Wednesday, 14 July 2021

ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే
పయః పానం భుజంగానాం కేవలం విష వర్ధనం
తా:-నీచులకు ఉపకారము చేసినా వాళ్ళు మనకు అపకారమే చేస్తారు.ఎలాగయితే పాముకు పాలు పోయడం వలన దానికి విషము వృద్ధి యై మనల్ని కాటువేస్తుందో అలాగ.
ఆయుర్వేదేన నిర్ణీత మౌషధం రోగిణాం
జ్ఞానం తదైవ నిర్ణీతం సర్వేషాం భవ రోగిణాం
అర్థము: ఆయుర్వేదము రోగముగల సర్వ మానవులకొఱకు ఎట్లు యేర్పడినదో అలాగున అజ్ఞాన రోగముగల సర్వ మానవులకు
బ్రహ్మ జ్ఞానమను ఔషధము భవరోగము లను తగ్గించుట కొఱకు వేదము చే నిర్ణయింప బడి నది.
యాంతి ధర్మ ప్రవృత్తస్య తిర్యం చోపి సహాయతాం
అపంథానంతు గచ్చానం సోదరోపి విముంచతి.
అర్థము:-ధర్మ మార్గమున నడచు వానికి పశు పక్ష్యాదులు కూడా సహాయ పడతాయి.అధర్మ నార్గం లో నడిచే వానిని సోదరుడు కూడా విడిచి పెడతాడు.(సోదరుడు విడిచి పెట్టినా వానికి పాపము అంటదు)(రామునికి కోతులు సహాయము చేశాయి కదా!)
ప్రాంజలి ప్రభ 

 – శ్రీ గోవింద నామాలు --

శ్రీ శ్రీనివాసా గోవిందా | శ్రీ వేంకటేశా గోవిందా |
భక్తవత్సల గోవిందా | భాగవతప్రియ గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |
గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

నిత్యనిర్మలా గోవిందా | నీలమేఘశ్యామ గోవిందా |
పురాణపురుషా గోవిందా | పుండరీకాక్ష గోవిందా |

నందనందనా గోవిందా | నవనీతచోర గోవిందా |
పశుపాలక శ్రీ గోవిందా | పాపవిమోచన గోవిందా |

శిష్టపరిపాలక గోవిందా | కష్టనివారణ గోవిందా |
దుష్టసంహార గోవిందా | దురితనివారణ గోవిందా |

వజ్రమకుటధర గోవిందా | వరాహమూర్తివి గోవిందా |
గోపీజనప్రియ గోవిందా | గోవర్ధనోద్ధార గోవిందా |

దశరథనందన గోవిందా | దశముఖమర్దన గోవిందా |
పక్షివాహన గోవిందా | పాండవప్రియ గోవిందా |

మత్స్యకూర్మా గోవిందా | మధుసూదనహరి గోవిందా |
వరాహనరసింహ గోవిందా | వామన భృగురామ గోవిందా |

బలరామానుజ గోవిందా | బౌద్ధకల్కిధర గోవిందా |
వేణుగానప్రియ గోవిందా | వేంకటరమణ గోవిందా |

సీతానాయక గోవిందా | శ్రితపరిపాలక గోవిందా |
దరిద్రజనపోషక గోవిందా | ధర్మసంస్థాపక గోవిందా |

అనాథరక్షక గోవిందా | ఆపద్బాంధవ గోవిందా |
శరణాగతవత్సల గోవిందా | కరుణాసాగర గోవిందా |

కమలదళాక్ష గోవిందా | కామితఫలదాతా గోవిందా |
పాపవినాశక గోవిందా | పాహిమురారే గోవిందా |

శ్రీముద్రాంకిత గోవిందా | శ్రీవత్సాంకిత గోవిందా |
ధరణీనాయక గోవిందా | దినకరతేజా గోవిందా |

పద్మావతిప్రియ గోవిందా | ప్రసన్నమూర్తి గోవిందా |
అభయహస్తప్రదర్శక గోవిందా | మత్స్యావతార గోవిందా |

శంఖచక్రధర గోవిందా | శార్ఙ్గగదాధర గోవిందా |
విరజాతీర్థస్థ గోవిందా | విరోధిమర్దన గోవిందా |

