1। ఖాళీ కుండలో ఆకాశం ఉంటుంది। - పరమాత్మ।
2। అందులో నీటిని నింపాక, నీటితో కలిసిన ఆకాశం ఉంటుంది। - జీవాత్మ।
3। ఆ నీటిలో ప్రతిబింబాకాశం ఉంటుంది।- మాయ జగత్తు।
*****
04. శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
52వ నామ మంత్రము 16.2.2022
ఓం శివ కామేశ్వరాంకస్థాయై నమః
శివస్వరూపుడు, కామస్వరూపుడు అయిన కామేశ్వరుని (శివుని) అంకమును (తొడను) స్దానముగా జేసికొని విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము
శ్రీలలితా సహస్ర నామావళి యందలి శివ కామేశ్వరాంకస్థా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం శివ కామేశ్వరాంకస్థాయై నమః యని ఉచ్చరించుచూ ఆ శ్రీమాతను ఉపాసించు సాధకునికి ఆత్మానందము, భౌతికసంబంధమైన సుఖసంతోషములు సంప్రాప్తమగును.
ఇంతవరకూ ఆ పరమేశ్వరి స్థూలరూప సందర్శనము నామ మంత్రములద్వారా జరిగినది. ఇప్పుడు ఆ పరమేశ్వరి నివాస స్థానముల వైనము తెలియజేయబడుచున్నది. అమ్మవారు శివకామేశ్వరాంకస్థా యని అనబడినది.
శివ అన్నప్పుడు మనం ఒక యోగి గురించి, మొట్టమొదటి యోగి లేక ఆదియోగి గురించి, అలాగే మొట్టమొదటి గురువు లేక ఆది గురువు అని అనుకోవాలి. ఆయనే ఆది భిక్షువు అని కూడా అంటారు. అటువంటి శివస్వరూపుడు పరమేశ్వరుడు. కోరికలు గలవాడు కాముడు. పరమేశ్వరుడు సృష్టిచేయాలనే కోరిక గలవాడు అని బృహదారణ్యకమున చెప్పబడినది. శివుడు, కాముడు అనునవి ఈశ్వరునికి (పరమేశ్వరునికి) విశేషణములు. గనుక ఆయన శివకామేశ్వరుడు. ఆయన అంకము తన స్థానముగా గలిగిన పరమేశ్వరి శివకామేశ్వరాంకస్థా యని అనబడినది. ఆ పరమేశ్వరి శివునికి ఇచ్ఛాస్వరూపురాలు. అనగా ఇచ్ఛాశక్తి. సృష్టిచేయాలనే శివుని ఇచ్ఛకు ఆ పరమేశ్వరి స్వరూపురాలు గనుక ఆ తల్లి శివుని ఇచ్ఛాస్వరూపురాలు అని చెప్పబడినది. భక్తుల హృదయస్థానము పరమాత్మకు నివాసస్థానము. పరమేశ్వరి ఇచ్ఛాస్థానము శివకామేశ్వరుని అంకస్థానము. ఇచ్ఛ అనునది ఒక శక్తి యని కూడా అన్నారు. శక్తులు ఆధారములేకుండా ఉండవు. ఆధారము కావలెను. ఈ శక్తి శివుని ఇచ్ఛాశక్తి గనుక శివుడాధారమైయున్నది. ఆ ఆధారమే కైలాసమునందు ఉండు పరమేశ్వరుని వామాంకము. గనుకనే అమ్మవారు శివకామేశ్వరాంకస్థా యని అనబడినది.
సత్యస్వరూపుడు, స్థావరజంగమాత్మకమగు జగత్తుయొక్క సృష్టికి కర్తయైనవాడు, చిద్రూపుడు (స్వప్రకాశస్వరూపుడు), సదా ప్రేమాస్పదుడు, ఆనందస్వరూపుడు, సృష్టిలోని పదార్థములన్నింటిలో పరిపూర్ణుడైనవాడు - ఇతనికే శివుడని పేరు. జీవేశ్వరులకు భేదములేనివాడు. లేదా జీవాత్మపరమాత్మలకు ఒకటే రూపమైనవాడు - అతడే శివుడు.
శివము అనగా మంగళము. అట్టి మంగళమును కలిగించువాడు గనుక శివుడు. శివుని భార్య శివాని. ఈమెకూడా మంగళరూపిణియే. ఒకరు కుడి అయితే మరొకరు ఎడమ. కుడిఎడమల స్వరూపమైన అర్ధనారీశ్వరతత్త్వమే శివపార్వతులు. గనుకనే ఆ పరమేశ్వరి కామేశ్వరుని అంకమున ఉన్నది. అందుచే ఆ జగన్మాత శివకామేశ్వరాంకస్థా యని అనబడినది.
