: నేటి ఆలోచనలు
కధలు చెప్పనే చెప్పొద్దు
నిదుర పొందుటే ఎందుకో
మధుర నీతులు తెలుసుకో మధురమ్మే
చెదలు పట్టనే పట్టొచ్చు
చెదర కుండగా ఉండాలి
పదము వల్లనే కష్టాలు పాదమేయు
నాదు కలలొచ్చు కామ్యమై
మోదమున కాక స్ఫూర్తి యై
వాదములులేవు వప్పుయై వరములవ్వు
నాది అన్నది లేదులే
నీది అన్నది ఉందిలే
వాది వాదము మనసులో వరములవ్వు
దినము తరిగి పోవుచునుండు
మనము చేసిన పుణ్యమే
తనువు మధురమ్ము దుర్గన్ధమ్ మనసులోన
వినుము నీతి వాక్యములను
కనుము సుందర స్వప్నము
అనకు పరులలో దోషాలు ఆర్తిగాను
ఇందు ఏ ప్రశ్నలడగకు
అందు జరుగు ఘటనచూడు
యెందు మాటలు పెంచకు ఇది నిజమ్ము
సందు లందును జాగర్త
విందు పొందు ఆలోచించు
పొందు వల్లసుఖము ఉండు నిజము జీవ
**"""""**
అణు వణువులో న ఆశ అధరమ్ము పాప మే
తనువు చేసే టి తప్పు లన్నియు శాప మే
మనసు చేందు బ్రమలలొ ఆశయ కోప మే
విన దగు కధలు హృదయ శ్వాస కు బంధ మే
నా కళ్ళ నుంచి కన్నీరు కారె ఉగ్ర వాదమ్ము న
నా వేళ్ళు నుంచి రాసేను నీకు నిగ్రహమ్మే ఇక
నీ ముళ్ళ బుధ్ధి మార్చాలి నీదు మోండి భావమ్మున
నీ కుళ్ళు నాకు చూపావె దేశ భక్తి లేదా ఇక
న భ న న జ న ల గ ...9./ 20
కళలు పొందియు వినక కనుల వినోద తరుణము ఏ
విలయ మొచ్చిన తెగువ నిరతము చూపి సుఖములుఏ
అలల లాగున ఉరక మరలుట వళ్ళ శుభములుఏ
అలుక వళ్ళను జరుగ పనులు మనస్సు కలతలు ఏ
ర జ న య స 6.'15.
రమ్య మైన వారము హృదయ సంభందము ఏ
గమ్య మందు సాగెను నడక సంతోషము ఏ
సౌమ్య మందు బాస ల కళలు తీర్చేందుకు ఏ
కామ్య బుద్ధి శోకము కలలు హృద్యమ్ము కధ ఏ
మోగ్గ నులిమి యు గుప్పు గుప్పు నా వచ్చెవాసనలులే
బుగ్గ నులిమిన కెవ్వు కెవ్వునా అర్పులే సెగలు గా
నింగి దాకను మల్లె పువ్వు ల వాసనే తరకలా
మగ్గిన పువ్వులు మత్తు మగువే మర్వలేకయుకదా
నేటి ఆలోచనా పద్యాలు
నడ్డియు రుద్దే గదన్నా భయ ముందన్నా
మడ్డి యు అంటే పనన్నా మన వృత్తన్నా
గాడిద ఏడ్చెం గదన్నా ఘన సంపన్నా
ఊడిగ మంటే కళన్నా బతుకే నన్నా
తగిన వాడు ఉన్న దానము చేయన్నా
తగని వాడు ఉన్న దారిని చూపన్నా
మగత నున్న వాడ్ని మంచిగ చూడన్నా
వగలమారి ఉన్న వలదని చెప్పన్నా
ప్రాణ శక్తి తెలిపె హృదయ మున్న మనిషిన్నా
ప్రాణ యుక్తి మలుపె విషయ వాంఛ తనువన్నా
ప్రాణ భక్తి చిలిపె బతుకు నేర్పు మమత న్నా
ప్రాణ ముక్తి పిలుపె మనసు దైవ వెలుగ న్నా
ఏక వాక్యమ్మే మోక్షమ్ము గాని యెట్లన్నా
కేక దౌర్భాగ్యం మేధస్సు మాడు టట్లన్నా
కాక జుష్టంబు గ్రాహ్యంబు గాని యట్లన్నా
పాక లెన్నున్నా సౌఖ్యంబు లేని నట్లన్నా
శ్రీ మాతా మమత ప్రసన్న వదనం ధ్యాయేత్ మనోధైర్యమే
సమ్మోహం సమయా ఉషస్సు సధనం సౌమ్యమ్ము సంతృప్తియే
తన్మాయే సహనం సమర్ధ నటనం సందర్భ సాహిత్య మే
గమ్యమ్మే తెలిపే మనస్సు కళయే విశ్వాస చాతుర్యమే
అన్న మాట మల్లె
ఉన్న ఆట తెల్పి
కన్న పాట పాడె భావనగా
చిన్న ఆశ అనకు
తన్ను కోక వినుము
కన్న వారి బతుకు భావమ్ములె
ఎవరి నడగవలెను
వెవరి పలుకు విలువ
దివము తెల్ప లేను కనులు యుందు
కవిత లల్ల గెలుపు
సవితి తీరు మెరుపు
యువత బతుకు తెరువు ఆశలన్ని
కథలు అల్లు చుండి
పదులు లెక్క లేదు
చెదురు ఘటన లన్ని వేగమయ్యె
నదులు లాగ సాగి
చెదలు లాగ చేరి
యదలొ చేరి ఉండు నిండు తృప్తి
దైవ నిర్ణయ వైభవమ్ముయే తెచ్చు గర్వము
జీవితము నందు జూద మాటలే విపరీతం
జీవ వైవిధ్య శాస్త్రములు అవహేళన
జీవ లక్ష్యము ఋణము తీర్చుటే ధ్యేయముు
వట్టి మాటలు ఎందుకో వలపులు పెంచుచాలు
గట్టి పోటీని ఇచ్చావు కలలను తీర్చు చాలు
ఒట్టు బెట్టియు చెప్తున్నా వయ్యార మిస్తె చాలు
గుట్టు రట్టును చేయను గుప్తమే ఉంచు తాను
మచ్చ లేకుండా ఉండుటే మనసుకు వజయమ్మే
రచ్చ చేయకే మనసులో రమ్యాన్ని ఎప్పుడైనా
హెచ్చు తగ్గులు చూడకే హేలగా జీవితాన
మెచ్చు చుంటినే నీగుణం మనసునే లాగేను
--(())--
చిలక పలుకు లు పలికేను చిన్నగాను
నలక కెలికెను జలకమ్ము నాట్య మాడె
గిలక కదిలేను కులుకుతూ కచ్ఛగాను
అలక వలననే మనసుకు ఆశ కలుగు
0
ఆషాడ మాసంలో కొత్త పెళ్లి కూతురు ఆవేదన
పుట్టింట నందు హాయాగా పెరిగె పువ్వులా
పట్టు విడుపులు తోడుగా స్వేచ్ఛ నవ్వులా
అంట్లు తోమకుయు అట్లు వేయ కుయు హాయిగా
కట్టు బాటుగను అమ్మమాటలను నమ్మితీ
మక్కవ చూపి ముద్దు చేయు మగ ధీరుడు
చక్కని చుక్క చేపట్టె మన్మధు డతడు
పక్కన చేరి పరువము నేదోచె తోడు
హక్కుగ అమ్మ ఆషాడ మాస మంటొచ్చె
పుట్టిల్లి కొచ్చి పుడమి తల్లికి యు మ్రోక్కితి
పుట్టి న చోట పొద్దు గడవదె ఈ స్థితి
పట్టుమని పని చెయ్యనీయ్యదుయె మాయమ్మ
బెట్టు తో స్నేహి తులతోను పలుకు బంగారమ్
నా లోని రాగ మేదో నీ నీడ కొరకు యే తపములే
నా లోన మెరుపు ఎందుకు కలిగె గిలిగింత మచ్చట్లు
నా లోన వింత చెక్కిలి గింత గుర్తుగా తల పించె
నా లోన మేను తాకగా సెగలు సెగలుగా వున్నది
తల్లి మాటలు
ఉండ నీ గాయము ను పచ్చి గాను గుండెషలో
మండ నీ తనవు తృప్తి గా తపన సెగలషలో
అండ గా మనసు మధనమ్ము కలల తలపు లో
మోండి గా బతుకు సాగించు ఒక్క నెలలో న
కన్నీళ్లు చిమ్ము తూ ఉండకు కళ తోడుంది
వేన్నీళ్ళు లాగ విద్యను బోధ తోడుంది
చన్నీ ళ్ల లోను ఆరోగ్య గుణము తృప్తి యే
మూన్నాళ్ళ సేవ చేసియు హాయి పొందుమా
మన సంత చేరు మోదటిరాత్రులలొ సుఖముయే
మనువాడిన మగడే గుర్తు కొచ్చు చున్నాడు
