Saturday, 24 July 2021


 



అందరికి గురుపౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు

ప్రాంజలి ప్రభు.... గురు అక్షరమాల స్తుతి....


అజ్ణాన తిమిరాన్ని ఆర్తిగా ను తరిమె విద్య చూడా మణి

విజ్ఞానాన్ని పెంచె విశ్వ వ్యాప్తి గాను మార్గ దర్శకుడై

ప్రజ్ణ చూపి శాంతి బహుమతినిఇచ్చే శుభము కల్గ జేసె

విజ్ఞత తో తెల్పు విజయ సోపానము అంద చేయు గురువు


*అ - అద్వైతమూర్తి - గురువు*

*ఆ - ఆనందస్ఫూర్తి - గురువు*

*ఇ - ఇలదైవం - గురువు*

*ఈ - ఈశ్వరరూపము - గురువు*

*ఉ - ఉద్ధరించువాడు - గురువు*

*ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు*

*ఋ - ఋజువర్తనుడు - గురువు*

*ౠ - ఋణము లేనివాడు - గురువు*

*ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు*

*ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు*

*ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు*

*ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు*

*ఓ - ఓంకార రూపము - గురువు*

*ఔ - ఔదార్య మేరువు - గురువు*

*అం - అందరూ సేవించేది - గురువు*

*అః - అహంకార రహితుడు - గురువు*

*క - కళంకము లేనివాడు - గురువు*

*ఖ - ఖండరహితుడు - గురువు*

*గ - గుణాతీతుడు - గురువు*

*ఘ - ఘనస్వరూపము - గురువు*

*ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు*

*చ - చక్రవర్తి - గురువు*

*ఛ - ఛత్రము వంటి వాడు - గురువు*

*జ - జనన మరణములు లేని వాడు - గురువు*

*ఝ - ఝరులవలె బోధించువాడు - గురువు*

*ఞ - జ్ఞానస్వరూపము - గురువు*

*ట - నిష్కపటుడు - గురువు*

*ఠ - నిష్ఠకలవాడు - గురువు*

*డ - డంబము లేనివాడు - గురువు*

*ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు - గురువు*

*ణ -  తూష్ణీభావము కలవాడు - గురువు*

*త - తత్త్వోపదేశికుడు - గురువు*

*థ - తత్త్వమసి నిర్దేశకుడు - గురువు*

*ద - దయాస్వరూపము - గురువు*

*ధ - దండించి బోధించువాడు - గురువు*

*న - నవికారుడు - గురువు*

*ప - పంచేంద్రియాతీతుడు - గురువు*

*ఫ - ఫలాకాంక్షా రహితుడు - గురువు*

*బ - బంధము లేనివాడు - గురువు*

*భ - భయరహితుడు - గురువు*

*మ - మహావాక్యబోధకుడు - గురువు*

*య - యమము కలవాడు - గురువు*

*ర - రాగద్వేష రహితుడు - గురువు*

*ల - లవలేశము ద్వేషము లేనివాడు - గురువు*

*వ - వశీకరణశక్తి కలవాడు - గురువు*

*శ - శమము కలవాడు - గురువు*

*ష - షడ్భావ వికారములు లేనివాడు - గురువు*

*స - సహనశీలి - గురువు*

*హ - హరిహర రూపుడు - గురువు*

*ళ - నిష్కళంకుడు - గురువు*

*క్ష - క్షరాక్షర విలక్షణుడు - గురువు*

*ఱ-ఎఱుకతో ఉన్నవాడు - గురువు*


కాలము మారె కథలుగా మారె దేనికో

గాలము మల్లె చేతిలో సెల్లు దేనికో

తాళము పెట్టి చేతితో చూడు దేనికో

వేలము మల్లె బతుకులో ఆశ దేనికో


మదిలో న వీణ పైపైన తెల్ప లేకున్నా

పద్యమ్ము తెల్పు పదునైన మాట ఆయుధం

గద్యమ్ము తెల్పు వినయమ్ము తృప్తి పల్కులే

విద్యయు నేర్పి సహనమ్ము తోడు మార్గమే


ఉనికి కి అర్థ మగుటయు లేదు దేనికో

మనిషిలొ స్వార్ధ మున్నను నేర్పు దేనికో

అణువు తో బాంబు చేయుట ఓర్పు దేనికో


చినుకులే గాలి వానగా మార్పు దేనికో

పుస్తకం లేదు చదువులు లేవు దేనికో

మస్తకం మాయ చెందుతూ ఉండు దేనికో


ఆస్తి యే పెర్గి బంధమ్ము కర్గు దేనికో

సుశ్తి యే వచ్చి కష్టమ్ము వచ్చు దేనికో

పువ్వులు పూజ లకువాడు.. కొన్ని నిత్యమూ


నవ్వులు పుట్టి కన్నీరు....కొంత సత్యమూ

రవ్వలు చింది భయ్యము...సర్వ చిత్తమూ

మువ్వల శబ్ధ వేడుక...... ధర్మ తత్వమూ


కాలము నాది ఆకలియె - ఆశయ మేది లేనిదియు   

చీకటి వెల్గు కానిదియు - తప్పులు ఏమి చేయనిది 

కష్టము నష్ట పోనిదియే   


ప్రేమయు నాది బోధలులె - ప్రేరణ నాది కామకుని 

వాదము నాది వామనునే - సాధ్యము నాది సాధువుని  

ఆశపరంగ ఆయువునే ... ... ...