సౌందర్యలహరియందు, ఎనిమిదవ శ్లోకంలో శంకరభగవత్పాదులవారు ఇలా అన్నారు.
సుధాసింధోర్మధ్యే - సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపో-పవనవతి చింతామణి గృహే |
శివకారే మంచే - పరమశివపర్యంక నిలయామ్
భజంతి త్వాం ధన్యాః - కతిచన చిదానందలహరీమ్ || 8 ||
ఓ పరమేశ్వరీ! అమృతసముద్రము మధ్యలో కల్పవృక్షాలతో నిండియున్న మణిద్వీపంలో, కదంబపుష్ప వృక్ష తోటలో, చింతామణులతో నిర్మించిన గృహమునందు, త్రికోణాకారపు మంచము మీద, పరమశివుని పర్యంకస్థితవై ప్రకాశించుచు, జ్ఞాన స్వరూపమై నిరతిశయ సుఖప్రవాహరూపముగా ఉన్న నిన్ను స్వల్ప సంఖ్యాకులైన ధన్యులు మాత్రమే సేవించుకోగలుగుతున్నారు.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ పోస్ట్ ని కాపీ పేస్ట్ చేస్తారో, లేక షేర్ చేస్తారో మీ ఇష్టం కానీ ఈ పోస్ట్ సమాజానికి చేరాలి, ఒక దురుద్దేశపూరిత ప్రచారాన్ని ప్రజల ముందు ఉంచాలి.
ముచ్చింతల్ లో 1000కోట్లు పెట్టి రామనుజులవారి అంత పెద్ద విగ్రహం పెట్టే బదులు హాస్పిటల్ కడితే రామానుజులకి గర్తింపు వస్తుంది కదా
అక్కడ యాగాల్లో మరియు హోమాల్లో వృధా చేస్తున్న నెయ్యి బీదలకు పంచిపెట్టొచ్చు కదా అనే సన్నాయి నొక్కులు గత వారంరోజులుగా, చూస్తున్నాము వింటున్నాము
చినజీయర్ స్వామి వారు పదేళ్లముందే తమ ఆశ్రమంలో 100 పడకల ఆస్పత్రి కట్టించారు అందులో ఉచిత సేవలు అందిస్తున్నారు, దానిముందు చిన్న విగ్రహము పెట్టించారు ఈ విమర్శించే లోకులకి ఈ విషయం తెలుసా...
తెలీదు తెలుసుకోవాలి అని అనుకోరు కానీ విమర్శించేస్తారు.....
ఇవే కాదు ఆశ్రమంలో హోమియో మెడికల్ కాలేజ్ ఉంది, వేదపాఠశాల ఉంది, గోశాల ఉంది, అంధులకి స్కూల్ మరియు కాలేజి ఉంది అందులో చదివే పిల్లలకి స్టేటు ర్యాంకులు వస్తున్నాయ్ ఇవేవీ మనకి తెలీదు కానీ విమర్శించేస్తాం...
JET (Jeeyar Educational Trust ) ద్వారా కొన్ని వందల మంది గిరిజన విద్యార్థులకి 2004 నుంచి ఉచిత విద్య, వసతి ఇస్తున్నారు, అది తెలుసా తెలీదు కానీ విమర్శలు చేస్తారు.
వికాసతరంగిణి అనే ట్రస్టు ద్వారా కొన్ని వేలమంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించారు, సేవలు అందించారు ఇవేవీ మనకి తెలీవు విమర్షిస్తాం, విమర్శకులు మాటలకు తానాతందానా అనేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆ విగ్రహం ఎందుకండి అని అంటే అన్నారు, రేపు తిరుమలలో వెంకన్న ఎందుకండీ అక్కడ కూడా కోట్ల రూపాయల ఖర్చు అంటారు, మీ ఊరిలో గుడి ఎందుకండీ అంటారు, అంతెందుకు ఇప్పటికే నువ్ ఇంట్లో దీపావళి చేసుకుంటే కాలుష్యం అంటున్నారు, సంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చేస్తే దుబారా అంటున్నారు, కాలుష్యానికి కారణాలు ఒక దీపావళి టపాసులే కాదని, దుబారాకు కారణాలు హైందవ సంప్రదాయ వివాహాలు మాత్రమే ఏకైక కారణం కాదు.