సాలగ్రామధర గోవిందా | సహస్రనామా గోవిందా |
లక్ష్మీవల్లభ గోవిందా | లక్ష్మణాగ్రజ గోవిందా |

కస్తూరితిలక గోవిందా | కాంచనాంబరధర గోవిందా |
గరుడవాహన గోవిందా | గజరాజరక్షక గోవిందా |

వానరసేవిత గోవిందా | వారధిబంధన గోవిందా |
ఏడుకొండలవాడ గోవిందా | ఏకస్వరూపా గోవిందా |

శ్రీ రామకృష్ణ గోవిందా | రఘుకులనందన గోవిందా |
ప్రత్యక్షదేవా గోవిందా | పరమదయాకర గోవిందా |

వజ్రకవచధర గోవిందా | వైజయంతిమాల గోవిందా |
వడ్డికాసులవాడ గోవిందా | వసుదేవతనయా గోవిందా |

బిల్వపత్రార్చిత గోవిందా | భిక్షుకసంస్తుత గోవిందా |
స్త్రీపుంసరూపా గోవిందా | శివకేశవమూర్తి గోవిందా |

బ్రహ్మాండరూపా గోవిందా | భక్తరక్షక గోవిందా |
నిత్యకళ్యాణ గోవిందా | నీరజనాభ గోవిందా |

హాతీరామప్రియ గోవిందా | హరిసర్వోత్తమ గోవిందా |
జనార్దనమూర్తి గోవిందా | జగత్సాక్షిరూప గోవిందా |

అభిషేకప్రియ గోవిందా | ఆపన్నివారణ గోవిందా |
రత్నకిరీటా గోవిందా | రామానుజనుత గోవిందా |

స్వయంప్రకాశక గోవిందా | ఆశ్రితపక్ష గోవిందా |
నిత్యశుభప్రద గోవిందా | నిఖిలలోకేశ గోవిందా |

ఆనందరూపా గోవిందా | ఆద్యంతరహితా గోవిందా |
ఇహపరదాయక గోవిందా | ఇభరాజరక్షక గోవిందా |

పరమదయాళో గోవిందా | పద్మనాభహరి గోవిందా |
తిరుమలవాసా గోవిందా | తులసీవనమాల గోవిందా |

శేషాద్రినిలయా గోవిందా | శేషసాయినీ గోవిందా |
శ్రీనివాస శ్రీ గోవిందా | శ్రీవేంకటేశ గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

శ్లో|| ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం

రహస్యం మన్త్రమౌషథమ్|

తపో దానావమానే చ 

నవ గోప్యాని కారయేత్||


హితోపదేశః


తా|| ఆయుష్షు, ఆదాయాదులు, ఇంటిలోని కలహాలు, వ్యక్తిగత రహస్యాలు (తనకు మాత్రమే తెలిసిన లోపాలు) మంత్రం, ఔషథం, తపస్సు, దానం, అవమానం అను ఈ తొమ్మిది విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి....

__(())__

 

# తప్పు అని తెలుసు - కానీ చేయకుండ ఉండలేము


1) మనకు అన్నీ తెలుసు

2) ఇది మంచి పని అనీ తెలుసు

3) ఇది చెడ్డ పని అనీ తెలుసు


4) ఇది చేస్తే పుణ్యం వస్తుంది అనీ తెలుసు

5) అయినా పుణ్య కర్మ చేయం

6) ఇది చేస్తే పాపం వస్తుంది అనీ తెలుసు

7) అయినా పాప కర్మ చేస్తాం - చేయకుండా ఉండలేము


8) అన్నిటికీ మొదటి కారణం మనస్సు

9) మనస్సును అదుపు చేయడం చాలా కష్టం

10) ఎన్నో కోట్ల జన్మల నుండి వస్తున్న వాసనా బలం

11) రెండో కారణం ఇంద్రియాలు

12) ఇంద్రియాలకు చాలా చాలా శక్తి ఉంటుంది

13) ఇంద్రియాలను జయించడం చాలా కష్టం


తప్పు చేయకుండా ఉండాలంటే -


14) శివుడి కాళ్లు పట్టుకోవాలి

15) నీ బలహీనత నీవు శివుడి ముందు చెప్పుకోవాలి

16) నీ ఇంద్రియాలను నిగ్రహించమని శివుడిని అడగాలి

17) అవి నిన్ను పట్టుకున్నాయి - నీవు వాటిని పట్టుకోలేదు.

