1.
1) నమస్తే భగవన్దేవ దత్తాత్రేయ జగత్ప్రభో |
సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే ||
2) అనసూయా సుత శ్రీశః జనపాతకనాశన |
దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ ||
3) భూతప్రేత పిశాచాద్యాః యస్య స్మరణ మాత్రతః |
దూరాదేవ పలాయంతే దత్తాత్రేయం నమామి తమ్ ||
4) యన్నామ స్మరణాద్దైన్యం పాపం తాపం చ నశ్యతి |
భీతర్గ్రహార్తి దుస్స్వప్నం దత్తాత్రేయం నమామి తమ్ ||
5) దద్రుస్ఫోటక కుష్టాది మహామారీ విషూచికాః |
నశ్యంత్యన్యేపి రోగాశ్చ దత్తాత్రేయం నమామి తమ్ ||
6) సంగజా దేశకాలోత్థాః తాపత్రయ సముద్దితాః |
శామ్యంతి యత్స్మరణతో దత్తాత్రేయం నమామి తమ్ ||
7) సర్పవృశ్చిక దష్టాణాం విషార్తానాం శరీరిణామ్ |
యన్నామ శాంతిదం శీఘ్రం దత్తాత్రేయం నమామి తమ్ ||
8) త్రివిధోత్పాత శమనం వివిధారిష్ట నాశనమ్ |
యన్నామ క్రూరభీతిఘ్నం దత్తాత్రేయం నమామి తమ్ ||
9) వైర్యాది కృత మంత్రాది ప్రయోగా యస్య కీర్తనాత్ |
నశ్యంతి దేహబాధాశ్చ దత్తాత్రేయం నమామి తమ్ ||
10) యచ్ఛిష్య స్మరణాత్సద్యో గతనష్టాది లభ్యతే |
యశ్చమే సర్వతస్త్రాతా దత్తాత్రేయం నమామి తమ్ ||
11) జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవమ్ |
భోగమోక్ష ప్రదస్యేమ పఠేద్దత్త ప్రియో భవేత్ ||
12) దేవనాథగురో స్వామిన్ దేశిక స్వాత్మనాయక |
త్రాహి త్రాహి కృపాసింధో పూర్ణ పారాయణం కురు ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీవాసుదేవానంద సరస్వతీవిరచిత దత్తాత్రేయశాంతిస్తోత్రం సంపూర్ణమ్ |
దత్తాత్రేయ శాంతిస్తోత్ర పారాయణేన భగవాన్ సర్వాత్మకం సర్వం శ్రీదత్తాత్రేయ పరబ్రహ్మార్పణమస్తు ||
__(())--
2. "చెరపకురా చెడేవు "
పూర్వం ఒక రాజు ఉండేవాడు...పరమక్రూరంగా , దయ లేకుండా అందరినీ బాధపెట్టేవాడు..
అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు అధికారులు ప్రజలు అందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేసాడు "నేను ఈ రోజు నుంచి ఎవ్వరినీ బాధపెట్టను , అందరితో మంచిగా ఉంటాను , దయగా ప్రవర్తిస్తాను" అని...మాట ఇచ్చినట్టే , మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉన్నాడు..కొంతకాలానికి అందరూ అతన్ని దయగలమారాజు అనుకుంటున్నారు...
మంత్రుల్లో ఒకరు ఈ మార్పు ఎలా సాధ్యం , తెలుసుకోకపోతే ఎలా అని చాలా కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి మీలో ఎందుకు ఉన్నట్టుండి అంత మార్పు వచ్చింది , కారణం చెప్తారా అని అడిగాడు...
రాజు సమాధానం చెప్తున్నాడు..
నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతుంటే ఒక వేటకుక్క నక్కని వెంటాడుతోంది...నక్క కష్టపడి తన గుహలోకి వెళ్ళేలోపే వేటకుక్క నక్క కాలు కరిచింది...నక్క కుంటిది అయిపోయింది...
ఆ రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను..అక్కడ అదే వేటకుక్క ఉంది...
ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకుని వేటకుక్క మీదకి విసిరాడు ...ఆ రాయి కుక్కకాలుకి తగిలి వేటకుక్క కాలు విరిగింది....
అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది...అతను కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు...
ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది...ఒక గుంటలో పడి దాని కాలూ విరిగిపోయింది...
వరుసగా జరిగిన ఈ సంఘటనలకు నాకు ఒక ఆలోచన తోచింది...
నక్క కాలు కుక్క కరిస్తే , కుక్క కాలు మనిషి రాయి వల్ల విరిగింది , మనిషి కాలు గుర్రం తన్నినందువల్ల విరిగితే..గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది...
ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకీ జరుగుతుంది అని బాగా తెలిసొచ్చింది...
అప్పుడు నా వల్ల ఎందరు బాధపడ్డారో..వారందరి వల్ల నేనూ బాధపడాల్సి వస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే వంట్లో వణుకు పుట్టింది...ఆ క్షణంలోనే నిజాయితీగా ఉండాలని నిర్ణయించు కున్నాను...ఎవ్వరినీ ఇంక కష్టపెట్టకూడదు అని అందరితో దయగా ఉండాలి అనుకున్నాను అని రాజు వివరించాడు...
ఇదంతా విన్న మంత్రి ఈ రాజుకి చాదస్తం ఎక్కువయినట్టుంది...రాజుని ఈ పరిస్థితుల్లో సింహాసనం నుంచి తప్పించి..కిరీటం నేను దక్కించుకోవచ్చు అని పన్నాగం పన్నుకుంటూ ఆలోచనల్లో పడి ముందున్న మెట్లు చూసుకోలేదు..మెట్ల మీద జారి పడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు...రాజు పదవి కాదు కదా మనిషిగా కూడా ఒకరిమీద ఆధారపడేలా అయ్యాడు..ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకీ అదే చెడు జరుగుతుంది అన్న మంచి విషయం ఈ కధ సారాంశం..