చాలామంది అభ్యుదయవాదులం అనే ట్యాగ్ లైన్ కోసం మన సంస్కృతిని సంప్రదాయాన్ని విమర్శిస్తూ, తరతరాలుగా వస్తున్న ఆచారాలను తప్పుబడుతున్నారు, కానీ ప్రతీ ఆచారం వెనుక ఒక పరమార్థం ఉండే ఉంటుంది, ఒకప్పుడు భూమి గుండ్రంగా ఉంటుందంటే అన్నవారిని శిక్షించిన ఇదే సమాజం నిజం తెలిసాక తలొంచుకుంది, మనకు తెలీనివన్నీ అసంబద్ధమైనవి అనుకోవడం మూర్ఖత్వం మాత్రమే....
ఇకపోతే
రామానుజుల విగ్రహానికి ఖర్చు పెట్టిన ఆ 1000కోట్లలో మీకు సంబంధించి ఒక్కరూ రూపాయి కూడా లేదు ఆ డబ్బు అంతా ధార్మికులు ఇచ్చిన విరాళాలు, చందాలు, కానుకల ద్వారా పొగుచేసినవి, మరి విమర్శిస్తున్న మీకు సంబంధం లేని ఆ డబ్బులు దేనికి ఖర్చు పెడితే మీకెందుకు
చిన జీయర్ గారు చేసిన చేస్తున్న కార్యక్రామలు గురించి చాలా మందికి చాలా వివరాలు తెలియవు, వారు పబ్లిసిటీ కోరుకోరు, అలాంటివారికి ఈ పోస్ట్ ద్వారా కొంత సమాచారం తెలియజేయాలనేది ఈ పోస్ట్ ఉద్దేశ్యం.
వేద విద్యాలయాలు
శ్రీరామనగరంతో పాటు విశాఖ,
సీతానగరం, కరీంనగర్ (ఎల్‌ఎండి) లలో జీయర్ గారి ఆధ్వర్యంలో వేదపాఠశాలలు నడుస్తున్నాయి,
అంధులకు విద్య..
శ్రీరామనగరంలో అంధులైన విద్యార్థుల కోసం జూనియర్, డిగ్రీకాలేజీలు నడుస్తున్నాయి,
విశాఖ జిల్లా వారిజలో ప్రాథమిక,మాధ్యమిక పాఠశాల నడుస్తున్నాయి..
అన్నదానం..
బదరీనాథ్ అష్టాక్షరీ క్షేత్రం, హృషీకేష్, శ్రీరంగం, మేల్కొటే, తిరుమల, భద్రాచలం, నడిగడ్డపాలెం,
సీతానగరం, శ్రీరామనగరంలలో రోజూ ఉచిత అన్నదానం జరుగుతోంది తద్వారా రోజు కొన్ని వేలమందికి ఆకలి తీర్చుతున్నారు అది మీకు తెలుసా..
ఆదర్శగ్రామం..
ఆదిలాబాద్ జిల్లాలో యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ఆదర్శ గ్రామాలను రూపొందించే మహత్తర కార్యక్రమం కొనసాగిస్తున్నారు, 11 గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్మాణం చేశారు తద్వారా ప్రజలకు సురక్షిత నీరు అందిస్తున్నారు.
06.ప్రకృతి విలయాలు..
ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు జీయర్ స్వామి వెంటనే స్పందిస్తున్నారు. భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు రంగంలోకి దిగి బాధితులకు చేయూత ఇస్తున్నారు,గుజరాత్‌లోని వల్లభాపూర్‌లో 88 శాశ్వత గృహాలు నిర్మించి ఇచ్చారు, మొన్న నేపాల్ భూకంపబాధితులకు తాత్కాలిక సాయం అందిస్తూ,
1.50 కోట్ల ఖర్చుతో విద్యాలయం నిర్మిస్తున్నారు తమిళనాడులో సునామీ రాగా,నాగపట్నంలో 50 మందికి పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారు, సర్వము కోల్పోయిన మత్స్యకారుల జీవనం కోసం పడవలు అందించారు, జపాన్‌లో సునామీ సందర్భంగా 11 లక్షల రూపాయలు అందించారు
ఉగ్రవాద నివారణ కోసం..
ఉగ్రవాద నివారణ కోసం మానససరోవరం తీరంలో బ్రహ్మయజ్ఞం 2002 లో నిర్వహించారు, కార్గిల్ యుద్దబాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారు
వృద్ధాశ్రమం..
గుంటూరు జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.
జిమ్స్..