18) అందుకే వాటిని ఎవడు నీకు పట్టించాడో వాడి కాళ్ళు పట్టుకుంటే - అవి నిన్ను వదులుతాయి

__(())__

 శ్రవేంకటేశ్వర: తల్లిదండ్రులకు, పెద్దలకు సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి? 🌻


🍃🌺భారతీయులు తమ తల్లిదండ్రులకు, పెద్దలకు, గురువులకు, మహాత్ములకు సాష్టాంగ నమస్కారము చేస్తారు. మనచే నమస్కరింపబడిన పెద్దలు తిరిగి వారి చేయిని మన తలమీద లేక పైన ఉంచి దీవిస్తారు. ప్రతి రోజు పెద్దలను కలిసినప్పుడు మరియు ఏదైనా కొత్తగా ప్రారంభించేటప్పుడు, జన్మదినములు. పండుగలు మొదలగు శుభ సందర్భాలలో కూడా పెద్దలకు నమస్కరించడము జరుగుతుంది.

🍃🌺కొన్ని సంప్రదాయ సమూహాలలో తమ కుటుంబము, సామాజిక హోదా మరియు తమ పరిచయము తెలియచేసే విధముగా ప్రవర తో కూడి) సాష్టాంగ నమస్కారము చేయబడుతుంది. సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?

🍃🌺మానవుడు తన పాదాల ఆధారముగా నిలబడతాడు. సాష్టాంగ నమస్కారములో పెద్దల పాదాలకు నమస్కరించడమనేది వారి వ్యక్తిత్వానికి ఆధారమైన పెద్దరికానికి, పూర్ణత్వానికి, ఉదారతకు, దివ్యత్వానికి మనము ఇచ్చేటటువంటి గౌరవా…
[7:32 am, 27/06/2021] శ్రవేంకటేశ్వర: దేవీభాగవతం - 55
శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు
చతుర్థ స్కంధము - 15
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
లలితా సహస్రనామ శ్లోకము -54

మహారూపా, మహాపూజ్యా, మహాపాతకనాశినీ!
మహామాయా,మహాసత్త్వా, మహాశక్తి, ర్మహారతిః!!

శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
 54వ  భాగములో....
భూదేవి మొర చదువుకున్నాము.
🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏
అమ్మ దయతో......  ఈ రోజు
శ్రీహరి పరాధీనత
దుష్టశిక్షణకు జగన్మాత వ్యూహం
చదువుకుందాం.
🙏🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🙏

 శ్రీహరి పరాధీనత

భూదేవీ ! బ్రహ్మాది దేవతలారా ! ఈ విషయంలో నేను స్వతంత్రుణ్ణి కాను. నేనే కాదు బ్రహ్మదేవుడూ శివుడు ఇంద్రుడూ దిక్పాలకులు చంద్రుడు సూర్యుడూ అగ్ని - ఎవ్వరూ స్వతంత్రులు కారు.
సృష్టి అంతా యోగమాయావశంవదం. బ్రహ్మాదిస్తంభపర్యంతమూ గుణసూత్ర గ్రథితమై నడుస్తోంది. ఆ మహామాయ తన ఇచ్ఛ ప్రకారం ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనుకుంటే అలా చేస్తుంది. మనమందరం ఆ మాయాశక్తికి వశులమే.

