Wednesday, 28 July 2021

చందస్సు





బాసటగా నేను ఉంటాను.. భాష వలదు నీవు

ఆసరగా నేను ఉంటాను..  ఆశ వలదు నీవు

తీగలకే  పందిరియ్యాను..దారి చూపుట నీవు

వెల్గులుగా నీడ నిస్తాను..... వెంట తోడుగు నీవు


అడ గాల్సిన పనిలే దిపుడులే... అడుగు లేయు నీవు

పడి పోవుట వలదే ఇపుడులే... పడ్డ తోడు నీవు

అడుగు ముందుకు అడుగు వెనక్కి.... కడ వరకు న నీవు

అడుగులు వేసే ప్రయత్నంలో..తటిపొడి లతొ నీవు





బంధ మైన సుదీర్ఘ భావము బాధ్యతే యగు తప్పదే

అందు వల్లనె గుండె భద్రత ఆశపాశము కాకనే

అంద మంతయు కంట నీరు గ ఆత్మతత్వము ఉండుంటే

జ్ణాపకాలను గుర్తుచేసియు జాతి రక్షణ ధర్మమే


ధనము లేకుంటే తల్లి నిందచేయు తండ్రి తెలియ జేయు

ధనము లేక పోతె తనయుల ప్రశ్న లె సోదరులు మోన మే

ధనము లేక సుఖము తేడ భార్య చూపు బంధువులు రారే

ధనము ఉన్న మనసు తృప్తి గుండ లేదు కాని ధనము ఆశ


ఆప దొచ్చి యున్న ఆదు కొమ్మనుటయు హితము చేయు పలుకు 

పాప పుమాటల్ని పరిహరించుకొమ్ము జగతి ప్రగతి కలుగు 

ఆపద చెప్పదే హాని తలపెట్టకు దారి చూపి బతుకు 

అప్పు జేయతప్పు నదియు కొంప ముంచు తెలివి నిన్ను మార్చు 


కూపమందు బెకము కోర నున్న అరుపు తప్పు చేయ నెంచు 

కోప మందబుద్ధి కోర కున్న వచ్చు మాయ నుంచి తొలగు

దీప వెలుగులోని దివ్యశక్తి తోను పృధ్వి చక్కజే యు

ఆశ పాశ మొద్దు అప్పు పాలు వద్దు ఆదుకొమ్ము నిజము

0


 ప్రాంజలి ప్రభ


అంతా ఒక్కటిగానే భావించేవాడు - దేవుడు.

అనేకంగా భావించేవాడు - జీవుడు.

మనువు జరిపించు మేధావి మగువ మాయ 


మనసు ఒక్కటిగా నుంచు పగటి మాయ   

తనువు ఏక మగు ట కోరు తాప మాయ       

వినియు విన నట్టి ప్రకృతి వాద మాయ

మనుషులలో కొన్ని లక్షణాలు - అవేవారి జీవితాలు 


1. కుప్పరులు


వీరు విధిగ రోజు వప్పుల అరుపులు

చెర్చి గొప్ప గాను చెప్పు కళలు  

మార్చి తనుకు తాను తిప్పలు పడినను

ఓర్పు తోను వుండి ఓటమి తెల్పు  


2. ఆకస్మికులు


వీరు చెప్ప కుండ వీరంగం చేయును  

మార్పు తెల్పు టకును పనులును చెప్పు  

చేర్చి సమయ మంత  సమ ఆ చారములని   

మరియు తెలుపు చుండు మనసు వార్త లనుచు


3. విధ్యుక్తులు


వీరు ఉదయ మందు విధిగా ‌శుభోదయం

మార్పు పలుకు చుండు విధిగ మనసు

రాత్రి వేళ లందు రవ్వల శుభరాత్రి  

రోజు తెల్సు చున్న రంగు మహిమ


4.గవాక్షులు.


వీరు ఏమి ఇదియు వరుసలు కలపరు 

ఏమి జరుగుతున్న ఏమి అనరు 

కాని పనుల కేమి కాలము తీర్చును  

వీరికి పరిజ్ఞాన మున్న లక్కు 


5. అవ్యవస్థితులు. 