జీయర్ ఇంటిగ్రెటివ్ మెడికల్ సర్వీసెస్JIMS (Jeeyar Integrated Medical Services) పేరుతో శ్రీరామనగరంలో హోమియో మెడికల్ కాలేజీ,
100 పడకల ఆసుపత్రి నడిపిస్తున్నారు,
అల్లోపతి/ఆయుర్వేదం/హోమియోపతి విధానాల్లో వేర్వేరుగా చికిత్స అందిస్తున్నారు, వైద్య పరిశోధనలు నిర్వహిస్తున్నారు
ఉచిత వైద్యశిబిరాలు..
గ్రామీణులకు ఉచితంగా వైద్య చికిత్స అందించేందుకు తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు, ఇప్పటి వరకు 2500 పైగా ఉచిత క్యాన్సర్ శిబిరాలు నిర్వహించి రెండు లక్షల మంది మహిళలకు చికిత్స అందించారు, 1300 వరకు సాధారణ ఉచిత వైద్య శిబిరాలు, 900 పైగా కంటి చికిత్స శిబిరాలు,1000 కిపైగా దంత వైద్య శిబిరాలు నిర్వహించారు.
పశువైద్య శిబిరాలు..
పశువులకు ఉచితంగా చికిత్స అందించేందుకు తరచూ పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు,
గ్రామాల్లో ఈ తరహా శిబిరాలను నిర్వహిస్తూ ఏటా సుమారుగా రెండు లక్షల పశువులకు చికిత్స అందిస్తున్నారు.
ఆలయాల జీర్ణోద్ధరణ..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు చిన్న జీయర్ శ్రీకారం చుట్టారు
గోసేవ..
సీతానగరం/శ్రీరామనగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేసి దాదాపు 500 గోవులను రక్షిస్తున్నారు
అవయవదానం..
అవయవదానం గొప్ప దానమని భావించిన చిన్నజీయర్ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎవరైనా అవయవదానం చేయవచ్చు. అనుకోకుండా ఎవరైనా చనిపోతే, ఆరుగంటల వ్యవధిలో వారి అవయవాలను సేకరించి, అవసరమైన వారికి అమరుస్తారు.
ఇందుకోసం ముందుకు వచ్చేవారు
లేదా
98492 45948 నెంబర్లకు ఫోన్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు, 2019 లో విశాఖపట్నం లొ 90 మందికి పైగా జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యములో అవయవదానం జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది.
ఖైదీల్లో పరివర్తన..
ఖైదీల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు జీయర్‌స్వామి ప్రయత్నిస్తున్నారు. క్షణికావేశలో తప్పుచేసి శిక్షపడిన వారిని సమాజంలో బాధ్యత గల పౌరులుగా రూపుదిద్దుతున్నారు, జైళ్లలో శిక్షపడిన వారి కుటుంబాల పోషణకోసం కుట్టుమిషన్లు, సైకిళ్లు తదితర వస్తువులను అందిస్తున్నారు.
భక్తినివేదన..
భక్తినివేదన పేరుతో ఆధ్యాత్మిక మాసపత్రిక నడిపిస్తున్నారు, తద్వారా సమాజంలో ధార్మిక చింతన, దైవభక్తి దేశభక్తి పెంపొందిస్తున్నారు.
పురస్కారాలు..
వేదవిద్యా వ్యాప్తికి పాటుపడుతున్నవారికి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వైదిక గ్రంథాలను ముద్రిస్తున్నారు
ఇలా ఒకటా రెండా,
ఎన్నో వందలాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో సేవలు చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోకుండానే సనాతన ధర్మం మీద బురద జల్లుతున్నారు, కుశ్చితమైన ఆలోచనలతో విమర్శలు చేస్తున్నారు, ఎవరైనా సరే హైందవ ధర్మాన్ని కించపరిచే ముందు విమర్శకులారా ఒక్కటి గుర్తుంచుకోండి ఇవ్వాళ భారత దేశంలో వైధికధర్మం నేర్పిన సహనం, సదాచారం గనుక లేకుండా ఉంటే ఇవ్వాళ సామాజిక పరిస్థితులు మరోరకంగా ఉండేవి, దయ చేసి అర్థం చేసుకోండి. విమర్శల పేరుతో రంధ్రాన్వేషణ చేసి మా మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం మానుకోండి, మీరనుకునే అభ్యుదయ భావాలు వెయ్యేళ్ళ కిందటే ప్రవచించి ఆచరించి చూపిన అభ్యుదయ శిఖరం
శ్రీ రామానుజులు
07 శిరస్సు వంచి అభివందనం చేసి తరించండి.....
🕉️జై శ్రీమన్నారాయణ🕉️
.
No comments:
Post a Comment