నేను స్వతంత్రుడినే అయితే ఎక్కడో సముద్రంలో ఒక చేపగానూ ఒక తాబేలుగానూ జన్మిస్తానా ? ఆలోచించండి. పశుజన్మలో భోగం ఉందా, కీర్తి ఉందా, సుఖం ఉందా ? పోనీ అంటే, క్షుద్రజంతువుగా అవతారం ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉందంటారా ? వరాహం అయ్యాను, నరసింహం అయ్యాను, వామనుడిని అయ్యాను, పరశురాముణ్ణి అయ్యాను. ఎందుకయ్యానంటారు ? ఆ రూపాలు కానీ ఆ చేసిన పనులు కానీ - ఎవరైనా ఎన్నడైనా ఇష్టపతారా ? ఇరవైయొక్క సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడుగా నెత్తురుటేర్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరం ! ఎంత నీచం ! గర్భస్థ శిశువులనుకూడా సంహరించాను. ఇదంతా ఇష్టపడే చేశానంటారా ? తరవాత దాశరథిగా అవతరించాను. దండకారణ్యాలలో నివసించాను. జటావల్కలాలు ధరించి మునివృత్తిని అవలంబించాను. భీషణ నిర్జనారణ్యాలలో ఒంటరిగా జీవించాను. వేటాడి సంపాదించుకున్న (పచ్చి) మాంసంతో కాలం గడిపాను. ఇది ఇష్టపడవలసిన విషయమా, సిగ్గు పడవలసిన విషయమా ? మీరే చెప్పండి.

బంగారులేడి కనపడితే అది రాక్షసుడని గ్రహించలేకపోయాను. దశకంఠుడి ప్రణాళిక అని గుర్తించలేకపోయాను. కుటీరంలో జానకిని ఒంటిరిగా వదిలేసి వెంటబడ్డాను. లక్ష్మణుడుకూడా సీతను అలాగే వదిలేసి వచ్చేశాడు. నామాట లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు. ప్రాకృత పురుషులం అయిపోయాం. రావణుడు భిక్షురూపం ధరించి వచ్చి జానకిని అపహరించాడు. అప్పటి నా శోకం ఇప్పటికీ నన్ను భయపెడుతోంది. అడవులన్నీ మారుమ్రోగేట్టు విలపించాను. కార్యవశాత్తూ సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకుని ప్రతిజ్ఞచేసి వాలిని అన్యాయంగా సంహరించాను. శపించకుండా వారించాను. వానరుల సహాయంతో లంకను చేరుకున్నాను.

నేనూ నా సోదరుడూ నాగపాశబద్ధులమై మూర్ఛపోయాం. ఇదేమిటని అందరూ ఆశ్చర్య పోయినవారే. అప్పుడు గరుత్మంతుడు దయతలిచి వచ్చాడు కనక సరిపోయింది. నాగపాశ విముక్తులం అయ్యాము. అప్పుడు నేనెంత దిగులుపడ్డానో మీకు తెలుసా ! దైవం ఇంకా ఏమేమి కష్టాలు కలిగిస్తుందో చూద్దాం అనిపించింది. రాజ్యం పోయింది. వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు, ప్రియ భార్య అపహరించబడింది, కష్టసాధ్యమైన యుద్ధం దాపురించింది. నిర్ధనుడనై అసహాయుడనై పాదచారినై భార్యతో కలిసి పధ్నాలుగేళ్ళు గాఢారణ్యాలలో గడిపాను.

క్షత్రియుడనై పుట్టి బోయవాడుగా జీవించాను. దైవం అనుకూలించి జయించాను. రావణుడు మరణించాడు. సీతను తెచ్చుకున్నాను. అయోధ్యను తిరిగిపొందాను. ఆ భోగాలు మాత్రం ఎంతకాలం ! లోకాపవాదానికి భయపడి సీతను అడవుల్లో వదిలేశాను. మళ్ళీ నా దుఃఖం నాదే. భార్యా వియోగ దుఃఖం. వద్దు, పగవారికైనా వద్దు. కడపటికి భూమిని చీల్చుకుని నా సీత పాతాళానికి వెళ్ళిపోయింది.

రామావతారంలో ఇన్ని రకాలుగా ఇంతింత దుఃఖం అనుభవించానంటే నేను స్వతంత్రుడినో పరతంత్రుడినో మీరే ఊహించండి.