వీరు సభ్యలు గుఁను వరుసగా చేరును    

మారు పలక కుండ మహిమ పంచు  

గోరు చుట్టు పోటు లాఉండి మారరు    

ఆరు నూరు అయిన అరచు చూఉండును


అల్లరి చేసియే అలసి ఆడుతు పాడుతు బుద్ధిమంతుడే 

ఘల్లు న శబ్దమై మనసు గాయము చేయడు ముద్దు కృష్ణుడే

పిల్పు ల వల్లనే తలపు భావము తెల్పును గోల కృష్ణుడే

మల్లెల మోహనే వలపు మోక్షము ఇచ్చియు హాయిగుంచుటే


పచ్చ నైన చీర కదలికే ఆచేను

మచ్చ లాగ మడత తళుకు లీనె

మచ్చి కైన పొలము మనసును దోచే ను

విచ్చు పువ్వు ముల్లె ధాత్రి తనువు


అమ్మల కుండునే సహన ఆర్తియు ఆతృత  అద్భుతమ్ము గా

నమ్మక బావమే సుగుణ నిర్మల సఖ్యత సంతసమ్ము గా

కమ్మని కోర్కయే కలలు కమ్మిన వారికి కాను కమ్మ గా

ఇమ్మని అమ్మనే తలపు ఈశ్వర భక్తికి నిశ్చితమ్ము గా


కష్టము నందు నే బతుకు కార్యము నిత్యము వుద్భవమ్ము యే

కష్టము ఉన్న నూ మనసు ఈశ్వర సాక్షి గ సఖ్యతమ్ము యే

ఇష్టము వల్ల నే పనులు ఎల్లలు దాటియు వచ్చి చేయు టే

చేష్టలు మార కే ధనము చెందును కష్టము పొంది ఉండుటే


లెక్కను తెల్ప కుండ నువు లోలక మల్లెను తిర్గుటెందుకో

అక్కసు చూపుటే వలదు అందరి మన్నన పొందుటేనులే

ఎక్కువ యేమి?నీయెడల యేమి విశేషము చెప్పవే చెలీ

తక్కువ యేమి కాదునులె ధైర్యము నీదియు నాదియేచెలీ

0


బాసటగా నేను ఉంటాను.. భాష వలదు నీవు

ఆసరగా నేను ఉంటాను..  ఆశ వలదు నీవు

తీగలకే  పందిరియ్యాను..దారి చూపుట నీవు

వెల్గులుగా నీడ నిస్తాను..... వెంట తోడుగు నీవు


అడ గాల్సిన పనిలే దిపుడులే... అడుగు లేయు నీవు

పడి పోవుట వలదే ఇపుడులే... పడ్డ తోడు నీవు

అడుగు ముందుకు అడుగు వెనక్కి.... కడ వరకు న నీవు

అడుగులు వేసే ప్రయత్నంలో..తటిపొడి లతొ నీవు


మంచి చెడుల మధ్య మనసుయే కదిలెను

స్వచ్ఛ తన్న దేది సరిగ లేదు

మచ్చ లేని మనిషి పలుకులు మేలగు

ఇచ్ఛ తీర్చు చుండు ఈశ్వర ప్రేమయు


నిజము పల్కు మనిషి నిర్మల మోనము

నమ్మి బతుకు సాగు నాన్య తగును

నటన చేయు వారు నాట్యము చేయును

నింగ నేల ఏక నవ్వు పలుకు


కుటిల బుధ్ధి తోను దాగుడు మూతలు

చెప్పి చెప్ప కుండు జిహ్వ పాపి

మనిషి ఓడి వున్న గొప్పలు తెలుపును

చెడును బయట చెప్పి చేయి దులుపు


అడ్డ దారు లందు ఆర్తిగా ఆర్భాటం

అడ్డు చెప్పు వాన్ని అనగ తొక్కు

చీడ పురుగు లాగ చెట్టును తినివేయు

నీడ నిచ్చు వార్ని నరికి వేయు


స్వార్ధ బుధ్ధి తోపు సర్వమూ తెలుసను

సత్య వాక్కు తెలుపు సూర్యుడు వలె

అల్ప సంత సమ్ము అందరి దృష్టి యు

అడుగు వేయు మోండి వాడు లాగ


ధర్మమే మన సంపద తత్వ తీర్పు 

కర్మ యే అని అనకుమా గోప్ప ఓర్పు

శర్మ చెప్పేది నడకయే సరళి మార్పు

మర్మ మైనను మనిషికి పెంచు నేర్పు


బంధ మైన సుదీర్ఘ భావము బాధ్యతే యగు తప్పదే

అందు వల్లనె గుండె భద్రత ఆశపాశము కాకనే

అంద మంతయు కంట నీరు గ ఆత్మతత్వము ఉండుంటే

జ్ణాపకాలను గుర్తుచేసియు జాతి రక్షణ ధర్మమే


ధనము లేకుంటే తల్లి నిందచేయు తండ్రి తెలియ జేయు

ధనము లేక పోతె తనయుల ప్రశ్న లె సోదరులు మోన మే

ధనము లేక సుఖము తేడ భార్య చూపు బంధువులు రారే

ధనము ఉన్న మనసు తృప్తి గుండ లేదు కాని ధనము ఆశ