మన లేక బెంగ పడ లేక నిద్ర లొ కలలు
తనువు హృదయము తపన పడుటయు మనసు యే
***"
మహానటి జయింతి శివోహం చెందినట్లు తెలిసి అంజలి ఘటించి ప్రాంజలి ప్రభ సంతాపం తెలియ చేస్తున్నది
జననం..06/01/1945...మరణం..26/07/2031..76
కన్ను మూసెను నటన ల తార మణి గ
మన్ను నమ్మియు మన్నునే మేను చేర
నున్న సినిమా నటి జయంతి ఒదిగి పోయి
ఉన్న ఆత్మకు శాంతి యు ఉండ గలుగు
ఒడు దుడుకు ల జీవితములో ఓడి గెలుచు
నడి వయసు లోన కష్టమ్మే నటన నేర్పు
చెడి బతుకలలో అనభవం చక్క చేయు
ఒడి కలుగుటలో ప్రేమను ఒలక పోయు
అమ్మ పలుకులతో అభివృద్ధి ఔను మరియు
ఆత్మ సంతృప్తి ముఖ్యమే అలక వలదు
నమ్మ కమ్ముతో బ్రతికితే నాన్యమగును
వమ్ము చేయకు ధైర్యమే వెంబడించు
0
ఆత్మజ్ఞానం - బ్రహ్మజ్ఞానం:-
👉 ఆత్మజ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడం. ఆత్మజ్ఞానిని 'ఋషి' అంటారు.
"* బ్రహ్మజ్ఞానం అంటే సకల చరాచర సృష్టి యొక్క జ్ఞానం., కోటానుకోట్ల లోకాల గురించి సుస్పష్ట విజ్ఞానం. బ్రహ్మజ్ఞానిని 'బ్రహ్మర్షి' అంటారు. "*
"*ఆత్మ జ్ఞానం అన్నది ధ్యానం ద్వారా లభించును."*
"*బ్రహ్మ జ్ఞానం అన్నది దివ్యచక్షువు యొక్క పరమ పరిపక్వతా స్థితి.*"
0
రూప మనంత మైన పురుషార్థ ప్రాప్తియే
శాప ఉషస్సు నీకు పరమార్ధ ప్రాప్తియే
దీప మువెల్గు లాంటి ఋషి శక్తి ప్రాప్తియే
పాప మనేది నీకు మరుజన్మ ప్రాప్తియే
బాల్య కాలము నుండి సత్సాంగత్య ప్రాప్తియే
మూల్య మైనది యైన నిత్యానంద ప్రాప్తియే
తుల్య మైనది కాదు వ్యత్యాసమ్ము ప్రాప్తియే
నిల్వ భక్తియె పొందు మోక్షానంద ప్రాప్తియే
పూర్వకముగ సత్కార్యము నాచరించు ప్రాప్తియే
సర్వ విషయ ఉత్సాహమ్ము ఆచరించు ప్రాప్తియే
కార్య కళలు తత్వానంద మాచరించు ప్రాప్తియే
ఆర్య పలుకు నిత్యానంద శోభ పంచు ప్రాప్తియే
గురువు వల్ల మనకు జీవిత సత్యమును తెల్పుట ప్రాప్తియే
బరువ నిత్యముగా భావము సత్యమై కలుగుట ప్రాప్తియే
తరువు వల్ల ఫలము దీప్తి వెలుగు లిచ్చు బుద్ధియు ప్రాప్తియే
పరువు పెంచజేయు పావ న సూక్తులే ఘనునికి ప్రాప్తియ్
జీవి తమ్ము లోను జెప్పు సుఖము లన్ని మనసున ప్రాప్తియే
భావి జీవితమ్ము బాట జూపు చుండు శుభములు ప్రాప్తియే
చేవ కురిపించుయు చింత తొల గించ గలుగుట ప్రాప్తియే
దీవె నలందించి ధనము చేకూర్చియు మమతల ప్రాప్తియే
అరువు పొందియుండి గొప్ప జ్ఞానముతో యశముయు ప్రాప్తియే
సిరుల జేగూర్చును సుఖము విద్య యనుధ జ్ఞానము ప్రాప్తియే
విరుల వంటిమృదువు వెలుగు లందజేయు తరుణము ప్రాప్తియే
నరులు నమ్మబలుకు నమ్ము వారి నిజము జేయుట ప్రాప్తియే
No comments:
Post a Comment