చతుర్వదనా ! నీకు తెలుసును గదా ! నువ్వూ రుద్రుడు ఇంద్రుడూ అందరూ పరతంత్రులే. అందరం ఆ మహామాయకు అధీనులమే.
(అధ్యాయం - 18, శ్లోకాలు - 60)

దేవతలారా ! మనమంతా మాయామోహితులమై ఈ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాం. జగద్గురువును స్మరించలేకపోతున్నాం. సచ్చిదానందుడు, అవ్యయుడూ శాంతుడూ అయిన పరమపురుషుడిని మర్చిపోతున్నాం. నేను విష్ణువుని, నేను విరించిని, నేను శివుడను - అని అహంకరించి మోహితులమవుతున్నాం. అతి సనాతనమూ పరాత్పరమూ అయిన వస్తువును తెలుసుకోలేకపోతున్నాం. ఐంద్రజాలికుడి చేతిలో కొయ్యబొమ్మలాగా నేనూ ఇంతే. ఎప్పుడూ మాయామోహితుడినై ప్రవర్తిస్తూంటాను.

పద్మసంభవా ! కల్పారంభంలో నువ్వూ నేనూ శివుడూ కలిసి వెళ్ళి క్షీరసముద్ర మధ్యభాగాన మణిద్వీపంలో మందార తరుచ్ఛాయలో రాసమండలంలో ఆ మహామాయను ఆదిపరాశక్తిని దర్శించాంకదా ! సర్వకామప్రద అయిన ఆ శక్తిని అందరూ కలిసి స్తుతించండి. మనస్సుల్లో స్మరించండి.

శ్రీమహావిష్ణువు ఇలా సలహా ఇవ్వగానే బ్రహ్మాది దేవతలందరూ సకలభువనేశ్వరిని మనసారా స్మరించారు. ఆదిపరాశక్తి దర్శనం అనుగ్రహించింది. దేవతలంతా ముక్తకంఠంతో స్తుతించారు.

జగన్మాతా ! సాలీడు నుంచి దారంలాగా, నిప్పు నుంచి రవ్వల్లాగా ఈ జగత్తు నీనుంచి ఆవిర్భవించింది. చరాచర జగత్తు అంతా నీ మాయాశక్తికి లోబడి ఉంటుంది. ఓ భువనేశ్వరీ ! ఓ కరుణాసముద్రమా ! నీకివే వందనాలు. నిన్ను తెలుసుకోకపోతే భవబంధాలు ఏర్పడతాయి. నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి. నువ్వు సంవిద్రూపవు (జ్ఞాన రూప). దేవీ ! మమ్మల్ని నడిపించు. ఓ మహాలక్ష్మీ ! ఓ మహాశక్తి ! మమ్ము నడిపించు.

ఓ భువనార్తి హారిణీ ! అనుగ్రహించు. మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు. రాక్షసులను మట్టుబెట్టి భూభారం తగ్గించు. దేవతలను రక్షించడం, దానవులను శిక్షించడం నా కర్తవ్యాలని నువ్వే ప్రకటించావుకదా ! కంస కేశి సాల్వ జయద్రథాదులు మదోన్మత్తులై భూగోళం మీద వీరవిహారం చేస్తున్నారు. వారినందరినీ సంహరించి భూదేవికి భారం వదిలించు. త్రిమూర్తులకుకూడా లొంగని మహామహాదానవులను నువ్వు ఒక కేళీవిలాసంగా అంతమొందించగలవు. నీ శక్తి లేనిదే ఈ త్రిమూర్తులు ఏమి చెయ్యలేరుగదా ! అనంతుడు ఈ భూమిని ధరించలేడుగదా ! ఓ చంద్రకళావతంసా ! మా విన్నపం ఆలించి మా దైన్యం తొలగించు - అని బృందగానంగా అందరూ కలిసి స్తుతించారు. అభ్యర్థించారు.

జగన్నాయకీ ! సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు. లక్ష్మీదేవి లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు. పార్వతి లేనిదే శివుడు సంహరించలేడు. వారికి ఆ శక్తులను సమకూర్చినదానవు నువ్వేకదా - అని ఇంద్రుడు ప్రత్యేకంగా స్తుతించాడు.