సర్వే జనా సుఖినోభ వంతు
--(())--
నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (14)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
3. *మన దినచర్యలో భాగంగా మనతో బతికే శ్రీమతి ని మనం గౌరవించాలి ఎందుకనగా మన మనస్సును అర్ధం చేసుకొని ప్రవర్తించేది ఒక్క స్త్రీనే అదియే "శ్రీమతి"
శ్రీమతి మాటలు కొన్ని పరిస్థితిలో ఉద్రేకం తెప్పించ వచ్చు, మరో పరిస్థితిలో శాంతింపచేయవచ్చు అయినా మానముమాత్రం తక్కవేమతినలేదు, వారినిఉడికిసాం ఏఏడిపిస్తాం, నవ్విస్తాం అన్నీ చేస్తాం శ్రీ మతి మాత్రం భర్తే దైవం అని తనపని తాను చేసు కుంటుంది।
అయినా ఉదయానికే ఉషదయ అరుణ కిరణాలు లేపినట్లు లేపి మొఖం కడుక్కోండి కాఫీ త్రాగుదాం అంటుంది, చూచేటప్పుడు ఆమె సౌందర్యం నయన సుందరిని మించినట్లు కనిపిస్తుంది, ఏమైనా మాటలు మాట్లాడె డప్పుడు శ్రీవాణి గా ప్రవర్తిస్తుంది, సహనములో పుడమి తల్లిని మించి పొయ్యేది, ఆహారపదార్ధాలు తయారీలో, వడ్డనలో, అన్నపూర్ణను గుర్తు చేస్తుంది।
ఆమె నడుస్తున్నప్పుడు ఒక హంస నడిచినట్లే ఉంటుంది, నవ్వుచున్నప్పుడు ప్రసన్న లక్ష్మి వచ్చినట్లు, మన మనస్సు అర్ధం చేసుకొని నవ్వించే హాసిని ఆమె।
చేసేపనికి ఎప్పుడూ స్పూర్తి దాయకమైన స్థితిలో ఉంటుంది, ఏ పని చేయడానికి అయినా ముందు స్పందన చేస్తూ, హెచ్చరిస్తూ, మంచి చెడులు తెలియ పరిచేది, మంచి పనిలో పవిత్రతగా, ఇష్టంగా చేసే పనికి ప్రీతిగా, నిజాలు బోధించేటప్పుడు సత్యవతిగా, మనస్సు శాంత పరిచేటప్పుడు నిర్మల గా, అబద్ధాలు మాట్లాడినపుడు కల్పనగా, పిల్లలకు చదువు నేర్పేటప్పుడు సరస్వతి గా, వ్యాపారంలో చేరి ప్రతిభగా అభివృద్ధి పరచి దేశ ప్రగతికి సహకరించి ఒక మాములు గృహిణిగా, అద్దంలో చూసైనా ప్రత్యక్షంగా చూసినా మొగవాని మనసుకు సుందరి శ్రీమతి।
సరిగమలు నేర్పునప్పుడు సంగీత లక్ష్మీగా, పాటలు పాడునపుడు శృతి కలిపి మధుర మనిపించే కోకిలగా, తాళం వేయునపుడు లయగా, సాహిత్య గోష్టిలో సాహిత్య దేవతగా, నగరాన్ని కాపాడుతూ, ప్రకృతి వనరులను అందించే స్త్రీ గా శ్రీమతి ।
జీవిత గమనంలో మనతో విద్యాభ్యాసంలో పిల్లలకు విద్యావతిగా, సంపాద నప్పుడు సహాయ సహకారము అందించు లక్ష్మిగా, మనిషి విసుగురానియ్యకుండా, సంతోషము కల్పిస్తూ, ఇంద్రియాల కొరియాకును తీరుస్తూ, చేసేవృత్తిలో ప్రేరణ కల్పిస్తూ, పని చేసి వచ్చాక భర్తకు ఉపశమన శాంతి కల్పిస్తూ, అన్ని వయసులలో లాలన, పాలన సాగిస్తూ, మధ్యవయస్సులో వయస్సుని ఉడికిస్తూ, ముసలితనంలో కరుణ, మమతను చూపిస్తూ జీవితాంతం మనతో ఉండే స్త్రీ గా శ్రీమతి ।
నీరు త్రాగునపుడు గంగ లా సహకరించేది, సాయింత్రం వేళలో సంధ్యా దేవిగా, చీకటైతే అందరికీ వెలుగుఅందెంచె జ్యోతిగా, రాత్రి మత్తును తాగించే నిషాగా, పడుకున్నాక స్వప్న సుందరి।
ఆలోచనలప్పుడు ఊహాగా ఆలోచనలు తీర్చేటపుడు భావనగా సంతోషంలో సంతోషి గా।
కోపంలో కనింపించే రుద్రకాళిగా, మనసులో ఉండే భైరవిగా, ఆటలాడునప్పుడు ఆనందినిగా , గెలుపు కోసం అహర్నిసాలు ప్రోచ్చాహం కల్పించి జయమును కల్పించే విజయ లక్ష్మీగా।
గెలిచిన తర్వాత కీర్తి ప్రతిష్టలు పెపుచేసేట్టు సహధర్మచారిణి ।
విశ్వాసం ఉంటె చాలు - మనసు అర్ధమవటానికి
నమ్మకం ఉంటే చాలు - రహస్యం తెల్పటానికి
ఆశయం బ్రతకటానికి - సహనమ్ము ఉంటే చాలు
గుండె వికసించటానికి - ఆశలు లేకుంటె చాలు
మోక్కలు నాటితే చాలు - పుడమి పులకించటానికి
మలయమారుతమ్ము చాలు - జీవిగా బతకటానికి
మంచి పలకరింపు చాలు - మనిషి గుర్తించటానికి
ఎడారిలొ నీరు చాలు - నరకం తప్పించటానికి
నీలొ త్యాగ బుద్ధి చాలు - నలుగురు మెచ్చటానికి
నీలొ ధర్మగుణం చాలు - నలుగురు బత్కటానికి
సమాజమ్ము బాగు చాలు - మానవత్త్వ నిలయానికి
శ్రమతొ విద్య ఉంటె చాలు - లెక్క గౌరవ సంపదకి
ఒక్క చూపు చూపు చాలు - మాయను చేర టానికి
ఒక్క పలుకు పల్కు చాలు - జీవితమ్ము మార డానికి
స్త్రీలో ఎన్ని లక్షణాలు ఉన్నా స్త్రీ మనస్సును తెల్సు కున్నప్పుడు, ఆ మనస్సు అర్ధమైనప్పుడు మగవానికి సుఖము సంతోషము శాంతి ఉంటుంది, అర్ధం కాకపొతే నరకం ఇంతకన్నా గొప్పగా ఉంటుందా అని ఆలోచించాలి।
స్త్రీ ఆత్మగౌరవం దెబ్బతీయకుండా మనిషిగా మన్నన పొందుతూ ఉండాలి।
--(())--
*అమృతస్య పుత్రా:*
*4- అన్నమయ్య జీవిత చరిత్ర*
గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు.
నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేసారు.
చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళుచేర్చికట్టి కూలద్రోయడం.
నారాయాణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచేసినప్పటికి నారాయణయ్య లేత మనస్సు గాయపడింది.
నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు.
నారాయాణుడు ఒంటరిగ గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు.
నేడు ఊటుకూరునందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒకగదిలో వున్న స్త్రీమూర్తి విగ్రహం "చింతలమ్మ" అని స్ధానికుల అభిప్రాయం.
పాము కరవలేదు సరికదా ! నారాయణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది.
నారాయణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఒళ్ళో చేర్చుకొని వూరడించింది.
"ఎందుకు బాబు ఈ అఘాయిత్యం. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు, తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైనది.
అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయణయ్య తాళ్ళపాక చేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు.
సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయణయ్య కుమారుడే నారాయణసూరి.
అన్నమయ్య తండ్రి - నారాయణసూరి.
అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును.
నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడప జిల్లా సిద్దవఠం తాలూకాలో వున్నది.
అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట.
*అన్నమయ్య తండ్రి - తిరుమల పయనం*:
భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు.
"మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు.
ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు.
లక్కమాంబ, నారాయణసూరి తిరుమలచేరారు. స్వామి మందిరం ప్రవేశించారు.
గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అదృశ్యమైంది.
వేంకటేశ్వరస్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.
||నారాయణాచ్యుత గోవిందా
గోవింద నామా గోవిందా శ్రీవిష్ణు దేవా గోవిందా
శ్రీ దామోదర గోవిందా||
గోవిందా హరి గోవిందా, వేంకటరమణా గోవిందా గోవిందా హరి గోవిందా వేంకట రమణా గోవిందా||
ఓం నమో వేంకటేశాయ!!
మనకి తెలిసిన, మనం చెప్పుకొనే సామెత :-
*ఇల్లు ఇరకాటం - ఆలి మర్కటం.
అంటే ఇల్లు ఇరుకుగా ఉండాలి. భార్య కోతిలా ఉండాలి.
ఇల్లు ఇరుకుగా ఉంటే ఎవరూ మన ఇంటికీవచ్చి, ఎక్కువ రోజులు తిష్ట వెయ్యరు. భార్య కోతిలా ఉంటే ఆమెని ఎవరూ పట్టించుకోరు.
అని ఎవరో చేతకాని వాళ్ళు అసలు సామెతకి చేతబడి చేసేసారు.
కానీ అసలు ఈ సామెత వెనకాల మన సంస్కృతీ సంప్రదాయలు నిబిడీకృతమై ఉన్నాయని ఎంత మందికి తెలుసు????
నేను కూడా చాలా చాలా ఆలోచించగా,,,,, చించగా,,,,, నా బుర్రకు తట్టింది మీకు తెలియజేస్తున్న.... నచ్చి, నిజమనిపిస్తే అసలు సామెత నే వాడుకలోనికి తీసుకురండి. మన సామెతల్ని ఎగతాళి చేసే అవకాశం ఇవ్వకుండా దాని అంతర్యాన్ని అందరూ గ్రహించాలని నా ఉద్దేశ్యం.
అసలు సామెత :-
" *ఇల్లు ఇరు కవాటం - ఆలి మరు కవాటం*. "
అనగా " ఇంటికి ముందు, వెనుక రెండు(ద్వారాలు)తలుపులుండాలి.- భార్య తలుపు చాటుగా ఉండాలి. " అని దాని అర్థం.
ఇరు = రెండు.
మరు = చాటు, వెనుక.
కవాటం = తలుపు.
'వాస్తు రీత్యా కానీ, భద్రతా రీత్యా కానీ ప్రతీ ఇంటికీ ముందు వైపు, వెనుక వైపు కూడా ద్వారం ఉండాలి.'
ఇంటికి అతిథి కానీ, వేెరెవరైనా కానీ వచ్చినపుడు 'ఇల్లాలు ఎపుడూ కూడా తలుపు వెనుక నుండే సంభాషించాలి.'
ఇంత అర్థ వంతమైన సామెత. దీనిని మనం ఎంత వికృతమైన అర్థం లో వాడుతున్నామో కదా! హతోస్మి.
__(())--
5. సృష్టికర్తతో ఒక మాట
- దీప్తి కోడూరు
ఒక శ్రమజీవి శరీరం విడిచి దివ్యాత్మ స్వరూపంతో భగవంతుని ముందు నిలుచున్నాడు.
సూటిగా భగవంతుని ఇలా ప్రశ్నించాడు, "వృద్ధాప్యం ఎందుకు సృజియించావు? నీవే ఇచ్చిన శారీరకమైన దృఢత్వాల్ని
ఒకదాని తరువాత ఒకటిగా ఎందుకు లాగేసుకుంటావు? మాలోని శక్తినీ, శరీరపుష్టిని, సృజనశీలతను, కర్మ చేయగలిగిన
లాఘవాన్ని అన్నిటినీ క్షయింపజేసి బలహీనమైన, కృంగిపోయే దేహానికి తీసుకొస్తావు ఆఖరుకు, ఎందుకలా?"
