Thursday, 3 February 2022

03-02-2022

 



03.1.2022 సాయంకాల సందేశము

శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము

కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|

కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్

ఐదవ అధ్యాయము-నాలుగవ భాగము

ధుంధుకారి ప్రేతత్వమును పొందుట - ఉద్ధరింపబడుట

సూర్యభగవానుడు ధుంధుకారి ప్రేతత్వ విముక్తికి శ్రీమద్భాగవత సప్తాహశ్రవణము అత్యంత ఉత్తమ సాధనమని చెప్పగా, గోకర్ణుడు అసంఖ్యాకమైన శ్రోతల నడుమ ధుంధుకారి ప్రేతమగుటచే వాయురూపమున వెదురు కణుపులలో కూర్చొనగా శ్రీమద్భాగవతమును ఏడు దినములు ప్రవచించగా ధుంధుకారి ప్రేతత్వ విముక్తుడాయెను ఇది మనం చదివాము.

ఈ లోకమునందు సప్తాహశ్రవణము చేయుటవలన భగవంతుని కరుణ శీఘ్రముగా ప్రాప్తించి సమస్తపాపములు తొలగును. భగవత్కథా శ్రవణమునకు దూరముగా ఉండువారు, నీటిలో పుట్టిన బుడగలవలె, జీవులలో జన్మించిన దోమలవలె కేవలము మరణించుటకే జన్మించిన వారగుదురు. భాగవతకథా శ్రవణము యొక్క ప్రభావమువలన జడములైన ఎండిన వెదురు కర్రలయొక్క కణుపులు పగిలిపోయినవి. అయినప్పుడు తత్ప్రభావము చేత చిత్తముయొక్క కణుపులు  తెరుచుకొనుననుట ఏమంత వింతకాదు కదా! సప్తాహశ్రవణము చేయుటవలన మానవుని హృదయగ్రంథులు విడిపోవును. అతని సమస్త సంశయములు పటాపంచలైపోవును. అతని కర్మలన్నియును నశించును.

ఈ భాగవతకథా రూపమైన తీర్థజలము సంసారమనెడి బురదపూతను కడిగివేయుటలో సమర్థమైనది. మనిషి చిత్తమునందు ఇది స్థిరముగా ఉన్నయెడల, అతనికి నిశ్చయముగా ముక్తి లభించి తీరునని విద్వాంసులు వక్కాణించుచుండిరి. ధుంధుకారి ఈ రీతిగా విషయములను అన్నింటిని తెలుపుచుండెను. ఇంతలో వైకుంఠవాసులగు పార్షదులతో కూడిన ఒక విమానము అతని కొరకై వచ్చి దిగెను. ఆ విమానము యొక్క కాంతులు ధగధగ మెరయుచు వలయాకారముగా వ్యాపించుచుండెను. అందరూ చూచు చుండగా ధుంధులీ కుమారుడైన ధుంధుకారి (ఎన్నో పాపములు చేసి ప్రేతత్వమంది, శ్రీమద్భాగవత సప్తాహ శ్రవణముతో ప్రేతత్వ విముక్తుడై) ఆ విమానమునెక్కెను. ఆ విమానము నందున్న గోకర్ణుడు ఇట్లు నుడివెను-

గోకర్ణుడు అడిగెను - భగవంతునికి ప్రియమైన పార్షదులారా! ఇక్కడ నిర్మల చిత్తము గలిగిన మా శ్రోతలు ఎందరో ఉన్నారు. వారందరి కొరకు కావలసినన్ని విమానములను ఒకేసారి తీసికొని రాలేదెందుకు? నిజమునకు ఇచటగల వారందరు సమానముగనే శ్రీమద్భాగవతకథను శ్రవణము చేసినారనుట స్పష్టము. కాని, ఫలితమునందు ఈ విధమగు భేదము ఎందుకు కలిగినట్లు? ఇది మాకు తెలుపుడు.