ఓ త్రిలోకీ ! నీ కళావైభవాన్ని మాకు అందించావు కనక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటున్నాం. ప్రభుత్వం చెలాయిస్తున్నాం. నిజానికి సమస్త విభవేశ్వరివి నువ్వే - అని విష్ణుమూర్తి కొసమెరుపుగా ఈ స్తోత్ర పాఠానికి ముక్తాయింపు ఘటించాడు.

జగదీశ్వరి మనస్సు ఆనందంతో పులికించింది. దేవతలారా ! పని ఏమిటో చెప్పండి. ఆందోళన పడకండి. అది ఎంతటి అసాధ్యమైనా సురల కోరిక తీరుస్తాను. మీకుగానీ ఈ భూదేవికిగానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి - అని అడిగింది. అడిగిందే తడవుగా దేవతలు ఏకకంఠంతో విన్నవించారు.

భువనేశ్వరీ ! పాలకులందరూ దుష్టులై పీడిస్తూంటే భరించలేక ఈ భూదేవి శోకిస్తూ వణికిపోతూ మా దగ్గరికి వచ్చింది. భూభారం తగ్గించమని అభ్యర్థించింది. దీనికి సమర్ధురాలవు నువ్వే అని నిన్ను ప్రార్ధించాం. ఇది మా దేవతలందరి అభ్యర్థన. దయచేసి పూనుకొని భూభారం తగ్గించు. దుష్టులను వెంటనే సంహరించు. ఇదివరలో నువ్వు మహిషాసురుడిని సంహరించావు. వాడి సహాయకులను కోట్లాదిగా మట్టుబెట్టావు. శుంభ నిశుంభ రక్తబీజ చండముండ ధూమ్రలోచన దుర్ముఖ దుస్సహ కరాళాది మహాదైత్యవీరులను క్రూరాతిక్రూరులను అవలీలగా అంతమొందించావు. మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చింది. దేవతా శత్రువులైన దుష్టభూభుజులను వెంటనే సంహరించి భూదేవిని రక్షించు తల్లీ !

దేవతల ప్రార్థనను శ్రద్ధగా ఆలకించిన పరాశక్తి పెద్ద పెట్టున నవ్వింది. కన్గొసలు ఎరుపెక్కాయి. మేఘగంభీర స్వరంతో పలికింది -

 దుష్టశిక్షణకు జగన్మాత వ్యూహం

దేవతలారా! ఈ విషయమై నేను ఎప్పుడో ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను. మీరు అందరూ మీమీ అంశలతో భూలోకంలో జన్మించాలి. భూభారాన్ని తొలగించాలి. అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను.

కశ్యపుడు భార్యాసహితుడై యదువంశంలో అనకదుందుభి గా అందరికంటే ముందు అవతరిస్తాడు. భృగుశాపం ఉంది కనక విష్ణుమూర్తి తన అంశతో వసుదేవుడికి పుత్రుడుగా అవతరిస్తాడు. నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను. కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను. దేవతాకార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను. ఆదిశేషుడు రోహిణీ గర్భసంజాతుడు అవుతాడు. ఈ ఇద్దరూ నా శక్తితో సర్వ దుష్టసంహారం చేస్తారు. ఇది ఈ ద్వాపరాంతంలోనే జరుగుతుంది. ఇంద్రాంశతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తంగా సంహరిస్తాడు. ధర్మాంశతో యుధిష్ఠిరుడు ఆవిర్భవించి పరిపాలకుడు అవుతాడు. వాయుదేవుని అంశతో భీముడూ, అశ్వినీ దేవతల అంశలతో నకులసహదేవులూ, అష్టమవసువుగా (వసు అంశంతో) భీష్ముడూ జన్మించి శత్రుబలాలను క్షీణింపజేస్తారు. కాబట్టి ఇక మీరంతా నిశ్చింతగా వెళ్ళండి. ధరాదేవి స్థిరాదేవి అవుతుంది. భారం తొలగిపోతుంది.