సృష్టికర్త చిరునవ్వుతో బదులిచ్చాడు.
"చిన్నివాడా, వృద్ధాప్యం శాపం కాదు, వరం. మీకు నేనిచ్చిన గొప్ప వరమది. వయసు పెరిగే కొద్దీ మరింత పరిపక్వమై,
తెలివిమంతమై, నేను ఈ దేహం కాదు, ఇదెప్పటికైనా వదిలిపెట్టాల్సిందే, అసలు ఈ ప్రపంచమే నాది కాదు. దీనిని వదిలి
అనంతలోకాలకు పయనం తప్పదు. మీ తండ్రినైన నన్ను చేరడమే చివరి లక్ష్యం అని మీరు తెలుసుకునేటందుకే జీవిత
చరమాంకంలో వృద్ధాప్యాన్ని జోడించాను."
"ఎంత అద్భుతం! మాలో ఎందరికి ఇది తోస్తుందో మరి?!!"
"ఇంతేనా, మీరు గుర్తించకుండా విస్మరించే అద్భుతాలు ఎన్నో. ఒక్కసారి హృదయకవాటాలు తెరచి చూడండి. మీ చుట్టూ
ఉన్న అద్భుతాలను గమనించండి.
ప్రకృతిలో ప్రతిదీ అద్భుతమే.
చిన్న విత్తనం పెద్ద మర్రి వృక్షం కావడం అద్భుతం కాదా!?!!
గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారడం అద్భుతం కాదా?!!
గర్భాలయంలో ఒక కణం మరొక కణంతో జతకూడి ఒక ప్రాణిగా పురుడు పోసుకోవడం అత్యంత అద్భుతం కాదా?!!
కళ్ళ ముందే కన్నీటిని మిగిల్చి మరణమనే పేరుతో దేహం చలనరహితమై పంచభూతాల్లో కలిసిపోవడం మరింత అద్భుతం కాదా?!!
ఏనాడైనా గమినించావా ఇవన్నీ?
చుట్టూ ఉన్న చెట్టుచేమలను మనసు పెట్టి చూచావా? వాటిలోని ఎదుగుదలను, ప్రాణశక్తిని గుర్తుపట్టావా?
అనంతమైన ఆకాశం అద్భుతం!
దిగంతాలను చుంబించే మహాసముద్రాలు అద్భుతం!
సూర్యుని వెచ్చదం అద్భుతం, చంద్రుని చల్లదనం అద్భుతం!
చూడగలిగే మనసుంటే ప్రకృతంతా అద్భుతాలమయమే. అనంతమైన శక్తిని అందిస్తూనే ఉంటుంది. ఎల్లప్పుడూ సానుకూల
పవనాలు వీస్తూనే ఉంటాయి. ఇన్ని అద్భుతాల మధ్య విసుగు అనే మానవుడి మనోస్థితి ఎలా పుట్టుకొచ్చిందో నాకు చిత్రంగా
ఉంటుంది. నా సృష్టిలో లేని విపరీతం అది.
శ్వాస తీసుకున్న ప్రతిసారీ భగవంతుని సృష్టితో నేనూ ఒక లంకె వేసుకుంటున్నట్లు ఎందుకు భావించవు?
నీవెప్పుడూ ఆ ప్రకృతిలో భాగమని ఎందుకు గుర్తించవు?
గుర్తించి ఎందుకు ఆ అనుభూతిని అనుభవించవు?
అనుభవించి ఎందుకు ఆనందించవు?!!"
--(())--
06 *అప్పట్లో కష్టం అంటే* -
తినడానికి..... సరైన తిండి దొరక్కపోవడం
చదివినా.... ఉద్యోగం దొరక్కపోవడ0
భార్యకి... భర్తపోరు... అత్తపోరు
ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు
ఆరుగాలం కష్టపడిన రైతుకి... పంట చేతికి అందకపోవడం
ఇంటిల్లపాది.... ఒక్కరి సంపాదనతో బ్రతకడం
చాలీచాలని జీతాలు
ఇలా ఒకస్థాయిలో ఉండేవి. మిగతావాటికి చాలావరకు సర్దుకుపోయేవారు.... సరిపెట్టుకునేవారు.
*ఇప్పుడు కష్టం అనే రూపురేఖలు మారిపోయాయి* -
పరీక్ష తప్పితే కష్టం, అమ్మ తిడితే కష్టం , నాన్న కొడితే కష్టం
పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం , సరైన చీర కొనకపోతే కష్టం
*ఇప్పటివారి కష్టాలకి కారణం ఒక్కటే* -
అనుకున్నది.... దొరకాలి అప్పుడు.... కష్టం లేనట్లు
పిన్నీసు దొరక్కపోయినా, ప్రాణం పోయేంత.... కష్టం వచ్చినట్లు బాధ పడిపోతున్నారు
అప్పట్లో మనస్సు చాలా బలంగా ఉండేది
ఎందుకంటే చిన్ననాటి నుండి కష్టాలు చూసి పెరిగేవారు
ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియకుండా....
తల తాకట్టుపెట్టయినా పిల్లలు కోరిందల్లా...
వాళ్ళ కాళ్ళ ముందు పెడుతున్నాము
మానసిక బలం తగ్గిపోబట్టి వాళ్ళకిప్పుడు ప్రతీది కష్టమే
అంతెందుకు మొన్న
కర్ణాటక లో ఒక IAS ఆఫీసర్ కోస్తాంధ్ర లో ఒక IPS ఆఫీసర్ సినిమా హీరోలు
ఎంతోమంది సబ్ ఇన్స్పెక్టర్లు ఐఐటీ స్టూడెంట్స్మెడికోస్
కూడా మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య లు చేసుకున్నారు
ఇప్పటి *కొత్తతరం పెద్దలకి* చెప్పేది ఏంటంటే -
చదవండి.. చదివించండి.