భగవత్సేవకులు చెప్పిరి - మహాత్మా వినుటయందు గల భేదము వలననే దాని ఫలితమునందు భేదము యేర్పడినది. శ్రోతలందరును సమానముగనే వినియున్నారు. కాని, వీరందరు వినినదానిని ఒకే విధముగ చింతనము చేయలేదు. కావున, అందరు కలిసి సేవించినప్పటికిని వారికి లభించు ఫలమునందు భేదము కలిగినది. ఈ ప్రేతము ఏడు దినములు ఉపవాసము చేసి చక్కగా శ్రవణము చేసినది. వినిన కథాంశమును స్థిరచిత్తముతో పూర్తిగా మననముతో పాటుగా నిధిధ్యాసను కూడ నేరవేర్చు చుండెను. జ్ఞానము దృఢము కాకపోయినచో, అది వ్యర్థమగును. ఏమరుపాటుచేత శ్రవణము చేయనియెడల వినిస దంతయునూ గాలిలో కలసిపోవును. మంత్రమునందు సందేహము ఏర్పడినచో వినిసదంతయు నష్టమైపోవును. చిత్తచాంచల్యముతో చేసిన జపము బూడిదలో పోసిన పన్నీరుగా మారును. భక్తులు లేని దేశము, అపాత్రునకు పెట్టిన శ్రాద్ధభోజనము, శ్రోత్రియులు కానివారికిచ్చిన దానము, ఆచారములేని కులము వ్యర్థములుగా తెలియవలెను. గురువు చెప్పిన మాటలయందు దృఢవిశ్వాసమును కలిగి యుండవలెను. వినయభావమును పెంచుకొనవలెను. మనసునందలి దోషములమీద విజయమును సాధించవలెను. కథాశ్రవణము నందు చిత్తముయొక్క ఏకాగ్రత కుదురుకొనవలెను. ఇట్టి నియమములు పాటించినయెడల కథాశ్రవణము యొక్క అచ్ఛమైన ఫలము దానంతటదే లభించి తీరును. అందువలన ఈ శ్రోతలు అందరును మరల ఒకసారి శ్రీమద్భాగవతకథను వినినచో, నిశ్చయముగా వీరందరికి వైకుంఠవాసము లభించును. ఇంకను, గోకర్ణా! గోవిందుడే స్వయముగా విచ్చేసి, నిన్ను గోలోకధామమునకు తీసికొని వెళ్ళును. అని ఈ విధముగా చెప్పి పార్షదులందరూ శ్రీహరిని కీర్తించుచూ, వైకుంఠమునకు వెళ్ళిపోయిరి. శ్రావణమాసము నందు గోకర్ణుడు మరల అదేవిధముగా సప్తాహక్రమముతో భాగవతకథను వినిపించెను. ఆ శ్రోతలందరూ రెండవసారి ఆ కథను శ్రద్ధగా వినిరి.

నారద మహర్షీ! ఈ కథ సమాప్తమగునపుడు అచట జరిగినదానిని మీరు వినగలరు. భక్తులతో నిండిన విమానములతో భగవంతుడు అక్కడ ప్రత్యక్షమాయెను. అన్ని వైపులనుండి జయజయ ధ్వనులు, నమస్కార శబ్దములు మారుమ్రోగసాగెను. శ్రీహరి మిగుల సంతసించి, స్వయముగా తన పాంచజన్య శంఖమును పూరించెను. వెంటనే ఆయన గోకర్ణుని బిగ్గరగా కౌగలించుకొని అతనికి తనవంటి స్వరూపముసు ప్రసాదించెను. అప్పుడా హరి ఒకే ఒక్క క్షణములో ఇతర శ్రోతలనందరినీ మేఘసమానమగు శ్యామవర్ణులుగా,పీతాంబరములను ధరించిన వారిగా, కిరీటములతోడను, కుండలములతోడను అలంకరింపజేసెను. గోకర్ణుని దయవలన ఆ గ్రామమునందుగల కుక్కలు, చండాలురు మొదలగు జీవులందరిని విమానములలోనికి ఎక్కించిరి. వారందరును యోగి జనులు చేరుకొనెడి భగవంతుని ధామమునకు పంపబడిరి. ఈ రీతిగా భక్తవత్సలుడైన శ్రీకృష్ణభగవానుని కథాశ్రవణముచేత ప్రసన్నుడై గోకర్ణుని వెంటనిడుకొని తన గోపబాలురకు ప్రియమైన గోలోకధామమునకు వెళ్ళిపోయెను. పూర్వము అయోధ్యవాసులందరు శ్రీరామచంద్రప్రభువువెంట సాకేత ధామమునకు చేరుకొనిరి. అటులనే గోకర్ణునితో పాటుగా అతని గ్రామవాసులందరిని శ్రీకృష్ణభగవానుడు యోగులకు దుర్లభమైన గోలోకధామమునకు చేర్చెను. సూర్యచంద్రులకు, సిద్ధపురుషులకు కూడ అంత సులభముగా లభ్యముకానట్టి లోకమునకు శ్రీమద్భాగవతకథాశ్రవణము చేయుటవలన వీరందరు చేరుకొనిరి. 

నారదమునీంద్రా! సప్తాహయజ్ఞము ద్వారా భాగవత కథను వినటవలన ఉజ్జ్వలమైన ఫలరాశి సమకూరును.దీనిని గూర్చి మేము నీకు ఇంకేమని చెప్పగలము? ఆర్యా! కర్ణపుటములచేత గోకర్ణుని కథయందలి ఒక్క అక్షరమైనను పానము చేయగలిగిన వారలు, తిరిగి తల్లికడుపున పుట్టనేలేదు.

గాలి, నీరు, ఆకులను ఆహారముగా స్వీకరించి శరీరమును శుష్కింపచేయయుటవలన గాని, ఎంతోకాలము వరకు భయంకరమగు తపస్సు చేయుటవలనగాని యోగాభ్యాసము చేయుటవలనగాని పొందలేని గతిని - పరంధామప్రాప్తిని సప్తాహశ్రవణము వలన మానవులు సహజముగనే పొందెదరు. 

చిత్రకూటమునందు విరాజమానుడైన శాండిల్య మునీంద్రుడు కూడ ఈ పరమ పవిత్రమైన భాగవతమును పఠించుచుండును. తద్ద్వారా ఆయన బ్రహ్మాండమున నోలలాడుచుండును.

ఈ కథ పరమ పవిత్రమైనది. ఒక్కమారు వినినంతనే ఇది సమస్త పాపరాశిని భస్మమొనర్చును. శ్రాద్ధసమయమునందు దీనిని పఠించినయెడల పితృదేవతలకు తృప్తి కలుగును. ఇక నిత్యము చక్కగా పఠించినచో మోక్షము లభించును.

ఇది శ్రీపద్మపురాణముయొక్క ఉత్తరఖండము నందలి శ్రీమద్భాగవత మహాత్మ్యమునందలి ఐదవ అధ్యాయము సంపూర్ణము

శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

*****
ఆరోగ్యం బ్రహ్మ.. ఆనందం బ్రహ్మ.. ఆధ్యాత్మిక బ్రహ్మ
03-02-2023
💐💐💐#గండకీనది_చరిత్ర 💐💐💐
గండకీ అనే వేశ్య గర్భంలోనే మహావిష్ణువు పుడతాడు, ఆమెతో ఒక్కరాత్రి గడిపితే చాలు అనుకునేవారు..!!
సాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఊరి పేరు కాదు. గ్రామం అస్సలే కాదు. విష్ణువు ఆకారంలో ఉండే చిన్నచిన్న రాళ్లనే సాలి గ్రామం అంటూ ఉంటారు. వాటిపై విష్ణువు రూపం ఉటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి. గండకి నది గర్భంలోనే ఇలాంటి రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది పూజగదిలో ఉంచుకుని పూజిస్తుంటారు. వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం.
గండకీ ఒక వేశ్య...
ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి. తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి. లోపల విష్ణువు కనపడతాడు. ఇంత ప్రత్యేకమైన సాలి గ్రామాలు గండకి నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం గండకీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకీ ఉండేది. గండకీ ఒక వేశ్య.
ఒక్కరాత్రి గడిపితే చాలు...
గండకీతో ఒక్కరాత్రి గడిపితే చాలు వాళ్ల తలరాతలు మారిపోయేవి. వాళ్ల అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా, గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకీ మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. చెడ్డ వాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక్క వ్యక్తితోనే గడిపేది.
భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది.
తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది. కేవలం సుఖం అందించడమే కాదు తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా తట్టుకోలేకపోయేది.
మారువేషంలో బేరం కుదుర్చుకున్నాడు
గండకి గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు. ఒక రోజు ముందు మారువేషంలో వెళ్లి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండికి కూడా అతను మంచి వాడిలాగా కనిపించాడు కాబట్టి ఒక రోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. తనకు ముందుగా భార్యలా స్నానం చేసి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు.
సరే అని.. గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసి వేస్తే ఒంటినిండా పుండ్లు కనపడ్డాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధద్రవ్యాలను గండకి ఆయన్ని పూసింది. కొత్త బట్టలు తొడిగించింది.
పక్క మీదకు తీసుకెళ్తుంది...
తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోతాడు. దాంతో ఆమెనే తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకెళ్తుంది. కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజు అంతా సేవ చేస్తుంది గండకి. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు.
చితిలోకి దూకుతుంది..
తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకుని సతీసహగమనం చెయ్యడానికి సిద్ధం అవుతుంది. అందరూ అడ్డుకున్న కూడా వినదు. తన దగ్గరుండే సొమ్మునంతా బీదలకు పంచిపెడుతుంది. తర్వాత శ్మశానంలో చితిలోకి దూకుతుంది.
విష్ణువునే గర్భానా పుట్టాలని కోరుకుంటుంది
అయితే మంటలు ఒక్కసారిగా మల్లె పూల మాదిరిగా మారుతాయి. విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చింది అంటాడు. గండకీ సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది. నీకు ఏ వరం కావాలో కోరుకో గండకీ అంటాడు విష్ణు మూర్తి. గండకీ విష్ణువునే తన గర్భానా పుట్టాలని కోరుకుంటుంది. సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది. నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు.
గండకీ మరు జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే సాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి. ఇది సాలిగ్రామం, గండకీ కథ.
తులసి శాపం వలన సాలగ్రామం గా మారిన విష్ణువు గండకీకి ఇచ్చిన వరం వలన గండకి నదిలోకి సాలగ్రామ రూపంలో చేరతాడు..
****


మల్లాప్రగడ రామకృష్ణ..03-02-2022
 / ఆత్మాయణం:-
రాముడు = ఆత్మ 
సీత = శక్తి 
రావణుడు (పది తలలు) = మనస్సు (వెర్రితలలు/పరి పరి ఆలోచనలు)
హనుమంతుడు (వాయుపుత్రుడు) = శ్వాస 
విభీషణుడు = బుద్ధి 
👉 రాముడు, సీత కలిసి ఉంటే ఆనందం.
 【ఆత్మ, శక్తి కలిసి ఉంటే ఆనందం.】
👉 రావణాసురుడు వచ్చాడు, సీతను తీసుకెళ్ళిపోయాడు.
 【మనస్సు వచ్చింది, శక్తిని తీసుకెళ్ళి పోయింది.】
👉 హనుమంతుని సహాయంతో సీత జాడ తెలిసింది.
 【శ్వాస మీద ధ్యాస ద్వారా శక్తిని పొందవచ్చు అని తెలిసింది.】
👉  రాముడు, రావణాసురుని మధ్య యుద్ధం లంకలో.
【ఆత్మకు, మనస్సుకు యుద్ధం అంతర్ముఖంలో.】
👉 రావణుడికి ఒక తల తీస్తే ఇంకొక తల పుట్టుకు వస్తుంది.
【మనస్సులో ఒక ఆలోచనను తీసివేస్తే మరొక ఆలోచన గుర్తుకు వస్తుంది.】
👉 విభీషణుని సహాయంతో రావణాసురుని జయించెను.
 【బుద్ధి సహాయంతో మనస్సును  జయించవచ్చు.】
👉 సీత రాముని దగ్గరికి వచ్చింది పట్టాభిషేకం జరిగింది.
【శక్తి ఆత్మతో కలిసింది ఆనందంతో జీవిస్తాము.】
ఇది ప్రతి ఆత్మ యొక్క కథే. ఆత్మ శక్తితోనే ఉంటుంది. మనస్సు వల్ల శక్తిని కోల్పోతాము. సాధన ద్వారా కోల్పోయిన శక్తిని తెచ్చుకొని ఆనందంతో జీవిస్తాము.
దయచేసి తేలుగు భాషను బ్రతికించండి.. తెలుగులో అభిప్రాయం తెలుపండి
1 Comment

నేటి రాధాకృష్ణ సరసగీతం - 03-02-2022
ప్రాంజలి ప్రభ -- మల్లాప్రగడ రామకృష్ణ 

హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  
మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 

ఎకసెక్కె ములు ఏల..ఏది ఎందాకనో
అందాక కులుకులే .. అరిగి నాను రాధా 
తైతక్క లాటలు.. తక్కువ అనగ లేను
విశ్వాస పలుకులు..విజయ మగును కృష్ణా 

మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 
నొప్పింత లేకుండ ..నొప్పింత రాకుండ
మనసునొప్పింపక..మనుగడగను రాధా 

ఆర్భాటములు లేవు..అంతరములు లేవు
ఆలుమగలు గాను బ్రతక వలెను కృష్ణా 
హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  

ప్రేమయే మనకిక.. ప్రేమయే శ్రధ్ధగా
శ్రద్ధకలిగెనేని .. శుభము మనకు రాధా 

సులభసాధ్యముప్రేమ...సుమధురమ్ముగ ప్రేమ
సర్వసృష్టికి సమయ మేను కృష్ణా 
హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  

వినుడునాదు పలుకు విశ్వసించు ము ప్రేమ
దెలియవచ్చెటి మేలు దెలుపు ప్రేమ రాధా 
అడిగిన తలపున..ఆదరముయు ప్రేమ
అలుకలేని సుఖము.. అందు ప్రేమ కృష్ణా 

మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 

హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  

మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా
*****
ఆరోగ్యం బ్రహ్మ...ఆనందం.. బ్రహ్మ.. ఆధ్యాత్మిక బ్రహ్మ
విధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ..03-02-2023
అంతరాలు, ఓ చక్కని వ్యాసం :
*మధ్యతరగతి అంతరంగంలో ఆ  #అంతరం అలాగే ఉండిపోయింది!*
1) *చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు తినడానికి ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం, కొంతమంది రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది!* 
అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని!
ఇప్పుడు పెద్దయ్యాక మనం కొనుక్కుని తినే టైంకి ఆ పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు.
*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది .*
2) *చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే, కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు, అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు అది ఖరీదైనది మనం అంత పెట్టగలిగేవాళ్ళంకాదని!*   
పెద్దయ్యాక మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే వాళ్ళు కాటన్ కు దిగారు ఇప్పుడు, కాటన్ దుస్తుల ధరే ఎక్కువ ! 
*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ..*
3) *చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే మోకాళ్ళ దగ్గర చినిగితే పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా #రఫ్ చేసి ఇస్తే మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం!* 
పెద్దయ్యాక చూస్తే జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని ఫ్యాషన్ పేరుతో #అధికధరలకు కొంటున్నారు !
*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ...*
4) *ఓ వయసులో మనకు సైకిల్ కొనగలగడమే కష్టం, అదీ సాధించేసరికి వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు, మనం స్కూటర్ కొనే సమయానికి వాళ్ళు కార్లలో తిరిగేవారు, మనం కొంచెం ఎదిగి మారుతి 800 కొనే సమయానికి వాళ్ళు BMW ల్లో తిరిగారు, మనం రిటైర్మెంట్ వయసుకి  వచ్చిన కూడబెట్టుకున్న వాటితో  కొంచెం పెద్ద కారు కోనేసమయానికి వాళ్ళు ఆరోగ్యావసరాలతో సైక్లింగ్ చేస్తున్నారు!
*దాంతో ఇప్పటికి ఆ అంతరం
 అలాగే ఉండిపోయింది . .
                        **
ప్రతి దశలో ప్రతి సమయాన విభిన్న మనుషుల మధ్య స్థాయి అంతరం ఉండనే ఉంటుంది.
*"ఆ అంతరం నిరంతరం" ఎప్పటికి ఉండి తీరుతుంది *
రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని మళ్ళీ రేపటిరోజున గతించిన  #ఇవాళ్టి గురించి చింతించేకంటే, ఇవాళ అందినదానితో ఆనందిస్తూ ఆస్వాదిస్తూ రేపటి స్వాగతం పలకడం శ్రేయస్కరం.
*మన, మనవారి గురించి
కాలాన్ని వెచ్చిద్దాం
*మనం నవ్వుతూ ఉందాం*
 *జీవితం కూడా సంతోషంగా ఉంటుంది * 
🙏🙏🙏శుభోదయం🙏🙏🙏

నేటి రాధాకృష్ణ సరసగీతం - ప్రాంజలి ప్రభ  
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 
మధుర క్షణాల్లో మాటలు అలికే 
గడిచిన ప్రతి క్షణము గమ్య మయ్యె 
ఉదయ భానుకర్తవ్యమే ఊత మయ్యె
కళ్ళ ముందట ఆయుధం కావ్య మయ్యె
చేష్ట లన్నియు నిజముయే చెంత కృష్ణా      

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే
ఆశల గొడుగు చేరకు ఆట లాగ  
ఆశ తలుపు తట్టకు నిరాశ యేగ 
అలసిన మనసు లో వేట లాగ
గెలుపు ఓటమి లాగానె గొలుసు రాధా 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 
మధుర క్షణాల్లో మాటలు అలికే 

లాలి పాటతో కమ్మగా జాలి ఆట 
గాలి వాటమై బ్రతుకుయే కాలి బాట 
మాలి లాగానే జీవితం మేలి మాట 
రాలి పొయేటి ఆకుయే రవ్వ వెల్గు కృష్ణా 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 

వెన్నెల కురిసే రాత్రుల్ని వేడు కొనుచు 
మంచు కప్పిన కాలము మనసు అనుచు  
తరువులకు ఉన్న పుష్పాలు తపన యనుచు  

లేత ఆకులు వలననే నీవు రాధా 
పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 

0



No comments:

Post a Comment