మీరంతా నిమిత్తమాత్రులు. స్వశక్తితో నేనే ఈ కార్యం నెరవేరుస్తాను. ఇది నిశ్చయం. కురుక్షేత్రంలో సర్వక్షత్రియ సంహారం జరుగుతుంది. అసూయ, ఈర్ష్య, తృష్ణ, మమత, జిగీష, మోహమూ, కామమూ మొదలైన దోషాలతోనూ, బ్రాహ్మణశాపం కారణంగానూ యాదవులు పూర్తిగా నశిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా శాపకారణంగానే అవతారం చాలిస్తాడు. మీరంతా మీమీ అంశలతో మధురలో గోకులంలో అవతరించి అతడికి సహాయపడతారు. అని చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది. భూదేవి తృప్తిగా నిట్టూర్చింది. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ తమతమ నెలవులకు వెళ్ళిపోయారు.

(అధ్యాయం - 19, శ్లోకాలు - 46)


(రేపు.... వ్యాసకృత యోగమాయా ప్రశంస )

 🙏అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే .......‌‌‌‌‌‌‌.🙏
                                  ..... సశేషం
శ్రవేంకటేశ్వర: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏


🌹 ఓం నమో వేంకటేశాయ గ్రూపు సబ్యులకు అందరికీ నమస్కారం.

🌹ప్రస్తుతం గ్రూపులో ఉన్న సభ్యులు కొంతమంది మేసేజ్ లు చూడకుండా కొంతమంది సభ్యులు వున్నారు. వీరికి మెసేజ్ డెలివరీ అవుతుంది. కానీ వాళ్ళు మెసేజ్ చదవడం లేదు. ఇలాంటి వారిని గ్రూపులో నుంచి తొలగించడం జరుగుతుంది.

🌹వీరిని తొలగించడం వలన కొత్తగా కొంతమంది సబ్యులకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.

🌹మరొక్క విషయం వ్యక్తి గత కారణంగా రేపటి నుంచి ప్రస్తుతం ఉన్న గ్రూపులు అన్నింటినీ డిలీట్ చేసి కొత్తగా ఓం నమో వేంకటేశాయ గ్రూపు మొదలుపెట్టడం జరుగుతుంది.

🌹కొత్త గ్రూపులో యాక్టివ్ గా ఉన్న వారు మాత్రమే జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది.

🌹కొత్తగా గ్రూపు మొదలు పెట్టిన తరువాత ప్రస్తుతం ఉన్న గ్రూపులలో మెసేజ్ లు పంపడం జరగదు గమనించగలరు.

🌹మీ యొక్క
పేరు:
ఊరు:
వర్క్ (ఏమి చేస్తుంటారు): ఈ విషయాలు తెలిపితేనే గ్రూపులో జాయిన్ చేయడం జరుగుతుంది.

🌹మీ పేరు ఇలాంటివి తెలపడానికి ఇష్టం లేని వారు గ్రూపులో నుంచి లెఫ్ట్ అవ్వచ్చు.
--
గురుపాదము గొలుచుకొమ్ము
గురుసేవల సలుపుచుండి
కరుణన్ గని సకల జనుల
తరుణమ్మున సాయమిడుము
--
అమలమ్ముగ నుంచి యెడఁద
సమభావముఁ బెంచుకొమ్ము
గమనించుచు సృష్టి రచన
ప్రముదమ్మునఁ బ్రణతులిడుము
--
నిరుపేదల నిరసించకు
ఒరులెవ్వరి దూరఁబోకు
గరిమమ్మిడు గుణముఁ బెంచు
సరసంబగు బాసలాడు
--
అతిగానెటఁ బల్కఁ బోకు
మతినుంచుము మాతనెపుడు
స్తుతిసేయకు దుష్టజనుల
గతిమార్చకు మాశమీఱి
--
ప్రాప్తమైనదానితోడఁ
దృప్తి గలిగి బ్రతుకనగును
ఆప్తవాక్యమంచునెంచి
జ్ఞప్తినుంచ సూక్తి మేలు
--
వెంటరావు కాసులేవి
జంటయగును గర్మమొకటె
మంటలోన బూడిదగుచు
మంటిలోనఁ గలయఁ దనువు
--
పాపభీతిఁ గలిగి యుండు.
ఆపలేని వాఁడననుచు
వేపఁబోకు పెచ్చుమీఱి.
తాపమిడును యముఁడు పిదప
--
మర్మముంచఁబోక మదిని
ధర్మమార్గమందె సాగి
కర్మఫలము విభునికిడుము
వర్మమగును దైవమతఁడె
--
ఆశలెన్ని యున్నఁగాని
నాశనమునుజేయకొరుల.
పాశమెపుడొ తగులుకొనును
క్లేశమొదవ నీకుఁ గూడ
--
మోసగించి బ్రతుకఁబోకు
హాసములను బయికిఁ జిమ్మి
దాసజనము మెచ్చఁబోరు
మాసిపోవునున్న పేరు
--
పిల్లపాపలందఱలర
మెల్లఁగాను దరికిఁ దీసి
చల్లఁగాను గాయుచున్న
నిల్లె స్వర్గమగును జూడ
--
కల్లలాడఁ గాదు ముద్దు
చెల్లదెపుడు దాట హద్దు
అల్లరవఁగ నెమ్మి రద్దు
తల్లి చెప్పుదొకటె కద్దు
--
చల్లనైన తల్లి యగుట
నెల్లరొకటె కనఁగఁ దలికి
నుల్లసిల్లు నేకమయిన
kaalamaay tapp dika
--((***))--
 