దాంతోపాటే కష్టపడడం నేర్పండిమేము పడుతున్న కష్టం చాలు,....
పిల్లలెందుకు కష్టపడాలి" అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు☹!
మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తూ వారిని పెంచండి
అప్పుడే వారికి కష్టం విలు తెలుస్తుంది.
జీవితంలో వారు స్థాయిలను చేరుకోవడానికి పునాది అవుతుంది
__(())__
07 బృహన్నల విజయం
మహారాజా ! కౌరసైన్యాన్ని జయించి, మనగోవుల్ని మళ్లించి ఉత్తరుడూ, సారధీ వస్తున్నారు. చివరకు రధానికైనా ఈషణ్మాత్రంకూడా ప్రమాదం లేకుండా సురక్షింతగా ఉన్నారు. మమ్మల్ని పిలిచి మీరువడిగా పోయి పురంలో ప్రకటించండి అంటే వచ్చాం అన్నారు, వారు.
విరాటరాజు ఆనందోత్సాహం పట్టలేకపోతున్నాడు. చూశావా నా కొడుకు ఉత్తరుడి బాహుబలం శౌర్యం ఎంతుఉదాత్తమైనవో ! కౌరవ సైన్యాన్ని ముట్టడించి, గెల్చి, గోవుల్ని తెచ్చాడు ! ఇంత ఘనకార్యం ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా చేశారా ! అన్నాడు పాచికలు వేస్తూ.
గెలవడం బ్రహ్మవశంకూడా కాదు గదా ! అంటూ అతడు తొందరపడుతున్న సమయంలో ఉత్తరుడు పంపించిన గొల్లవాళ్ళు అక్కడికి వచ్చారు.
భీష్మ, కర్ణ, దుర్యోదన, ద్రోణ, కృపామున్నగు యోధుల్ని ఉత్తరుడు ఒక్కడే జయించగలిగి నట్లయితే, ఇంతకన్న ఆశ్చర్యకరమైన విషయం లోకంలో ఉంటుందా ? ప్రపంచంలో ప్రసిద్ధి కెక్కుతాడు అన్నాడు , కంకుడు.
కంకుడి మాటలు విరాటుని బాధించాయి. అతడు కటకట పడినాడు.
నువ్వు ఇలాగమాట్లాడడంలో అంతరార్థం నా కొడుకు విజయం సందేహమనేనా ? నువ్వు కనుక ఇంతమట్టుకు ఓపిక పట్టాను. ఇంకఇటువంటి మాటలు అనకు, అన్నాడు, కోసంగా. అతని చెక్కిళ్లు అదిరినవి. కళ్ళు కెంపెక్కినవి. మూతిముడుచుకొని ఆడుతున్నాడు. కాని కంకుడా తణ్ణి లెక్కచేయలేదు.
కౌరవసైన్యాన్నే అన్నమాటేమిటి ? దేవతలూ, రాక్షసులూ కలిసి వచ్చినా గెలుస్తాడు, ఉత్తరుడు, శత్రుసైన్యాలకు జడుపుపుట్టే ఆ బృహన్నలరధం మీద ఉండాలిగాని అన్నాడు.
విరాటుడి కోపం రెట్టించింది. మొహం వికృతమైంది.
నీవల్ల చాలాచాలా వింతలు వింటున్నాం ! ఇంతకు ముందు ఎప్పుడూ సారధుల్ని చూడలుదనుకుంటున్నావు కాబోలు. అబ్బో ! లోకంలో మహామహా వీరుల్నే చూశాం అతని కన్నులు నిప్పులు కురుస్తున్నవి. నాకొడుకుని గురించి పోటు మాటలు నీకెందుకు ? సంతోషంగా ఆడలేవా ? పిచ్చిపిచ్చిమాటలు కట్టిపెట్టు. అటువంటివి మేం సహించలేం
బ్రాహ్మడా, అన్నాడు, విరాటరాజు.
ధర్మరాజు పట్టువదల్లేదు. చిరునవ్వు నవ్వి.యుద్ధం చేయాలని వేడుకపడి, అతి సాహసుడై, బృహన్నల ఉత్తరుణ్ణి సారధిగా చేసుకొని కౌరవసేనలను జయించి, ఒక్క పశువైనా పోకుండా అన్నిటినీ తెచ్చి ఉంటాడు. నా మాట నిజం అవుతుందోకాదో చూస్తూండు, అన్నాడు కంకుడు. అంతటితో ఆగక బృహన్నల విజయం పురంలో చాటించు అన్నాడారాజు మొగం చూస్తూ.
విరాటుడు రౌద్రుడుయాడు. బుసకొట్టాడు. పేడిని పొగడడం మానమంటే మానవేం ? అంటూ పాచికను కంకుడి మొహానికేసి కొట్టాడు.
ఈ విధంగా దెబ్బతినినా, ధర్మారాజుకు కోపంరాలేదు. ద్రౌపది వైపు చూచి ఊరుకున్నాడు. ద్రౌపది గబగబ పరుగెత్తి అతని నొసటి దెబ్బనుండి కారుతున్న రక్తాన్ని తన పమిట చెంగుతో అద్ది, ఆ చేరువలోనున్న బంగారు కలశలోని నీళ్లతో చేతులు తడుపుకొని గాయాన్ని నెమ్మదిగా తుడుస్తున్నది.
రక్తాన్ని చీర చెంగుతో అద్దుతున్నావేం ? అని విరాటుడు సైరంధ్రిని అడిగినాడు.
నిర్మలమైనవంశంలో పుట్టిన ఈ పుణ్యాత్ముని నెత్తురు ఎన్ని బొట్లు నేలమీద పడతాయో అన్ని సంవత్సరాలు ఇక్కడ అనావృష్టి కలుగుతుంది. ఉత్తమ బ్రాహ్మణుడికి హాని చేయడంవల్ల కలిగే పాపం ఎట్లాగూ కీడు కలిగిస్తుంది. కనుక నీకు హాని రాకుండా ఉండాలని ఇలాగ చేశాను. అంటూ ఆమె అతని గాయాన్నుండి కారుతున్న నెత్తురు తుడుస్తున్నది.
ఉత్తరుడొక్కడూ లోపలికి వచ్చినాడు. తండ్రిపాదాలకు మోకరిల్లాడు. విరాటుడు ఆనందబాష్పాలు కార్చి, కొడుకును గట్టిగా గుండెలకదుముకొన్నాడు. ఉత్తరుడు తండ్రికి పునః ప్రణామాలు చేశాడు. పిమ్మట కంకుడికి సగౌరవంగా నమస్కరించాడు.
ఆతని నుదుటను ఉన్నగాయం చూచి ఇదేమి ? అన్నాడారుద్దాగా.
నాయానా ! నేను నీ విజయాన్ని పొగడుతూంటే అతడు పేడివాణ్ణి పొగడాడు. దాంతో, నేను కోపం ఆపుకోలేకపోయాను. అప్పుడు నాచేతిలో ఉన్న పాచికపుచ్చుకొని కొట్టాడు, అన్నాడు విరాటుడు.
ఉత్తరుడు భయమూ, సంభ్రమమూపడినాడు.
అయ్యయ్యో ! నాన్నా ! గొప్పతప్పుచేశావు.
నీవు ఇలాగ చేయవచ్చా ? వారు ఏం చెపుతే అదల్లా మనం అంగీకరించాలిగాని, ఇలాగ, కాదు, కూడదు అంటూ నిషేదించవచ్చా ? వారిని సవినయంగా బ్రతిమాలుకోండి.
పవిత్రచరిత్రులైన పరమద్విజుల్నికోపించి అవమానించిన పరిపాలకులకు ఆయువు, సిరి కలుగుతాయా ? అన్నాడు, ఉత్తరుడు, అత్యాదరంతో.
ఉత్తరుని మాటలు పాటిగా బట్టి, విరాటుడు ధర్మరాజును భయభక్తులతో వేడుకొన్నాడు క్షమించమని.
ధర్మరాజు నాకేం కోపంలేదు. నీ తండ్రి చెడుమార్గన నడిచేవాడు కాదు. ఈ దినము అటువంటిది హాని కలిగింది అని నవ్వుతూ ఉత్తరుడితో అన్నాడు.
అప్పుడు తండ్రి, కొడుకులు సంతోషించారు.
__(())__
08 ఆమె మనసు నాది అనుట నటన తప్పు కలువ లేక ఉన్న
ఏమి చెప్పగలను ఎవరికి చెప్పెదను ఆమె కొరకు ఉన్నానని
కోమలాంగి అదియు కోటి మంది కన్న మిన్న అందమైన
ఆమెకామెసాటి అణువు అణువు పంచు దేవతయే ఆమె
[17:28, 12/07/2021] +91 96036 37166: 👍🏽
[17:29, 12/07/2021] Mallapragada Ramakrishna: తెలుగు వారి కున్న తెలివి తేట లు వేఱనకు ఇపుడు
తెలుగు మెచ్చుకొను తెగువ ఎక్కువేను మారు చెప్ప కుండు
తెలుగు జాతి కున్న తెగులును గనుమోయి విశ్వ మంత చేరి
తెలుగు నరుల మాట తేనియల మూటా పంచ బుద్ధి కలిగె
తెలుగు వారి బాట తల్లి నేర్పు మాట తెల్లవారి వెలుగు
తెలుగు పాట బతుకు తెల్ల వారి తీయని పలుకులతొ మెలుగు
తెలుగు అక్ష రమ్ము తల్లి నేర్పు చున్న మాతృ భూమి వెలుగు
తెలుగు భాష మనసు తరుణ మంత హాయి నింపి హృదయ మెలుగు
[17:31, 12/07/2021] Mallapragada Ramakrishna: నాన్న హృదయములో నన్ను హెచ్చరిస్తు నేను ఉన్నా నని
వెన్ను తట్టి లేపి వదలకు ధైర్యమూ అదియు నీకు రక్ష
కన్న వారి ఆశ కాలమున తీర్చూ కధలు చెప్ప కెపుడు
అన్న మాట తోను ఆదరణతో నువే హాయిగా ఉండుము
వాని మాటవల్ల వరుస తెల్సి ఫలము పొంద లేక యున్న
కాని వారికెల్ల కనికరమును చూపె కార్య సాదకునిగ
ధీను లందరికీ దీప్తి వెలుగు లంద చేయు చుండు బతుకు
కాని పనులు వదలి కాలయాపన చేయకయు జీవమందు
[18:27, 12/07/2021] Mallapragada Sridevi:
!
[18:31, 12/07/2021] Mallapragada Sridevi: ⭕ ఒక ప్రభుత్వ టీచర్ చేసిన విశ్లేషణ ..
తప్పకుండా ఆలోచించాల్సిన
*అంశాలు ......
ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థ మధ్య పోటీలో.. ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా బలిపశువులు చేసి చూపుతున్నారో, వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం నాది...
కొంత హిస్టరీలో కి వెళ్దాం...
30 సంవత్సరాలకు పూర్వం అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించేవారు.
డాక్టర్ కొడుకైనా, లాయర్ కొడుకైనా, ఇంజనీర్ కొడుకైన, టీచర్ కొడుకైనా, రాజకీయ నాయకుడి కొడుకైనా, రైతు కొడుకైనా, కూలి కొడుకైన ఎవరైనా ఒకే పాఠశాలలోనే చదవాల్సిందే..
అప్పుడు పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండేవి..
దాదాపు ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడేవి.
అప్పుడు కూడా విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా ఉండేవారు కాదు.
ఏ కొంత మంది విద్యార్థులకో ప్రత్యేక తర్ఫీదు లు ఉండేవి కాదు.
కానీ విద్యార్థులు వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి ముందు తరగతులకు వెళ్తూ ఉండేవారు.
తెలివైన విద్యార్థులు 5 నుండి 10 శాతం మంది ఉన్నత తరగతులు చదువుతూ కాలేజీల్లోనూ.. యూనివర్సిటీల్లోని సీట్లు సంపాదిస్తూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు.
మిగతా 90 శాతం మంది విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో విద్యను ఆపేసిన వారు కొందరు, హైస్కూల్ స్థాయిలో విద్యను ఆపేసిన వారు కొందరు, కాలేజీ స్థాయిలో కొందరు, రకరకాల వృత్తులో స్థిరపడిన వారు కొందరు ఉండేవారు.
అలా ఉన్న 90 శాతం మందిలో ఏ ఒక్కరు కూడా ఆ పాఠశాల వలనే మాకు చదువు రాలేదు అని ఎవరూ అనలేదు.
మేము చదువు మీద సరైన శ్రద్ధ చూపలేదు అని మాత్రమే అనేవారు.
వారికి చదువు చెప్తున్న ఏ ఉపాధ్యాయుని కూడా నిందించే వారు కూడా కాదు.
తర్వాత వాస్తవం లోకి వెళ్దాం ...
కాలంతో పాటు జనాభా కూడా పెరుగుతోంది. గ్రామాల్లోని విద్యార్థులకు కూడా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది.
కానీ ప్రాథమిక విద్య తర్వాత హైస్కూల్ లో జాయిన్ చేయడానికి అందుబాటులో లేక చదువు మానేసిన వాళ్లు కొందరు.
దీనికి కారణం ఉపాధ్యాయులా? ప్రభుత్వమా?
ఏదోలా దూరాన ఉన్న హై స్కూల్లో చేరి హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరుదామనుకుంటే రెండు, మూడు మండలాలకు కలిపి ఒక జూనియర్ కళాశాల దానిలో 100 నుంచి 200 సీట్లు ఉండేవి.
మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ? ప్రభుత్వాలు వాళ్లకి ఎందుకు చదువుకునే అవకాశాలు కల్పించలేకపోయింది?
అప్పుడే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయి.
ప్రభుత్వం కూడా తన భారం తగ్గుతుంది కదా అని పర్మిషన్ లు కూడా ఇచ్చేసేది.
కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వాడు మాత్రమే ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయ్యే వారు.
కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వారి సంఖ్య పెరుగుతూ పోయింది.
కానీ ప్రభుత్వ కళాశాలలు పెరగలేదు. వాటిల్లో సీట్ల సంఖ్య పెరగలేదు.
ప్రైవేటు కళాశాలల సంఖ్య మాత్రం వారికి అనుగుణంగా పెరుగుతూ పోయింది.
రేకుల షెడ్ ల లో నడుస్తున్న అపార్ట్ మెంట్ ల లో నడుస్తున్నా.. విద్యా ప్రమాణాలు పాటించకున్నా.. ప్రభుత్వం తన మీద భారం లేదు కదా అనుకుంటూ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయింది.
మరి ప్రాథమిక విద్య లో విద్యార్థులను ఆకర్షించడం ఎలా..?
వాళ్ల దగ్గర లేనిది మన దగ్గర ఏముంది?
దానికి సమాధానమే ఇంగ్లీష్ మీడియం...
ఇబ్బడి ముబ్బడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి...
కాస్త ధనవంతులు ఉన్నత తరగతి వ్యక్తులందరూ అటు వైపు ఆకర్షింపబడ్డారు.
ప్రభుత్వం ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలని రూల్ ఏమి పెట్టలేదు.
అడిగిన వాళ్లందరికీ ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చేసింది.
కానీ ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు.
ప్రభుత్వం మీద భారం లేకుండా ఎవరికి వారే కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ గా చదివేస్తున్నారు.
ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయమే కదా..! ప్రభుత్వ ఖర్చు లేకుండా ప్రజలు విద్యావంతులై పోతుంటే..!!
అలా ఉన్నత, మధ్య తరగతి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళిపో సాగారు. అది సమాజం లో స్టేటస్ సింబల్ గా మారిపోయింది.
*ప్రభుత్వ పాఠశాలలు క్రమేపీ పేదల పాఠశాల లు గా మారిపోయింది.
కష్టం చేసుకునే ప్రజల పిల్లలు..
ఇంటి దగ్గర కష్టపడుతూ స్కూల్ కి వచ్చి చదువుకునే పిల్లలు..
ఏ మాత్రము చదువుకు సహకరించని తల్లిదండ్రులున్న పిల్లలు... ప్రభుత్వ పాఠశాలలకు దిక్కయ్యారు
వాళ్లలో కూడా తెలివైనవారిని రెసిడెన్షియల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు లాంటివి పరీక్షలు పెట్టి తీసుకెళ్లిపోయారు.
ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మీద భారం వేసి నీవల్లే ప్రభుత్వ పాఠశాల నాశనమయ్యిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మీద దురభిప్రాయం రుద్దింది.
ఆకులు చిదిమేసి, కొమ్మలు నరికేసి, చెట్టు మొదలు కి నీరు పోసినట్టు..
ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అని.. తూతూమంత్రంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాయి.
పెట్టినా.. అందుకు తగ్గట్టు వనరులు సమకూర్చ లేకపోయింది.
ప్రైవేటు పాఠశాల పక్కన, ప్రభుత్వ పాఠశాల చిన్న పోయేలా ప్రభుత్వం తయారుచేసింది.
1.* సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఇవ్వలేకపోవడం
2. విద్యార్థులకు తరగతి గదులు సరిపడా ఫర్నిచర్ లేకపోవడం.
3.* ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు సరైన సమయంలో చేసి, సరైన పద్ధతిలో పాఠశాలలను నడిపించలేక పోవటం
4.* ప్రైవేటు విద్యార్థులు సొంతంగా సిలబస్ లు.రూపొందించుకున్న వారిని అదుపు చేయలేక పోవడం.
5.* కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం లేకపోవడం..
ఉదాహరణకు 5వ తరగతి పూర్తి చేసి నవోదయ రాస్తున్న విద్యార్థికి ఐదవ తరగతి సిలబస్ లో ఉన్న ప్రశ్నలు కాకుండా ఇతరత్రా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని పాఠశాలలో బోధించే ఏవిధంగా సిలబస్ లేకపోవడం.
ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు MPC గ్రూప్ గవర్నమెంట్ కాలేజీలో చదివి లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్క లైను కూడా మిస్ అవ్వకుండా మొత్తం అవపోసణ చేసిన వాడికి ఐఐటీలో సీటు వస్తుందా? రాదు...
ఎందుకంటే ఆ సిలబస్లో లేని అంశాలు, అంతకు మించిన అంశాలను ఆ ఎక్జామ్ లో ప్రశ్నించడం వలన...
అంటే ప్రభుత్వం ఆ అంశాలను ఎందుకు సిలబస్ లో పొందుపరచ లేకపోయింది. లేదా ఇంటర్మీడియట్ సిలబస్ కు మించకుండా ఐఐటీ ఎగ్జామ్ ని ఎందుకు నిర్వహించలేక పోతుంది?
అంటే గవర్నమెంట్ పాఠశాల పుస్తకాలు, గవర్నమెంట్ కాలేజీ చదువులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సరిపోవు.. అనే భావాన్ని ప్రజల్లో బాగా నాటింది...
ఈ విధంగా ప్రభుత్వం తన విధానాలతో ప్రభుత్వ స్కూళ్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులు మీదికి నెట్టేస్తూ ప్రజల్లో ఆ భావాన్ని గట్టిగా నాటింది.
నిజంగా ఇప్పుడు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న రాష్ట్రంలో విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే వారి సంఖ్యకు తగ్గట్టు స్కూళ్లను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగలదా...?
ఆ సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బలోపేతం కావు ..?!
ఇక్కడ నేను చెప్ప వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే ...
ఫలితాలు చూపిస్తూ మేము మీ కంటే మెరుగ్గా ఉన్నాం అని విర్రవీగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, వాటిని సమర్థించే గొర్రె మంద లాంటి జనాలు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి.
నీళ్లు ఉన్నచోట ఎవరైనా పంట పండిస్తారు..
ఎడారిలో పండించండి ...
మీ ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు.
వారిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు.
నువ్వు అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు.
నువ్వు ఎన్ని గంటలు రుద్దుతున్నా వింటాడు.
వాళ్ల తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు.
ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం కేటాయించగల గలవారై ఉంటారు.
ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు.
మరి నా ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు ..
నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీల పిల్లలు...
అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి..
ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి...
పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్యలోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి..
ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి..
పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు..
★ నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోవు.
మేము చేర్చుకుంటాం...
★ మీరు పుస్తకం లేకపోతే బడీకి రానివ్వరు..
మేము రానిస్తాం...
★ మీరు పాఠశాలకు ఆలస్యమైతే ఒప్పుకోరు..
మాకు వాడు పాఠశాలకు ఎప్పుడు వచ్చినా అదే పదివేలు..
★ మీరు మీ విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు.
మా పిల్లల తల్లిదండ్రులు 90 శాతం నిరక్షరాస్యులు..
★ మీ పాఠశాలను శుభ్రం చేసే మనుషులు ఉంటారు.
మాకు మా విద్యార్థులు మరియు మేమే ఆ పని చేస్తాం.
★ మీరు చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు.
ఎందుకంటే వాడు ఉంటే మీ పాఠశాల పరువు తక్కువ కాబట్టి.
మేము వెనుకబడిన విద్యార్థులకు పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటాం.
★ మీ పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు.
మా పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించవలసిందే...
★ మీ పాఠశాలలో తెలివైన విద్యార్థులను మీరే దాచుకుంటారు. ఫీజు రాయితీలు అంటూ బయటికి పోనివ్వరు.
ఎందుకంటే వాడి పేరు చెప్పి ఇంకో వందమందిని ఆకర్షించాలిగా..
మా పాఠశాలలో తెలివైనవారిని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తుంటాం...
★ మీరు కొన్ని వందల పాఠశాలల బ్రాంచ్ లు కలిపి అది మీ యొక్క పాఠశాల రిజల్ట్ గా చెప్పుకుంటారు...
మాకు మా పాఠశాలలో వస్తేనే మా గొప్ప...
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి...
అవన్నీ మీకు కూడా తెలుసు...
వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని మాట్లాడుతున్న గా.. అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి.
అయినా మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తోపులు కాలేదు..
లక్షల మంది దగ్గర్నుంచి ఐఐటీ సీట్లంటూ లక్షలు.. గుంజేస్తుంటే ఏ వందమందికో సీట్లు వస్తున్నాయి...
మరి మిగతా వాళ్ల సంగతేంటి..?
మా ప్రభుత్వ పాఠశాలలో పదికి పది పాయింట్లు వచ్చిన వారిని నీలాగ రాష్ట్రం అంతా కలిపి లెక్కేస్తే, టీవీల్లో ప్రకటనలు ఇస్తే నువ్వు ఒక పక్కకు కూడా రావు.. అది నీ లాంటి సౌకర్యాలు లేకుండా..
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది.
ప్రైవేట్ పాఠశాలలు గోదారి బ్రిడ్జి మీద కారులో పోతున్నట్టు ఉంది..
అన్ని తెలుసుకోకుండా ఎవడికి వాడు ఈ రంగంలో లేకుండా ఒడ్డున కూర్చుని మామీద రాళ్లువేయడం సరికాదు.
దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ లోపాలను సరి చేయండి.
నిజమే.. అనిపిస్తే ఈ నిజాలను ఎంత ఎక్కువ మందికి చేరవేస్తే(share) అంత మంచి చేసినవారు అవుతారు.
ఆలస్యమెందుకు... చదివిన వెంటనే ఆ పని మొదలు పెట్టండి. 🤗
No comments:
Post a Comment