తామర కన్న తోడువులె   - మల్లెల కన్న వాసనలె       

జాబిలి కన్న వెన్నెలలె - మాటల కన్న మన్ననలె   

తండ్రికి బిడ్డ సేవకుడే ...  ...  ...  


సర్వసుఖాల సారముయె   - సర్వభయాల భారముయు  

సర్వమదీయ సాధనయె   - సర్వవిధాల సోధనయు 

తల్లికి బిడ్డ పోషణయే  ...  ...  ... 


పుత్తడి పంచు సౌమ్యముగ -పృథ్వి ప్రెమించు ప్రేమముగ           

విద్య నెర్పుము పాఠ్యముగ అగ్ని నిల్చును ఊర్ధముగ      

తల్లియుతండ్రి భాద్యతయే ... ... ... 

--((**))-




అలసి నీ శరణం అడిగితి నీవు గా నన్ను నమ్మయ్యా

తలపులు తెల్పి తీ  తప్పులు క్షమించ గలవు నీవయ్యా

మలుపు లెన్నెన్నో  మనసు కథ లెన్నో నీ కొరకు నయ్యా

చిలిపి చేష్టల తో చింతలు తెల్పితీ రామ భక్త హనుమ


వయసులో పరుగు చెందుటే సొగసు వేటలే

మనసులో మెరుపు కల్గుటే హృదయ వాంఛలే

సొగసులో పొందు కోరుటే ప్రకృతి ధర్మమే

నలుసు పడ్డ కంటినే నాలుకయు తీయు


తనువు నందున దోచె దాపపు జ్వాలలే

అణువు నందున ఉండె ఆశయ నీడలే

వినుము నిత్యము సత్య వాక్కులు ప్రేమలే

కనులు మూయవు నిన్ను గాంచుచు ఆటలో


ఉదయ కాలము లోన ఉద్యోగ నేర్పుగా

మధుర వాణి గ నీవు పల్కుల ఓర్పుగా

మృధుల గీతము లోని మలుపులు తీర్పుగా

నదులు గమనము లోని నడకయు మార్పుగా


మద్దతు లె జీవ సాగర ముందు సహజ

ఉధ్ధతి యె సేవ భావము నందు  విలువ

పద్ధతి యె కాన రాకయు పొందు బలము

ఉద్ధతుల మధ్య పేదల కుండ తరమె


చిత్త మేలుకో నేడు చిన్మయా నందమే

మత్తు మనసునే మాయ చేయుటయే లీల

మెత్త మెత్తగా సెజ్జ మృదువైన గీతమ్ము

మత్తు పుట్టించగలగు మధుర మీ భావమ్ము


ఇప్పుడే నీకు సేవ భావమ్ము కలగాలి

ఇప్పుడే ప్రేమ పెంచు మనుషులు ఉండాలి

ఇప్పుడే స్నేహ మిచ్చు హృదయము పొందాలి

ఇప్పుడే ధైర్య మిచ్చు శాంతిని కోరాలి


ఇప్పుడే రెక్క లుడికె కానరాని గాలిలా

ఇప్పుడే ఊహ కవిత చెప్పలేని మనసు

ఇప్పుడే కన్న కడుపు కోతగా బాధలు

ఇప్పుడే ఒంటరిగను ఏకాంత పలుకులే


ఇప్పుడే సాటి మనిషి తోడుగా ఉండాలి

ఇప్పుడే మాన వత్వ హృదయమ్ము కావాలి

ఇప్పుడే రామ కృష్ణ అనుచునే ఉండాలి

ఇప్పుడే కాన రాని దైవమే గుర్తొచ్చు


అజ్ణాన తిమిరాన్ని ఆర్తిగా ను తరిమె విద్య చూడా మణి

విజ్ఞానాన్ని పెంచె విశ్వ వ్యాప్తి గాను మార్గ దర్శకుడై

ప్రజ్ణ చూపి శాంతి బహుమతినిఇచ్చే శుభము కల్గ జేసె

విజ్ఞత తో తెల్పు విజయ సోపానము అంద చేయు గురువు


పచ్చని చేలు లే పుడమి తల్లి తీర్పు తరువు ల సంపదే

పచ్చికచేలలో మేత గోవులకే గతిగపాలు పొందు

చిచ్చెరబాకులా చిరునగవు ల మెరుపు హృదయ భావ మందు

మచ్చిక చేయగా మూగ జీవులన్ని  చేయు సహాయమ్ము


పిచ్చుక రాగములు పేలపు గింజలకు మేళ తాళ మెయ్యు

ఎచ్చట నుండి యో ఏవొ గీత బోధలే వినబడు చుండె

ముచ్చట తీర్చుమా పండుగచేయుమా శాంతము ఉండుమా

బిచ్చము కోరుతూ పేరు తెల్పుచూ ప్రేయసిని కోరే


గుచ్చి న పూలలో కమ్మని వాసనే చెమ్మగాను నీరు 

కుచ్చులగంటలే గాలమయ్యేనే సుందరమ్ము గాను

చొచ్చుకు పోవుటే చక్క దిద్దు చుండి సంతసమ్ముగాను

ముచ్చట లాడుచూ భందమవ్వుటేను హాయి గొలుపు చుండు


ఇచ్చటనే నేను ఈశ్వర లీలగా కానరాకున్నా

మచ్చలేని తనము మాయ చెప్ప లేక ఇందు బత్కి ఉన్న 

ఇచ్చటనే నేను ఇల్లు యిల్లాలు కధ లేదు ఎందు కొరకు

ఇచ్చటనే తెలుగు ఈశ్వరుని మాయే చేయు చున్న దేల




అల్పపీడనం వల్ల కుంభవృష్టి  తెలుగు రాష్ట్రములందు

ప్రజల ఆలాపన

నవ్వకూ నన్ను చూడగ.. నీవు వానవై


ఈ వాన నన్ను .పోనీదు ..హృదయ మూగగా

జీవమ్ము నీవు భావమ్ము ..నీవు నిజముగా

సేవగా వచ్చి పోవాలి... ముంచి పోకమ్మా

గగనమ్ము నందు సూరీడు.. కాన రాకుండె


మెగఆడ శిశువు తేడాలు ..లేక పరుగులు

జగమందు కమ్మె చీకటి..పగటి పూట నే

యుగమాయ లాగ వర్షము ..కరిసె ఇచ్చోట

ఇది యేమి మాయ మదిలోన.. నింపు భయమును


హృదయమ్ము వద్దు అనకయే.. ఓర్పు చూపేను

నిద్రలు లేవు తిండియు ..గూడు లేకయే

పదియారు ముంచి కవ్వించు ‌.. మనుగడ కలలు

నవ్వితి మచ్చ చంద్రున్ని ..చూసి సుఖముగా


నవ్వితి శివుని కంఠము .. చూసి విజయమై

నవ్వితి నల్ల వస్త్రం ను .. కట్టె బలరామ

నవ్వితి వాన వల్లను.. మునిగె జనులను

నవ్వితి పువ్వు తుమ్మెద.. మచ్చ లాగుండె


నవ్వితి బురద కలువను.. చూసి మచ్చగా

నవ్వితి కీర్తి మచ్చను ... చూసి కోపమై

నవ్వితి వాన వల్లను.. కల్గు మచ్చను

నవ్వులపాలు అగుటయే .. జీవి తమ్మున


నవ్వించి నేను ఏడ్పించి... మచ్చ గావున్నా

నవ్వుల జల్లు సంసారం.. లోన మచ్చగా

పువ్వుల వాన పంచేటి... మచ్చ మార్పుకే

వర్ష మోచ్చి న జలములు కాలువ వాగులో  నికిచేరే


చేరి నదులలో కలసియూ చెంగున దూకిఉరకలు

హర్షముతొ పొంగి పొలములు గృహములు ముంచివేయు

పురజనులలొ భయ్యం వల్ల పుడమి ని ప్రార్ధించేను

వర్షము వేయి రెక్కలతొ వందిత వోలెను మల్లె మోగ్గ లై


హర్షము ఆవిరై కలలు కల్లలు అయ్యెను భయ్యమై కధా

శీర్షిక పొంగులై జలము సాగర వెంబడి పర్గులై కధా 

ప్రేరణ కారణం జనుల మార్గము మున్గియు బాధలొచ్చుటే

పచ్చని చేలు కాలవలు పొంగియు భయ్యము కల్గియే మనో


నిచ్చెన ఆశ పాశము ల నెమ్మదిగా నును చుట్టు వారలన్

వచ్చిన వర్ష భాణములు వేగము ముంచియు వాసమందునన్

స్వచ్ఛత గా సహాయములు చేయుట ధర్మము ఓర్పుగాచుటన్

అంబరమ్ము న మేఘమాలలు విస్తరించియు సాగుతూ


సంబ రమ్ము గ గాలితో కలిసే సహాయము గాలులై

దంబ మంతయు చూపి వర్షము కుండ పోత గ కుర్సియే

నిబ్బరమ్ముయు తగ్గెనే భయమేను కల్గెనె పొంగులై

నిర్భయమ్ము గ సాగుచూ జన హృద్యభయ్యము నింపుటే


మన్నెం ల్లో మది క్రాంతి దాహముయె నీడల్లా గ పోషించుటన్

అన్యాయం మను భ్రాంతి దేహముకు ఆటల్లా గ బంధించుటన్

కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణమీల్

మూన్నాళ్ళే అనీ వేచి వుండుటను బంధాలన్ని ఆస్ఛాదన ల్




గానమ్ము సేయ రమ్ము.. కాలమ్ము నీది ఔను

దానమ్ము పుచ్చు కొమ్ము.. మౌనమ్ము వీడి ఉండు

గంగలా పార నిమ్ము.. చెంగులా జర్గనిమ్ము

తొందరా చెంద కమ్ము...పొందురా నిత్య సొమ్ము


ధ్యానమ్ము సేయ నిమ్ము..ద్వారమ్ము తెర్వ నిమ్ము

త్యాగమ్ము చేయ రమ్ము... దైవము చేరు సుమ్ము

నిత్య సంతోష మీవా .. సత్య వాక్కు తెల్పవా

తత్వ బోధ చేయవా... నృత్య మాడ కుండువా


ఈ కాళ రాత్రిలో... ఈ గోల మధ్యలో

ఈ కాల మాయలో... ఈ వేళ స్థాయిలో

నే కాకి నీజగాన ... నీ మాట ఈ యుగాన

నీ రూపు నా మదీనా... నాశక్తి నీ మాటున


లోకాన విప్లవాలు ..... దాహానదప్పి దాలు

ఆకాశ నక్షత్రాలు.... ఓదార్పు ఒప్పు కోలు

నీనగు మోము చూచు....


జల్లులన్నియు నెమ్మనెమ్మది జారు చుండు ట ఎందుకో

మెల్ల మెల్లగ కప్పలర్పులు మాయ మవ్వు ట ఎందుకో

మల్లెలాయెను ముత్యమల్లెను ముందు చెప్పు ట ఎందుకో

చల్లగుండెను నిత్య హృద్యము హాయి పొందు ట ఎందుకో


సుమ ఓ కామారీ ధృడ గుణము బంధం కరుణ గా

మమతా మాధుర్యం రస మయము సృష్టే తరుణ మై

సమయా చాతుర్యం పలుకులతొ సర్వ విదిత మై

సముఖమ్మే శిధ్ధీ వినయము తొ సుఖమ్ము కళ లై


చల్లని వెన్నెల లొ చెలియ చూపు లలో చిత్ర మే చూపే

మెల్లగా సాగే మెరుపు తీగలలో మాయ చూపు లేలె

మల్లె పువ్వులు గా మోన నవ్వులు గా మనసు‌ దోచు నమ్మి

కల్ల మాట లొద్దు కాని పను లొద్దూ చంద మామ వలెను


హద్దులు ఉన్న ఆటలలొ హాస్యముతో అర్ధ  భావము తెల్పి

మోద్దులు యైన చేష్టలను మాటలతో మర్మ మంతయు తెల్పి

చద్దిని పెట్టి అందరిని చూపులతో నిత్య ధర్మము తెల్పె

వద్దని యెంత వేడినను వచ్చెడి వాడె స్తుతింప నర్హుడౌ 


మోండితుడైన వానికిని విద్యవినోద లీల దేనికిన్ అనకు

పండితుడైన వానికిని సతకవితా రసగోష్ఠి యేటికిన్ అనకు

ఖండితుడైన వానికిని కానిదంటు స్వరపుష్టి దేనికిన్ అనకు

పీడితుడైన వానికిని సేవలంటు ఇక ఇష్ట మేటికిన్ అనకు


కార్య రూపమే ను కధలు గాను తెల్పు మంచి మాటలన్ని

సర్వము స్వప్నమె సమర కల్పము లే నిత్య అను భూతికి

నిర్విరామ కృషియె నిత్య జీవనమ్ము సకల అభిలాషే 

కార్య మైత్రి మనసు కరుణ ధారణలో సిద్ధి కల్గచేయు


కోడి పందెము ఎర్ర ఎర్రగ గుర్తుకొచ్చెను రెక్కలే

ఊడి డెందము గుల్ల గుల్ల గ ఊయలయ్యెను ఎర్రగా

వాడి చూపులు ఖర్చు అయ్యెను వేడి మంటకు ఆహుతే

ఓడిపోయిన బత్కుపంచెను ఓర్పు చూపియు లాభమే

0


No comments:

Post a Comment