 

మనోరమ ముద్దు కోసం... కవిత

మను వాడ గా వచ్చితి నే సహనమ్ము తొ
తను వంత యు తాపము దాహము దేహము
విను మాటలు నచ్చితి వే మన సైనది
కనుక సైగలు చేయుము కాలము నీదియు

అటులే ఇక నాకు యు నీ కును శోభ యె
చిటికేసిన పిల్పు కు వచ్చె ద వెంట నె
కటి నేల ను తాకి యు ఉంటిని ఆశలు
ఇటు తీర్చు ము వేడి కి చల్లగ ఉండును

కళగా ఇచటే కొలువే మనకుందిలె
ఇలలో కలిసే తెలిపే వరసుందిలె
కలలో కదిలే కథలే శుభ కాంక్షలె
వలలో మనమే ఒకటై సుఖముందిలె

తనువే తపనే కలిగే ఇక ఏలిక
మనసే బిగువై వరదై ఇక పొంగులె
మనువే ఇకలే కలలే ఇక తీర్చుకొ
అణువైనవి సేవకులుగా మనకుందిలె

తరుణం ఇదియే శరణం అనుచుంటిని
పరువం మనదీ పదిలం ఇక విదితం
సరళం సుముఖం సహనం మన జంటకు
కరుణా లయమే కథనం చిరు శాంతిగ

0
నేటి ఛందస్సు ...  

కోరు వయసులోన - కొరికే తృప్తిగా  
చేష్టలగను - కలలు తలపు గాను  
సేవ బలము - వర్ణ మవ్వుటే జీవితం  
ప్రేమ బ్లు చూపుటే

చేరు తనువులోన - తాపమే  తృప్తిగా
కష్టములను - కళల వలపు గాను  
కాల మనసు నర్ధ మవ్వుటే జీవితం  
కాల కలలు తీర్చుటే  

అమ్మ పలుకు లోన - బ్రేమయే మానసం
అన్ని తెలుపు - మనసు కదలయయ్యె
కాని పనులు వద్దు - భావమే మానసం
నన్ను మరువటేల నీవు    

వెన్న మనసులోనఁ - బ్రేమయే వెన్నయా
కన్నె మనసు - కలల కవనమయ్యె
వన్నె లలరినట్లు - వాంఛలే పూచెఁగా
నన్ను కనవదేల నీవు

ప్రేమ తలపులోన - బంధ బాంధవ్యమే
ప్రేమ చెలిమి - మాన్సు తలపు గాను
ప్రేమ మనసుచేరి - బ్రేమనే పంచుటే
ప్రేమ అనునదే ఇదీ    
 
కష్ట సుఖములోన - ధర్మ ధర్మాలులే
ఇష్ట వయసు - చెలిమి తలపు గాను
నష్ట మనునదేది - చేయకే ఉండుటే
ఇష్ట మనునదే ఇదీ 

1 comment: