుల మోతలో తల్లడిల్లి..

 దేహాలు పుల్వామా ఉగ్రాదాడిలో..

నెత్తుటి మరకలతో రక్తసిక్తమై..

ఆనందించేవు భరతమాత

ఒడిలో.. ప్రాణాలకు తెగించి..

గర్వించేము.. నీ వీరత్వం చూసి..

ఏమిచ్చి తీర్చుకోగలం నీ రుణం?

వీరమరణం పొందిన వీర జవాన్లకు ఏమివ్వగలం.. మీకు 

రెండు నిమిషాలు మౌనం పాటించినా..

తీర్చుకోగలమా మీ రుణం?

దేశ సరిహద్దే తల్లి, చెల్లి, ఇల్లు అనుకుని..

ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్న..

ప్రతి ఒక్క సైనికుడికి పాదాభివందనం

వృథా కాకూడదు వారి బలిదానం

జవాన్ల సేవలకు చెయ్యెత్తి జై కొడదాం..

వీర సైనికులారా జయహో..

పుల్వామా దాడుల్లో ప్రాణాలర్పించిన అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ..

       😔😔 😞 😔😔

జై హింద్  ✊🏻 జై భారత్ 🇮🇳

వందేమాతరం..✊🏻

          📕శుభోదయం🌼 

🌻 మహనీయుని మాట 🌻

"జీవితంలో ముందుకెళ్లడం అంటే నలుగురి వెనుక పరిగెత్తడం కాదు. నలుగురూ నడిచే మార్గాన్ని ఏర్పరచుకోవడం."

       --------------------------

🌹 నేటి మంచి మాట 🌹

      ---------------------------

"మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మనకోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరచిపోయేలా చేస్తుంది. 

****



An image collection on imgfave
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 
నేటి కవిత్వం - స్త్రీ తత్త్వం
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

స్త్రీపురుషులలోను  మానవత్వమ్ముయే
స్త్రీలలొ కనికర  చెలిమి మనస్సు 
స్త్రీలలొ సుకుమార సుందరాకృత్వమే 
స్త్రీలను బతికించుటే 

స్త్రీ సిరి అనకుండ జీవనమ్మే సుధా            
మంగళమును తలచి అరుణ సౌంద
ర్యమ్మును విరజాజి పువ్వులా స్త్రీ సువా          
సమ్ములను మనసిచ్చుటే         
             
స్త్రీ అనునది జాగృతీ ఆకృతీ స్వీకృతీ        
మౌన తలపు వలపు వయసు పంచి     
ప్రేమ మగని కంట సామ రస్యమ్ముగా          
తెల్పియు మన సిచ్చుటే   

స్త్రీలహృదయమే సుఖాలనిచ్చే సుసౌ
ఖ్యమ్ము తొ నలిగియు వెలుగును పంచు       
టే నవవిధాలుగా, సమాజమ్ముగా  
భర్తకు మనసిచ్చుటే   

స్త్రీ చిరునగవే మనస్సు ఆకర్షణే       
స్త్రీల తెలివి వినయ వినిమయమ్ము      
కాల్లమహిమ బట్టి  మాట ప్రేమన్  సహా 
యమ్ము గ మనసిచ్చుటె        


--(())--

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు.

_నేటి సద్విషయం

ఎలాంటి పనులకు - ఎలాంటి ఫలితములు!!!

మహాభారతం లో భీష్మ - ధర్మజులకు జరిగిన సంభాషణ ద్వారా పరిశీలిద్దాం!!

ఒక రోజు ధర్మరాజు...

" పితామహా.. మంచి పనులకు మంచి ఫలితాలు ఉంటాయి " అంటారు కదా...

" ఏ మంచి పనికి ఎలాంటి ఫలితము ఉంటుంది " అని అడిగాడు...

భీష్ముడు...

ధర్మనందనా.. ఒక్కో పనికి ఒక్కో ప్రత్యేక ఫలితం ఉంటుంది... ఆకలితో ఉన్న బాటసారికి అన్నం పెడితే వచ్చే ఫలితం అంతా ఇంత కాదు...

రోజూ చేసే అగ్ని ఉపాసన మన పనులను విజయవంతం చేయడానికి తోడ్పడుతుంది...

మనం మంచి వస్తువులు ఇతరులకు దానం చేస్తే మనకు అవసరమైన సమయాలలో ఆ వస్తువులు అయాచితంగా లభిస్తాయి...

మౌనం పాటిస్తే మన జ్ఞానం వృద్ధి చెందుతుంది...

తపస్సు చేస్తే అధిక భోగములు చేకూరుతాయి... 

ఉపవాసం చేస్తే మనస్సు నిర్మలంగా ఉంటుంది...

అహింసా వ్రతము ఆచరిస్తే రూపము, బలము, ఐశ్వర్యము చేకూరుతాయి...

ఉపవాసం చేస్తే మనస్సు నిర్మలంగా ఉంటుంది, కేవలం ఫలములు, నీరు త్రాగి 

జీవించిన వాడికి రాజ్యప్రాప్తి కలుగుతుంది...

వేదములు చదివితే సుఖాలు ప్రాప్తిస్తాయి... 

వేదార్ధము గ్రహిస్తే పరలోకసుఖము ప్రాప్తిస్తుంది...

సత్య వ్రతము పాటిస్తే మోక్ష ప్రాప్తి కలుగు తుంది...


ధర్మనందనా.. మంచి పనులకు మంచి ఫలితము కలిగినట్లే చెడుపనులకు కూడా చెడు ఫలితాలు కలుగుతాయి...


ఏ విత్తు వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది అన్నట్టుగా మానవుడికి ముసలితనము వచ్చి పళ్ళు ఊడిపోయి, వెంట్రులకు రాలిపోయి, చెవులు వినపడక, కళ్ళు కనపడక పోయినా అతడిలో కోరికలు మాత్రము చావవు... ప్రాణములు పోయినా కోరికలు విడువవు...

ఇది మామూలు మనుషులకే కాదు పండితులకు కూడా ఈ బానిసత్వము తప్పదు...

ఆఖరిదశ వరకు ఈ కోరికల మీద మోహము విడిచి పెడదాము అన్న ఆలోచన కూడా రానివ్వరు...

వెలుపలి ప్రపంచంలో విహరించే వారికి పుణ్యకర్మలు సుఖాన్ని పాపకర్మలు దుఃఖాన్ని కలుగచేస్తాయి... 

అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు...

దీనినిబట్టి - మనము ఎలాంటి పనులు చేయాలో - మనమే నిర్ణయించుకోవాలి!!🙏

                 🍂శుభమస్తు🍂

         🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏 


చక్రార్థ నిరూపణ

(చక్ర విజ్ఞానం)

ఉప చక్రాలు - లలనా చక్రం

భట్టాచార్య

 మన శరీరం లో ఉన్న 7 ప్రధాన చక్రాలు కాక ...ఇంకా ఇతర చక్రాలు /శక్తి కేంద్రాలు ఉన్నాయి. అందులో బిందు విసర్గం లేదా లలనా చక్రం ఒకటి. అర్థ చంద్రాకారాన్ని (crescent moon) ఈ ప్రదేశానికి చిహ్నంగా చూపిస్తారు. బిందువు అంటే చుక్క అని అర్థం. కర్మలు శిఖా స్థానంలోనే దాక్కొని ఉంటాయి. పూర్వకాలంలోనూ/ఈనాటి కాలంలోనూ కొందరు సాధకులు   ఈ శిఖను బాగా బిగించి, ముడి కట్టుకుని , వేదాధ్యయనం చేసేవారు. ఇప్పుడు కూడా అలాగే అనుకోండి. నిద్ర మత్తు స్తబ్ద స్థితులనుండి ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండడానికి ఇలా చేస్తూ ఉండేవారు. ఈ బిందు స్థానాన్ని ఎప్పుడూ జాగృతితో ఉంచి ...ఇక్కడ ఉండే అమృతాన్ని ఎప్పుడూ క్రింద పడకుండా చూసుకోవాలి. ఈ లలనా చక్రాన్ని "తాలు చక్రం" అనికూడా అంటారు. ఈ లలనా చక్రం చైతన్యవంతం కాకపోతే, జీవితం బాధాకరంగా ఉంటుంది. ఈ చక్రం చైతన్యం కావడానికి "ఖేచరి" ముద్ర సహాయకారి. (ఈ ముద్రను గురువు సహాయంతో అభ్యసించాలి) ఈ చక్రస్థానాన్ని ఉత్తేజ పరచడానికి షణ్ముఖీ ముద్ర, నవముఖీ ముద్ర వేసుకోవాలి.

     సౌభాగ్యోపనిషత్తు ప్రకారం ఈ తాలు చక్రం 12దళముల కాంతివంతమైన కమలంగా ఉంటుంది. కొన్ని తంత్ర గ్రంథాలు ఈ చక్రానికి 64 వెండి రంగులో ఉంటాయని, వీటికి "ఘంటిక" అనే పేరు గల కాంతివంతమైన ఎర్రని రంగు గల అంచులుంటాయని, ఈ చక్రం చైతన్యవంతం అవ్వడం వలన ....చంద్రుని శక్తి "అమృతం" రూపంలో స్రవిస్తుందని చెబుతున్నాయి. ఈ చక్రం సంపూర్తిగా చైతన్య వంతం అయిన యోగికి "శూన్య అవస్థ" అనుభవానికి వస్తుందని తాంత్రికులు చెబుతారు. ఈ తాలు చక్రం యొక్క 64 సూక్ష్మ దళాలు, 64గురు యోగినుల  గృహములుగా చెప్పబడినవి. అష్ట సిద్ధులు ఆశించేవారు, ఈ చక్రాన్ని చైతన్య పరచుకోవడం ముఖ్యం. సాధనలో కొన్ని సార్లు ఈ చక్రం చైతన్యవంతమైనది గానూ, ఇబ్బంది కరమైనదిగానూ అనిపిస్తుంది. సాధకులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
   విశుద్ధ, బిందు విసర్గాలు(తాలు చక్రం/లలనా చక్రాలు) ప్రక్క ప్రక్కనే ఉంటాయి.ఇక్కడి నుండీ అమృతం క్రిందకి జాలువారుతూ ఉంటుంది.ఆ అమృతం మణిపూరకానికి చేరుకున్నప్పుడు అక్కడి అగ్ని తత్వం వల్ల ఆవిరై పోతుంది. శరీరంలో ఎక్కడైనా విష పదార్థాలు పేరుకొని ఉంటే వాటిని శుద్ధి చేయగలిగే శక్తి ఈ అమృతానికి ఉంది. బిందువిసర్గం/లలనా చక్రం అత్యున్నత సత్యలోకంతో అనుసంధానమై ఉంటుంది. ఇది ఆనందమయ కోశ స్థానం.ఇక్కడ మత్తు కలిగించే రసాలు ఉద్భవిస్తాయి. ఖేచరీ ముద్రవలన ఈ అమృతం క్రింద పడి వృథా కాకుండా నిలువ వుంటుంది. అందుకే విశుద్ధ చక్రం, బిందు విసర్గ స్థానాలను కలిపి జాగృతం చేస్తూ కర్మ నిర్వర్తిస్తుండాలి.

****

No comments:

Post a Comment