ఆప దొచ్చి యున్న ఆదు కొమ్మనుటయు హితము చేయు పలుకు 

పాప పుమాటల్ని పరిహరించుకొమ్ము జగతి ప్రగతి కలుగు 

ఆపద చెప్పదే హాని తలపెట్టకు దారి చూపి బతుకు 

అప్పు జేయతప్పు నదియు కొంప ముంచు తెలివి నిన్ను మార్చు 


కూపమందు బెకము కోర నున్న అరుపు తప్పు చేయ నెంచు 

కోప మందబుద్ధి కోర కున్న వచ్చు మాయ నుంచి తొలగు

దీప వెలుగులోని దివ్యశక్తి తోను పృధ్వి చక్కజే యు

ఆశ పాశ మొద్దు అప్పు పాలు వద్దు ఆదుకొమ్ము నిజము


0 comm




వ్యక్తి గత జేవుడవ్వటం వలదు నన్న 

వ్యక్తి భావజ్ఞాపకశక్తి వక్క టవుట 

వ్యక్తి బుద్డి చిత్తమ్ముయు  వ్యాప్తిచెందు  

వ్యక్తి నేనే ను అహమును వదల లేడు 


"ఉన్నదియు ఒక్కటే ఉలుకు కెక్కు !"

అన్నది యు మేలుకు అలుక ఎక్కు  

చిన్నది పలుకుల కులుకుచిగురుla సిగ్గు 

ఎన్ని యన్నను నేనేను ఎదను పంచు  


రూప మేలైన మనసును రంగ రించు

పాప లాగదైవము నిన్ను మలుపు తిప్పు

ద్వీప దైవాన్ని మనసులో తీర్చిదిద్ది

దేవుడని మనుషులలోను తృప్తి పరచు


దైవ కృప కలిగి నపుడు దివ్య నేత్ర

మిచ్చి దివ్య చక్షువులను  పెంచు దేవ

సిద్ది కొరకయే ప్రేమను వ్యక్త పరుచు

ప్రతి ఫలాన్ని కోరక రాగ భక్తి


చేయి చేయికలిపి శబ్ద చేరువవ్వు    

పాప పుణ్యకర్మలు ఫలం పొందు నువ్వు   

వేడికి జలము ఆవిరి వేగమవ్వు 

దైవ పూజలే మనకు దగ్గరవ్వు   


కర్మచేమనోమాలిన్యం కాటికేవ్వు  

కర్మ లన్ని సంసార మ్ము కడిగి వేయు  

కర్మలజ్ఞానాన్నిసము పార్ది౦చవచ్చు  

కర్మ లు గురువు ఉపదేశ కరువు మార్చు 


రోగము నయము కానిదే రాక వుండు 

భోగము వలన రోగము బోధ చేయు 

యోగ కామిని కాంచన ఎదురు తిరుగు 

మూగ అవయవ దోషము మాయ మవును     


సూర్యుని వెలుగు స్నేహము సరయు చేయు

సర్వ రక్షణ జగతికి సత్వరమ్ము

పర్వ మగుచుండు నిత్యమూ మంగళమ్ము

కార్య నిర్వాహక కవిగా గళము విప్పు


మిన్ను జారె న మాయ కమ్మె న మన్ను ఊగె న దేనికో 

నన్ను నమ్ముము ఉన్న మాటను నేను తెల్పతి మర్వకా 

విన్న వాక్కులు తెల్పుచుంటిని వంత పల్కుము సత్యమే 

ఉన్న దంతయు ఊడ్చి పంచును ఊయ లవ్వు ట ఖాయము


ఖచ్చితముగాను వదలదు ఖరము బుద్ది   

నిశ్చయంబును వదలరు నిపుణ మతులు

మచ్చు కైనను తెలపగా మాయ చేయు  

వచ్చు ఓటుకు ధనమును ఓట్టు పంచు


బ్రతుకు తెరువు వల్ల బాధ్యతే భాగ్యమౌ

వెలుగు లన్ని ధనము వెంట పరుగు

కలలు తీర్చు సమయ కాలము నీవెంత

ధనము ఘనము దొడ్డ తనము గంటె

----

"

మత్తేభము..

----

వసనున్ బోసిన మాతృమూర్తియిడె సౌవాక్యాలసంపత్తులన్

రసవత్పూరితమాధురీనిహితసారాత్తంబునౌగ్రంథమున్

వ్యసనంబౌనటుఁజూచుటన్ కలితమౌవ్యాపారమయ్యెన్ సదా

వ్యసనంబైనదిమానకుంటినిసమస్యాపూరణంబయ్యయో !? "

--


( ఇందులో.. చివరి పాదమే..సమస్య )..

----------------------------------------

రసమయ్యేనులె రమ్యమై రగడ  సర్వార్ధాలసంతోషమే

కశిగా కామ్యతభావమై కనులు వక్కాణించుసంభోగమే

వ్యసనం కాదును సంతసం హృదయ మేవాంఛా సుసంపన్నమే

వ్యసనంబైనది మానకుంటినిస మస్యాపూరణంబయ్యయో

1


******





No comments:

Post a Comment